
సాక్షి, హైదరాబాద్: ఉత్తమ్ పోయి ఉత్తర కుమారుడు వచ్చాడని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి పగటి కలలు కంటున్నాడని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం అనేది ఓ కల అని అన్నారు. కాంగ్రెస్ కలహాలు సరిదిద్దడానికి రేవంత్‌కు సమయం సరిపోదని ఎద్దేవా చేశారు. అదే విధంగా బీజేపీ వాళ్లది కాకి గోల మాత్రమేనని, వాళ్లతో ఏం కాదని మండిపడ్డారు.
విభజన చట్టాన్ని అమలు చేయని బీజేపీ వాళ్లకు మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రయోజనాలపై బీజేపీ వాళ్ల ఎందుకు మాట్లాడరని, రాజకీయ స్వార్ధం కోసమే వారి ఆరాటమని ధ్వజమెత్తారు. నది జలాల విషయంలో రెండు రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉన్నదని అన్నారు.
చదవండి: ఒకే దేశం.. ఒకే చట్టం... ఇదెక్కడి న్యాయం !