చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో తప్పులు జరిగినందువల్లే రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ స్పష్టం చేశారు. ఫిర్యాదు ఎవరిచ్చినా ఈసీ చర్యలు చేపడుతుందని అన్నారు. టీడీపీ కోరిన 18 చోట్ల కూడా వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నామని చెప్పారు. రీపోలింగ్ జరిగే 5 కేంద్రాల్లో పీవో, ఏపీవోపై కఠిన చర్యలు ఉంటామని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న అనధికార వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని అన్నారు.