తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందనే విషయాన్ని హెరిటేజ్ వాహనాల్లో ఎర్రచందనం దుంగలు పట్టుబడటం స్పష్టం చేస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ నేత జోగి రమేశ్ అన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనవసరంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభాండాలు వేసిన బాబు.. తన ప్రభుత్వంలో ఏదైనా ప్రూవ్ చేయగలిగారా? అని ప్రశ్నించారు. సీబీఐ అంటే బాబు ఎందుకు అంత భయమని అన్నారు. విశాఖలో లక్ష ఎకరాల భూమిని టీడీపీ నేతలు మింగారని ఆరోపించారు. చంద్రబాబుకు అల్జీమర్స్ వ్యాధి వచ్చినట్లు అనుమానంగా ఉందని అన్నారు.