
సాక్షి, ఏలూరు: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం దర్జాగా అమలు చేస్తున్నారు కూటమి నేతలు. దెందులూరులో టీడీపీ నాయకుడు చింతమనేని కనుసన్నల్లో రెడ్‌బుక్ అమలు జరుగుతోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి టీడీపీ శ్రేణులు మూకుమ్మడి దాడికి చేశాయి. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.
దెందులూరులో చింతమనేని కనుసన్నల్లో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేసి కూటమి నేతలు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నివాసంపై టీడీపీ మూకలు దూసుకెళ్లారు. అంతేకాకుండా అబ్బయ్య చౌదరికి చెందిన చేనులో పామాయిల్ గెలలు కోస్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు వారిని ప్రశ్నించగా దాడికి దిగారు. దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు.
