
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గం టీడీపీ, జనసేనలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఏలూరు రూరల్ మండలం పైడి చింతపాడులో..జనసేన నేతలపై టీడీపీ నేతలు దాడి చేశారు.
గ్రామాల్లో కేవలం టీడీపీ నేతలే పెన్షన్లు పంచుతారంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హుకుం జారీ చేశారు. ప్రభాకర్ ఆదేశాలతో ఆగ్రహానికి గురైన జనసేన నేతలు సైతం తామూ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటామని తేల్చి చెప్పారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వివాదం ముదిరి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది.
జనసేన నేతలపై టీడీపీ నేతలు దాడికి దిగారు. పిడుగులు గుద్దులు గుద్దుతూ రెచ్చిపోయారు. ఈ ఘటనలో జనసేన పైడి చింత పాడు అధ్యక్షుడు మౌరు రామ కృష్ణతో పాటు పలువురికి గాయాలయ్యాయి. రామకృష్ణను అత్యవసర చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
