
చల్లని విషం!
మంగళవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోu
సాక్షి, వరంగల్: అసలే ఎండాకాలం.. ఆపై చల్లటి ఐస్ క్రీమ్.. రోడ్డుపై వెళ్తుంటే కనిపిస్తే చాలు తినకుండా ఎవరైనా ఉండగలరా? ఎండల నుంచి ఉపశమనానికని కొందరు, అలవాటుగా మరికొందరు ఐస్ క్రీమ్‌లు తినేస్తుంటారు. దీంతో వేసవి మూడు నెలలు ఐస్‌క్రీమ్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈడిమాండ్‌ను కొంత మంది క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇందుకు ఇటీవల నగరంలో అధికారుల తనిఖీల్లో బహిర్గతమైన ఘటనలే నిదర్శనం. కాసుల కక్కుర్తితో కొంతమంది నాసిరకం, నిబంధనలు పాటించకుండా ఐస్ క్రీమ్‌లు తయారు చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్నారు.
నిబంధనలు పాటించకుండానే..
కొన్ని ఐస్‌క్రీమ్ కంపెనీలు ఎక్స్‌పైరీ తేదీలను ఐస్‌క్రీమ్ ప్యాక్‌పై ముద్రించడం లేదు. అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తున్నట్లుగా ఇటీవల టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల సంయుక్త దాడుల్లో తేలింది. హానికారక, ప్రమాదకర కెమికల్స్ వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు. ఆకర్షణీయంగా మెరిసేందుకు కెమికల్స్ వాడుతున్నట్లు గుర్తించారు. ఈ కెమికల్స్ రక్తనాళాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ కల్తీ ఐస్ క్రీమ్ తినడం వల్ల చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ఐస్‌క్రీమ్‌లు కొనేముందు అన్నీ చెక్ చేసుకోవాలని పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. అయితే టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా కలిసి దాడి చేసి ఆహర కల్తీ పదార్థాలు పట్టుకున్న కేసులు నాలుగు నెలల్లో పది కేసులు నమోదైతే ఐదు కేసుల వరకు కల్తీ ఐస్ క్రీమ్‌లవే ఉండడం గమనార్హం. ఈఐదు కేసుల్లో రూ.8,69,000 కల్తీ ఐస్‌క్రీం ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
న్యూస్‌రీల్
నిబంధనలు పాటించని
‘ఐస్’ కంపెనీలు
అపరిశుభ్ర వాతావరణం..
కెమికల్స్ వినియోగం
తయారీ, ఎక్స్‌పైరీ తేదీలు లేకుండానే విక్రయాలు
టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులతో వెలుగులోకి..
ఏప్రిల్ 11: హనుమకొండలోని గాంధీనగర్ పోచమ్మ గుడి సమీపంలోని షామా డిస్ట్రిబ్యూటరీలో ఎక్స్‌పైరీ తేదీలు ముద్రించకుండానే ఐస్‌క్రీమ్‌లు ప్యాక్ చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేసి నిబంధనలు పాటించకుండా ఐస్‌క్రీమ్ తయారు చేస్తున్న నిర్వాహకులను పట్టుకున్నారు. రూ.25,740 విలువైన ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని నిర్వాహకుడు మొహమ్మద్ జాన్ పాషాను అదుపులోకి తీసుకున్నారు.
ఏప్రిల్ 12: మడికొండలోని కనకదుర్గ కాలనీలో ఓంకార్ ఐస్‌క్రీమ్ డిస్ట్రిబ్యూటరీలో టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేశారు. తయారీ, ఎక్స్‌పైరీ తేదీలు ముద్రించకుండా అమ్మకానికి సిద్ధంగా ఉంచిన రూ.2,39,476 విలువైన ఐస్ క్రీమ్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు వొల్లాల రవీందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏప్రిల్ 14: వరంగల్ బాలాజీనగర్‌లోని కూల్ టచ్ ఐస్ క్రీమ్ కంపెనీలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నియమాలు పాటించకుండా, తయారీ, ఎక్స్‌పైరీ తేదీలు ముద్రించకుండా, లైసెన్స్ లేకుండా అమ్మకానికి సిద్ధంగా ఉంచిన రూ.83,200ల విలువైన ఎనిమిది రకాల ఉత్పత్తులను గుర్తించారు. టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎల్.పవన్‌కుమార్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కృష్ణమూర్తి సంయుక్తంగా దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు అల్లిపురం శ్రీపాల్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు.

చల్లని విషం!

చల్లని విషం!