Eluru District
-
పోలీసులే ఫిర్యాదు చేసి.. పోలీసులే కేసు నమోదు!
ఏలూరు: టీడీపీ ఆదేశాలతో అక్రమ కేసుల పర్వం కొనసాగుతోంది. వైఎస్సార్ సీపీ శ్రేణులే లక్ష్యంగా టీడీపీ చెలరేగిపోతోంది. తాజాగా దెందులూరు నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసింది కూటమి ప్రభుత్వం. ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిపై అక్రమ కేసులు బనాయించారు దెందులూరు పోలీసులు. తన నివాసం వద్ద ఉన్న కామిరెడ్డి నాని.. తమ విధులకు ఆటంకం కల్గించారంటూ రివర్స్ కేసులు పెట్టారు ఏపీ పోలీసులు. ఈ కేసులో పోలీసులే ఫిర్యాదు చేసి.. వాళ్లే కేసు నమోదు చేయడం గమనార్హం. కామిరెడ్డి నానిపై హెడ్ కానిస్టేబుల్ హమిద్ ఫిర్యాదు చేయగా, ఎస్పై శివాజీ కేసు నమోదు చేశారు. 132R/w 3(5)bns సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.ఏపీలో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తువారిపై, కూటమిలో ఉన్న పార్టీలపై గతంలో విమర్శలు చేసిన వారిపై టీడీపీ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారసుడు నారా లోకేష్ ‘రెడ్ బుక్’ రాజ్యాంగం రాసుకుంటున్నానని గతంలో ఏదైతే చెప్పారో అదే అమలు చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం అక్రమ కేసులను బనాయిస్తూ.. వైఎస్సార్సీపీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఏదొక అక్రమ కేసును వారిపై మోపి.. బెదిరింపు చర్యలకు పాల్పడుతోంది. ఇందుకు రాష్ట్ర పోలీసులు కూడా సహకరిస్తూ ఉండటంతో అక్రమ కేసుల పరంపరంకు అడ్డుకట్టలేకుండా పోతోంది. కూటమి ప్రభుత్వం అరాచకపాలను ప్రశ్నిస్తే చాలు ఏదొక అక్రమ కేసును చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ప్రశ్నిస్తేనే తప్పు అన్నట్లుగా ఏపీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. -
హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తుండగా ప్రమాదం
-
ఏలూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న లారీ.. ముగ్గురి మృతి
సాక్షి, ఏలూరు జిల్లా: ఏలూరు సమీపంలోని చొదిమెళ్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్‌ను లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.లారీ లోయలో పడి ముగ్గురి మృతిమరో ఘటనలో వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని మద్దిమడుగు ఘాట్ పైన బుధవారం మధ్యాహ్నం లారీ లోయలోకి పడిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. చేపల మేత లోడుతో బెంగళూరు నుంచి ఏలూరుకు వెళ్తున్న లారీ మద్దిమడుగు ఘాట్ పైన నాలుగో మలుపు వద్దకు రాగానే బ్రేక్ ఫెయిల్ అయి అదుపుతప్పి 50 అడుగులున్న లోయలోకి పడిపోయింది.లారీలోని డ్రైవర్ సాంబయ్య, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా.. చక్రాయపేట మండలం కప్పకుంటపల్లెకు చెందిన కె.వివేకానందరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాద తీవ్రత కారణంగా లారీ మూడు ముక్కలుగా విడిపోయి కేబిన్ నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న రక్షక్ సిబ్బంది అగ్ని మాపక సిబ్బందిని, 108 అంబులెన్స్‌ను పిలిపించి క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. -
ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభణ.. ఓ వ్యక్తికి పాజిటివ్!
సాక్షి, ఏలూరు: ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభణ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. టెస్టుల్లో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్‌గా నమోదు కావడంతో జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలంలో కోళ్ల ఫామ్‌కు దగ్గరలో ఉంటున్న వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతో, అతడికి టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో వైద్యశాఖ అధికారులు అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా జిల్లా వైద్యశాఖ అధికారిని డాక్టర్ మాలిని మాట్లాడుతూ.. జిల్లాలో ఓ వ్యక్తిని బర్డ్ ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక్కడ తొలి కేసు నమోదైంది. దీంతో, కేసు నమోదైన ప్రాంతంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. బర్డ్ ఫ్లూ సోకిన వారికి చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని తెలిపారు.మరోవైపు.. ఏలూరులోని బాదంపూడిలో కిలోమీటర్ మేర ఇన్ఫెక్టెడ్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. 10 కిలోమీటర్ల వరకు సర్వే లెన్స్ జోన్లుగా విధించారు. ఇన్ఫెక్టెడ్ జోన్లో ఉన్న కమర్షియల్ ఫార్మ్ కోళ్లను, నాటు కోళ్లను పూర్తిగా కిల్లింగ్ చేసి ఖననం చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వుల్లో తెలిపారు. ఏలూరు జిల్లా పశు సంవర్ధన కార్యాలయంలో 24x7 కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఫోన్ నెంబర్ 9966779943 ఇచ్చారు. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా సమాచారాన్ని అందించాలని హై అలర్ట్ జారీ చేశారు.ఇదిలా ఉండగా.. తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలంతో కానూరు అగ్రహారంలో చికెన్ షాపులను మూసివేశారు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ గుడ్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇక, భారీగా తగ్గిన చికెన్, కోడిగుడ్ల వినియోగం తగ్గిపోయింది. దీంతో, పౌల్ట్రీ యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
ఎమ్మెల్యే చింతమనేని అరాచకం.. జనసేన నేతపై దాడి
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరాచకాలు కొనసాగుతున్నాయి. జనసేన నూజివీడు మండల అధ్యక్షుడు యర్రం శెట్టి రాముపై చింతమనేని అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేశారు. 2014 నుండి దుగ్గిరాలలో కౌలు వ్యవసాయం చేస్తున్న యర్రం శెట్టి రాము పొలంలో చెరుకు పంటను నాశనం చేశారు.స్పందనతో పాటు, నారా లోకేష్, టీడీపీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు మొరపెట్టుకున్నా తమకు న్యాయం జరగలేదంటూ జనసేన నేత వాపోతున్నారు.తనకు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియాలో పెట్టామని దుగ్గిరాల వీఆర్వోతో తిరిగి తనపై కేసు పెట్టించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై దాడి చేసిన చింతమనేని అనుచరులపై చర్యలు తీసుకోవాలని యర్రం శెట్టి రాము కోరుతున్నారు.ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తతయర్రంశెట్టి రాముపై చింతమనేని అనుచరుల దాడిపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంపై స్టేషన్ ఎదుట జనసేన నాయకులు నిరసన వ్యక్తం చేశారు. చింతమనేని, అతని అనుచరులపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినా కానీ.. పోలీసులు టీడీపీ నేతలకు కొమ్ముకొస్తున్నారు అంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.దెందులూరులో జనసేన మండల అధ్యక్షుడికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని జనసేన నేతలు నిలదీశారు. స్పందనతో పాటు నారా లోకష్‌కు, జనవాణిలో ఫిర్యాదు చేసిన తమకు న్యాయం జరగలేదంటున్న జనసేన నేతలు.. చింతమనేని, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
సైలెంట్ పుంజు.. వయలెంట్ విజయం
భీమడోలు: ఏలూరు జిల్లా కోడి పందేల బరిలో ఓ పుంజు చిత్రమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ‘నేనెప్పుడూ సైలెంట్.. నా జోలికొస్తే మాత్రం మహా వయలెంట్’ అన్నట్టుగా మూడు కోడి పుంజుల్ని వీరోచిత పటిమతో ఓడించిన రసంగి పుంజును అబ్రాస్ పుంజు మట్టికరిపించింది. ఏలూరు జిల్లా భీమడోలులో జాతీయ రహదారి పక్కన ఓ భారీ బరిని ఏర్పాటు చేశారు. బుధవారం చివరగా ఓ పందెం వేశారు. ఒకేసారి ఐదు కోడి పుంజులను బరిలోకి దింపారు. వాటిలో ప్రారంభం నుంచి సైలెంట్‌గా ఉన్న అబ్రాస్ కోడి పుంజు వేరే పుంజుల జోలికి వెళ్లకుండా మౌనంగా ఉండిపోయింది. కాగా.. రసంగి కోడి పుంజు మిగిలిన మూడు పుంజులపై వీరోచితంగా పోరాడి వాటిని మట్టి కరిపించింది. చివరగా నక్కినక్కి ఉన్న అబ్రాస్ కోడి పుంజుని పొడిచేందుకు వెళ్లిన రసంగిని అబ్రాస్ పుంజు ఒకే ఒక్క దెబ్బతో నేల కరిపించింది. ఈ పందేన్ని చూసిన వారంతా ‘సైలెంట్ పుంజు.. వయలెంట్’ విజయం.. అని వ్యాఖ్యానించారు. -
సంక్రాంతికి ఇంటికొచ్చిన అల్లుడికి 470 వంటకాలు
సంక్రాంతి పండుగకు అల్లుళ్లకు మర్యాదల్లో తాము తగ్గేదేలే అని చెబుతున్నారు ఉమ్మడి గోదావరి జిల్లా వాసులు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో వందనపు వెంకటేశ్వరరావు దంపతులు తమ అల్లుడికి 452 రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. అలాగే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కుక్కుల వెంకటేశ్వరరావు దంపతులు తమ అల్లుడికి 270 రకాల పిండి వంటలతో మెగా విందు ఏర్పాటు చేశారు. – మామిడికుదురు/జంగారెడ్డిగూడెం120 రకాల వంటలతో కొత్త అల్లుడికి భోజనం!పెళ్లి అయిన తర్వాత తొలిసారి సంక్రాంతికి వచ్చిన అల్లుడికి అత్తామామలు 120 రకాల వంటకాలతో భోజనం పెట్టి సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన నందిగామ భాస్కరరావు – సుజాత రెండో కుమార్తె మధుశ్రీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సుధాపల్లికి చెందిన కొనకళ్ల సందీప్‌తో వివాహం జరిగింది. కొత్త దంపతులు సంక్రాంతి పండుగకు వైరా వచ్చారు. ఈ సందర్భంగా భాస్కరరావు దంపతులు తమ అల్లుడు, కుమార్తెకు వివిధ రకాల పిండివంటలు, ఇతర వంటకాలు కలిపి 120 రకాలతో భోజనం వడ్డించడం విశేషం.చదవండి: వెళ్ళొస్తా సుజాతా.. సంక్రాంతి సిత్రాలు -
ప.గో జిల్లాలో సంక్రాంతి సంబరాల పేరుతో కూటమి నేతల బరితెగింపు
-
అశ్లీల నృత్యాల ఘటనలో 24 మంది అరెస్టు
నిడమర్రు: ఏలూరు జిల్లా బావాయిపాలెంలో జనసేన నేతల అశ్లీల నృత్యాల బాగోతంలో 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఈ వ్యవహారానికి సూత్రధారి అయిన జనసేన పార్టీ క్రొవ్విడి గ్రామ అధ్యక్షుడు వాకమూడి ఇంద్రకుమార్, మరో 21 మంది యువకులు, ఇద్దరు హిజ్రాలు ఉన్నట్లు గణపవరం సీఐ సుభాష్ గురువారం తెలిపారు. ఈ అశ్లీల నృత్యాల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీఆర్వో భుజంగరావు ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి కేసు నమోదు చేశామని చెప్పారు. అరెస్టయిన వారిపై బీఎన్ఎస్ సెక్షన్ 292, 296 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇదీ జరిగింది: ఈ నెల 12వ తేదీ రాత్రి బావాయిపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లులో వాకమూడి ఇంద్రకుమార్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ వేడుకలకు హాజరైన వారిలో పలువురు మద్యం సేవించారు. భీమవరానికి చెందిన ఇద్దరు హిజ్రాలతో కలిసి అశ్లీల నృత్యాలు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ఈ నృత్యాలను మిల్లులో ఉన్న ధాన్యం బస్తాల పైనుంచి సెల్ఫోన్లో రహస్యంగా చిత్రీకరించి, బుధవారం సోషల్ మీడియాలో పెట్టినట్లు చర్చ జరుగుతోంది. ఈ విషయం తెలిసి జనసేన నేతలు టీడీపీ వారిపై ఆగ్రహంతో ఉన్నారు. ఇదే తొలిసారి: ఈ ప్రాంతంలో ఇలా అశ్లీల నృత్యాలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఇదే కొనసాగితే జనసేన నాయకుల ఆగడాలు ఎలా ఉంటాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి వారిని ప్రోత్సహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు వైఖరిని నియోజకవర్గ ప్రజలు తప్పుపడుతున్నారు. మరోపక్క ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన ఇంద్రకుమార్‌ను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఆ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మల దొరబాబు ప్రకటించారు. -
అధికారుల అండతో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్యచౌదరి ఇంటిపై దాడికి యత్నం
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఇంటిపై దాడికి యత్నించారు. చింతమనేని అనుచరులను వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. చింతమనేని అనుచరులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.పెదవేగి మండలం కొండలరావుపాలెం గ్రామంలో అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద రెండో రోజు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ రోజు(శనివారం) ఇంటి ముందు వంటా వార్పు పేరుతో చింతమనేని అనురులు డ్రామాకు దిగారు. దీంతో చింతమనేని అనుచరులు, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. చింతమనేని అనుచరులకు వత్తాసు పలుకుతూ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. -
ద్వారకా తిరుమల ఆలయంలో డ్రోన్ కెమెరా కలకలం
సాక్షి, ఏలూరు జిల్లా: ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో డ్రోన్ కెమెరా కలకలం సృష్టించింది. సోషల్ మీడియాలో శ్రీవారి క్షేత్ర డ్రోన్ విజువల్స్ హల్చల్ చేశాయి. ఆలయ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల ఒక యూట్యూబర్ పట్టపగలు క్షేత్రంపై డ్రోన్ ఎగురవేశారు. విజువల్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.నిషేధిత ప్రాంతంలో డ్రోన్ ఎగురవేస్తుంటే అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికీ ఆలయ భద్రతా వైఫల్యమేనని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రోన్ ఎగరవేసిన యూట్యూబర్ పై, ఇంత జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
తెలుగు తమ్ముళ్ల మధ్య రచ్చకెక్కిన ‘అక్రమ మైనింగ్’ పంచాయతీ
సాక్షి, ఏలూరు జిల్లా: నూజివీడులో తెలుగు తమ్ముళ్ల అక్రమ మైనింగ్ పంచాయతీ రచ్చకెక్కింది. కూటమి అధికారంలోకి వచ్చాక తోటపల్లిలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ సాగుతుండగా.. చర్యలు తీసుకోవాలంటూ ఏలూరు జిల్లా కలెక్టర్‌కు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు స్వయంగా ఫిర్యాదు చేశారు. దీంతో ముద్దరబోయిన తీరుపై నూజివీడు మండలం రావిచర్ల టీడీపీ నేతలు మండిపడుతున్నారు.ముద్దరబోయిన కలెక్టర్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ రావిచర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు అన్నారు. రావిచర్లలో అక్రమ మైనింగ్ జరిగితే ఏ చర్యలైనా తీసుకోండని అధిష్టానాన్ని కోరుతున్నాం. సొంత పార్టీలోని నేతలపైనే బురద చల్లడం బాధాకరం. అధిష్టానం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ముద్దరబోయిన చర్యలున్నాయి. తక్షణం ముద్దరబోయినను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి’’ అని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. -
తల్లి, కుమారుడి దారుణహత్య
మండవల్లి/కైకలూరు: ఏలూరు జిల్లా మండవల్లి మండలం గన్నవరంలో శుక్రవారం రాత్రి తల్లి, కొడుకు దారుణహత్యకు గురయ్యారు. శనివారం తెల్లవారి చుట్టుపక్కలవారు మృతదేహాలను గమనించడంతో హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి తగాదాల నేపథ్యంలో వీరి హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నవరం గ్రామానికి చెందిన రొయ్యూరు సుబ్బారావు, నాంచారమ్మ దంపతులకు నగేష్‌బాబు (55) సంతానం. అతడు పుట్టిన తర్వాత నాంచారమ్మ మరణించడంతో ఆమె చెల్లెలు భ్రమరాంబను సుబ్బారావు రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి సురేష్ (35) సంతానం. సుబ్బారావు 20 సంవత్సరాల కిందట మరణించాడు. నగేష్‌బాబు విజయవాడలో డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. ఐటీడీపీలో యాక్టివ్ మెంబర్‌గా కొనసాగుతున్న సురేష్ స్వగ్రామంలోనే ఉంటున్నాడు. ఈ కుటుంబానికి గన్నవరంలో 40 సెంట్ల పొలం, ఒక భవనం, 6 సెంట్ల స్థలం తండ్రి ఆస్తిగా ఉన్నాయి. వీటి విషయంలో నగేష్‌బాబు, సురేష్‌ల మధ్య విభేదాలున్నాయి.కోర్టుల్లో కేసులు కూడా ఉన్నాయి. ఇటీవల 40 సెంట్ల పొలాన్ని చెరిసగం పంచుకున్నారు. భవనం విషయంలో గొడవలు ముదిరాయి. సురేష్ భార్య గాయత్రి తండ్రి సంవత్సరీకం కావడంతో భార్య, భర్త, పిల్లలు గురువారం ముసునూరు వెళ్లారు. తల్లి ఇంటివద్ద ఒంటరిగా ఉందని సురేష్ శుక్రవారం గన్నవరం వచ్చేశాడు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు ఇంట్లో మంచంపై పడుకున్న సురేష్ మెడను కోసి హత్యచేశారు. బయట పడుకున్న భ్రమరాంబను తలపై నరికి చంపేశారు. శనివారం తెల్లవారిన తరువాత భవనం వరండాలో రక్తపుమడుగులో ఉన్న భ్రమరాంబను చుట్టుపక్కలవారు గమనించారు. వచ్చి చూడగా రెండు హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఘటనాస్థలాన్ని ఏలూరు డీఎస్పీ శ్రవణ్‌కుమార్, కైకలూరు సీఐ వి.రవికుమార్, ఎస్ఐ రామచంద్రరావు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కైకలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఆస్తి వివాదాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్టు భావిస్తున్నామన్నారు. మొదటి భార్య కుమారుడు నగేష్‌బాబు పాత్రతో పాటు ఇతర కారణాలపై విచారిస్తున్నట్లు చెప్పారు. -
సుందర్ కుమార్ అక్రమ అరెస్ట్..
-
టీడీపీ Vs జనసేన.. తారాస్థాయికి వర్గ విభేదాలు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ-జనసేనలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. కొల్లేరు గ్రామాల్లో జనసేన నాయకులపై టీడీపీ నేతల వరస దాడులకు తెగబడుతున్నారు. పెన్షన్ల పంపిణీ అంశంలో టీడీపీ నేతలే పంచి పెట్టాలని ఎమ్మెల్యే చింతమనేని హుకుం జారీ చేశారు. ప్రశ్నించిన జనసేన నేతలపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. తన అనుచరులతో దాడి చేయించి కేసులు పెట్టించారు.కొల్లేరులో టీడీపీ నేతల ఆగడాలు పెరిగిపోయాయంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు పట్టాలంటే ఎమ్మెల్యేకు ఎకరాకు లక్ష కట్టాలంటూ కొల్లేరు వాసులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రౌడీ మూకలతో జనసేన నాయకులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.నేడు జిల్లాలో పర్యటించనున్న పవన్‌కల్యాణ్‌ను కలిసి చింతమనేని తీరుపై నియోజకవర్గ ఇన్ చార్జి ఘంటసాల వెంకటలక్ష్మి ఫిర్యాదు చేయనున్నారు. కొన్ని అరాచక శక్తులు జనసేనలో చేరాయంటూ చింతమనేని వ్యాఖ్యానించారు. కొత్తగా పార్టీలో చేరి పెత్తనం చలాయిస్తే ఊరుకోమని.. పెన్షన్ పంపిణీకి, అలాంటి వారికి ఏం సంబంధం అంటూ చింతమని హెచ్చరించారు. -
బాణసంచా తయారీ కేంద్రంలో ఇద్దరు మహిళలు సజీవదహనం
ఉండ్రాజవరం/సాక్షి, అమరావతి: దీపావళి పండుగ వారి జీవితాల్లో అమావాస్యను మిగిల్చింది. కూటికోసం కూలికొచ్చిన ఇద్దరు మహిళల్ని పిడుగుపాటు సజీవదహనం చేసింది. బాణసంచా తయారీ కేంద్రంలో చెలరేగిన మంటలు వారిని కాల్చేశాయి. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యారావుపాలెంలో జనావాసాలకు దూరంగా వేగిరోతు రామశివాజీ ఆధ్వర్యంలో సాయి ఫైర్వర్క్స్ పేరిట దీపావళి బాణసంచా తయారీ కేంద్రం కొనసాగుతోంది. తణుకు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు, పురుషులు ఇక్కడ పనిచేస్తున్నారు. గురువారం దీపావళి నేపథ్యంలో బాణసంచా తయారీ ముమ్మరంగా సాగుతోంది. బుధవారం సాయంత్రం ఆ కేంద్రం సమీపంలోని కొబ్బరిచెట్టుపై పిడుగుపడింది. ఆ నిప్పురవ్వలు బాణసంచా తయారీ కేంద్రం మీద పడ్డాయి. బాణసంచా అంటుకుని మంటలు చెలరేగాయి. అక్కడ పనిచేస్తున్న వేగిరౌతు శ్రీవల్లి (50), గుమ్మడి సునీత (35) సజీవంగా కాలిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొందరికి స్వల్పగాయాలయ్యాయి. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సూర్యారావుపాలెంలో పిడుగుపాటుతో బాణసంచా తయారీ కేంద్రంలో ఇద్దరు మృతిచెందిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంటలు చెలరేగి గాయపడిన వారికి తక్షణమే మైరుగైన వైద్యసదుపాయాలు అందించాలని డిమాండ్ చేశారు. -
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
పీఎస్‌లో రెడ్‌బుక్ రాజ్యాంగం.. అమలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, ఏలూరు జిల్లా: తలకడిపూడి పీఎస్‌లో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ హల్చల్ చేశారు. ఎస్సై కుర్చీలో కూర్చొని టిఫిన్ చేసిన ఆయన.. పోలిస్ స్టేషన్లో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసినట్లుగా వ్యవహరించారు. పోలిస్ స్టేషన్‌ను సెటిలిమెంట్లకు అడ్డగా మార్చారు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్. పోలిస్ స్టేషన్లో ఎస్సై కుర్చీలో కూర్చొని ఆదేశాలిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఏలూరులో మహిళపై సామూహిక అత్యాచారం
ఏలూరు టౌన్: కోల్‌కతాలో డాక్టర్‌పై హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తున్న వేళ.. ఏలూరులో ముగ్గురు యువకులు ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేయడం స్థానికంగా కలకలం రేపింది. భార్యాభర్తలు నిద్రిస్తున్న సమయంలో భర్తను చితక్కొట్టి.. భార్యను లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఈ ఘటన ఆ మృగాళ్ల ఉన్మాదానికి పరాకాష్టగా నిలుస్తోంది. పోలీసులు వెంటనే స్పందించకపోవడం, ఘటన వివరాలు ఓ వ్యక్తి వెంటనే తెలిపినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తే.. కూటమి సర్కారులో మహిళలకు భద్రత కరువైందన్న దానికి తార్కాణంలా ఈ ఘటన నిలుస్తోంది.భర్త ఫిర్యాదుతో ఏలూరు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. బాధితురాలికి ఏలూరు జీజీహెచ్‌లో వైద్యచికిత్స అందిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ అమానుష ఘటన వివరాలు.. ఏలూరు జిల్లా లింగపాలెం మండలానికి చెందిన భార్యాభర్తలు జీవనోపాధి కోసం 20 రోజుల క్రితం ఏలూరు నగరానికి వచ్చారు. వన్‌టౌన్ ప్రాంతంలోని ఓ హోటల్లో పనికి కుదిరారు. రాత్రి వేళల్లో స్థానికంగా ఉన్న ఆధ్యాతి్మక వేదిక రామకోటిలో నిద్రపోయి.. ఉదయం లేచి పనులకు వెళుతున్నారు. జీతం వచ్చాక అద్దె ఇల్లు కూడా తీసుకోవాలని భావించారు. వీరు ఇలా జీవించడం చూసిన ముగ్గురు జులాయి యువకులు కొద్ది రోజులుగా భర్తతో స్నేహంగా ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ముగ్గురు యువకులు భర్తకు మద్యం తాగించారు. అతను మత్తులో మునిగి నిద్రపోగా.. అతని భార్య (35)ను అక్కడి నుంచి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె కేకలు వేయగా.. మెలకువ వచి్చన భర్త వారిని అడ్డగించాడు. యువకులు బలమైన కర్రతో భర్త కాళ్లను చితక్కొట్టారు. అనంతరం మహిళను సమీపంలోని భవనంలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆమె ముఖంపైనా బలంగా కొట్టారు. పోలీసుల అలసత్వం కాళ్లపై బలంగా దెబ్బతిన్నా.. భర్త రోడ్డుపైకి వచ్చి సాయం కోసం అరిచాడు. సినిమా చూసి అటుగా వెళుతున్న బాలాజీ అనే యువకుడు ఇది గుర్తించి డయల్ 100కు ఫోన్ చేయగా సిబ్బంది పట్టించుకోలేదు. చేసేది లేక ఏలూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అక్కడి సిబ్బందికి జరిగిన విషయాన్ని చెప్పగా.. వారు వెంటనే స్పందించకుండా ఆలస్యం చేశారు. పోలీసులు వెంటనే స్పందించకపోవడంతో బాలాజీ.. తన స్నేహితులకు ఫోన్ చేసి ఘటనా స్థలానికి వెళ్లాడు. వీరు వెళ్లాక నిందితులు ముగ్గురూ బాధిత మహిళను అక్కడే వదిలేసి పారిపోయారు. ముగ్గురు నిందితుల అరెస్ట్ మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు ముగ్గురినీ ఏలూరు వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఏలూరు వన్‌టౌన్ గజ్జవారి చెరువు వద్ద బిట్టు బార్ ఎదురుగా రోడ్డుపై నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జులాయిగా తిరిగే ఈ నిందితులు ఏలూరు టీచర్స్ కాలనీలో చెంచుకాలనీ రోడ్డు ప్రాంతానికి చెందిన నూతిపల్లి పవన్, లంబాడీపేట, సాయిబాబా గుడి ప్రాంతానికి చెందిన నారపాటి నాగేంద్ర, ఎంఆర్ఆర్ కాలనీ 13వ రోడ్డు ప్రాంతానికి చెందిన గడ్డి విజయకుమార్ అని పోలీసులు వెల్లడించారు. -
నల్ల బంగారులోకం!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఆంధ్రా సింగరేణిగా ఏలూరు జిల్లా చింతలపూడి ప్రాంతం వెలుగొందనుంది. నల్ల బంగారు గనులతో రాష్ట్రానికి కాసుల పంట పండించనుంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుంది. నవ్యాంధ్ర అభివృద్ధికి ఊతం అందించనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80 బొగ్గు గనుల వేలానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ జాబితాలో ఏలూరు జిల్లా చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్డబ్ల్యూ), చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్ఈ)లు 44, 45 స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు సెక్టార్లు కూడా చింతలపూడి మండలంలోనే ఉండటం విశేషం. దీంతో చింతలపూడి మండలంలో నాణ్యమైన బొగ్గు తవ్వకాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే వేలంలో చోటు దక్కినా...!చాట్రాయి మండలం సోమవరం గ్రామం నుంచి చింతలపూడి వరకు 2వేల మిలియన్ టన్నుల నుంచి 3వేల మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తెలంగాణలోని సింగరేణి తరహాలో ఇక్కడ బొగ్గు తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి 2015లో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎండీసీ) లేఖ రాసింది. దానిపై కేంద్రం స్పందించలేదు. కానీ, గతంలో కేంద్రం దేశవ్యాప్తంగా నిర్వహించిన బొగ్గు గనుల వేలంలో ప్రస్తుతం ఏలూరు జిల్లా చాట్రాయి మండలం సోమవరం, తడికలపూడితోపాటుగా చింతలపూడి బ్లాక్‌లోని జంగారెడ్డిగూడెం కూడా ఉన్నాయి. ఈ వేలంలో సింగరేణి సంస్థ పోటీలో లేక పోవడంతో బొగ్గు గనుల వేలం వాయిదా పడింది. తాజాగా ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి దేశవ్యాప్తంగా నూతన బొగ్గు గనుల వేలం జాబితాను ప్రకటించగా, చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్డబ్ల్యూ), చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్ఈ)లకు చోటు దక్కింది. దీంతో బొగ్గు తవ్వకాలు ప్రారంభమైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రజలు భావిస్తున్నారు.60 ఏళ్ల నుంచి అన్వేషణ.. » ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాల పరిధిలో బొగ్గు గనులను కనుగొనేందుకు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ)తోపాటు వివిధ సంస్థలు 60 ఏళ్ల నుంచి సర్వేలు చేశాయి. తొలి దశలో 1964 నుంచి 2006 వరకు నాలుగు దఫాలుగా సర్వేలు నిర్వహించారు. 2006 నుంచి 2016 వరకు మళ్లీ సర్వేలు కొనసాగాయి. » అన్ని సర్వేల్లోనూ చింతలపూడి ప్రాంతంలో నాణ్యమైన బొగ్గు గనులు ఉన్నట్లు గుర్తించారు. ఆయా సర్వే సంస్థల నివేదికల్లో కొన్ని స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ చింతలపూడి మండలంలో 30 కిలో మీటర్ల వ్యాసార్థంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు దాదాపు అన్ని సంస్థలు అంచనా వేశాయి. » లక్నోకు చెందిన బీర్బల్ సహానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ అనే సంస్థ 2013లో నాటి కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బొగ్గు గనులపై అధ్యయనం చేసింది. చాట్రాయి మండలం సోమవరం నుంచి చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల మీదుగా రాజమండ్రి వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. ఇతర రాష్ట్రాల్లో లభించే బొగ్గుతో పోల్చితే ఇక్కడ అత్యంత నాణ్యమైన గ్రేడ్–1 రకం బొగ్గు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అది కూడా భూ ఉపరితలానికి 500 మీటర్ల లోతులోనే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని వెల్లడించింది. » సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ మరో సంస్థతో కలిసి చింతలపూడి ప్రాంతంలో 120 పాయింట్లను గుర్తించి అధునాతన రిగ్గులతో డ్రిల్లింగ్ చేపట్టింది. ఈ 120 పాయింట్ల ద్వారా సుమారు 65,000 మీటర్ల లోతున బొగ్గు అన్వేషణ చేపట్టి సుమారు 40,000 మీటర్ల పనులు పూర్తి చేసింది. » ఇక్కడ గనుల్లో తవ్వకాలు ప్రారంభమైతే ఏడాదికి 8 వేల మెగావాట్లు చొప్పున 60 సంవత్సరాల వరకు విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు సరిపోతుందని వివిధ సర్వే రిపోర్టుల ఆధారంగా అధికారులు అంచనా వేశారు. -
Eluru District: పందికొక్కుల మెక్కేస్తున్నారు..
-
తెగిపోయిన పెదవాగు ప్రాజెక్టు ఆనకట్ట
వేలేరుపాడు: కుండపోత వర్షాలు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలాన్ని ముంచెత్తాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నీటి ప్రవాహం ఉధృతం కావడంతో పెదవాగు ప్రాజెక్టు గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో తెగిపోయింది. దీంతో మండలంలోని మేడేపల్లి, కమ్మరగూడెం, అల్లూరి నగర్, ఒంటిబండ, రామవరం ఊటగుంపు, ఉదయ్‌నగర్, సొంబే గొల్లగూడెం, గుల్లవాయి, పాత పూచిరాల గ్రామాల్లో ఇళ్లు నీట మునిగాయి. అకస్మాత్తుగా ప్రాజెక్టు నీరు రావడంతో ఆయా గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగు తీశారు. పెదవాగు ప్రాజెక్టుకు చేరువలో ఉన్న మేడేపల్లి, అల్లూరి నగర్, ఒంటి బండ, కమ్మరగూడెం గ్రామాల ప్రజలు ఒక్కసారిగా నీరు రావడంతో సమీపంలోని గుట్టల పైకి, భవనాల పైకి ఎక్కారు. వరద ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. సహాయక చర్యలు అందించేందుకు ఆయా గ్రామాలకు అధికారులు వెళ్లాలన్నా రహదారి సౌకర్యం లేదు. ఆయా గ్రామాల ప్రజలే సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వేలేరుపాడు మండలం మేడేపల్లి మొదలుకొని అల్లూరి నగర్, కోయ మాధవరం, గుల్లవాయి తదితర ప్రాంతాల్లో రహదారులన్నీ నీట మునిగాయి. వేలేరుపాడు నుంచి కొయిదా వెళ్లే రహదారిలో వేళ్లవాగు, ఎద్దెల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎద్దెల వాగు వద్ద వంతెన అప్రోచ్ కొట్టుకుపోయింది. వేలేరుపాడు నుంచి రుద్రమ్మకోటకు వెళ్లే రహదారిలో పెదవాగు వంతెన వద్ద రహదారి అంతా నీట మునిగింది. -
నిద్రమత్తు ముగ్గురిని బలిగొంది..
ద్వారకాతిరుమల: కారు డ్రైవర్ నిద్రమత్తు మూడు నిండు ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన ఏలూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగి ఉన్న కంటైనర్‌ను వెనుక నుంచి కారు వేగంగా ఢీకొట్టిన దుర్ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం రాజవోలు గ్రామానికి చెందిన రాచాబత్తుని నాగార్జున హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.అతని భార్య భాగ్యశ్రీ (30) సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూ నిమిత్తం ఈ నెల ఆరో తేదీన భీమవరానికి చెందిన తన తల్లిదండ్రులు బొమ్మా నారాయణరావు, కమలాదేవి (57)తో పాటు, తన ఇద్దరు పిల్లలు నాగనితిన్ కుమార్ (4), నాగషణ్ముఖను తీసుకుని కిరాయి కారులో హైదరాబాద్‌కు వెళ్లారు. ఇంటర్వ్యూ ముగించుకుని ఏడో తేదీ రాత్రి స్వగ్రామానికి అదే కారులో తిరుగు ప్రయాణమయ్యారు. నారాయణరావు విజయవాడలో కారు దిగి, భీమవరానికి వెళ్లిపోగా, మిగిలినవారు రాజవోలుకు బయలుదేరారు.అయితే ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం మారంపల్లి పంచాయతీ పరిధిలోని లక్ష్మీనగర్ జాతీయ రహదారి వద్దకు రాగానే డ్రైవర్ దుర్గా వంశీ నిద్రమత్తులో రోడ్డు పక్కన నిలిపివున్న కంటైనర్‌ను వెనుక నుంచి అతి వేగంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో భాగ్యశ్రీ,, ఆమె తల్లి కమలాదేవి, ఆమె చిన్న కుమారుడు నాగనితిన్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.పెద్ద కుమారుడు నాగషణ్ముఖ, డ్రైవర్ దీవి వంశీకృష్ణ తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు క్షతగాత్రులను ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఏలూరు జిల్లా ఎస్పీ మేరి ప్రశాంతి ఘటనాస్థలిని పరిశీలించారు. భీమడోలు సీఐ బి.భీమేశ్వర రవికుమార్, ద్వారకా తిరుమల ఎస్ఐ జి.సతీష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుడే పింఛన్ల తొలగింపు
సాక్షి నెట్వర్క్: అనుకున్నంతా అయింది. నెలకే మొదలైంది. ఐదేళ్లుగా కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా పింఛన్ అందుకున్న లబ్ధిదారులకు ఇక్కట్లు మొదలయ్యాయి. కూటమి నాయకులు వారికి చుక్కలు చూపిస్తున్నారు. పలు గ్రామాల్లో పింఛన్లను నిలిపేశారు. పలువురి పింఛన్లు తొలగించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి విడత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనే అడుగడుగునా తమ నైజం బయటపెట్టుకున్నారు. పలు గ్రామాల్లో పింఛన్ల పంపిణీని టీడీపీ నాయకులు తమ కనుసన్నల్లో నడిపించారు.ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదనే కారణంతో పలు గ్రామాల్లో కొందరికి పింఛన్లు అందకుండా చేశారు. వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారనే ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఇళ్లపై టీడీపీ జెండా ఐదేళ్లు ఎగిరితేనే పింఛన్ ఇస్తామని బాహాటంగానే చెబుతున్నారు. ఒక లబ్ధిదారుడికి పింఛన్ ఆపేశారని ఫోన్ చేసిన టీడీపీ కార్యకర్తతో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచితంగా మాట్లాడారు. తొక్కగాడివి.. మొనగాడిననుకుంటున్నావా.. అంటూ విరుచుకుపడ్డారు. దెందులూరు మండలంలో పింఛన్లు రాలేదని నిరసన తెలుపుతున్న వారిని ఫొటోలు తీస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్త శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. 41 మందికి ఆగిన పింఛన్ ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొత్తగూడెం గ్రామంలో 41 మంది లబ్ధిదారులకు పింఛన్ ఇవ్వలేదు. వారు మంగళవారం గ్రామ సచివాలయం వద్దకు వచ్చి తమ పింఛన్ ఎందుకు ఇవ్వలేదని కార్యదర్శిని ప్రశ్నించారు. అనంతరం గ్రామ సచివాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న వీరిని సెల్ఫోన్లో ఫొటోలు తీస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్త తీడా శ్రీనుపై ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. దీంతో మనస్తాపం చెందిన తీడా శ్రీను వెంటనే అక్కడినుంచి వెళ్లి పెట్రోల్ తీసుకొచ్చాడు. టీడీపీ కార్యకర్తలు తనపై దాడిచేసినచోటే పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.స్థానికులు వెంటనే అతడిని అడ్డుకున్నారు. సర్పంచ్ పరసా లక్ష్మీసుజాత, వైఎస్సార్సీపీ నేత పరసా కనకరాజు సూచన మేరకు వైఎస్సార్సీపీ నాయకుడు ఉదయభాస్కర్ తదితరులు శ్రీనును ద్విచక్ర వాహనంపై భీమడోలు వైద్యశాలకు తీసుకువెళ్లారు. వైద్యులు శ్రీనుకు ప్రాథమిక వైద్యసేవలు అందించారు. 41 మందికి పెన్షన్లు ఎందుకు నిలిపేశారని పరసా కనకరాజు, కోటిపల్లి సత్తిరాజు, ఉదయభాస్కర్, వర్రె సత్తిబాబు, రాజు ప్రశ్నించారు.వెంటనే గ్రామానికి చెందిన 41 మంది పెన్షనర్లకు నగదు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరికి, ఏపీ ఆయిల్‌ఫెడ్ మాజీ చైర్మన్ కొఠారు రామచంద్రరావుకు తెలియజేస్తామని, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ విషయమై దెందులూరు ఎంపీడీవో వి.శ్రీలతను వివరణ కోరగా.. ఫిర్యాదులు రావడంతో పెన్షన్లు నిలిపేసినట్లు చెప్పారు. వాటిని పరిశీలించి విచారించిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. వికలాంగులపై కక్ష గుంటూరు జిల్లా గరికపాడులో ఈనెల 1వ తేదీన 11 మంది వికలాంగుల పింఛన్లను టీడీపీ నాయకులు నిలిపేశారు. వీరు వైఎస్సార్సీపీ సానుభూతి పరులని, దొంగ సర్టిఫికెట్లతో పింఛన్ తీసుకుంటున్నారని అధికారులకు పోస్టుద్వారా ఫిర్యాదు చేశారు. వారికి పింఛన్ పంపిణీ నిలిపేయాలని డిమాండ్ చేశారు. దీంతో 11 మంది వికలాంగులకు అధికారులు పింఛన్ పంపిణీ నిలిపేశారు. ఈ విషయమై ఎంపీడీఓ రామకృష్ణ మాట్లాడుతూ 11 మంది నకిలీ సర్టిఫికెట్లతో ఫింఛన్ తీసుకుంటున్నారని వెంటనే వారికి నిలిపివేయాలని గ్రామ టీడీపీ నేతలు నోటీసు ఇవ్వడంతో ప్రస్తుతానికి నిలిపేసినట్లు చెప్పారు. ఐదేళ్లు టీడీపీ జెండా ఉండాలని బెదిరింపు పల్నాడు జిల్లా అల్లూరివారిపాలెం, పమిడిపాడు, దొండపాడు గ్రామాల్లో పలువురికి పింఛన్ల పంపిణీ నిలిపేశారు. అల్లూరివారిపాలెంలో 20 మందికిపైగా లబ్ధిదారులకు మంగళవారం సాయంత్రం వరకు పింఛన్లు పంపిణీ చేయలేదు. సోమవారం గ్రామంలో పింఛన్ ఇచ్చేందుకు వచ్చిన సచివాలయ సిబ్బంది వద్దకు లబ్ధిదారులు వెళ్లారు. పింఛన్ కావాలంటే గ్రామంలోని టీడీపీ నాయకులను కలవాలని సచివాలయ సిబ్బంది వారికి చెప్పారు. దీంతో పలువురు లబ్ధిదారులు టీడీపీ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి తమకు పింఛన్ వచ్చేలా చూడాలని కోరారు.టీడీపీలో చేరి ఇంటిపై జెండా పెడితేనే పింఛన్ ఇస్తామని టీడీపీ నేతలు చెప్పారు. ఐదేళ్లు జెండా ఇంటి మీద ఉండాలని స్పష్టం చేశారు. దీనికి లబ్ధిదారులు విముఖత చూపడంతో వారికి పింఛన్ పంపిణీ చేయలేదు. పమిడిపాడులో పింఛన్ల పంపిణీని జనసేన నాయకులు అడ్డుకున్నారు. సోమవారం కూటమి సానుభూతిపరులకు మాత్రమే పింఛన్ ఇచ్చారు. వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపారంటూ పలువురికి పింఛన్ పంపిణీ చేయకుండా జనసేన నాయకులు అడ్డుకుని హంగామా సృష్టించారు.గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో పోలీసు బందోబస్తుతో మంగళవారం పెన్షన్లు పంపిణీ చేశారు. దొండపాడులోను పింఛన్ల పంపిణీని ఇదే విధంగా అడ్డుకున్నారు. పలు గ్రామాల్లో సోమవారం టీడీపీ సానుభూతిపరులకే పింఛన్లు పంపిణీ చేశారు. జాబితాలో ఉన్న అందరికీ పింఛన్ ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో మంగళవారం మిగిలిన పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్ అందలేదని నిరసనశ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోరింట సచివాలయం పరిధిలో తమకు పింఛన్లు ఇవ్వలేదని 19 మంది మంగళవారం నిరసన తెలిపారు. సచివాలయం వద్ద సాయంత్రం వరకు కార్యదర్శి కోసం వేచి చూశారు. సాయంత్రం సచివాలయం కార్యదర్శి నాగరాజు వచ్చి 13 మందికి పింఛన్లు ఇచ్చారు. ఇంకా ఆరుగురికి ఇవ్వాల్సి ఉంది. పింఛన్‌దారుల తరఫున సర్పంచ్ భర్త తమ్మినైన మురళీకృష్ణకు చెప్పి ఆఫీసు పనిమీద మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లానని కార్యదర్శి చెప్పారు. సాయంత్రం 13 మందికి పింఛన్లు ఇచ్చానని, మిగిలిన వారిలో అర్హులందరికీ ఇస్తానని తెలిపారు.ఎంపీడీవో లాగిన్ ద్వారా ఇద్దరి పింఛన్ల తొలగింపుశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం రావులకొల్లులో కలవకూరి రామ్మూర్తి, చిగురుపాటి బోడియ్య పింఛన్లు తొలగించారు. రామ్మూర్తికి ఐదేళ్లుగా వృద్ధాప్య పింఛన్, బోడియ్యకు నాలుగేళ్లుగా చర్మకార్మిక పింఛన్ వస్తున్నాయి. స్థానిక టీడీపీ నాయకులు కొద్దిరోజులుగా ఇక నుంచి వారికి పింఛన్ రాదని గ్రామంలో ప్రచారం చేశారు. ఆ విధంగానే ఈ నెల 1వ తేదీ వారికి పింఛన్ నగదు అందలేదు.దీంతో రామ్మూర్తి, బోడియ్య మంగళవారం పోలంపాడులోని గ్రామ సచివాలయానికి, కలిగిరిలోని ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. ఎంపీడీవో లాగిన్ ద్వారా పింఛన్లను తొలగించారని తెలియడంతో నిర్ఘాంతపోయారు. తమ పింఛన్‌ను అన్యాయంగా నిలిపేశారని కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీ నాయకులు ఉద్దేశ పూర్వకంగానే అధికారుల ద్వారా తమ పింఛన్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో పలు పంచాయతీల్లో కొందరికి పింఛన్ నిలిపేయాలని స్థానిక నాయకులు సచివాలయ సిబ్బందికి సూచించినట్లు తెలిసింది.గత నెలలో పింఛన్ అందిందిగత నెలలో పింఛన్ నగదు బ్యాంకులో జమ అయింది. ఈ నెలలో పింఛన్ కోసం సోమవారం అంతా ఎదురుచూశాను. మంగళవారం కూడా రాకపోవడంతో మా ఊళ్లో సచివాలయానికి వెళ్తే ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లమన్నారు. అక్కడికెళ్తే ఎంపీడీవో లాగిన్ ద్వారా పింఛన్ తొలగించారని చెప్పారు. టీడీపీ నాయకులు అన్యాయంగా పింఛన్ తొలగించారు. – కలవకూరి రామ్మూర్తిదళితులకు చేసే న్యాయం ఇదేనా?దళితుడినైన నాకు కులవృత్తి అయిన చర్మకార్మిక పింఛన్ వస్తోంది. మా కుమార్తె చనిపోవడంతో ఆమె ఇద్దరు పిల్లలకు కూడా మేమే ఆధారం. నాలుగేళ్లుగా వస్తున్న పింఛన్ తొలగించారు. అధికారంలోకి వచ్చిన నెలలోనే దళితులకు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న న్యాయం ఇదేనా? నాకు పింఛన్ అందించి న్యాయం చేయాలి. – చిగురుపాటి బోడియ్యజాగ్రత్తగా ఉండు.. సొంత పార్టీ కార్యకర్తకు ఎమ్మెల్యే కూన హెచ్చరిక శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సొంత పార్టీ కార్యకర్తపైనే విరుచుకుపడ్డారు. ఆ ఆడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమదాలవలస మండలం పీరుసాహెబ్పేటకు చెందిన ఊట రాజారావుకు పింఛన్ ఆపేశారంటూ.. పొందూరు మండలం పిల్లలవలసకు చెందిన టీడీపీ కార్యకర్త గురుగుబెల్లి భాస్కరరావు మంగళవారం ఎమ్మెల్యేకి ఫోన్ చేశారు.రాజారావు వైఎస్సార్సీపీకి చెందినవారని పెన్షన్ నిలుపుదల చేశారని, ఆయన మన టీడీపీ వ్యక్తేనని చెప్పారు. ఆయనకు పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటలు ముదిరి నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఫోన్లో వాదించుకున్నారు. పార్టీ గెలుపునకు వేల రూపాయలు ఖర్చుచేశానని, ఇప్పుడు తమ చుట్టాలకు పెన్షన్ తీసివేయడం సమంజసం కాదని భాస్కరరావు చెబుతుండగానే.. ‘డొంక తిరుగుడు మాటలు మాట్లాడకు, తొక్కగాడివి, మొనగాడివి అనుకుంటున్నావా? మర్యాద ఇచ్చి మాట్లాడు.మర్యాద ఇస్తున్నాను జాగ్రత్తగా ఉండు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్..’ అంటూ ఎమ్మెల్యే కూన విరుచుకుపడ్డారు. కూన రవికుమార్ మాటలు విన్న భాస్కరరావు ‘ఆ పెన్షన్ డబ్బులు మూడువేలు కూడా మీరే తీసుకోండి. మేం కష్టపడి పనిచేశాం. తప్పుగా మాట్లాడలేదు. ఇడియట్ అని మీరు తిడితే సహించేదిలేదు..’ అంటూ తిరిగి సమాధానం చెప్పాడు. -
ఆయిల్‌పామ్.. ధర పతనం
ఆయిల్‌పామ్ ధరలు తిరోగమనం బాట పట్టాయి. క్రూడ్ ఆయిల్‌పై కేంద్రం దిగుమతి సుంకం రద్దు చేయడం, ఇతర కారణాలతో ఆయిల్‌పామ్ ధరలు భారీగా పడిపోతున్నాయి. గతేడాదితో పోల్చితే 40 శాతం మేర ధర తగ్గింది. అంతర్జాతీయంగా వచ్చే 30 ఏళ్ల వరకు ఆయిల్‌పామ్‌కు విపరీతంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతుండగా దానికి విరుద్ధంగా ధరలు పతనమవుతున్నాయి. ఐదేళ్ల నుంచి వరుసగా ధరలు పెరుగుతూ వచ్చి మళ్లీ ఈ ఏడాది రివర్స్‌లో పయనిస్తున్నాయి. ఆయిల్‌పామ్ సాగులో దేశంలోనే ఏలూరు జిల్లా మొదటి స్థానంలో నిలుస్తుంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు: వాణిజ్య పంటల్లో అగ్రగామిగా ఉన్న ఆయిల్‌పామ్ సాగు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అధికంగా ఉంది. దేశంలోనే సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 1.62 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగు జరుగుతుండగా ఒక్క ఏలూరు జిల్లాలోనే 48,968.8 హెక్టార్లలో, పశ్చిమగోదావరి జిల్లాలో 3 వేల హెక్టార్లు సాగులో ఉంది. సుమారుగా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు కలిపి 1.30 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్, కోకో, కొబ్బరి, మిరియాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు అంతర పంటగా వేసుకునే వీలు ఆయిల్‌పామ్‌కు ఉండటంతో లక్షా 30 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌తో పాటు అత్యధిక శాతం కోకో అంతర పంటగా ఉంది.ప్రధానంగా గోదావరి పరీవాహక ప్రాంతం కావడంతో గాలిలో 85 శాతం తేమ ఉండటంతో ఆయిల్‌పామ్ సాగుకు జిల్లా పూర్తి అనుకూలంగా ఉంటుంది. ఇసుకతో కూడిన ఎర్రని నేలలు కావడం, కృష్ణా, గోదావరి డెల్టా మధ్య ప్రాంతం కావడంతో గాలిలో తేమ శాతం ఉండటం వాతావరణం పూర్తి అనుకూలంగా ఉండటంతో ఆయిల్‌పామ్ సాగు అత్యధికంగా సాగుతుంది. మార్కెట్ ధరలతో నిమిత్తం లేకుండా దీర్ఘకాలిక పంటగా దీన్ని అత్యధిక శాతం సాగు చేస్తున్నారు. తిరోగమనంలో ధరలుఆయిల్పామ్ ధరలు తిరోగమనంలో కొనసాగుతున్నాయి. 2017లో సగటున రూ.8 వేలు ఉన్న ధర అంతర్జాతీయ పరిణామాలు డిమాండ్ కారణంగా 2022 నాటికి టన్ను ధర అత్యధికంగా రూ.26 వేలకు చేరింది. ఆ తరువాత క్రూడ్ ఆయిల్‌పై దిగుమతి సుంకం రద్దు చేయడంతో ఆయిల్‌పామ్ ధర తిరోగమన బాట పట్టి గతేడాది రూ.23 వేలు సగటున ఉండగా ప్రస్తుతం రూ.13,180కు పరిమితమైంది. రెండేళ్ల క్రితం వరకు కేంద్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్ ఇంపోర్ట్‌పై డ్యూటీ (దిగుమతి సుంకం) విధించింది. ఐదేళ్ల క్రితం వరకు ఇంపోర్ట్ డ్యూటీ 30 శాతం ఉండగా తర్వాత 20 శాతానికి తగ్గించారు.గతేడాది పూర్తిగా రద్దు చేయడంతో దేశంలోని ప్రధాన కంపెనీలు దిగుమతులపై ఆధారపడుతున్నాయి. వాస్తవానికి 10 లక్షల టన్నులు ఏటా డిమాండ్ ఉంటే 2 లక్షల టన్నులు కూడా ఉత్పత్తి లేని పరిస్థితి. ఈ క్రమంలో డిమాండ్ అధికంగా ఉండాలి. అయితే ఇంపోర్ట్ డ్యూటీ పూర్తిగా రద్దు చేయడంతో దిగుమతుల పైనే అత్యధికంగా ఆధారపడటంతో స్థానిక మార్కెట్లో ధరలు పూర్తిగా పతనమయ్యాయి. ఈ ఏడాది మళ్లీ ఇంపోర్టు డ్యూటీ విధించే అవకాశం ఉంది. ఇంపోర్ట్ డ్యూటీ అమలులోకి వస్తే ఆయిల్‌పామ్ ధరలు కొంతైనా పెరిగే అవకాశం ఉంది.ఏలూరు జిల్లాలో భారీగా సాగుఏలూరు జిల్లాలో 14 మండలాల్లో అత్యధికంగా ఆయిల్‌పామ్ సాగు జరుగుతుంది. 2019–20లో 72,860 హెక్టార్లు, 2020–21లో 70,963 హెక్టార్లు, 2022023లో 48,836 హెక్టార్లు, 2023–24లో 48,968.8 హెక్టార్లలో సాగు విస్తీర్ణంలో ఉంది. ప్రధానంగా టి.నర్సాపురం మండలంలో 16190 ఎకరాలు, కామవరపుకోట మండలంలో 16,078 ఎకరాలు, ద్వారకాతిరుమల మండలంలో 17,504 ఎకరాలు, చింతలపూడి మండలంలో 18,304 ఎకరాలు, జంగారెడ్డిగూడెం మండలంలో 8,422 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. హెక్టారుకు నాలుగేళ్లు కలిపి రూ.71 వేలు సబ్సిడీ రూపంలో ఇవ్వడం, 30 ఏళ్ల పాటు దిగుబడి వచ్చే పంట కావడంతో ఆయిల్‌పామ్ సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఆయిల్‌పామ్‌ను పామాయిల్ పరిశ్రమలు తక్కువ గాను, కాస్మొటిక్స్ ఇతర అనుబంధ పరిశ్రమలకు ఎక్కువగా వినియోగిస్తున్నారు. -
ఏజన్సీలో డయేరియా ఇద్దరు మృతి
-
చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదైంది. అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, స్టేషన్లో దౌర్జన్యం చేయడంపై 224,225,353,143 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చింతమనేని గూండాగిరిహత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పెదవేగి పోలీస్‌స్టేషన్ నుంచి మాజీ ఎమ్మెల్యే, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ బలవంతంగా తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో ఈనెల 13న పోలింగ్ కేంద్రంలో గ్రామ ప్రెసిడెంట్ సంజీవరావు కుమారుడు చలపాటి రవిపై నిందితుడు తాళ్లూరి రాజశేఖర్ దాడి చేయగా.. పోలీసులు బుధవారం రాజశేఖర్‌ను పోలీస్‌స్టేషన్‌కు రమ్మని ఆదేశించారు.ఈ క్రమంలో గురువారం నిందితుడు తాళ్లూరి రాజశేఖర్ అతడి తండ్రి డేవిడ్ గురువారం ఉదయం 8:30 సమయంలో పెదవేగి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు అతడిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని రాజశేఖర్ టీడీపీ కార్యకర్తల ద్వారా చింతమనేనికి తెలియజేశాడు. దీంతో చింతమనేని తన అనుచరులతో కలిసి స్టేషన్‌కు వచ్చి సీఐ, ఎస్ఐలపై తిరగబడి దౌర్జన్యంగా రాజశేఖర్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. -
కాకిస్‌నూరు.. ఓటింగ్‌లో సూపర్..
అది బాహ్య ప్రపంచంతో సంబంధం లేని ఓ కుగ్రామం. ఏలూరు జిల్లా కేంద్రానికి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గూడేనికి చేరుకోవడమే ఓ ప్రహసనం. ఎలాంటి రహదారి సౌకర్యం లేని అక్కడి పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలంటే కొయిదా గ్రామం నుంచి గోదావరి‡ నదిగుండా బోట్లో ప్రయాణించి, ఆవలి ఒడ్డు నుంచి సుమారు మూడు కిలోమీటర్లు గుట్టల నడుమ కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడ మొత్తం 472మంది కొండరెడ్ల ఓటర్లున్నారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో 440 ఓట్లు పోల్ కాగా 93.22శాతం ఓటింగ్ నమోదు చేసుకుని ఎలక్షన్ కమిషన్ దృష్టిని ఆకర్షించింది. అంతేనా... అధికారుల ప్రశంసలను కూడా అందుకుని దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆ గ్రామమే పోలవరం నియోజకవర్గం పరిధిలోని కాకిస్‌నూరు.వేలేరుపాడు: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని అత్యంత మారుమూల, దట్టమైన అటవీ ప్రాంత గ్రామమైన కాకిస్‌నూరు గ్రామం ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షించింది. సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 93.22 ఓటింగ్ శాతం నమోదు చేసుకుని ఆదర్శంగా నిలిచింది. అక్కడ ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు ఈ నెల 12వ తేదీ రాత్రి వెళ్లిన అధికారులకు గ్రామ కొండరెడ్లు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అధికారులను పూలమాలలతో సన్మానించారు. వారి సహృదయతకు ముచ్చటపడిన భారత ఎన్నికల సంఘం ‘ఎక్స్’ వేదికగా అధికారులకు స్వాగతం పలికిన ఫొటోను అప్లోడ్ చేసి, వివరాలతో ట్విట్ చేశారు. దీనికి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. బోటుపై వచ్చి ఓటు హక్కు వినియోగందట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కాకిస్‌నూరు పోలింగ్ కేంద్రం పరిధిలోని పేరంటపల్లి, టేకుపల్లి, చినమకోలు, పెదమంకోలు గ్రామాల ఓటర్లు 440 మంది గోదావరిలో బోటుపై వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 16,37,430 ఓటర్లున్న ఏలూరు జిల్లాలోని 1,744 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ సకల ఏర్పాట్లు చేశారు. కాకిస్‌నూరు గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విద్యుత్ సౌకర్యం లేని ఆ గ్రామంలో జనరేటర్ సమకూర్చి, తాత్కాలికంగా లైట్లు ఏర్పాటు చేయించారు.ఫోన్ కవరేజ్ లేకపోవడంతో ఈ గ్రామంలో శాటిలైట్ ఫోన్ ఏర్పాటు చేశారు. ఓటర్లు వచ్చేందుకు బోటు సౌకర్యం కల్పించడమే కాకుండా ఓటింగ్‌కు ఒక రోజు ముందు వారికి ఓటింగ్‌పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల అధికారులు 12న కాకిస్‌నూరు గ్రామానికి చేరుకొని, ఇంటింటికీ తిరిగి ప్రతిఒక్కరూ ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువను వివరించారు. ఫలితంగా ఓటింగ్ శాతం పెరిగింది. తమ గ్రామానికి దే«శస్థాయిలో గుర్తింపు రావడంపై భారత ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌కుమార్ మీనా, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌కు గ్రామ కొండరెడ్లు కృతజ్జతలు తెలిపారు.మా ఓటు వల్లనే ఊరికి మంచి పేరుమేమంతా ఓటు వేయడం వల్లనే మా ఊరికి మంచి పేరొచ్చింది. మా ఊరు దేశ ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లింది. మాకు చాలా సంతోషంగా ఉంది. –సిద్ది శ్రీనివాసరెడ్డిసానా సంతోషంగా ఉందయ్యామేమంతా ఓటెయ్యడం వల్ల ఊరికే పేరు రావడం నాకు సానా సంతోషంగా ఉందయ్యా.. పెద్ద సార్లకు కృతజ్ఞతలు చెబుతున్నా. – కోళ్ల కన్నమ్మ -
రోడ్డు ప్రమాదంలో భారీగా నగదు స్వాధీనం..!
-
కేసుల పుట్ట రఘురామకృష్ణరాజు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆస్తులు, కేసుల పుట్ట అని వెల్లడైంది. ఆయన, ఆయన భార్య కనుమూరి రమాదేవి పేరిట స్థిర, చరాస్తులు మొత్తం కలిపి రూ.215.57 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తేలింది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్రల్లో 19 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో సీబీఐ కేసులు కూడా ఆయనపై ఉన్నాయి. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు తరఫున ఆయన భార్య రమాదేవి శుక్రవారం రెండు సెట్ల నామినేషన్‌ను సమర్పించారు. ఉండి అభ్యర్థిగా టీడీపీ ఇంకా ఆయన పేరును అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు, కేసుల వివరాలను పేర్కొన్నారు. వీటి ప్రకారం.. బ్యాంకుల్లో అప్పులు రూ.12.60 కోట్లు ఉన్నట్టు తెలిపారు. ఆస్తులు, అప్పులు ఇవి.. రఘురామకృష్ణరాజు పేరుతో రూ.13.89 కోట్లు, ఆయన భార్య రమాదేవి పేరుతో రూ.17.79 కోట్ల చరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో చూపించారు. తమిళనాడు, తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, వాణిజ్య భవనాలు అన్నీ కలిపి రూ.8.48 కోట్లు రఘురామకృష్ణరాజు పేరిట, ఆయన భార్య పేరుతో రూ.175.45 కోట్లు ఆస్తులు ఉన్నట్టు తెలిపారు. రఘురామకృష్ణరాజుకు రూ.8.15 కోట్లు, ఆయన భార్యకు రూ.4.45 కోట్లు బకాయిలు ఉన్నట్టు చూపించారు. రఘురామపై కేసుల వివరాలివీ.. ►సైబరాబాద్‌లో వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఘటనలో, నేరపూరిత కుట్ర ఆరోపణలతో పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల పోలీస్‌స్టేషన్‌లో, పెనుమంట్ర పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసులు నమోదయ్యాయి. ►ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్‌గా ఉండి ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టించడం, రూ.25 కోట్ల చెల్లింపులు చేయకపోవడానికి సంబంధించి మహారాష్ట్రలోని థానేలో ఉన్న ఆర్థిక నేరాల విభాగం 2022 జనవరి 27న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనికి సంబంధించి హైదరాబాద్ కోర్టులో రెండు కేసులు, ముంబై కోర్టులో ఒక కేసు కొనసాగుతున్నాయి. ►మత విద్వేషాలు రగిల్చేలా మాట్లాడినందుకు చింతలపూడి, మంగళగిరి, భీమవరం, పోడూరు, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, నర్సాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేశారు. ►కుట్ర, మోసం, ఫోర్జరీ చేశారని ఎస్బీఐ ఇచ్చిన ఫిర్యాదుపై, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను మోసం చేయడంతో ఢిల్లీలో సీబీఐ కేసులు నమోదు చేసింది. ►ఫెమా చట్టం ఉల్లంఘన కింద రూ.40 కోట్లు జరిమానా విధించిన కేసు తెలంగాణ హైకోర్టులో కొనసాగుతోంది. -
రెట్టించిన ఉత్సాహంతో...
(మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) నుదిటిపై గాయం మానలేదు.. కుట్లు పచ్చి ఆరలేదు.. కంటిపైన వాపు తగ్గలేదు.. అయినా పెదాలపై చిరునవ్వు చెరగలేదు. ఆ ముఖంలో ఏ మాత్రం భయంలేదు. సడలని ఉక్కు సంకల్పంతో మరింత దృఢ నిశ్చయంతో జగన్ సోమవారం తన బస్సుయాత్రను ముందుకు దూకించారు. దాడులతో మన యాత్రను ఆపలేరని, ధైర్యంగా ముందుగు సాగుదామని కేడర్‌లో జోష్ నింపారు. బస్సుయాత్రలో భాగంగా ప్రతిరోజూ ఉ.9 గంటల నుంచి జగన్ సంబంధిత నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలను కలుస్తారు. అలాగే, సోమవారం ఈ కార్యక్రమానికి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి పలువురు నాయకులు తరలివచ్చారు. వారిని కలిసిన అనంతరం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కారణంగా డాక్టర్ల సూచనతో ఒకరోజు విశ్రాంతి తర్వాత కృష్ణాజిల్లా కేసరపల్లి నుంచి జగన్ ‘మేమంతా సిద్ధం’ 15వ రోజు బస్సుయాత్ర సోమవారం ఉదయం 10.25 నిమిషాలకు ప్రారంభమైంది. కేసరపల్లి బస ప్రాంతానికి అప్పటికే భారీగా చేరుకున్న అభిమానులు జగన్ రాకతో జై జగన్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. అక్కడి నుంచి వందలాది మోటార్ బైకులు ర్యాలీగా ముందు నడవగా.. బస్సుయాత్ర గన్నవరం చేరుకుంది. మార్గమధ్యంలో తన కోసం వచ్చిన ఓ మహిళా అభిమానితో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. గన్నవరం నియోజకవర్గం కొత్తపేటలో ప్రవేశించిన ముఖ్యమంత్రికి జాతీయ రహదారికి ఇరువైపులా బారులుతీరిన మహిళలు అఖండ స్వాగతం పలికారు. గన్నవరం వద్ద జాతీయ రహదారికి రెండువైపులా జనసందోహంతో నిండిపోయింది. గన్నవరం చరిత్రలోనే కనీవినీ ఎరుగనంత జనంతో కూడళ్లు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి. బస్సుపైకెక్కి వారికి అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు. మహిళలు జననేతకు గుమ్మడికాయలతో దిష్టితీసి హారతులిచ్చారు. జగనన్నా.. నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డువేస్తామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గాంధీబొమ్మ సెంటర్ జనసంద్రంగా మారింది. ఆపదను దాటి వచ్చిన నాయకుడికి అక్కడి ప్రజలు ప్రేమతో స్వాగతం పలికారు. జగన్‌ను చూసేందుకు పెద్దఎత్తున భవనాలపైకి స్థానికులు చేరుకున్నారు. జననేతను చూసి ఆనందంతో అభివాదం చేశారు. స్వచ్ఛందంగా తరలివస్తున్న జనం.. ఉమామహేశ్వరం మీదుగా ముందుకు సాగిన జగన్‌ను చూసేందుకు ఇళ్లల్లో నుంచి వృద్ధులు మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. హనుమాన్ జంక్షన్ క్రాస్ మీదుగా పెరికీడుకు చేరుకున్న జగన్‌కు భారీ జనసందోహం బాణాసంచాతో స్వాగతం పలికారు. కానుమోలులో శిరీష రీహాబిలిటేషన్ సెంటర్ (ఉయ్యూరు) నిర్వాహకులు, దివ్యాంగులతో వచ్చి జగన్‌ని కలిశారు. తమ సేవలను గుర్తించి ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ను అందించినందుకు వారు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వారితో మాట్లాడి ముందుకు సాగిన జగన్‌కు గ్రామస్తులు భారీగా వచ్చి ఘనస్వాగతం పలికారు. ఆరుగొలనులో రహదారి కిక్కిరిసిపోయేలా అభిమానులు తరలివచ్చి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఆరుగొలను ఆరోగ్యమాత ఆలయం వద్ద స్కడ్ హాట్ ఇంగ్లిష్ మీడియం స్కూలు విద్యార్థులు జగన్ మావయ్యా అంటూ ఎదురొచ్చారు. వారిని దాటి వచ్చిన జగన్‌కు పుట్టగుంటలో దారిపొడవునా ప్రజలు స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో ఎదురొచ్చిన వేద పండితులు జగన్‌ను ఆశీర్వదించారు. మ.3.30 గంటలకు జగన్నాథపురం వద్ద మధ్యాహ్న భోజన విరామం తీసుకున్న సీఎం జగన్ ప్రజాభిమానాన్ని దాటుకుంటూ సా.5.38 గంటలకు గుడివాడ బహిరంగ సభకు చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచే బహిరంగ సభకు జనం పోటెత్తడంతో సభా ప్రాంగణం జన సునామీని తలపించింది. ఆ అశేష జనవాహినినుద్దేశించి జగన్ ప్రసంగించారు. సభ అనంతరం 6.40 కి బస్సుయాత్ర తిరిగి ప్రారంభమైంది. హనుమాన్ జంక్షన్ హైవే మీదుగా కలపర్రు టోల్‌ప్లాజా చేరుకుంది. ఏలూరు జిల్లా నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్‌కు ఎదురొచ్చి గజమాలలు, డప్పులు, బాణాసంచా వెలుగులతో ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు, పవన్ కుట్ర అది.. ఇక జగన్‌పై హత్యాయత్నం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ కుట్రేనని బస్సుయాత్రకు వచ్చిన ప్రతిఒక్కరూ నినదించారు. వాళ్లే వేయించారని, రాళ్లు పెట్టికొట్టండి పగోడు వస్తున్నాడు అని ఆ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ రెచ్చగొట్టారని దుమ్మెత్తిపోశారు. ‘రాళ్లుపెట్టి కొట్టండి అని చంద్రబాబు అన్నాడు. నీకు దమ్ముంటే గెలిపించుకో, నీకు దమ్ముంటే పథకాలివ్వు. నీ దగ్గర శక్తి ఉంటే జనం మనస్సులు గెలుచుకో. కానీ, నువ్వు ఏ ఒక్క పథకం ఇవ్వలేదు. జనానికి సున్నా చుట్టావు. నిన్నెలా నమ్ముతారు చంద్రబాబు.. అంటూ జనం సూటిగా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఎవరికీ న్యాయం చేయలేదని, అన్యాయమే చేశాడని, 175 సీట్లు జగన్‌కే వస్తాయి.. చంద్రబాబుకు ఒక్క సీటు కూడా రాదని ముక్తకంఠంతో చెప్పారు. ఏలూరు జిల్లాలో ఎగిసిన అభిమాన సంద్రం బస్సుయాత్ర కలపర్రు టోల్గేట్ వద్దకు చేరుకోగానే ఏలూరు జిల్లాకు చెందిన నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్‌కు ఎదురొచ్చి గజమాలలు, డప్పులు బాణాసంచాతో జగన్‌కు ఘనస్వాగతం పలికారు. గజమాలలు ఏర్పాటుచేసి మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీశారు. పొద్దుపోయినా జాతీయ రహదారిపై జనం బారులు తీరారు. బస్సు పైకెక్కి వారందరికీ జగన్ అభివాదం చేస్తూ ఏలూరు క్రాస్ నుంచి భీమడోలు మీదుగా యాత్ర కదిలింది. కైకరం వద్ద రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడ్డ వారిపట్ల సీఎం తక్షణమే స్పందించి మానవత్వం చూపారు. ఒక పోలీస్ వాహనాన్ని (కాన్వాయ్ వాహనం కాదు) బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు వెనకనుంచి ఢీకొట్టారు. సీఎం బస్సును ఆపి, ప్రమాదాన్ని చూసిన తర్వాత బాధితులకు వెంటనే వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. సీఎం కాన్వాయ్‌లో ఉంచిన అంబులెన్స్ ద్వారానే క్షతగాత్రులను ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ముందుకు సాగిన సీఎం జగన్ చేబ్రోలు మీదుగా నారాయణపురం బస ప్రాంతానికి రాత్రి 9.55 నిమిషాలకు చేరుకున్నారు. యాత్ర మొత్తం జగన్‌ను చూసేందుకు వచ్చిన ప్రజలు మీకు తోడుగా మేమున్నామంటూ ఆశీర్వదించంతో 15వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర ముగిసింది. మొదటి ఓటు జగన్ మామకే.. ఫస్ట్‌టైమ్ ఓటు వేస్తున్నాను. నాకైతే చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే జగన్ వంటి మంచి వ్యక్తికి ఓటు వేయడమనేది చాలా గర్వంగా ఉంది. జగన్ మామకే ఓటు వేయాలనుకుంటున్నా. మంచి పథకాలిచ్చి జనానికి మంచి చేస్తున్నారు. అందుకోసమైనా గెలిపించుకోవడానికి ఆయనకే ఓటు వేస్తా. మంచిచేసే వ్యక్తిని కావాలని కోరుకుంటాంగానీ తప్పుడు పనులు చేసేవాళ్లకు వేయం కదా. ఇంతకుముందు పాలనలో పేదోడు అయితే బాగుపడింది లేదు. ఇప్పుడు జగన్ మామ వచ్చిన తర్వాత పేదోడు అనేవాడు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాడు. మంచి గెలవాలి అంటే మనమంతా కలిసి గెలిపించుకోవాలి.. చెడు రాజకీయం చేయకూడదు. ఇక్కడికి వచ్చిన వాళ్లలో విద్యార్థులే ఎక్కువ.. అన్నయ్య గెలుపు కూడా విద్యార్థులతోనే మొదలవుతుంది.– కమలాకర్, విద్యార్థి జగనే మళ్లీ సీఎంగా రావాలి.. జగనన్న స్థలం ఇచ్చాడు.. ఇళ్లు కట్టించాడు. మగ్గం డబ్బులు కూడా ఇచ్చి ఆదుకున్నాడు. నాకు మగ్గంతో ఇంట్లో ఇరుకుగా ఉండేది. ఇల్లు ఇరుకుగా ఉండటంతో మగ్గాన్ని షెడ్డులో తెచ్చిపెట్టుకున్నాం. ఇప్పుడు మాకు బాగుంది. కాబట్టి మళ్లీ జగనన్నే సీఎంగా రావాలని కోరుకుంటున్నాం. – బత్తూరి పద్మావతి, మంగళగిరి టీడీపీ హయాంలో నరకయాతన టీడీపీ ప్రభుత్వంలో చాలా యాతన పడ్డాం.. వాళ్లు వెయ్యి రూపాయల పెన్షన్‌ను కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. మా అమ్మ ఆఫీస్ చుట్టూ తిరగలేకపోయేది. మేం వెళ్తుంటే పెన్షన్ మాకు ఇచ్చేవారు కాదు. ఆవిడే రావాలి, ఆవిడే సంతకం పెట్టాలి అని టీడీపీ వాళ్లు చాలా ఇబ్బంది పెట్టారు. ఆవిడ నడవలేని, లేవలేని మనిషి.. వాళ్ల అమ్మాయికివ్వండి అని ఎంతమంది చెప్పినా ఇవ్వలేదు. జగనన్న మాకు స్థలం ఇచ్చాడు. ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు కూడా ఇచ్చాడు. మేం ఇల్లు కట్టుకున్నాం. పెన్షన్, రేషన్ ఇంటికే వస్తోంది. ఈరోజు ఈ ఇంట్లో ఉండి తినగలుగుతున్నామంటే అంతా జగనన్న చలవే. ఇంతవరకు మమ్మల్ని అలా ఆదరించిన వాళ్లు, అలా అనుగ్రహించి చూసిన వాళ్లు, సహాయం చేసినవాళ్లంటూ ఎవరూ లేరు. నా తోడబుట్టిన వాడిలా మాకు సహాయం చేశాడు. మళ్లీ మళ్లీ జగనే రావాలని మేం కోరుకుంటున్నాం. – కందుకూరి కల్పన, ప్రభుత్వ సంక్షేమ లబ్ధిదారు సూరీడు నిప్పులు చెరుగుతున్నా.. ఎర్రని సూరీడు చండ్ర నిప్పులు కురిపిస్తున్నా లెక్కచేయకుండా జగన్ బస్సుపైకి వచ్చి అందరికీ అభివాదం చేశారు. చినఅవుటపల్లి వద్దకు రాగానే అక్కడ మహిళలు జగన్‌కు ఎదురొచ్చారు. వారిని జననేత పలకరించి సమస్యలు తెలుసుకున్నారు. హైవే బైపాస్వల్ల జాతీయ రహదారితో కనెక్షన్ కోల్పోయిన చినవాడిపల్లికి న్యాయం చేయాలంటూ ఆ గ్రామస్తులు వినతిపత్రం అందించారు. ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లికి చెందిన క్యాన్సర్ బాధితురాలు లింగంపల్లి నేలవేణి సాయం చేయమని సీఎంను కోరారు. ఆమెకు భరోసా ఇచ్చి జగన్ ముందుకు కదిలారు. మరికొంత దూరం రాగానే పెదఅవుటపల్లి క్రాస్ వద్ద తనను చూసేందుకు పరుగుపరుగున వచ్చిన ప్రజలను చూసి జగన్ బస్సును ఆపించి వారితో మాట్లాడారు. సుభాషిణి అనే మహిళ తన అన్న బాలశౌరి ఆరోగ్యంపై వినతిపత్రం అందజేశారు. ఆత్కూరులో అభిమానులు జగన్‌కు వైఎస్సార్సీపీ జెండాలతో స్వాగతం పలికారు. అక్కడి మహిళల సమస్యలను జగన్ అడిగి తెలుసుకున్నారు. పొట్టిపాడు టోల్గేట్ దాటగానే మహిళలు హైవేపై బంతిపూలతో వైఎస్సార్సీపీ అని రాసి స్వాగతం పలికారు. తేలప్రోలు వద్ద అభిమానుల స్వాగతాన్నందుకుని జగన్ ముందుకొచ్చారు. కోడూరుపాడు వద్ద మహిళలు, రైతులను జగన్ పలకరించారు. వీరవల్లి హైస్కూల్ బాలికలు జగన్ మావయ్యకు ఆప్యాయంగా స్వాగతం పలికారు. వారితో జగన్ కాసేపు ముచ్చటించారు. -
మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 16వ రోజు షెడ్యూల్
సాక్షి, పశ్చిమగోదావరి: మేమంతా సిద్ధం 16వ రోజు మంగళవారం (ఏప్రిల్ 16) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం సోమవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9 గంటలకు నారాయణపురం రాత్రి బస నుంచి బయలుదేరుతారు. నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకొని ఉండి శివారులో భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బయలుదేరి భీమవరం బైపాస్ రోడ్ గ్రంధి వెంకటేశ్వర రావు జూనియర్ కాలేజ్ వద్ద సాయంత్రం 3.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. చదవండి: మేమంతా సిద్ధం 15వ రోజు: సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్ -
రౌడీఛీటర్ చింతమనేని
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘మీరు దళితులు, మీరు వెనుకబడిన వారు, మీరు షెడ్యూల్డ్ కాస్ట్ వారు... రాజకీయాలు మాకుంటాయి..మాకు పదవులు... మీకెందుకురా పిచ్చముండా కొడకల్లారా గొడవలు...’’ ఇదీ ఏలూరు జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలోని దళిత పేటలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళిత సామాజికవర్గంపై తీవ్ర అసభ్య పదజాలంతో చేసిన వ్యాఖ్యలు. ‘‘పవన్‌కళ్యాణ్.. వాడి వల్ల ఏం అవుతుంది. వాడి అన్న చిరంజీవి లాంటి వాడినే గెలిపించుకోలేనివాడు.. మమ్మల్ని ఏమి చేస్తాడు... మేము గతంలో 2014లో వాడి బొమ్మపై గెలిచామా..’’ అంటూ దురహంకారపూరిత వ్యాఖ్యలు. దెందులూరులోని ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ వద్ద జనసేన నేత పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలివి. దెందులూరు టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని నోటి దురుసుతో పాటు తీవ్ర వివాదాస్పద వైఖరితో ప్రతి ఒక్కరిపై దాడులు చేయడంలో సిద్ధహస్తుడు. జర్నలిస్టు మొదలుకొని మంత్రి వరకు అందరిపై దాడి చేసిన ఏకైక రికార్డు కలిగిన రాజకీయ నేత. 85కి పైగా కేసులు చింతమనేనిపై ఉన్నాయని గత డీజీపీ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. 40కి పైగా క్రిమినల్ కేసులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ విప్ హోదాలో ఉన్న చింతమనేనిపై ఏలూరు త్రీటౌన్‌లో రౌడీషిట్ తెరిచారు. అత్యంత వివాదాస్పద వ్యక్తిగా రాష్ట్రంలో గుర్తింపు ఉన్న చింతమనేని అన్ని వర్గాలను దూషించి, అందరితో ఘర్షణలకు దిగినా కనీసం క్షమాపణలు కూడా చెప్పని తలపొగరు రాజకీయం సాగిస్తున్నారు. 2004 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొల్లేరు అక్రమ చేపల సాగు, పోలవరం కుడికాల్వ, తమ్మిలేరు ఇసుకను ప్రధాన ఆదాయ వనరులుగా మార్చుకుని వందల కోట్ల సహజ సంపద బహిరంగంగా దోపిడీకి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి యతి్నంచిన పోలీస్, అటవీ శాఖ, రెవెన్యూ, మైనింగ్ శాఖ సిబ్బందిపై దాడులుకు దిగిన ఘటనలు కోకొల్లలున్నాయి. 10 ఏళ్ళ ఎమ్మెల్యే పదవి కాలంలో వందల కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపణలు ఉన్నాయి. పోలవరం గట్లు మాయం పోలవరం కుడికాల్వ గట్టు 20 కిలోమీటర్ల మేర ఐదేళ్లలో పూర్తిగా మాయం చేసిన ట్రాక్ చింతమనేనిది. పోలవరం నుంచి 180 కిలోమీటర్ల మేర కాల్వ నిర్మాణం ఉండగా దెందులూరు నియోజకవర్గం చల్లచింతలపూడి నుంచి పెదపాడు మండలం వరకు సుమారు 50 కిలోమీటర్ల మేర ఉంది. 240 అడుగుల వెడల్పుతో కాల్వను నిరి్మంచడానికి భూసేకరణ చేసి 240 అడుగుల వెడల్పు విస్తీర్ణంలో 80 అడుగుల మేర కాల్వ తగ్గి, కుడి, ఎడమ వైపు 80 అడుగుల మేర పోలవరం గట్లు ఏర్పాటు చేశారు. అలాగే 30 అడుగుల లోతుతో కాల్వను తవ్వారు. కాల్వను తత్విన మట్టితో పాటు కుడి, ఎడమ వైపు తత్విన గట్లపై ఉన్న గ్రావెల్‌నూ కొల్లగొట్టారు. దెందులూరు నియోజకవర్గంలోనే లక్ష క్యూబిక్ మీటర్ల మేర మట్టిని కొల్లగొట్టినట్టు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే అప్పటి విజిలెన్స్, ఇరిగేషన్ అధికారులు నిర్ధారించారు. 17 క్యూబిక్ మీటర్ల చొప్పున ఒక లారీ లోడు దింపి ప్రతిరోజూ 200 టిప్పర్లు, కొన్నేళ్ళపాటు నిరాటంకంగా నిర్వహించి మట్టి దోపిడీకి పాల్పడ్డారు. 85కుపైగా కేసులు అన్ని రకాల కేసులు 85కు పైగానే చింతమనేనిపై ఉన్నాయి. వీటిలో సగం కేసులు కోర్టుల్లో కొట్టి వేయగా, మరికొన్ని నడుస్తున్నాయి. 26 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. గతంలో ట్రాఫిక్ వి«ధులు నిర్వహిస్తున్న కొవ్వూరు ఏఎస్ఐ, సీపీఓలపై దాడిచేసిన కేసుతోపాటు తెలంగాణలోనూ కోడిపందేల కేసులు ప్రభాకర్‌పై నమోదు కావడం విశేషం. ప్రధానంగా తహసీల్దార్ వనజాక్షిపై దాడి కేసులో చింతమనేని, ఆయన గన్‌మెన్, మరో 58 మందిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఐపీసీ సెక్షన్ 353, 332, 379, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. 2011 నవంబర్ 26న దెందులూరులో జరిగిన రచ్చబండలో అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై చింతమనేని దాడి చేసిన ఘటనలో ఐపీసీ సెక్షన్ 506, 353, 332, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. భీమడోలు కోర్టులో రెండేళ్లు జైలుశిక్ష విధించారు. దీనిపై ప్రస్తుతం ఏలూరు జిల్లా కోర్టులో అప్పీల్ కేసు కొనసాగుతోంది. మాజీ మంత్రి వట్టి వసంత్‌పై దాడి 2011 నవంబర్ 26న దెందులూరు ఉన్నత పాఠశాలలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో అప్పటి రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న వట్టి వసంత్ కుమార్‌పై అప్పటి ఎమ్మెల్యేగా పదవిలో ఉన్న చింతమనేని ప్రభాకర్ దాడి చేశారు. వట్టి వసంత్‌కుమార్‌తో మాటామాటా పెరిగి చింతమనేని అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదై భీమడోలు జూనియర్ సివిల్ కోర్టులో మూడు సెక్షన్ల కింద అభియోగాలు నిర్ధారణ కావడంతో జడ్జి కె.దీపదైవకృప రెండేళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై చింతమనేని అప్పీల్‌కు వెళ్లారు. తమ్మిలేరును మింగేశారు తెలంగాణ రాష్ట్రం నుంచి ఏజెన్సీ ప్రాంతం మీదుగా ఏలూరు నగరం నుంచి కొల్లేరు వరకు విస్తరించి ఉన్న తమ్మిలేరు ప్రధాన కాల్వను చింతమనేని అండ్ ముఠా మింగేసింది. దెందులూరు నియోజకవర్గంలో తమ్మిలేరు ఎక్కువగా ఉండటం, తమ్మిలేరు పరీవాహక ప్రాంతంలో నాణ్యత ఉన్న ఇసుక ఉండటంతో దెందులూరు, నూజివీడు నియోజకవర్గాల్లోని తమ్మిలేరు పరీవాహక ప్రాంతాలంతా గట్టిగా కొల్లగొట్టారు. ప్రధానంగా పెదవేగి మండలంలో విజయరాయి నుండి ప్రారంభమై నడిపల్లి, బలివే, సూర్యారావుపేట, తమ్మిలేరు, చింతలపూడి నియోజకవర్గం వలసపల్లి వద్ద తమ్మిలేరు 24 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఒక రాత్రికి 200 లారీలు చొప్పున దాదాపు 4 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను దోచేశారు. దోపిడీ ప్రస్థానాన్ని దెందులూరుతో పాటు పక్క నియోజకవర్గమైన నూజివీడులో కూడా చొరబడి ముసునూరు మండలంలో ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే 2015 జూన్‌లో ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కేంద్ర బిందువయ్యారు. తహసీల్దార్ వనజాక్షి జుట్టు పట్టుకుని దాడి 2015 జూలై 11న ముసునూరులో చింతమనేని అనుచరులు అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తుండటంతో అప్పటి ముసునూరు తహసీల్దార్ వనజాక్షి ఇసుక ట్రాక్టర్లకు అడ్డుపడి గట్టిగా నిలువరించారు. దీంతో సమాచారం తెలుసుకున్న చింతమనేని హుటాహుటిన అక్కడకు చేరి మహిళా అధికారి, మండల మేజిస్ట్రేట్ అని కూడా చూడకుండా జుట్టుపట్టి ఈడ్చి పక్కకు పడేసి దాడి చేయడంతో పాటు నానా దుర్భాషలాడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. కేసు నమోదైన వెంటనే బెయిల్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాగ్రహం వెల్లువెత్తడం, రెవెన్యూ తిరుగుబాటుతో చంద్రబాబు దిగి వచ్చి వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేశారు. చింతమనేనిపై 2015లో ఏలూరు త్రిటౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ తెరిచారు. అలాగే ఆటపాక పక్షుల కేంద్రం వద్ద అటవీ శాఖాధికారిపై దాడి, ఐసీడీఎస్‌లో పనిచేసే మహిళా అధికారులపై బెదిరింపులకు దిగడం, 2016 ఫిబ్రవరి 10న కానిస్టేబుల్ మధుపై దాడి ఘటనలకు చింతమనేని పాల్పడ్డారు. కొల్లేరులో చేపలు మాయం కొల్లేరులో చేపలను మాయం చేసిన ఘనత చింతమనేనిది. అటవీ శాఖ అధికారులను బెదిరించి మరీ కొల్లేరులో ఆక్రమణలకు దిగి చెరువులను స్థానిక టీడీపీ నేతలతో సాగు చేయించారు. అడ్డుకోవడానికి వెళ్లిన రెవెన్యూ, అటవీశాఖ అధికారులకు.. కొన్ని సమయాల్లో చెక్‌పోస్టుల వద్ద పోలీసులపై తన నోటికి, చేతికి పని చెప్పడంతో కేసులు నమోదైన ఘటనలు అనేకం. మొత్తం 1,860 ఎకరాల్లో చేపల చెరువులు పూర్తిగా చింతమనేని కనుసన్నల్లోనే సాగైనట్టు అంచనా. ఒక్క కొల్లేరులోనే సగటున రూ.వంద కోట్లకుపైగా దోచినట్లు సమాచారం. పెదవేగి మండలం పెదవేగి (సూర్యారావుపేట) లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేయకుండా దాదాపు 70 ఎకరాల్లో గ్రావెల్ దోచేశారు. పెదపాడు మండలం ఏపూరు, కలపర్రు గ్రామాల్లో మట్టిని కొల్లగొట్టారు. -
కూటమిలో కత్తులు
సాక్షి నెట్వర్క్ : ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేసుకుంటామని ఇన్నాళ్లూ చెబుతూ వచి్చన టీడీపీ, జనసేన మధ్య ఇప్పుడు విభేదాలు రచ్చకెక్కాయి. ఇక్కడ జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజును మార్చాలని టీడీపీ ఇన్చార్జి బొరగం శ్రీనివాస్ వర్గీయులు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయమై రెండురోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో బస చేసిన చంద్రబాబు క్యాంప్ వద్దకు వెళ్లి మరీ బొరగం వర్గీయులు ధర్నా చేశారు. పేరుకే రిజర్వుడు నియోజకవర్గమైనా ఇక్కడ పెత్తనమంతా బాబు, పవన్ సామాజికవర్గాలదే. దీంతో బాబు వర్గం బొరగం వర్గీయుల్లో అసమ్మతిని రాజేసింది. ప్రతిపనికీ పవన్ సామాజిక వర్గం వద్దకు వెళ్లి అడగలేమని, ఇక్కడ అభ్యర్థిని మార్చి టీడీపీకి ఇవ్వాలని బాబు సామాజికవర్గం డిమాండ్ చేస్తోంది. ముందు సీటు ఎవరికి ఇచ్చినా ఓకే అన్న బొరగం భీమవరంలో అంజిబాబు తరహాలో తనను జనసేనలో చేర్చుకుని టికెట్ ఇస్తారని ఆశించారు. అయితే అనూహ్యంగా జనసేన నేతకు ఇవ్వడంతో బొరగంతోపాటు బాబు సామాజికవర్గ నేతలు కంగుతిన్నారు. ► ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పుణ్యమా అని పలువురు సీనియర్ నాయకులు రాజకీయ నైరాశ్యంలో మునిగిపోయారు. టికెట్ ఆశ చూపి చివరకు రూ.కోట్లకు పడగలెత్తిన అభ్యర్థులకు పెద్దపీట వేయడంతో దశాబ్దాల తరబడి పార్టీ కోసం రెక్కలుముక్కలు చేసుకున్న నేతలు లబోదిబోమంటున్నారు. కళ్యాణదుర్గంలో ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వరనాయుడికి బాబు మొండిచేయి చూపారు.ఉమామహేశ్వరనాయుడు వైఎస్సార్ సీపీలో చేరారు. హనుమంతరాయచౌదరి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గుంతకల్లులో గుమ్మనూరు జయరాంకు టికెట్ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ కోలుకోలేని దెబ్బతిన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ నేత ప్రభాకర్ చౌదరికి రాజకీయ సన్యాసం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రెండుసార్లు ఎంపీగా చేసిన బీసీ నేత నిమ్మల కిష్టప్పనూ బాబు నట్టేటముంచారు. ► అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిని మార్చకుంటే ఘోర పరాజయం తప్పదని మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం మాజీ సీఎం, రాజంపేట పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి తేల్చి చెప్పింది. ఆదివారం కలికిరిలోని పార్టీ కార్యాలయంలో శంకర్ వర్గీయులు కిరణ్‌తో సమావేశమయ్యారు. శంకర్‌కి టికెట్ ఇవ్వకుంటే సహకరించబోమని స్పష్టం చేశారు. ► తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రెండురోజుల క్రితం పశి్చమగోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం చైర్మన్, సినీ నిర్మాత బన్నీ వాసుకు ఘోర అవమానం జరిగింది. వేదిక ఎక్కుతున్న సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. జనసేన ఇన్చార్జి అని చెప్పినా వినిపించుకోలేదు. అక్కడే ఉన్న టీడీపీ నాయకులూ దీనిని పట్టించుకోలేదు. అవమానంగా భావించిన బన్నీ వాసు అక్కడి నుంచి ని్రష్కమించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బన్నీ వాసుకు ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు (మాజీ మంత్రి పితాని సత్యనారాయణ బావమరిది)ని రాజీకి పంపారు. ఆయన వాసు దగ్గరకు వెళ్లి బుజ్జగించి చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. వాసుకు జరిగిన అవమానంపై జనసైనికులు మండిపడుతున్నారు. ► ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అశోక్‌రెడ్డికి సీటు కేటాయించడంపై జనసేన నేత ఆమంచి స్వాములు కారాలుమిరియాలు నూరుతున్నారు. తాను ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. గిద్దలూరు జనసేన ఇన్చార్జ్ బెల్లంకొండ సాయిబాబుతోనూ ఆయనకు పొసగడం లేదు. కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న స్వాములు వెంటే ఆ సామాజికవర్గం ఉండడంతో టీడీపీ అభ్యర్థి అశోక్‌రెడ్డి ఆందోళన చేస్తున్నారు. ► కర్నూలు జిల్లా ఆదోనిలో కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ పార్థసారథికి సహకరించేది లేదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ప్రకా‹Ùజైన్ తేలి్చచెప్పారు. కూటమిలో ఆ ఆరు ఓసీలకే.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సామాజిక న్యాయానికి పాతరేసింది. విజయవాడ తూర్పు, సెంట్రల్, వెస్ట్, మైలవరం, పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓసీలకే సీట్లు కేటాయించింది. ఈ ఆరు నియోజకవర్గాల్లో ఐదు టీడీపీ అధినేత సొంత సామాజికవర్గానికే కేటాయించారు. ఒకటి పవన్ కళ్యాణ్ సామాజికవర్గానికి ఇచ్చారు. దీంతో బలహీనవర్గాల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. వాస్తవానికి విజయవాడ పశి్చమ నియోజకవర్గంలో మైనార్టీలు ఎక్కువ. చంద్రబాబు తొలుత మైనార్టీలకు సీటు ఇస్తామని చెప్పి, పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు. ఆ పార్టీ తన సామాజికవర్గానికి చెందిన సుజనా చౌదరికే టిక్కెట్టు ఇచ్చేలా చక్రం తిప్పారు. ఈ సీటు తొలుత జనసేనకు కేటాయించారు. ఇక్కడ పదేళ్లుగా బీసీ అయిన పోతిన మహేష్ డబ్బులు ఖర్చుపెట్టి పార్టీ జెండా మోశారు. తీరా చివరకు బీజేపీకి సీటు ఇవ్వడంతో పోతిన నైరాశ్యంలో కూరుకుపోయారు. సామాజిక న్యాయం పాటించిన వైఎస్సార్ సీపీ సామాజిక న్యాయం అంటే ఏమిటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టికెట్ల కేటాయింపులో చేసి చూపారు. విజయవాడ తూర్పులో దేవినేని అవినాష్ (కమ్మ), సెంట్రల్లో వెలంపల్లి శ్రీనివాస్ (వైశ్య), విజయవాడ వెస్ట్‌లో షేక్ ఆసిఫ్ (ముస్లిం మైనార్టీ), పెనమలూరులో జోగి రమేష్ (గౌడ–బీసీ), మైలవరంలో సర్నాల తిరుపతిరావు (యాదవ బీసీ), గన్నవరంలో వల్లభనేని వంశీ (కమ్మ)కి టికెట్లు ఇచ్చారు. దీంతో క్షేత్రస్థాయిలో వైఎస్ జగన్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. పిఠాపురంలో జనసేనానికి అసమ్మతిసెగ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీలో అసమ్మతి సెగ రేగింది. స్థానికేతరులు పిఠాపురంలో పెత్తనం చెలాయిస్తున్నారంటూ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆ పార్టీ గొల్లప్రోలు మండల నేత అరవ వెంకటాద్రి నాయుడు (భారతీయుడు) ఆదివారం లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ఇక్కడి నుంచి పోటీకి దిగిన జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా స్థానికేతరుడే కావడంతో లేఖ పార్టీలో కలకలం రేపింది. -
టీడీపీ అభ్యర్థి పార్థసారథికి పెద్దవ్వ ఝలక్
నూజివీడు: ‘మీరు ఇచ్చే హామీలు నెరవేరుస్తామని హామీపత్రం రాసివ్వండి. లేకపోతే మీకు ఓటు వేయం...’ అంటూ ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథిని ఓ వృద్ధురాలు నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కె.పార్థసారథి శనివారం నూజివీడులోని 10వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా... స్థానికులు తమ గృహాలు చెరువు పోరంబోకు స్థలంలో ఉన్నాయని, వాటికి పట్టాలు ఇప్పించాలని కోరారు. దీనిపై పార్థసారథి మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే నివేశన స్థలాలకు పట్టాలు ఇప్పిస్తామని, లేనిపక్షంలో పొజిషన్ సర్టిఫికెట్లు అయినా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంతలో స్థానికంగా నివాసం ఉంటున్న తులసమ్మ అనే వృద్ధురాలు జోక్యం చేసుకుని ‘నోటి మాట చెబితే కుదరదు. రాతపూర్వకంగా హామీపత్రం రాసివ్వాలి. లేకపోతే ఓట్లు వేయం’ అని చెప్పారు. దీంతో తులసమ్మతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఈలోపు కొందరు స్థానికులు జోక్యం చేసుకోవడంతో వాళ్లంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
YSRCP ఏలూరు అభ్యర్థులు వీళ్లే
ఏలూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
టీడీపీకీ ముద్రబోయిన వెంకటేశ్వరరావు గుడ్ బై
సాక్షి, ఏలూరు జిల్లా: టీడీపీకీ ముద్రబోయిన వెంకటేశ్వరరావు గుడ్ బై చెప్పారు. నూజివీడు టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ పోస్టర్లను ముద్రబోయిన పీకిపడేశారు. టీడీపీ తనను దారుణంగా మోసం చేసిందని, చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. ఏది చెబుతాడో అది చేయని వ్యక్తి చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డా. చచ్చిపోయిన పార్టీని నూజివీడులో బతికించా. పార్టీ ఏ పిలుపునిచ్చినా పనిచేశా. కరోనా సమయంలో రాష్ట్ర టీడీపీ కార్యాలయం మూతపడినా.. నూజివీడు టీడీపీ కార్యాలయం మూతపడలేదు. పార్టీ కష్ట కాలంలో నన్ను పిలిచి నూజివీడులో పోటీచేయమని యనమల అడిగారు. నా ఇంటికి మనిషిని పంపించి మరీ నూజివీడు సీటిచ్చారు. ఈ రోజు నన్ను నూజివీడు టీడీపీ ఇంఛార్జిగా నన్ను ఎందుకు తీసేశారో చెప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదు’’ అని ముద్రబోయిన ధ్వజమెత్తారు. నేను ఏం తప్పుచేశానో చెప్పమంటే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, యనమల సమాధానం చెప్పలేకపోయారు. నాలుగైదు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ముద్రబోయిన వెంకటేశ్వరరావు వెల్లడించారు. -
‘ప్రతిపక్షాలు సూట్ కేసులు సర్దుకుంటున్నాయి’
ఏలూరు: దెందులూరులో శనివారం జరిగిన వైఎస్సార్సీపీ ‘సిద్ధం సభ’కు గోదావరి, కృష్ణ నదులు ఉప్పొంగినట్టుగా ప్రజలు తరలివచ్చారని వైఎస్సార్సీసీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. తామంతా జగనన్నను సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాన్ని రాష్ట్రవ్యాప్తంగా పంపించిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. పాత్రికేయులకు జరిగిన చిన్న అసౌకర్యానికి మన్నించాలని కోరుతున్నామన్నారు. దెందులూరులో జరిగిన ‘సిద్ధం సభ’ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చినీయాంశంగా మారిందని తెలిపారు. భీమిలి సభ ట్రైలర్ అయితే నిన్న(శనివారం) దెందులూరు సభతో ప్రతిపక్షాలు సూట్ కేసులు సర్దుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. జగనన్న ప్రభుత్వం వచ్చాక ఏ కుటుంబానికి అయితే లబ్ధి చేకూరిందో వారే తమ స్టార్ క్యాంపెనర్లలని సీఎం జగన్ సూచించారని అన్నారు. వై నాట్ 175 అనేది.. నిన్నటి సభతో ప్రతిపక్షాలకు అర్థమై ఉంటుందని అన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామనే నినాదం సభలో ప్రజల నోట వినబడిందని తెలిపారు. ఈ 60 రోజులు ప్రతి కార్యకర్త కష్టపడదామని సీఎం జగనన్నను మళ్లీ సీఎం చేసుకుందామని అనేక కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని అన్నారు. ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు నేతలు సూట్ కేసులు సర్దుకుని హైదరాబాద్ వెళతాయని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇప్పటికే హైదరాబాదులో ఉంటున్నారని మండిపడ్డారు. కుప్పం టూ ఇచ్చాపురం మా అభ్యర్థులు ఎవరో చెప్పాం.. మా ఎజెండా ఏంటి.. మా జెండా ఏంటి.. అనేది స్పష్టం చేశామని పేర్కొన్నారు. అభ్యర్థులు కరువై.. ప్రతిపక్షాలు పొత్తులకు వెళుతున్నాయని ఎద్దేవా చేశారు. -
Updates: నాకున్న సైన్యం, బలం.. దేవుడు, ప్రజలే: సీఎం జగన్
UPDATES: 05:47 PM, Feb 3, 2024 దెందులూరు వైఎస్సార్సీపీ సిద్ధం సభ.. సీఎం జగన్ తన ప్రసంగం అనంతరం వేదిక దిగుతుండగా సెల్ఫీల కోసం ఎగబడిన అభిమానులు, ప్రజాప్రతినిధులు వారితో ఓపిగ్గా సెల్పీలు దిగిన సీఎం జగన్ 05:14 PM, Feb 3, 2024 ముగిసిన సిద్ధం బహిరంగ సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్సీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు 04:14 PM, Feb 3, 2024 సిద్ధమా అంటూ ప్రసంగం ప్రారంభించిన సీఎం జగన్ ►మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా: సీఎం జగన్ ►ఇంటింటి భవిష్యత్తును మరింత మార్చేందుకు మీరు సిద్ధమా ►దుష్టచతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధమా ►పేదల భవిష్యత్‌ను కాటేసే ఎల్లో వైరస్‌పై యుద్ధానికి మీరు సిద్ధమా ►రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారు ►ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరిగానే కనిపిస్తాడు ►కానీ నిజం ఏంటంటే..కోట్ల మంది హృదయాల్లో జగన్ ఉన్నాడు ►జగన్ ఒంటరివాడు కాదన్నది ఇక్కడ కనిపిస్తున్న జనమే నిజం ►కోట్లాది మంది గుండెల్లో జగన్ ఉండటమే నిజం ►నాకున్న సైన్యం, బలం.. దేవుడు, ప్రజలే: సీఎం జగన్ ►జగన్ ఎప్పటికీ ఒంటరివాడు కాదు ►నా తోడు, నా ధైర్యం, నా బలం పైనున్న ఆ దేవుడు, మీరే ►నాకున్న నమ్మకం మీరే ►వచ్చే ఎన్నికల రణక్షేత్రంలో మీరంతా కృష్ణుడైతే నేను అర్జునుడిని ►దుష్టచతుష్టయం దాడి అంతా అభివృద్ది, సంక్షేమం మీదనే ►రాబోయే తరం విద్యావిధానాల మీద దుష్టచతుష్టయం దాడి చేస్తోంది ►రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై టీడీపీ దండయాత్ర చేస్తోంది ►మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం మనది ►పేదవాడి భవిష్యత్తు, సంక్షేమం మీద వారంతా దాడి చేస్తున్నారు ►గ్రామగ్రామాల్లో మనం తెచ్చిన మార్పు స్పష్టం కనిపిస్తోంది. ►అవినీతి, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించాం ►అందించిన సంక్షేమ పాలనకు ప్రతీ పేద కుటుంబమే సాక్ష్యం ►175కు 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యం ►నా మాటలన్నీ ప్రతీ ఇంటికి వెళ్లి పంచుకోవాలని కోరుతున్నా ►చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు తేడాను గమనించండి ►పేద కుటుంబాలకు చంద్రబాబు ఏం చేశాడో అడగండి ►చంద్రబాబు హయాంలో ఇచ్చిన స్కీములు ఏమున్నాయో అడగండి ►కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ ఏ గ్రామానైన్నా తీసుకోండి ►గతంలో లేనిది ఇప్పుడు గ్రామాల్లో వచ్చిన మార్పును గమనించండి ►సచివాలయ వ్యవస్థతో గ్రామాల్లో వచ్చిన మార్పులు గమనించండి ►ఈ వ్యవస్థను ఎవరు తీసుకొచ్చారంటే జగన్ అని చెప్పండి ►ఒకటో తేదీ ఉదయాన్నే అవ్వాతాతలకు పింఛన్ అందిస్తున్నాం ►అసైన్డ్ భూములకు శాశ్వత భూహక్కు ఇచ్చాం ►డీబీటీ ద్వారా 2 లక్షల 55 కోట్లు పేదలకే అందించా ►కేబినెట్లో 68 శాతం పదవులు ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీలకే ఇచ్చాం ►4 డిప్యూటీ సీఎం పదవులు, స్పీకర్‌తో సహా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం అమలు చేశాం ►అక్క చెల్లెమ్మలకు ఆర్థిక స్వావలంబన అందించాం ►31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ►మీ బిడ్డ జగన్ పాలనలోనే ఇళ్ల పట్టాలు వచ్చాయని చెప్పేందుకు గర్వపడుతున్నా ►దిశ యాప్‌తో అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాం ►రాష్ట్రంలో కొత్తగా 15 మెడికల్ కాలేజీలు కడుతున్నాం ►కొత్తగా 4 పోర్టులు, 10 షిప్పింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం ►మహానేత వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తూ పాలన అందిస్తున్నాం ►అబద్దాల పునాదులపై ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాయి ►వచ్చే ఎన్నికలు.. పేదల భవిష్యత్‌ను నిర్ణయించేవి ►ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ జగనే ►3వేల పెన్షన్ అందాలన్నా.. భవిష్యత్‌లో పెరగాలన్నా.. మీ జగనే రావాలి ►ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికీ చెప్పాలి ►చెప్పిన ప్రతీది చేసిన ప్రభుత్వం మనది ►ప్రజలు నా స్టార్ క్యాంపెయినర్లు ►జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యమని చెప్పాలి ►పేదల సొంతింటి కల నెరవేరాలంటే జగనన్నే కావాలని చెప్పండి ►రైతు భరోసా కొనసాగాలన్నా జగనన్నే మళ్లీ రావాలని చెప్పండి ►పేదలకు అండగా నిలిచేందుకు 57 నెలల్లో 124 సార్లు బటన్ నొక్కాం.. ►రూ.2 లక్షల 55వేల కోట్లు పేదల ఖాతాల్లో నేరుగా జమ చేశాం ►మీరు నా కోసం ఒక్కసారి బటన్ నొక్కండి ►ఒకటి అసెంబ్లీ,ఒకటి పార్లమెంట్‌కు ఫ్యాన్ మీద నొక్కితే చంద్రముఖి బెడద మీకు శాశ్వతంగా ఉండదు ►ప్యాకేజీ కోసం రా.. కదలిరా అంటూ బాబు.. దత్తపుత్రుడిని పిలుస్తున్నాడు ►చంద్రబాబు అండ్ కో.. నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ ►175 స్థానాల్లో పోటీ చేసేందుకు చంద్రబాబుకు అభ్యర్థులే లేరు ►చంద్రబాబు అండ్‌కోపై యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా ►చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మకు ఏపీతో ఏం సంబంధం ►దిగజారుడు పార్టీలన్నీ పేదవాడి భవిషత్తునే టార్గెట్ చేసుకుంటున్నాయి ►ప్రజల రక్షణ కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ 04:10 PM, Feb 3, 2024 దెందులూరులో భారీ జనసందోహానికి సీఎం జగన్ అభివాదం సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికిన వైఎస్సార్సీపీ శ్రేణులు దెందులూరులో జగనన్న ప్రభంజనం కనిపిస్తోంది: అబ్బయ్య చౌదరి ఎటుచూసిన వైఎస్సార్సీపీ జెండాలే రెపరెపలాడుతున్నాయి. విశ్వసనీయతకు మారు పేరు సీఎం జగన్ సీఎం జగన్ రంగంలోకి దిగితే వార్ వన్‌సైడే పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధానికి మేం సిద్ధం 03:56 PM, Feb 3, 2024 సిద్ధం సభావేదికపై వైఎస్సార్‌కు సీఎం జగన్ నివాళి సిద్ధం సభావేదికపై వైఎస్సార్‌కు నివాళి అర్పించిన సీఎం జగన్, వైఎస్సార్సీపీ నేతలు భారీ వాక్ వేపై పార్టీ శ్రేణులకు అభివాదం చేసిన సీఎం జగన్ 50 నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు 03:41 PM, Feb 3, 2024 సిద్ధం వేదికపైకి సీఎం జగన్ ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్సార్సీపీ సిద్ధం సభ సిద్ధం సభా వేదికపైకి చేరుకున్న సీఎం జగన్ ‘సిద్ధం’ పాటతో మారుమోగుతున్న దెందులూరు సభా ప్రాంగణం కాసేపట్లో పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్ 03:29 PM, Feb 3, 2024 దెందులూరు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ హెలికాఫ్టర్‌లో దెందులూరు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ దెందులూరులో వైఎస్సార్సీపీ సిద్ధం సభ వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం సభలో పాల్గొననున్న సీఎం జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్ 03:22 PM, Feb 3, 2024 సిద్ధం సభ ప్రతిపక్షాల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది: మంత్రి వేణు అంబేద్కర్ చెప్పిన సామాజిక న్యాయాన్ని జగన్ చేతల్లో చూపించారు సీఎం జగన్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమైంది చంద్రబాబు ఎల్లో మీడియాతో కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు కుట్రలు చేయడమే చంద్రబాబు పని 03:15 PM, Feb 3, 2024 సీఎం జగన్ పేదల పక్షపాతి: ఆళ్ల నాని ప్రతిపక్షాలు సీఎం జగన్‌ను ఎదుర్కొలేక కుట్రలు చేస్తున్నాయి ప్రతీ ఇంటికీ సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు సీఎం జగన్ పాదయాత్రలో పేదల కష్టాలు తెలుసుకొని జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారు. పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది 03:00 PM, Feb 3, 2024 తాడేపల్లి నుంచి దెందులూరు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ కాసేపట్లో ఏలూరు సిద్దం సభకు హాజరు జగన్‌ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధం: కొట్టు సత్యనారాయణ మా ప్రజాబలం చూసి చంద్రబాబుకు మతిభ్రమించింది. సీఎం జగన్ వెంటే ప్రజలు ఉన్నారు. 175కు 175 సీట్లు గెలవడమే మా టార్గెట్ జగన్‌కు ఉన్న స్టార్ క్యాంపెయినర్లను చూశారా? వైస్సార్సీపీకి సామాన్య ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు పచ్చ బ్యాచ్‌కు మాత్రం దండిగా స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబుకి సపోర్ట్‌గా దత్తపుత్రుడు పవన్, వదిన.. బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో ఉన్న బాబు అభిమాన సంఘం పొరుగు రాష్ట్రాల్లో ఉంటూ ప్రభుత్వంపై విద్వేషం గుప్పించే యెల్లో మీడియా కానీ, సీఎం జగన్‌కు నో స్టార్ క్యాంపెయినర్లు వైఎస్సార్సీపీకి సామాన్యులే క్యాంపెయినర్లు అందుకు ప్రత్యక్ష తార్కాణం.. ఏలూరు దెందలూరు సిద్ధం సభకు పోటెత్తిన జన ప్రభంజనం Star Campaigners of YSRCP…🔥 సామాన్య ప్రజలే మన పార్టీ స్టార్ క్యాంపైనర్లు…#YSJaganAgain #Siddham#YSRCPStarCampaigners pic.twitter.com/kg1Nv4I2Tq — YSR Congress Party (@YSRCParty) February 3, 2024 జనజాతరను తలపిస్తున్న@YSRCParty దెందులూరు సిద్ధం సభ🔥#Siddham#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/Hg07fTSKQk — YSR Congress Party (@YSRCParty) February 3, 2024 02:30 PM, Feb 3, 2024 తూర్పుగోదావరి జిల్లా ఏలూరు సిద్ధం సభకు భారీగా తరలి వెళుతున్న వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు... రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బస్సులు, కార్లలో తరలింపు. అభ్యర్థులను ప్రకటించి సిద్ధంగా ఉన్నాం: రాజమండ్రి ఎంపీ భారత్. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ప్రజలంతా మేము సిద్ధంగా ఉన్నామని సభకు వస్తున్నారు. మేము సిద్ధం అంటే .. సంసిద్ధం అంటూ ప్రతిపక్షాలు అనడం సిగ్గుచేటు. ఒక పార్టీ ఇచ్చిన నినాదాన్ని మరొక పార్టీ కూడా ఫాలో అయ్యే పరిస్థితికి ప్రతిపక్షాలు దిగజారిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు పెద్దపీఠం వేసి మేము ఎన్నికలకు సిద్ధ పడుతున్నాం. మేము 175 నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించి మేము సిద్ధం అంటున్నాం. మీరు పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత సంసిద్ధం అని చెప్పండి.. ఊరికనే కాదు. 01:50 PM, Feb 3, 2024 కృష్ణాజిల్లా : దెందులూరులో జరిగే సిద్ధం సభకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో. గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాల నుండి 100 బస్సుల్లో బయల్దేరిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు. సిద్ధం సభకు బస్సు డ్రైవర్‌గా మారిన మాజీ మంత్రి పేర్ని నాని. కార్యకర్తలతో వెళ్తున్న బస్సును స్వయంగా నడిపిన పేర్ని నాని. 01:30 PM, Feb 3, 2024 ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో సిద్ధం సభకు భారీగా బయలుదేరిన వాహన శ్రేణులు జాతీయ రహదారిపై జెండా ఊపి బస్సులను ప్రారంభించి వారితో సభకు కలిసి వెళ్లిన ఉదయభాను. దెందురూరులో,సీఎం జగన్ సిద్ధం సభకు మైలవరం నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి వెళ్ళిన వైఎస్సార్సీపీ శ్రేణులు. దెందురూరులో సిద్ధం సభకు మైలవరం నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి వెళ్ళిన వైఎస్సార్సీపీ శ్రేణులు.. 12:50 PM, Feb 3, 2024 తూర్పుగోదావరి జిల్లా: రాజానగరం నియోజకవర్గ నుండి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో 92 బస్సుల్లో వేలాదిగా సిద్ధం సభకు తరలిన అభిమానులు, కార్యకర్తలు కృష్ణా జిల్లా: పెనమలూరు,కంకిపాడు, ఉయ్యూరు నుండి దెందులూరు సిద్ధం బహిరంగ సభకు భారీగా తరలివెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు. దెందులూరు లో సీఎం జగన్ ‘సిద్ధం’ సభకు పెడన నియోజకవర్గం ఇన్చార్జి ఉప్పాల రాము ఆధ్వర్యంలో వేలాదిగా తరలి వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులు 12:26PM, Feb 03, 2024 సిద్ధం సభకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి తరలివెళ్లిన కార్యకర్తలు కార్యకర్తలతో కలిసి బయల్దేరిన ఎమ్మెల్యే, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా బస్సుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన వెలంపల్లి శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి 12:20PM, Feb 03, 2024 వైఎస్ జగన్‌ను మరోసారి సీఎం చేసేందుకు మేమంతా సిద్ధం: మంత్రి చెల్లుబోయిన మరో ఐదేళ్లపాటు ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం దెందులూరు సిద్ధం సభను విజయవంతం చేస్తాం సేవే లక్ష్యంగా పని చేస్తున్న సీఎం జగన్ కోసం మేమంతా సిద్ధం నాయకుడి లక్ష్యం నెరవేర్చడమే పార్టీ కేడర్ ఉద్దేశం సిద్ధం సభ.. దేశ రాజకీయాల్లో సేవే లక్ష్యమని చాటి చెప్పడం సేవకి సైన్యం సిద్ధమైంది 12:15PM, Feb 03, 2024 గుడివాడ నుండి సిద్ధం సభకు వేలాదిగా వైఎస్సార్సీపీ శ్రేణులు దెందులూరులో సీఎం జగన్ సిద్ధం సభకు ఎమ్మెల్యే కొడాలి నాని నేతృత్వంలో గుడివాడ నుండి వేలాదిగా తరలి వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులు గుడివాడ VKR VNB ఇంజనీరింగ్ కళాశాల వద్ద పార్టీ శ్రేణుల బస్సు ర్యాలీని పార్టీ జెండా ఊపి ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్. 12:00 PM, Feb 3, 2024 కృష్ణా జిల్లా: మచిలీపట్నం నుంచి సిద్ధం సభకు బస్సుల్లో కదలిన వైఎస్సార్సీపీ శ్రేణులు కార్యకర్తలతో కలిసి బయల్దేరిన బస్సులో దెందులూరు బయల్దేరిన కృష్ణాజిల్లా వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు. నేడు ఏలూరు జిల్లా దెందులూరులో వైయస్ఆర్సీపీ రెండో ఎన్నికల సన్నాహక సభ సిద్ధం బహిరంగ సభకు 50 నియోకవర్గాల నుంచి తరలిరానున్న కేడర్ 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం @ysjagan#Siddham#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/k9WIu7L5D8 — YSR Congress Party (@YSRCParty) February 3, 2024 11:30 AM, Feb 3, 2024 వైఎస్సార్సీపీ ఎన్నికల సన్నాహక సమావేశానికి తూర్పుగోదావరి జిల్లా నుంచిమంత్రి వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో దెందులూరు బయలుదేరిన అభిమానులు కార్యకర్తలు. దెందులూరు సిద్ధం సభకు రాజమండ్రి నుంచి భారీగా బయలుదేరిన అభిమానులు కార్యకర్తలు. ఎంపీ భరత్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బస్సులు, కార్లలో తరలి వెళ్తున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు సీఎం జగన్ సభను విజయవంతం చేసేందుకు ఉత్సాహంతో బయలుదేరిన అభిమానులు 11:23AM, Feb 03, 2024 ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నుండి సిద్ధం సభకు దెందులూరుకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు జెండా ఊపి బస్సులను ప్రారంభించిన నియోజకవర్గ ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాస్ 11:20AM, Feb 03, 2024 ఏలూరు జిల్లా: కైకలూరు నుండి సిద్ధం సభకు దెందులూరుకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు జెండా ఊపి బస్సుల ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు 11:10 AM, Feb 3, 2024 ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నుంచి సిద్ధం సభకు దెందులూరుకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు, జెండా ఊపి బస్సులను ప్రారంభించిన నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఏలూరు జిల్లా: కైకలూరు నుంచి సిద్ధం సభకు దెందులూరుకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు, జెండా ఊపి బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు. సాక్షి, ఏలూరు: జన జాతరకు.. జన గోదావరి సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్సీపీ శ్రేణులకు ‘సిద్ధం’ సభా వేదికగా శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో 19, ఉమ్మడి పశ్చిమగోదావరిలో 15, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు మొత్తం 50 నియోజకవర్గాల నుంచి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీలు, ముఖ్యనేతలతో పాటు పార్టీ కార్యకర్తలు, పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు, ప్రజలు లక్షలాది మంది సభకు తరలిరానున్నారు. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా గత శనివారం విశాఖపట్నం జిల్లా భీమిలి వేదికగా ఎన్నికల సమరానికి శంఖం పూరించారు. ఆ సభ సూపర్‌హిట్ అయిన నేపథ్యంలో శనివారం ఏలూరులో ‘సిద్ధం’ రెండో సభ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం లక్షలాదిగా తరలివచ్చే పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తారు ఏలూరు ఆటోనగర్–దెందులూరు సమీపంలోని సహారా గ్రౌండ్స్‌లో 110 ఎకరాల ప్రాంగణాన్ని బహిరంగ సభ కోసం ముస్తాబు చేశారు. ఎనిమిది ప్రాంతాల్లో 150 ఎకరాల్లో పార్కింగ్ సెంటర్లతో సర్వం సన్నద్ధం చేశారు. సభా వేదిక నిర్మాణం, వేదిక ముందు భాగంలో ‘ఫ్యాన్’ గుర్తులో వాకింగ్‌వే ఏర్పాటుచేశారు. ప్రతి గ్యాలరీలో మంచినీరు, మజ్జిగ అందించేలా ఏర్పాట్లతో పాటు వైద్యసేవలు కూడా అందుబాటులో ఉంచారు. సభా ప్రాంగణం చుట్టూ ఏర్పాటుచేసిన పార్టీ ఫ్లెక్సీలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ‘మేం సిద్ధం’ అంటూ పార్టీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలతో ప్రాంగణాన్ని నింపేశారు. పదుల సంఖ్యలో సీఎం జగన్ భారీ కటౌట్లను స్థానిక నేతలు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో 15కు పైగా భారీగా ఎల్ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటుచేశారు. సభా ప్రాంగణం వెనుక భాగంలో హెలీప్యాడ్ సిద్ధమైంది. సీఎం షెడ్యూల్ ‘సిద్ధం’ బహిరంగ సభకు ముఖ్యమంత్రి షెడ్యూల్ ఖరారైంది. మూడో తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లిలోని హెలీప్యాడ్ నుంచి బయలుదేరి 3.20 గంటలకు దెందులూరులో సభా ప్రాంగణం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులను కలిసిన అనంతరం 3.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని 4.55 గంటలకు సభ ముగిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు హెలికాప్టర్లో తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. -
ఏలూరు ‘సిద్ధం’కు చురుగ్గా ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షిఅమావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల మూడో తేదీన ఏలూరు జిల్లాలో నిర్వహించనున్న ‘సిద్ధం’ బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ప్రజాప్రతినిధులు గురువారం పరిశీలించారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు సభకు తరలిరానున్న క్రమంలో ఆ మేరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 110 ఎకరాల సువిశాల ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది. ఏలూరు ఆటోనగర్, దెందులూరు సమీపంలోని సహారా గ్రౌండ్స్‌లో బహిరంగ సభ వేదిక పనులు చురుగ్గా సాగుతున్నాయి. భారీ సభా వేదిక నిర్మాణం, పదుల సంఖ్యలో గ్యాలరీల ఏర్పాటు, పార్టీ శ్రేణులందరి దగ్గరకు వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా పార్టీ గుర్తయిన ‘ఫ్యాన్’ ఆకారంలో భారీ వాక్‌వేను ఏర్పాటు చేశారు. జిల్లా చరిత్రలోనే లక్షలాది మందితో నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో జాతీయ రహదారిపైన ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లూ చేశారు. గోదావరి ప్రజలు సిద్ధం : మంత్రి కారుమూరి ఎన్నికలకు జగన్మోహన్రెడ్డి సిద్ధమంటే గోదావరి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని, ఉభయగోదావరి జిల్లాలు జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటాయని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్రెడ్డి ప్రతి ఇంటి బిడ్డ అని, సంక్షేమాన్ని ప్రతి ఇంటికి చేర్చి దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టించిన నేత అని కొనియాడారు. ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ దెందులూరులో జనసునామీ చూడబోతున్నారని, చంద్రబాబునాయుడు కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదు ఎకరాల్లోనే సభలు పెడుతుంటే జనం రాని పరిస్థితి ఉందని, కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక పిలుపుతో 110 ఎకరాల్లో జరిగే సభకు లక్షలాది మంది తరలిరానున్నారని చెప్పారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు, సీఎం ప్రోగ్రామ్స్ కోఆరి్డనేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ళ నాని తదితరులు ఉన్నారు. 3న దెందులూరుకు సీఎం ‘సిద్ధం’ బహిరంగ సభకు ముఖ్యమంత్రి షెడ్యూల్ ఖరారైంది. మూడో తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లిలోని హెలీప్యాడ్ నుంచి బయలుదేరి 3.20 గంటలకు దెందులూరులో సభా ప్రాంగణం వెనుక భాగంలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులను కలిసిన అనంతరం 3.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని 4.55 గంటలకు సభ ముగిస్తారు. ఐదు గంటలకు హెలికాప్టర్లో తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. -
అమ్మో.. పులొచ్చింది!
ద్వారకాతిరుమల: పెద్ద పులి.. కొద్ది రోజులుగా తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయకంపితులను చేస్తోంది. తాజాగా మంగళవారం తెల్లవారుజామున ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం రామసింగవరం పంచాయతీ, కొత్తగూడెంలోకి వచ్చిన పెద్ద పులి ఒక దూడను చంపి తినేసింది. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం గ్రామానికి చెందిన రైతు ముక్కవల్లి బాలసుందరం గేదెల నుంచి పాలు తీసేందుకు తెల్లవారుజామున తన తోటలోకి వెళ్లాడు. అక్కడ కట్టేసి ఉన్న గేదెలు, దూడలు బెదిరిపోయి అరుస్తుండడాన్ని గమనించాడు. వాటిలో ఒక గేదె దూడ లేకపోవడాన్ని గుర్తించాడు. దూడ కోసం వెతుకుతుండగా సమీప పొదల్లోంచి పులి గాండ్రింపులు వినబడడంతో వెంటనే అక్కడున్న జీడి మామిడి చెట్టెక్కి కూర్చున్నాడు. ఏం చేయాలో పాలుపోక తన వద్ద ఉన్న సెల్ ఫోన్ ద్వారా స్థానిక రైతులకు, గ్రామస్తులకు సమాచారం అందించాడు. ఆనోటా ఈనోటా చుట్టుపక్కల గ్రామాలకు సైతం ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా డీఎఫ్‌వో నాగరాజు, జంగారెడ్డిగూడెం సబ్ డీఎఫ్‌వో ఎ.వెంకట సుబ్బయ్య, ఏలూరు సబ్ డీఎఫ్‌వో ఆర్.శ్రీదేవి, ఏలూరు ఎఫ్ఆర్వో ఎస్వీకే కుమార్, నూజివీడు ఎఫ్ఆర్వో దావీదురాజు నాయుడు తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ పులి జాడలు, దూడ రక్తం, ఎముకలు వారికి కనిపించాయి. పులి పరిసర ప్రాంతాల్లోనే ఉన్న ట్లు నిర్ధారించిన అధికారులు దాని కోసం గా లించారు. అవసరాన్ని బట్టి బోను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను అమర్చారు. గ్రామస్తులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కొత్తగూడెంలో టాంటాం వేయించారు. ఘటనపై రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటే‹Ùను ఆరా తీయగా, పులి రామసింగవరం అడవిలోకి వెళ్లిపోయిందని ఆయన తెలిపారు. -
ఏలూరు జిల్లా దెందులూరులో పెద్దపులి సంచారం
-
సీఎం జగన్ మీటింగ్ కు భారీ ఏర్పాట్లు
-
ఏలూరు జిల్లాలో కలకలం రేపుతున్న పెద్దపులి సంచారం
-
పండుగపూట విషాదం.. అక్కాచెల్లెళ్లు ముగ్గు వేస్తుండగా..
సాక్షి, ఏలూరు జిల్లా: మండపల్లి మండలం కానుకొల్లులో పండగపూట విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం భోగి పండుగ సందర్భంగా ఇంటి ఎదుట ముగ్గులు వేస్తున్న అక్కాచెల్లెళ్లపైకి సడన్‌గా ఇటుక లోడుతో వెళుతున్న లారీ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో పంగిళ్ల తేజస్విని(16), పల్లవి దుర్గ(18) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
పరువు పోతుంది.. చింతమనేనికి టికెట్ ఇవ్వొద్దు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరులో టీడీపీ-జనసేన మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చింతమనేని ప్రభాకర్‌పై టీడీపీలోని ఓ వర్గం రగిలిపోతుండగా, మరోవైపు చింతమనేని వద్దే వద్దని జనసేన నేతలు అంటున్నారు. కొత్త అభ్యర్ధికి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుండగా, తనకు టికెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీని ఓడిస్తానంటూ చింతమనేని బెదిరింపులకు దిగుతున్నారు. చింతమనేని నోటి దురుసుతో పార్టీ పరువు పోతుందని.. దెందులూరు టికెట్ చింతమనేనికి ఇవ్వొద్దని టీడీపీ అధిష్టానానికి పలువురు నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. జనసేన నేత కొఠారు ఆదిశేషుకు దెందులూరు టికెట్ ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. మరోవైపు చింతమనేనికి వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు మొదలయ్యాయి. 'ప్రజా వ్యతిరేకి.. రౌడీ అయిన చింతమనేని మాత్రం వద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ అయన వ్యతిరేకులు, కొందరు టీడీపీ నాయకులూ ఫ్లెక్సీలు పెట్టారు. తనను ఓడించిన వైఎస్సార్సీపీ నాయకుడు అబ్బయ్య చౌదరిపై ప్రతీకారం తీర్చుకుంటానని భావించి.. ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్న చింతమనేని ప్రభాకర్‌కు ఇప్పుడు ఇలా వ్యతిరేక పవనాలు వీయడం ఇబ్బందికరంగా మారింది. -
ఏజెన్సీలో హైవే
సాక్షి, ఏలూరు ప్రతినిధి: ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో నూతన జాతీయ రహదారి ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఉన్న రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరించి ఏజెన్సీ మీదుగా ప్రధాన రహదారుల మధ్య కనెక్టివిటీ పెంచే జాతీయ రహదారికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. తెలంగాణ నుంచి ఆంధ్రా మధ్య దూరాన్ని తగ్గించేలా హైవే ప్రణాళిక ఖరారు చేశారు. మొదటిసారిగా పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన పోలవరంలో అత్యధిక భాగం నాలుగు వరుసల రహదారి నిర్మాణం కానుండటం విశేషం. ఎన్‌హెచ్ 365 బీబీ రెండో ప్యాకేజీ పనులకు రూ.367.97 కోట్లు మంజూరు కావడం, భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో వచ్చే నెలాఖరు నాటికి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. సూర్యాపేట నుంచి పట్టిసీమను కలిపేలా.. సూర్యాపేట నుంచి ఖమ్మం, చింతలపూడి నియోజకవర్గం మీదుగా దేవరపల్లి జాతీయ రహదారికి ఇప్పటికే కనెక్టివిటీ పెంచేలా గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో పాటు ఏజెన్సీ ఏరియాలో పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యత, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని గ్రీన్‌ఫీల్డ్ హైవేకు సమీపంలోనే జాతీయ రహదారి 365 బీబీ నిర్మాణ పనులకు ఆమోదం లభించింది. సూర్యాపేట నుంచి కూసుమంచి, ఖమ్మం, వైరా, తల్లాడ, సత్తుపల్లి, అశ్వారావుపేట మీదుగా ఏపీలోని జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మీదుగా పోలవరం వద్ద పట్టిసీమ కలిపేలా రహదారిని డిజైన్ చేశారు. జీలుగుమిల్లి నుంచి పట్టిసీమ మీదుగా రాజమండ్రి వరకు మొత్తం 86.5 కిలోమీటర్ల మేర రహదారి ఉంది. ప్రస్తుతం ఉన్న రెండు వరుసల రోడ్డును నాలుగు వరుసల రహదారిగా నిరి్మంచడానికి వీలుగా టెండర్ ఖరారు చేశారు. దీనిలో భాగంగా మొదటి విడతలో జీలుగుమిల్లి నుంచి పోలవరం వరకు 365 బీబీ నిర్మాణ పనులు మొదటి ప్యాకేజీలో భాగంగా జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెం నుంచి జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం, కేఆర్ పురం, ఎల్ఎన్డీ పేట మీదుగా పట్టిసీమ వరకు 40.4 కిలోమీటర్ల మేర రహదారిని విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.367.97 కోట్లు మంజూరు చేశారు. జిల్లా యంత్రాంగం ఇప్పటికే జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో 52.89 హెక్టార్ల భూమి అవసరమవుతుందని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసి గ్రామ సభ కూడా నిర్వహించారు. వచ్చే నెల రెండో వారానికి టెండర్లు పూర్తి చేసి నెలాఖరు నాటికి పనులు ప్రారంభించే అవకాశముంది. -
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర.. 23వ రోజు షెడ్యూల్ ఇలా..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సాధికారత దిశగా నడిపించిన వైనాన్ని, వారికి చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర మంగళవారం విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల, ఏలూరు జిల్లాలో కైకలూరు నియోజకవర్గాల్లో జరుగుతుంది. ఏలూరు జిల్లా: కైకలూరులో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహం 12 గంటలకు సీతారాం ఫంక్షన్ హాలులో తటస్థులతో వైసీపీ నాయకుల సమావేశం కానున్నారు. 3 గంటలకు ఫంక్షన్ హాలు నుంచి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం మార్కెట్ సెంటర్లో బహిరంగ సభ జరగనుంది. మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, విడదల రజిని, జోగి రమేష్, పినిపే విశ్వరూప్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ తదితరులు హాజరుకానున్నారు. విజయనగరం జిల్లా: నెల్లిమర్లలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. ఉదయం 10:30 గంటలకు విజయనగరంలోని జగన్నాధ ఫంక్షన్ హాలులో వైసీపీ నేతల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11:30 గంటలకు కొండవెలగడ గ్రామ సచివాలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం నెల్లిమర్ల వరకు ర్యాలీ జరపనున్నారు. 3:00 గంటలకు నెల్లిమర్ల మొయిన్ జంక్షన్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు సీదిరి అప్పలరాజు, రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి తదితరులు హాజరుకానున్నారు. -
నేడు విజయనగరం, ఏలూరు జిల్లాలో సాధికార యాత్ర
-
‘ఈసారి కూడా నా మనవడే సీఎం’
ద్వారకా తిరుమల: ‘ఈ మనవడు నాకెందుకు తెలీదు. నా పెద్ద మనవడే. వయసులో చిన్నోడైనా నాలాంటి ముసలోళ్లతోపాటు ఎంతోమంది పేదల జీవితాల్లో భరోసా నింపుతున్నాడు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా నేనే కాదు. రాష్ట్రంలోని అందరూ ఆయనకే ఓటేస్తారు. ఈసారి కూడా నా మనవడు జగనే సీఎం అవుతాడు’ అంటోంది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడుకు చెందిన ముద్దన ముస్సెమ్మ. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం దొరసానిపాడులో ఇంటింటికీ వెళ్లి సీఎం జగన్ సంక్షేమ పాలనను వివరించారు. ఈ సందర్భంలో ముద్దన ముస్సెమ్మ అనే వృద్ధురాలు తారసపడగా.. ఎమ్మెల్యే ఆమెతో ముచ్చటించారు. ‘మా నమ్మకం నువ్వే జగన్’ కరపత్రంపై ఉన్న సీఎం జగన్ ఫొటోను బామ్మకు చూపి ‘ఈయన ఎవరో గుర్తు పట్టావా’ అని అడిగారు. అది చూసిన ముస్సెమ్మ విప్పారిన కళ్లతో ‘నా మనవడు నాకెందుకు తెలీదు. జగన్ మనవడి వల్లే సంతోషంగా బతుకుతున్నా. జగన్‌బాబే లేకపోతే మాలాంటి వాళ్ల బతుకులు ఏమైపోయేవో. ఆయన దయవల్ల ఎందరో పేదల బతుకులు బాగుపడ్డాయ్. మా అందరి ఆశీస్సులతో మళ్లీ నా మనవడే సీఎం అవుతాడు’ అంటూ అమితానందంతో జవాబిచ్చింది. చదవండి: ఇళ్లపైకి ‘పచ్చ’దొంగలు.. జాగ్రత్త! -
చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు: సీఎం జగన్
సాక్షి, ఏలూరు: చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడినే జరిగిందని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదని అన్నారు. తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్ యుద్ధం పుణ్యాన, మూడోసారి రుణమాఫీతో అధికారంలోకి వచ్చారని ప్రస్తావించారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయన్న సీఎం జగన్.. చంద్రబాబుకు మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తు తెచ్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఎస్సీలో ఎవరైనా పుట్టాలనుకుంటారా, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన మేనిఫెస్టోలపై కమిట్మెంట్ లేని నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ తోడేళ్లంతా ఏకమవుతున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. దొంగల ముఠా అంతా ఏకమై ప్రతి ఇంటికి బెంజ్ కారు ఇస్తామంటారు.. నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. 2014 చంద్రబాబు, పవన్ ఏకమై ఇచ్చిన హామీలు నెరవేర్చారా అని ఆలోచించాలని సూచించారు. తనకు ప్రజా దీవెనలు ఉన్నంత వరకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని స్పష్టం చేశారు. చదవండి: నిమ్మగడ్డ రమేష్ కొత్త పన్నాగం.. దానికి సమాధానముందా? సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలను వ్యవసాయం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారంభించడంతోపాటు అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేశారు. చుక్కల భూములు, షరతుల గల పట్టా భూములు, సర్వీస్ ఈనాం భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించడం, భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూములపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీని సీఎం జగన్ ఈ సభలో ప్రారంభించారు. శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం రాష్ట్రంలో 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ.. కొత్తగా డీకేటీ పట్టాలను అందిస్తున్నామని తెలిపారు. చుక్కుల భూములకు సైతం పరిష్కారం చూపించామని, అసైన్డ్ భూములు, లంక భూములకు భూ హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. భూ తగాదాలకు పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్డేట్ చేస్తున్నామన్నారు. వేలమంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేపడుతున్నామని తెలిపారు. ‘మొదటి దశలో 18 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. రెండవ దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. మొత్తంగా 45 లక్షల ఎకరాల సరిహద్దు అంశాలు పరిష్కరించాం. 4 వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. సర్వే పూర్తయిన గ్రామాల్లో అక్కడి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గిరిజన రైతులకు పోడు భూములపై హక్కు కల్పించాం లంక భూమి సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు కల్పించాం. గ్రామ ఇనామ్ సర్వీస్ భూములనునిషేధిత జాబితా నుంచి తొలగించాం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన భూములకూ హక్కులు కల్పిస్తున్నాం. దళిత వర్గాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా స్మశానవాటికలకు స్థలాలు కేటాయించాం. సామాజిక న్యాయాన్ని ఒక విధానంగా అమలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చాక 2 లక్షల 7 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: చంద్రబాబుకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ -
నూజివీడులో సీఎం జగన్ పబ్లిక్ మీటింగ్ విజువల్స్
-
చంద్రబాబుకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Live Updates.. ►నూజివీడులో అర్హులకు పట్టాలు ప్రదానం చేసిన సీఎం జగన్. సీఎం జగన్ మాట్లాడుతూ.. ►ప్రజలకు మంచి చేసి చంద్రబాబు సీఎం కాలేదు. చంద్రబాబుకు మంచి చేద్దామనే ఆలోచనే లేదు. బాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడీనే. బాబు హయాంలో అందరినీ మోసం చేశాడు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అబద్దాలతో వస్తారు.. ప్రతీఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. ►తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్ యుద్ధం పుణ్యాన, మూడోసారి రుణమాఫీతో అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబుకు మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తుకు తెచ్చుకోండి. ►ఎస్సీల్లో ఎవరైనా పుట్టానుకుంటారా, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు అన్నారు. ఆయన అన్న మాటలను గుర్తుకుతెచ్చుకోండి. ►ఇచ్చిన మేనిఫెస్టోలపై కమిట్మెంట్లోని నాయకుడు చంద్రబాబు. కోడలు మగ పిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా అన్నది చంద్రబాబే. దొంగల ముఠా అంతా ఏకమై ప్రతీ ఇంటికి బెంజ్ కారు ఇస్తామంటారు మోసపోకండి. ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ తోడేళ్లు అందరూ ఏకమవుతారు. ప్రజల దీవెనలు ఉన్నంత వరకూ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోను. ►రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాం. 2003 నాటి అసైన్డ్ భూములకు హక్కు కల్పిస్తున్నాం. కొత్తగా డీకేటి పట్టాలను అందిస్తున్నాం. పేదవాళ్లకు వెన్నుదన్నుగా ఉంటే పెత్తందార్లకు నచ్చడం లేదు. పేదవర్గాల పట్ల బాధ్యతగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నాం. ►మొదటి దశలో 18లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. రెండో దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. నాలుగు వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. సర్వే పూర్తి అయిన గ్రామాల్లో అక్కడి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. భూ తగాదాల సమస్యలను పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్డేట్. వేల మంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేపడుతున్నాం. అసైన్డ్ భూములకు భూ హక్కులు కల్పిస్తున్నాం. చుక్కల భూములకు సైతం పరిష్కారం చూపించాం. ►ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన భూములకూ హక్కులు కల్పిస్తున్నాం. గిరిజన రైతులకు పోడు భూములపై హక్కు కల్పించాం. లంక భూమి సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు కల్పించాం. గ్రామ ఇనామ్ సర్వీస్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాం. దళిత వర్గాల కోసం రాష్ట్రవ్యాప్తంగా స్మశాసవాటికలకు స్థలాలు కేటాయించాం. ►నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. నాడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే.. నేడు చంద్రబాబు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. 2018 తెలంగాణ ఎన్నికల్లో టీడీపీకి రెండు సీట్లు వచ్చాయి. 2024 ఏపీ ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాదు. 175కు 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ కచ్చితంగా గెలుస్తుంది. నారా లోకేశ్ రాజకీయాలకు పనికిరాడు.. ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి. లోకేశ్ ఏదైనా ఇండస్ట్రీ ప్రారంభిస్తానంటే సీఎం జగన్‌కు చెప్పి అనుమతులు ఇప్పిస్తాను. ►ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘతన సీఎం జగన్‌దే. దివంగత వైఎస్సార్ వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. చంద్రబాబు ఎవ్వరికీ పట్టాలు ఇవ్వలేదు. నూజివీడుకు చంద్రబాబు చేసిందేమీ లేదు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు రెండు సీట్లు కూడా రావు. ►నూజివీడు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ►నూజివీడు బయలుదేరిన సీఎం జగన్ ►కాసేపట్లో అసైన్డు, లంక భూముల రైతులకు పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం ►భారీ భూ పంపిణీ కార్యక్రమానికి నేడు నూజివీడు వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే 10,303 మందికి 12,886.37 ఎకరాల భూమిని శాశ్వత హక్కుతో అందించనున్నారు. 31 గ్రామాల్లో ఎస్సీ శ్మశాన వాటికలకు 33.32 ఎకరాలను ఇదే వేదిక నుంచి మంజూరు చేయనున్నారు. సీఎం పర్యటన ఇలా.. ► ఉదయం 10.25 గంటలకు నూజివీడులోని హెలీప్యాడ్‌కు చేరుకుని ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో మాట్లాడతారు. ► 10.55 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్, ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. ► 11.10 నుంచి 12.25 గంటల వరకు భూ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పట్టాలు పంపిణీ చేసి సభలో ప్రసంగిస్తారు. ► 12.50 గంటలకు హెలీప్యాడ్‌కు చేరుకుని స్థానిక నాయకులు, ప్రజలను కలుసుకుంటారు. అనంతరం 1.55 గంటలకు తాడేపల్లి పయనం కానున్నారు. గోడు విన్నారు.. పోడు భూములిచ్చారు సాక్షి, అమరావతి: గిరిజనుల గోడును ఆలకించి నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోడు భూములకు అటవీ హక్కుల గుర్తింపు చట్టం(ఆర్వోఎఫ్ఆర్ యాక్ట్) ద్వారా పట్టాలిచ్చి రికార్డు సృష్టించారు. గిరిజనులకు పోడు భూముల పంపిణీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా నిలిపారు. 2008 నుంచి 2019 వరకు గత ప్రభుత్వాలు 95,649 గిరిజన కుటుంబాలకు 2,33,410 ఎకరాలకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలిచ్చాయి. వీటిల్లో గత పదకొండేళ్లలో ఇచ్చిన మొత్తం పట్టాల్లో అత్యదికంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పంపిణీ చేసినవే కావడం గమనార్హం. వాస్తవానికి పోడు భూములకు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టింది కూడా వైఎస్సారే. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గత నాలుగున్నరేళ్లలో ఏకంగా మొత్తం 1,30,368 కుటుంబాలకు 2,87,710 ఎకరాలకు పట్టాలిచ్చి పేదలకు మేలు చేయడంలో తండ్రి కంటే రెండు అడుగులు ముందుంటానని నిరూపించుకున్నారు. వీటిలో 1,29,842 మందికి 2,19,763 ఎకరాలు, 526 సామూహిక(కమ్యూనిటీ) టైటిల్స్ ద్వారా 67,947 ఎకరాల పోడు భూములకు పట్టాలుగా పంపిణీ చేయడం విశేషం. డీకేటీ పట్టాల పంపిణీ.. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని (రిజర్వ్ ఫారెస్ట్ కాని భూమి) వారు సాగు చేసుకొని జీవించేలా రాష్ట్ర ప్రభుత్వం డీకేటీ పట్టాల రూపంలో పంపిణీ చేస్తుంది. గత నాలుగున్నరేళ్ల కాలంలో ఈ కార్యక్రమం ద్వారా 26,287 మంది గిరిజనులకు 39,272 ఎకరాల భూమిని పంపిణీ చేయడం గమనార్హం. -
పేదజనం కల నెరవేర్చిన జగనన్న ప్రభుత్వం
-
సామాజిక విప్లవ సారథి జగన్‌కు జేజేలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/ సాక్షి, బాపట్ల/సాక్షి, కడప: సామాజిక విప్లవ సారథి వైఎస్ జగన్ పరిపాలనకు ప్రజలు అడుగడుగునా జేజేలు పలుకుతున్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రను హర్షాతిరేకాలతో స్వాగతిస్తున్నారు. ‘జగనన్నే మా భవిష్యత్తు.. జగనే రావాలి.. జగనే కావాలి’ అంటూ అన్ని వర్గాలూ ఒక్క గళమై నినదిస్తున్నారు. వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు మూడో రోజు శనివారం ప్రజలు నీరాజనం పలికారు. గత 53 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు చేస్తున్న మంచిని వివరించడానికి సీఎం జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర శనివారం విశాఖ జిల్లా భీమిలి, బాపట్ల జిల్లా బాపట్ల, వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది. ఈ బస్సు యాత్ర సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, ఏలూరు జిల్లా దెందులూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గాల్లో జరగనుంది. బాపట్లలో అపూర్వ స్పందన బాపట్ల నియోజకవర్గంలో బస్సు యాత్రకు అపూర్వ స్పందన లభించింది. యాత్రకు ప్రజలు పూల తివాచీలతో ఘనస్వాగతం పలికారు. బస్సు యాత్ర నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం, సంగుపాలెం కోడూరు గ్రామాల మీదుగా మధ్యాహ్నం 1.10 గంటలకు చందోలులోని శ్రీ బండ్లమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరింది. అక్కడ అమ్మవారికి నేతలు పూజలు చేశారు. పెద్ద మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చందోలులోని నీలి బంగారయ్య ఉన్నత పాఠశాలలో పూర్తి చేసిన నాడు–నేడు పనులను పరిశీలించారు. విద్య, వైద్యం తదితర విభాగాల్లో జరిగిన అభివృద్ధిని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజలకు వివరించారు. యాత్ర రెడ్డిపాలెం, కర్లపాలెం మీదుగా సాయంత్రం 5.30 గంటలకు బాపట్ల చేరుకుంది. నియోజకవర్గంలోని యువకులు అధిక సంఖ్యలో ద్విచక్రవాహనాలతో భారీ ర్యాలీ చేశారు. అంబేడ్కర్ సెంటర్లో సభ జరిగింది. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చేస్తున్న మేలును మంత్రులు వివరించిన సమయంలో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. జనసంద్రంగా మారిన పసిడిపురి పసిడిపురి ప్రొద్దుటూరులో సామాజిక సాధికార యాత్ర జనజాతరలా సాగింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని వైవీఆర్ కళ్యాణ మండపం నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర బైపాస్ రోడ్డు మీదుగా రామేశ్వరం వైపు సాగింది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి నియోజకవర్గ నేతలతో కలిసి బస్సు ముందు నడుస్తుండగా మహిళలు వైఎస్సార్సీపీ జెండాలతో స్వాగతం పలికారు. యువత భారీ బైక్ ర్యాలీ చేశారు. రామేశ్వరంలోకి బస్సు చేరుకోగానే బాణాసంచా కాల్చారు. వన్‌టౌన్ పోలీసు స్టేషన్ సమీపంలో ముస్లిం మైనార్టీలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. రాజీవ్ సర్కిల్ వద్ద ప్రజలు గజమాలతో స్వాగతం పలికారు. శివాలయం సెంటర్లో అసంఖ్యాక జనం మధ్య బహిరంగ సభ జరిగింది. దసరా ఉత్సవాలకు పసిడిపురి పెట్టింది పేరు. భారీ స్థాయిలో ప్రజానీకం వీటిని వీక్షిస్తుంటారు. శనివారం సామాజిక సాధికార యాత్ర కూడా ఇదే ఉత్సవాలను తలపించింది. శివాలయం సెంటర్ నుంచి కనుచూపు మేర రోడ్డుకు ఇరువైపులా ప్రజానీకం నిల్చొని నేతల ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. భీమిలిలో 2వేల బైక్‌లతో భారీ ర్యాలీ భీమిలిలో స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రను ఎండాడలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగు నాగా ర్జున, సీదిరి అప్పలరాజు, కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. అక్కడ నుంచి చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘నాడు–నేడు’ పనులను నాయకులు పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించారు. ఆనందపురం మండలం బోయిపాలెం కూడలి నుంచి 2 వేలకు పైగా బైక్‌లు, వందకు పైగా కార్లతో ర్యాలీగా యాత్ర ప్రారంభమై హైవే మీదుగా తగరపువలస చిట్టివలస ఫుట్‌బాల్ గ్రౌండ్ వద్ద బహిరంగ సభాస్థలి వద్దకు చేరింది. అక్కడ కూడలిలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి బహిరంగ సభ వద్ద వైఎస్సార్ విగ్రహాలకు నివాళర్పించి మంత్రులు ప్రసంగించారు. -
చంద్రబాబు జైల్లో ఉండటానికి కారణం వారే: కొమ్మినేని
సాక్షి, ఏలూరు జిల్లా: తీర ప్రాంత అభివృద్ధిపై దృష్టిపెట్టిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఏపీ సి.ఆర్.మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమలు రావట్లేదని కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు అబద్ధ ప్రచారం చేస్తున్నాయి. చంద్రబాబు అమరావతిని తనకు కావాల్సిన వాళ్లకి రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చారు. సీఎం జగన్ తనకు తెలిసిన వారితో పరిశ్రమలు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఏపీకి ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగాల్సిన అవసరం తప్పకుండా ఉంది.’’ అని కొమ్మినేని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై కొమ్మినేని మాట్లాడుతూ, చంద్రబాబు 38 రోజులుగా జైల్లో వుండటానికి కారణం వారి కుటుంబ సభ్యులు, టీడీపీ లాయర్లే... లాయర్లు ముందు బెయిల్ కోరకుండా కేసు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారు. మొన్నటి దాకా చంద్రబాబు ఎండలో తిరిగి ఫిట్‌గా ఉన్నానని, ఇప్పుడు జైల్లో నీడలో ఉండి ఆరోగ్యం బాగాలేదనడం అర్థం కాని విషయం. చంద్రబాబు కుటుంబ సభ్యులు ఏసీలు కావాలని కోర్టులో వేస్తున్నారు తప్ప, ఆయన్ని ఆసుపత్రిలో చేర్చమని ఎందుకు అడగడం లేదు’’ కొమ్మినేని శ్రీనివాసరావు ప్రశ్నించారు. చదవండి: అన్ని సీట్లలో పోటీ చేయదట.. టీడీపీపై విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు -
బైక్ లిఫ్ట్ అడగడమే ఆమెకు శాపమైంది.. ఫొటోలు తీసి..
సాక్షి, ఏలూరు: మహిళలు, యువతులపై వేధింపులు తగ్గించేందుకు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కొందరు మృగాలు మాత్రం మారడం లేదు. చట్టాలు తమకు వర్తించవు అనే రకంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కొందరు ఆకతాయిల వేధింపుల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. దీంతో, ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ విషాదకర ఘటన ఏలూరులో చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనపై ఎస్ఐ చావా సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భీమడోలు మండలం లక్ష్మీపురానికి చెందిన సుంకర లక్ష్మణరావుకు దెందులూరుకు చెందిన పావని (35)కి 2007లో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. పిల్లల చదువుల నిమిత్తం గుండుగొలనులోని గంగానమ్మ గుడి సమీపంలోని ఓ అద్దె ఇంట్లో గత రెండేళ్లుగా నివాసం ఉంటున్నారు. అయితే గత నెల 15న పావని ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తూ అటుగా వస్తున్న ఓ మోటార్ స్లైక్లిస్ట్‌ను లిఫ్ట్ అడిగి వెళుతోంది. అయితే, ఆ సమయంలో లక్ష్మీపురానికి చెందిన పాత నేరస్తుడు బోను శివకృష్ణ ఆమె బండి ఎక్కి వెళుతున్న దృశ్యాన్ని తన సెల్ఫోన్లో వీడియో తీసి తన సహచరులైన బోను పవన్, సుంకర యశ్వంత్, శనపతి రాజబాబులతో కలిసి ద్వారకాతిరుమల వరకు వారిని వెంబడించారు. అక్కడ వారిని అడ్డగించి తమ కోరిక తీర్చాలని లేదంటే వీడియో వైరల్ చేసి అల్లరి పాలు చేస్తామని బెదిరించారు. అయినా ఆమె వారికి లొంగలేదు. కాగా, ఈనెల 10న బోను శివకృష్ణ సదరు మహిళ బైక్ ఎక్కి వెళ్లిన వీడియోను గ్రామంలో అందరికి షేర్ చేశాడు. వ్యభిచారిణిగా చిత్రీకరిస్తూ ప్రచారం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదరు వివాహిత అదేరోజు ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. మృతదేహానికి వీఆర్వోలు వి.వెంకటేశ్వరరావు, కందులపాటి శంకర్ పంచనామా నిర్వహించారు. పావని మృతికి కారణమైన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి వీడియోలను తీసిన సెల్ఫోన్లను కూడా సీజ్ చేశామని చెప్పారు. నిందితులను భీమడోలు కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. చేపల పట్టుబడికి వెళుతూ జీవనం పొందుతున్న భర్త, పిల్లలు పావని ఆత్మహత్యతో తల్లడిల్లిపోయారు. ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో యువ జంట దుర్మరణం -
లోకేశ్‌ను కలిసేందుకు రైతులు ససేమిరా
జంగారెడ్డిగూడెం రూరల్/కామవరపుకోట: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో బుధవారం నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వెలవెలబోయింది. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి నుంచి పుట్లగట్లగూడెం మీదుగా గురవాయిగూడెం వరకు యాత్ర సాగింది. పాదయాత్ర షెడ్యూల్లో పుట్లగట్లగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ హైవే రైతులతో లోకేశ్ ముఖాముఖి ఏర్పాటు చేశారు. అయితే.. రైతుల వద్దకు లోకేశ్ రారని.. రైతులనే లోకేశ్ వద్దకు తీసుకు రావాలని చెప్పడంతో నాయకులు హైరానా పడ్డారు. లోకేశ్ వద్దకు రావాలని రైతులను బతిమాలుకోగా.. తాము రాబోమని రైతులు తెగేసి చెప్పారు. దీంతో టీడీపీ నేతలు తమ బంధువులను, పరిచయం ఉన్న వారిని తీసుకెళ్లి వాళ్లే రైతులని లోకేశ్‌కు చెప్పారు. వారితో ముక్తసరిగా మాట్లాడిన లోకేశ్ యాత్రను ముందుకు సాగించారు. చదవండి: 15 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల విధానం -
జనం లేక లోకేశ్ పాదయాత్ర వెలవెల
లింగపాలెం/చింతలపూడి: ఏలూరు జిల్లా లింగపాలెం, చింతలపూడి మండలాల్లో సోమవారం నారా లోకేశ్ పాదయాత్ర జనం లేక వెలవెలబోయింది. లింగపాలెం మండలంలోని సుందరరావుపేట నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి చింతలపూడి మండలం వెలగలపల్లి, ఫాతిమాపురం గ్రామాల మీదుగా చింతలపూడి శివారు క్యాంప్ సైట్‌కు చేరారు. ఎన్వీఎన్ కాలనీ సమీపంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని లోకేశ్ ప్రారంభించారు. పాదయాత్రలో నాయకులు, యువగళం టీం సభ్యులు మినహా స్థానిక ప్రజలు ఎక్కడా పెద్దగా కనిపించలేదు. అక్కడక్కడా టీడీపీ నాయకులు, కార్యకర్తలు లోకేశ్‌తో కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా, తనకు ఒక చెయ్యి నొప్పిగా ఉందని చెబుతూ మరో చేతిని ఊపుతూ వెళ్లిపోయారు. లింగపాలెం గ్రామ శివారుకు వెళ్లిన తర్వాత మాజీ ఎమ్మెల్యే, స్థానిక మాజీ ప్రజాప్రతినిధిని ‘మీ గ్రామంలో జనం ఏరి..’ అంటూ లోకేశ్ ప్రశ్నించారు. కాగా, లోకేశ్ క్యాంప్ సైట్లో పామాయిల్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నేతలు ముందుగానే ఎంపిక చేసిన తమ పార్టీకి చెందిన రైతులనే ఈ కార్యక్రమానికి అనుమతించారు. తన తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పామాయిల్ రైతులకు ఎంతో మేలు చేసినట్లు చెప్పినా రైతుల నుంచి స్పందన రాకపోవడంతో ‘కనీసం చప్పట్లన్నా కొట్టండయ్యా..’ అంటూ లోకేశ్ అడిగి మరీ చప్పట్లు కొట్టించుకోవడంతో రైతులు నవ్వుకున్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత లోకేశ్ పాదయాత్ర చింతలపూడి వైఎస్సార్సీపీ కార్యాలయం వద్దకు చేరుకోగానే ‘సైకో పోవాలి, సైకిల్ కావాలి...’ అంటూ మైకులో కేకలు వేయడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ‘జై జగన్... వైఎస్సార్సీపీ జిందాబాద్...’ అంటూ నినాదాలు చేశారు. దీంతో లోకేశ్ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితోపాటు టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపైకి దూసుకువచ్చారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించారు. కూలి ఇవ్వలేదని జెండాలు పారేసి వెళ్లిన వైనం.. ముసునూరు: ఏలూరు జిల్లాలో జరుగుతున్న లోకేశ్ పాదయాత్రలో పెయిడ్ ఆర్టిస్టులే కనిపిస్తున్నారు. పల్లెల్లో ప్రజల్లో స్పందన కరువవడంతో పెయిడ్ ఆర్టిస్టులతో పాదయాత్ర సాగిస్తున్నారు. పాదయాత్రకు కూలి డబ్బులిస్తామని జనాన్ని తరలించిన విషయం సోమవారం వెలుగుచూసింది. శనివారం యువగళం పాదయాత్ర నూజివీడు మండలం పోతురెడ్డిపల్లిలో ప్రారంభమై మండలంలోని కొర్లగుంట–ముసునూరుల మీదుగా వలసపల్లి వరకు జరిగింది. ఈ క్రమంలో కొందరు ఆటోలో కాట్రేనిపాడు గ్రామం మీదుగా దగ్గర దారిలో హనుమాన్‌జంక్షన్ వైపు వెళుతూ జెండాలను రహదారి పక్కనే పడేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు.. అలా పడేశారేంటని ఆటోలోని వారిని ఆరా తీశారు. కూలి డబ్బులు ఇస్తామని పాదయాత్రకు తీసుకొచ్చారని, కానీ డబ్బులివ్వకుండా తమను మోసం చేశారని ఆటోలోనివారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే వెనుదిరిగి వెళ్లిపోతున్నామని చెప్పారు. పాదయాత్రలో పాల్గొనేందుకు తమకు ఇచ్చిన జెండాలు, చొక్కాలను విప్పి దారిలో పారేసి వెళుతున్నామని తెలిపారు. ఈ ఘటనపై కాట్రేనిపాడుకు చెందిన కంబాల రాజేశ్ సోషల్‌మీడియాలో పెట్టిన వీడియో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా రాజేష్ సోమవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. పాదయాత్ర తమ గ్రామం మీదుగా జరగలేదని, దగ్గర దారి కావడంతో వీరంతా ఇటువైపు వెళ్లారని చెప్పారు. వారు ఏ గ్రామానికి చెందినవారో చెప్పలేదని ఆయన తెలిపారు. -
ఏలూరు: లోకేష్ యాత్రలో రెచ్చిపోయిన టీడీపీ రౌడీలు
సాక్షి, ఏలూరు: లోకేష్ పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. తుక్కులూరులో విధ్వంసానికి యత్నించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్ల దగ్గర రెచ్చగొట్టే చర్యలకు దిగిన టీడీపీ శ్రేణులు.. వైఎస్సార్సీపీ నేత విజయ్ ఇంటిపై రాళ్లు రువ్వారు. దీంతో ఇంటి అద్దాలు ధ్వంసం కాగా, వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. టీడీపీ అరాచకాలను చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా దాడులకు తెగబడ్డారు. మీడియా ప్రతినిధుల ఫోన్లను సైతం లోకేష్ యువగళం టీమ్ లాక్కొంది. అడ్డుగా వెళ్లిన రూరల్ కానిస్టేబుల్‌పై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. చదవండి: ఆర్జీవీ థర్డ్ గ్రేడ్ అంటూ లోకేశ్ వ్యాఖ్యలు.. రివర్స్ కౌంటర్ ఇచ్చిన వర్మ -
సీన్ రివర్స్.. చంద్రబాబుకు వార్నింగ్.. అలా చేయకపోతే తోకలు కత్తిరిస్తాం..
తోకలు కత్తిరిస్తానంటూ అందరినీ బెదిరించడం చంద్రబాబుకు బాగా అలవాటు. అయితే ఉమ్మడి గోదావరి జిల్లాలోని ఓ నియోజకవర్గంలో పచ్చ పార్టీ పరిస్థితి ఇప్పుడు రివర్స్ అయింది. తమ ఇన్‌చార్జ్‌ను మార్చకపోతే మేమే తోకలు కత్తిరిస్తామంటూ అక్కడి నాయకులు చంద్రబాబుకే వార్నింగ్ ఇచ్చారట. బయటినుంచి తమ మీద పెత్తనం చేస్తున్న వ్యక్తికి కాకుండా లోకల్ లీడర్‌కే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉండగానే టీడీపీ బాస్ చంద్రబాబుకు ఏలూరు జిల్లా నూజివీడు తమ్ముళ్లు చుక్కలు చూపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నూజివీడు అసెంబ్లీ సీటు స్థానికులకే ఇవ్వాలన్న డిమాండే దీనికి కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం నూజివీడు ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న ముద్రబోయిన వెంకటేశ్వరరావు గత రెండు ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడిపోయారు. అటు పార్టీలోను.. ఇటు ప్రజల్లోనూ ఆదరణ లేక ఓటమిని తనఖాతాలో వేసుకోవాల్సివచ్చిందని టాక్. రెండుసార్లు ఓడిపోయిన నేత మూడోసారైనా గెలుపే లక్ష్యంగా పనిచేయాల్సి ఉండగా.. నియోజకవర్గంలోని టీడీపీ కేడర్‌ను, నాయకులను టార్గెట్ చేసి వేధిస్తున్నాడనే ప్రచారం సాగుతోంది. తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని ఎప్పట్నుంచో నూజివీడు టీడీపీకి ఆయువుపట్టుగా ఉన్న క్యాడర్‌ను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారట. ముఖ్యంగా నూజివీడు పార్టీలో సీనియర్ నేత కాపా శ్రీనివాసరావుకు.. ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందని తెలుస్తోంది. దీంతో కాపా వర్గాన్ని ముద్రబోయిన తరచూ టార్గెట్ చేస్తున్నారట. ఇటీవల లోకేష్ యువగళం పాదయాత్రకు మద్దతుగా కాపా శ్రీనివాసారావు వర్గం పాదయాత్ర చేపట్టింది. నియోజకవర్గ ఇంఛార్జి ముద్రబోయిన లేకుండానే పాదయాత్ర చేపట్టినందుకు కాపా వర్గానికి చెందిన నూజివీడు మండల నేతలపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ పరిణామాలతో కాపా శ్రీనివాసరావు వర్గం ముద్రబోయినపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాపా వర్గం తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి నేరుగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనే పంచాయతీ పెట్టిందట. ఆ సమయంలో చంద్రబాబు తన సహజధోరణితో.. మీ సంగతి చూస్తా...అంతు తేలుస్తా..అంటూ హెచ్చరించడంతో వెళ్లినవారంతా షాక్ తిన్నారట. సమస్య చెప్పుకోవడానికి వెళితే బెదిరిస్తారా అంటూ రగిలిపోతున్న కాపా వర్గం ముద్రబోయిన కావాలో తాము కావాలో తేల్చుకోవాలంటూ, అధిష్టానానికి అల్టిమేటమ్ ఇచ్చేందుకు ఓ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలియగానే మొన్నటి వరకూ డోంట్ కేర్ అన్న అధిష్టానం బుజ్జగింపుల కోసం ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులుని రంగంలోకి దించింది. ఓ మూడు గంటలు పాటు బ్రతిమిలాడిన తర్వాత.. మూడు రోజులు గడువిస్తామని.. ఈలోగా తమ డిమాండ్లకు సానుకూల నిర్ణయాలు రాకపోతే..తమ నిర్ణయం ఏంటో ప్రకటిస్తామని కాపా శ్రీనివాసరావు పార్టీ నాయకత్వానికే డెడ్ లైన్ పెట్టారట. చదవండి: పాదయాత్రలో లోకేష్‌కు జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్ ఇదిలా ఉంటే నూజివీడు ఇన్చార్జ్గా అధిష్టానం ఎవరిని సూచించినా ఆ నేతకు మద్దతిస్తామని.. కానీ ఆ వ్యక్తి ముద్రబోయిన కాకుండా స్థానికుడే అయిఉండాలని పట్టుబడుతున్నారట కాపా వర్గం నేతలు. ఏ సామాజిక వర్గానికి చెందిన నేత అయినా స్థానికుడైతే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ముద్రబోయిన కాకుండా ఎవరైనా ఓకే అని స్పష్టం చేస్తున్నారట. తమ డిమాండ్‌ను కాదని ముద్రబోయినకు టిక్కెట్టిస్తే మాత్రం తేడాలొచ్చేస్తాయనే బలమైన సంకేతాన్ని పంపించారట. ఇప్పుడు నూజివీడులో చోటుచేసుకున్న ఈ పరిణామాలు పసుపు పార్టీలో తీవ్రస్థాయి చర్చకు దారితీసాయి. వారి డిమాండ్‌కు తలవొగ్గితే అన్ని చోట్ల నుంచి అటువంటి డిమాండ్లు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే మరో రకంగా సమస్య వస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా సమస్యగానే కనిపిస్తోందంటూ చంద్రబాబు తల బాదుకుంటున్నారని టాక్. -
ఏలూరు, ప.గో.జిల్లాలో పంచాయతీ ఉపఎన్నికలు
అమరావతి: ఏలూరు, పశ్చిమ గోదావరి జిలాల్లో మొత్తం నాలుగు సర్పంచ్ స్థానాలకు 31 వార్డు స్థానాలకు నేడు పంచాయతీ ఉపఎన్నికలు జరగనున్నాయి. ఏర్పాట్లన్నీ పూర్తి కాగా ఉదయం 7 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది గత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనంతరం ఖాళీ అయిన స్థానాల భర్తీ కోసం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా ఈరోజు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఏలూరు జిల్లాలో మొతం 3 సర్పంచ్ స్థానాలకు 21 వార్డులకు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సర్పంచ్ స్థానానికి 10 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలనుంచి కౌంటిం ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు రిటర్నింగ్ అధికారి. ఏలూరు జిల్లాలో ఆగిరిపల్లి మండలంలోని అడవినెక్కలం, పెదపాడు మండలం వీరమ్మకుంట, ముదినేపల్లి మండలంలోని వణిదురు సర్పంచ్ స్థానాలకు, అలాగే 21 వార్డులకు.. పశ్చిమగోదావరి జిల్లాలో ఇరగవరం మండలం కావలిపురం సర్పంచ్ పదవికి, 10 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు పూర్తయిన వెంటనే జరగాల్సిన కౌంటింగ్ ప్రక్రియకు కూడా అని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏలూరు జిల్లాలో మొత్తం 4 సర్పంచ్ స్థానాలు, 47 వార్డు మెంబర్లకు గాను శ్రీనివాసపురం సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. అలాగే 12 వార్డులు ఏకగ్రీవం కాగా, 12 వార్డులకు సింగిల్ నామినేషన్లు, మరో రెండు వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో 21 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటి కోసం 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 160 మంది సిబ్బందిని నియమించారు. ఏలూరు జిల్లాలో 11,114 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు, 120 మంది సిబ్బందిని నియమించారు. -
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పంచాయతీ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం
-
48 గంటల్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేశాం...!
-
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన (ఫొటోలు)
-
అందరికీ తప్పకుండా న్యాయం చేస్తాం: సీఎం జగన్
LIVE UPDATES: ► రాజమండ్రి చేరుకున్న సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చేరుకున్నారు సీఎం జగన్. ఇవాళ రాత్రి ఇక్కడి ఆర్&బి అతిధి గృహంలో బస చేస్తారు. మంగళవారం(రేపు) డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. ► ఏలూరు జిల్లా: ముగిసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి కుక్కునూరు పర్యటన. రాజమండ్రి బయలుదేరారు. గొమ్ముగూడెంకు వరద ముంపు బాధితులతో సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్ ►ఆర్ అండ్ ఆర్ విషయంలో కేంద్రం నిధులకు తోడు రాష్ట్రం నిధులు ►ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం ►జనవరి కల్లా ప్యాకేజీ అందే విధంగా చూస్తాం ►అందరికీ తప్పకుండా న్యాయం చేస్తాం ►2013 -14 రేట్ల తో కడతామని గత ప్రభుత్వం చెప్పింది ►ఆ రేట్ల ప్రకారమే డబ్బులు ఇస్తామని కేంద్రం చెప్పింది ►మనసుపెట్టి ఆలోచించాలని కేంద్రానికి సూచించాము.. ►కేంద్రంలో కొంత కదలిక వచ్చి సానుకూల వాతావరణం వచ్చింది ►సెంట్రల్ క్యాబినెట్ అప్రూవల్ కోసం పంపారు ►ఈ నెలాఖరుకు కేంద్ర క్యాబినెట్ లోకి వచ్చే అవకాశం ఉంది అది వేస్తే17వేల కోట్లు కేంద్రం ఇచ్చే అవకాశం ఉంది.. ►హామీ ఇచ్చిన రీతిలో 47వేల ఏకరాలకు ఐదు లక్షలు ఇస్తాము ►2025 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి చేసి నీరందిస్తాం ►గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పోలవరం ఆలస్యం ►స్పిల్ వే కట్టకుండా డయా ఫ్రమ్ వాల్ కట్టారు ►కాఫర్ డ్యాం కట్టకపోవడం వల్లే గ్రామాలు ముంపునకు గురయ్యాయి ►కొత్త డయాఫ్రం వాల్ కట్టడంతో పాటు స్పిల్ వే పనులు పూర్తి చేస్తున్నాం ►గత ప్రభుత్వాల కంటే భిన్నంగా వరద బాధితులను ఆదుకుంటున్నాం ►వరదలతో ఇళ్లు దెబ్బతింటే సాయం అందిస్తున్నాం ►ఏ ఒక్కరూ సాయం అందలేదనకూడదు ►సహాయక చర్యల్లో కలెక్టర్లకు అన్ని రకాల అధికారాలు ఇచ్చాం ►వరద బాధితులకు సాయం అందకుంటే ఫిర్యాదు చేయొచ్చు ►పోలవరం డ్యాంలో మూడు దశల్లో నీళ్లు నింపుతాం ►వచ్చే 6,7 నెలల్లో మీకు రావాల్సిన ప్యాకేజీపై మంచి జరుగుతుంది ►లిడార్ సర్వే ద్వారా అందరికీ న్యాయం జరుగుతుంది ►లిడార్ సర్వే సైంటిఫిక్‌గా జరిగింది.. ఎవరికీ అన్యాయం జరగదు ►భూములు కొనుగోలుకు సంబంధించి మరింత న్యాయం చేస్తాం ►వరద నష్టాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన సీఎం జగన్ ►గొమ్ముగూడెంలో వరద బాధితులకు సీఎం జగన్ పరామర్శ ►వరద బాధితులతో మాట్లాడిన సీఎం జగన్ ►వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం జగన్ ►ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన ►కుక్కునూరు మండలం గొమ్ముగూడెం చేరుకున్న సీఎం జగన్ ►వరద బాధితులను పరామర్శించనున్న సీఎం జగన్ అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో సీఎం జగన్ .. ►పోలవరం నిర్మాణంలో మా ప్రభుత్వం క్రెడిట్ కోసం ఆలోచించదు ►ప్రజలకు న్యాయం చేయడమే మా సంకల్పం ►ఆర్&ఆర్ విషయంలో కేంద్రం నిధులకు తోడు రాష్ట్రం నిధులు ►పోలవరం నిర్మాణంలో చంద్రబాబు బుద్ధిలేకుండా వ్యవహరించారు ►పోలవరం ముంపు బాధితుల పునరావాస ప్యాకేజీ పారదర్శకంగా అమలు. ►పునరావాస ప్యాకేజీకి త్వరలోనే కేంద్రం ఆమోదం. ►పోలవరం పరిహారం కేంద్రం స్వయంగా చెల్లించినా పర్వాలేదు. ►బాధితులకు రావాల్సిన ప్యాకేజ్‌పై మంచి జరుగుతుంది. ►ప్రతి నిర్వాసిత కుటుంబానికి న్యాయపరమైన ప్యాకేజీ అందుతుంది. ►ముంపు ప్రాతాల్లో లీడార్ సర్వే ద్వారా అందరికీ న్యాయం జరుగుతోంది. ►మూడు దశల్లో పోలవరం డ్యాంలో నీళ్లు నింపుతాం ►ఒక్కసారిగా నింపితే డ్యామ్ కూలిపోవచ్చు ►సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం పోలవరం డ్యాంలో నీళ్లు ►సెంట్రల్ వాటర్ కమిషన్ ఆదేశాల ప్రకారమే ముందుకెళ్తున్నాం ►వరద సాయం అందలేదని ఒక్క ఫిర్యాదు రాలేదు. ►ఏ ఒక్క బాధితుడు మిగిలిపోకుండా సాయం అందించారు ►అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు ► బాధితులందరికీ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు. ►సహాయక చర్యల కోసం అధికారులకు తగిన సమయం ఇచ్చాం. ►నష్ట పరిహారం పక్కాగా అందేలా చర్యలు తీసుకున్నాం. ►అధికారులు వారంపాటు గ్రామాల్లోనే ఉన్నారు. ►వరద బాధితులకు నిత్యవసరాలు అందించాం, ఇళ్లు దెబ్బతిని ఉంటే రూ10 వేలు ఇవ్వాలని ఆదేశించాం ► ఇళ్లలోకి నీరు వచ్చినన వారికి రూ. 2 వేలు ఆర్థికసాయం చేశాం. ►వరద సాయం అందకుంటే ఇక్కడికి వచ్చి నాకు చెప్పండి ►ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నదే మా తాపత్రయం ►డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం మా ప్రభుత్వానికి లేదు. ►అల్లూరి సీతారామరాజు, ఏలూరులో జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. కూనవరంలో వరద బాధిత ప్రజలను పరామర్శించారు. వరద సహాయ, పునరావాస చర్యలను అడిగి తెలుసుకున్నారు. ►తాడేపల్లి నుంచి వరద ప్రాంతాల పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయలుదేరారు. తొలుత ఏఎస్ఆర్ జిల్లా కూనవరం, వీఆర్ పురం మండలాల బాధితులను సీఎం కలవనున్నారు. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో సోమవారం పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి కూనవరం, వీఆర్‌పురం మండలాల బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడనున్నారు. అనంతరం కుక్కునూరు మండలం గొమ్ముగూడెం సందర్శించనున్నారు. సాయంత్రం రాజమహేంద్రవరం ఆర్అండ్బీ గెస్ట్‌హౌజ్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. రాత్రికి అక్కడే బసచేయనున్నారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించి, వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో సీఎం జగన్ నేరుగా మాట్లాడనున్నారు. వరద సహాయ, పునరావాస చర్యలు అమలు చేసిన తీరుపై స్వయంగా బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకోనున్నారు. గోదావరి వరదలతో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో ఇటీవల పలు ప్రాంతాలు వరద ముంపునకు గురైన విషయం తెలిసిందే. చదవండి: హానీట్రాప్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్.. కీలక సమాచారం పాక్ చేతిలోకి? సీఎం జగన్ షెడ్యూల్ సోమవారం ఉదయం 9.30 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట చేరుకుంటారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడతారు. కూనవరం బస్టాండ్ సెంటర్లో కూనవరం, వీఆర్ పురం మండలాల వరద బాధితులతో సమావేశం అవుతారు. అనంతరం ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గొమ్ముగూడెం చేరుకుంటారు. అక్కడ వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత వరద బాధిత కుటుంబాలతో సమావేశమవుతారు. సాయంత్రానికి రాజమహేంద్రవరం ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. మంగళవారం ఉదయం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపులంక చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం తానేలంక రామాలయంపేట గ్రామం వెళతారు. అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు. ఆ తర్వాత అయినవిల్లి మండలం తోటరాముడివారిపేట, కొండుకుదురు చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
పోలవరం వద్ద పెరుగుతున్న వరద.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
సాక్షి, ఏలూరు జిల్లా : ఎగువను కురుస్తున్న వర్షాలకు పోలవరం వద్ద గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్‌వే వద్ద 32.390 మీటర్ల నీటిమట్టం పెరిగింది. వరద పోటెత్తడంతో డ్యాం 48 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. స్పిల్ వే గేట్ల నుంచి 7 లక్షల 43 వేల 352 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. స్పిల్ వే దిగువన 24 మీటర్లకు గోదావరి నీటిమట్టం చేరింది. గోదావరి వరదల నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు జిల్లా పరిధిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 1800 233 1077 జంగారడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 9553220254 కుక్కునూరు తహశీల్దార్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 7013128597,9848590546 వేలేరుపాడు తహశీల్దార్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 6309254781 తూ.గో. జిల్లా: ధవళేశ్వరంలో గోదావరి ఉధృతి కొనసాగుతోంది. కాటన్ బ్యారేజ్ వద్ద 10.8 అడుగులకు నీటి మట్టం చేరింది. 8.48 లక్షల క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాల్వలకు 11వేల క్యూసెక్కులు విడుదల చేశారు అధికారులు. చదవండి: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ వదలని వాన.. వరదలా.. -
అమానవీయ ఘటన.. కన్న కూతుళ్లనే రెండో భర్త పరం చేసిన మహిళ
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి హేయమైన చర్య ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. సంతానం కోసం కన్న కూతుళ్లనే రెండో భర్త పరం చేసింది తల్లి పుట్ట విజయ లక్ష్మి. సదరు మహిళకు ఇద్దరు ఆడపిల్లలు కాగా, భర్త మరణించగా మేనత్త కొడుకు సతీష్‌ను రెండో పెళ్లి చేసుకుంది. తనకు పిల్లలు కావాలని, లేకపోతే మరో పెళ్లి చేసుకుంటానంటూ సతీష్ బెదిరించడంతో వేరే పెళ్లి వద్దని, తన ఇద్దరు కుమార్తెలతోనే పిల్లల్ని కనాలని రెండో భర్తకు అప్పగించింది. 17 ఏళ్ల పెద్ద కుమార్తె 2017లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తర్వాత మగ పిల్లవాడి కోసం తన రెండో కుమార్తెనూ భర్తకు అప్పగించింది. ఆమెకు ఏడాది క్రితం మగశిశువు పుట్టి మృతి చెందాడు. భార్య భర్తల మధ్య విభేదాలతో వ్యవహారం బయటపడింది. విషయం తెలిసిన బంధువులు ఏలూరు దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులు సతీష్, విజయలక్ష్మిలను అదుపులోకి తీసుకుని పొక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: హైదరాబాద్: టీవీ సీరియల్ నటి అదృశ్యం -
‘బతకాలని ఉన్నవారు వెళ్లిపోండి.. ఇక నుంచి ఇలాంటివే జరుగుతాయి’
బుట్టాయగూడెం: ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం పులిరామన్నగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. హాస్టల్లో నిద్రపోతున్న నాలుగో తరగతి విద్యార్థి గోగుల అఖిల్‌వర్ధన్‌రెడ్డి (9) దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అటవీ ప్రాంతంలో గల శివారు గ్రామం ఒర్రింకకు చెందిన గోగుల శ్రీనివాసరెడ్డికి ఇద్దరు భార్యలు. వారిద్దరు అక్కచెల్లెళ్లు. మొదటి భార్య లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు, రెండో భార్య రామలక్ష్మికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. రామలక్ష్మి రెండో కుమారుడైన అఖిల్‌వర్ధన్‌రెడ్డి గత ఏడాది ఈ ఆశ్రమ పాఠశాలలో మూడో తరగతిలో చేరాడు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి 10 గంటలకు తోటి విద్యార్థులతో కలిసి వసతిగృహంలో నిద్రపోయాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వసతిగృహం పక్కవైపు కిటికీలో నుంచి లోపలికి ప్రవేశించి టార్చ్లైట్తో అఖిల్‌వర్ధన్‌రెడ్డిని గుర్తించి మరీ బయటకు తీసుకువెళ్లారు. దుండగులు తీసుకెళ్లిన అఖిల్‌వర్ధన్‌రెడ్డి తెల్లవారేసరికి పాఠశాల ఆవరణ సమీపంలో శవమై కనిపించాడు. మృతుడి చేతిలో ఒక లెటర్ ఉంది. దాన్లో ‘బతకాలని ఉన్నవారు వెళ్లిపోండి.. ఎందుకంటే ఇకనుంచి ఇలాంటి సంఘటనలే జరుగుతాయి..’ అని రాసి ఉంది. అఖిల్‌వర్ధన్‌రెడ్డి మెడ నల్లగా కమిలిపోయి ఉంది. కాలితో తొక్కి చంపి ఉండవచ్చని భావిస్తున్నారు. మర్మాంగాలు చితికిపోయి ఉన్నాయని, వీపుపై గాయాలున్నాయని వైద్యులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ మేరీ ప్రశాంతి.. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు తెలిపారు. ఏలూరు నుంచి తీసుకొచ్చిన పోలీస్ జాగిలం సహాయంతో గాలించారు. -
‘జన్మభూమి కమిటీల దోపిడీలు పవన్‌కు ఇష్టమేమో..?’
సాక్షి, ఏలూరు: పవన్ కల్యాణ్ పోరాటం.. ఆరాటం అంతా చంద్రబాబు కోసమేనని మాజీ మంత్రి ఆళ్లనాని మండిపడ్డారు. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్.. వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం ఏలూరులో ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆళ్ల నాని.. ‘ వాలంటీర్లపై నీచంగా మాట్లాడతావా?, పవన్ కన్నా క్రిమినల్ ఎవరున్నారు..?, నీ గెలుపు మీదే నీకు నమ్మకం లేకపోతే.. నీ పార్టీవాళ్ళు నిన్నెలా నమ్ముతారు?, పవన్ పోరాటం.. ఆరాటం.. అంతా బాబు కోసమే. జగన్ గద్దెదించి.. మరి ఎవర్ని గద్దెనెక్కిస్తాడో చెప్పే ధైర్యం లేని వ్యక్తి పవన్. చంద్రబాబు హయాంలో కాగ్ అక్షింతలు వేయని సంవత్సరం ఏదైనా ఉందా..?, జగన్‌ని ఏకవచనంతో పిలిచే అర్హత నీకెక్కడిది?,–వందజన్మలెత్తినా జగన్ స్థాయికి చేరుకోలేవు. బాబు అధికారం కోసం చేసే నీ పోరాటం వృథానే’ అని ఆళ్ల నాని ధ్వజమెత్తారు. ఆళ్ల నాని ఏమన్నారంటే.. రాజకీయ అవగాహన లేని నాయకుడు పవన్ వారాహి అపజయ యాత్రలో భాగంగా పవన్‌కళ్యాణ్ నిన్న ఏలూరులో కొంతమంది జనసేన కార్యకర్తలతో మీటింగ్ పెట్టాడు. రాజకీయపార్టీ పెట్టి పదేళ్లు దాటిన తరుణంలో తమ పార్టీ గురించి, తాము ఏ దశలో ఉన్నామో ఆపార్టీ అధినేతగా ఆయన కార్యకర్తలకు వివరిస్తారేమోనని అందరూ ఎదురు చూశారు. అయితే, పవన్‌కళ్యాణ్ మాత్రం ఎప్పటిలాగానే తన రాజకీయ అవగాహన లేమిని ప్రదర్శించుకున్నారు. ఆయనకు ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై.. నియోజకవర్గాల్లోని ప్రజా సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదు. కేవలం, ఆయన మిడిమిడి జ్ఞానంతో వారాహి యాత్ర మొత్తం బూతులు, దూషణలతోనే సాగుతుంది. ప్రభుత్వ పనితీరుపై బురదజల్లే ఆరోపణలు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత దూషణలకే పవన్‌కళ్యాణ్ పరిమితమయ్యాడు. ప్రజాప్రతినిధులను నోటికొచ్చినట్లు తిట్టడమే కాకుండా.. చివరికి ప్రజల్ని కూడా ‘మీరు నాకు ఓట్లేయలేదు’ అని తన అక్కసు వెళ్లగక్కిన పవన్‌కళ్యాణ్ తీరు అందరూ చూస్తున్నారు. వారాహి యాత్రను ప్రజలు అసహ్యించుకుంటున్నారు మొదటి యాత్రంటే ఏదో తెలిసీ తెలియనితనంతో ముగించాడనుకుందాం. రెండోవిడత యాత్ర ప్రారంభంతోనే నిన్న పవన్‌కళ్యాణ్ మరింత దిగజారిపోయి ప్రవర్తించాడు. ఆయన మాటల్ని చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతీ వ్యక్తి అసహ్యించుకునే పరిస్థితికి వచ్చేశాడు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను తిడుతున్నాడు. మా నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని వ్యక్తిగతంగా ఏకవచనంతో మాట్లాడుతాడు. చివరికి ఈ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన ప్రజాసేవలందించే వాలంటీర్లను కూడా వదిలిపెట్టకుండా పవన్‌కళ్యాణ్ దూషిస్తున్నాడు. ఒక రాజకీయ సిద్ధాంతం, రాజకీయ లక్ష్యం లేకుండా వారాహి యాత్ర పేరుతో ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్న పవన్‌కళ్యాణ్ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఏలూరు సభలో పవన్‌కళ్యాణ్ ఇక్కడి ప్రజల్ని ఉద్దరించే మాటలేమైనా చెబుతాడేమోనని అందరూ ఎదురుచూశారు. చంద్రబాబుతో కలిసి ఆయన రాబోయే కాలంలో ప్రజల్ని ఉద్ధరించడానికి ఎలాంటి మ్యానిఫెస్టోను ప్రకటించబోతున్నారోనని చూసినవాళ్లకు చివరికి నిరాశే మిగిలింది. ఏలూరు సభ నుంచే తాను ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో పిలుస్తానంటూ అదేదో ప్రజలకు మేలు చేసే మ్యానిఫెస్టో అంశంగా ప్రకటించడం ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేసింది. పిచ్చిపిచ్చిగా నోటికొచ్చినట్లు వాగే పవన్‌కళ్యాణ్‌కు అసలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి పేరును ఉచ్ఛరించే అర్హత కూడా లేదని మనవి చేసుకుంటున్నాను. మా నాయకుడ్ని ఏకవచనంతో పిలవడానికి పవన్‌కళ్యాణ్ ఎవరు..? అసలు, నీ స్థాయి.. నీ అర్హతలేంటని ప్రశ్నిస్తున్నాను. గ్లామర్ తగ్గుతుందనే పాదయాత్ర చేయలేదా..? గతంలో ఒకసారి ఇదే పవన్‌కళ్యాణ్ పాదయాత్ర చేస్తానన్నాడు. కొంతకాలానికి నేను పాదయాత్ర చేస్తే శాంతిభద్రతల సమస్య వస్తుంది. నా పాదయాత్రతో ప్రజలకు నష్టం కలిగే ప్రమాదముందని ఆయన నోటితో కుంటిసాకులు చెప్పాడు. పాదయాత్ర ప్రతిపాదనను విరమించుకున్నాడు. నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్న విషయమేంటంటే, ‘నువ్వు ప్రజల మధ్యకు వెళ్లే సువర్ణావకాశమైన పాదయాత్రను ఎందుకు కాదనుకున్నావు..? ఎండలో, వానలో తిరిగి ప్రజల మధ్య నలిగి నల్లగా నువ్వు కమిలిపోతే.. నీకు సినిమా అవకాశాలు రావనే భయంతోనే పాదయాత్ర చేయంది..? అంటే, నీకు ప్రజాసేవ చేయాలనే తపన లేదు కనుకనే ప్రజల మధ్య తిరిగే సువర్ణావకాశాన్ని గ్లామర్ కోసం వదులుకున్నావు.’ దీన్నిబట్టి చూస్తే నీకు ప్రజల మేలు కంటే... నీకు డబ్బు తెచ్చిపెట్టే సినిమాలే ఎక్కువని అందరికీ అర్ధమవుతుంది కదా..? వందజన్మలెత్తినా జగన్ గారి స్థాయికి చేరుకోలేవు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలపై అవగాహన చేసుకున్న నాయకుడు జగన్మోహన్రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రతీ హామీని నెరవేర్చారు. ఇప్పటికే 99.5 శాతం మ్యానిఫెస్టో హామీల్ని అమలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారితో పవన్‌కళ్యాణ్‌కు ఎక్కడ పోలిక ఉంది..? నువ్వు వందజన్మలెత్తినా మా నాయకుడు జగన్ గారి స్థాయికి చేరుకోలేవు. లేనిపోని వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయ లబ్ధిని పొందాలనుకునే వపన్‌కళ్యాణ్ ప్రయత్నాలు ఆకాశం మీద ఉమ్మేసిన చందంగా ఉంటాయనడంలో సందేహమేదీలేదు. పవన్ అబద్ధాలకు అంబేద్కర్ ఆత్మక్షోభిస్తుంది? పట్టుమని పది అసెంబ్లీ నియోజవర్గాల్లో పర్యటించక ముందే పవన్‌కళ్యాణ్‌లో అంత నిరాశా నిస్పృహలెందుకు..? ఎవరి మీద ఆయన అక్కసు..? ఈరోజు ఆయన సభకొచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా మా జగన్‌గారికే ఓటేస్తామని బహిరంగంగా చెబుతుంటే.. తనను ఎందుకు గెలిపించరని పవన్‌కళ్యాణ్‌లో అసహనం పెరిగిపోతుంది. అంబేద్కర్ మహానుభావుడి సాక్షిగా అన్నీ నిజాలే మాట్లాడుతానని చెబుతూ.. అన్నీ అబద్ధాలే మాట్లాడాడు నిన్న పవన్‌కళ్యాణ్. అయన మాట్లాడిన దూషణలకు ఆ అంబేద్కర్ మహానుభావుడే చిన్నబుచ్చుకుని ఆయన ఆత్మ క్షోభించి ఉంటుందని ప్రజలంతా అనుకున్నారు. వాలంటీర్లపై నీచపు మాటలా? వాలంటీర్ వ్యవస్థ పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా నీచాతీ నీచంగా మాట్లాడిన పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యల్ని మేం ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన అద్భుతమైన సంస్కరణల్లో సచివాలయాలు- వాలంటీర్ వ్యవస్థ ఒకటి. మహాత్మ గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నెరవేరుస్తున్న ఈ వాలంటీర్లు ప్రభుత్వ సేవలన్నింటినీ ఇంటి గడప వద్దకే తీసుకొస్తూ.. ప్రతీ ఇంటిలో ఒక అక్క, చెల్లెలు, తమ్ముడు, అన్నగా కనిపిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు. అలాంటి పవిత్రమైన వాలంటీర్ వ్యవస్థను అగౌరవపరచడానికి నీకు సిగ్గుందా.. పవన్‌కళ్యాణ్..? ఈరోజు ఎక్కడా పైసా అవినీతి లేకుండా ప్రభుత్వసేవల్ని పారదర్శకంగా అందిస్తున్న వ్యవస్థే ఈ వాలంటీర్ వ్యవస్థ. ఇప్పటికైనా నీ మాటలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని హితవు పలుకుతున్నాను. జన్మభూమి కమిటీల దోపిడీలు పవన్‌కు ఇష్టమేమో..? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలంటూ... ప్రతీ పనికీ లంచం సమర్పించాలంటూ హుకుం చేసిన గత జ్ఞాపకాలు ప్రతీ ఒక్కరికీ తెలుసు. చివరికి వృద్ధులకు పింఛన్లు ఇవ్వాలన్నా కూడా గంటల తరబడి పడిగాపులుతో లంచాలిచ్చుకుని పింఛన్లు తీసుకున్న పరిస్థితి. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలోనూ జన్మభూమి కమిటీల అవినీతి అంతా ఇంతా కాదు. ఇవన్నీ అప్పట్లో ఈ పవన్‌కళ్యాణ్‌కు బాగా ఇష్టమైన కార్యక్రమాలుగా ఉన్నాయేమో..ఇవన్నీ ఏమీలేకుండా అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ఇప్పటి వాలంటీర్ వ్యవస్థంటే పవన్‌కు ఎందుకు నచ్చడంలేదు..? అత్యంత నిస్వార్థంగా జగన్ గారి స్ఫూర్తితో ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతూ మహత్తరమైన ప్రజాసేవ చేసే వాలంటీర్లంటే మీకెందుకు కక్ష అని ప్రశ్నిస్తున్నాను. ఇందుకు పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి. పవన్‌కళ్యాణే పెద్దక్రిమినల్ కోవిడ్ సమయంలో ఇక్కడ ప్రజల్ని పట్టించుకోకుండా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ లు.. హైదరాబాద్‌లో తమ ప్యాలెస్‌లలో కూర్చొన్నారు. అయితే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల్ని కోవిడ్ సమయంలో ఆదుకునే కార్యచరణ ప్రణాళికలో ఈ వాలంటీర్ల వ్యవస్థ భాగస్వామ్యం అయింది. వాలంటీర్లు అందరూ తమ ప్రాణాల్ని లెక్కచేయకుండా ఇంటింటా సర్వేలు చేశారు. వైద్యసాయం అందించారు. ఆనాడు వాలంటీర్ల చొరవ కారణంగా ఇంటింటా ప్రభుత్వసేవలందాయి. అలాంటి వాలంటీర్లను పట్టుకుని మీరు మెచ్చుకోకపోయినా పర్వాలేదు. వాలంటీర్లను బ్రోకర్లు, క్రిమినల్స్ అంటూ పవన్‌కళ్యాణ్ మాట్లాడటానికి సిగ్గుందా..లేదా..? అని అడుగుతున్నాను. నిజానికి ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా ప్రజల్ని రెచ్చగొడుతున్న పవన్‌కళ్యాణ్ అనే వ్యక్తే పెద్ద క్రిమినల్ అని చెబుతున్నాను. వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలి పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ.. తనను, తన భార్యాబిడ్డల్ని ఎవరో అసభ్యంగా మాట్లాడుతున్నారని మొసలికన్నీరు పెడుతున్నారే.. మరి, ఈరోజు మీరు వాలంటీర్లను పట్టుకుని బ్రోకర్లు, క్రిమినల్స్ అంటే వారి కుటుంబాలు రోధించవా..? వారి ఏడుపు మీకు శాపంగా మారదా..? అని ప్రశ్నిస్తున్నాను. కనుక, ఇప్పటికైనా నువ్వు ఫ్రస్టేషన్లో మాట్లాడిన మాటల్ని వెనక్కితీసుకుని వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. చంద్రబాబు కోసం చేసే నీ పోరాటం వృథానే పట్టుమని పది నియోజకవర్గాల సమస్యలపై కూడా అవగాహన లేని పవన్‌కళ్యాణ్ ఎవరికోసం పోరాటం చేస్తున్నాడు. ఆయన ఎక్కడ పోటీ చేస్తాడో.. ఎక్కడ గెలుస్తాడో.. ఆయనకే దిక్కులేదు. మాటకొస్తే ప్రతీచోటా జగన్‌గారిని గద్దె దించాలంటూ పిలుపునిస్తున్నాడు కదా..? మరి, జగన్‌గారిని గద్దె దించితే.. ఆ తర్వాత గద్దెనెక్కేది ఎవరు..? పవన్‌కళ్యాణ్ మనసులో ఉన్నదేంటో బయటపెట్టాలి కదా..? చంద్రబాబును ఎక్కిస్తాడా..? లేదంటే, లోకేశ్‌ను గద్దెనెక్కిస్తాడా..? చంద్రబాబు అనే ప్రజాకంటకుడ్ని, దుర్మార్గుడ్ని అధికారంలోకి తెచ్చేదాకా పోరాటం చేస్తానని ఆరాటపడుతున్నాడు. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలతో బురదజల్లినా.. మా జగన్‌గారిని వ్యక్తిగతంగా దూషించినా.. ఊగినా తూగినా కూడా పవన్‌కళ్యాణ్ ప్రయత్నాలన్నీ వృథాప్రయాసే. ఎందుకంటే, గతంలో చంద్రబాబుతో జతకట్టి, అధికారంలోకి వచ్చాక, టీడీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలపై నోరుమెదపని పవన్‌కళ్యాణ్ అంటేనే ప్రజలకి విరక్తి కలిగింది. కనుక, ఇప్పుడు ఆయన ఎన్ని యాత్రలతో ప్రజల్ని నమ్మించాలని చూస్తే వారు నమ్మరుగాక నమ్మరని స్పష్టంచేస్తున్నాను. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు 175 చోట్లా వైఎస్ఆర్సీపీకే ప్రజా మద్ధతు ఉంటుందని, మరలా శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారని ధీమాగా చెబుతున్నాను. ఏలూరు అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నా నేను ఏలూరు ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే.. నామీద పవన్‌కళ్యాణ్ ఏవేవో గాలిపోగేసి మాట్లాడినంత మాత్రానా ఎవరూ నమ్మరు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల నిమిత్తం ఇప్పటికే రూ.150 కోట్లతో ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపాం. సుమారు రూ.500 కోట్లతో ఏలూరు మెడికల్ కళాశాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడేదో అంతుచిక్కని వ్యాధులు ప్రబలుతున్నాయంటూ పవన్‌కళ్యాణ్ ఏవేవో అవగాహరాహిత్యంతో మాట్లాడుతున్నాడు. గతంలో ఇక్కడ ఒక అంతుచిక్కని వ్యాధి ప్రబలినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు తరచూ సమీక్షలు జరిపి, ఢిల్లీనుంచి ఐసీఎంఆర్ నిపుణుల్ని పిలిపించి సర్వే చేయించి వారిచ్చిన నివేదిక ప్రకారం రూ.300 కోట్లతో ఏలూరుకు గోదావరి జలాల్ని తెచ్చే ప్రాజెక్టును కూడా త్వరలో ప్రారంభించనున్నాం. ఇప్పటికైనా పవన్‌కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే.. ప్రజలు వారాహిని అడ్డుకుని మీకు తగిన బుద్ధిచెబుతారని హెచ్చరిస్తున్నాను. -
నువ్వే కావాలి అంటూ లవ్ ప్రపోజ్.. క్లోజ్‌గా వీడియో కాల్స్ మాట్లాడి..
సాక్షి, ఏలూరు: సోషల్ మీడియాలో హాయ్ అంటూ ఆమెకు దగ్గరయ్యాడు. ప్రతీరోజూ చాటింగ్, కాల్స్ చేసి ఆమెకు నమ్మకం కలిగించాడు. ఇంతలోనే నువ్వంటే ఇష్టమని మనసులోని మాట తనకు చెప్పేశాడు. తర్వాత తన అసలు రంగు బయటపెట్టాడు యువకుడు. వీడియో కాల్ చేసి ఆమెతో అసభ్యకరంగా మాట్లాడుతూ.. వీడియోలు రికార్డు చేశాడు. అనంతరం.. ఆమెను వేధింపులకు గురిచేశాడు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. రంగుల రాజాను అదుపులోకి తీసుకున్నాడు. వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన నవీన్.. ఇన్స్‌స్టాగ్రామ్‌లో హైదరాబాద్‌లో ఎంబీఏ చేస్తున్న యువతితో పరిచయం పెంచుకున్నాడు. తరుచు ఆమెతో చాటింగ్, కాల్స్ చేస్తూ చనువుతో మెదిలాడు. ఇలా కొద్దిరోజులు గడిచాక.. ఆమెను ప్రేమిస్తున్నానంటూ మనసులోని కపట ప్రేమను వ్యక్తం చేశాడు. అతడి మాటలు నమ్మిన బాధితురాలు నవీన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో, స్పీడ్ పెంచిన నవీన్.. యువతితో చనువు పెంచుకుని వీడియో కాల్స్ చేస్తూ అసభ్యకరంగా వీడియోలు తీసి రికార్డు చేసుకున్నాడు. ఇక, కొద్దిరోజులు గడిచిన తర్వాత వారిద్దరూ ఏకాంతంగా మాట్లాడుతున్న వీడియోలను ఆమెకు చూపించిన బెదిరింపులకు దిగాడు. డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. తాను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలను ఆమె బంధువులకు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించి బాధితురాలు దగ్గరి నుంచి రూ.25వేలు వసూలు చేశాడు. తాజాగా వీడియోలను అడ్డుపెట్టుకుని మరో లక్ష రూపాయాలు డిమాండ్ చేశాడు. దీంతో, చేసేదేమీ లేక బాధితురాలు ఈ విషయాన్ని తన పేరెంట్స్ చెప్పింది. ఈ క్రమంలో వారంతా కలిసి ఓ ప్లాన్ చేశారు. తన ఇంటి వద్దే నవీన్‌కు డబ్బులు ఇస్తానని చెప్పి.. అక్కడికి రావాలని కోరింది. ఈ క్రమంలో నవీన్.. ఆమె ఇంటి వద్దకు రావడంతో.. అతడిని పట్టుకోవాలని వారు ప్రయత్నించారు. నవీన్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో, బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నవీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: ఘాతుకం: కళ్లకు గంతలు.. కాళ్లు చేతులు వైర్లతో కట్టేసి.. ప్రేయసిని పూడ్చిపెట్టాడు -
ఏలూరు జిల్లా టీడీపీ బహిరంగ సభలో అపశ్రుతి
సాక్షి, ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లా టీడీపీ బహిరంగ సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో టీడీపీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. సభలో చినరాజప్ప మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా స్టేజీ కుప్ప కూలిపోయింది. దీంతో చినరాజప్ప, మాగంటి బాబు, పీతల సుజాత, చింతమనేని ప్రభాకర్ కింద పడిపోయారు. పలువురు టీడీపీ నేతలు గాయపడ్డారు. వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చదవండి: ‘ఎల్లో మీడియా నుంచి స్క్రిప్ట్.. ఓ పథకం ప్రకారం కథ’ -
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం వైఎస్ జగన్
-
ఆర్బీకేల పనితీరు బాగుంది
భీమడోలు: రైతులకు అనేక రకాల సేవలందిస్తున్న రైతు భరోసా కేంద్రాల పనితీరు బాగుందని స్వచ్ఛ భారత్ మిషన్ సంయుక్త కార్యదర్శి, జలశక్తి శాఖ డైరెక్టర్ జితేంద్ర శ్రీవాత్సవ కొనియాడారు. స్వచ్ఛాంధ్ర మిషన్ కార్యక్రమంలో పారిశుధ్య పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన ఏలూరు జిల్లా భీమడోలు, దుద్దేపూడి గ్రామ పంచాయతీలను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ జె. వెంకట మురళీతో కలిసి జితేంద్ర శ్రీవాత్సవ సందర్శించారు. ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాల తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతీరును సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులపై హౌసింగ్ అధికారులను అడిగారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న సచివాలయ వ్యవస్థలోని ప్రతి విభాగం పనితీరు, అది ఏ విధంగా ఉపయోగపడుతున్నదీ వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వెల్నెస్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. తొలుత సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్, మత్స్యశాఖ సహాయకులు, ఇంజనీరింగ్ శాఖల సహాయకులు జాబ్‌చార్ట్‌తో పాటు వారు చేసే సేవలపై ఆరా తీశారు. మంచి స్పర్శ.. చెడు స్పర్శ (గుడ్ టచ్.. బ్యాడ్ టచ్) కార్యక్రమంపై నువ్వేం చేస్తావు.. అంటూ మహిళా కానిస్టేబుల్ని ప్రశ్నించగా.. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలుచేస్తోందని, తాను ఉన్నత పాఠశాలల బాలికలు, కళాశాలల్లో యువతులు, డ్వాక్రా మహిళలకు దీనిపై విస్తృత ప్రచారం చేస్తూ అవగాహన కలి్పస్తున్నానని ఆమె తెలిపింది. కియోస్క్ పనితీరుపై ఆరా.. ఆ తర్వాత రైతుభరోసా కేంద్రంలోని కియోస్క్ యంత్రాన్ని చూసిన ఆయన వీఏఏ (విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్) రూప నుంచి ఈ యంత్రం ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఆరా తీశారు. కియోస్క్ యంత్రంలో రైతులు తమకు కావాల్సిన ఎరువులను బుక్ చేసుకుంటారని, వాటి నగదును చెల్లిస్తే రైతుల చెంతకే ఎరువులు చేరుకుంటాయని ఆమె వివరించారు. రైతులకు మద్దతు రేటుకే అందుబాటులో ఉంటున్నాయని, ఈ విధానంలేని తరుణంలో రైతులు దళారుల వద్ద ఎక్కువ రేటుకు కొనుగోలు చేసుకునేవారని ఎండీ జె. వెంకటమురళి ఆయనకు వివరించారు. అక్కడే ఉన్న సర్పంచ్ పాము సునీతామాన్‌సింగ్‌ను కియోస్క్ యంత్రం రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతోందని ప్రశ్నించారు. ఆర్బీకే సేవలవల్ల రైతులు సంతృప్తికరంగా ఉన్నారని, ఈ విధానం లేనప్పుడు రైతులు సాగుకు తీవ్ర ఇబ్బందులు పడేవారని సర్పంచ్ వివరించారు. దీంతో రైతుభరోసా కేంద్రాల పనితీరు బాగుందని, రైతులకు సంతృప్తికరమైన సేవలు అందుతాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయ ప్రాంగణంలో జితేంద్ర శ్రీవాత్సవ మొక్కలు నాటారు. నూజివీడు సబ్‌కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ఈడీ ఊరి్మళాదేవి, జెడ్పీ సీఈఓ కేవీఎస్ఆర్ రవికుమార్, డీపీఓ ఏవీ విజయలక్షి్మ, ఎంపీపీ కనమాల రామయ్య, జెడ్పీటీసీ తుమ్మగుంట భవానీరంగ, కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పోలవరం చేరుకున్న సీఎం వైఎస్ జగన్
-
సీఎం జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి
-
రేపు సీఎం జగన్ పోలవరం పర్యటన..
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(మంగళవారం) పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం.. అధికారులతో ప్రాజెక్ట్‌పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: పబ్లిసిటీ కాదు.. బాధితులకు సేవచేయడం ముఖ్యం: మంత్రి అమర్నాథ్ -
ప్రపంచంలోనే భయం లేని జంతువు
దాదాపు 30 కిలోమీటర్ల మేర వినిపించేంత భీకరంగా అరిచే అరుదైన జీవి తేనె కుక్క. హనీ బ్యాడ్జర్గా పిలిచే ఈ వన్య జీవులు పాపికొండలు అభయారణ్యంలో సందడి చేస్తున్నాయి. చిన్నపాటి ఎలుగు బంటిని పోలినట్టుండే తేనె కుక్కలు సుమారు రెండేళ్ల క్రితం కర్ణాటకలోని కావేరి వన్య ధామంలో కనిపించాయి. ఇటీవల పాపికొండలు అభయారణ్యంలో సైతం వీటి జాడలు ట్రాప్ కెమెరాలకు భారీగానే చిక్కాయి. బుట్టాయగూడెం: తేనె కుక్కలుగా పిలిచే అరుదైన వన్యప్రాణి హనీ బ్యాడ్జర్ (రాటిల్) పాపికొండలు అభయారణ్యంలో కనువిందు చేస్తున్నాయి. 25 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికా అడవుల్లో మాత్రమే గుర్తించిన ఈ జీవులు పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలోనూ ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. వీటి ఎత్తు కేవలం 12 అంగుళాలు. తల నుంచి తెలుపు, తెలుపు గీతలతో కూడిన మందపాటి.. దట్టమైన నల్లని బొచ్చును కలిగి ఉండటం వీటి ప్రత్యేకత. తేనె కుక్కల పంజా గోళ్లు మూడు అంగుళాల వరకు పొడవు ఉన్నాయి. చూసేందుకు చిన్నపాటి ఎలుగుబంటి.. పెద్దగా ఉండే ముంగిసలా కనిపిస్తుంది. నడకలో మాత్రం కుక్కను పోలి ఉంటుంది. వీపుపై తెల్లని ఛాయలుండే నల్లని ఈ జీవి చూసేందుకు భీతి గొలుపుతుంది. ఈ జీవులకు పౌరుషంలో మరో వన్యప్రాణి సాటిరాదు. వీటికి అడవిలో లభించే తేనె తుట్టెల్లోని తేనెటీగ లార్వాలంటే ఎంతో ఇష్టం. అందుకే వీటికి హనీ బ్యాడ్జర్ అని పేరొచ్చింది. ఇతర కీటకాలు, కుందేళ్లను కూడా తింటాయి. వీటి ఆహారంలో 25 శాతం పాములే. కలుగుల్లో ఉండే కొండ ఎలుకల్ని సైతం ఇవి ఇష్టంగా తింటాయి. వీటిని చూస్తే జంతువులకు హడల్ తేనె కుక్కలను చూడగానే నక్కలు, తోడేళ్లు, ఎలుగుబంట్లు, ఏనుగులు హడలిపోతాయి. ఇవి కనిపిస్తే వాటికి దారిచ్చి తప్పుకుని వెళ్లిపోతాయి. ఇవి చాలా ధైర్యం గల ప్రాణులు. వీటి చర్మం ఎలాస్టిక్ మాదిరిగా సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. పదునైన పళ్లు ఉంటాయి. అడవిలో ఎంత పెద్ద క్రూర జంతువుతోనైనా ధైర్యంగా పోరాడగల జంతువు ఇది. పులి, చిరుత, కొండచిలువతోనైనా పోరాడుతుంది. పాము విషం కూడా వీటిని ఏమీ చేయలేదు. ప్రపంచంలోనే భయం లేని జంతువు హనీ బ్యాడ్జర్ ఒక్కటే అని అటవీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీటి జీవిత కాలం ఏడేళ్లు మాత్రమే. వాసనను పసిగట్టి ఆహారాన్ని సేకరించడంలో స్నిపర్ డాగ్‌ను మించిన నైపుణ్యం వీటి సొంతం. అరుదైన హనీ బ్యాడ్జర్ల సంచారం పాపికొండల అటవీప్రాంతంలో ఎక్కువగా∙ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. సుమారు 1,200 పైగా హనీ బ్యాడ్జర్లు ఇక్కడ ఉన్నట్టు ఇక్కడి ట్రాప్ కెమెరాలలో చిక్కిన జాడలను బట్టి తెలుస్తోందన్నారు. వీటి సంతతి పెరుగుతోంది అరుదైన హనీ బ్యాడ్జర్లు పాపికొండలు అభయారణ్యంలో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ధైర్యమైన జంతువుగా దీనికి పేరుంది. తేనెటీగల లార్వాను చాలా ఇష్టంగా తింటాయి. పులి, చిరుతతో పాటు ఎటువంటి జంతువుతోనైనా ఎదిరించి పోరాడగలవు. వీటి సంతతి 1,200కు పైగా ఉన్నట్టు అంచనా వేశాం. – దావీదు రాజునాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, ఏలూరు జిల్లా -
వర్షాలకు దెబ్బతిన్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం
-
ఆంధ్రా–తెలంగాణ రాష్ట్రాల మధ్య గ్రీన్‌ఫీల్డ్ రయ్.. రయ్!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆంధ్రా–తెలంగాణ రాష్ట్రాల మధ్య నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది భూసేకరణతో కలిపి రూ.4,609 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ను ఖరారు చేయగా.. ఏలూరు జిల్లా పరిధిలో రూ.1,281.31 కోట్లతో పనులు జరుగుతున్నాయి. రెండేళ్లలో హైవే నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నారు. భారతీమాల ప్రాజెక్టులో భాగంగా మంజూరైన ఈ రహదారి నిర్మించడం వల్ల కలిగే ప్రయోజనాలను కేంద్రానికి వివరించిన రాష్ట్ర ప్రభుత్వం.. తెలంగాణతో కాకినాడ పోర్ట్ అనుసంధానం చేయడానికి ఈ ప్రాజెక్టు కీలకమైనదని కేంద్రానికి నివేదించి ఈ ప్రాజెక్ట్ మంజూరు చేయించింది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల నుంచి జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం వరకు 4 లేన్ల రహదారి నిర్మాణానికి రూ.569.37 కోట్లు, గుర్వాయిగూడెం నుంచి దేవరపల్లి వరకు రూ.711.94 కోట్లను కేంద్రం కేటాయించింది. 53 కిలోమీటర్లు తగ్గనున్న దూరం ప్రస్తుతం ఖమ్మం–రాజమండ్రి నగరాల మధ్య దూరం 220 కిలోమీటర్లు. దీనిని 167 కిలోమీటర్లకు తగ్గించడానికి ఈ ప్రాజెక్టు కీలకంగా ఉపయోగపడనుంది. దీని నిర్మాణం పూర్తయితే ఖమ్మం–రాజమండ్రి మధ్య దూరం 53 కిలోమీటర్లు తగ్గుతుంది. ఏలూరు జిల్లాలో 72 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం నుంచి కల్లూరు మీదుగా వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట నుంచి ఆంధ్రాలో జీలుగుమిల్లిలోకి ప్రవేశించి జంగారెడ్డిగూడెం నుంచి కొయ్యలగూడెం గోపాలపురం, కొవ్వూరు మీదుగా రాజమండ్రి చేరుకోవాల్సి ఉంటుంది. నూతనంగా నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ రహదారి ఖమ్మం, సత్తుపల్లికి దూరంగా రేచర్ల నుంచి నేరుగా ఆంధ్రాలోని చింతలపూడి మండలంలో ఎండపల్లి నుంచి రా«ఘవాపురం, రేచర్ల మీదుగా టి.నరసాపరం, గుర్వాయిగూడెం మీదుగా దేవరపల్లి రహదారిలో కలుస్తుంది. భూసేకరణ పూర్తి ఈ రహదారి కోసం మొత్తం 1,411 ఎకరాల భూమి అవసరమవుతోంది. అందులో 114 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా.. 1,297 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు. ఇప్పటికే భూసేకరణ పనులు పూర్తయినట్టు అధికారులు వెల్లడించారు. 70 మీటర్ల వెడల్పుతో ఎకనామిక్ కారిడార్‌గా ఈ రహదారిని వర్గీకరించారు. గ్రీన్‌ఫీల్డ్‌తో జిల్లాకు ఉపయోగం గ్రీన్‌ఫీల్డ్ రహదారితో మెట్ట ప్రాంతంలో రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుంది. ఆంధ్రా–తెలంగాణ మ«ధ్య నూతన రహదారి వల్ల దూరం తగ్గడమే కాకుండా తెలంగాణ, కాకినాడ పోర్టు అనుసంధానానికి ఉపయోగపడుతుంది. –కోటగిరి శ్రీధర్, ఏలూరు ఎంపీ -
మరో అతిథికి చోటు: ప్రేమ పక్షులివి.. జీవిత కాలమంతా ఒక్క పక్షితో...
బుట్టాయగూడెం (ఏలూరు జిల్లా): బెంగాల్ పులులు.. బంగారు బల్లులు.. గిరి నాగులు.. అలుగులు.. అరెంజ్ ఓకలీఫ్ సీతాకోక చిలుకలు వంటి అరుదైన జీవజాలానికి నిలయమైన పాపికొండలు అభయారణ్యంలో తాజాగా మరో అతిథికి చోటు దక్కింది. కొమ్ము కత్తిరి (ఇండియన్ హార్న్‌బిల్) పక్షులకు ఈ అభయారణ్యం అలవాలంగా మారింది. ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పరిధిలో గలగల పారే అందాల గోదావరికి ఇరువైపులా 1,01,200 హెక్టార్లలో పాపికొండలు అభయారణ్యం విస్తరించి ఉంది. ఇక్కడ విలువైన వృక్షాలు, వివిధ జంతువులతో పాటు కొమ్ము కత్తిరి పక్షులు కిలకిలారావాలు ఆలపిస్తున్నాయి. కొన్నిచోట్ల వీటిని ఇబిరిత పక్షులని కూడా పిలుస్తారు. పొడవాటి ముక్కుతో ఉండే ఈ పెద్ద పక్షుల రెక్కలు నలుపు రంగులో ఉంటాయి. రెక్కల మధ్యలోని తెలుపు చారలు అవి ఎగురుతున్నప్పుడు మెరుస్తుంటాయి. పాపికొండలు అభయారణ్యంలో ఈ అరుదైన పక్షులు బాలాజీ అనే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ కెమెరాకు చిక్కాయి. జీవితమంతా ఒక పక్షితోనే.. ఈ పక్షులు పండ్లు, పురుగులను ఆహారంగా తీసు కుంటాయి. ఇవి జీవిత కాలమంతా ఒక పక్షితోనే జత కడతాయి. వీటికి ప్రేమ పక్షులనే పేరు కూడా ఉంది. ఆడ, మగ పక్షులు జతగా ఉంటాయి. గుడ్లు పొదిగే సమయంలో ఆడ పక్షికి కావాల్సిన ఆహారం, గూడు సమకూర్చే బాధ్యత మగ పక్షి తీసుకుంటుంది. చెట్లలో సహజంగా ఉండే తొర్ర లనే ఇవి గూడుగా ఏర్పాటు చేసుకుని వాటిలో నివసిస్తాయి. హార్న్‌బిల్ ఆడ పక్షి సుమా రు 4 నెలలపాటు గూట్లోనే ఉంటూ గుడ్లు పెట్టి పొదుగుతుంది. ఆ సమయంలో మగ పక్షులే ఆహారాన్ని తీసుకొచ్చి చెట్టు తొర్రల కన్నం ద్వారా ఆడ పక్షికి తినిపిస్తాయి. పిల్లలు పుట్టాక తల్లి, పిల్ల పక్షులకు సైతం ఆహారం తీసుకొచ్చి పెడుతుంటాయి. పోలవరం పరిసర ప్రాంతాల్లో.. పాపికొండలు అభయారణ్యంలో వీటిలో అత్యధికంగా 150 వరకు ఇండియన్ హార్న్‌బిల్ జాతి పక్షులు ఉన్నట్టు వైల్డ్‌లైఫ్ అధికారులు చెప్పారు. పోలవరం మండలంలోని శివగిరి, సిరివాక, పేరంటాలపల్లి, కొరుటూరు తదితర ప్రాంతాల్లో ఈ పక్షులు ఎక్కువగా సంచరిస్తున్నాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల పలు గ్రామాలు ముంపు ప్రభావిత ప్రాంతాలుగా మారడంతో అనేక గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. దీంతో ఆయా గ్రామాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఈ పక్షులు ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే వీటి సంతతి పెరుగుతున్నట్టు గుర్తించామని వైల్డ్‌లైఫ్ అధికారులు వెల్లడించారు. వన్య ప్రాణుల సంరక్షణపై ప్రత్యేక చర్యలు పాపికొండల అభయారణ్యంలో జీవవైవిధ్యం పెరిగింది. అరుదైన జంతువులు, పక్షుల సంఖ్య కూడా పెరుగుతోంది. వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం సరిహద్దుల్లో బేస్ క్యాంప్‌లు ఏర్పాటు చేశాం. ప్రత్యేక బృందాల ద్వారా పహారా కాసే ఏర్పాట్లు చేశాం. వన్యప్రాణులను వేటాడాలని చూస్తే కఠిన శిక్షలు తప్పవు. – దావీద్‌రాజు నాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పోలవరం -
ఏలూరు జిల్లాలో రెచ్చిపోతున్న కలప స్మగ్లర్లు
-
గ్రామగ్రామాన జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం
-
ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ప్రత్యేక ప్రణాళిక
-
దురంతో ఎక్స్‌ప్రెస్ కు తృటిలో తప్పిన ప్రమాదం
-
ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం
మన ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో పొదుపు సంఘాల పని తీరు ఎలా మారిందో అందరికీ కనిపిస్తోంది. గత ప్రభుత్వ పాలనలో దెబ్బతిన్న పొదుపు సంఘాల ఉద్యమం మళ్లీ ఊపిరి పోసుకుంది. తద్వారా ఈ రోజు 91 శాతానికి పైగా సంఘాలు ఏ, బీ గ్రేడ్లలో కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 18 శాతం సంఘాలు ఎన్పీఏలు.. ఓవర్ డ్యూస్గా ఉంటే, ఈ రోజు అది కేవలం 0.45 శాతం మాత్రమే. అక్కచెల్లెమ్మల పట్ల మన ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమని.. అక్క చెల్లెమ్మలకు విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కల్పించాలని తపిస్తున్న ప్రభుత్వమని, ఇక్కడికి విచ్చేసిన తన అక్కచెల్లెమ్మలే ఇందుకు నిదర్శనమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మహిళలు అన్ని విధాలుగా ఎదగాలని, బాగు పడాలని.. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఇంటి నుంచి రావాలన్న తపన, తాపత్రయంతో గత 45 నెలల పాలన సాగిందని చెప్పారు. ఇప్పటిదాకా వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు రూ.2.25 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఏలూరు జిల్లా దెందులూరులో శనివారం ఆయన వైఎస్సార్ ఆసరా పథకం కింద మూడో విడత నగదు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పది రోజుల పాటు ప్రతి మండలంలో జరగబోయే ఆసరా సంబరాల్లో రాష్ట్రంలో 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా రూ.6,419 కోట్లు జమ చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కేవలం 45 నెలల్లోనే మహిళా సాధికారత విషయంలో మనందరి ప్రభుత్వం తీసుకు వచ్చిన మార్పులు, ఫలితాలు ఎంత గొప్పగా ఉన్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ‘నా పాదయాత్ర సందర్భంగా ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ మీ తమ్ముడిగా, అన్నగా మాటిచ్చాను. ఆ రోజు నేను విన్నాను, నేను మీ బాధలు చూశాను, నేను ఉన్నాను అని చెప్పిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తోడుగా ఉంటూ వచ్చాను. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 2019 మార్చి 31 వరకు ఉన్న రూ.25,500 కోట్లకు పైగా రుణాల విషయంలో తోడుగా ఉంటామని చెప్పాం. తద్వారా 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే రెండు వాయిదాల్లో రూ.12,758 కోట్లు ఇచ్చాం. ఈ రోజు నుంచి ప్రారంభమై.. పది రోజుల పాటు జరిగే ఆసరా పండగ కార్యక్రమంలో మరో రూ.6,419 కోట్లు నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయి. మొత్తంగా రూ.19,178 కోట్లు లబ్ధి చేకూర్చాం’ అని చెప్పారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం వ్యాపార పరంగా అండగా నిలిచాం ► పొదుపు సంఘాలకు ఇస్తున్న ఆసరా డబ్బు ఎలా ఖర్చు చేసుకోవాలన్నది అక్కచెల్లెమ్మల అభిమతానికి వదిలి పెట్టాం. వీటిని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం లేదా స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంది. ► తోడ్పాటు అందించడానికి వ్యాపార దిగ్గజ సంస్థలైన ఎల్ అండ్ టీ, పీ అండ్ జీ, రిలయన్స్, ఐటీసీ, అమూల్, అల్లానా, మహేంద్రా గ్రూప్, తానాగేర్, కాల్ గుడి, హిందూస్తాన్ యూనీ లీవర్ వంటి కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని బ్యాంకులకు కూడా అనుసంధానం చేసి ప్రతి అక్కచెల్లెమ్మలకు వ్యాపార మార్గాలు చూపించేలా అడుగులు వేస్తోంది. ► ఈ 45 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం చూపిన శ్రద్ధ వల్ల అక్కచెల్లెమ్మలకు ఈరోజు నిత్యావసర సరుకుల షాపులు, వస్త్ర వ్యాపారం, ఆవులు, గేదెల ద్వారా పాడి, గొర్రెలు, మేకల పెంపకం, పౌల్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, చేపల పెంపకం, కూరగాయలు, పండ్ల తోటలు, హస్తకళలతో పాటు తమకు నైపుణ్యం ఉన్న ఇతర మార్గాల్లో పెద్ద ఎత్తున వీరందరికీ స్వయం ఉపాధి మార్గాలు చూపించింది. ► ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి అనేక కార్యక్రమాలను క్రోడీకరించాం. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 9,86,616 మంది అక్కచెల్లెమ్మలకు బ్యాంకుల ద్వారా రూ.4,355 కోట్లను అనుసంధానం చేశాం. వారంతా ఇవాళ వివిధ రకాల వ్యాపారాలలో నిమగ్నమై వాళ్ల కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో 2014–2019 మధ్య పొదుపు సంఘాలకు సంబంధించి రూ.14 వేల కోట్ల బ్యాంకు రుణాలు ఇస్తే, ఇవాళ అక్కచెల్లెమ్మలకు సగటున రూ.30 వేల కోట్ల రుణాలు మన ప్రభుత్వం ద్వారా అందుతున్నాయి. వైఎస్సార్ ఆసరా మూడో విడత సాయం కింద లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్ మన పొదుపు సంఘాల వైపు ఇతర రాష్ట్రాల చూపు ► వివిధ బ్యాంకుల ద్వారా ఈ సంఘాలకు ఏటా రూ.30 వేల కోట్లకు పైగా రుణాలు అందుతుండగా.. వాటిని చెల్లించే విషయంలో 99.55 శాతం రికవరీ ఉంది. అంటే ప్రతి అక్కచెల్లెమ్మ తీసుకున్న రుణాల్లో 99.55 శాతం తిరిగి చెల్లిస్తూ.. దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచారు. తద్వారా మన రాష్ట్రంలో ఏం జరుగుతోందని మిగిలిన రాష్ట్రాల వారు వచ్చి పొదుపు సంఘాల విప్లవాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు. ► ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి పొదుపు సంఘాలకిచ్చే రుణాల వడ్డీ శాతాన్ని తగ్గించింది. ఇంతకు ముందు రూ.3 లక్షల రుణానికి 13 శాతం ఉండే వడ్డీని 7 శాతానికే తగ్గించాం. రూ.5 లక్షల రుణంపై వడ్డీ 13 శాతం ఉంటే 9.5 శాతానికి తగ్గించాం. ఈ వడ్డీ శాతం ఇంకా తగ్గించేలా బ్యాంకర్లపై ఒత్తిడి తీసుకువస్తాం. ► అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని ఇంత బాధ్యతగా చేస్తున్నాం. వారు ఏం వ్యాపారం చేస్తున్నారు? ఆదాయం ఎంత వస్తుంది? ఏ మేరకు వడ్డీ రీజనబుల్? ఎంత శాతం కన్నా వడ్డీ ఎక్కువ ఉండకూడదు.. తదితర విషయాలు చెప్పి, మీ తరఫున బ్యాంకులతో మాట్లాడుతూ బాధ్యతగా అడుగులు వేస్తున్న ప్రభుత్వమిది. పొదుపు సంఘాల మహిళలు, ప్రజాప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ నాడు రుణ మాఫీ కాదు.. పథకాలే రద్దు ► చంద్రబాబు హయాంలో అక్కచెల్లెమ్మలందరికీ రుణాలు మాఫీ చేస్తాం.. ఎన్నికల వేళ ఎవరూ వాటిని కట్టొద్దని చెప్పారు. ఎన్నికలయ్యాక అక్కచెల్లెమ్మలతో పని అయిపోవడంతో ఆ హామీని గాలికి వదిలేశారు. వారి రుణాల మాఫీ కథ దేవుడెరుగు.. 2016 అక్టోబర్ నుంచి వారి తరఫున కట్టాల్సిన సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసిన దుస్థితి చూశాం. ► అలాంటి దారుణమైన పరిస్థితుల్లో అక్కచెల్లెమ్మలకు తోడుగా, అండగా ఉంటూ బ్యాంకులకు వాళ్లు కట్టాల్సిన వడ్డీని చెల్లిస్తున్నాం. 2016 అక్టోబర్‌లో నిలిచిపోయిన సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి తీసుకువచ్చి రూ.3,615 కోట్లు సున్నా వడ్డీ కింద కింద చెల్లించాం. తద్వారా మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి గర్వ పడుతున్నాం. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ► జగనన్న అమ్మఒడి ద్వారా 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు, 82 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ.. రూ.19,674 కోట్లు సాయం చేశాం. వైఎస్సార్ చేయూత ద్వారా 26.39 లక్షల మందికి రూ.14,219 కోట్లు లబ్ధి చేకూర్చాం. వైఎస్సార్ కాపునేస్తం ద్వారా 3.56 లక్షల మందికి రూ.1,518కోట్లు, ఈబీసీనేస్తం ద్వారా మరో 3.94 లక్షల మందికి రూ.596 కోట్లు అందించాం. ► వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ ద్వారా ఇంకో రూ.22,793 కోట్లు అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టాం. విద్యా దీవెన ద్వారా 26.99 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పిల్లల చదువుల కోసం రూ.9,947 కోట్లు ఇచ్చాం. వసతి దీవెన ద్వారా మరో 22.58 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పిల్లల వసతి, భోజన సౌకర్యం కోసం రూ.3,363 కోట్లు ఇచ్చాం. ► 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని వారి పేరుతో ఇళ్ల పట్టాలిచ్చాం. వీరిలో 22 లక్షల మంది ఇప్పటికే ఇళ్లు కట్టడం ప్రారంభించారు. ఆ ఇళ్లు పూర్తయితే ఒక్కో ఇంటి విలువ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు వేసుకున్నా.. ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో అంత డబ్బు పెట్టినట్టు అవుతుంది. ఇవన్నీ పూర్తయితే ఈ ఒక్క పథకం ద్వారానే రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు వారి చేతిలో పెట్టినట్లవుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు రోజా, తానేటి వనిత, ఉషాశ్రీచరణ్, కొట్టు సత్యనారాయణ, విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లోనూ 50% ► నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పోస్టులు అక్కచెల్లెమ్మలకే రావాలని ఏకంగా అసెంబ్లీలోనే చట్టం చేశాం. నామినేషన్ ద్వారా ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో కూడా 50 శాతం ఇవ్వాలని చట్టం చేశాం. ఏ రాజకీయ పదవి చూసినా.. ఎంపీపీ నుంచి జెడ్పీ చైర్పర్సన్ వరకు, మున్సిపల్ చైర్మన్ నుంచి కార్పొరేషన్ మేయర్ వరకు గుడి చైర్మన్ నుంచి ఏఎంసీ చైర్మన్ పదవుల వరకు ఏ పదవిలో చూసినా 50 శాతం అక్కచెల్లెమ్మలు కనిపిస్తున్నారు. ► అక్కచెల్లెమ్మలు ఎక్కడకు వెళ్లినా ధైర్యంగా వెళ్లాలని, వారి రక్షణ కోసం దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని విధంగా దిశ యాప్‌ను తీసుకొచ్చాం. దీని ద్వారా 1.17 కోట్ల మంది ఈ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎవరికి ఆపద వచ్చినా ఎక్కడికి వెళ్లినా యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కినా, లేక సెల్‌ఫోను ఐదు సార్లు ఊపినా వెంటనే పోలీసు సోదరుడు పది నిమిషాల్లో అక్కడికి చేరుకుని అండగా నిలిచే గొప్ప వ్యవస్థను తీసుకొచ్చాం. ఈ రోజు దిశ యాప్ ద్వారా 26 వేల మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరిగింది. ఈ ప్రభుత్వం.. మీ ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం.. వివక్ష మీద పోరాటం చేస్తున్న ప్రభుత్వం. కోట్ల మంది అక్కచెల్లెమ్మలు తమ అన్నకు రక్షా బంధనం కట్టిన ప్రభుత్వం. ప్రతి రూపాయి కూడా మన అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతుంది. వారికి ఇస్తే కుటుంబాలు బాగు పడతాయని నమ్మిన ప్రభుత్వం ఇది. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మహిళా సంక్షేమం మీద ఇన్ని రంగాలలో వారిని అభివృద్ధి పథం మీద నడిపించాలని తపన పడుతోంది. వారి రక్షణ మీద కూడా మనలా దృష్టి పెట్టిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. బాబు మోసం చేస్తే.. జగన్ ఆదుకున్నారు సీఎం వైఎస్ జగన్ సహకారంతో దెందులూరులో రూ.1900 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. రూ.85 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్, రూ.70 కోట్లతో మంచినీటి పథకం, నూజివీడు – దెందులూరు మధ్య తమ్మిలేరుపై బ్రిడ్జి శంకుస్థాపన, సీహెచ్‌సీ ప్రారంభోత్సవం సీఎం చేతుల మీదుగా జరగడం ఆనందంగా ఉంది. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని నాడు చంద్రబాబునాయుడు ఇదే దెందులూరులో హామీ ఇచ్చి మోసం చేశారు. సీఎం జగన్ చెప్పిన మాట మేరకు డ్వాక్రా రుణాల చెల్లింపు దిశగా దెందులూరు వేదికగా మరో అడుగు మందుకు వేయడం ఆనందంగా ఉంది – కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు ఎమ్మెల్యే కలకాలం సీఎం చల్లగా ఉండాలి వైఎస్సార్ ఆసరా కార్యక్రమం మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది. ఈ పథకం ద్వారా మా గ్రూప్ సభ్యులకు రూ.2.95 లక్షలు వచ్చాయి. నా వాటాగా రూ.27,400 దక్కాయి. గత రెండు విడతల ఆసరా కార్యక్రమం ద్వారా అందిన మొత్తాలతో కుట్టు మిషన్, జిగ్ జాగ్ మిషన్ కొనుగోలు చేసి, టైలరింగ్ ద్వారా రోజుకు రూ.500 నుంచి రూ.700 వరకు సంపాదిస్తున్నా. పిల్లలను చదివించుకుంటున్నా. చిన్న కొడుకు 8వ తరగతి చదువుతున్నాడు. జగనన్న ఇచ్చిన ట్యాబ్‌తో బాగా చదివి క్లాస్‌లో ఫస్ట్ ర్యాంక్‌లో నిలిచాడు. కలకాలం మీరు (సీఎం) చల్లగా ఉండాలి. – ఎండీ.రుబీనా బేగం, 48వ డివిజన్, ఏలూరు మహిళల జీవితాల్లో వెలుగులు వైఎస్సార్ ఆసరా ద్వారా మా గ్రూపునకు రూ.5 లక్షలు అందింది. ఇందులో నా వాటాకు తోడుగా ఉన్నతి, స్త్రీనిధి ద్వారా రుణాలు తీసుకుని ట్రాక్టర్ కొనుగోలు చేశాను. నా భర్తకు రోడ్డు ప్రమాదం కారణంగా కాలు విరిగి పోవడం వల్ల ప్రస్తుతం కుటుంబాన్ని నేనే నడిపిస్తున్నాను. ఆరోగ్యశ్రీ ద్వారా నా భర్తకు ఉచితంగా వైద్యం అందింది. వైఎస్సార్ ఆసరా నా లాంటి మహిళలు లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. మహిళల సంక్షేమం కోసం ఇంతలా తపించే సీఎం వైఎస్ జగన్‌కు దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆదరాభిమానాలు ఎప్పటికీ ఉంటాయి. – కలపాల గంగారత్నకుమారి, దొరమామిడి, బుట్టాయగూడెం మండలం -
CM YS Jagan: నేనున్నానని.. మీకేం కాదని
సాక్షి, ఏలూరు: వైఎస్సార్ ఆసరా మూడవ విడత కింద మహిళలకు ఆర్ధిక సహాయం అందించేందుకు దెందులూరు కు విచ్చేసి కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వెళుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు బాధితులు కలిసి తమ బాధను వ్యక్తం చేసుకున్నారు. దెందులూరు గ్రామానికి చెందిన బర్నాన క్రాంతి ప్రసాద్ (31) బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నట్లు, ఇప్పటికే రెండుసార్లు మేజర్ ఆపరేషన్లు జరిగాయని, 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యాయని తండ్రి గణపతి ముఖ్యమంత్రి వద్ద వాపోయారు. ఈ మేరకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. తక్షణమే వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం మంజూరు చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తక్షణమే లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. పెదవేగి మండలం రాట్నాలకుంట కు చెందిన పెనుబోయిన కృపారావు (39) తనకు రెండు కిడ్నీలు పాడయ్యాయని, వైద్యానికి 5 నుండి 6 లక్షల రూపాయలు ఖర్చు కాగలదని, అందుకు ఆర్ధిక సాయం అందించాలని ముఖ్యమంత్రిని కోరారని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా దెందులూరు గ్రామానికి చెందిన వై. మోషేరాజు, ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన కోసన అర్జున్ కిడ్నీల వ్యాధితో బాదుతున్నామని, తమను ఆదుకోవాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ దాతలు సిద్ధంగా ఉంటె, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా బాధితులకు ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్‌కు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలియజేసారని, తక్షణ వైద్య సహాయం కోసం లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందిస్థానని, హామీ ఇచ్చారని, ఆ మేరకు కృపారావు, కోసన అర్జున్, వై. మోషే రాజు లకు లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం చెక్కులను వెంటనే పంపిణీ చేసినట్లు కలెక్టర్ చెప్పారు. ఉంగుటూరు మండలం గోపరాజుపాడు కు చెందిన కుప్పాల సుధారాణి తన కుమార్తె కె. దేదీప్య (5) కి పుట్టుకతోనే లివర్ సమస్య ఉందని, ఎండోస్కోపీ వైద్యానికి ప్రతీ నెల 30 నుండి 40 వేల రూపాయలు ఖర్చు అవుతోందని, తమ బాధను ముఖ్యమంత్రికి తెలియజేసారని కలెక్టర్ తెలిపారు. తన భర్త దుర్గా రావు కూలి పనికి వెళతారని, వైద్యానికి ఇప్పటివరకు లక్షల రూపాయల వరకు ఖర్చు చేశామని చెబుతూ, ప్రస్తుతం వైద్యం కోసం హైదరాబాద్ తీసుకువెళ్ళుతున్నామని, తమ ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తమకు వైద్య చికిత్సకు సహాయం చేయాలనీ ముఖ్యమంత్రిని కోరారని కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేదీప్య వైద్య చికిత్స నిమిత్తం వారి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం చెక్కును అందించినట్లు కలెక్టర్ చెప్పారు. ద్వారకాతిరుమల మండలం జి. కొత్తపల్లికి చెందిన పి . రేవతి తమ కుమార్తె పి . వెంకట లక్ష్మి (8) శాశ్వత వినికిడి లోపం సమస్యతో బాధపడుతున్నాదని, ఇప్పటికే 1.50 లక్షల రూపాయలతో చికిత్స అందించామని, కాక్లియర్ ఇంప్లాంటేషన్ కు 22 లక్షలు ఖర్చు అవుతాయని ముఖ్యమంత్రికి రోగి తల్లి రేవతి తమ బాధను వ్యక్తం చేశారు. కాక్లియర్ ఇంప్లాంటేషన్ కు అవసరమైన వైద్య సహాయం కోసం చర్యలు తీసుకుంటామని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తక్షణ వైద్య ఖర్చుల కోసం లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం చెక్కును సదరు కుటుంబానికి అందించినట్లు కలెక్టర్ తెలియజేసారు. దెందులూరు గ్రామానికి చెందిన కొంగర ప్రిస్కిల్లా కుమార్తె కె. సెఫిల్ అనోరెక్టల్ మాల్ ఫార్మేషన్ తో బాధపడుతున్నట్లు ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు ముఖ్యమంత్రికి తెలియజేసారని, దీనిపై మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డిఎమ్ హెచ్ ఓ తో చర్చించి, ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. వైద్య చికిత్స నిమిత్తం ప్రిస్కిల్లా కుటుంబానికి తక్షణ ఆర్ధిక సహాయంగా లక్ష రూపాయలు అందించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లక్ష రూపాయల చెక్కును అందించినట్లు కలెక్టర్ చెప్పారు. దెందులూరు మండలం, దెందులూరు గ్రామానికి చెందిన ఈడుపల్లి ప్రసాద్ శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నానని, మంచంపై నుండి కదలలేని పరిస్థితిలో ఉన్నానని, తనకు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా ముఖ్యమంత్రిని కోరారని, వారికి వైద్య చికిత్స నిమిత్తం తక్షణ వైద్య సహాయంగా లక్ష రూపాయలు చెక్కును అందించి, పెన్షన్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన జుత్తిగ హేమలత తన కుమార్తె భవ్యశ్రీ మల్లిక (10 నెలలు) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాదని , తిరుపతి లోని పద్మావతి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించామని, పోస్ట్ ఆపరేషన్ వైద్య చికిత్సకు మందులు అందించాలని ముఖ్యమంత్రికి తెలియజేసిన పిమ్మట వారి అభ్యర్థనపై స్పందించిన ముఖ్యమంత్రి వారికి లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లుగా హామీ ఇచ్చారని , ఆ మేరకు లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం చెక్కును అందించినట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలియజేసారు. ఆర్ధిక సహాయం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు కొఠారు అబ్బాయి చౌదరి, తలారి వెంకటరావు, పుప్పాల వాసుబాబు, జాయింట్ కలెక్టర్ పి . అరుణ్ బాబు, డ్వామా పీడీ డి. రాంబాబు , ప్రభృతులు పాల్గొన్నారు. -
సీఎం జగన్‌కు వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనస్వాగతం (ఫొటోలు)
-
ఏలూరు: వైఎస్సార్ ఆసరా పథకం మూడో విడుత నిధుల విడుదల
-
మహిళా పక్షపాత ప్రభుత్వం మనది: సీఎం జగన్
మూడవ విడతగా రూ. 6,419.89 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేటి నుంచి (25–03–2023) ఏఫ్రిల్ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావరణంలో 7,89,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి ఏలూరు జిల్లా దెందులూరులో శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే....: చెరగని ఆప్యాయతలు, చిక్కటి చిరునవ్వుల మధ్య ఈ రోజు మీ అన్నకు, మీ తమ్ముడికి, మీ బిడ్డకు తోడుగా నిలబడడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వాతాతలకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం... దేవుడి దయతో ఈరోజు ప్రజలందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమాన్ని దెందులూరు నుంచి ప్రారంభిస్తున్నాం. దాదాపు 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ... మరో పదిరోజుల పాటు జరగబోయే ఆసరా సంబరాల్లో రూ.6,419 కోట్లు నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ప్రతిమండలంలోనూ ఒక పండగ వాతావరణం మధ్య ప్రతి అక్కా, ప్రతి చెల్లమ్మా తాను సాధించిన విజయాలు చెబుతుంది. మహిళా సాధికారితకు మీరే నిదర్శనం... మన దెందులూరులో నా స్టేజ్ ఎదురుగా మిమ్నల్ని చూసినప్పుడు మహిళా సాధికారతకు అద్దం పడుతూ ఉన్న ఇంతమంది అక్కచెల్లెమ్మలు స్టేజ్ మీదే కాకుండా.. నా ఎదురుగా ఉన్న అక్కచెల్లెమ్మలందరూ కూడా కనిపిస్తున్నారు. కేవలం 45 నెలల కాలంలోనే మహిళా సాధికారత విషయంలో మనందరి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు ఫలితాలు ఎంత గొప్పగా ఉన్నాయన్నది ఇక్కడ కనిపిస్తోంది. ఈ రోజు వైఎస్సార్ ఆసరాగా మూడో విడతకు సంబంధించిన నిధుల విడుదల ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. నేను ఇంతకముందు చెప్పినట్టుగా పదిరోజుల పాటు ప్రతి మండలంలోనూ ఉత్సవ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 78 లక్షల మందికి మంచి జరిగే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు... డ్వాక్రా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటామని 2019లో నా పాదయాత్ర సందర్భంగా ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ మీ తమ్ముడిగా, అన్నగా మాటిచ్చాను. ఆ రోజు నేను... నేను విన్నాను, నేను మీ బాధలు చూశాను, నేను ఉన్నాను అని చెప్పిన మాటకు కట్టుబడి తూచా తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నా అక్కచెల్లమ్మలకు తోడుగా ఉంటూ వచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం... ఇచ్చిన మాట ప్రకారం నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 2019 మార్చి 31 వరకు ఉన్న రూ. 25,500 కోట్లకు పైగా అప్పుల ఊబిలోకి పోయి కొట్టుమిట్టాడుతున్నవారికి తోడుగా ఉంటామని చెప్పాం. ఆ మాట తప్పకుండా వారికి అండగా ఉండే కార్యక్రమం చేశాం. ఈ 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే రెండు వాయిదాల్లో రూ.12,758 కోట్లు ఇచ్చాం. ఈ రోజు నుంచి ప్రారంభించి ఈ పదిరోజుల ఆసరా పండగ కార్యక్రమంలో భాగంగా మరో రూ.6419 కోట్ల రూపాయలు నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయి. అసరా ద్వారా రూ.19,178 కోట్లు జమ... ఎక్కడా ఎవ్వడూ లంచాలు అడగడు. ఎవ్వరూ వివక్ష చూపరు. నేరుగా మీ అన్న బటన్ నొక్కిన వెంటనే నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి. ఈ రూ.6419 కోట్లు కలుపుకుంటే రూ. 19,178 కోట్లు నేరుగా ఒక్క ఆసరా ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ అవుతుంది.ఈ కార్యక్రమం ద్వారా అక్కచెల్లెమ్మలను ఆదుకుంటూ వారికి తోడుగా ఉంటూ ప్రతి అడుగులోనూ చేయిపట్టుకుని నడిపిస్తున్నాం. వ్యాపార దిగ్గజాలతో అండ.... వైయస్సార్ ఆసరాగా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలన్నది నేను మీ అభిమతానికి వదిలిపెట్టాను. ఈ డబ్బులు పెట్టుబడిగా వ్యాపారం, లేదా స్వయం ఉపాధి పొందాలనుకుంటే వారికి ప్రభుత్వం కూడా అన్నిరకాలుగా అండదండలు ఇస్తూ... మీకు తోడుగా ఉంటుంది. వారికి తోడ్పాటు ఇస్తూ సలహాలిస్తూ.. అండగా నిలబడి ప్రముఖ వ్యాపార దిగ్గజ సంస్ధలైన ఎల్ అంట్ టీ, పీ అండ్ జి, రిలయన్స్, ఐటీసీ, అమూల్, అల్లానా, మహేంద్రా గ్రూప్, తానాగేర్, కాల్ గుడి, హిందుస్తాన్ యూనీలీవర్ వంటి అనేక వ్యాపార దిగ్గజాలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని బ్యాంకులను కూడా వీరికి అనుసంధానం చేసి ప్రతి అక్కచెల్లెమ్మకూ వ్యాపార మార్గాలు చూపించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేసింది. స్వయం ఉపాధి దిశగా... ఈ 45 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం చూపిన ఈ శ్రద్ధ వలన అక్కచెల్లెమ్మలకు ఈరోజు నిత్యావసరసరుకుల షాపులు, వస్త్ర వ్యాపారం, ఆవులు, గేవులు ద్వారా పాడి, గొర్రెలు, మేకలు పెంపకం, పౌల్ట్రీ, పుడ్ ప్రాససింగ్ యూనిట్లు, చేపల పెంపకం, కూరగాయలు, పండ్ల తోటలు, హస్తకళలలతో పాటు తమకు నైపుణ్యం ఉన్న ఇతర మార్గాలలో పెద్ద ఎత్తున వీరిందరికీ స్వయం ఉపాధి మార్గాలు ప్రభుత్వం దగ్గరుండి కల్పించింది. ఆసరా, చేయూత సున్నావడ్డీ వంటి అనేక కార్యక్రమాలను క్రోడీకరించాం. వీటి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 9,86,616 మంది అక్కచెల్లెమ్మలకు బ్యాంకుల ద్వారా రూ.4355 కోట్లను వారికి అనుసంధానం చేశాం. వారంతా ఇవాళ వివిధ రకాల వ్యాపారాలలో నిమగ్నమై వాళ్ల కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు. గత ప్రభుత్వంలో... గత ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య పొదుపు సంఘాలకు సంబందించి సగటున వారికి బ్యాంకురుణాలు రూ.14వేలు ఇచ్చే కార్యక్రమం జరిగితే.. ఇవాళ అక్కచెల్లెమ్మలకు సగటున బ్యాంకు రుణాలు ఏటా రూ.30వేలు అందుతున్నాయి. 99.95 శాతం రుణాల రికవరీ..దేశంలో పొదుపు సంఘాలకు ఏపీ రోల్‌మోడల్ అప్పటికీ ఇప్పటికీ తేడా చూడండి. వివిధ బ్యాంకుల ద్వారా ఈ సంఘాలకు ఏటా రూ.30వేల కోట్లకు పైగా రుణాలు అందుతుండగా.. ఈ రుణాలు చెల్లించడంలో కూడా 99.55 శాతం రికవరీ ఉంది. అంటే ప్రతి అక్కచెల్లెమ్మ తీసుకున్న రుణాల్లో 99.55 శాతం తిరిగి చెల్లిస్తూ.. దేశానికే పొదుపు సంఘాల విషయంలో ఆంధ్రరాష్ట్రం అక్కచెల్లెమ్మలు రోల్‌మోడల్‌గా నిలబడ్డారు. మిగిలిన రాష్ట్రాలు వచ్చి ఆంధ్రరాష్ట్రంలో ఏం జరుగుతుందని చూస్తున్నారు. పొదుపు సంఘాలలో జరుగుతున్న విప్లవాన్ని ఎలా జరుగుతుందని ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి.. పొదుపు సంఘాలకిచ్చే రుణాల వడ్డీ శాతాన్ని తగ్గించే కార్యక్రమంలో అడుగులు వేగంగా వేసింది. ఇంతకముందు రూ.3 లక్షల రుణానికి సంబంధించి వడ్డీ 13 శాతం ఉండగా దాన్ని 7 శాతానికే తగ్గించడమైంది. రూ.5లక్షల రుణంపై వడీ 13 శాతం ఉంటే దాన్ని కూడా బ్యాంకులతో మాట్లాడి 9.5 శాతానికి తగ్గించడమైంది. ఈ వడ్డీ శాతంపై కూడా ఇంకా బ్యాంకులతో మాట్లాడుతున్నాం. ఈవడ్డీ శాతం కూడా ఇంకా తగ్గించుకుంటూ పోయే కార్యక్రమానికి బ్యాంకర్లతో మాట్లాడి వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఆ అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని ఇంత బాధ్యతగా చేస్తున్నాం. వారు ఏం వ్యాపారం చేస్తున్నారు ? ఆదాయం ఎంత వస్తుంది ? ఏ మేరకు వడ్డీ రీజనబుల్ ? వడ్డీ ఎంత శాతం కన్నా ఎక్కువ ఉండకూడదని చెప్పి మీ తరపున బ్యాంకులతో మాట్లాడుతూ బాధ్యతగా అడుగులు వేస్తున్న ప్రభుత్వమిది. చేయూతతో మారిన పొదుపు సంఘాలు... మన ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో చేయూత వల్ల పొదుపుసంఘాల పనితీరు ఎలా మారిందో అందరికీ కనిపిస్తోంది. గత ప్రభుత్వ పాలనలో దెబ్బతినిపోయిన పొదుపు సంఘాల ఉద్యమం మరలా ఈ రోజు ఊపిరి పోసుకుంది. ఈ రోజు 91 శాతానికి పైగా సంఘాలు ఏ, బీ గ్రేడ్లగా మార్పు చెందాయి. ఈ సంఘాలు ఇంతకముందు ఎన్పీఏలు. గత ప్రభుత్వ హయాంలో ఎన్పీఏలు ఓవర్ డ్యూస్గా 18 శాతం మేరకు సంఘాలు ఉంటే.. ఈ రోజు ఎన్పీఎలు, ఓవర్ డ్యూలు శాతం 0.45 శాతం మాత్రమే. మనందరి ప్రభుత్వం సాధికారిత, అక్కచెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి ఎంతగా అండగా నిలబడిందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అక్కచెల్లమ్మల పట్ల మన ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి నిదర్శనం. గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. చంద్రబాబునాయుడు గారి హయాంలో ఆ రోజులలో అక్కచెల్లెమ్మలందరికీ రుణాలు మాఫీ చేస్తాం అంటూ ఎన్నికల వేళ ఎవరూ వాటిని కట్టొద్దని చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కచెల్లెమ్మలతో పనిఅయిపోయింది. అక్కచెల్లెమ్మలకిచ్చిన హామీని గాలికి వదిలేశారు. వారి రుణాల మాఫీ కథ దేవుడెరుగు.. 2016 అక్టోబరు నుంచి వారి తరపున కట్టాల్సిన సున్నావడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసిన పరిస్థితులు గత ప్రభుత్వంలో చూశాం. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో అక్కచెల్లెమ్మలకు తోడుగా, అండగా ఉంటూ బ్యాంకులకు వాళ్లు కట్టాల్సిన సున్నావడ్డీని మరలా తీసుకొచ్చి దీనికింద రూ.3036 కోట్లు ఇవాళ వడ్డీ రూపంలో తిరిగి చెల్లించడం జరిగింది. 2016 అక్టోబరులో నిలిచిపోయిన సున్నావడ్డీ అనే పథకాన్ని మన ప్రభుత్వం తిరిగి తీసుకునిరావడం వల్ల మన ప్రభుత్వం రూ.3615 కోట్లు సున్నావడ్డీ పథకం కింద చిరునవ్వుతో చెల్లించాం. మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి కూడా గర్వపడుతున్నాం. ఈ 45 నెలల కాలంలో మీ అన్న ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు ఏ రకంగా ముందుకు వేసిందో కొన్ని ఉదాహరణలు చెబుతాను. వివిధ పథకాల ద్వారా... జగనన్న అమ్మఒడి ద్వారా 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు 82 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ.. రూ.19,674 కోట్లు సాయం చేశాం. వైయస్సార్ చేయూత ద్వారా 26.39 లక్షల మందికి రూ.14,219 కోట్లు సాయం అందించాం. వైయస్సార్ కాపునేస్తం ద్వారా 3.56 లక్షల మందికి రూ.1518 కోట్లు, ఈబీసీ నేస్తం ద్వారా మరో 3.94 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.596 కోట్లు అందించాం. వైఎస్సార్ ఆసరా, సున్నావడ్డీ ద్వారా మరో రూ.22,793 కోట్లు అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టాం. విద్యాదీవెన ద్వారా 26.99 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పిల్లల చదువులు కోసం అందించిన సహాయం.. రూ.9947 కోట్లు. వసతి దీవెన ద్వారా మరో 22.58 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పిల్లలు వసతి భోజన సౌకర్యం కోసం ఇబ్బంది పడకూడదని చెప్పి రూ.3363 కోట్లు ఇచ్చాం. 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని వారి పేరుతో ఇళ్లపట్టాలిచ్చాం. 22 లక్షల మంది అక్కచెల్లెమ్మలు ఇప్పటికే ఇళ్లు కట్టడం ప్రారంభించారు. ఆ ఇళ్లు పూర్తైతే ప్రతి అక్కచెల్లెమ్మచేతిలోనూ ఒక్కో ఇంటి విలువ రూ.5 నుంచి రూ.10 లక్షలు వేసుకున్నా కూడా ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో అంత డబ్బు పెట్టినట్టు అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 30 లక్షల ఇళ్లపట్టాలు, 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న పరిస్థితులు.. ఇవన్నీ పూర్తైతే ఈ ఒక్క పథకం ద్వారా రూ.2 నుంచి రూ.3 లక్షల కోట్లు వారి చేతిలో పెట్టినట్లవుతుంది. మహిళా పక్షపాత ప్రభుత్వం.... ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. మహిళా పక్షపాత ప్రభుత్వం. నా అక్కచెల్లెమ్మలకు విద్యా, ఆర్ధిక, సామాజిక, రాజకీయ సాధికారతను కల్పించాలని తపిస్తున్న ప్రభుత్వం మనది. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం... వివక్ష మీద పోరాటం చేస్తున్న ప్రభుత్వం. కోట్ల మంది అక్కచెల్లెమ్మలు తమ అన్నకు రక్షా బంధనం కట్టిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రతి రూపాయి కూడా మన అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతుంది. వారికి ఇస్తే కుటుంబాలు బాగుపడాతాయని నమ్మిన ప్రభుత్వం మనది. కాబట్టి.. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మహిళా సంక్షేమం మీద ఇన్ని రంగాలలో వారిని అభివృద్ధి పథం మీద నడిపించాలని తపన పడి, వారి రక్షణ మీద దృష్టిపెట్టిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు. నా అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని, అన్ని రకాలుగా తోడుగా ఉండాలని అఢుగులు వేస్తున్నాం. ఆర్ధికంగా తోడుగా ఉండడం, రాజకీయంగా కూడా అక్కచెల్లెమ్మలను పైకి తీసుకురావాలన్న తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం. నామినేటెడ్ పదవులు, పనుల్లోనూ 50 శాతం... నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పోస్టులు అక్కచెల్లెమ్మలకే రావాలని ఏకంగా అసెంబ్లీలోనే చట్టం చేశాం. నామినేషన్లలో ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో కూడా 50 శాతం ఇవ్వాలని చట్టం చేశాం. ఏ రాజకీయ పదవి చూసినా.. ఎంపీపీ నుంచి జడ్పీ చైర్మన్ వరకూ, మున్సిపల్ చైర్మన్ నుంచి కార్పొరేషన్ మేయర్ వరకూ గుడి చైర్మన్ నుంచి ఏఎంసీ చైర్మన్ పదవుల వరకూ ఏ పదవిలో చూసినా 50 శాతం అక్కచెల్లెమ్మలు కనిపిస్తున్నారు. అక్క చెల్లెమ్మల రక్షణ కోసం... అక్కచెల్లెమ్మల రక్షణ కల్పించే విషయంలో అడుగులు వేగంగా వేసింది. అక్కచెల్లెమ్మలు ఎక్కడికి పోయినా, ఎప్పుడు వెళ్లినా ధైర్యంగా వెళ్లాలి. ఇంతకముందు ఎప్పుడూ జరగని విధంగా, దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని విధంగా దిశ యాప్‌ను తీసుకొచ్చాం. దీని ద్వారా 1.17 కోట్ల మంది ఈ యాప్ రిజిష్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో ఎవరికి ఆపద వచ్చినా ఎక్కడికి వెళ్లినా ఒక ఎస్ఓఎస్ బటన్ నొక్కినా లేదా పోన్‌ను ఐదు సార్లు ఊపినా వెంటనే పోలీసు సోదరుడు పదినిమిషాల్లో అక్కడికి వచ్చి అక్కా నీకేమైంది అని అడిగే గొప్ప వ్యవస్ధనుతీసుకొచ్చాం. 21 వ శతాబ్ధపు ఆధునిక మహిళ ఏపీ నుంచే.. ఈ రోజు దిశ యాప్ ద్వారా 26వేల మంది అక్కచెల్లెమ్మలకి మంచి జరిగింది. ఇవన్నీ మహిళలు విద్యాపరంగా, సామాజికపరంగా, ఆర్ధికంగా రాజకీయంగా ఎదగాలని, బాగుపడాలని 21వ శతాబ్ధపు ఆధునిక భారతీయ మహిళ రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి మన రాష్ట్రంలోని ప్రతి ఇంటి నుంచి రావాలన్న తపన, తాపత్రయంతో ఈ 45 నెలల పాలన జరిగింది. ఈ రోజు వివిధ పథకాల ద్వారా నా అక్కచెల్లెమ్మలకు రూ.2.25 లక్షల కోట్లు సొమ్ము ఇచ్చాం. ఇంతలా అక్కచెల్లెమ్మల గురించి ఆలోచించి, మంచి చేసిన పరిస్థితి గతంలో లేదన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. నా అక్కచెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలని మనసారా తపిస్తున్నాను. దేవుడి చల్లని ఆశీస్సులు మీ బిడ్డపై, ఈ ప్రభుత్వంపై ఉండాలని ఆశిస్తున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్సార్ ఆసరా: సీఎం జగన్ దెందులూరు పర్యటన దృశ్యాలు
-
హామీని నిలబెట్టుకున్నా.. అండగా నిలిచా: సీఎం జగన్
Updates Time: 01:05 PM ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించారు. వైఎస్సార్ ఆసరా పథకం మూడో విడత ఆర్థిక సాయాన్ని ఆయన విడుదల చేశారు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మూడవ విడతగా రూ. 6,419.89 కోట్ల ఆర్ధిక సాయాన్ని శనివారం నుంచి ఏప్రిల్ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావారణంలో 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేయనున్నారు. నేడు అందిస్తున్న రూ. 6,419.89 కోట్లతో కలిపి వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటివరకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 19,178 కోట్లు. Time: 12:47 PM ►రూ.6,419.89 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ అవుతాయి: సీఎం జగన్ ►ఎక్కడా లంచాలు ఉండవు, వివక్ష ఉండదు : ►ఈ మొత్తాన్ని ఎలా ఖర్చుచేసుకోవాలన్నదీ మీ అభిమతానికే విడిపెట్టాను ►స్వయం ఉపాధి పొందాలనుకుంటే.. ప్రభుత్వం పరంగా అండదండలు ►అక్షరాల రూ.19,178 కోట్లు ఒక్క ఆసరా కార్యక్రమం కింద ఇచ్చాం ►మహిళలకు తోడ్పాటు ఇస్తూ, సలహాలు ఇస్తూ.. అన్నగా… ప్రభుత్వం నిలబడుతుంది ►ఆసరా, చేయూత, సున్నా వడ్డీ ద్వారా అనేక కార్యక్రమాలను క్రోడీకరించాం ►9 లక్షల మందికిపైగా నా అక్క చెల్లెమ్మలు రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు ►రూ.4355 కోట్లు బ్యాంకుల ద్వారా వారికి అనుసంధానం చేశాం ►తద్వారా వారి కుటుంబాలకు వారు అండగా నిలబడుతున్నారు ►చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలకు సంబంధించిన సగటున వారికి వచ్చే బ్యాంకుల రుణాలు రూ.14వేల కోట్లు కాగా, ఇవాళ బ్యాంకుల ద్వారా ఏటా రూ.30 వేల కోట్లు సగటున అందుతున్నాయి ►99.55 శాతం రుణాలను పొదుపు సంఘాలు చెల్లిస్తున్నారు ►దేశానికి రోల్‌మోడల్‌గా ఏపీ పొందుపు సంఘాలు నిలుస్తున్నాయి ►బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతాలను తగ్గించాం ►ఇంకా తగ్గించేలా బ్యాంకర్లమీద ఒత్తిడి తీసుకువస్తున్నాం ►చంద్రబాబు వల్ల దెబ్బతిన్న పొదుపు సంఘాల ఉద్యమం.. మళ్లీ ఊపిరి పోసుకుంది ►ఎన్పీఏలు, ఓవర్ డ్యూలు కేవలం 0.45శాతం మాత్రమే ►గత ప్రభుత్వం హయాంలో 18.36శాతం ►రుణాలు మాఫీచేస్తానని చంద్రబాబు గత ఎన్నికల్లో చెప్పారు ►వారిని నిలువునా ముంచేశారు ►2016 అక్టోబరు నుంచి కూడా సున్నా వడ్డీరుణాల పథకాన్ని చంద్రబాబు నిలిపేశారు ►రూ.3వేల కోట్ల వడ్డీలు, చక్కవడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ►తిరిగి సున్నావడ్డీ కిందరుణాలు వచ్చే పరిస్థితిని తీసుకు వచ్చాం ►2016 అక్టోబరులో నిలిచిపోయిన ఈ పథకాన్ని తీసుకొచ్చి రూ.3600 కోట్లు చెల్లించాం ►చిక్కటి చిరునవ్వుతోనే ఇదంతా చేశాం ►మహిళా పక్షపాత ప్రభుత్వం మనది ►ఈ 45 నెలల కాలంలో మీ జగనన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం… మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు ముందుకేసింది ►అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ రూ.2,25,330.76 కోట్లు అక్క చెల్లెమ్మలకు ఇచ్చాం: ►మహిళ వివక్షమీద పోరాటం చేస్తోంది ఈప్రభుత్వం ►కోట్లమంది అక్కచెల్లెమ్మలు తమ అన్నకు రక్షా బంధనం కట్టిన ప్రభుత్వం మనది ►ప్రతి రూపాయి అక్క చెల్లెమ్మలకు ఇవ్వాలి, కుటుంబాలు బాగుపడతాయని నమ్మిన ప్రభుత్వం ఇది ►గుడి ఛైర్మన్, ఏంఎసీ.. ఇలా నామినేటెడ్ పదవుల్లో 50శాతం అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం ►అక్క చెల్లెమ్మలకు ఎలాంటి హానీ కలగకూడదనే ఉద్దేశంతో దిశ యాప్‌ను తీసుకు వచ్చాం ►1.17 లక్షల మంది రిజస్టర్ చేసుకున్నారు ►21 శతాబ్దపు ఆధునిక మహిళ మన రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి రావాలని తపన పడుతున్నాను Time: 12:25 PM ►మహిళలకు ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పిస్తోంది: సీఎం జగన్ ►వ్యాపార దిగ్గజాలతో ఒప్పంద చేసుకొని వ్యాపార మార్గాలు చూపాం ►ఆసరా, చేయూత, సున్నా వడ్డీ ద్వారా మహిళలకు అండగా నిలిచాం. ►పొదుపు సంఘాల మహిళలు దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచారు ►పొదుపు సంఘాల పనితీరును ఇతర రాష్ట్రాలు పరిశీలిస్తున్నాయి ►బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతాన్ని తగ్గిస్తున్నాం ►78.94 లక్షల మంది లబ్ధిదారులకు రూ.6,419.89 కోట్ల ఆర్థిక సాయం ►10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆసరా పంపిణీ ఉత్సవాలు ►ప్రతి మండలంలోనూ ఉత్సవంలా వైఎస్సార్ ఆసరా కార్యక్రమం Time: 12:25 PM ►పొదుపు సంఘల మహిళలకు అండగా నిలిచాం: సీఎం జగన్ ►డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం ►ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లు అందించాం ►లంచాలు లేవు.. వివక్ష ఉండదు.. నేరుగా ప్రజల ఖాతాల్లోకి డబ్బులు ►ఆసరా కింద ఇచ్చే డబ్బులు ఎలా వాడుకుంటారో మీ ఇష్టం Time: 12:09 PM ►మహిళా సాధికారిత లక్ష్యంగా ముందుకెళ్తున్నాం: సీఎం జగన్ ►పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నా ►డ్వాక్రా మహిళలకు అండగా ఉంటానని పాదయాత్రలో మాటిచ్చా ►నేను విన్నాను... నేను మీ బాధలు చూశాను.. నేను ఉన్నానని చెప్పా ►ఇచ్చిన మాట ప్రకారం అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉన్నా Time: 12:00 PM ►వైఎస్సార్ ఆసరా నిధులు ఇవ్వడం సంతోషంగా ఉంది: లబ్దిదారులు ►వైఎస్సార్ ఆసరా నిధులతో మా కాళ్ల మీద మేము నిలబడ్డాం ►అండగా విద్యాకానుక, విద్యాదీవెన, ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాలు. ►మీ పాలనలో మా పిల్లలకు మంచి చదువులు ►నవరత్నాల పథకాలతో మా జీవితాల్లో వెలుగులు నింపారు. Time: 11:45AM ► సున్నా వడ్డీ పథకాన్ని నీరుగార్చిన ఘనత చంద్రబాబుది: ఎమ్మెల్యే అబ్బయ చౌదరి ►డ్వాక్రా మహిళలను చంద్రబాబు నమ్మించి మోసం చేశారు. ►పొదుపు సంఘాలు చివరికి సీ,డీ గ్రేడ్లకు పడిపోయాయి. ►సున్నావడ్డీ పథకంతో అక్కచెల్లెమ్మల్లో మళ్లీ ఆనందం తెచ్చిన ఘనత సీఎం జగన్‌ది ►సీఎం జగన్ పాలనలో పొదుపు సంఘాలు ఏ,బీ గ్రేడ్లకు చేరాయి. Time: 11:31AM ► వైఎస్సార్ ఆసరా లబ్ధిదారులను పలకరించిన సీఎం జగన్ ► వైఎస్సర్ ఆసరా లబ్ధిదారులతో సీఎం జగన్ ఫోటో సెషన్ Time: 11:15AM ►దెందులూరు సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకున్నారు. మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తున్నారు. Time: 10:50AM ► దెందులూరుకు సీఎం జగన్ చేరుకున్నారు. సభా ప్రాంగణానికి బయల్దేరారు. దారిపోడవునా సీఎంకు అపూర్వ స్వాగతం పలికారు. Time: 10:10AM ► ఏలూరు జిల్లా దెందులూరుకు సీఎం జగన్ బయల్దేరారు. కాసేపట్లో వైఎస్సార్ ఆసరా పథకం కింద లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. సాక్షి, ఏలూరు జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు దెందులూరు చేరుకుంటారు. 10.50 నుంచి 12.35 గంటల మధ్య దెందులూరులో బహిరంగ సభలో పాల్గొని వైఎస్సార్ ఆసరా పథకం మూడో విడత ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. కాగా ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా మూడో విడత సాయాన్ని శనివారం విడుదల చేయనున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 78.94 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్ లేఖలు రాశారు. పది రోజుల పాటు జరిగే ‘ఆసరా’ పంపిణీ ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ది దారులకు సీఎం లేఖలను నేరుగా అందజేస్తారని అధికారులు తెలిపారు. వరుసగా మూడవ ఏడాది వైఎస్సార్ ఆసరా వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మూడవ విడతగా రూ. 6,419.89 కోట్ల ఆర్ధిక సాయాన్ని శనివారం నుంచి ఏప్రిల్ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావారణంలో 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేయనున్నారు. నేడు అందిస్తున్న రూ. 6,419.89 కోట్లతో కలిపి వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటివరకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 19,178 కోట్లు. పథకం ఉద్దేశ్యం ఈ పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుపడి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల ఆర్ధిక పురోగతికి దోహదపడుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా మహిళలు ఆర్ధికంగా అభివృద్ది చెంది వారి కుటుంబాలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ ఈ పథకం తీసుకురావడం జరిగింది. మహిళలను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దడం మహిళల జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకురావాలని, వారి కుటుంబంలో సుస్ధిరమైన ఆదాయం రావాలని, వారికి వారుగా సృష్టించుకునే వ్యాపార మరియు జీవనోపాధి అవకాశాలకు ఈ డబ్బును ఉపయోగించుకుని ఆర్ధికంగా అభివృద్ది చెందుతూ లక్షాధికారులు కావాలనే మంచి ఆలోచనతో ఈ పథకాన్ని అమలుచేయడం జరిగింది. మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్లుగా చేయడం కోసం, జీవనోపాధిని మెరుగుపరుచుకునే విధంగా అమూల్, హిందూస్తాన్ యూనిలివర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గ్యాంబల్, అలానా, అజియో రిలయెన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, కాల్గుడి, జియాన్, నినె, ఆయేకార్ట్, మహేంద్ర అండ్ ఖేతి వంటి వ్యాపార దిగ్గజాలతో, మరియు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకొని వారికి చక్కటి వ్యాపార మార్గాలు చూపి, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి పథకాలతో వారికి సుస్ధిరమైన ఆర్ధిక అభివృద్దికి సీఎం బాటలు వేశారు. కార్పొరేట్ సంస్ధలు, బ్యాంకులతో అనుసంధానం చేసి వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన సహకారంతో ఇప్పటివరకు 9,86,616 మంది అక్కచెల్లెమ్మలు కిరాణా దుకాణాలు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం, వస్త్రవ్యాపారం వంటి వ్యాపారాలు చేపట్టి నెలకు రూ. 7,000 నుండి రూ. 10,000 వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. అమూల్‌తో ఒప్పందం కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి లీటర్ పాలపై రూ. 5 నుంచి రూ. 15 వరకు అదనపు ఆదాయం లభిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్.. 78.94 లక్షల మందికి రూ.6,419 కోట్లు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆసరా పథకం మూడో విడత కింద రాష్ట్రవ్యాప్తంగా 78.94 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో రూ.6,419.89 కోట్ల మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్ జమ చేయనున్నారు. ఈ నెల 25న ఏలూరు జిల్లా దెందులూరులో లాంఛనంగా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి మొత్తం డబ్బులను నాలుగు విడతల్లో లబ్ధిదారులకు నేరుగా చెల్లించే వైఎస్సార్ ఆసరా పథకానికి అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,571 కోట్ల అప్పు ఉంది. ఇందులో ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లను మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. మూడో విడతగా ఇప్పుడు అందజేసే రూ.6,419.89 కోట్లతో కలిపి మొత్తం రూ.19,178.17 కోట్లను ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేసినట్టు అవుతుంది. ఈ డబ్బులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు ఏ అవసరానికైనా ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పది రోజులపాటు ఉత్సవాలు కాగా వైఎస్సార్ ఆసరా మూడో విడత పంపిణీ ఉత్సవాలను ప్రభుత్వం పది రోజుల పాటు పండుగలా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 5 వరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహిస్తారు. రోజుకు కొన్ని గ్రామ సమాఖ్యల పరిధిలో పంపిణీ జరిగే ప్రాంతంలో ఆ ప్రాంత ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించేందుకు గ్రామీణ పేదిరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదిరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఆయా కార్యక్రమాలకు స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీలతోపాటు సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. మంత్రులు కూడా రోజూ పాల్గొంటారు. చదవండి: మొక్కల డాక్టర్లు వచ్చేస్తున్నారు! ఇంటింటికీ వెళ్లి.. మరోవైపు ఇప్పటికే మార్చి 14 నుంచి 17 వరకు గ్రామ, వార్డు వలంటీర్లు, గ్రామ సమాఖ్య సహాయకులు (వీవోఏ), పట్టణ రిసోర్స్ పర్సన్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మూడో విడతలో వారికి ఎంత మొత్తం ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతుందో తెలియజేశారు. అలాగే మార్చి 18 నుంచి 20 వరకు సెర్ప్ కమ్యూనిటీ కోర్డినేటర్లు ఆయా పొదుపు సంఘాల సభ్యులందరితో సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల వారీగా లబ్ధిదారుల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 21న సచివాలయాల వారీగా సమావేశాలు ప్రారంభం కాగా, 23, 24 తేదీల్లో కూడా కొనసాగనున్నాయని సెర్ప్ అధికారులు వెల్లడించారు. చంద్రబాబు కాలంలో సంఘాలన్నీ కుదేలు 2014లో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని అప్పటి ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. తర్వాత ఆ హామీని అమలు చేయకుండా మోసం చేశారు. 2014 ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలు ఎవరూ కట్టవద్దని చంద్రబాబు పిలుపునివ్వడంతో మహిళలు ఆ రుణాలు కట్టలేదు. దీంతో వాటి వడ్డీలు కూడా చెల్లించలేనంతగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితిలో పొదుపు సంఘాలు పూర్తి చిన్నాభిన్నమై ‘ఏ’ కేటగిరీ సంఘాలు కూడా ‘సీ’, ‘డీ’ కేటగిరీల్లోకి వెళ్లిపోయాయి. పొదుపు సంఘాల రుణాలపై సున్నా వడ్డీ పథకానికి కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వడం నిలిపివేసింది. ఇలాంటి దుస్థితిలో రాష్ట్రంలో తిరిగి పొదుపు సంఘాల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టింది. దీంతో పొదుపు సంఘాలు తిరిగి జీవం పోసుకున్నాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడంలో మన రాష్ట్ర మహిళలు దేశంలోనే అత్యధికంగా ఉన్నారు. మన రాష్ట్రంలో 99.55 శాతం మంది రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు. దీంతో మొత్తం పొదుపు సంఘాల్లో 91 శాతం ఏ, బీ గ్రేడ్‌ల్లో కొనసాగుతున్నాయి. -
పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి!
సాక్షి, ఏలూరు: పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. పండుగ సందర్భంగా గోదావరిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతిచెందారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల ప్రకారం.. శివరాత్రి పండుగ వేళ ఏలూరులో విషాదం నెలకొంది. గోదావరిలో ఏడుగురు స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతిచెందారు. మృతులను తూర్పు గోదావరి జిల్లా దోసపాడు వాసులుగా గుర్తించారు. మృతుల వివరాలు ఇవే.. - ఓలేటి అరవింద్ (20) - ఎస్కే లక్ష్మణ్ (19) - పెదిరెడ్డి రాంప్రసాద్ (18). -
ఏలూరు జిల్లాలో బస్సు బీభత్సం
-
ఏలూరు జిల్లా: విస్సన్నపేటలో క్షుద్ర పూజల కలకలం
-
స్థలం వివాదం పరిష్కరిస్తానని.. వివాహేతర సంబంధం పెట్టుకుని..
చింతలపూడి(ఏలూరు జిల్లా): చింతలపూడిలో మహిళ మిస్సింగ్ కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. మహిళను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ కేసు వివరాలు వెల్లడించారు. చింతలపూడి ఎస్బీఐ నగర్‌కు చెందిన పొట్ల నాగమణి(37) భర్త చనిపోవడంతో ఇద్దరు కుమార్తెలతో పాటు అత్త , మామలతో కలిసి ఉంటుంది. ఖమ్మం జిల్లా గంగారం గ్రామంలో స్థలం విషయంలో వైరాకు చెందిన నంబూరి శ్రీనివాసరావుతో ఆమెకు పాత గొడవలు ఉన్నాయి. మృతురాలు 2016లో ఇదే స్థల వివాదంలో సివిల్ కోర్టులో పిటిషన్ వేసింది. మూడు సంవత్సరాల క్రితం చింతలపూడి మండలం, ఎండపల్లి గ్రామానికి చెందిన బర్రె రాంబాబు నాగమణికి పరిచయమయ్యాడు. తనకు తెలిసిన పెద్దలతో మాట్లాడి స్థలం వివాదం పరిష్కరిస్తానని నమ్మబలికాడు. అనంతరం నాగమణితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. స్థల వివాదం పరిష్కరించాలని నాగమణి పట్టుబట్టడంతో రాంబాబు శ్రీనివాసరావును కలిశాడు. నాగమణిని అడ్డు తప్పిస్తే ఉన్న స్థలంలో 6 కుంట్లతో పాటు రెండు లక్షల నగదు ఇస్తానని శ్రీనివాసరావు చెప్పడంతో రాంబాబు అంగీకరించాడు. దీంతో ఇద్దరూ పథకం ప్రకారం నాగమణిని అడ్డు తప్పించాలనుకున్నారు. గత నెల 19న రాంబాబు కారులో కాకినాడ సర్పవరం జంక్షన్లో ఉన్న శ్రీనివాస లాడ్జికి నాగమణిని తీసుకెళ్ళాడు. అదే రోజు రాత్రి కారు జాకీ రాడ్‌తో తలపై కొట్టి చీర చెంగుతో మెడకి గట్టిగా బిగించి హత్య చేశాడు. చదవండి: షాకింగ్.. ప్రియుడి మోజులో పడి.. భార్య ఎంతపని చేసిందంటే.. అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలు చేతికి ఉన్న బ్రాస్లెట్లు తీసుకున్నాడు. లాడ్జికి దగ్గరలో ఉన్న ఎరువుల దుకాణంలో పెట్రోలు డబ్బా, ఎరువుల సంచి కొని మృతదేహాన్ని మూటకట్టి కారులో వేసి 21వ తేదీ తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రం దమ్మపేట మండలం ఆర్లపెంట గ్రామ శివారులోని డంపింగ్ యార్డు వద్ద పెట్రోల్ పోసి నాగమణి మృతదేహాన్ని తగలబెట్టాడు. అనంతరం మృతురాలి సోదరుడితో కలిసి చింతలపూడి పోలీసులకు నాగమణి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. రాంబాబుపై అనుమానం వచ్చి విచారించగా పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నారు. సీఐ ఎంవీఎస్ మల్లేశ్వరరావు తన సిబ్బందితో రాంబాబుతో పాటు నంబూరి శ్రీనివాసరావును పట్టుకుని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. -
షాకింగ్.. ప్రియుడి మోజులో పడి.. భార్య ఎంతపని చేసిందంటే..
ముసునూరు(ఏలూరు జిల్లా): ఇసుక తోలడానికి వెళ్ళిన వ్యక్తి అదృశ్యమవడం, అనంతరం హత్యకు గురవడం సంచలనం సృష్టించింది. మండలంలోని యల్లాపురానికి చెందిన రాయనపాటి రాటాలు(కాశి)(36) జనవరి 3న తన వ్యానులో ఇసుక లోడు చేసి రమణక్కపేటలో విక్రయానికి వెళ్తున్నానని చెప్పాడు. తెల్లారినా ఇంటికి రాకపోవడంతో తండ్రి సత్యనారాయణ ముసునూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనుమానితులను విచారించగా.. అతనిని హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని సమాచారం. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని మృతుని భార్య ప్రియుడితో కలసి హత్య చేయించినట్లు వెల్లడైంది. అదృశ్యమైన రోజు రాత్రి రమణక్కపేట నుంచి తిరిగి వస్తున్న మృతుడు రాటాలును అతని భార్య, ప్రియుడు, మరో ముగ్గురు కలసి సూరేపల్లి మామిడి తోటలో హత్య చేసి, లోపూడి అడవిలో దహనం చేశారు. అనంతరం మళ్లీ వెళ్ళి చూడగా శవం పూర్తిగా కాలలేదని గుర్తించారు. దీంతో తన వ్యానులో వేసుకుని యల్లాపురం గ్రామంలోని తమ్మిలేరులో పాతిపెట్టినట్లు సమాచారం. చదవండి: ఈ భార్యాభర్తలు మామూలోళ్లు కాదు.. సినిమా స్టైల్లో.. -
కొల్లేట్లో కొండచిలువ.. ఐయూసీఎన్ రెడ్ లిస్టులో ‘రాక్ పైథాన్’
కొల్లేరంటే కిక్కిస పొదలు.. పెద్దింట్లమ్మ ఆలయం.. విభిన్న రకాల చేపలు.. వలస పక్షులు.. నీటి పిల్లులు.. అరుదైన కుక్కలకు మాత్రమే ప్రసిద్ధి అనేది మొన్నటి మాట. ఆ జాబితాలో ఇప్పుడు కొండ పాములుగా పిలిచే కొండచిలువలు(ఇండియన్ రాక్ పైథాన్లు) సైతం చేరిపోయాయి. సుమారు మూడు దశాబ్దాల క్రితం ఎగువ అరణ్య ప్రాంతాల నుంచి బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వంటి వాగుల ద్వారా కొల్లేరుకు వలస వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఉప్పుటేరుల మధ్య పొదలు.. చేపల చెరువుల గట్లపై ఆవాసాలను ఏర్పాటు చేసుకుని మనుగడ సాగిస్తున్నాయి. కైకలూరు(ఏలూరు జిల్లా): కొండ చిలువలు చెట్లపై మాత్రమే ఉంటాయని భావిస్తుంటారు. ఇవి నీటిలో సైతం వేగంగా ఈదగలవు. ఎక్కువ సమయం ఇవి నీటిలోనే గడుపుతుంటాయి. చిత్తడి నేలలు, గడ్డి భూములు, రాతి పర్వతాలు, నదీ లోయల్లో ఇవి నివసిస్తుంటాయి. పాడుబడిన క్షీరదాల బొరియలు, చెట్లు, మడ అడవుల్లో దాక్కుంటాయి. కోళ్లు, పక్షులు, ఎలుకలు, అడపాదడపా ఇతర జంతువులను సైతం ఆహారంగా తీసుకుంటాయి. అలాంటి కొండచిలువలు ఇప్పుడు కొల్లేరుకు అతిథులయ్యాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 9 మండలాల పరిధిలో.. 77,138 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. ఇక్కడ 2.80 లక్షల ఎకరాల్లో చేపల చెరువులు సాగవుతున్నాయి. ఈ చెరువుల చెంతకు సుమారు మూడు దశాబ్దాల క్రితం అరణ్య ప్రాంతాల నుంచి బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వంటి వాగుల ద్వారా కొండచిలువలు వలస రావటం మొదలైంది. కిక్కిస పొదలు, చేపల చెరువుల గట్లపై ఆవాసాలను ఏర్పాటు చేసుకుని ఇక్కడే తిష్టవేశాయి. ఇట్టే పెరిగిపోతాయి ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొండంగి, మట్టగుంట, పడమటిపాలెం, కైకలూరు మండలం ఆటపాక, వరాహపట్నం, భుజబలపట్నం, ముదినేపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ప్రాంతాల్లో కొండచిలువల సంచారం కనిపిస్తోంది. చేపల చెరువులపై కొండచిలువలు సంతానోత్పత్తి చేస్తున్నాయి. ఇండియన్ రాక్ పైథాన్‌గా పిలిచే కొండచిలువల శాస్త్రీయ నామం పైథాన్ మోలురూస్. ఇవి 12 అడుగుల పొడవు, 52 కేజీల బరువు పెరుగుతాయి. వీటి జీవిత కాలం గరిష్టంగా 21 సంవత్సరాలు. ఇవి పుట్టిన తర్వాత త్వరగా పెద్దవి అవుతాయి. ఏడాది వయసు దాటిన తర్వాత నుంచి జత కడుతుంటాయి. సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇవి జత కట్టి 2 నుంచి 3 నెలల్లో గర్భం దాలుస్తాయి. అనంతరం మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో రోజుకు 20 నుంచి 30 గుడ్ల చొప్పున కనీసం 100 గుడ్ల వరకు పెడతాయి. నాలుగు నెలల పాటు గుడ్లను పొదుగుతాయి. పొదిగిన గుడ్లలో 80 శాతానికి పైగా పిల్లలు అవుతాయి. పుట్టిన పిల్లలు 18–24 అంగుళాల వరకు పొడవు ఉంటాయి. అయితే, పుట్టిన వాటిలో 25 శాతం పిల్లల్ని వరకు తల్లే తినేస్తుంది. ఆహారం అందక ఇంకొన్ని చనిపోతాయి. చివరకు 10–15 పిల్లలు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. ఇవి మాంసాహారులు. క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలను తింటాయి. ఒకసారి ఆహారం తీసుకున్న తర్వాత వారం పాటు ఏమీ తినకుండా ఉండగలవు. ఎక్కువగా ఒంటరి జీవితం గడుపుతాయి. సంభోగ సమయంలో మాత్రమే జత కడతాయి. ప్రపంచంలో అతి పెద్ద పాముల్లో ఇది కూడా ఒకటి. కొండచిలువలకు అండ ఏదీ! కొండచిలువలు విషసర్పాలు కానప్పటికీ ప్రజల చేతిలో హతమవుతున్నాయి. వీటి ఆకారం భారీగా ఉండటంతో ప్రజలు భయపడి చంపేస్తున్నారు. కొద్ది ఘటనల్లో మాత్రమే అటవీ శాఖ అధికారులు వీటిని రక్షించి చింతలపూడి ఎగువన అడవుల్లో వదులుతున్నారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) హాని కలిగే జాతుల జాబితా (రెడ్ లిస్ట్)లో వీటిని చేర్చింది. ఐయూసీఎన్ సంస్థ దాదాపు 40 శాతం రాక్ పైథాన్ జాతి అంతరించిందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొల్లేరు గ్రామాల్లో ఏటా 30 నుంచి 40 కొండచిలువలు ప్రజల చేతిలో హతమవుతున్నట్టు అంచనా. అటవీ శాఖ కొండచిలువలను కూడా షెడ్యూల్–1లో చేర్చింది. వీటిని చంపటం నేరమని ప్రకటించింది. చంపొద్దు.. సమాచారం ఇవ్వండి.. ఇండియన్ రాక్ పైథాన్లు అరుదైన సరీసృపాలు. ఇవి విషపూరితం కావు. చేపల చెరువుల వద్ద ఇవి సంచరిస్తున్నాయి. అరుదుగా జనాలకు తారసపడుతున్నాయి. ఇటీవల మత్స్యకారుల వలల్లో ఇవి చిక్కాయి. అటవీ శాఖ సిబ్బంది వీటిని అడవుల్లో సురక్షితంగా వదులుతున్నారు. కొండచిలువలు కనిపిస్తే వాటిని చంపొద్దు. వీటిని చంపటం నేరం. అందువల్ల ఎక్కడైనా కొండచిలువలు కనిపిస్తే అటవీ అధికారులకు సమాచారం తెలియజేయండి. – జె.శ్రీనివాస్, అటవీ శాఖ రేంజర్, కైకలూరు -
AP: దేశంలో పెద్ద మంచినీటి సరస్సు మన రాష్ట్రంలోనే.. ప్రత్యేకతలివే!
అరుదైన చేపలకు జన్మస్థలం... వలస పక్షులకు ఆవాసం... మూడున్నర లక్షల మందికి నివాసం...పెద్దింట్లమ్మ కొలువు దీరిన పుణ్యక్షేత్రం... మన కొల్లేరు. 901 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి దేశంలోనే అత్యంత పెద్ద మంచినీటి సరస్సుగా... జీవవైవిధ్యానికి జలతారుగా కొల్లేరు ప్రత్యేకతను సంతరించుకుంది. ఉప్పునీటిని, మురుగునీటిని తనలో ఇముడ్చుకుని... తనను నమ్మి వచ్చిన పక్షులు, మనుషులు... ఒకటేమిటి సకలజీవరాశులను అక్కున చేర్చుకుని స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అందిస్తోంది. ఘన చరిత్రకు ఆనవాళ్లు.. మూడో శతాబ్దం నుంచి ఈ సరస్సు పురాతన గ్రంధాల్లో ఉంది. కొల్లేరుపై పట్టు కోసం పూర్వం రాజుల మధ్య యుద్ధాలు జరిగినట్లు చరిత్ర చెబుతోంది. చైనా యాత్రికుడు హ్యూయాన్‌త్సాంగ్.. వెంగీ నగరంతోపాటు కొల్లేరును దర్శించినట్టు పలు గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ఇక కొల్లేరును నూజివీడు జమీందార్లు తమకు విశ్వాసంగా ఉండే ‘కామదాన’ కుటుంబానికి దానం ఇచ్చినట్టు చెబుతారు. సరస్సులో ఊళ్లు ఎలా వెలిశాయంటే.. వరుస యుద్ధాల కారణంగా 17వ శతాబ్దంలో ఒడిశాలో తీవ్ర కరువు ఏర్పడింది. దీంతో అక్కడి వడ్డెర కులాలకు చెందిన పలు కుటుంబాలు జీవనాధారం వెదుక్కుంటూ వలస వెళ్లాయి. ఆ క్రమంలో సుమారు 10 కుటుంబాలు కొల్లేరు ప్రాంతానికి వచ్చాయి. సరస్సు మధ్యలో మట్టి దిబ్బలపై గుడిసెలు వేసుకుని చేపలను వేటాడి తింటూ జీవనం గడిపేవారు. ఆ తర్వాత పచ్చి, ఎండు చేపల విక్రయం ద్వారా జీవనోపాధి పొందారు. క్రమంగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. పక్క గ్రామాల దురాక్రమణ నుంచి తమను కాపాడుకోవడానికి పలు సందర్భాల్లో కత్తులు, బరిసెలతో గ్రామాల మధ్య హోరాహోరీ యుద్ధాలు జరిగేవి. సుమారు 30 ఏళ్ల క్రితం ప్రత్తికోళ్లలంక, పందిరిపల్లిగూడెం గ్రామాల మధ్య సరిహద్దు విషయమై రెండు పర్యాయాలు జరిగిన పోరులో సుమారు 15 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇటువంటి కొట్లాటలు ఎన్నో కొల్లేరులో జరిగాయి. తొలినాళ్లలో రవాణాకు తాటిదోనెలను వాడేవారు. ఆ తర్వాత నాటు పడవలు, లాంచీలు వినియోగించేవారు. ఇప్పుడు రోడ్లు అభివృద్ధి చెందడంతో వాహనాలు ఉపయోగిస్తున్నారు. కొల్లేరుపై ఆధారపడి జీవించే ప్రజలు చేపలను వేటాడి విక్రయిస్తుంటారు. పర్యాటకంతో కొత్త అందాలు కొల్లేరును పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కొల్లేరులో కొలువైన పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయం, రోడ్లు, వంతెనల అభివృద్ధి, అటపాక పక్షుల కేంద్రాన్ని తీర్చిదిద్దడం, ఉప్పుటేరుపై అక్విడక్ట్‌ల నిర్మాణం వంటి అనేక పనులు వేగంగా జరుగుతున్నాయి. కొల్లేరులో అతిథి గృహాలు, రిసార్టులు, బోట్ షికారు వంటివి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. వలస పక్షులకు పుట్టిల్లు.. ► సైబీరియా, ఆ్రస్టేలియా, నైజీరియా వంటి అనేక దేశాల నుంచి ఏటా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో వలస పక్షులు ఇక్కడికి వచ్చి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. ► గతంలో వలస పక్షులకు తోడు స్థానిక పక్షులన్నీ కలిపి 189 రకాలు కొల్లేరుపై ఆధారపడి జీవించేవి. ఇప్పుడు సుమారు 73 రకాల పక్షులున్నట్టు లెక్కతేల్చారు. ► కైకలూరు సమీపంలోని అటపాక పక్షుల విహార కేంద్రం వద్ద శీతాకాలంలో పెలికాన్, పెయింటెడ్ సాŠట్క్ వంటి విదేశీ పక్షులు సందడి చేస్తుంటాయి. ► కొల్లేరులో దాదాపు 140 రకాల చేప జాతులు ఉన్నట్టు అంచనా. ► అరుదైన నల్ల జాతి చేపలు ఇక్కడే పురుడుపోసుకున్నాయి. ► మార్పు, కొరమీను, ఇంగిలాయి, జల్ల, బొమ్మిడాయి, గొరక, వాలుగ, ఇసుక దొందులు వంటి చేపలు ఇక్కడ పుట్టినవే. కొల్లేరు విస్తరణ ఇలా.. ► ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో ఉన్న తొమ్మిది మండలాల్లో 77,138 ఎకరాల్లో విస్తరించింది. ► సుమారు 901 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన కొల్లేరు ప్రాంతంలో 122 గ్రామాలున్నాయి. వాటిలో సుమారు మూడున్నర లక్షల మంది జీవిస్తున్నారు. ► అతిపెద్ద మంచినీటి (చిత్తడి నేలల) సరస్సుగా 1971లో ఇరాన్‌లోని రాంసార్ సదస్సు తీర్మానించింది. ► 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు ఈ సరస్సులోకి చేరుతుంది. ► ఉప్పుటేరు ద్వారా కొల్లేటి నీరు సముద్రంలో కలుస్తుంది. -
ఏలూరు వ్యాప్తంగా అంబరాన్నంటుతున్న సంక్రాంతి సంబరాలు
-
ఏపీ: ఈసారి ‘క్రాస్’ పుంజులతో..
కైకలూరు: సంక్రాంతి అంటేనే కోడిపందేలకు పెట్టింది పేరు. కత్తులతో కుత్తుకలు తెగే పుంజుల పోరాటాన్ని రక్తికట్టించేందుకు నిర్వాహకులు ఎప్పటిలాగే ఈ ఏడాదీ ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి విభిన్నంగా క్రాస్డ్ జనరేషన్ పుంజులను బరిలోకి దించుతున్నారు. ఈ రోమాంచిత పోటీలకు జస్ట్ ఆరు రోజులే గడువు మిగిలి ఉంది. టిక్..టిక్..టిక్.. గతేడాది జనవరిలో కోడిపందేల రూపంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.900 కోట్లు చేతులు మారాయన్నది ఓ అంచనా. ఇందులో కోడిపందేలకు పెట్టింది పేరైన ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల వాటా అత్యధికంగా రూ.500 కోట్లు ఉండొచ్చు. నోట్ల రద్దు, కరోనా ప్రభావంతో గతంలో పందేల జోరు తగ్గినా, ఈ ఏడాది పరిస్థితులు అనుకూలించడంతో రాష్ట్రంలో ఈ ఏడాది ఇంకా ఎక్కువగా పందేలు ఉంటాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కోడిపందేల నిర్వాహకులు పందెపు బరులను సిద్ధంచేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు.. ఇప్పటికే పలు జిల్లాల్లో లాడ్జిలు, అతిథి గృహాలు బుక్కయిపోయాయి. కోడి పందేలు.. కొత్త పుంతలు.. ఈ ఏడాది కోడిపందేలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. క్రాస్ జనరేషన్ కోడిపుంజుల హవా కొనసాగుతోంది. అమెరికన్ గేమ్ పాల్, అమెరికన్ పెర్విన్, బ్రెజిల్ జాతి కోళ్లను తీసుకొచ్చి దేశీయ నెమలి, డేగ వంటి జాతి కోళ్లతో క్రాసింగ్ చేయిస్తున్నారు. పందేనికి సిద్ధమైన వీటి ధర రూ.లక్ష పైమాటగానే ఉంది. ఇక కోడిపుంజుల పెంపకాన్ని పలు జిల్లాల్లో నిర్వాహకులు కుటీర పరిశ్రమగా మార్చుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో దాదాపు 300 కోడిపుంజుల శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 18 నెలల పాటు పుంజులను పోటీలకు సిద్ధంచేయడానికి ఒక్కో శిక్షకుడికి రూ.15 వేలు జీతం ఇస్తున్నారు. యంత్రాలలో కోడిగుడ్లను పొదిగించి నాణ్యమైన పుంజు జాతులను తయారుచేస్తున్నారు. మార్పు కోసం పోలీసుల యత్నం హైకోర్టు ఆదేశాలతో కోడిపందేలను అడ్డుకోవడానికి గతంలో పోలీసులతో పాటు ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా రంగంలోకి దిగారు. పోలీసు యాక్ట్ 144 సెక్షన్‌ను విధించారు. బైండోవర్లు చేసి, వేలాదిగా కోడి కత్తులను సీజ్ చేశారు. ఈ ఏడాది కూడా భారీగా కోడికత్తులను సీజ్ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడిపందేలకు సంబంధించి 900 కేసులు నమోదు చేశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్, క్రికెట్ వంటి పోటీలను మార్పు కోసం నిర్వహిస్తున్నారు. కమిటీలతో కట్టడి చేస్తాం.. సంక్రాంతి పండుగ సమయంలో కోడిపందేలు, జూదాలను కట్టడి చేయడానికి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటుచేశాం. ఏలూరు జిల్లాలో కేవలం 15 రోజుల్లోనే 45 కేసులు నమోదు చేశాం. ఇప్పటికే పెట్రోలింగ్ టీంలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా జూదాల వైపు దృష్టి మళ్లకుండా పోలీస్స్టేషన్ల పరిధిలో వాలీబాల్, క్రికెట్ వంటి పోటీలను పోలీసు శాఖ ఏర్పాటుచేసింది. – రాహుల్‌దేవ్ శర్మ, ఎస్పీ, ఏలూరు జిల్లా -
సీతాకోక చిలుకల హరివిల్లు
బుట్టాయగూడెం(ఏలూరు జిల్లా): ఎన్నెన్నో అందాలు.. అన్నింటా అందాలు.., సీతాకోక చిలుకకు చీరలెందుకు.. అని కవులు సీతాకోక చిలుక అందాలను అభివర్ణించారు. సప్తవర్ణ శోభితమైన వాటి సోయగాలు ప్రకృతి ప్రేమికుల మదిని దోచుకుంటున్నాయి. ప్రకృతి అందాలతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న పాపికొండల అభయారణ్యం జీవవైవిధ్యంతో అలరారుతోంది. అరుదైన రకాల సీతాకోక చిలుకలకు ఆలవాలంగా నిలుస్తోంది. జాతీయస్థాయి విజేత ఓకలీఫ్ పాపికొండల అభయారణ్యంలో జంతువులు, వృక్షాలే కాక అందమైన రంగురంగుల సీతాకోక చిలుకలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 130 రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. గతేడాది జాతీయ స్థాయిలో నిర్వహించిన ఉత్తమ సీతాకోక చిలుకల పోటీలకు పాపికొండల నేషనల్ పార్క్‌లో ఉన్న 3 రకాల సీతాకోక చిలుకలు పోటీపడ్డాయి. తుది పోరులో దేశవ్యాప్తంగా 7 రకాల సీతాకోక చిలుకలు ఎంపిక కాగా వీటిలో పాపికొండల అభయారణ్యంకు చెందిన 3 రకాల ఉన్నాయి. వీటిలో ఆరెంజ్ ఓకలీఫ్ జాతీయ సీతాకోక చిలుకగా ఎంపికయ్యింది. ఇవి వర్షాకాలం, శీతాకాలం సమయంలో గుంపులుగా తిరుగుతూ చూపరులను ఆకట్టుకుంటాయి. పచ్చని చెట్ల మధ్య సీతాకోక చిలుకలు ఎగురుతుండటం ఆహ్లాదంగా అనిపిస్తుంది. అరుదైన సీతాకోక చిలుకలు పాపికొండల అభయారణ్యంలో కనిపిస్తున్నాయి. 1,045 రకాల జంతువులు పాపికొండల అభయారణ్యం ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ పార్కుగా 2008 నవంబర్ 4న ప్రకటించింది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో గోదావరికి ఇరువైపులా 1,01,200 హెక్టార్ల పరిధిలో పాపికొండల అభయారణ్యం విస్తరించి ఉంది. 1978లో పాపికొండల అభయారణ్యం 591 కిలోమీటర్ల విస్తీర్ణంలోని రిజర్వ్ ఫారెస్ట్‌గా ఉండేది. జాతీయ పార్క్‌గా ప్రకటించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం దీని పరిధిని విస్తరించింది. జంతు, వృక్ష సంపదను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనివల్ల ఇక్కడి జంతుజాతుల సంఖ్య మరింత పెరిగిందని వైల్డ్‌లైఫ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 1,045 రకాల జంతువులు ఉన్నట్లు గుర్తించామని అధికారులు అంటున్నారు. పెద్ద పులులు, చిరుతలు, అలుగులు, గిరినాగులతో పాటు పలురకాల జంతువులకు నిలయంగా అభయారణ్యం మారింది. అరుదైన జీవజాలం అరుదైన జీవజాలానికి నిలయంగా పాపికొండల అభయారణ్యం ఉంది. ఇక్కడ రకరకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. అలాగే వృక్ష సంపద ఉంది. వీటితోపాటు పలురకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. 2021లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో కామన్ జెజెబెల్, కామన్ నవాబ్, ఆరెంజ్ ఓకలీఫ్ అనే మూడు జాతులు ఎంపికయ్యాయి. ఆరెంజ్ ఓకలీఫ్ అనే సీతాకోక చిలుక జాతీయ సీతాకోక చిలుకగా ఎంపికయ్యింది. ఈ అభయారణ్యంలో 130 రకాల రంగుల సీతాకోక చిలుకలు ఉన్నాయి. – జి.వేణుగోపాల్, వైల్డ్‌లైఫ్ డిప్యూటీ రేంజర్, పోలవరం -
సంక్రాంతి సంబరాలు షురూ.. గిరి పల్లెల్లో మొదలైన సందడి
బుట్టాయగూడెం (ఏలూరు జిల్లా): సంక్రాంతి.. ఇది ఒక పండుగ మాత్రమే కాదు. ఎన్నెన్నో అనుభూతులు, మరెన్నో మేళవింపులు... భావోద్వేగాలు... ఒక మాటలో చెప్పాలంటే ఏడాదికి సరిపోయే ఎన్నో అద్భుతమైన తీపి జ్ఞాపకాల సంబరం. అలాంటి పండుగ రెండు వారాల్లో రాబోతుంది. అయితే అంతకన్నా ముందే పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఆట పాటలతో హోరెత్తించారు. సంక్రాంతి అనగానే వెంటనే గుర్తుకు వచ్చేవి భోగిమంటలు.. సంప్రదాయ పంచెకట్లు, పట్టు పరికిణీలు, గంగిరెడ్లు, డూడూ బసవన్నలు, సన్నాయి వాయిద్యాలు, రంగురంగుల ముగ్గులు, ఎడ్ల పందేలు, కోడి పందేలు, జానపదాలు, సరదాలు, షికార్లు ఇలా అనేక రకమైన కళలు, సాంస్కృతిక మైమరపుల కలబోతే సంక్రాంతి. సంక్రాంతి పండుగలో సాంస్కృతిక శోభను అదిమి పట్టుకునే విధంగా బుట్టాయగూడెం మండలంలోని తెల్లంవారిగూడెం పాఠశాలలో సంక్రాంతి సంబరాలను ఉపాధ్యాయులు నిర్వహించారు. హరిలో రంగ హరి అంటూ హరిదాసు సందడి, భోగిమంటలు, గొబ్బెమ్మలతో ముగ్గులు, రోలులో పిండి కొట్టే సాంప్రదాయం ఇలా అన్ని ఉట్టిపడేలా ఏర్పాటు చేసి ముందుగానే సంక్రాంతి సందడిని తీసుకువచ్చారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద సంక్రాంతి వచ్చిందే తుమ్మెద.. సరదాలు తెచ్చిందే తుమ్మెద... అంటూ సాగే పాటకు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో పాటు ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సైతం నృత్యాలు చేశారు. అదేవిధంగా భోగి తెచ్చే భోగం అనే పాటకు కూడా విద్యార్థులతో పాటు బాలరాజు నృత్యం చేసి అందరినీ అలరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పండగను ఆనందోల్సాహాలతో జరుపుకున్నారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు సంక్రాంతి, జానపద పాటలకు నృత్యాలు విద్యార్థినులను ఉత్సాహపరిచారు. (క్లిక్ చేయండి: ఆంధ్రా ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి) -
కాలం మారింది.. హరిదాసులు అప్డేట్ అయ్యారు!
సంక్రాంతి నెల రావడంతో పల్లెల్లో సందడి మొదలైంది. హైటెక్ హరిదాసులు సందడి చేస్తున్నారు. మోటారు వాహనాలపై తిరుగుతూ దానం స్వీకరిస్తున్నారు. సంక్రాంతి పండుగకు నెల రోజుల ముందు నుంచే ఈ హరిదాసులకు పూలు, పండ్లు, ధాన్యం ఇస్తుంటారు. రానురాను ప్రజల్లో భక్తిభావం తగ్గుతుందని, హరిదాసులు జీవించడానికి ఆశించిన విధంగా ఆదాయం రాకపోయినా తాతముత్తాతల నుంచి వస్తున్న ఈ వృత్తినే కొనసాగిస్తున్నామని కొవ్వలి గ్రామానికి చెందిన హరిదాసు మహేష్ అన్నారు. – దెందులూరు(ఏలూరు జిల్లా) -
ప్రజారోగ్యంతో చెలగాటం.. చేపలకు మేతగా కుళ్లిన కోళ్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కుళ్లిన కోడిగుడ్లు, కోడి పేగులు, ఈకలు, పాడైపోయిన అన్నం ఇవి కొల్లేరు ప్రాంత ఫంగస్ చేపల సాగు కోసం చెరువుల్లో వేస్తున్న ఆహారం. ఈ చేపలను మనం తింటే ఏమవుతుంది. వ్యర్థ పదార్థాలను సైతం వృథా కానివ్వకుండా చేపలకు మేతగా వేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఏలూరు జిల్లా పరిధిలో ఇటీవల పట్టుబడుతున్న వ్యర్థ పదార్థాల వాహనాల కేసులు ఇందుకు నిదర్శనంగా మారాయి. ఈ ఏడాది నవంబరు 14న కలెక్టరు వి.ప్రసన్న వెంకటేష్ వ్యర్థాల నివారణకు మండల స్థాయిలో టాస్క్ఫోర్సు కమిటీల పర్యవేక్షణకు జీవో విడుదల చేశారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో 2,50,045 ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా సాగు విస్తరించింది. వ్యాధులకు తట్టుకుని, ఎలాంటి మేతనైనా జీర్ణం చేసుకునే గుణాలు కలిగిన ఫంగస్ చేపల సాగు దాదాపు 12,000 ఎకరాల్లో జరుగుతోంది. సాధారణంగా చేపల పెంపకానికి డీవోబి, వేరుశెనగ చెక్క, పిల్లెట్లు మేతగా ఉపయోగిస్తారు. పిల్లెట్లతో ఫంగస్ చేపలు త్వరగా బరువు పెరగవు. పైగా ఖర్చు ఎక్కువ. అందుకే వాటి స్థానంలో కోళ్ల వ్యర్థాలు, కుళ్ళిన కోడిగుడ్లు చెరువులో వేస్తున్నారు. టాస్క్ఫోర్సు కమిటీలు రాష్ట్ర చేపల రైతుల సంఘం ఫిర్యాదుతో 2016లో అప్పటి మత్స్యశాఖ కమిషనరు చేపల చెరువుల్లో కోడి వ్యర్థాల మేతను నిషేధిస్తూ జీవో నెంబరు 56 ద్వారా కఠిన నిబంధనలు విధించారు. అప్పట్లో నిషేధిత క్యాట్ ఫిష్ సాగు చేసేవారు. ఆ సాగును కేంద్రం నిషేధించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యర్థాలను ఫంగస్ సాగులో వేస్తున్నారు. ఫంగస్ సాగు చేసే అందరి రైతులు వ్యర్థాలను వేయడం లేదు. ఈ ఏడాది నవంబరులో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ నిషేధిత జీవోను పటిష్టంగా అమలు చేయాలని ఆయా శాఖాలకు ఆదేశించారు. మండల స్థాయిలో తహసీల్దారు, వీఆర్ఓ, వెహికల్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ, మత్స్య అభివృద్ధి అధికారి(ఎఫ్‌డీవో)లతో టాస్క్ఫోర్సు కమిటీని ఏర్పాటు చేశారు. పట్టుబడిన వ్యర్థాలను నాశనం చేయడం, వాహన డ్రైవర్ల లైసెన్సు రద్దు, వ్యర్థాలతో సాగు చేస్తున్న చెరువుల ఆక్వాకల్చర్ రిజిస్ట్రేషన్లు రద్దు వంటి చర్యలను టాస్క్ఫోర్సు చేస్తోంది. అక్రమ రవాణా ఇలా.. వ్యర్థాల అక్రమ రవాణాకు వేస్ట్ఫుడ్ మాఫియా బరితెగిస్తుంది. తెలంగాణ, విజయవాడ, గుడివాడ, ఏలూరు వంటి పలు ప్రాంతాల్లో చికెన్ షాపుల నుంచి కిలో రూ.ఐదు చొప్పున వ్యర్థాలను కొనుగోలు చేసి వాటిని పెంపకందారులకు రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. ఆయా దుకాణాల వద్ద డ్రమ్ములను ఏర్పాటు చేసి ఒక్కొక్కటి సేకరించి వ్యాన్లలో చెరువుల వద్దకు తరలిస్తున్నారు. హోటల్స్ నుంచి మిగిలిన అన్నం, కూరలను సేకరిస్తున్నారు. ఈ దందా రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. జిల్లాలో పెదపాడు, ఉంగుటూరు, మండవల్లి, కైకలూరు మండలాల్లో కోడి వ్యర్థాలను ఫంగస్ సాగులో ఉపయోగిస్తున్నారు. మండవల్లి మండలం నుచ్చుమిల్లి, కైకలూరు మండలం కొట్టాడ గ్రామాల్లో కోడి వ్యర్థాల వినియోగంపై కేసులు నమోదయ్యాయి. కఠిన చర్యలు తప్పవు కోడి వ్యర్థ్యాలను చెరువుల్లో ఉపయోగించడం వల్ల నీరు, నేల కలుషితమవుతాయి. ఇలాంటి చేపల సాగు మొత్తం ఆక్వాకల్చర్ పేరును పాడుచేస్తోంది. కొట్టాడ గ్రామంలో 12 క్వింటాల కోడి వ్యర్థాల వ్యాన్‌ను పట్టుకున్నాం. చెరువు యజమాని, వాహనదారుడిపై కేసులు నమోదు చేశాం. – ఎన్.భవిత, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కైకలూరు ప్రజారోగ్యానికి ముప్పు కుళ్లిన వ్యర్థాలతో సాగు చేసిన చేపలను మనుషులు తింటే ఆరోగ్యం పాడవుతోంది. ముఖ్యంగా దీని ప్రభావం మెదడుపై పడుతోంది. నరాల వ్యాధులు వస్తాయి. ఉదర కోశ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. చేపలకు మేతగా పెట్టిన వ్యర్థాల్లో కలుషిత రసాయనాలు శరీరంలోకి చేరుతాయి. ఇవి ఎంతో ప్రమాదకరం. – బి.శంకర్, కొల్లేటికోట పీహెచ్సీ డాక్టరు, కైకలూరు మండలం -
Eluru: లాడ్జికి తీసుకెళ్లి తాళి కట్టాడు.. గర్భం విషయం తెలియగానే..
నూజివీడు: మండలంలోని రావిచర్లకు చెందిన దేవరపల్లి సురేష్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఒక యువతి రూరల్ పోలీస్‌స్టేషన్ శుక్రవారం ఫిర్యాదు చేసింది. తనను లాడ్జికి తీసుకెళ్లి తాళి కట్టాడని.. తనకు గర్భం విషయం తెలిపి పెళ్లి చేసుకోమని అడగగా, పథకం ప్రకారం జ్యూస్‌లో మందు కలిపి తాగించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో యువతికి గర్భస్రావం అయింది. తనకు జరిగిన అన్యాయాన్ని సురేష్ పెద్దవాళ్ల దృష్టికి తీసుకెళ్లగా వాళ్లు ఆమెను అవమానించి, గ్రామమంతా చెప్పి అల్లరిపాలు చేస్తామని బెదిరించారంటూ బాధితురాలు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తలారి రామకృష్ణ తెలిపారు. చదవండి: (పరువు తీశారని మాజీ సర్పంచ్ ఆత్మహత్య) -
కొల్లేరులో వలస పక్షుల సందడి
కైకలూరు(ఏలూరు జిల్లా): కిక్కిస పొదలు.. అందమైన జలదారుల నడుమ ప్రకృతి పంపిన రాయబారులు రాజహంసల్లా సందడి చేస్తున్నాయి. వలస పక్షులతో కొల్లేరు కళకళలాడుతోంది. శీతాకాలం విడిది కోసం సైబీరియా, నైజీరియా, రష్యా, టర్కీ, యూరప్ దేశాల నుంచి వలస పక్షులు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ విస్తరించిన కొల్లేరు ప్రాంతానికి చేరుకున్నాయి. అందరికీ విదేశీ పక్షులుగానే కనిపించే.. ఈ విహంగాలు కొల్లేరు ప్రాంత వాసులకు మాత్రం ఇంటి ఆడపడుచులుగా ఏటా ఇక్కడకు విచ్చేస్తాయి. 6 లక్షల పక్షుల రాక రాష్ట్రంలో కొల్లేరు అభయారణ్యం 77,185 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఏటా కొల్లేరుకు దాదాపు 6 లక్షల విదేశీ పక్షులు వలస వస్తున్నాయి. అక్టోబర్‌లో వలసబాట పట్టే ఈ విహంగాలు ఇక్కడే సంతానోత్పత్తి చేసుకుని మార్చిలో తిరిగి పయనమవుతాయి. కొల్లేరు అభయారణ్యంలో 190 జాతులకు చెందిన పక్షులు జీవనం సాగిస్తున్నాయి. ఏలూరు జిల్లా ఆటపాక పక్షుల విహార కేంద్రానికి పెలికాన్ పక్షులు వేలాదిగా రావడంతో దీనికి పెలికాన్ ప్యారడైజ్‌గా నామకరణం చేశారు. ఏలూరు రేంజ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో నాలుగు వారాలుగా పక్షుల లెక్కింపు జరుగుతోంది. డిసెంబర్ రెండో వారానికి దాదాపు స్వదేశీ, విదేశీ పక్షులు 5 లక్షల 20 వేలను గుర్తించారు. ఏటా శీతాకాలంలో విదేశీ వలస పక్షులు 6 లక్షలు, స్వదేశీ పక్షులు 3.50 లక్షల వరకు గుర్తిస్తున్నామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. కొల్లేరు ప్రాంతంలో స్పాట్ బిల్డిన్ పెలికాన్, కామన్ శాండ్‌పైపర్, బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్, గ్లోబీ ఐబీస్, పెయింటెడ్ స్టార్క్, రివర్ టర్న్, జకనా, లార్జ్ విజిటింగ్ డక్, ఓరియంటల్ డాటర్, కామన్ రెడ్ షంక్ వంటి 43 రకాల వలస పక్షులను ప్రస్తుతానికి అటవీ సిబ్బంది గుర్తించారు. వలస పక్షుల సంఖ్య పెరుగుతోంది ప్రకృతి అనుకూలించడంతో కొల్లేరుకు వచ్చే వలస పక్షుల సంఖ్య పెరుగుతోంది. ఏటా 6 లక్షల విదేశీ పక్షులు వలస వస్తుండగా.. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పక్షుల గణన జరుగుతోంది. పక్షుల ఆవాసాల కోసం అటవీ శాఖ కృత్రిమ స్టాండ్లను ఏర్పాటు చేస్తోంది. – ఎస్వీకే కుమార్, ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ రేంజర్, ఏలూరు -
చినబాబు మూడు ముక్కలాట.. ‘గో ఎహెడ్.. నీకే టిక్కెట్..’
ఏలూరు తెలుగుదేశం పార్టీలో మూడు ముక్కలాట మొదలైంది. గతం నుంచీ ఉన్న ఇన్‌చార్జ్‌ను కాదని మరో ఇద్దరు టిక్కెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. చినబాబు అడిగినవారందరికీ సీటు గ్యారెంటీ హామీ ఇస్తున్నారట. అసలే ప్రజల్లోకి వెళ్ళడానికి ధైర్యం లేక పసుపు కేడర్ బిక్కచచ్చిపోయింది. మరోవైపు నేనే అభ్యర్థినంటూ ముగ్గురు రంగంలోకి రావడంతో కేడర్ అయోమయానికి గురవుతోందట. నూజివీడు మూడు ముక్కలాట మీరూ చదవండి. ముద్దరబోయిన వర్సెస్ కమ్మ ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చిన నూజివీడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పెద్ద కష్టమే వచ్చిందట. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే తెలుగు తమ్ముళ్లలో కన్ఫ్యూజన్ మొదలైందని టాక్ నడుస్తోంది. అందుకు కారణం నియోజకవర్గంలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలే అంటున్నారు. గట్టి పట్టున్న స్థానిక నేతలు లేకపోవడంతో.. గన్నవరం నుంచి వలస వచ్చిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు గత రెండు ఎన్నికల్లోనూ నూజివీడు నుంచి పోటీ చేశారు. ఓడిపోయినప్పటికీ ప్రస్తుతం నూజివీడు టీడీపీకి ఆయనే ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ ఇప్పుడు ముద్దరబోయిన వర్సెస్ కమ్మ సామాజిక వర్గ టీడీపీ నేతలు అనేలా ఇక్కడ ఇంటర్నల్ పాలిటిక్స్ నడుస్తున్నాయట. కొంతకాలంగా ముద్దరబోయిన వర్సెస్ మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కాపా శ్రీనివాసరావు అనేలా ఇక్కడి స్థానిక రాజకీయాలు సాగాయంటున్నారు. ఫలితంగా నూజివీడులో ముద్దరబోయిన వర్గం ఒకవైపు కమ్మసామాజిక వర్గం మరో వైపు అనేలా పరిస్థితులు మారిపోయాయని టీడీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. వ్యాపారం నుంచి రాజకీయం ఇదిలా ఉంటే.. ముద్దరబోయిన వర్సెస్ కాపా శ్రీనిసవారావు వర్గాలతోనే కేడర్ అయోమయంలో పడితే..తాజాగా మరో నేత ఎంట్రీ ఇచ్చారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన బిజినెస్ మ్యాన్ నూజివీడు టీడీపీ పాలిటిక్స్ లోకి ఎంటరయ్యాడట. నియోజకవర్గానికే చెందిన పర్వతనేని గంగాధరరావు హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడ్డారు. వచ్చే ఎన్నికల్లో నూజివీడు నుంచి పోటీ చేయాలనే లక్ష్యంతో గంగాధరరావు చినబాబుతో టచ్ లోకి వెళ్లాడట. నేనూ లోకలే..నాకూ టిక్కెట్ కావాలంటూ నూజివీడులో పర్యటిస్తున్నారట. ఫంక్షన్లు, ప్రారంభోత్సవాలు అంటూ గ్రామాల్లో తిరుగుతూ..తెలిసినవారికి, కావాల్సినవారికి ఆర్ధిక సహాయం అందిస్తూ ముద్దరబోయినను వ్యతిరేకించిన వారితో పాటు కమ్మ సామాజిక వర్గాన్ని కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడట. చినబాబు టికెట్ల హామీలు నూజివీడులోని ఈ ముగ్గురి పంచాయతీ ఇటీవల పార్టీ యజమానులు చంద్రబాబు, చినబాబు వద్దకు చేరిందట. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడతో అటు చంద్రబాబు, ఇటు చినబాబు తమ వద్దకు వచ్చిన వారికి గో ఎహెడ్.. నీకే టిక్కెట్ అంటూ హామీ ఇచ్చి పంపించేశారట. దీంతో ఈ ముగ్గురూ ఈసారి నేనే క్యాండెట్.. నాకే సీటు అంటూ కేడర్ దగ్గర ప్రచారం చేసుకుంటున్నారట. పరిణామాలన్నీ గమనిస్తున్న క్యాడర్ కు ఈ ముగ్గురిలో ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియడం లేదని టాక్. బీసీ సామాజికవర్గానికి చెందిన ముద్దరబోయినకు మద్దతివ్వాలా.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కాపా శ్రీనివాసరావు లేదా..బిజినెస్ మ్యాన్ పర్వతనేని గంగాధరరావు పంచన చేరాలో తేల్చుకోలేకపోతున్నారట. చదవండి: గన్నవరం టీడీపీ అభ్యర్థి ఎవరు?.. అసలు అక్కడ ఏం జరుగుతోంది? ముగ్గురు టిక్కెట్ అడుగుతున్నపుడు పార్టీ నేతలు కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. గన్నవరం నుంచి వలస వచ్చినా గతం నుంచి పార్టీని నమ్ముకుని ప్రస్తుతం ఇంచార్జ్‌గా ఉన్న.. బీసీ వర్గం నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావును పక్కన పెట్టేందుకు... కమ్మ వర్గం నేతలను ప్రోత్సహిస్తున్నారని చర్చ నూజివీడులో జరుగుతోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
చంద్రబాబు హైడ్రామా.. రెచ్చగొట్టే ప్రసంగాలతో.. విద్వేషాలు రగిల్చేలా..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రజలను రెచ్చగొట్టేలా.. స్థానికంగా విద్వేషాలు రగిల్చేలా.. స్థానిక ప్రజాప్రతినిధులను చులకన చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతూ చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగింది. ప్రతి చోటా హైడ్రామా సృష్టించి టీడీపీ కేడర్ గందరగోళం చేయడానికి ప్రయత్నించింది. పర్యావసానంగా కొయ్యలగూడెం మండలంలో చంద్రబాబుకు తీవ్రస్థాయిలో నిరసన సెగ తగిలింది. గో బ్యాక్ బాబు అంటూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, స్థానికులు ప్లకార్డులు చూపారు. మొత్తం మీద ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన నిరసనలు, స్వల్ప ఉద్రిక్తతలు, ధర్నాల నడుమ ముగిసింది. రెచ్చగొట్టే ప్రసంగాలతో.. కొయ్యలగూడెంలో చంద్రబాబు బీసీ సదస్సులో మాట్లాడి రోడ్‌షో ప్రారంభించి ప్రతి చోటా ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. అధినేతే అలా మాట్లాడుతుండటంతో టీడీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోయారు. కొయ్యలగూడెంలో చంద్రబాబుకు గో బ్యాక్ అంటూ వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన తెలియజేయడంతో రెచ్చిపోయిన టీడీపీ కేడర్ వారిపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు మూర్తిరాజు తలకు గాయమైంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో టీడీపీ రోడ్‌షో కొనసాగింది. అక్కడ నుంచి పోలవరం చేరుకున్న చంద్రబాబు నానా హడావుడి చేశారు. నా మానసపుత్రిక అయిన ప్రాజెక్టును చూడటానికి నన్నే అనుమతించరా అంటూ మహిళా డీఎస్పీపై మండిపడ్డారు. ప్రాజెక్టులో పనులు జరుగుతున్న క్రమంలో సందర్శించడానికి పోలీసు అనుమతి తప్పనిసరని, ముందుగా అనుమతి తీసుకోవాలని, పైగా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా అనుమతించడం లేదని చంద్రబాబుకు డీఎస్పీ చెప్పినా హడావుడి చేసి పెద్ద పెద్ద కేకలు వేసి టీడీపీ నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు సీరియస్‌గా పట్టించుకోకపోవడంతో 15 నిమిషాలు తర్వాత అక్కడ నుంచి లేచి వెళ్లి సభలో మాట్లాడి కొవ్వూరుకు చంద్రబాబు పయనమయ్యారు. ప్రతి చోటా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని తీవ్రస్థాయిలో దూషించడంతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు లక్ష్యంగా విమర్శలు ఆయన చేశారు. చదవండి: చంద్రబాబుకు చాదస్తం మరీ ఎక్కువైంది -
నిరసన సెగ.. కొత్త నాటకానికి తెరలేపిన చంద్రబాబు
ఏలూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓవరాక్షన్ చేశారు. రోడ్డుపై బైఠాయించి తననే అడ్డుకుంటారా అంటూ కొత్త డ్రామాకు తెరతీశారు. జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబుకు అడుగడుగునా నిరసన సెగ తగలడంతో కొత్త నాటకాన్ని ప్లే చేయబోయారు. పోలవరాన్ని పరిశీలిస్తానంటూ బాబు హడావిడి చేశారు. పోలవరానికి వెళ్లేదారిలో బైఠాయించి పబ్లిసిటీ స్టంట్‌కు తెరలేపారు చంద్రబాబు.యాత్రలో అడుగడుగునా నిరసన సెగలు తగలడం వల్లే కొత్త నాటకాన్ని రక్తికట్టించే యత్నం చేశారు చంద్రబాబు. కాగా, కొయ్యలగూడెం రోడ్ షోలో చంద్రబాబుకు నిరసన గళమే వినిపించింది. చంద్రబాబు ప్రతిపక్ష కావడం మా కర్మ అంటూ ఫ్లకార్డు ప్రదర్శించారు. మరొకవైపు సీఎం జగన్ ముఖ్యమంత్రి కావడం మా అదృష్టమంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. అక్కడ ఉన్న వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లు రువ్వారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో, వారిని పోలీసులు చెదరగొట్టారు. కాగా, ప్రశాంతంగా ఉన్న మా ప్రాంతంలో మళ్లీ ఉద్రికత్తలు, రెచ్చగొట్టేందుకే చంద్రబాబు యాత్రలు చేస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. ఇది చదవండి: చంద్రబాబుకు మరోసారి నిరసన సెగ.. -
చంద్రబాబుకు మరోసారి నిరసన సెగ.. ఎక్కడంటే?
సాక్షి, ఏలూరు: జిల్లాలోని కొయ్యలగూడెం రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. ఈ సందర్భంగా నిరసనకారులు చంద్రబాబు ప్రతిపక్ష నేత కావడం మాకర్మ అంటూ ఫ్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు. ఇదే సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం మా అదృష్టమంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు రెచ్చిపోయారు. అక్కడ ఉన్న వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లు రువ్వారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో, వారిని పోలీసులు చెదరగొట్టారు. కాగా, ప్రశాంతంగా ఉన్న మా ప్రాంతంలో మళ్లీ ఉద్రికత్తలు, రెచ్చగొట్టేందుకే చంద్రబాబు యాత్రలు చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఏలూరు జిల్లాలో చంద్రబాబుకు నిరసన సెగ
సాక్షి, ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లాలో చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి. జగనన్న పాలనే మా అదృష్టమంటూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ రోడ్లకు ఇరువైపుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చదవండి: జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ షాక్.. భారీగా ఆస్తుల అటాచ్ -
సృజనకు సాన.. వైజ్ఞానిక ప్రదర్శన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తిని పెంచి.. వారి ఆలోచనలకు సానపెట్టి నూతన ఆవిష్కరణలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విజ్ఞాన శాస్త్రం, గణితం, పర్యావరణాన్ని ముడి సరుకులుగా వినియోగించి సృ‘జన’హితమైన ఆవిష్కరణలు తీసుకువచ్చేలా విద్యార్థులను ఉపాధ్యాయులు సమాయత్తం చేస్తున్నారు. విజ్ఞాన ప్రదర్శనల ద్వారా చిన్నతనం నుంచే ఆవిష్కరణల ఆలోచనలు పెంచేలా మార్గదర్శకం చేస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లావ్యాప్తంగా పాఠశాల స్థాయిలో సైన్స్ ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. తొలుత పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనల్లో ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి వాటిని మండల స్థాయికి పంపుతారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనల్లో తమ నైపుణ్యాన్ని రంగరించి మండల స్థాయి అక్కడి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయికి తమ ఆవిష్కరణలు వెళ్లాలనే ఆసక్తి విద్యార్థుల్లో కనిపిస్తోంది. వారికి గైడ్ టీచర్లు సూచనలిస్తూ మరింత పదును పెడుతూ ప్రోత్సహిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచే ప్రదర్శనలు విద్యార్థుల్లో సహజంగా ఉండే బెరుకును పోగొట్టడానికి తొలుత వారి ఆవిష్కరణలను తమతో ఎప్పుడూ తిరిగే, తాము రోజూ చూసే సహ విద్యార్థుల మధ్యనే ఈ ప్రదర్శనలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. దీంతో మొదటగా వారు చదివే పాఠశాలలోనే విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించే ఏర్పాటుచేసింది. దీని ద్వారా తోటి విద్యార్థుల నుంచి వెల్లడయ్యే అభిప్రాయాలు, వారి నుంచి అందుకునే అభినందనలు విద్యార్థులకు సగం బలాన్నిస్తాయనేది ప్రధాన ఉద్దేశం. ఈ మేరకు ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లాలో ఈనెల 22, 23 తేదీల్లో పాఠశాల స్థాయిలో విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించారు. ఆవిష్కరణలకు మార్గనిర్దేశనం విద్యార్థులు ఆవిష్కరణలు చేయడానికి తగిన అంశాలను వెతుక్కోవాల్సిన పనిలేకుండా ప్రభుత్వమే కొన్ని అంశాలను సూచించింది. ఈ మేరకు విద్యార్థు లు పర్యావరణ అనుకూల పదార్థాలపై, ఆరోగ్యం, పరిశుభ్రతపై, సాఫ్ట్వేర్–యాప్స్ అభివృద్ధి, పర్యావరణం–వాతావరణ మార్పులు, గణిత నమూనాలు అనే అంశాలపై తమ ప్రాజెక్టులను సిద్ధం చేశారు. ఆయా ప్రాజెక్టులను పాఠశాల స్థాయిలో మంగళ, బుధవారాల్లో ప్రదర్శించారు. మండల స్థాయికి ఐదు చొప్పున.. పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన వాటిలో ఉత్తమమైన ఐదు ప్రాజెక్టులను ఎంపిక చేసి మండల స్థాయి ప్రదర్శనలకు పంపనున్నారు. ఇలా ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు మండల స్థాయిలో ప్రదర్శనకు వెళ్లనున్న నేపథ్యంలో పోటీ తీవ్రంగా ఉంది. వచ్చేనెల 12, 13వ తేదీల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో మండల స్థాయి ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. సృజనాత్మకతకు పెంచేలా.. విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తికి పదును పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇప్పటికే పాఠశాల స్థాయి ప్రదర్శనలు పూర్తయ్యాయి. కేవలం ప్రాజెక్టులు రూపొందించేలా ప్రోత్సహించడంతో పాటు ఆయా ప్రాజెక్టులను చూసి ఇతర విద్యార్థులు స్ఫూర్తి పొందడం ప్రదర్శనల ఉద్దేశం. అలాగే ప్రాజెక్టులను రూపొందించిన విద్యార్థులను ఆదర్శంగా తీసుకుని మిగిలిన పిల్లలు ఇటుగా ఆలోచించేలా కృషిచేస్తున్నాం. అందుకే పాఠశాల స్థాయిలో నిర్వహించిన ప్రదర్శనలకు సమీపంలోని ఇతర పాఠశాలల విద్యార్థులను కూడా తీసుకువెళ్లి వారికి ప్రాజెక్టులను పరిచయం చేయాలని సంబంధిత స్కూళ్ల ప్రధానోపాధ్యాయులను ఆదేశించాం. – ఆర్ఎస్ గంగాభవాని, జిల్లా విద్యాశాఖాధికారి, ఏలూరు -
మెరైన్ మత్స్య ఉత్పత్తుల్లో ఏపీకి ఐదు అవార్డులు
కైకలూరు(ఏలూరు జిల్లా): నేషనల్ ఫిషరీష్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్ఎఫ్డీబీ) ఏటా నవంబర్ 21న ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అందించే అవార్డుల్లో ఏపీకి 5 విభాగాల్లో చోటు దక్కింది. ఏ, బీ కేటగిరీలుగా ఎంపిక చేసిన జాబితాను ఎన్ఎఫ్డీబీ శుక్రవారం ప్రకటించింది. ఏపీలో ఉత్తమ మెరైన్ జిల్లాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఉత్తమ మెరైన్ చేపల రైతుగా ఏలూరు జిల్లా మట్టగుంటకి చెందిన తిరుమాని నాగరాజు, ఉత్తమ హేచరీగా కాకినాడ జిల్లాకు చెందిన సప్తగిరి హేచరీస్, ఉత్తమ ల్యాబ్‌గా తూర్పు గోదావరి జిల్లా రెడ్డి డ్రగ్స్.. ల్యాబ్‌కు చెందిన నరేష్కుమార్, ఉత్తమ ఆర్టెమియా టెక్నాలజీ ఇన్ఫ్యూషన్‌గా కవితారెడ్డికి అవార్డులు దక్కాయి. -
రూ.1,400 కోట్లతో ‘పశ్చిమ’కు తాగునీరు
సాక్షి, అమరావతి: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా కల్చర్‌తో ఏర్పడిన నీటి కాలుష్యంతో పాటు తీర ప్రాంతంలో ఉప్పునీటి సాంద్రత కారణంగా నెలకొన్న తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించేందుకు వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా రూ.1,400 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఇందుకు సంబంధించిన పనులకు సీఎం వైఎస్ జగన్ ఈ నెల 21న శంకుస్థాపన చేయనున్నారు. నిడదవోలు, తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, ఉంగుటూరు, దెందులూరు (కొంత భాగం), తాడేపల్లిగూడెం (కొంత భాగం) పరిధిలోని 26 మండలాల ప్రజలకు పథకం ద్వారా ఏడాది పొడవునా తాగునీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుంది. మొత్తం 1,178 గ్రామీణ నివాసిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ మంచినీటి కొళాయిని ఏర్పాటు చేసి రోజూ సగటున ప్రతి వ్యక్తికి 55 లీటర్ల సురక్షిత తాగునీటి సరఫరా చేస్తామని గ్రామీణ నీటి సరఫరా శాఖ (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు వెల్లడించారు. సమీపంలోని నదుల నుంచి.. గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల ఇప్పటికే రక్షిత మంచినీటి పథకాలున్నా సరఫరా చేయడానికి నీరు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. వాటర్ గ్రిడ్ ద్వారా ఏడాది పొడవునా తాగునీటి సరఫరా జరిగేలా సమీప నదులతో ప్రత్యేక పైపులైన్ల ద్వారా అనుసంధానిస్తున్నారు. సీఎం ప్రారంభించనున్న రూ.1,400 కోట్ల తాగునీటి పథకానికి కూడా గోదావరి నుంచి ఏటా 1.374 టీఎంసీల నీటిని వినియోగిస్తారు. 30 నెలల వ్యవధిలో దీన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. రూ.10,131 కోట్ల పనులు.. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి వాటర్ గ్రిడ్ ద్వారా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో రూ.10,131 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను ప్రభుత్వం చేపట్టింది. దశాబ్దాలుగా కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్న శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో రూ.700 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని అధికారంలోకి రాగానే సీఎం జగన్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయినట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రూ.480 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ పనులు ఇప్పటికే 34 శాతానికిపైగా జరిగాయి. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ పరిధిలో రూ.279 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ పనులు 25 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగతా చోట్ల త్వరలోనే ప్రారంభం.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రూ.1,650 కోట్లతో, ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో రూ.1,290 కోట్లతో, ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో రూ. 1,200 కోట్లతోనూ, ఉమ్మడి కృష్ణా జిల్లా సముద్ర తీర ప్రాంతంలో రూ.750 కోట్లతో, ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలో రూ.2,370 కోట్లతో వాటర్ గ్రిడ్ ద్వారా శాశ్వత రక్షిత మంచినీటి పథకాలకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు ప్రక్రియ పూర్తి చేసింది. ఈ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. -
ఏలూరు జిల్లా: శివస్వామికి కారంతో అభిషేకం
-
గోరుముద్దకు మరింత అండ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): బడిలో మధ్యాహ్న భోజనం మానేసిన రోజుల నుంచి ఎప్పుడెప్పుడు భోజనం టైమవుతుందా.. ఈ రోజు కిచిడీ లేదా ఫ్రైడ్‌రైస్ తినొచ్చు అంటూ విద్యార్థులు ఎదురు చూసే రోజులు వచ్చాయి. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు తీసుకున్న నాటి విద్యారంగంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించిన విషయం తెలిసిందే. కేవలం అమ్మ ఒడి, నాడు – నేడు వంటి పథకాలు మాత్రమే విద్యార్థులకు కడుపు నింపవని గుర్తించిన ముఖ్యమంత్రి విద్యార్థులు ఇష్టంగా భోజనం చేసేలా ఏర్పాటు చేయాలని భావించారు. గత ప్రభుత్వాలు కేవలం పప్పు, సాంబారులతో సరిపెట్టారు. చిన్నారుల ఆకలిబాధను గుర్తించిన జగన్ మామ వారందరికీ శుభవార్త చెప్పారు. దాని ఫలితమే కిచిడీ, ఫ్రైడ్ రైస్, పులిహోర వంటి వాటితో పాటు కోడిగడ్లు, చిక్కీలు మెనూలో చేరాయి. దీనితో గతంలో బడిలో మధ్యాహ్న భోజనం మానివేసిన విద్యార్థులు సైతం ఇప్పుడు ఇష్టంగా తింటున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా నిధుల పెంపు విద్యార్థులకు రుచి, శుచికరమైన ఆహారం అందించడానికి నాణ్యమైన నిత్యావసరాలు, బియ్యం వంటివి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. నాణ్యమైన వస్తువులు కొనాలంటే కుక్, హెల్పర్లకు ప్రస్తుతం ఇస్తున్న నిర్వహణ నిధులు సరిపోవడం లేదని ముఖ్యమంత్రి గ్రహించారు. కుక్, హెల్పర్లు మనస్ఫూర్తిగా పని చేయాలంటే వారికి తగిన ఆదాయం కల్పించాల్సి ఉంటుందని భావించిన ముఖ్యమంత్రి వారికి నిర్వహణ నిధులు పెంచుతూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. పెరుగుతున్న కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు, కోడిగుడ్ల ధరలను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేలా నిధులు పెంచారు. అదనంగా నెలకు రూ.76.93 లక్షలు చెల్లింపు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే కుక్, హెల్పర్లు దాదాపు 6 వేల మంది వరకూ ఉన్నారు. ఏలూరు జిల్లాలో 1824 పాఠశాలలు ఉండగా 1,50,654 మందికి మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 1413 పాఠశాలలు ఉండగా 1,09,153 మంది విద్యార్థులకు వండి వడ్డిస్తున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారు చేసేందుకు ప్రభుత్వం కుక్, హెల్పర్లకు గతంలో ప్రాథమిక స్థాయి విద్యార్థులు ఒక్కొక్కరికీ రూ. 4.97 చెల్లించేది. ప్రస్తుతం ఆ ధరను రూ.5.88కి పెంచింది. అంటే ఒక్కొక్క విద్యార్థికి 91 పైసలు పెంచింది. ప్రాథమికోన్నత, ఉన్నత తరగతుల విద్యార్థులకు రూ.7.45 చెల్లించేది. ప్రస్తుతం ఆ ధరను రూ. 8.57కు పెంచడంతో ఒక్కొక్క విద్యార్థిపై కుక్, హెల్పర్లకు రూ.1.12 లబ్ది చేకూరుతోంది. ఈ మేరకు ఏలూరు జిల్లాలోని అందరు విద్యార్థులపై రోజుకు రూ. 1,48,857 అదనంగా లభిస్తుండగా పశ్చిమ గోదావరి జిల్లాలోని రూ. 1,07,599 లభిస్తోంది. అంటే నెలకు రూ. 76.93 లక్షలను ప్రభుత్వం కుక్, హెల్పర్లకు అదనంగా చెల్లిస్తోంది. మధ్యాహ్న భోజనం మెనూ ఇలా.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఏ పదార్థాలు వడ్డించాలో ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ మేరకు సోమవారం అన్నం, కోడిగుడ్డు కూర, పప్పుచారు, చిక్కీ, మంగళవారం పులిహోర, టమోట పప్పు, ఉడకబెట్టిన గుడ్డు, బుధవారం వెజిటబుల్ రైస్(ఫ్రైడ్‌రైస్), ఆలూ కుర్మా, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కీ, గురువారం కిచిడీ, టమాటా చట్నీ, ఉడకబెట్టిన గుడ్డు, శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడకబెట్టిన గుడ్డు, శనివారం అన్నం, సాంబారు, తీపి పొంగలి వడ్డిస్తున్నారు. సంతోషంగా ఉన్నారు ప్రభుత్వం కుక్, హెల్పర్లకు నిర్వహణ నిధులను పెంచడంతో వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన పదార్థాలను, రుచి, శుచికరంగా వండి వడ్డిస్తున్నారు. ప్రతి పాఠశాలలో మా అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు మధ్యాహ్న భోజనం జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తున్నారు. ఏజెన్సీలకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటుండడంతో వారికి ఆర్థికంగా ఉపయోగకరంగా ఉంటోంది. -ఆర్ఎస్ గంగాభవాని, జిల్లా విద్యాశాఖాధికారి, ఏలూరు జిల్లా -
AP: కళ్లెదుటే కలల గృహం
పేదల సొంతింటి కల సాకారమవుతోంది.. పల్లెల స్వరూపం మారుతోంది.. జగనన్న కాలనీలు కొంగొత్త గ్రామాలుగా అవతరిస్తున్నాయి.. కళ్లెదుటే ఆనందాల లోగిళ్లను చూస్తూ పేదల మోము వికసిస్తోంది.. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో గృహనిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో భాగంగా పేదల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా ప్రతి పేదవాడికీ సొంతింటిని అందించాలని సంకల్పించి చర్యలు తీసుకుంది. ఈ మేరకు అర్హులందరికీ స్థలాల పట్టాలు అందించి గృహనిర్మాణాలకు అన్నివిధాలా తోడ్పాటు అందిస్తోంది. ఈ క్రమంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 1,863 లేఅవుట్లు గ్రామాలుగా విస్తరిస్తున్నాయి. ఒక్కో లేఅవుట్లో ఇళ్ల నిర్మాణంతో కొత్త ఊరిని తలపిస్తోంది. లేఅవుట్ల వద్ద మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వివిధ దశల్లో నిర్మాణాలు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో 1,863 లేవుట్లు ఉండగా.. 2,12,895 ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పటికే రెండు జిల్లాల్లో 17,916 ఇళ్ల నిర్మాణాలు పూర్తికాగా లబ్ధిదారులు నివాసముంటున్నారు. ఇదిలా ఉండగా రెండు జిల్లాల్లోనూ వివిధ దశల్లో ఉన్న గృహాలను వచ్చే డిసెంబర్ 21 నాటికి పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారీస్థాయిలో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ప్రతి రోజూ లక్ష్యాలను నిర్దేశించి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. వందల కోట్లతో.. రెండు జిల్లాల్లో నిర్మాణాలు పూర్తయిన ఇళ్ల కోసం ప్రభుత్వం ఇప్పటివరకూ రూ. 322.48 కోట్లు వెచ్చించింది. అలాగే వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాల కోసం మరో రూ.600 కోట్లు అందిస్తోంది. వీటితో పాటుగా ప్రతి ఇంటికీ డీఆర్ డీఏ ఆధ్వర్యంలో రూ.35 వేలు అదనంగా అందిస్తూ నిర్మాణాలను ప్రోత్సహిస్తోంది. అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులకు కూడా అడిగిన వెంటనే ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంది. నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి ఏలూరు జిల్లావ్యాప్తంగా గృహనిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాం. వీలైనంత ఎక్కువ మందికి గృహాలు అందించాలని నిర్ణయించి ఆ దిశగా లక్ష్యాన్ని నిర్దేశించి పనులు పూర్తి చేయిస్తున్నాం. ఇప్పటికే పెండింగ్ బిల్లులు చెల్లించి, ఎప్పటికప్పుడు ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తూ గృహనిర్మాణాల వేగవంతానికి చర్యలు తీసుకుంటున్నాం. – వె.ప్రసన్న వెంకటేష్, కలెక్టర్, ఏలూరు ప్రభుత్వమే అన్నీ సమకూర్చుతూ.. అధికారులు సిమెంట్, ఐరన్, ఇసుకను ఇంటి వద్దనే అందిస్తున్నారు. నిర్మాణ పనుల కోసం నీటిని సరఫరా చేస్తున్నారు. నేను, నా భార్య కూలీలతో కలిసి పనిచేస్తున్నాం. మా ఇద్దరికీ ఉపాధి పథకం ద్వారా 90 రోజుల కూలీ డబ్బు లు రూ.30 వేలు బ్యాంకు ఖాతాలో జమచేశారు. మొత్తంగా రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. సంతోషంగా నిర్మాణం పూర్తి చేస్తాం. – పాలే ఈశ్వరరావు, చాటపర్రు, ఏలూరు మండలం. పక్కాగా మౌలిక వసతులు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి జగనన్న కాలనీ భూమి మెరక చేసింది. దీంతో మాకు పునాది ఖర్చు రూ.50 వేల వరకు తగ్గింది. కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కరెంటు ఇచ్చారు. గ్రావెల్ రోడ్డు వేశారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నారు. అధికారులు అన్ని పనులు దగ్గరుండీ చేయిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. – బసవరాజు వెంకటేశ్వరరావు, చాటపర్రు, ఏలూరు మండలం స్థిరాస్తిని అందించిన ప్రభుత్వం ఇతడి పేరు కిల్లారి రాంబాబు, భీమడోలు మండలంలోని గుండుగొలను గ్రామం. వీరి కుటుంబానికి ప్రభుత్వం సెంటున్నర భూమి ఇచ్చి ఇంటిని మంజూరు చేసింది. ఐదు నెలల క్రితం ఆ స్థలంలో ఇంటి నిర్మాణం పూర్తిచేసి కుటుంబంతో అక్కడే నివసిస్తున్నారు. సొంతింటి కల సాకారం చేయడంతో పాటు జగనన్న తనను రూ.5 లక్షల ఆస్తికి హక్కుదారుడిని చేశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆనందంగా నిర్మాణం ఈమె పేరు కానూరి పార్వతి, భీమడోలు మండలం గుండుగొలను గ్రామం. కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో అవస్థలు పడుతుండగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటిని మంజూరు చేసింది. సెంటున్న స్థలాన్ని ఉచితంగా అందించగా ఆనందంగా నిర్మాణ పనులు చేపట్టింది. తన దశాబ్దాల కల సాకారమైందని, జీవితాంతం సీఎం జగన్‌కు రుణపడి ఉంటానని ఆమె అంటున్నారు. -
సంగీత సరస్వతికి ‘నూజివీడు’ నీరాజనం
విజయవాడ కల్చరల్: వీణ.. సరస్వతీదేవీ ఒడిలో సరిగమలు పలుకుతుంది.. కళాకారుల చేతిలో సప్త స్వరకుసుమాలను విరబూస్తుంది.. చిట్టిబాబు, ఈమని శంకర శాస్త్రి, వీణా శ్రీవాణి, ఘంటసాల వెంకటేశ్వరరావు, తుమరాడ సంగమేశ్వరశాస్త్రి, పప్పు సోమేశ్వరరావు, ఆదిభట్ల నారాయణదాసు తదితరులు ఈ వీణ ద్వారా మనోహర స్వరాలు పలికించి సంగీత సరస్వతికి నీరాజనాలు అందించారు. అంతటి మహత్తర వీణ తయారీ వెనుక కఠోర శ్రమ ఉంది. తపస్సు ఉంది. కళాకారులు నిరంతర తపోదీక్షతో వీణకు ప్రాణం పోస్తున్నారు. రాష్ట్రంలో బొబ్బిలి, విజయనగరం, నూజివీడు తదితర ప్రాంతాల్లో వీణలు తయారు చేసినా నూజివీడులో షేక్ మాబూ కుటుంబం తయారు చేసిన వీణకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. దేశ విదేశాల్లో ఉన్న సంగీత విద్వాంసులు వీణ కోసం నూజివీడు కళాకారులను సంప్రదిస్తారు. శ్రీపాద పినాకపాణి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలాచందర్, నూకల చిన సత్యనారాయణ. నేదునూరి కృష్ణమూర్తి, ఈమని కల్యాణి, తంగిరాల ప్రణీత వంటి కళాకారులు నూజివీడు కళాకారులు తయారు చేసిన వీణలపైనే రాగాలు పలికించారు. ప్రముఖ సంగీత విద్వాంసులు నూజివీడు కళాకారులను అభినందనలతో ముంచెత్తారు. రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో దసరా మహోత్సవాల సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో నూజివీడు కళాకారులు తయారు చేసిన వీణనే ఉపయోగిస్తారు. తయారీ విధానం : వీణ తయారీకి ప్రత్యేక కలప అవసరం. సుతిమెత్తగా ఉండే పనస చెట్టు నుంచి వచ్చిన కలపను తయారీకి వినియోగిస్తారు. దీని తయారీకి సుమారు 20 రోజులు పడుతుంది. విడి భాగాలుగా తయారు చేసి.. వాటిని ఒకే రూపంలోకి తీసుకొస్తారు. ధర సుమారుగా రూ.40 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఇళ్లల్లో, కార్యాలయాల్లో.. షో కేసుల్లో అలంకరించుకునే చిన్న వీణలనూ నూజివీడు కళాకారులు తయారు చేస్తున్నారు. వీరు తయారు చేసిన వీణ కళా నైపుణ్యాన్ని చూసి గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు కూడా. ప్రపంచ రికార్డులు సొంతం నూజివీడు కళాకారులు తయారు చేసిన వీణ పలు రికార్డులను సాధించింది. ముఖ్యంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత్ వరల్డ్ రికార్డ్స్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పురస్కారాలనూ సాధించింది. ఈ వృత్తినే నమ్ముకున్నాం తాతల కాలం నుంచి ఈ వృత్తినే నమ్ముకున్నాం. ఆర్డర్ చేసిన వారికి కావాల్సిన విధంగా వీణను తయారు చేసి అందిస్తాం. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కళాకారులకు శిక్షణ ఇస్తున్నాం. ప్రభుత్వ సహకారం ఉంటే నూజివీడులో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. మా తండ్రి షేక్ మీరాసాహెబ్ వద్ద వీణ తయారీలో శిక్షణ తీసుకున్నాను. మీరా అండ్ సన్స్ వీణా మేకర్స్ సొసైటీ ద్వారా సేవలందిస్తున్నాం. – షేక్ మాబూ -
Kolleru Lake: ఎగువ నుంచి భారీగా కొల్లేరుకు వరద నీరు
కైకలూరు: కొల్లేరు సరస్సు ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలకు ఎగువ నుంచి కొల్లేరుకు వరద నీరు చేరుతోంది. కొల్లేరుకు చేరిన వరద నీరు సముద్రానికి చేరే మార్గమధ్యంలో అక్రమ చేపల చెరువులు అడ్డు వస్తున్నాయి. దీనికి తోడు గుర్రపుడెక్క తోడవడంతో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు పాకుతోంది. కొల్లేరు గ్రామాల్లో పలు అక్రమ చేపల చెరువులకు గండ్లు పడటంతో రహదారులు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో కొల్లేరు ప్రక్షాళన అంశం మరోసారి తెరపైకి వస్తోంది. మండవల్లి మండలం పెనుమాకలంక, ఇంగిలింపాకలంక గ్రామస్తుల ప్రధాన మార్గమైన పెదఎడ్లగాడి – పెనుమాలంక రహదారి కొల్లేరు వరద నీటికి మునిగింది. దశాబ్దాలుగా ఇదే సమస్య కొల్లేరు గ్రామాల ప్రజలను పట్టి వేధిస్తోంది. పెద ఎడ్లగాడి వంతెన దిగువన ఈ గ్రామాలు ఉండటంతో వరద నీరు వెనక్కి వచ్చి ముంచెత్తుతోంది. పెదఎడ్లగాడి వద్ద 8.6 అడుగుల నీటి మట్టం నమోదైంది. అదే విధంగా కైకలూరు–ఏలూరు రహదారిలో ఇరువైపులా కొల్లేరు నీరు గట్లను తాకుతోంది. ఇలాంటి పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదని స్థానికులు వాపోతున్నారు. ప్రమాదకరంగా ఇనుప వంతెన... సర్కారు కాల్వపై ఇనుప వంతెన ప్రమాదకరంగా మారింది. వరదల సమయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి 67 డ్రెయిన్ల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు కొల్లేరుకు చేరుతుంది. కొల్లేరు గ్రామాలను అనుసంధానం చేయడానికి పందిరిపల్లిగూడెం వద్ద ఇనుప వంతెనను గ్రామస్తులు నిర్మించారు. ఇటీవల వంతెనపై రేకులు దెబ్బతిన్నాయి. దీనికి తోడు కింద నుంచి ప్రవాహ వేగం పెరిగింది. టోల్గేట్దారులు భారీ వాహనాలను సైతం వంతెనపై అనుమతిస్తున్నారు. దీంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. అడ్డు వస్తున్న చేపల చెరువులు కొల్లేరుకు చేరే నీటిని సముద్రానికి చేరవేసే క్రమంలో అక్రమ చేపల చెరువు గట్లు అడ్డు వస్తున్నాయి. తెలుగుదేశం పాలనలో కొల్లేరులో అక్రమ చేపల చెరువులను తవ్వేశారు. అడ్డుకున్న అటవీ సిబ్బందిపై టీడీపీ నేతల అండతో దాడులు సైతం చేశారు. కొల్లేరులో డ్రెయిన్లు సైతం అక్రమించారు. ఈ కారణంగా వరదల సమయంలో చేరుతున్న నీరు కిందకు చేరడం లేదు. పెద ఎడ్లగాడి వంతెన వద్ద 8 అడుగులు నీటి మట్టం ఉంటే, దిగువన ఉన్న ఉప్పుటేరు వంతెన వద్ద కేవలం 4 అడుగుల నీటి మట్టం ఉంది. ఎగువ నుంచి నీరు కిందకు రావడానికి చేపల చెరువుల గట్లు అడ్డుపడుతున్నాయి. గుర్రపుడెక్కతో చిక్కులు ఎగువ నుంచి కొట్టుకువస్తున్న గుర్రపుడెక్కతో ప్రతీ ఏటా సమస్య ఉత్పన్నమవుతోంది. కొల్లేరుకు చేరుతున్న నీటిని సముద్రానికి చేరవేయడానికి పెద ఎడ్లగాడి వంతెన మార్గంగా ఉంది. ఈ వంతెనకు ఉన్న 56 ఖానాలలో ఇప్పుడు గుర్రపుడెక్క పేరుకుపోయింది. మేటలు వేసిన గుర్రపుడెక్క కారణంగా నీరు వెనక్కి మల్లుతుంది. ఈ కారణంగా పెదఎడ్లగాడి నుంచి పెనుమాకలంక చేరే రహదారి నీట మునిగింది. సాదరణంగా వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత పైనుంచి చేరుతున్న నీటితో కొల్లేరుకు వరద పోటు వస్తుంది. గుర్రపు డెక్క తొలగిస్తాం పెదఎడ్లగాడి వద్ద గుర్రపుడెక్కను మనుషులతో తొలగిస్తాం. దీనికి రూ.8 లక్షలు నిధులు మంజూరయ్యాయి. పొక్లయిన్‌తో తొలిగిస్తుంటే వంతెన పాడవుతుందని ఆర్అండ్బీ అధికారులు అడ్డు చెబుతున్నారు. దీంతో మనుషులను పెడుతున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా 8.6 అడుగులు నీటి మట్టం నమోదయ్యింది. 12 అడుగులకు చేరితే మరింత ప్రమాదం. పరిస్థితిని సమీక్షిస్తున్నాం. – బి.ఇందిరా, డ్రెయినేజీ జేఈఈ, కైకలూరు -
ఆదివాసీ రైతు.. అభివృద్ధి పథంలో సాగుతూ..
బుట్టాయగూడెం(ఏలూరు జిల్లా): పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన రైతులు ఎటువంటి రసాయనాలను వినియోగించకుండా ఆరోగ్యవంతమైన పంటలు పండించేలా కృషి చేస్తున్న ఆదివాసీ జీడిమామిడి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ సీఈఓ సోడెం ముక్కయ్యను వైఎస్సార్ అచీవ్మెంట్ పురస్కారం వరించింది. గిట్టుబాటు ధరతో పాటు నేరుగా పంటలను విక్రయించుకునేలా రైతులకు తోడ్పాటునందించేలా గురుగుమిల్లిలో 2019లో నాబార్డు సహకారంతో ఆయన ఆదివాసీ జీడిమామిడి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌ను ఏర్పాటుచేశారు. అలాగే ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ బ్యాంక్ సహకారంతో ఆదివాసీ జీడిమామిడి ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పారు. ఆయా సంస్థల ద్వారా ఏటా లక్షలాది రూపాయల అమ్మకాలు చేస్తున్నారు. దీంతోపాటు 200 ఎకరాల్లో జీడిమామిడి పంటలను ప్రోత్సహించడంతోపాటు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల ద్వారా రైతులు పంటలు పండించేలా ముక్క య్య కృషి చేస్తున్నారు. ప్రస్తుతం వీరి సంస్థలో 714 మందికి పైగా రైతులు పనిచేస్తున్నారు. వ్యవసా యాభివృద్ధి లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది గురుగుమిల్లి వంటి మారుమూల గ్రామంలో పనిచేస్తున్న నేను వైఎస్సార్ సాఫల్య పురస్కారానికి ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ గుర్తింపుతో మరింత బాధ్యత పెరిగింది. గిరిజన ప్రాంతంలో వ్యవసాయాభివృద్ధికి మరింత కృషి చేస్తా. – సోడెం ముక్కయ్య -
భారీ వర్షాలకు పొంగుతున్న ఎర్రకాలువ
-
అంతులేని విషాదం.. కుటుంబం మొత్తం..
సాక్షి, జంగారెడ్డిగూడెం: కారు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం ఒక కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. కుటుంబసభ్యులంతా మృతిచెందడంతో హృదయవిదారకర పరిస్థితి నెలకొంది. ఈ నెల 25న దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కుటుంబమంతా మృతిచెందిన ఘటన ఇది. ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురానికి చెందిన నూక ఉమామహేశ్వరరావు(35), ఆయన భార్య రేణుక(28), వారి పిల్లలు షర్మిల(9), దుర్గాప్రసాద్(8) ఈ ప్రమాదంలో మృతిచెందారు. బుట్టాయగూడెం మండలం అటవీ ప్రాంతంలోని గుబ్బల మంగమ్మ గుడికి వెళ్లి దర్శనం చేసుకుని ఈ నలుగురు ఒకే మోటార్‌సైకిల్‌పై తిరిగి స్వగ్రామం వెళ్తున్నారు. మరో బైక్‌పై ఉమామహేశ్వరరావు తండ్రి నూక గణపతి, తల్లి లక్ష్మిలు వెళ్తున్నారు. కామవరపుకోట మండలం బొర్రంపాలెం అడ్డరోడ్డు వద్దకు వెళ్లేసరికి ఎదురుగా వస్తున్న కారు ఉమామహేశ్వరరావు కుటుంబం ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్‌ను ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు షర్మిల, దుర్గాప్రసాద్‌లు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన ఉమామహేశ్వరరావు రేవతిలను మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ఏలూరు సమీపంలోకి వెళ్లే సరికి ఉమామహేశ్వరరావు పరిస్థితి విషమించడంతో వెంటనే ఏలూరు జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే ఉమామహేశ్వరరావు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన భార్య రేవతిని విజయవాడ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. కుటుంబం మొత్తం మృతిచెందడంతో ఉమామహేశ్వరరావు తల్లితండ్రులు గణపతి, లక్ష్మిలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మీర్జాపురంలో ఉమామహేశ్వరరావు భార్య రేవతి పేరున జగనన్న కాలనీ మంజూరైంది. ఇటీవలే ఇంటి నిర్మాణం కోసం కుటుంబసభ్యులతో ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. నిర్మాణం ప్రారంభించకుండానే కుటుంబం మొత్తం రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఉమామహేశ్వరరావు సొంతింటి కల నెరవేరకుండానే కుటుంబం అనంతలోకాలకు వెళ్లిపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. పోలీసుల అదుపులో కారు డ్రైవర్ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ వేముల బాల గంగాధర్ తిలక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి ప్రమాదంలో గాయాలు కావడంతో స్థానిక ఏరియా ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు. ప్రమాదం సమయంలో కారులో తనతోపాటు మరో ముగ్గురు ఉన్నారని అంతా భయపడి పారిపోయామని డ్రైవర్ తిలక్ చెబుతున్నాడు. ఘటనపై తడికలపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జ్ సీఐ ఎంవీఎస్ మల్లేశ్వరరావు చెప్పారు. డ్రైవర్ బాలగంగాధర్ తిలక్‌కు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించి కోలుకున్న తరువాత అరెస్టు చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన చిన్నారులు షర్మిల, దుర్గాప్రసాద్ మృతదేహాలకు జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో, ఉమామహేశ్వరరావు మృతదేహానికి ఏలూరు ఆసుపత్రిలో, రేవతి మృతదేహానికి విజయవాడ ఆసుపత్రిలో సోమవారం పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాలను ఉమామహేశ్వరరావు తండ్రి గణపతికి అప్పగించినట్లు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. -
‘తలపోటుగా ఉంది.. మాత్ర తెచ్చుకుంటా’.. ఇంతలోనే బిగ్ షాక్
జంగారెడ్డిగూడెం(ఏలూరు జిల్లా): వివాహిత అదృశ్యంపై భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.సాగర్‌బాబు చెప్పారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం మండలం శోభనాద్రిపురం గ్రామానికి చెందిన టి.రామాజంనేయులుకు, వెంకటరామన్నగూడెం గ్రామానికి చెందిన ప్రభావతితో ఐదు నెలల క్రితం వివాహమైంది. ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం తలపోటుగా ఉంది, మాత్ర తెచ్చుకుంటానని ప్రభావతి భర్త రామాంజనేయులకు చెప్పి బయటకు వెళ్లింది. చదవండి: విషాదం: కుటుంబాన్ని వీడలేక.. డ్యూటీ చేయలేక.. ఎంతకు ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల విచారించగా, స్కూల్ సమీపంలో ఫోన్ మాట్లాడుతూ ఆటో ఎక్కి వెళ్లిందని, ఆటోలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు అతనికి చెప్పారు. భార్య నంబర్‌కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వస్తుండటంతో బంధువులకు, ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. వారి ఇళ్లకు కూడా వెళ్లలేదని తెలుసుకున్నాడు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో శనివారం భర్త ఫిర్యాదు చేశాడన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నిమజ్జనంలో అపశ్రుతి
కొయ్యలగూడెం: ఏలూరు జిల్లాలో వినాయక నిమజ్జనంలో ప్రమాదవశాత్తు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలోని పోతన చెరువులో వినాయక విగ్రహాన్ని ఆదివారం నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న షేక్ రియాజ్ (25), ఉక్కుర్తి దొరబాబు (45), దొరబాబు కొడుకు కార్తీక్ ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయారు. వెంటనే మత్స్యకారుడు పి.రమణ స్పందించి కార్తీక్‌ను కాపాడాడు. పూర్తిగా నీటమునిగిన రియాజ్, దొరబాబులను బయటకు తీసుకొచ్చారు. కొన ఊపిరితో ఉన్న వారిని జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలిచ్చారు. అప్పటికే వారు మృతిచెందారని వైద్యులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. రియాజ్ అవివాహితుడు కాగా, దొరబాబుకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. -
ఉపాధి జాతర: కోటికిపైగా పనిదినాల కల్పన
ఏలూరు (టూటౌన్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కష్టకాలంలో పేదలకు భరోసాగా నిలుస్తోంది. ఏలూరు జిల్లాలో 2022– 23 ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లో అధికారులు కోటికి పైగా పనిదినాలు కల్పించారు. వేతనాలు, మెటీరియల్ కాంపోనెంట్ కలిపి రూ. 227.85 కోట్ల మేరకు ఖర్చు చేశారు. జిల్లా ఉపాధి హామీ చరిత్రలో ఇదో రికార్డుగా నిలిచింది. జిల్లాల పునర్విభజన తర్వాత ఒక్క ఏలూరు జిల్లాలోనే కోటికి పైగా పనిదినాలు కల్పించడంతో పాటు అత్యధిక నిధులు ఖర్చు చేయడంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ సిబ్బంది, అధికారులు విశేష కృషి చేశారు. వీరి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం స్వాతంత్య్ర దిన వేడుకల్లో అవార్డు ఇచ్చి సత్కరించింది. అడిగిన ప్రతిఒక్కరికీ పని కల్పించే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. కష్టకాలంలో బాసటగా.. కరోనా ప్రభావంతో పూర్తిగా ఛిన్నాభిన్నమైన పేదల బతుకులు తేరుకునేందుకు ఉపాధి హామీ పథకం ఊతమిస్తోంది. ఏలూరు జిల్లాలో 2022–23లో 1.50 కోట్లు పనిదినాలు కల్పించాలనే లక్ష్యాన్ని నిర్దేశించగా మొదటి ఐదు నెలల్లోనే 1.03 కోట్ల పనిదినాలు కల్పి ంచారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడు నెలలు పనిచేసి లక్ష్యానికి రెట్టింపు పనులు చేయాలనే దృఢ సంకల్పంతో డ్వామా సిబ్బంది పనిచేస్తున్నారు. వివిధ దశల్లో ఉన్న పనులను పూర్తి చేయడంతో పాటు కొత్తగా పనులను గుర్తించి పేదలకు ఉపాధి కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో స్థానికంగానే పనులు కల్పించడంపై ఉపాధి కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేదల జీవనానికి ఇబ్బందులు లేకుండా తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 706 కుటుంబాలకు వంద రోజుల పని జిల్లాలో 5.35 లక్షల జాబ్ కార్డులు ఉండగా వీటిలో మొత్తం 5.82 లక్షల మంది ఉపాధి కూలీలు నమోదయ్యారు. ఇప్పటివరకూ 3.26 లక్షల జాబ్ కార్డులు కలిగిన కుటుంబాలకు చెందిన దాదాపు 4.50 లక్షల మంది ఉపాధి హామీ కూలీలకు 103.38 లక్షల పనిదినాలు కల్పించారు. జిల్లావ్యాప్తంగా 706 కుటుంబాలకు వంద రోజుల పనిదినాలు కల్పించారు. సగటున రోజుకు ఒక్కరికి రూ.206.16లు వేతనాలుగా చెల్లించారు. ఐదు నెలల్లో రూ.227.85 కోట్ల నిధులు ఖర్చు చేయగా దీనిలో రూ. 203.13 కోట్లు కూలీల వేతనాలుగా, రూ. 24.72 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్గా వెచ్చించారు. కూలీలకు వేతనాలను 15 రోజుల వ్యవధిలో 95.84 శాతం మేర చెల్లిస్తున్నారు. అడిగిన వారందరికీ పని ఉపాధి హామీ పథకంలో అడిగిన ప్రతిఒక్కరికీ పనులు కల్పించేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో అధికంగా పనులు కల్పించే దిశగా కృషి చేస్తున్నాం. జిల్లా నీటి యాజమాన్య సంస్థ పరి«ధిలో జరుగుతున్న అన్ని పనులను సత్వరం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జేసీ అరుణ్‌బాబు సహకారంతో నిరంతరం పనులు కల్పించేలా పనిచేస్తున్నాం. – డి.రాంబాబు, పీడీ, డ్వామా, ఏలూరు -
‘పశ్చిమ’లో కొబ్బరి.. తడబడి
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కొబ్బరి ఎగుమతులు పతనమవుతున్నాయి. మార్కెట్ పుంజుకుంటున్న సమయంలో ఇతర రాష్ట్రాల్లో పంట అందుబాటులోకి రావడంతో ఇక్కడి నుంచి ఎగుమతులు ఢీలా పడ్డాయి. దీంతోపాటు నాణ్యతపరంగా పొరుగు రాష్ట్రాల్లో పంట బాగుండటంతో మన మార్కెట్ డౌన్ అయ్యింది. జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు ఉండగా.. ప్రస్తుతం రోజుకు 30 లారీల కొబ్బరి ఎగుమతి చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కొబ్బరి మార్కెట్ పుంజుకుంటున్న సమయంలో తమిళనాడు, కేరళ కొబ్బరి అందుబాటులోకి వచ్చింది. దీంతో జిల్లా నుంచి ఎగుమతులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇక్కడి నుంచి తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గఢ్ ప్రాంతాలకు పెద్ద ఎత్తున కొబ్బరికాయలు ఎగుమతి చేస్తుంటారు. ఉమ్మడి జిల్లాలో ఏలూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం వద్ద రెడ్డిసీమ, కోరుమామిడి, చింతలపూడి, ద్వార కాతిరుమల, దేవరపల్లి, పెదవేగి, కొవ్వూరు, నల్లజర్ల, గోపాలపురం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకు, పాలకొల్లు, మొగల్తూరు, పేరుపాలెం ప్రాంతాల్లో కొబ్బరి సాగు ఎక్కువగా ఉంది. సీజన్లో రోజుకు 100 లారీల వరకు కొబ్బరి ఎగుమతి చేస్తారు. శ్రావణమాసం సందర్భంగా కొద్దిరోజుల ముందు వరకూ ఎగుమతులు బాగున్నా.. ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. లారీకి 30 వేల కాయల వరకు.. చిన్నలారీలో సుమారు 20 వేలు, పెద్ద లారీలో 30 వేల వరకు కాయలను లోడు చేస్తుంటారు. ప్రస్తుతం జిల్లా నుంచి సుమారు 30 లారీల పంట ఎగుమతి అవుతోంది. ప్రస్తుతం పాత, కొత్త కాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. తమిళనాడులో కొబ్బరి కాయల ధర రూ.7 నుంచి రూ.8 వరకు ఉండటంతో అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు బాగున్నాయి. డిమాండ్ ఎక్కడెక్కడంటే.. గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిసా, హర్యానా రాష్ట్రా ల్లో సాధారణ రోజుల్లో కూడా కొబ్బరి కాయకు డిమాండ్ ఉంటుంది. జిల్లా నుంచి పీచు కాయ గుజరాత్‌కు ఎక్కువగా ఎగుమతి అవుతుంది. బెల్ట్ ఫోర్ పట్టా రకాన్ని మహారాష్ట్ర, గుజరాత్‌కు ఎగుమతి చేస్తుంటారు. కొబ్బరి ఎగుమతుల్లో రాష్ట్రంతో తమిళనాడు, కేరళ పోటీపడుతున్నాయి. లాక్డౌన్ సమయంలో ఆంధ్రా కొబ్బరి ఎగుమతి అధికంగా ఉండటంతో పాటు ధర రూ.15 వరకూ పలికింది. ఒక్కసారిగా తమిళనాడు, కేరళలో దిగుబడులు పెరగడంతో మన మార్కెట్లో ధరలు తగ్గాయి. పరిశోధనా కేంద్రాలు కీలకం పరిశోధనా కేంద్రాల సూచనలు ఆధారంగా ఇతర రాష్ట్రాల్లో రైతులు కొబ్బరి సాగుచేస్తున్నారు. తద్వారా నాణ్యమైన దిగుబడులు వస్తున్నాయి. మన రాష్ట్రంలో కోనసీమ జిల్లా అంబాజీపేటలో మినహా మరెక్కడా కొబ్బరి పరిశోధనా కేంద్రం లేకపోవడంతో రైతులకు సాగుపై సరైన అవగాహన లేకుండా పోయింది. విస్తీర్ణం తగ్గుతూ.. జిల్లాలో గతంలో సుమారు 60 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు చేసేవారు. ఆక్వా విస్తీర్ణం పెరుగుతుండటంతో ప్రస్తుతం సుమారు 50 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు ఉంది. ఆక్వా చెరువు గట్ల వెంబడి ఉన్న కొబ్బరి చెట్లకు నల్లి తెగులు సోకడంతో ఆశించిన దిగుబడులు రావడం లేదు. కొబ్బరి కాయపై మచ్చలు ఏర్పడటం, కాయ పరిమాణం తగ్గడంతో రైతులు లాభాలను అందుకోలేకపోతున్నారు. పరిశోధనా కేంద్రం అవసరం తమిళనాడు, కేరళతో సంబంధం లేకుండా మన రాష్ట్రంలో కొబ్బరికి డిమాండ్ పెరగాలంటే ఇక్కడ పండించే కొబ్బరి కాయకు మచ్చ లేకుండా ఉండాలి. ఈ సమస్య పరిష్కారం కావాలంటే కొబ్బరి పరిశోధనా కేంద్రాలు ఉండాలి. వాటి ద్వారా రైతులకు అవగాహన కల్పించాలి. లేదంటే తమిళనాడు కొబ్బరి పంట అందుబాటులో ఉంటే మన పంటకు డిమాండ్ తగ్గుతుంది. – దేవరపు లక్ష్మీనారాయణ, పాలకొల్లు కొబ్బరి మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు డిమాండ్ తగ్గింది శ్రావణమాసం పూర్తికావడంతో మహారాష్ట్రలో డిమాండ్ తగ్గింది. ప్రస్తుతం శూన్యమాసం కావడం, తమిళనాడు, కేరళæ పంట అందు బాటులోకి రావడంతో మన మార్కెట్ పతనమవుతోంది. ఇటీవల జిల్లాలో వరదలు రావడంతో చెట్లు సుమారు 20 రోజులు నీటిలో ఉండటంతో కాయల్లో నాణ్యత తగ్గింది. డొక్క, పీచు ఇలా అన్ని రంగాల్లో ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – మాటూరి వీర వెంకట నరసింహమూర్తి, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల కోకోనట్ కోప్రా మర్చంట్స్ అసోసియేషన్ సెక్రటరీ -
బంగారం ధగధగ: ఉమ్మడి పశ్చిమ గోదావరిలో రూ.800 కోట్ల విక్రయాలు
నరసాపురం: కనకం మోత మోగిస్తోంది.. అమ్మకాలలో భళా అనిపిస్తోంది.. నెల రోజుల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి. ఎన్నడూ లేనివిధంగా రూ.800 కోట్ల అమ్మకాల టర్నోవర్ సాగినట్టు బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీటిలో రూ.500 కోట్ల వరకూ కేవలం ఆభరణాలు వంటి రిటైల్ వ్యాపారమే జరిగిందని చెబుతున్నారు. సాధారణంగా పండుగల సీజన్లలో బంగారం వ్యాపారం జోరుగా ఉంటుంది. ప్రస్తుతం శ్రావణమాసంలో వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు మాత్రమే ఉన్నాయి. అయినా రికార్డుస్థాయి అమ్మకాలు నమోదవుతున్నాయి. జిల్లాలోని నరసాపురం, భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు లాంటి ప్రధాన పట్టణాల్లో బంగారం షాపులు కళకళలాడుతున్నాయి. ధర పెరుగుతున్నా.. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగాయి. మూడు రోజుల నుంచి మాత్రం స్వల్పంగా తగ్గినా అదీ నామామాత్రమే. ముంబై ధరలను అనుసరించి వ్యాపారం సాగే నరసాపురం బులియన్ మార్కెట్లో గురువారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,500, 22 క్యారెట్ల 916 ఆభరణాల బంగారం ధర రూ.49,750గా ట్రేడయ్యింది. ఈలెక్కన కాసు (8 గ్రాములు) ధర రూ.39,800గా ఉంది. మూడు రోజుల నుంచి గ్రాముకు రూ.70 మాత్రమే ధర తగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మకాలు పెరగడంపై బులియన్ వర్గాల్లో చర్చ సాగుతోంది. సాధారణంగా శ్రావణ మాసంలో కొంత మేర అమ్మకాలు పెరుగుతాయి. అయితే ఈ స్థాయిలో ఎన్నడూ పెరగలేదు. ప్రతి దుకాణంలో మూడు రెట్ల వరకూ అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇదే కారణం కావచ్చు.. కరోనా సెకండ్‌వేవ్ తర్వాత రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో బంగారం ధరల పెరుగుదలలో భారీగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. మరో పక్క డాలర్‌తో రూపాయి మారకపు విలువ కూడా భారీ హెచ్చుతగ్గులను చూస్తుంది. ప్రస్తుతం డాలర్ విలువ రూ.80కు చేరింది. మరో పక్క షేర్ మార్కెట్ ఒడిదుడుకుల్లో సాగుతోంది. ఈనేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలతో బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ మంది మక్కువ చూపడంతో బిస్కెట్ అమ్మకాలు పెరిగినట్టుగా భావిస్తున్నారు. దీంతోపాటు చాలాకాలం నుంచి బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్న వారు ఒక్కసారిగా ఆసక్తి చూపడంతో ఆభరణాల అమ్మకాల జోరు పెరిగినట్టు చెబుతున్నారు. నెలరోజుల్లో జిల్లాలో హోల్‌సేల్ వ్యాపారం ఎక్కువ జరిగే నరసాపురంలో అత్యధికంగా, తర్వాత స్థానంలో భీమవరంలోను పెద్ద ఎత్తుల అమ్మకాలు సాగాయని అంచనా. మూడురెట్లు పెరిగాయి నెల రోజుల నుంచి బంగారం షాపులు ఖాళీ ఉండటం లేదు. ఆభరణాల అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. గత నెల చివరి నుంచి అమ్మకాల విషయంలో తేడా కనిపిస్తోంది. దాదాపుగా ప్రతి షాపులో మూడురెట్లు అమ్మకాలు పెరిగాయి. కరోనా తర్వాత ఈ స్థాయిలో అమ్మకాలు సాగడం ఇదే. బంగారం ధరలు తగ్గితే రాబోయే రోజుల్లో కూడా ఇదేజోరు కొనసాగుతుంది. దసరా, దీపావళి లాంటి పండుగలు ముందున్నాయి. – వినోద్‌కుమార్‌జైన్, నరసాపురం బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు -
గంజి నాగప్రసాద్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం
సాక్షి, ద్వారకాతిరుమల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే ఏ ఒక్క నాయకుడిని, అతడి కుటుంబాన్ని ఆ పార్టీ విడిచిపెట్టదని చెప్పడానికి గంజి నాగప్రసాద్ కుటుంబానికి అందించిన చేయూతే ఒక ఉదాహరణ. ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో మూడునెలల కిందట వైఎస్సార్సీపీ నేత గంజి నాగప్రసాద్ హత్యకు గురైన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ ఏడాది జూలై 3వ తేదీన కొవ్వూరులో జరిగిన వైఎస్సార్సీపీ జిల్లా ప్లీనరీలో నాగప్రసాద్ కుమారుడు ఉదయఫణికుమార్కు ఆయన రూ.15 లక్షల చెక్కు అందించారు. అలాగే మరో రూ.10 లక్షల చెక్కును మిథున్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 16న రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా నాగప్రసాద్ కుమారుడు ఉదయఫణికుమార్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ భరత్‌రామ్, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మిథున్‌రెడ్డి, రాజీవ్‌కృష్ణ, జీవీ, చెలికాని రాజబాబు, ప్రతాపనేని వాసు తదితరులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్న వైఎస్సార్సీపీకి తాము రుణపడి ఉంటామని చెప్పారు. (క్లిక్: ప్రభుత్వ పాఠశాలల్లో ‘స్పోకెన్ ఇంగ్లిష్’ క్లాసులు) -
వివాహేతర సంబంధం.. ఇంట్లో సహజీవనం చేస్తున్న వ్యక్తితో కనిపించడంతో..
భీమడోలు(ఏలూరు జిల్లా): తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుందని మనస్తాపంతో కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భీమడోలులో శుక్రవారం జరిగింది. ఎస్ఐ చావా సురేష్ కథనం ప్రకారం.. భీమడోలు గాంధీబొమ్మ సెంటర్‌కు చెందిన దాసరి వెంకట్ (21) తాపీ కార్మికుడు. అతని చిన్నతనంలోనే తండ్రి మృతిచెందగా, తల్లితో కలసి ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. చదవండి: మహిళతో వెటర్నరీ అటెండర్ సన్నిహిత సంబంధం.. చివరికి ట్విస్ట్ గత కొన్నేళ్లుగా తన తల్లి వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఎన్నిసార్లు మందలించినా ఆమె తీరు మారలేదు. శుక్రవారం తాపీ పనికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి భోజనం చేసేందుకు రాగా, ఇంట్లో తల్లి సహజీవనం చేస్తున్న వ్యక్తితో కనిపించింది. దీంతో కోపోద్రిక్తుడైన వెంకట్ తల్లితో గొడవ పడి బయటికి వెళ్లి మద్యం సేవించి తిరిగి వచ్చాడు. లోపలికి వెళ్లి గడియ పెట్టుకుని తల్లి చీరతో ఫ్యాన్‌కి ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటికి అతని స్నేహితుడు ఆనంద్ ఇంటికి రావడంతో ఆత్మహత్య విషయం వెలుగుచూసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. -
చంద్రబాబుకు సీఎం జగన్ మధ్య తేడా ఇదే
-
బాబూ మీ బురద చాలు
-
వీలైనంత త్వరగా ఆర్థిక సాయం అందించాలని ప్రధానిని కోరుతా: సీఎం జగన్
-
కేంద్రంతో కుస్తీ పడుతున్నాం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఏలూరు జిల్లా: ముంపు బాధితులకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఏలూరు జిల్లా తిరుమలాపురం, నార్లవరం వరద బాధితులను ఆయన బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, వరద బాధిత ప్రాంతాల్లో అధికారులు బాగా పనిచేశారని ప్రశంసించారు. ఇంత పారదర్శకతతో గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. చదవండి: వరద బాధితులందరికీ న్యాయం చేస్తాం: సీఎం జగన్ వరద సహాయ చర్యల్లో అధికార యంత్రాంగం అంతా పాల్గొంది. ఎన్యుమరేషన్ ప్రారంభించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి రూ.10వేల ఆర్థిక సాయం ఇవ్వాలని ఆదేశించామని సీఎం తెలిపారు. వరదలతో నష్టపోయిన ప్రతిఒక్కరినీ ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో సాయం అందిస్తామన్నారు. సాధ్యమైనంత త్వరగా ముంపు బాధితులకు పరిహారం అందిస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నాం. ఈ ప్యాకేజీకి రూ.20 వేల కోట్లు అవసరం. కేంద్రంతో యుద్ధం చేస్తూనే ఉన్నాం. కేంద్రం తప్పనిసరిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తక్కువ మొత్తం అయితే కేంద్రం ఇవ్వకున్నా మేమే ఇచ్చేవాళ్లం. రూ.20 వేల కోట్లు అయ్యేసరికి ఏమీ చేయలేకపోతున్నాం. ప్రధానిని ఇప్పటివరకు మూడుసార్లు కలిశా. కేంద్ర మంత్రులను మన మంత్రులు కలుస్తూనే ఉన్నారు. అయినా కేంద్రం నుంచి అనుకున్న స్థాయిలో కదలిక లేదు. ప్రధాని మోదీని కలిసి వరద ఏ స్థాయిలో ఉందో వివరిస్తా. వీలైనంత త్వరగా ఆర్థిక సాయం అందించాలని ప్రధానిని కోరతామని’’ సీఎం జగన్ అన్నారు. -
పారదర్శకంగా బాధితులకు పరిహారం అందించాం : సీఎం జగన్
-
నేడు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
-
వరద బాధితులకు అండగా..వలంటీర్ల సైన్యం
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి ప్రతినిధి, ఏలూరు/తాళ్లరేవు: గోదావరి వరద బాధితులకు వలంటీర్లు కొండంత అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వ చేయూతను బాధితుల చెంతకు చేరుస్తున్నారు. నడుం లోతు నీళ్లలోనూ ప్రాణాలకు తెగించి మరీ ముంపు గ్రామాల్లో బాధితులకు భోజనం, మంచినీటి టిన్నులు, నిత్యావసరాలు అందజేస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో వలంటీర్లు అలుపెరగని సేవలందిస్తున్నారు. మూడురోజుల కిందట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వలంటీర్ల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. రెండు రోజులుగా ప్రభుత్వ సాయాన్ని బాధితులకు అందించడంలో వలంటీర్లు బాధ్యత తీసుకోవడంతో పంపిణీలో వేగం పెరిగింది. ఉదయాన్నే పాల ప్యాకెట్లు, అల్పాహారం, మంచినీటి టిన్నులు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి వాటిని భుజాన వేసుకుని బాధితుల ఇళ్లకు వెళ్లి ఇస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటకుండా భోజనం ప్యాకెట్లు అందజేస్తున్నారు. అల్లవరం మండలం బోడసకుర్రు పల్లిపాలెంలో వలంటీర్లు స్వయంగా వంట వండి వరద బాధితులకు వడ్డించారు. అయినవిల్లి మండలం పొట్టిలంకలో పాము శేషవేణి నడుం లోతు నీటిలో 20 లీటర్ల మంచినీటి టిన్నులను భుజానికెత్తుకుని వెళ్లి బాధిత కుటుంబాలకు అందచేసింది. ముమ్మిడివరం మండలం కర్రివానిరేవు పంచాయతీ చింతావానిరేవులో రాత్రి 8గంటల సమయంలో వలంటీర్లు భోజనాలు వండి వడ్డించారు. ముంపు గ్రామాల్లో పడవలపై వెళ్లి సేవలందించారు. తాళ్లరేవు మండలం పిల్లంక పంచాయతీ శివారు కొత్తలంకలో వలంటీర్ ఐతాబత్తుల గోపాలకృష్ణ వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించటం, అవసరమైన వారికి మందులు సరఫరా చేయడంతోపాటు దాతలు అందించే ఆహార పొట్లాలు, కాయగూరలు ప్రతి ఇంటికీ చేరవేస్తున్నాడు. గ్రామంలో 80 శాతానికిపైగా ఇళ్లు వరదలో చిక్కుకోవటంతో పీకల్లోతు నీటిలో ఈదుకుంటూ వెళ్లి ప్రతి ఇంటికీ నిత్యావసరాలు అందజేస్తున్నాడు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 450 మంది వలంటీర్లు సేవలందిస్తున్నారు. వీరికి మంగళవారం నుంచి మరో 150 మంది తోడవనున్నారు. ఆచంట, నర్సాపురం, యలమంచిలి మండలాల్లో వరద బాధితులకు వలంటీర్లు ప్రభుత్వ సాయాన్ని గంటల్లోనే అందిస్తున్నారు. బాధితులు వలంటీర్లను గుర్తించేలా ఏలూరు కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ విలేజ్ వలంటీర్ పేరుతో టీ షర్టులు సిద్ధం చేయించి పంపిణీ చేశారు. సముద్రంలో సంభవించే ఆటు పోటులు వరదపై ప్రభావం చూపుతున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో 4 రోజులుగా సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. గోదావరి నుంచి కొత్త నీటిని రాకుండా అడ్డుకున్నట్టుగా మారటంతో వరద నీరు వెనక్కి పొంగి గ్రామాలను ముంచెత్తింది. ఆదివారం సాయంత్రం నుంచి ఈ పరిస్థితి మారింది. సముద్రం పోటు తగ్గి.. ఆటు వచ్చి వెనక్కి వెళ్లిపోడవంతో వరద నీరు సముద్రంలో ఆటంకం లేకుండా సునాయాసంగా కలుస్తోంది. ఇప్పటివరకు పోటెత్తిన వరద ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. వలంటీర్లను సత్కరిస్తాం ముంపు మండలాల్లో వలంటీర్లు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. అధికారులకు పూర్తి సహాయకారులుగా ఉండటంతో ప్రజలకు ప్రభుత్వ సాయం త్వరితగతిన అందుతోంది. వలంటీర్ల సేవలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి స్వాతంత్య్ర దినోత్సవం రోజు వారిని సత్కరిస్తాం. – ప్రసన్నవెంకటేష్, కలెక్టర్, ఏలూరు జిల్లా -
ఇలాంటి వరదలు రావడం ఇదే మొదటిసారి
-
మహోగ్రరూపం దాల్చిన గోదావరి
-
ఏలూరు జిల్లా ముంపు మండలాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు
-
కొల్లేరు సరస్సు రీసర్వేకు రంగం సిద్ధం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొల్లేరు సరస్సు రీసర్వేకు రంగం సిద్ధమైంది. దశాబ్దాలుగా కొల్లేరులో ఆక్రమణలకు గురై వెలుగులోకి రాని భూములు వేల ఎకరాలు ఉన్నాయి. చెరువుల సాగుకు అనుకూలమైన భూములైనప్పటికీ ఆక్రమణల పర్వంతో స్థానిక కొల్లేరు ప్రజలకు మాత్రం నిరుపయోగంగా మారాయి. ఈ క్రమంలో కొల్లేరు రీసర్వే డిమాండ్ సుదీర్ఘకాలంగా ఉంది. దీంతో కొల్లేరు ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల ఆకాంక్ష మేరకు కొల్లేరు రీసర్వే చేయిస్తామని గత నెలలో గణపవరంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో సర్వేపై అధికారులు వేగంగా దృష్టి సారించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. సర్వే ప్రక్రియ ఇలా కొల్లేరు అభయారణ్యంలో నిర్వహించనున్న సర్వే ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే అటవీ శాఖాధికారులు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ.4 కోట్ల వ్యయంతో సర్వే నిర్వహించడానికి వీలుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సర్వే ప్రక్రియను జలవనరుల శాఖ పర్యవేక్షించింది. రాడార్ ల్యాండ్ సర్వే ద్వారా కొల్లేరు భూముల విస్తీర్ణం లెక్క తేల్చనుంది. అభయారణ్యం ఉపరితలంపై రాడార్‌ను అమర్చి డ్రోన్ల ద్వారా సర్వే నిర్వహించనుంది. ఒక్కొక్క కాంటూరు పరిధిలో అభయారణ్యం భూములు ఎంత ఉన్నాయి.. జిరాయితీ భూములు ఎంత ఉన్నాయి.. అనధికారిక చెరువులు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి.. ఆక్రమణ భూములు ఎంత ఉన్నాయి ఇలా కాంటూరుల వారీగా అభయారణ్యం విస్తీర్ణం పక్కాగా లెక్క తేలనుంది. సర్వే ద్వారా ఐదో కాంటూరు లోపే సుమారు 70 వేల ఎకరాల భూమి వెలుగులోకి వస్తుందని, దీనిలో 55 వేల ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, 10 వేల ఎకరాలు జిరాయితీ భూమి ఉంటుందని అధికారిక అంచనా. ఐదో కాంటూరు వరకు అభయారణ్యంలో 77,340 ఎకరాల భూమి ఉన్నట్టు అటవీ శాఖ రికార్డులు చెబుతున్నాయి. రాడార్ సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక సిద్ధం చేసి అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వం అనుమతితో వచ్చే నెలాఖరు నాటికి సర్వే ప్రక్రియ జిల్లాలో ప్రారంభం కానుంది. మరోవైపు స్వచ్ఛ కొల్లేరుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రూ.420 కోట్ల వ్యయంతో మూడు చోట్ల రెగ్యులేటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. రెగ్యులేటర్ల నిర్మాణం ద్వారా సముద్రం నుంచి వచ్చే ఉప్పు నీటితో కొల్లేరు కలుషితం కాకుండా కట్టడి చేయనున్నారు. సర్వేతో వెలుగులోకి అభయారణ్య, జిరాయితీ భూములు.. మంచినీటి సరస్సుగా కొల్లేరు ప్రపంచ ఖ్యాతిగాంచింది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 901 చదరపు కిలోమీటర్ల మేర 2,22,300 ఎకరాల్లో ఉన్న కొల్లేరు రెండు జిల్లాల్లో 12 మండలాల్లో విస్తరించి ఉంది. కొల్లేరుపై ఆధారపడి మూడున్నర లక్షల మంది జీవిస్తున్నారు. 1959లో కొల్లేరులో చేపల సాగుకు ప్రభుత్వం మొదటగా అనుమతినిచ్చింది. అప్పటి నుంచి క్రమక్రమంగా చేపల సాగు పెరిగి వేల ఎకరాలకు చేరింది. కొల్లేరు సర్వే వల్ల అభయారణ్య భూములు, జిరాయితీ భూములు వెలుగులోకి రానున్నాయి. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొల్లేరు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2007లో కొల్లేరులో ప్రక్షాళనలో భాగంగా సుమారు 55 వేల ఎకరాల అనధికారిక చెరువులు కొట్టేసి సాగుదారులకు రూ.55 కోట్ల మేర పరిహారం అందించారు. 2005లోనే సుప్రీంకోర్టు నియమించిన సాధికారిక కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిత్రా కమిటీలు కొల్లేరులో పర్యటించి స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదికలు అందించాయి. వాటి ఆధారంగానే కొల్లేరు ప్రక్షాళనకు దివంగత వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో కైకలూరు పరిసర ప్రాంతాల్లో అభయారణ్యంలో 7500 ఎకరాల భూమి వెలుగులోకి వచ్చింది. సమగ్ర సర్వే నిర్వహిస్తాం ప్రభుత్వ ఆదేశాలతో కొల్లేరు రీసర్వేకు ప్రతిపాదనలు, సర్వే నిర్వహించాల్సిన క్రమం, ఇతర అంశాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. రూ.4 కోట్ల వ్యయంతో సర్వే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. అభయారణ్యం భూముల లెక్క తేల్చి ప్రభుత్వానికి నివేదిస్తాం. – ఎస్వీకే కుమార్, ఏలూరు అటవీ శాఖ రేంజర్ -
మా జీవితాల్లో సీఎం జగన్ వెలుగులు నింపారు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వారి 23 ఏళ్ల ఎదురు చూపులు ఫలించనున్నాయి. వారంతా డీఎస్సీలో అర్హత సాధించినా.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇంతవరకూ కొలువులు దక్కలేదు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చుతూ వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు పచ్చజెండా ఊపారు. దీంతో 1998 డీఎస్సీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకుంటూ తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. పాదయాత్రలో మొరపెట్టుకున్న అభ్యర్థులు 1998లో అప్పటి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించి అర్హుల జాబితా సిద్ధం చేసింది. వారిలో కొంతమందికి మాత్రమే ఉద్యోగాలిచ్చి మరికొంతమంది భవిష్యత్తును గాలికొదిలేసింది. ఆ తరువాత 2000, 2001, 2002, 2003, 2006, 2008, 2012, 2016, 2018 సంవత్సరాల్లో సైతం డీఎస్సీలు నిర్వహించి వారికి ఉద్యోగాలిచ్చినా 1998లో అర్హత సాధించిన వారి భవితను త్రిశంకు స్వర్గంలో ఉంచారు. అప్పటి నుంచి వారు అనేక పోరాటాలు చేసినా వారి గోడును ఆలకించలేదు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాదయాత్రలో 1998 డీఎస్సీ అర్హులు కలిసి మొరపెట్టుకున్నారు. తాను అధికారంలోకి వస్తే వారికి న్యాయం చేస్తానని జగన్ అభయహస్తం ఇచ్చారు. మాట తప్పని.. మడమ తిప్పని నాయకుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలివ్వడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేయగా.. సుప్రీంకోర్టులోవేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ అడ్డంకిగా మారింది. సాంకేతికంగా ఏర్పడిన ఇబ్బందిని అనంతర కాలంలో అధిగమించడంతో ఇప్పుడు సీఎం జగన్ తన హామీని నెరవేర్చడానికి అనుకూల పరిస్థితి ఏర్పడింది. దీంతో వారికి కూడా ఉద్యోగాలిచ్చే ఫైలులో కదలికలు వచ్చాయి. ప్రస్తుతం 1998 డీఎస్సీ అర్హులైన అభ్యర్థులు జిల్లాలో సుమారు 450 మంది ఉండగా వారిలో మెరిట్ ప్రాతిపదికన అప్పటి డీఎస్సీలో ప్రకటించిన మేరకు సమారు 275 మందికి ఉద్యోగాలొచ్చే అవకాశం కలిగింది. దీనిపై అభ్యర్థులు స్పందిస్తూ జగనన్న నిజంగానే మాటతప్పని, మడమ తిప్పని నాయకుడని మరోసారి నిరూపించుకున్నా రని కృతజ్ఞతలు తెలిపారు. చాలీచాలని జీతాలతో నెట్టుకొచ్చాం ఇంతవరకూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చాలీచాలని జీతాలతో దుర్భరంగా నెట్టుకొస్తున్నాం. మా తరువాత ఎన్నో డీఎస్సీలు జరిగి మాకంటే జూనియర్లు ఉద్యోగాల్లో స్థిరపడగా మేం మాత్రం ఉద్యోగం కోసం పోరాటాలు చేస్తూనే ఉండాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ మా ఆవేదనను అర్థం చేసుకున్నారు. మాకు ఉద్యోగాలివ్వడానికి ముందుకు రావడం నిజంగా మా అదృష్టం. ముఖ్యమంత్రి పెద్ద మనసుకు కృతజ్ఞులమై ఉంటాం. – రామబ్రహ్మ పతంజలి, 1998 డీఎస్సీ అభ్యర్థి 23 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం 23 ఏళ్లుగా ఎంతో వేదనాభరిత జీవితం అనుభవించాం. గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా సమస్యకు పరిష్కారం లభించలేదు. ముఖ్యమంత్రి జగన్‌ను పాదయాత్రలో కలిసి మా సమస్య చెప్పుకున్నాం. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చిన అన్ని వర్గాలకూ న్యాయం చేశారు. మాకూ న్యాయం చేస్తారనే ధీమాతోనే ఉన్నాం. మా నమ్మకం నిజమైంది. దీనిని మేము పండుగలా చేసుకుంటాం. ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలుపుతూ విజయోత్సవ సభను జిల్లాస్థాయిలో నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాం. – వై.సుబ్బారాయుడు, 1998 డీఎస్సీ అర్హుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఆశయాలను కొనసాగిస్తాం బీఎస్సీ, బీఈడీ అర్హత ఉంది. డీఎస్సీకి అర్హులమయ్యాం. కానీ ఉద్యోగం మాత్రం కలగానే మిగిలిపోయింది. అర్హతకు తగిన ఉద్యోగం కాకపోయినా కుటుంబ పోషణకు తప్పనిసరి పరిస్థితిలో ప్రైవేట్ విద్యాసంస్థలో ఉద్యోగం చేస్తున్నాం. ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని జగన్ చేశారు. మా ఆవేదనను అర్థం చేసుకుని మాకు ఉద్యోగాలివ్వడానికి పచ్చజెండా ఊపిన ముఖ్యమంత్రిని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తాం. – పి.బెనర్జీ, 1998 డీఎస్సీ అర్హుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
అల్లరి చేస్తున్నాడని కొడితే.. ప్రాణమే పోయింది!
బుట్టాయగూడెం: అల్లరి చేస్తున్నాడని మందలిస్తూ వెదురు కర్రతో తలపై కొట్టగా బాలుడు మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో శనివారం జరిగింది. దీనికి సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుట్టాయగూడెం మండలం జెగ్గిశెట్టిగూడేనికి చెందిన ఒనుముల రామ్‌చరణ్ (14), మరికొంతమంది గ్రామంలో ఆడుకుంటున్నారు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ఒనుముల లక్ష్మణరావు అనే యువకుడు ఆడుకుంటున్న పిల్లల దగ్గరకు వెళ్లి ఎందుకు అల్లరి చేస్తున్నారని మందలించాడు. అయినా వారు ఆడుకుంటుండడంతో తన చేతిలో ఉన్న వెదురు కర్రతో రామ్‌చరణ్ తలపై కొట్టాడు. దీంతో తలకు గాయమైన రామ్‌చరణ్‌ను కుటుంబసభ్యులు స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా రామ్‌చరణ్ మృతి చెందాడు. కర్రతో కొట్టిన లక్ష్మణరావు మతిస్థిమితం లేని వ్యక్తి అని పోలీసులు తెలిపారు. మృతుడు రామ్‌చరణ్ తండ్రి ఒనుముల చిన్నబుచ్చిరాజు ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్ఐ ఎం.జయ బాబు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
పది పాస్‌కు ప్రత్యేక తరగతులు
పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా వారిని పరీక్షలకు మరింత సన్నద్ధం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. దీనిలో భాగంగా ఈనెల 13 నుంచి ఫెయిలైన విద్యార్థులకు ఆయా పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. సాక్షి, భీమవరం: కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు విద్యాబోధన సక్రమంగా సాగకపోవడంతో ఇటీవల ప్రకటించిన 10వ తరగతి పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. గత రెండేళ్లు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు లేకుండానే విద్యార్థులను పాస్ చేశారు. ప్రస్తుత విద్యాసంçవత్సరం తరగతులు నిర్వహించిన రోజులు తక్కువ కావడంతో ప్రభుత్వం పరీక్షా విధానంలో మార్పులు చేసింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఈసారి 57.55 శాతం మాత్రమే పాస్ అయ్యారు. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో సుమారు 47వేల మంది పరీక్షలకు హాజరుకాగా వీరిలో దాదాపు 27 వేల మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో 31,254 మంది విద్యార్థులకు 13,274 మంది పాస్ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో 9,303 మంది విద్యార్థులు తప్పగా వారిలో ఒక సబ్జెక్ట్ తప్పినవారు 3,226 మంది, రెండు సబ్జెక్టŠట్స్‌లో తప్పినవారు 2,272 మంది, మూడింటిలో తప్పినవారు 1,856 మంది, నాలుగింటిలో తప్పినవారు 1,079 మంది ఉన్నారు. 602 మంది అయిదు సబ్జెక్ట్స్ లో, 268 మంది అన్నింటిలో ఫెయిల్ అయ్యారు. ఈ నేపథ్యంలో వారిని సన్నద్ధం చేసి జూలైలో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సా«ధించేలా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఏ పాఠశాలలో ఎంతమంది ఫెయిల్ అయ్యారు.. ఏఏ సబ్జెక్సŠట్లో తప్పారు అన్న విషయాలను సేకరించి దానికి అనుగుణంగా ఆయా పాఠశాలల్లో ఈ నెల 13 నుంచి ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి ప్రత్యేక తరగతుల నిర్వహణకు రూపకల్పన చేశారు. ఏ స్కూల్లో ఎన్ని తరగతులు నిర్వహించాలనే అంశాన్ని ఆయా పాఠశాలల ప్రాధానోపాధ్యాయులకే అప్పగించారు. విద్యార్థులకు సబ్జెక్సŠట్ వారిగా తరగతులు నిర్వహించి ఉత్తీరణ సాధించేలా సన్నద్ధం చేయడానికి రూపకల్పన చేశారు. కంపార్ట్మెంట్ పాస్‌గా కాకుండా రెగ్యులర్ పాస్‌గా ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఉత్తీర్ణత శాతంన్ని పెంచడానికి విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి ప్రత్యేక తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. ప్రత్యేక కార్యాచరణతో తరగతుల నిర్వహణ పదో తరగతి అడ్వాన్స్డ్ పరీక్షలను ప్రత్యేకంగా సన్నద్ధం చేయడానికి కార్యాచరణ రూపొందించాం. ఎక్కువ మంది విద్యార్థులు ఒకటి, రెండు సబ్జ్క్ట్స్లో ఫెయిల్ అయినందున వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా పరీక్షలకు సన్నద్ధం చేస్తాం. తరగతులు ఎలా నిర్వహించాలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులదే నిర్ణయం. ఫెయిలయిన విద్యార్థులకు సబ్జ్క్ట్ల బట్టి తరగతులు నిర్వహిస్తారు. పరీక్షలు ముగిసేవరకు ప్రత్యేక తరగతులు ఉంటాయి. – ఆర్వీ రమణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం -
యువకుడి పాడుపని.. వివాహిత ఇంటికెళ్లి.. చేయి పట్టుకుని..
ద్వారకా తిరుమల(ఏలూరు జిల్లా): ఒక వివాహితతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ టి.సుధీర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారకాతిరుమలకు చెందిన ఎ.సురేష్ అనే యువకుడు ఈ నెల ఏడో తేదీ మధ్యాహ్నం అదే గ్రామానికి చెందిన ఒక వివాహిత ఇంటికి వెళ్లి, చేయి పట్టుకుని తన కోర్కె తీర్చమని బలవంతపెట్టాడు. చదవండి: ప్రేమ.. పెళ్లి.. భర్తకు దూరంగా అద్దె ఇంట్లో.. చివరికి ఇలా.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. గతంలో కూడా సురేష్ ఆమెను పలుమార్లు ఇబ్బంది పెట్టినట్టు, ఆ విషయాన్ని పెద్దలకు తెలిపినా ఫలితం లేకపోయిందని ఫిర్యాదులో వెల్లడించినట్టు పేర్కొన్నారు. -
మామిడి రైతుకు నిరాశే
నూజివీడు/ చింతలపూడి : ఏటా వేలాది మంది కూలీలకు ఉపాధి, కోట్లాది రూపాయల వ్యాపారం చేసే మామిడి పరిశ్రమ ఈ ఏడాది రైతులు, వ్యాపారులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. మామిడి ఎగుమతుల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఏలూరు జిల్లా ప్రాంతంలో ప్రస్తుతం వ్యాపారం మందగించింది. సీజన్ ప్రారంభమై నెలన్నర కావస్తున్నా ఇంతవరకు ఆశించిన స్థాయిలో ఎగుమతులు లేక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గం మామిడి సాగుకు పెట్టింది పేరు. జిల్లాలో దాదాపు 52 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉండగా ఒక్క నూజివీడు నియోజకవర్గంలోనే 45 వేల ఎకరాలు ఉండటం విశేషం. మిగిలిన ఏడు వేల ఎకరాలు చింతలపూడి చుట్టుపక్కల ప్రాంతాల్లో సాగులో ఉన్నాయి. దెబ్బతీసిన నల్ల తామర గత రెండేళ్లు కరోనాతో దెబ్బతిన్న రైతులు, ఈ ఏడాది కొత్తగా ఆశించిన నల్లతామర వల్ల దారుణంగా దెబ్బతిన్నారు. సంక్రాంతి తరువాత తోటల్లో పూత ఉద్ధృతంగా వచ్చినప్పటికీ నల్లతామర పురుగు ఆశించడంతో పూత అంతా మాడిపోయి కేవలం కాడలే మిగిలాయి. దీని ప్రభావం దిగుబడిపై çపడింది. సాధారణంతో పోల్చితే సగం కూడా దిగుబడి రాలేదు. అరకొరగా వచ్చిన దిగుబడికి సరైన ధర లభించకపోవడంతో మామిడిపై రైతులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. భారీగా తగ్గిన ఎగుమతులు ప్రతి ఏటా ఈ ప్రాంతం నుంచి కోల్‌కతా, నాగపూర్, గుజరాత్, హైదరాబాద్, పూనే, అహ్మదాబాద్, ఢిల్లీ, కాన్పూర్, ఒడిశా తదితర రాష్ట్రాలకు వేలకొద్ది లారీల్లో నాణ్యమైన మామిడి ఎగుమతి అయ్యేది. ఈ ఏడాది సీజన్ ముగింపు దశకు వచ్చినా ఎగుమతులు చేయలేకపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. ఏటా ఒక్క నూజివీడు ప్రాంతం నుంచే రోజుకు దాదాపు 350 నుంచి 400 లారీల మామిడి ఎగుమతులు జరి గేవి. ఈ ఏడాది ఎగుమతులు రోజుకు 150 లారీలకు పడిపోయాయి. చింతలపూడి ప్రాంతం నుంచి రోజుకు 25 లారీల ఎగుమతులు జరిగేవి. ఈ ఏడాది 10 నుంచి 12 లారీలకు పడిపోయాయి. దీనిని బట్టి దిగుబడులు ఏ స్థాయిలో తగ్గాయో అర్థం చేసుకోవచ్చు. సిండికేట్‌తో పడిపోయిన ధరలు ఈ ఏడాది మామిడి దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో ధర బాగుంటుందని రైతులు భావించారు. రైతుల ఆశలను ఢిల్లీ వ్యాపారులు ప్రతిఏటా మాదిరిగానే అడియాస చేశారు. వారంతా సిండికేట్ అయ్యి ధరను తమకు కావాల్సిన విధంగా పెంచడం, తగ్గించడం చేస్తూ రైతులతో ఆడుకున్నారు. దీంతో దిగుబడి తక్కువగా ఉన్నా ధర మాత్రం రోజురోజుకూ దారుణంగా పతనమైంది. మామిడి సీజన్ ప్రారంభమైన ఫిబ్రవరి చివరి వారం, మార్చి తొలి వారంలో బంగినపల్లి టన్ను రూ.1.20 లక్షలు, కలెక్టర్ (తోతాపురి) రకం రూ.90 వేలకు కొనుగోలు చేసిన ఢిల్లీ వ్యాపారులు దిగుబడి పూర్తిస్థాయిలో వచ్చే సమయాల్లో అతి దారుణంగా ధరను పతనం చేశారు. ఆ తరువాత సీజన్ గడుస్తున్న కొద్దీ తగ్గుకుంటూ వచ్చి చివరకు బంగినపల్లి ధర టన్ను రూ.20 వేల నుంచి రూ.40 వేల మధ్యలో నిలబడింది. కలెక్టర్ రకం ధర రూ.11 వేల నుంచి రూ.16 వేల మధ్య నడుస్తోంది. ఢిల్లీ వ్యాపారులు సిండికేట్ అయ్యారు ఈ ఏడాది దిగుబడి బాగా తగ్గినప్పటికీ ఆశించిన స్థాయిలో ధర లభించలేదు. ఢిల్లీ వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర దారుణంగా తగ్గించి కొనుగోలు చేశారు. ప్రారంభంలో ధర బాగున్నప్పటికీ సీజన్ గడుస్తున్న కొద్దీ ధరను తగ్గించేశారు. దీంతో రైతులు నష్టాలపాలయ్యారు. – మూల్పురి నాగవల్లేశ్వరరావు, మామిడి రైతు, నూజివీడు నష్టాలు తప్పువు ఈ ఏడాది మామిడి రైతుకు నష్టాలు తప్పవు. మంగు తెగులు కారణంగా ఎగుమతులు మందగించాయి. ధర పెరిగితేనే గానీ నష్టాల నుంచి బయటపడడం కష్టం. ప్రారంభంలో టన్ను రూ.లక్ష వరకు ఉన్న ధర ప్రస్తుతం రూ.20 వేలు మాత్రమే పలుకుతోంది. ప్రస్తుతం ఉన్న ధర ఇలాగే కొనసాగితే రైతులు, వ్యాపారులకు ఈ ఏడాది తీవ్ర నిరాశే మిగులుతుంది. – చిక్కాల సుధాకర్, మామిడి కమీషన్ వ్యాపారి, చింతలపూడి -
మా జెండా.. అజెండా.. ప్రజా సంక్షేమమే
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ ఏలూరు టౌన్: దుష్ట పాలనకు చరమగీతం పాడేందుకు.. జనం కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు ఆనాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చేశారు. ప్రజాభీష్టంతో విజయభేరి మోగించి అధికారం చేపట్టారు. చరిత్ర సృష్టిస్తూ ఏకంగా 151 సీట్లు కైవసం చేసుకుని విజయగర్జనతో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేశారు. పాలన తొలిరోజు నుంచే ప్రజా సంక్షేమానికి శ్రీకారం చుట్టారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ నూరుశాతం అమలుకు శ్రమిస్తున్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా 130కి పైగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సంక్షేమ పాలనకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి మూడు వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో వాడవాడలా వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడింది. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, శ్రేణులు అంబరాన్నంటేలా సంబరాలు చేసుకున్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదలకు దుస్తుల పంపిణీ, రోగులకు పండ్ల పంపిణీతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు, కేక్ కటింగ్లతో వేడుకలు జరుపుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇలా.. నరసాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్థానిక పార్టీ కార్యాయంలో ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ వేసి వేడుకలు నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వీరవాసరం మండలంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పాలకొల్లు నియోజకవర్గంలో జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్, నాయకులు గుణ్ణం నాగబాబు, మేకా శేషుబాబు, యడ్ల తాతాజీ, చెల్లెం ఆనంద ప్రకాష్ పాల్గొని కేక్ కట్ చేశారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉండి నియోజకవర్గంలో డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, నియోజకవర్గ ఇన్చార్జి గోకరాజు రామరాజు కాళ్ల మండలం పెద అమిరం గ్రామంలో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఆచంట నియోజకవర్గంలో ఏఎంసీ చైర్మన్ సుంకర ఇందిర, పెనుగొండ సర్పంచ్ల చాంబర్ అధ్యక్షురాలు దండు పద్మావతి, నాయకులు చిన్నం రామిరెడ్డి, దంపనబోయిన బాబూరావు తదితరులు కేక్ కట్ చేశారు. తణుకు నియోజకవర్గంలో శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. వృద్ధాశ్రమంలో భోజన వసతి కల్పించారు. పేదలకు పండ్లు, వస్త్రాలు పంపిణీ చేశారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు ప్రాంతాల్లో స్థానిక నేతలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా కార్యదర్శి నల్లమిల్లి విజయానందరెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుండుబోగుల నాగు, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో ఇలా.. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కొయ్యలగూడెం మండలంలో మూడేళ్ల పండుగ చేసుకున్నారు. అన్ని మండలాల్లో మండల కన్వీనర్లు, నేతలు ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు సంత మార్కెట్ వద్ద భారీ కేక్ కట్ చేశారు. దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చింతలపూడి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఘనంగా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. నాలుగు మండలాల్లోనూ స్థానిక నేతలు కేక్ కటింగ్‌లు చేశారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ స్థానిక నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేపట్టారు. నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు పట్టణంలో చినగాంధీ బొమ్మ సెంటరులో కేక్ కట్ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ రామిశెట్టి త్రివేణి దుర్గ, వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, పార్టీ నేతలు హాజరయ్యారు. ద్వారకాతిరుమల మండలం నారాయణపురంలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కేక్ కట్ చేసి సంబరాలను ప్రారంభించారు. ఎంపీపీ బొండాడ మోహిని, జెడ్పీటీసీ చిగురుపల్లి శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో స్థానిక నేతలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. పార్టీ నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. 44వ డివిజన్లో ఎస్సీ, ఎస్టీ జాతీయ నాయకుడు పొలిమేర హరికృష్ణ ఆధ్వర్యంలో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. -
దొడ్డిగట్టు.. కాసులు పట్టు!
ఏలూరు రూరల్ : కొల్లేరు దొడ్డిగట్లు.. అక్రమ చెరువులకు అడ్డాగా మారాయి. కొల్లేరులోని నీటికుంటను మత్స్యకారులు దొడ్డిగట్టుగా పిలు స్తారు. వీటిలో నిబంధనలకు విరుద్ధంగా మ త్స్యకారులు చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నా రు. ఇందుకు అటవీశాఖ అధికారులకు సొమ్ము లు ముట్టజెబుతున్నారు. సెక్షన్ ఆఫీసర్ నుంచి గార్డు వరకూ దొడ్డిగట్ల ద్వారా ఏడాదికి రూ.కోటికిపైగా మామూళ్లు అందుతున్నట్టు అంచనా. సుమారు 30 వేల ఎకరాల్లో.. 2007లో అధికారులు కొల్లేరు ప్రక్షాళన చేపట్టిన సమయంలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 75 వేల ఎకరాల విస్తీర్ణంలో వందలాది చెరువు గట్లను ధ్వంసం చేశారు. కాలక్రమేణ వరదలు, వర్షాలకు ఈ చెరువు గట్లు కుంగి దొడ్డిగట్లుగా మారాయి. వీటిని పటిష్టపరిచి కొందరు చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అభయారణ్యంలో సుమారు 30 వేల ఎకరాల్లో దొడ్డిగట్లు వెలిశాయి. ఎకరానికి రూ.3 వేల వరకూ.. దొడ్డిగట్లలో చేపల సాగును సెక్షన్ ఆఫీసర్లు, గా ర్డులు అడ్డుకుంటున్నారు. కేసులు పెడతామని, గట్లు కొట్టేస్తామని మత్స్యకారులను బెదిరిస్తున్నారు. దీంతో మత్స్యకారులు అధికారులకు సొమ్ములు ముట్టజెబుతున్నారు. ఇదే అదనుగా సెక్షన్ ఆఫీసర్లు, గార్డులు కలిసి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పెదపాడు సెక్షన్ పరిధిలో శ్రీపర్రు, కలకుర్రు, మానూరులో దొడ్డిగట్లలో సాగు చేస్తున్న మత్స్యకారుల నుంచి ఎకరాకు రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఈ సెక్షన్ పరిధిలో సుమారు 6 వేల ఎకరాల్లో చేపల సాగు ఉంది. అలాగే నిడమర్రు, ఏలూరు, భీమడోలు పరిధిలో సుమారు 24 వేల ఎకరాల దొడ్డిగట్లలో సాగు చేస్తున్న మత్స్యకారుల నుంచి అధికారులు సుమారు రూ.కోటి వరకూ వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో కొంత మొత్తం ఉన్నతాధికారులకు సైతం చేరుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దొడ్డిగట్లు కొట్టేస్తాం దొడ్డిగట్లలో చేపల సాగు ను అడ్డుకుంటాం. ఏలూ రు మండలం కొక్కిరాయిలంక వెనక అక్రమ చెరు వు తవ్వకాలను అడ్డుకున్నాం. ఈ ప్రాంతంలో దొడ్డిగట్లను చేపల చెరువులుగా మార్చి సాగు చేస్తున్నట్టు గుర్తించాం. వెంటనే పూర్తిస్థాయిలో ధ్వంసం చేయాలని నిర్ణయించాం. ఈ మేరకు రేంజర్లు, సెక్షన్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశాం. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ఏలూరు, కైకలూరు రేంజర్ల పర్యవేక్షణలో దొడ్డిగట్లను ధ్వంసం చేయిస్తాం. –సెల్వం, డీఎఫ్ఓ హక్కులు కాపాడాలి కొల్లేరులో సహజ సిద్ధంగా ఏర్పడ్డ దొడ్డిగట్లలో చేపలు పట్టుకునే హక్కు మత్స్యకారులకు ఉంది. వేసవిలో వీటిని పట్టుకుని అమ్ముకుంటారు. దొడ్డిగట్లలో చేపల సాగు చాలా కష్టం. కొల్లేరుకు వరద వస్తే దొడ్డిగట్లు మునిగి మత్స్యకారులు నష్టపోతారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెగ్యులేటర్ల నిర్మాణం పూర్తి చేయగానే కొల్లేరు మొత్తం నిండుకుండలా మారిపోతుంది. అప్పుడు మ త్స్యకారులు సంప్రదాయ చేపల వేటతో జీవనం సాగించవచ్చు. –పెన్మెత్స శ్రీనివాసరాజు, ఎంపీపీ, ఏలూరు