సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం | Supreme Court Angry On Telangana CM Revanth Reddy No ByElection Comments | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం

Published Wed, Apr 2 2025 2:57 PM | Last Updated on Wed, Apr 2 2025 3:28 PM

Supreme Court Angry On Telangana CM Revanth Reddy No ByElection Comments

న్యూఢిల్లీ, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Revanth Reddy)పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీలు మారినా ఉప ఎన్నికలు రావు అని రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను బుధవారం విచారణలో ప్రత్యేకంగా ప్రస్తావించిన జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలే చేసింది.

పవిత్రమైన చట్టసభలో ఈ వ్యాఖ్యలు చేయడం... రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అపహాస్యం చేయడం కిందకే వస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయకుండా సీఎంకు హితవు చెప్పండి. ఎట్టిపరిస్థితుల్లో ఈ తరహా వ్యాఖ్యలను ఉపేక్షించబోం. అవసరమైతే కోర్టు ధిక్కారంగా భావించాల్సి వస్తుంది’’ అని సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీని ఉద్దేశించి జస్టిస్‌ గవాయ్‌ అన్నారు.

మేం అన్నీ ఆలోచించే కోర్టు ధిక్కార నోటీసులు ఇస్తున్నాం. అంతమాత్రాన మాకు అధికారాలు లేవని కాదు‌. అసెంబ్లీలో నాయకులు చేసే ప్రకటనలకు ఒక విలువ ఉంటుంది. అసెంబ్లీలో మాట్లాడే అంశాలను కోర్టులు కూడా తీసుకుంటాయి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

గత బుధవారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో సీఎం రేవంత్‌ ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని, పార్టీ మారిన ఎమ్మెల్యేలెవరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘‘వచ్చే వారమే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్‌ఎస్‌ నేతలు ఊదరగొడుతున్నారు.  కానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. గత బీఆర్‌ఎస్‌ హయాంలో ఉన్న రాజ్యాంగమే ఇప్పుడు కూడా ఉంది. స్పీకర్‌ వ్యవస్థ, చట్టం అవే ఉన్నాయి. ఏవీ మారలేదు. అలాంటప్పుడు అప్పుడు పార్టీలు మారిన నేతల విషయంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని వ్యాఖ్యానించారు. 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై సుప్రీంకోర్టు ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement