రాజకీయ దుర్నీతికి వేదికగా మారిన శాసనమండలికి చరమగీతం పాడాల్సిందేనని రాష్ట్ర శాసనసభ తేల్చి చెప్పింది. ప్రజా సంక్షేమం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అడ్డంకిగా నిలిచిన మండలిని రద్దు చేయాలన్న చట్టబద్ధ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రజాతీర్పుతో ఎన్నికైన ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ప్రతిబంధకంగా మారుతూ, ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన వారి రాజకీయ లబ్ధికి సాధనంగా మారుతున్న శాసనమండలి కథకు ముగింపు పలకాల్సిందేనని స్పష్టం చేసింది. రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది.