తెలంగాణ బడ్జెట్ పల్లె బాట పట్టింది! సాగునీటికి నిధుల వరద పారిస్తూనే... చితికిన కుల వృత్తులు, కూలిన జీవితాలను నిలబెట్టేందుకు కొత్త నినాదం ఎంచుకుంది. అట్టడుగు వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బీసీలకు భరోసా కల్పించింది. అత్యంత వెనుకబడిన వర్గాలకు తొలిసారి బడ్జెట్‌లో చోటు కల్పించింది. గ్రామీణ ఆర్థిక ప్రగతిని లక్ష్యంగా ఎంచుకొని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రూ.1,49,646 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.