మరికొంచెం రెచ్చిపోయారు | J&K: Protest in Nowhatta after Friday prayers, flags of Pakistan, LeT and Islamic State raised | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 18 2015 7:58 AM | Last Updated on Thu, Mar 21 2024 8:30 PM

మరోసారి జమ్మూకాశ్మీర్లో జాతి వ్యతిరేక శక్తులు రెచ్చిపోయారు. పాకిస్థాన్కు, పలు ఉగ్రవాద సంస్థలకు మద్దతు తెలుపుతూ జెండాలు ప్రదర్శించారు. వారికి అనుకూల నినాదాలు చేస్తూ వీధుల్లోకి చొచ్చుకొచ్చే యత్నం చేశారు. దీంతో పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. శుక్రవారం పవిత్ర ప్రార్థనలు ముగిసిన కొద్ది సేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ జమ్మూకాశ్మీర్ పర్యటనలో ఉండగానే ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి గతంలో కన్నా జమ్మూకాశ్మీర్లో పీడీపీ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినప్పటి నుంచి ఈ తరహా ఘటనలు ఎక్కువవుతున్నాయి. వేర్పాటువాద సంస్థ హుర్రియత్ కూడా పాకిస్థాన్ అనూకూల శక్తులను మరింత ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పురిగొల్పుతునే ఉంది. అయినప్పటికీ, పీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు సమర్థంగా తీసుకోకపోవడం గమనార్హం. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన అనంతరం ప్రత్యేక వాదులు ప్రదర్శించిన పాక్ ఉగ్రవాద సంస్థల జెండాల్లో లష్కరే ఈ తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ ఐఎస్ ఐఎస్ వి ఉన్నాయి. ఈ జెండాలు ప్రదర్శించినవారంతా యువకులేకావడం, వారి వెనుక చిన్న చిన్న పిల్లలు కూడా ఉండటం కొంత ఆందోళన కలిగించింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement