ముంబై తీరానికి సమీపంలో సముద్రంలో నిర్మించ తలపెట్టిన ఛత్రపతి శివాజీ మహరాజ్ భారీ స్మారక ( ఎత్తు192 మీటర్లు) నిర్మాణానికి శనివారం ప్రధాని మోదీ జలపూజ చేశారు. దక్షిణ ముంబైలోని తీరం నుంచి 1.5 కి.మీ దూరంలో రూ.3,600కోట్లతో ఈ స్మారకాన్ని నిర్మించనున్నారు. గిరుగావ్ చౌపట్టి బీచ్ నుంచి హోవర్‌క్రాఫ్ట్ (కోస్టుగార్డు ప్రత్యేక నౌక)లో అరేబియా సముద్రంలోని స్మారకం నిర్మించే ప్రాంతానికి వెళ్లి జలపూజ చేశారు. మహారాష్ట్రలోని అన్ని జిల్లాలనుంచి తీసుకొచ్చిన మట్టి, వివిధ నదుల నుంచి తీసుకొచ్చిన నీరు నింపిన కలశాలను మోదీ సముద్రంలో విసర్జనం చేశారు.