
శివనాడార్ 2022–23 విద్యా ఏడాదికి పలు కోర్సుల్లో ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
UG Admissions In Shiv Nadar University 2022: ఢిల్లీకి చెందిన విశ్వవిద్యాలయం శివనాడార్ 2022–23 విద్యా ఏడాదికి పలు కోర్సుల్లో ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంజనీరింగ్, నేచురల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్– ఎంటర్ ప్రెన్యూర్‌షిప్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్‌లో అండర్ గ్రాడ్యుయేట్ పరిశోధన అందించే అకాడమీ ఆఫ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలు చేపడుతోంది.
బీఎస్సీ (పరిశోధన), కెమిస్ట్రీ డిగ్రీతో పాటు ఒక కొత్త ఏకీకృత బ్యాచిలర్ ఇన్ టెక్నాలజీ ప్రోగ్రామ్‌ను పరిచయం చేయనుంది. శాట్, ఏసీటీ, ఎస్‌ఎన్‌యూ, జేఈఈ మెయిన్స్ స్కోరుతో ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని శివనాడార్ ఈడీ కల్నల్ గోపాల్ కరుణాకరన్ ఒక ప్రకటనలో తెలిపారు. (క్లిక్: అందుకే భారతీయులు ఉక్రెయిన్ బాట!)