
అక్టోబర్‌లో మీటర్ రీడింగ్ తీయగా రూ.73,287 రావడంతో ఆందోళనకు గురయ్యారు. రెండు నెలలకు సంబంధించి రూ.1,21,728 వచ్చింది.
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన మెరుగు సంధ్య పేరిట ఉన్న విద్యుత్ మీటర్‌కు రూ.1,21,728 కరెంటు బిల్లు వచ్చింది. దీంతో వినియోగదారులు అవాక్కయ్యారు. సెప్టెంబర్‌లో రూ.48,441 విద్యుత్ బిల్లు రావడంతో బిల్లు సవరించాలని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అక్టోబర్‌లో మీటర్ రీడింగ్ తీయగా రూ.73,287 రావడంతో ఆందోళనకు గురయ్యారు.
చదవండి: జూబ్లీహిల్స్ దాడిలో గాయపడ్డ రియల్టర్ రవీందర్ రెడ్డి మృతి
రెండు నెలలకు సంబంధించి రూ.1,21,728 వచ్చిందని బాధితురాలు వాపోయింది. అంతకుముందు నెలకు రూ.500 నుంచి రూ.600 వస్తుండగా రెండు నెలల నుంచి వేలల్లో బిల్లు రావడంతో వారి గుండె గుభేల్ మంటోంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.