
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాలో పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కండి ఫారెస్ట్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే పక్కా సమాచారంతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించేందుకు శుక్రవారం ఉదయం వెళ్లారు జవాన్లు. ఓ గుహలో ఉన్న ఉగ్రవాదులను చుట్టుముట్టారు. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి.
అయితే జవాన్లు లక్ష‍్యంగా ఉగ్రవాదులు ఐఈడీని పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారత సైన్యం ఈ విషయాన్ని అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇద్దరు సైనికులను బలిగొన్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఘటనా స్థలానికి అదనపు బలగాలను పంపిటన్లు తెలిపింది.
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, జవాన్లకు మధ్య కాల్పుల ఘటన జరగడం మూడు రోజుల్లో ఇది మూడోసారి కావడం గమనార్హం. గురువారం బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉద్దరు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: మణిపూర్‌లో హైటెన్షన్.. మంత్రిపై దాడి.. రైళ్లు బంద్