
అతనిది సింగిల్ రూమ్ షెటర్‌లో టైలరింగ్ షాపు. ప్యాంట్లు, చొక్కాలతో పాటు షేర్వాణీలు కుడుతుంటాడు. నెల నెలా కరెంట్ బిల్లును ఫోన్ పేలో కడుతుంటాడు. ఉన్న సింగిల్ బల్బ్‌కు నెలలో రోజంతా కరెంట్ వాడినా.. నెలకు రూ.2 వేలు రావడం కూడా కష్టమే. అయితే ఈ నెల బిల్లు చూడగానే.. గుండె ఆగినంత పనైందట అతనికి. ఏకంగా 86 లక్షల బిల్లు వచ్చింది.
గుజరాత్ వల్సద్‌కు చెందిన అన్సారీ.. తన మామతో కలిసి టేలర్ షాప్ నడుపుతున్నాడు. కరెంట్ బిల్లు నెల నెల ఫోన్ పేలో కడుతుంటాడు. అయితే ఈ నెల బిల్లు చూసి అతని కళ్లు బయర్లు కమ్మాయట. ఏకంగా 86 లక్షల బిల్లు రావడంతో.. ఎలక్ట్రిసిటీ బోర్డుకు పరుగులు తీశాడు. ఆ వెంటనే డిస్కం సిబ్బంది సైతం అంతే వేగంగా అతని షాపు మీటర్‌ను పరిశీలించారు. అయితే..
వల్సద్‌లో ఇతని దుకాణం ఉన్న ఏరియాకు దక్షిణ్ గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్ నుంచి పవర్ సప్లై జరుగుతుంది. ఈ పరిధిలో గుజరాత్ ఏడు జిల్లాల నుంచి 32 లక్షల మంది ఉన్నారు. ఇతని షాప్ మీటర్‌లో రెండు డిజిట్స్ పొరపాటున ఎక్కువ యాడ్ అయ్యాయట. అలా.. అతనికి అంతలా బిల్లు వచ్చిందని సిబ్బంది గుర్తించారు.
వెంటనే సిబ్బంది తమ తప్పును సరిదిద్దుకుని.. రివైజ్ బిల్లును అన్సారీ చేతిలో పెట్టారు. అందులో రూ.1,540 మాత్రమే ఉంది. దీంతో హమ్మాయ్యా అనుకున్నాడా టైలర్. అయితే బిల్లు సంగతి ఏమోగానీ.. ఆ నోటా ఈ నోటా పాకి ఇప్పుడతని టైలర్ షాప్‌కు సెల్ఫీల కోసం జనం క్యూ కడుతున్నారట. దీంతో అన్సారీ హ్యాపీగా ఫీలవుతున్నాడు.
86 લાખનું અધધ બિલ... વલસાડમાં વીજ વિભાગની બેદરકારીથી દરજીની દુકાનમાં મસમોટું લાઇટ બિલ આવ્યું#ligthbill #valsad #gujarat #viralvideo #trendingvideo pic.twitter.com/nEOdfr2g6G
— Zee 24 Kalak (@Zee24Kalak) November 25, 2024
Video Credits: Zee 24 Kalak
ఇదీ చదవండి: గత 75 ఏళ్లుగా ఫ్రీ టిక్కెట్ సర్వీస్ అందిస్తున్న ఏకైక రైలు ఇదే..!