
సాక్షి, ఏలూరు జిల్లా: తలకడిపూడి పీఎస్‌లో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ హల్‌చల్ చేశారు. ఎస్సై కుర్చీలో కూర్చొని టిఫిన్ చేసిన ఆయన.. పోలిస్ స్టేషన్‌లో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసినట్లుగా వ్యవహరించారు.
పోలిస్ స్టేషన్‌ను సెటిలిమెంట్లకు అడ్డగా మార్చారు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్. పోలిస్ స్టేషన్‌లో ఎస్సై కుర్చీలో కూర్చొని ఆదేశాలిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.