
సాక్షి, శివాజీనగర (బెంగళూరు): కరోనా వారాంతపు కర్ఫ్యూ రెండో రోజు కూడా రాష్ట్రంతో పాటు బెంగళూరులో నిశ్శబ్దం నెలకొంది. మహమ్మారి నియంత్రణ కోసం గత వారం నుంచి వీకెండ్ లాక్‌డౌన్‌ను అమలు చేయడం తెలిసిందే. శని, ఆదివారాలు సంక్రాంతి, కనుమ సంబరాల సందడి తక్కువగానే కనిపించింది. వ్యాపార సముదాయాలు, థియేటర్లు మూతపడడంతో నగరాలు బోసిపోయాయి.
కూరగాయలు, ఔషధాలు, పాలతో పాటు అత్యవసర సేవలే అందుబాటులో ఉన్నాయి. దూర ప్రాంతాలకు మాత్రం తక్కువగా కేఎస్‌ఆర్‌టీసీ బస్సులు సంచరించాయి. బెంగళూరు బస్టాండులో పెద్దసంఖ్యలో బస్సులను నిలిపివేశారు. బెంగళూరులో జనసందడి ప్రాంతాలైన కే.ఆర్.మార్కెట్, శివాజీనగర, చిక్కపేట, ఎన్‌పీ రోడ్డు, జయనగరతో పాటు పలు మార్కెట్‌లు బంద్ అయ్యాయి.
చదవండి: (Hyderabad-Lockdown: మళ్లీ లాక్‌డౌనా అనేలా హైదరాబాద్ పరిస్థితి)