
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ (రిటైర్డ్ ఐఎఎస్)కు కీలక బాధ్యతలు అప్పగించారు. సోమేష్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, సోమేష్ కుమార్ మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ సీఎస్‌గా ఉన్న సోమేష్ కుమార్‌ను కేంద్రం రిలీవ్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, ఆయన ఏపీలో రిపోర్ట్ చేశారు. ఇక, ఇటీవలే సోమేష్ కుమార్ వీఆర్‌ఎస్ తీసుకున్నారు. దీంతో, సీఎం కేసీఆర్ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో సోమేశ్ ‘ముద్ర’.. అనేక రాజకీయ విమర్శలను ఎదుర్కొని