
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ నమోదు కావడం బాధాకరమిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కు ఉపయోగించుకునేందుకు ఆసక్తి చూపకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఓటు హక్కుపై ఎన్నికల కమిషన్ మరింత అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులకు సీట్లు పొందాలన్నా, సర్టిఫికెట్ తీసుకోవాలన్న కచ్చితంగా ఓటు వేసి ఉండాలన్న నిబంధన పెట్టాలి అని సూచించారు. ఓటు వేసిన వ్యక్తులకే ఉద్యోగ, విద్యావకాశాలు కల్పించాలన్నారు. అలాగే ఓటేయని వారికి ప్రభుత్వ పథకాలు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటేనే ఓటింగ్ శాతం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
(చదవండి : గ్రేటర్ వార్: పోలింగ్ కేంద్రంలో సిబ్బంది కునుకుపాట్లు)