
సాక్షి, హైదరాబాద్: భజరంగ్‌దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌గా శివరాం ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్‌ను వీహెచ్‌పీ రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్ సమక్షంలో ఎన్నుకున్నారు.
కో–కన్వీనర్‌లుగా వెంకట్, జీవన్ ఎన్నికయ్యారు. భజరంగ్ దళ్ బెంగళూరు క్షేత్ర శారీరక ప్రముఖ్‌గా కుమారస్వామి, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సహ కార్యదర్శిగా పండరినాథ్, ధర్మ ప్రసాద్, రాష్ట్ర సహ కార్యదర్శిగా సుభాష్ చందర్‌లను ఎన్నుకున్నట్టు విశ్వహిందూ పరిషత్ ప్రచార సహ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి వెల్లడించారు.