
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది
ఎల్కతుర్తి: కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాల న సాగిస్తోందని ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నా రు. ఈనెల 27న ఎల్కతుర్తి మండలం చింతలపల్లి సమీపాన నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభా స్థలిని ఆయన మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌తో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా విలేకరులతో మాట్లాడారు. గడిచిన 25 ఏళ్ల కాలంలో తెలంగాణలో నెలకొన్న సమస్యలను అప్పటి సీఎం కేసీఆర్ పరిష్కరిస్తే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే తిరిగి వెనుకటి రోజులను తీసుకొచ్చిందని విమర్శించా రు. బీఆర్‌ఎస్ సర్కారు కరెంట్ సమస్య లేకుండా, గుంట పొలం ఎండిపోకుండా చేస్తే.. ఇప్పుడు కరెంట్, నీరు లేక వందల ఎకరాల్లో పంటలు ఎండిపోయిన పరిస్థితి దాపురించిందన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తం సదానందం, బీఆర్‌ఎస్ నాయకులు పిట్టల మహేందర్, మండల సురేందర్, తంగెడ మహేందర్, గోల్లె మహేందర్, తంగెడ నగేశ్, శేషగిరి, కడారి రాజు, జూపాక జడ్సన్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ మధుసూదనాచారి