-
చంద్రబాబుకు కుప్పంలో ఓటమి భయం!
నారా చంద్రబాబు నాయుడు మూడున్నర దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోంది. చంద్రబాబు కంచుకోటగా చెబుతున్న కుప్పంలో ఈసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఈసారి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యే అవకాశం లేదా? చంద్రబాబుకు పట్టిన ఈ దుస్థితికి కారణం ఏంటి?చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి 35 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చంద్రబాబునాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి..ఇప్పుడు మూడోసారి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. దొంగ ఓట్లను చేర్పించి భారీ మెజారిటీతో ఎన్నికవుతూ వస్తున్న చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ ఆవిర్భావంతో చెక్ పడింది. క్రమంగా మెజారిటీ తగ్గుతూ...ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఈసారి దొంగ ఓట్లు భారీగా తొలగించడంతో గెలుపు మీదే నమ్మకమే పోయింది. తనను ఏడు సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపించిన కుప్పం ప్రజల్ని చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే కుప్పం నియోజకవర్గానికి మహర్దశ పట్టింది. ఐదేళ్ళలో పూర్తిగా అభివృద్ధి చెందింది. అందుకే చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో ఫేడ్ అవుట్ లీడర్ గా మారిపోయారు.కుప్పంలో 1989 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన చంద్రబాబు అక్కడి ప్రజల్ని మోసం చేస్తూ...తాను మాత్రం ఉన్నత పదవులు అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో మారుమూల తమిళనాడు బోర్డర్లో ఉన్న కుప్పం ప్రజల ఉపాధి గురించి ఏనాడూ పట్టించుకోలేదు. అందుకే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కుప్పం ప్రజలు చంద్రబాబుకు బుద్ది చెప్పడానికి నిర్ణయించుకున్నారు. 2019 ఎన్నికల్లో 73 శాతం పోలింగ్ నమోదు అయితే, ఈసారి కుప్పంలో 89.88 శాతం ఓటింగ్ నమోదైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సిఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపునకు మహిళా ఓటర్లు, వృద్దులు పెద్ద ఎత్తున స్పందించారు. కుప్పం నియోజకవర్గానికి హంద్రీ నీవా కాలువల ద్వారా కృష్ణాజలాలు తీసుకువచ్చిన తర్వాతనే మళ్లీ ఓటు అడగటానికి వస్తాను అని చెప్పిన మాటలు కుప్పం ప్రజలు మనసుల్లో పెను మార్పును తీసుకువచ్చాయంటున్నారు. హామీలో భాగంగా ఈ ప్రాంతంను సస్యశ్యామలం చేస్తూ, కుప్పం ప్రజల చిరకాల వాంఛ అయిన తాగు, సాగు నీరు అందించిన సిఎం జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునేందుకు ఓటు రూపంలో తమ కృతజ్జత చూపారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పట్ల వివక్షత అనేది లేకుండా కుప్పంను మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా రెవెన్యూ సమస్యలతో సతమతం అవుతున్న ఈప్రాంత ప్రజలు కష్టాలు తీరుస్తూ కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా అందించారు. అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేశారు. ఇవన్నీ గమనించిన కుప్పం ప్రజల మనసుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలిచిపోయారు. అందుకే ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. కుప్పం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 89.88 శాతం పోలింగ్ నమోదు కావడమే ఫ్యాన్ గాలి జంఝామారుతంలా వీచిందనడానికి సాక్ష్యం అని విశ్లేషకులు చెబుతున్నారు.కుప్పం ప్రాంతంలో బలంగా ఉన్న వన్నెకుల సామాజికవర్గానికి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. భరత్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో పాటుగా చంద్రబాబు మీద పోటీ చేసే ఛాన్స్ కల్పించారు. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో మొన్నటి వరకు లక్ష మెజారిటీ సాధనే లక్ష్యం అన్న కుప్పం టీడీపీ నాయకులు... ఎన్నికలు జరిగిన సాయంత్రం నుంచి సైలెంట్ అయిపోయారు. భారీగా పెరిగిన మహిళా ఓటింగ్ అటు టీడీపీకి, ఇటు చంద్రబాబుకు పెను ప్రమాదంగా మారిందనే భయాందోళనలు టీడీపీని వెంటాడుతున్నాయి. -
ఉమ్మడి ‘పశ్చిమ’లో సంక్షేమానికే పట్టం!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగ్ సమయంలో జనప్రభంజనం సునామీలా కనిపించింది. మెజార్టీ స్థానాల్లో ప్రజలు సంక్షేమానికే పట్టం కట్టారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసింది. ప్రతి ఇంటికీ లబ్ది చేకూర్చడం అధికార పార్టీకి ఉమ్మడి జిల్లాలో కలిసొచ్చిన అంశం. కూటమి పొత్తులు, గుర్తుల గందరగోళాలు, చివరి నిమిషంలో వచ్చి చేరిన దిగుమతి నేతలు మోసుకొచ్చిన సమస్యలే కాకుండా... కేవలం దౌర్జన్యాలు, పోల్ మేనేజ్మెంట్ను నమ్ముకోవడంతో కూటమి పరిస్థితి అయోమయంగా మారింది. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా గడిచిన ఐదేళ్లలో పెద్ద ఎత్తున అమలయ్యాయి. ప్రభుత్వానికి పాజిటివ్ ఓటు బాగా పడిందనే వాదన జిల్లాలో బలంగా వినిపిస్తోంది.ఇక టీడీపీ కంచుకోట అని చెప్పుకునే నియోజకవర్గాల్లో సైతం ఫ్యాన్ హవా బాగా కనిపిస్తోందని, సైలెంట్ ఓటుతో ఓటర్లు కూటమి పార్టీలకి షాక్ ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా తాడేపల్లిగూడెం, దెందులూరు నియోజకవర్గాల్లో కూటమి నేతలు దౌర్జన్యాలకు తెగబడినా, కైకలూరులో కూటమి అభ్యర్థి పోలీసులపై బెదిరింపులకు దిగినా ఓటింగ్ శాతంపై ఎక్కడా ప్రభావం చూపలేదు. ఏలూరు జిల్లాలో 2019లో 82.61 శాతం పోలింగ్ నమోదు కాగా 2024లో 83.65గా నమోదైంది. ఉంగుటూరులో అత్యధికంగా 87.75 శాతం నమోదుకాగా ఏలూరులో అత్యల్పంగా 71 శాతం నమోదైంది.అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ శాతంలో స్వల్ప పెరుగుదల కనిపించింది. పశ్చిమగోదావరి జిల్లాలో 12,16,667 ఓట్లు పోలవ్వగా, ఏలూరు జిల్లాలో 13,67,999 ఓట్లు పోలయ్యాయి. సంక్రాంతి పండక్కి బారులు తీరినట్లుగా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ఈసారి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఉమ్మడి జిల్లా నుంచి వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారిలో 50 నుంచి 60 వేల మంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి జిల్లాకు వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో సెటిలర్స్ ఉన్న ప్రాంతంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఆత్మీయ సమావేశాలు నిర్వహించి పోలింగ్‌కు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అధికార యంత్రాంగం కూడా ఓటర్లను చైతన్య పరిచే కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడంతో పోలింగ్ శాతం గతం కంటే కూడా స్వల్పంగా పెరిగింది. అలాగే రెండు జిల్లాల్లో 18 ఏళ్ళు నిండి తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య 80 వేలకు పైగానే ఉంది. దీంతో పోలింగ్ కేంద్రాల్లో యువత, వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించారు.ఏలూరు జిల్లాలో ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ప్రతి ఇంటికీ పథకాలు అందాయి. ఊళ్లు రూపురేఖలు మారాయి. ప్రతి ఊరిలో నాడు-నేడు కార్యక్రమంతో బాగుపడిన పాఠశాలలు, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, రహదారుల నిర్మాణాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న తమ్మిలేరు రిటైనింగ్ వాల్‌తో సహా కీలక అభివృద్ధి పనులన్నీ పూర్తయ్యాయి. వంచనకు, విశ్వసనీయతకు మధ్య జరిగిన ఎన్నికల సంగ్రామంలో ప్రజల విశ్వాసాన్ని చూరగొని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం జగన్‌కే ప్రజలు మళ్లీ పట్టం కట్టారనీ తెలుస్తోంది.ఏలూరు జిల్లాలోని 28 మండలాల్లో 548 సచివాలయాలు నిర్మించి, 600 రకాల సేవలను ప్రజలకు స్థానికంగా అందిస్తున్నారు. పెన్షన్ మొదలుకొని పౌర సేవలు, రేషన్ వంటివి ఇంటికే అందిస్తున్నారు. 271 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు నిర్మించి పల్లెల్లో మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా 2,83,239 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. 350 రైతు భరోసా కేంద్రాలు నిర్మించి దళారీ వ్యవస్థ లేకుండా ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నారు. నాడు-నేడుతో జిల్లాలో 2,032 పాఠశాలలను రూ.270.75 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేశారు. జిల్లాలో 1,16,431 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన చరిత్ర జగన్ సర్కారుది. రూ.713.17 కోట్లతో 98,874 ఇళ్ల నిర్మాణం చేసుకునేలా ప్రభుత్వం పూర్తిగా సహకారం అందించింది. జిల్లాలో 2.81 లక్షల మందికి ఐదేళ్లలో రూ.3,880 కోట్ల పెన్షన్, 35,745 ఆసరా గ్రూపుల్లోని రూ.3.55 లక్షల మంది మహిళలకు రూ.1305.05 కోట్ల రుణమాఫీ, 1.78 లక్షల మంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి పథకం కింద రూ.1,069.30 కోట్లు, 1.73 లక్షల మంది మహిళల ఖాతాల్లో ఏటా రూ.130.15 కోట్ల చొప్పున విద్యా కానుక ఇలా పలు సంక్షేమ పథకాల వేల కోట్ల లబ్ధిని చేకూర్చారు.ఇతర పార్టీల నుంచి వచ్చిన దిగుమతి నేతలతో స్థానిక నేతలకు సమస్యలు, కూటమి పేరుతో చివరి నిమిషంలో ఊడిపడ్డ జనసేన, బీజేపీ నేతలతో చికాకులు, నాయకులతో సమన్వయలేమి ఇలా గందరగోళాలతో సైకిల్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గతంలో 14 ఏళ్లు అధికారంలో ఉన్నా జిల్లాను పట్టించుకోకపోవడం, సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా టీడీపీ నేతలు జేబులు నింపుకోవడం, కొన్నిచోట్ల పెద్ద ఎత్తున విధ్వంసకాండ, కోట్ల దోపిడీ, అధికారులపై దాడులు వంటి ఘటనలను జిల్లా ప్రజలు మరిచిపోలేదు. టీడీపీ ఎంపీ అభ్యర్థి, దిగుమతి నేత పుట్టా మహేష్‌కు జిల్లా నేతల నుంచి సహకారం లేకపోవడం, పోలవరం, చింతలపూడి, కైకలూరు, నూజివీడు ఇలా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతల వివాదాలను పరిష్కరించలేని పరిస్థితితో పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారం చేయలేక చేతులెత్తేశారు.జిల్లాలో చంద్రబాబు ఏలూరు, నూజివీడు, దెందులూరులో సభలు నిర్వహించినా అట్టర్ ఫ్లాప్ కావడంతో పార్టీ కేడరే లైట్ తీసుకుంది. అలాగే కీలక నియోజకవర్గాల అభ్యర్థులు పోలింగ్‌కు ముందే చేతులెత్తేసిన పరిస్థితి కనిపించింది. ఐదేళ్ల జగన్ సంక్షేమ పాలనలో నవరత్నాల ద్వారా జిల్లాలో రూ.8,500 కోట్ల మేర నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. ఏలూరు వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేసి 150 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించడం, కొల్లేరు మిగులు భూముల పంపిణీకి వీలుగా సర్వే ప్రక్రియ తుది దశకు చేరడం, టీడీపీ విధ్వంసానికి గురైన పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టి యుద్ధప్రాతిపదికన ప్రధాన పనులు పూర్తిచేయడంతో పాటు ఆర్అండ్ఆర్ కాలనీలో సమగ్ర అభివృద్ధి పనులు జరిగాయి.ఏలూరులో 50 ఏళ్ల నుంచి ఉన్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా తమ్మిలేరు రిటైనింగ్ వాల్‌ను రూ.80 కోట్ల ఖర్చుతో పూర్తి చేశారు. అలాగే బుట్టాయగూడెం, చింతలపూడి, నూజివీడుల్లో ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునికీకరణ పనులు ఈ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. జిల్లాలో వైఎస్సార్సీపీ క్వీన్‌స్వీప్ దిశగా దూసుకువెళ్తోంది. ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు రెండుసార్లు గడపగడపకూ వెళ్లడం, విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ప్రజలే స్టార్ క్యాంపెయినర్లుగా మారడం పార్టీకి కలిసి వచ్చిన అంశాలు. పార్టీ అధినేత, సీఎం జగన్ దెందులూరులో లక్షలాది మందితో సిద్ధం బహిరంగ సభ నిర్వహించడం, ఏలూరు, కైకలూరులో ఎన్నికల ప్రచార సభలు, దెందులూరు, ఏలూరు, ఉంగుటూరులో రోడ్ కు ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా ఎన్నికల ప్రచారం చేశారు. అటు పార్టీ అధినేత వైఎస్ జగన్, ఇటు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులంతా ప్రజలతో మమేకం కావడం, పాజిటివ్ ఓటు మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని తేలిపోయింది.నర్సాపురం పార్లమెంట్ పరిధిలోనూ వైఎస్సార్సీపీదే హవా!ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం పార్లమెంట్ స్థానం పరిధిలో వైఎస్ఆర్సీపీకి ఎదురుండదనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎంపీ సీటుతో సహా, ఏడు అసెంబ్లీ స్థానాలపై పోటీ చేసిన అభ్యర్థులు ఎంతో ధీమాగా కనిపిస్తున్నారు. జిల్లాలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని చెబుతున్నారు. వారి ధీమాకు కారణం ఏంటో చూద్దాం.నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని పశ్చిమగోదావరి జిల్లాలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగనుంది. నర్సాపురం ఎంపీ స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ సీట్లల్లోనూ ఫ్యాన్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించనున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఐదేళ్లలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి కార్య క్రమాలు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలకు జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టిన తీరు, మరోపక్క కూటమిలోని వర్గ విభేదాలు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటనలకు స్పందన లేకపోవడం, కూటమి మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాదనే వాదన ప్రజల్లో స్పష్టంగా కనబడుతోంది. సీఎం జగన్ పాలనలో జిల్లాలో ప్రగతి పరవళ్లు తొక్కింది. డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో సంక్షేమ పథకాల ద్వారా 11,364.57 57 కోట్లు లబ్దిదారులకు అందించారు. జిల్లాలో 6,988.37 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు.నరసాపురంలో ఆక్వావర్సిటీ, ఫిషింగ్ హార్బర్, పాలకొల్లులో వైద్య కళాశాల తదితర అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాకు తలమానికమయ్యాయి. నాడు-నేడు పథకంలో కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ బడులు, ఆస్పత్రుల రూపురేఖలు మారాయి. సచివాలయం, వలంటీర్ వ్యవస్థల ద్వారా పాలనను ప్రజల చెంతకు చేర్చారు. జగనన్న సురక్ష శిబిరాల ద్వారా జిల్లాలోని 6,05,780 మంది లబ్దిదారులకు ఉచితంగా 6,48,607 సర్టిఫికెట్లు జారీ చేశారు. జగనన్న ఆరోగ్య సురక్షలో 447 వైద్యశిబిరాలు ద్వారా ప్రజల చెంతకే వెళ్లి 4.10 లక్షల మందికి వైద్యసేవలు అందించారు. నవరత్న పథకాల్లో భాగంగా 77 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి సొంతింటి కలను సాకారం చేశారు.పొత్తులు కుదుర్చుకుని కూటమిలోని మూడు పార్టీలు సీట్లు ప్రకటించిన తర్వాత జనసేన శ్రేణుల్లో నిస్సత్తువ అలముకుంది. పవన్ కల్యాణ్ వైఖరిని నిరసిస్తూ ఆచంటలో ఆ పార్టీ ఇన్చార్జి చేగొండి సూర్యప్రకాష్ ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడే రెండోసారి భీమవరం నుంచి పోటీకి వెనుకడుగు వేయడం, భీమవరంలో సొంత నేతలకు సత్తాలేదని టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను దిగుమతి చేసుకుని సీటు ఇవ్వడం జిల్లాలో ఆ పార్టీకి పట్టు లేదనే విషయాన్ని తేటతెల్లం చేసింది. టీడీపీ పోటీ ఉన్నచోట తమకు సరైన ప్రాధాన్యత ఉండటం లేదని జనసేన నేతలు మదనపడుతున్నారు. భీమవరం, తణుకు, నరసాపురం తదితర నియోజకవర్గాల్లో రెండు పార్టీల కేడర్ మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి.కూటమితో పోలిస్తే వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో చాలా వేగంగా దూసుకుపోయారు. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రతిఇంటికీ వెళ్లి ప్రజలతో మమేకమై వారి సమస్యలు పరిష్కరించడం, జగనన్న సురక్ష, వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన కార్యక్రమాలతో ఐదేళ్లుగా జనం మధ్యనే ఉండటం ప్రచారంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రజలకు మరింత చేరువచేసింది. ఆయా గ్రామాలు, వార్డులకు వెళ్లినప్పుడు స్థానికులను పేర్లు పెట్టి పిలుస్తూ, మీ సమస్యలు పరిష్కరించామని చెబుతూ, ఐదేళ్ల ప్రగతిని వివరిస్తూ, చేపట్టబోయే పనులను తెలుపుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థులకు అపూర్వ స్పందన లభించింది.వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ఉంటే టీడీపీ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కానిదిగా ఉందని ప్రజలు పెదవి విరిచారు. గత అనుభవాల నేపథ్యంలో చంద్రబాబు హామీలను వారు విశ్వసించలేదు. కరోనా మహమ్మారి విలయ తాండవం చేసిన రోజుల్లో జగన్ సర్కారు, వైఎస్సార్సీపీ అభ్యర్థులు అండగా నిలిచిన తీరును గుర్తు చేసుకున్నారు. కూటమి అభ్యర్థులు, మూడు పార్టీల అధినేతలు అప్పుడేమయ్యారని ప్రజలు ప్రశ్నించారు. టీడీపీ, జనసేన తొలిసారిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ తుస్సుమంది. సభా ప్రాంగణంలో సగానికి పైగా ఖాళీగానే కనిపించింది. ఆ తర్వాత నరసాపురం, పాలకొల్లు. తణుకు, తాడేపల్లిగూడెం, ఉండి నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్వహించిన ప్రచార సభలకు జనం రాక వెలవెలబోయాయి. వారు ప్రసంగిస్తున్న సమయంలోనే జనం వెనుదిరిగి వెళ్లిపోవడం కనిపించింది.జిల్లాలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి జనం ప్రభంజనంలా తరలిరావడం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది. ఉండి, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల మీదుగా సాగిన బస్సుయాత్రకు దారిపొడవునా బారులు తీరి జననేతకు బ్రహ్మరథం పట్టారు. భీమవరం, నరసాపురంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలకు మండుటెండను సైతం లెక్కచేయకుండా వేలాదిగా తరలివచ్చి జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. గత ఎన్నికల్లో జిల్లాలో ఎంపీ స్థానంతో పాటు ఏడింటిలో ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న వైఎస్సార్సీపీ తాజా పరిస్థితుల నేపధ్యంలో జిల్లాలోని అన్ని స్థానాల్లో విజయ ఢంకా మోగిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.70 ఏళ్ల నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలో తొలి బీసీ మహిళా నేత వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోయారు. బీజేపీ నేత భూపతిరాజు శ్రీనివాసవర్మకు సీటు ఇవ్వడాన్ని జిల్లాకు చెందిన కూటమి అసెంబ్లీ అభ్యర్థులు వ్యతిరేకించారు. బీసీ మహిళకు సీటు ఇవ్వడం వైఎస్సార్సీపీకి బాగా కలిసొచ్చిన అంశమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ఉమాబాల విజయానికి బాటలు వేస్తుందని అంటున్నారు. అంతేకాక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులంతా విజయంపై పూర్తి ధీమాతో ఉన్నారు. -
టీడీపీకి తడబాటే.. పచ్చ నేతల్లో కొత్త టెన్షన్!
ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతోంది. ఓటింగ్ జరిగిన తీరు, పెరిగిన ఓటింగ్‌తో తెలుగుదేశం పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. పైకి భీకరంగా ఉన్నా.. ఓటమి తప్పదనే నిర్ణయానికి వచ్చేశారు. ఉదయం నుంచే వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడాన్ని చూసి టీడీపీకి గుండె జారిపోయింది. దీంతో వారి కంటి మీద కునుకు కరువైంది. ఇంతకీ ఉత్తరాంధ్రలో ఏం జరగబోతోంది?సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున పోలింగ్ జరగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల నుంచి ఊహించని విధంగా ఓటింగ్ జరగడం వైఎస్సార్సీపీకే అనుకూలమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విశాఖలో అనేక భారీ పరిశ్రమలు రావడంతో యువత వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపిందనే చర్చ జరుగుతోంది.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఓటర్లను పోలింగ్ కేంద్రాల వైపు నడిపించాయని అంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మూలపేట పోర్ట్, ఐటీ రంగం అభివృద్ధితోపాటు, భారీ పరిశ్రమలు ఏర్పాటు, విశాఖ నగర అభివృద్ధి, కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం వంటివి ఓటర్లను వైఎస్సార్సీపీ వైపు మరింతగా ఆకర్షితులను చేశాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో ఉత్తరాంధ్రలో ఉన్న వెనుకబాటుతనం పోతుందనే అభిప్రాయానికి అక్కడ ప్రజలు వచ్చారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అమ్మఒడి, వైయస్సార్ చేయూత, ఆసరా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు మహిళలకు ఎంతో అండగా నిలిచాయి. ఈ పథకాలన్నీ మళ్ళీ కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్ రావాలనే ఆలోచన మహిళల్లో స్పష్టంగా కనిపించింది.పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాలు తెరవకముందు నుంచే మహిళలు వృద్ధులు బారులు తీరారు. గంటల కొద్దీ ఓపికగా క్యూల్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న ఆరు జిల్లాలు విశాఖ సిటీ, ఏజెన్సీ, మైదాన ప్రాంతాలు అనే తేడా లేకుండా మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేశారు. విజయనగరం జిల్లాలో అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ 81 శాతానికి పైగా జరగడం విశేషంగా చెబుతున్నారు.ఉత్తరాంధ్ర జిల్లాలో పెరిగిన ఓటింగ్ టీడీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. హేమా హేమీలైన నేతల్లో వణుకు పుడుతోంది. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బొత్స ఝాన్సీని నిలబెట్టడం వైఎస్సార్సీపీకి కలిసి వచ్చింది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతోపాటు, ఆమె పుట్టినఊరు కావడంతో కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గాల ఓటర్లు సైతం బొత్స ఝాన్సీకి బ్రహ్మరథం పట్టారు.టీడీపీ ఎంపీ అభ్యర్థి గీతం భరత్ ఎన్ని కోట్లు కుమ్మరించినా ప్రజలు బొత్స ఝాన్సీవైపే మొగ్గు చూపారు. గీతం భరత్ ఆయన కుటుంబ సభ్యులు అవినీతి అక్రమాలకు పాల్పడడం, గీతం యూనివర్సిటీ ముసుగులో సాగించిన భూకబ్జాలను విశాఖ ప్రజలు మర్చిపోలేదు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి కూడా ఇదేవిధంగా తయారైంది. ప్రతీ ఎన్నికకు ఒక నియోజకవర్గం మారే గంటాకు ఈసారి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు.ప్రతీ ఎన్నికలోనూ రిగ్గింగ్‌తో గెలిచే అచ్చెన్నాయుడుకు ఈసారి టెక్కలిలో చెక్ పడనుంది. అచ్చెన్న గూండాయిజం, అవినీతితో విసిగిపోయిన ప్రజలు ఈసారి ఆయన్ను పక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుది అదే పరిస్థితి. బూతులతో విరుచుకుపడే అయ్యన్నకు మహిళలు బుద్ధి చెప్పడానికి రెడీ అయ్యారు. నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు, కొత్త రోడ్లు నిర్మాణం, రోడ్లు విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలతో మరోసారి వైఎస్సార్సీపీకి ప్రజలు మొగ్గు చూపించారు. సొంత నియోజకవర్గాల్లో గెలవలేని మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, కళా వెంకటరావులు పక్క నియోజకవర్గాలకు తరలి వెళ్లారు.అనకాపల్లి ఎంపీగా ఒకప్పటి నాటు సారా వ్యాపారి, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్ కూటమి తరపున పోటీ చేశారు. సీఎం రమేష్ నాన్ లోకల్ కావడం, ఓసీ వెలమ కావడంతో స్థానికంగా ఉన్న బీసీ వెలమలు వైఎస్సార్సీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుకే మోగ్గు చూపించారు. ఇక్కడున్న కొద్ది రోజుల్లోనే సీఎం రమేష్ రౌడీయిజంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సీఎం రమేష్ ఎన్నికలపుడే ఇంతటి గుండాయిజం చేస్తున్నాడు. పొరపాటున గెలిస్తే తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతాడనే ఆందోళన అనకాపల్లి ప్రజల్లో కనిపించింది. దీంతో రమేష్‌కు మద్దతివ్వడానికి అనకాపల్లి ప్రజలు ఏమాత్రం అంగీకరించలేదు. ప్రస్తుత ఓటింగ్ జరిగిన తీరును బట్టి చూస్తే ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీకి క్లీన్ స్వీప్ ఖాయం అనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కూటమి తరపున పోటీ చేసిన హేమాహేమీలంతా మట్టి కరుస్తారనే టాక్ నడుస్తోంది. టీడీపీకి గతంలో వచ్చిన కొద్ది సీట్లు కూడా ఈసారి రావనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
గుడివాడ సీటు గెలుపుపై మేకపోతు గాంభీర్యం!
ఆ నియోజకవర్గంలో పోలింగ్ పూర్తవ్వగానే పసుపు పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. పోలింగ్ సరళి తమకే అనుకూలమని డప్పు కొట్టుకున్నారు. కట్ చేస్తే.. తాజా లెక్కలు చూశాక వారిలో ఆందోళన మొదలైందట. ఏదో అనుకుంటే మరేదో జరిగేలా ఉందనుకుని కలవరపడుతున్నారని టాక్ నడుస్తోంది. ఇంతకీ కృష్ణాజిల్లా గుడివాడలో తెలుగు తమ్ముళ్ల టెన్షన్‌కు కారణమేంటి?.. కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ టాప్ ప్రయారిటీ లిస్ట్ లో పెట్టుకున్న నియోజకవర్గం గుడివాడ. ఇక్కడి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని శక్తిగా ఉన్న కొడాలి నానిని వైఎస్ఆర్సీపీ తరపున హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవకుండా అడ్డుకోవాలనేది టీడీపీ నాయకత్వం బలమైన కోరిక. ఇందుకోసం రెండేళ్లుగా చాలా ప్రయత్నాలు చేసింది. కొడాలి నానిపై పోటీకి పనికొచ్చే నాయకులు గుడివాడలో కనిపించక, చివరికి అమెరికా నుంచి వచ్చిన ఎన్నారై వెనిగండ్ల రామును పోటీలో నిలిపింది. కొడాలి నానిని ఓడిస్తానని ధీమా వ్యక్తం చేసిన వెనిగండ్ల రాము, టీడీపీ నేతలు పోలింగ్ సరళిని చూసి ఖంగుతిన్నారట. 13వ తేదీన జరిగిన పోలింగ్ లో గుడివాడ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. దీంతో గతం కంటే పోలింగ్ శాతం పెరిగింది. పోలింగ్ శాతం పెరగడానికి మహిళా ఓటర్లలో చైతన్యం ఎక్కువగా కనిపించడమే ప్రధాన కారణం. మొత్తంగా.. గుడివాడ నియోజకవర్గం అంతటా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. నందివాడ మండలంలో రెండు కేంద్రాలు, గుడివాడ పట్టణంలోని రెండు కేంద్రాల్లో రాత్రి 10 గంటల వరకూ పోలింగ్ జరిగింది. నియోజకవర్గంలో ఎక్కడా చిన్న అవాంఛనీయ ఘటన కూడా లేకుండా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడంతో తొలిసారి రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. ఇదిలా ఉంటే పోలింగ్ సరళి..పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల క్యూ లైన్లను చూసి బోల్డంత ఊహించుకున్న టీడీపీ నేతల ఆశలపై వారే తయారుచేసుకున్న తాజా లెక్కలు నీళ్లు చల్లాయట. రికార్డ్ స్థాయిలో జరిగిన పోలింగ్ సైకిల్ పార్టీకి అనుకూలంగా లేదని వారిలో వారే చర్చించుకుంటున్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఉదయం నుంచే భారీగా తరలి రావడం తమకే కలిసి వచ్చిందని టీడీపీ నేతలు సంబరపడినప్పటికీ, పోలింగ్ అనంతరం వేసుకున్న లెక్కలు వారిని కలవరపెడుతున్నాయని టాక్. భారీగా పెరిగిన పోలింగ్ శాతం.. మహిళల ఓట్లన్నీ వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా కనిపిస్తున్నాయట. గడచిన మూడు దశాబ్ధాలుగా గుడివాడ నియోజకవర్గంలో జరగని చాలా అభివృద్ధి పనులు కేవలం ఈ ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని చేసి చూపించారు. పేదల సొంతింటి కల టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనీల రూపంలో ప్రజలకు అందజేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును వినియోగించుకున్న తరుణంలో మరోసారి గుడివాడ ఎమ్మెల్యేగా కొడాలి నాని గెలుపు ఖాయం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారట.తాజా అంచనాలు భయపెడుతున్నా చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు తమను కచ్చితంగా గట్టెక్కిస్తాయని చెప్పుకుంటున్నారట టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము. లోలోన టెన్షన్ పడుతూనే చంద్రబాబు సూపర్ సిక్స్ ను చూసే మహిళలు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. గెలుపు లాంఛనమే అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్న చర్చ ప్రస్తుతం గుడివాడలో జోరుగా సాగుతోంది.ఇదీ చదవండి: ట్రెండ్ తెలియాలంటే నిరీక్షించాల్సిందే -
May 25th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
6:10 PM, May 25th, 2024నాపై టీడీపీ నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా నేను తిరిగి ఒక్క మాట కూడా అనలేదు: చెవిరెడ్డి భాస్కర్రెడ్డిఎవరినో విమర్శలు చేయాలని, తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కాదుఒక అవాస్తవం ప్రచారం చేస్తుంటే...వాస్తవాలు మీ దృష్టికి తీసుకువస్తున్నాసామాజిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న వాడ్ని, న్యాయ శాస్త్రంలో పట్టా పుచుకున్నవాడ్నికర్మ సిద్ధాంతం నమ్ముకున్న వాడ్నిగత ఐదేళ్లు గా నాపై విమర్శలు చేస్తున్నా, ఏ రోజు చిన్న విమర్శ చేయలేదునారా లోకేష్ పాదయాత్ర చేస్తే ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చేసులేదునారా భువనేశ్వరి పర్యటన చాలా ప్రశాంతం గా చంద్రగిరి లో జరిగిందిగత ఐదేళ్లు గా నాని కుటుంబం పై చిన్న కేసు నమోదు చేయలేదునా బావమరిదిని పులివర్తి నాని చేయి చేసుకున్నాడునామినేషన్ రోజు నా కారుపై దాడి చేశారుపులివర్తి నాని క్వారీలు పై దాడి చేయలేదు, వారి ఆస్తులు జోలికి వెళ్ళలేదు2014 -19 లో టీడిపి వాళ్లు నేను తప్పు చేసే నన్ను ఊరుకునే వారాగత ఐదుదేళ్ళుగా ఒక్క కేసు పెట్టలేదుపులివర్తి నాని , అతని భార్య అసభ్య పదజాలంతో నన్ను రోజు తిడుతూ ఉన్నారుశ్రీపద్మావతి మహిళా యూనివర్శిటి వద్ద నానికు ఎలాంటి గాయాలు లేవుగన్మెన్ ఈశ్వర్ రెడ్డిని కొట్టారు.నా కారుపై నామినేషన్ దాఖలు సమయంలో దాడి చేశారుపోలింగ్ రోజు మోహిత్ కారు దగ్ధం చేశారు , సర్పంచ్ ఇంటికి నిప్పు పెట్టారుసుధాకర్ అనే వ్యక్తి కాలికి బుల్లెట్ దిగింది, చెన్నై అపోలో చికిత్స పొందుతూ ఉన్నాడు,కాలికి తీవ్రగాయం అయ్యింది. మాపై విషప్రచారం చేస్తున్నారు,దాడి జరిగిన తర్వాత నాని చాలా యాక్టీవ్ గా ఉన్నాడు.. రెండు గంటల తర్వాత వీల్ చైర్ లో కూర్చుని డ్రామాలు చేస్తున్నారుపులివర్తి నాని సతీమణి సుధారెడ్డి చిత్తూరు మహానటి ప్రదర్శన చేశారుస్విమ్స్ ఆసుపత్రిలో పేషెంట్‌ను చూసేందుకు వచ్చిన బంధువుపై దాడి చేశారునేను రాజకీయ ప్రత్యర్థులుగా చూశాను, వ్యక్తిగత శత్రువులుగా నేను చూడలేదునాయకుడు అనేవాడు ఆదర్శంగా ఉండాలి 4:30 PM, May 25th, 2024భారీ విజయంతో చరిత్ర తిరగరాయనున్న సీఎం జగన్జూన్ 4న 2019 కి మించిన భారీ విజయంతో చరిత్ర తిరగరాయనున్న జగనన్న🔥జూన్ 9న ఉదయం 9 గంటల 38 నిమిషాలకు ప్రమాణ స్వీకార మహోత్సవానికి సిద్ధంగా ఉండండి ✊🏻#YSRCPWinningBig#YSJaganAgain pic.twitter.com/Dt7DADj4Ik— YSR Congress Party (@YSRCParty) May 25, 2024May 24th AP Elections 2024 News Political Update 3:00 PM, May 25th, 2024మనసున్న మారాజు సీఎం జగన్ప్రతినెలా ఒకటో తేదీన తెల్లవారుజామునే ఇంటి తలుపు తట్టి పెన్షన్ అందేలా చేసిన మనసున్న మారాజు సీఎం @ysjagan...ఆ సువర్ణ పాలన జూన్ 4 తర్వాత మరోసారి కొలువుదీరనుంది.#YSRCPWinningBig#YSJaganAgain#YSRPensionKanuka pic.twitter.com/LHcfOoqk3h— YSR Congress Party (@YSRCParty) May 25, 2024 2:00 PM, May 25th, 2024అడ్డంగా బుక్కైన పీకే..చంద్రబాబుకి వంతపాడి అడ్డంగా బుక్కైన పీకే!ఏపీలో సర్వే చేయించకపోయినా టీడీపీకి లబ్ధి చేకూర్చడానికి నోరుజారినట్లు ఒప్పుకున్న ప్రశాంత్ కిషోర్తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై అపర బ్రహ్మలా అంచనా వేసి నవ్వులపాలు..అయినా సిగ్గులేకుండా చంద్రబాబు కోసం ఏపీ ఫలితాలపై జోస్యం. చంద్రబాబుకి వంతపాడి అడ్డంగా బుక్కైన పీకే!ఏపీలో సర్వే చేయించకపోయినా.. @JaiTDPకి లబ్ధి చేకూర్చడానికి నోరుజారినట్లు ఒప్పుకున్న ప్రశాంత్ కిషోర్ తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై అపర బ్రహ్మలా అంచనా వేసి నవ్వులపాలు.. అయినా సిగ్గులేకుండా @ncbn కోసం ఏపీ ఫలితాలపై జోస్యం… pic.twitter.com/3EDeTU73n6— YSR Congress Party (@YSRCParty) May 25, 2024 1:30 PM, May 25th, 2024ఫ్యాన్ ప్రభంజనం ఖాయం..అనంతపురం:ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కామెంట్స్..ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయం164 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందిటీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పగటి కలలు కంటోంది 1:00 PM, May 25th, 2024వైఎస్సార్సీపీదే ఘన విజయం: ఎంపీ గోరంట్ల మాధవ్అనంతపురం:ఎంపీ గోరంట్ల మాధవ్ కామెంట్స్..22 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం ఖాయంఓటమి భయంతోనే టీడీపీ దౌర్జన్యాలు చేస్తోందిటీడీపీ రిగ్గింగ్ చేసిన చోట్ల రీపోలింగ్ జరపాలి 12:30 PM, May 25th, 2024కౌంటింగ్ భద్రతపై పోలీసుల ఫోకస్విజయవాడకౌంటింగ్ భద్రతపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టిఏపీవ్యాప్తంగా 24 జిల్లాలకి 56 మంది డీఎస్పీలు, అదనపు ఎస్పీలు, నాన్‌కేడర్ ఎస్పీలకు ప్రత్యేక బందోబస్తు బాధ్యతలుఆయా జిల్లాల ఎస్పీలకి రిపోర్ట్ చేయాలని డీజేపీ ఆదేశాలుసమస్యాత్మక నియోజకవర్గాల్లోని కౌంటింగ్ ప్రాంతాల్లో బాధ్యతలు అప్పగించాలని ఆదేశాలు 11:00 AM, May 25th, 2024వైఎస్సార్సీపీ నేతపై దాడి.తిరుపతిలో వైఎస్సార్సీపీ నేతలపై దాడి.వెంకట శివారెడ్డికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపువైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తున్న పచ్చ బ్యాచ్ 10:30 AM, May 25th, 2024పల్నాడుపై పోలీసుల ఫుల్ ఫోకస్..పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న పోలీసుల ఆపరేషన్. ఎన్నికల్లో పోలింగ్ తర్వాత హింస నేపథ్యంలో పోలీసులు అలర్ట్.కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలుఇప్పటికే గ్రామాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్ అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు.పలు గ్రామాల్లో మారణాయుధులపై కూడా పోలీసులు ఫోకస్కౌంటింగ్ కోసం అదనంగా మరికొన్ని పోలీసు బలగాలు ఏర్పాటు. 9:30 AM, May 25th, 2024టీడీపీలో కొత్త ట్విస్ట్!లోకేష్‌కు పార్టీ పగ్గాలు ఇవ్వాలంటూ బాబు బ్యాచ్ కొత్త డ్రామా.చినబాబు పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్న టీడీపీ నేతలుజూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా టీడీపీలో సీరియస్‌గా కొనసాగుతున్న చర్చ. జూన్ నాలుగు తర్వాత చంద్రబాబు, లోకేష్‌పై తిరుగుబాటు తప్పదంటున్న విశ్లేషకులు. పార్టీ లేదు ఏమీ లేదని మూడేళ్ల క్రితమే స్పష్టం చేసిన అచ్చెన్నాయుడు. జూన్ నాలుగుకి ముందే ఓటమిని ఒప్పేసుకున్న టీడీపీ. 8:10 AM, May 25th, 2024వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యచిత్తూరుఅన్నమయ్య జిల్లా మదనపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యమృతుడు పుంగనూరు శేషాద్రిమదనపల్లెలోని శ్రీవారి నగర్లో ఈ ఘటన జరిగింది.తెల్లవారుజామున నివాస గృహంలోకి చొరబడిన దుండగులు హత్య చేసి పరారుకేసు నమోదు చేసుకొని విచారిస్తున్న పోలీసులు 7:25 AM, May 25th, 2024బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లైలో టీడీపీ అనుచరులుడ్రగ్స్ అయినా, స్కాములైనా సూత్రధారులు టీడీపీ నేతలు, కార్యకర్తలే. బెంగళూరు రేవ్ పార్టీలో పచ్చ బ్యాచ్‌కు లింక్. చిత్తూరు జిల్లాకు చెందిన మద్దిపట్ల ప్రణీత్ చౌదరి, కొండేటి సుకుమార్ నాయుడు కీలక వ్యక్తులురేవ్ పార్టీకి వీరే డ్రగ్స్ సప్లయర్స్. చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థులతో వీరికి సన్నిహిత సంబంధాలు. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ సప్లై సూత్రధారులు @naralokesh అనుచరులే!బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళలో మద్దిపట్ల ప్రణీత్ చౌదరి, కొండేటి సుకుమార్ నాయుడు వీరిద్దరూ బెంగళూరు @JaiTDP ఐటీ ఫోరంకి చెందిన కీలక వ్యక్తులుపూతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళీతో వీరికి… pic.twitter.com/wpjpZBv13Z— YSR Congress Party (@YSRCParty) May 24, 2024 డ్రగ్స్ అయినా, స్కాములైనా సూత్రధారులు మాత్రం తెలుగు డ్రగ్స్ పార్టీ (టీడీపీ) వాళ్ళే!బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళలో @naralokesh కి ముఖ్య అనుచరులు అయిన చిత్తూరు జిల్లాకు చెందిన మద్దిపట్ల ప్రణీత్ చౌదరి (ఐటీ ఎంప్లాయ్) కొండేటి సుకుమార్ నాయుడు (సీఈవో) Eavetop… pic.twitter.com/8zi7mwScAH— YSR Congress Party (@YSRCParty) May 24, 2024 7:00 AM, May 25th, 2024వెబ్ కాస్టింగ్ హైజాక్! చంద్రబాబు చేతిలో ఆన్, ఆఫ్ బటన్చంద్రబాబు చేతిలో ఆన్, ఆఫ్ బటన్లు కమాండ్ కంట్రోల్ సెంటర్లలో టీడీపీ కార్యకర్తలుప్రైవేట్ ఏజెన్సీ ముసుగులో దారుణ అక్రమాలు ఈసీ చేతిలో భద్రంగా ఉండాల్సిన సమాచారం చినబాబు చేతికి విదేశాల నుంచి వీడియోలు పోస్ట్ చేసిన లోకేష్.. దర్యాప్తు దశలో బయటకు వెళ్లి ఉండవచ్చంటూ ఈసీ బాధ్యతారాహిత్యం అధికార యంత్రాంగంపై ఇప్పుడు అజమాయిషీ ఈసీదే కదా?.. కారకులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈసీకి లేదా? ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడుస్తున్నా నిర్లిప్తత.. ఆకస్మికంగా అధికారుల బదిలీ.. టీడీపీ బ్యాచ్‌కు పోస్టింగులు చంద్రబాబు సేవలో తరిస్తున్న పల్నాడు పోలీసు అధికారులు ఎమ్మెల్యే పిన్నెల్లిపై తాజాగా మరో అక్రమ కేసు కౌంటింగ్ దాకా అలజడులు కొనసాగిస్తూ మళ్లీ విధ్వంసానికి పచ్చముఠాల యత్నాలు 6:50 AM, May 25th, 2024పీకేవన్నీ తప్పుడు అంచనాలేగతేడాది జరిగిన ఐదు ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ చెప్పినదానికి వ్యతిరేకంగా ఫలితంప్రఖ్యాత జర్నలిస్టు కరణ్‌థాపర్ ఇంటర్వ్యూలో అడ్డంగా దొరికిపోయిన పీకేఈ ఎన్నికల్లో బీజేపీకి 300 లోక్‌సభ స్థానాలపైనా నిలదీసిన కరణ్ ఏపీలో టీడీపీ గెలుస్తుందని బాబు ప్యాకేజీ తీసుకుని చిలక జోస్యం ఇక్కడా ఆయన అంచనాలు తప్పుతాయంటున్న విశ్లేషకులు 6:40 AM, May 25th, 2024ఆ పచ్చ ‘సీఐ’ పై చర్యలేవి?పోలింగ్‌కు రెండు రోజుల ముందు కారంపూడి సీఐగా నారాయణస్వామి ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసేందుకు పంపిన ఉన్నతాధికారి స్వామి అండతో కారంపూడి పరిధిలో చెలరేగిన టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, వారి ఇళ్లపై దాడి చేస్తున్నా పట్టించుకోని సీఐ అయినా చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు 6:30 AM, May 25th, 2024మాచర్లను రావణకాష్టంలా మార్చేందుకు టీడీపీ కుట్రఅందుకు ఈసీలోని కొంతమంది సహకారం చంద్రబాబు, పవన్‌లకు మరో 10 రోజులే కలలుగనే అవకాశం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ సీఎం జగన్‌కు బాసట వైఎస్సార్సీపీ కార్మిక విభాగం అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి -
మాచర్లను రావణకాష్టంలా మార్చేందుకు టీడీపీ కుట్ర
సాక్షి, అమరావతి: పల్నాడు ప్రాంతంలో మాచర్లలో గొడవలకు తెరలేపి ఆ ప్రాంతాన్ని రావణకాష్టంలా మార్చేందుకు టీడీపీ కుట్రలు పన్ని విజయం సాధించిందని, దీనికి ఎన్నికల సంఘంలోని కొంత మంది సహకరిస్తూ ప్రజల్లో లేనిపోని అపోహలు, ఆందోళనలు కలిగేలా చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్మిక విభాగం(వైఎస్సార్టీయూసీ) అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి చెప్పారు. అందుకే ఎన్నికల కమిషన్‌లో దొంగలు పడ్డారని అనాల్సి వస్తోందని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.చంద్రబాబు, పవన్‌లకు మరో పది రోజులే కలలు కనే అవకాశం ఉందన్నారు. పెత్తందారులకు అధికారం వస్తే ప్రమాదమని గ్రహించే ఓటింగ్ శాతం పెరిగిందని, మహిళలు ఏకంగా 89 శాతం మంది పాల్గొనడం సీఎం జగన్ విజయానికి తొలి సంకేతమని చెప్పారు. వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని, ఎక్కడా చీలిక లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ సీఎం జగన్‌కి బాసటగా నిలిచాయని తెలిపారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై గతంలో చినకాకాని సమీపంలో టీడీపీ గూండాలు దాడిచేస్తే తృటిలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా, ఆయన వాహనాలు ధ్వంసమైన విషయాన్ని గుర్తు చేశారు.విజయవాడకు చెందిన బొండా ఉమా మాచర్ల వెళ్లి పిన్నెల్లి మీద కర్రలు, రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించిన విషయాన్నీ ప్రస్తావించారు. తాజాగా పిన్నెల్లికి సంబంధించిన వీడియో అంటూ ఆయనను టార్గెట్ చేస్తూ టీడీపీ నేత లోకేశ్ తన ఎక్స్‌లో పోస్టు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ వరుస ఘటనలు చూస్తే నూటికి నూరు శాతం దుర్బుద్ధితో, కుట్ర పూరితంగా పిన్నెల్లిని టీడీపీ టార్గెట్ చేస్తోందని చెప్పారు. ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయిగేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటించకుండా.. అదెలా బయటకొచ్చిందో విచారణ చేస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. లోకేశ్‌పై చర్యలేవి? సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే.. అమాయక ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని, అయితే వారి మీద ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశి్నంచారు. ఘటనకు సంబంధించి ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశామని చెబుతున్న ఈసీ.. ఈ వీడియోను సంపాదించుకుని ఎక్స్‌లో పోస్టు చేసిన లోకేశ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశి్నంచారు. -
బ్లడ్ శాంపిలా?.. ప్రమాణమా?
నెల్లూరు (దర్గామిట్ట): జూదం, మద్యంతో పాటు అన్ని అవ లక్షణాలు కలిగిన టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తనను అప్రతిష్ట పాల్జేసేందుకే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. ‘బెంగళూరు రేవ్ పార్టితో నాకు సంబంధముందని నిరూపిస్తావా? బ్లడ్ శాంపిల్ ఇస్తావా? లేక ప్రమాణం చేస్తావా?’ అంటూ ఆయన సోమిరెడ్డికి సవాల్ విసిరారు. శుక్రవారం మంత్రి కాకాణి విలేకరులతో మాట్లాడారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక కారుకు తన స్టిక్కర్ ఉందనే ప్రచారంతో సోమిరెడ్డి పసలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తమ ఆధ్వర్యంలోనే రేవ్ పార్టీ జరిగిందని, తన పాస్ పోర్ట్ దొరికిందని, గోపాల్ రెడ్డి తనకు సన్నిహితుడని చెత్త ఆరోపణలు చేశారని చెప్పారు.ఈ విషయంపై తాను సోమిరెడ్డికి మరోసారి సవాల్ విసురుతున్నానన్నారు. కారులో నా పాస్‌పోర్టు దొరికిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పాస్‌పోర్ట్ తన దగ్గరే ఉందని చెబుతూ... కాకాణి దాన్ని మీడియాకు చూపించారు. ఆ కారు తుమ్మల వెంకటేశ్వరరావు పేరుతో ఉందని, ఆ కారుకు తన స్టిక్కర్ ఉందని జరుగుతున్న ప్రచారంపై ఇప్పటికే తాను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానన్నారు. నెల్లూరు నగరంలోని వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారన్నారు. గోపాల్‌రెడ్డితో తనకు పరిచయమున్నట్టు ఏ ఆధారమున్నా సోమిరెడ్డి బయట పెట్టాలని డిమాండ్ చేశారు. గోపాల్‌రెడ్డికి – రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక పోలీసులే స్పష్టం చేశారని, సోమిరెడ్డి మాత్రం రేవ్ పార్టీని తనకు అంట కడుతున్నారన్నారు.క్లబ్‌కు వెళ్లడం, పేకాటాడటం, డ్రగ్స్ అలవాట్లు ఎవరికి ఉన్నాయో తేల్చుకుందామని ఆయన సవాల్ విసిరారు. సోమిరెడ్డి వ్యక్తిత్వంపై గతంలో స్థానిక పత్రికల్లో వార్తలు వచ్చాయని, వాటిని ఎప్పుడూ ఆయన ఖండించలేదన్నారు. పురాతన పంచలోహ విగ్రహాలను విదేశాలకు అమ్మేందుకు సోమిరెడ్డి ప్రయత్నం చేశారని ఆరోపించారు. సోమిరెడ్డిపై తాను చేస్తున్న ఆరోపణలన్నీ నిజమేనన్నారు. గతంలో కోర్టులో చోరీ ఉదంతంపై తనకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పారు. తన సచ్చిలతను నిరూపించుకునేందుకు ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని, మరి సోమిరెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిరూపించుకునేందుకు ఆయన సిద్ధమా? అని సవాల్ విసిరారు. -
పీకేవన్నీ తప్పుడు అంచనాలే
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిశోర్(పీకే) అంచనా తప్పుతోంది. దానిని కప్పిపుచ్చుకునేందుకు ‘ది వైర్’ వెబ్సైట్, చానల్ కోసం ప్రఖ్యాత జర్నలిస్టు కరణ్‌థాపర్ చేసిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి 2022 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని.. తెలంగాణ అసెంబ్లీకి 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని అప్పట్లో పీకే జోస్యం చెప్పారు. అయితే హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇదే అంశాన్ని కరణ్‌థాపర్ ఎత్తిచూపుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో 300కు పైగా లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని నిలదీశారు. దీనిపై పీకే స్పందిస్తూ తాను హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పలేదని బుకాయించారు. కానీ అప్పట్లో పీకే చెప్పిన జోస్యంపై జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన వార్తల క్లిప్పింగ్‌లను కరణ్‌థాపర్ చూపడంతో ఆయన తెల్లబోయారు. పత్రికల్లో వచ్చే వార్తలకు విశ్వసనీయత ఉండదంటూ తప్పించుకునేందుకు యత్నించగా... ఇదే అంశంపై అప్పట్లో పీకే స్వయంగా చేసిన ట్వీట్లను ఎత్తిచూపారు. దీంతో అడ్డంగా దొరికిపోయిన పీకే ఉక్రోషంతో ఊగిపోయారు. మీరు జర్నలిస్టే కాదంటూ కరణ్‌థాపర్‌పై విరుచుకుపడ్డారు. బిహార్‌లో రాజకీయాలు కలసి రాకే... పశ్చిమ బంగా ఎన్నికల తర్వాత ఇక ఎన్నికల వ్యూహకర్తగా పని చేయబోనంటూ ప్రతిజ్ఞ చేసిన పీకే ఐప్యాక్ నుంచి తప్పుకున్నారు. బిహార్‌లో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత బిహార్ సీఎం నితీష్‌కుమార్ పంచన చేరి జేడీ(యూ) కీలక నేతగా చలామణి అయ్యారు. కొన్నాళ్లకు ఆయనతో విభేదించి సొంత పార్టీ స్థాపించి బిహార్‌లో పాదయాత్ర చేశారు. దానివల్ల ఏమాత్రం ప్రయోజనం లేకపోవడంతో రాజకీయంగా ఇక మనుగడ సాగించలేమని తెలిసి డబ్బుల కోసం ఎవరు ప్యాకేజీ ఇస్తే వారికి అనుకూలంగా జోస్యం చెప్పడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పంచన చేరి ఆ పార్టీకి అనుకూలంగా జోస్యం చెబుతూ వస్తున్నారు. ఏపీలోనూ ఆయన అంచనాలు తారుమారే గతేడాది చివర్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం శాసనసభల ఎన్నికల్లోనూ పీకే జోస్యాలు చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన చెబితే కాంగ్రెస్ గెలిచింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ గెలుస్తుందని చెబితే ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికార పీఠం అధిష్టించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ పీకే జోస్యం తప్పడం ఖాయమని, గత ఎన్నికల్లో టీడీపీ తరఫున వకాల్తా పుచ్చుకున్న లగడపాటి మాదిరిగానే ప్రశాంత్ కిశోర్ కూడా ఫలితాలు వెలువడ్డాక మాయం కావడం తథ్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బాబు పలుకులే చెబుతూ..ప్రశాంత్‌కిశోర్ ప్రస్తుతం ఏ పార్టీకీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం లేదన్న మాటల్లో ఎంతమాత్రం నిజం లేదని పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ ఏప్రిల్ 12న ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–బీజేపీ కూటమికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారనీ, అందుకే ఏపీలో చంద్రబాబుకు, పశ్చిమ బంగాలో బీజేపీకి అనుకూలంగా జోస్యం చెబుతున్నారని ఆమె స్పష్టం చేశారు. దీనిని బట్టి చంద్రబాబు విసిరిన ప్యాకేజీ తీసుకుని టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పీకే పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందుకే ఆయన బాబే గెలుస్తారంటూ అవకాశం వచ్చినప్పుడల్లా చెబుతున్నట్టు తేటతెల్లమైంది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టుతో భయపడిన నారా లోకేశ్ ఢిల్లీలో తలదాచుకున్న సమయంలో పీకేను కలిశారు. తమకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయాలని వేడుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు బెయిల్‌పై విడుదలయ్యాక పీకేను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు, అక్కడి నుంచి విజయవాడకు సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్‌లో తీసుకొచ్చారు. ఉండవల్లిలో చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనూ తాను ఏ పార్టీకీ వ్యూహకర్తగా పని చేయడం లేదని పీకే చెప్పిన విషయం అబద్ధమని తరువాత అందరికీ తెలిసిందే. -
హింస పన్నాగంతోనే అధికారుల బదిలీ
సాక్షి ప్రతినిధి, విజయనగరం: హింసాత్మక ఘటనలకు పాల్పడాలనే పన్నాగంతోనే టీడీపీ నాయకులు అధికారులను బదిలీ చేయించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆయన శుక్రవారం శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామితో కలిసి విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీకి భారీగా ఓట్లు వేసే బడుగు, బలహీన వర్గాలున్న ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు ప్రేరేపించడం ద్వారా పోలింగ్‌ను అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు కుట్రపన్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలన్నీ ఎస్పీలు బదిలీ అయిన ప్రాంతాల్లోనే జరగడం నిజం కాదా? అని ప్రశి్నంచారు.తొమ్మిదిచోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగితే.. వాటి విషయం టీడీపీ నాయకులు మాట్లాడటంలేదని చెప్పారు. అవి ఓటమి భయంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లే పనులు తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. పేదలంటే చంద్రబాబుకు ఎప్పుడూ పడదన్నారు. పేదల సంక్షేమానికి ఆయన వ్యతిరేకి అని విమర్శించారు. ధనవంతులు, బలిసినవారే చంద్రబాబుకు కావాలన్నారు. అందుకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి సంక్షేమ పథకాలను అందనీయకుండా ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాశారని గుర్తుచేశారు. పింఛన్ల పంపిణీని అడ్డుకుని 32 మంది వృద్ధుల మరణానికి కారణమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.చేయూత, ఇన్పుట్ సబ్సిడీ, విద్యాదీవెన ఇవ్వొద్దని కూడా లేఖ రాశారని గుర్తుచేశారు. వ్యవసాయం శుద్ధదండగ అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు ఒక్కరేనన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరికీ చెప్పే విదేశాలకు వెళ్లారని తెలిపారు. మరి కూటమి నాయకులు ఎక్కడికెళ్లారో ఎందుకు తెలియజేయలేదని ప్రశి్నంచారు. తమ పాలన చూసి ఓటు వెయ్యమని చెప్పిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. రాష్ట్రంలో 175కి 175 స్థానాల్లోను విజయం తమదేనని పూర్తి విశ్వాసంతో చెబుతున్నట్లు ఆయన తెలిపారు. -
వంగా గీత బలం.. ప్యాకేజ్ స్టార్ బలహీనతలు ఇవే!
ఏపీలో పోలింగ్ ముగిసి పది రోజులు గడిచింది.. కాని ఇప్పటికీ అందరి చూపూ పిఠాపురం నియోజకవర్గం మీదే ఉంది. కారణం అక్కడ ప్యాకేజీ స్టార్‌గా పేరు తెచ్చుకున్న పవన్ కల్యాణ్ పోటీ చేయడమే. దత్త తండ్రి పచ్చ పార్టీని గెలిపించడానికి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఈసారి పిఠాపురంలో ఎలాగైనా గెలవాలని పడరాని పాట్లు పడ్డారు. ఇక్కడ పవన్ ప్రత్యర్థి వంగా గీత అత్యంత ఆదరణ కలిగిన ప్రజా నాయకురాలు. పిఠాపురంలో పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీత బలం ఏంటి? ప్యాకేజీ స్టార్ బలహీనతలు ఏంటి? పిఠాపురం ఓటర్లు ఎవరి పక్షాన నిలిచారు? కారణాలు ఏంటి?2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ .. ఈసారి కాపులు అత్యధికంగా ఉన్నారన్న కారణంతో పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. పవన్ పిఠాపురం నుండి పోటీ చేస్తానని ప్రకటించక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతా విశ్వనాధ్ ను పిఠాపురం ఇంఛార్జిగా ప్రకటించి..బరిలో నిలిపింది. గత ఎన్నికల్లో కంటే ఈసారి పిఠాపురంలో అదనంగా 6 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో పోలింగ్ సరళిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ .. జనసేన పార్టీలు అంచనాలు వేసుకుని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.వాస్తవంగా చూస్తే గతంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా, పిఠాపురం ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యురాలిగా, ప్రస్తుతం లోక్‌సభ ఎంపీగా ఉన్న వంగా గీత ఉన్నత విద్యావంతురాలు. న్యాయశాస్త్ర పట్టభద్రురాలు. ప్రజాసేవలో దశాబ్దాల అనుభవం గడించి, ప్రజల ఆదరణ చూరగొన్న వంగా గీతతో టెన్త్ క్లాస్ చదివిన పవన్‌కల్యాణ్‌కు ఏమాత్రం పోలిక లేదు. అసలు పవన్‌కల్యాణ్ పార్ట్‌టైమ్ పొలిటీషియన్ అనే విషయం అందిరికీ తెలుసు. పైగా రాష్ట్రంలో ఏ జిల్లా గురించీ అవగాహన లేదు. గతంలో రెండు జిల్లాల నుంచి పోటీ చేసి ఓడిపోయి..ఈసారి మరో జిల్లానుంచి పోటీ చేస్తున్నారు.టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ త్యాగం చేస్తే పవన్ కు పిఠాపురం నుండి పోటీ చేసే అవకాశం కలిగింది. తన గెలుపు కోసం వర్మ మీద ఆధారపడిన పవన్..ఒక దశలో ఆయన్ను నమ్మలేదు. చివరికి టివి, సినిమా నటులతో తన కోసం పిఠాపురంలో ప్రచారం చేయించుకున్నాడు పవన్. మెగా కుటుంబాన్ని సైతం తన తరపున ప్రచారానికి పిఠాపురం తెచ్చుకుని గెలుపు కోసం పడరాని పాట్ల పడ్డాడు.ఎలాగైనా గెలవాలని ఇన్ని పాట్లు పడినా..ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే పవన్ తమకు అందుబాటులో ఉండరని ప్రజలకు తెలిసొచ్చింది. ఎందుకంటే పవన్ ప్రచారం కోసం పిఠాపురం వచ్చిన కొత్తలో చిన్నపాటి జర్వానికి రాత్రుళ్లు ప్రత్యేక హెలికాప్టర్, విమానాల్లో హైదరాబాదు వెళ్లి వచ్చేవారు. దీంతో పవన్‌పై పిఠాపురం ప్రజల్లో నమ్మకం పోయింది. అందువల్ల అందరికి అందుబాటులో ఉండే వంగా గీతా పిఠాపురంకు ఎమ్మెల్యే ఐతే బెటర్ అని ప్రజలు నమ్మారు. ఇక పిఠాపురంలో కాపుల్లో మెజార్టీ పవన్ వైపు ఉన్నా...వంగా గీతను కూడా అభిమానించే కాపులు అధికంగానే ఉన్నారు. అంతేకాదు బీసీ, ఎస్సీ, మైనార్టీలు వంగా గీతకు ఏకపక్షంగా మద్దతు పలికారు.2009లో వంగా గీత పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచాక..అనేక అభివృద్ది పనులను చేసి ప్రజల విశ్వాసం పొందారు. కాకినాడ ఎంపీగా కూడా జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. గొల్లప్రోలు, పిఠాపురం వద్ద రైల్వే అండర్ పాస్‌లు నిర్మించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. యూ.కొత్తపల్లి మండలంలోని సెజ్ లో ప్రతిష్టత్మక ఐఐఎఫ్‌టీ విద్యా సంస్దను తీసుకువచ్చారు. కాకినాడలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించి కార్మికులకు అండగా నిలిచారు. మరోవైపు యూ.కొత్తపల్లి మండలంలో సీఎం జగన్ జగన్ చోరవతో రూ.400 కోట్లతో ఫిషింగ్ హర్బర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురికాకుండా జియో ట్యూబ్ నిర్మాణం కోసం వంగా గీత కేంద్రానికి ప్రతిపాదన పంపించారు.ఇలా చెప్పుకుంటే కాకినాడ జిల్లాకు ప్రత్యేకించి పిఠాపురంకు వంగా గీత చేసిన సేవలు చాలా ఉన్నాయి. అందుకే ఇక్కడి ప్రజలకు గీత అంటే నమ్మకం. ప్రజల్లో ఆదరణ ఉన్నందునే సీఎం జగన్ పిఠాపురం ప్రచార సభలో మాట్లాడుతూ.. వంగా గీతను డిప్యూటీ సీఎం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఇక్కడ ప్రజలు ఇది తమకో వరమని భావించారు. అందుకే అటు అభివృద్ది.. ఇటు సంక్షేమం కలిపి పిఠాపురంలో ఓటింగ్ శాతం భారీగా పెంచాయని అర్దమవుతోంది. మొత్తం మీద వంగా గీతకే విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
తాడిపత్రిలో సిట్.. అల్లర్లపై కొనసాగుతున్న దర్యాప్తు
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురం తాడిపత్రి అల్లర్ల ఘటనలపై సిట్ బృందం దర్యాప్తు చేపట్టింది. కేసుల వివరాలు, నిందితుల గుర్తింపు లాంటి అంశాలపై సిట్ ఆరా తీస్తోంది. మరోవైపు.. అరెస్టులు కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయిలో విచారణ చేసిన తర్వాతే నివేదికను సిద్ధం చేయాలని సిట్ భావిస్తోంది.పల్నాడు జిల్లాలో పోలింగ్ డే ఘటనల్లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని పోలీసులు గుర్తిస్తున్నారు. నిన్న(గురువారం) పల్నాడులో 60 మందికిపైగా అరెస్టులు జరిగాయి. 33 మంది పెట్రోల్ బాంబులతో దాడులకు తెగబడినట్లు నిర్ధారణ అయ్యింది. నిందితుల్ని నరసరావుపేట కోర్టులో హాజరుపరిచి.. నెల్లూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.పల్నాడుపై సిట్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. పల్నాడు జిల్లా పోలింగ్ నాటి హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు.. ఈవీఎం ధ్వంసం ఘటనపై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోనే విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతోంది.ఈవీఎం ధ్వంసం వెనుక కారణాలపై సిట్ ఆరా తీస్తోంది. పిన్నెల్లి వీడియోతో సంబంధం లేదని ఈసీ ప్రకటించగా, వీడియో బయటకు ఎలా వచ్చిందనేదానిపై సిట్ విచారణ చేపట్టనుంది. కుట్ర కోణాలు ఉన్నాయా? అనే అంశంపై సిట్ పరిశీలించనుంది. మాచర్ల, పల్నాడు ఈవీఎం ఘటనలపై సిట్ సమగ్ర నివేదిక సిద్ధం చేయనుంది. -
వామ్మో వీళ్లే.. పీఎస్! వీళ్లదే.. కోర్టు తీర్పు!!
ఆంధ్రప్రదేశ్‌లోని మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఒక ఘటనకు విశేష ప్రచారం వచ్చింది. అక్కడి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్‌లో ఈవీఎంను కిందపడేసినట్లు చెబుతున్న ఉదంతానికి సంబంధించిన వీడియో సహజంగానే వైరల్ అవుతుంది. అలాంటి వాటిని ఎవరూ సమర్థించరు. కానీ అదే సమయంలో అక్కడ జరిగిన ఇతర గొడవలు, టీడీపీవారి దౌర్జన్యాలను కప్పిపుచ్చుతూ ఈ వీడియో మాత్రమే లీక్ అయిన తీరు ఆశ్చర్యంగానే ఉంటుంది. మొత్తం వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పిన్నెల్లి తప్పు చేశారో, లేదో కానీ, దానితో పోల్చితే ఎన్నికల సంఘం చేసిన తప్పే పెద్దదిగా కనిపిస్తుంది.ఎన్నికల సంఘం వద్ద రహస్యంగా ఉండవలసిన వెబ్ కాస్ట్ వీడియో ఫుటేజీ బయటకు వచ్చిన వైనం, అది కూడా టీడీపీ నేత లోకేష్ కు దగ్గరకు చేరడం, దానిని ఆయన ఎడిట్ చేసి తమకు అనుకూలమైన మేర ఎన్నికల కమిషన్ కు పంపడం, వెంటనే కమిషన్ స్పందించడం.. ఇవన్ని చూస్తుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఏదో పెద్ద కుట్రే జరుగుతోందన్న అనుమానం వస్తుంది. లోకేష్ వద్దకు ఆ వీడియో ఎలా వెళ్లిందో తెలియదని సీఈఓ మీనా చెప్పడాన్ని బట్టే ఇందులో కుట్ర స్వభావం కనిపిస్తుంది. దీనిపై లోకేష్ ను విచారిస్తారా? లేదా? అనేది చూడాలి.మే పదమూడో తేదీన జరిగిన ఈ ఘటన వీడియో ఎనిమిది రోజుల తర్వాత ఎలా వెలుగులోకి వచ్చిందన్నది ఒక ప్రశ్న. అలా అనధికారికంగా ఎన్నికల సంఘం నుంచి వీడియోలు లీక్ కావచ్చా? అది నిజమైన వీడియోనా? కాదా? అనే దానిని దృవీకకరించుకోకుండా ఎన్నికల సంఘం చర్యకు ఉపక్రమించవచ్చా? వీడియో లీక్ పై విచారణ జరగదా? సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోరా? పరిస్థితి ఇలాగే ఉంటే ఎన్నికల సంఘం విశ్వసనీయతపై ప్రజలకు అనుమానాలు రావా? ఇప్పటికే ఏపీలో టీడీపీ, బీజేపీలు జత కట్టాక ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా లేదని, కూటమి నేతలు ఏది కోరితే అది చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. దానికి తగినట్లే ఇలా రహస్య సమాచారం కూడా బయటకు వెళ్లితే కౌంటింగ్ అయినా సజావుగా జరుగుతుందా? లేక కూటమికి ఉపయోగపడేలా ఈసీ నిర్ణయాలు తీసుకుంటుందా? అనే సందేహాలు వచ్చే అవకాశం ఉంది.ఈవీఎంలను కిందపడేసి పాడు చేసే యత్నాలకు సంబంధించి అనే ఈ వీడియోలను ఈసీ అధికారికంగా విడుదల చేసి ఉండవచ్చు. అప్పుడు ఎమ్మెల్యే అయినా, మరొకరు అయినా తప్పు చేస్తే చర్య తీసుకోవచ్చు. అలాకాకుండా సెలెక్టివ్ గా వీడియో లీక్ కావడంలో ఆంత్యర్యం ఏమిటి? దానిని ఎవరైనా ఈసీ వర్గాల నుంచి తస్కరించి బయటపెట్టారా? లేక అధికారులు ఎవరైనా లీక్ చేశారా? లేదా పిన్నెల్లి లాయర్ అనుమానించినట్లు అదేమైనా ఫేక్ వీడియోనా? అనేది తేలాలి.పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబందిత పాల్వాయి గ్రామం వద్ద టీడీపీ వారు రిగ్గింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు శ్రద్ద చూపలేదట. ఈసీకి ఫిర్యాదు చేసినా వారు సీరియస్‌గా చర్య తీసుకోలేదు. అక్కడ వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్‌ను కూడా తరిమేసి దొంగ ఓట్లను వేయించుకోవడం, బలహీనవర్గాలవారిని ఓటింగ్ కు రాకుండా భయపెట్టడం వంటి సంఘటనలు ఏమి చెబుతాయి! ఆ సమాచారం తెలిసిన పిన్నెల్లి అక్కడకు వెళ్లి ఆవేశపడి ఉండవచ్చు. కానీ దానివల్ల ఈవీఎం. ఏమీ పాడుకాలేదు. అక్కడ రీపోలింగ్ కూడా అధికారులు పెట్టలేదు. అలాంటటప్పుడు ఈవీఎం ద్వంసం అని ప్రచారం చేయడం అర్దరహితం. టీడీపీ వారు కూడా ఇలాగే మరో ఆరేడు, చోట్ల పల్నాడు ప్రాంతంలో ఈవీఎంలను పాడు చేయడానికి యత్నించారు. అక్కడ కూడా రీపోలింగ్ జరగలేదు.ఆ ఘటనలలో కొందరు టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేయగా, మరికొందరు పరారీలో ఉన్నారు. అయినా టీడీపీ వారు చేసిన తప్పులను మాత్రం కప్పిపుచ్చుతూ ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా వైఎస్సార్సీపీపై మాత్రం విపరీత ద్వేషపూరిత ప్రచారం చేస్తోంది. ఈసీ ఈవీఎంలను ద్వంసం చేయడానికి జరిగే ప్రయత్నాల వీడియోలన్నిటిని బహిరంగపరచి ఉండాల్సింది. అలాగే పాల్వాయి వద్ద వైఎస్సార్సీపీ ఏజెంట్ ను కొట్టి బయటకు లాగడం, తదితర దృశ్యాలను కూడా విడుదల చేయాల్సింది. అలా చేయకపోవడం వల్ల ఈసీ తీరుపై అనుమానాలు పెరుగుతున్నాయి.తాజాగా గుంటూరు ఐజీ త్రిపాఠి కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరుపై వచ్చిన కథనం సంచలనంగా ఉంది. ఇదంతా చూస్తే ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పటికీ, అధికారం మాత్రం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చెలాయిస్తున్నదన్న అభిప్రాయం వస్తుంది. 2019 ఎన్నికల సమయంలో బీజేపీకి దూరంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈసీ పై ఆరోపణలు చేస్తూ సిఈఓ ఆఫీస్ వద్ద ధర్నా కూడా చేశారు. తన మనిషిగా భావించి ఇంటెలెజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ఈసీ బదిలీ చేయడానికి వీలు లేదని నానా రచ్చ చేశారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ఫలానా అధికారి కావాలని కానీ, ఫలానా అధికారులను ఎందుకు బదిలీ చేశారని కానీ ఈసీని ప్రశ్నించలేదు.చంద్రబాబు మాదిరి గొడవలకు దిగకుండా హుందాగా వ్యవహరిస్తున్నారు. పార్టీపరంగా ఏదైనా అవసరం వస్తే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తున్నారు. ఈ రకంగా చంద్రబాబుకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఉన్న తేడాను గమనించవచ్చు. అంతేకాక జరుగుతున్న పరిణామాలు చూస్తే చంద్రబాబు నాయుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఎందుకు అంటకాగడానికి విశ్వయత్నం చేసింది అందరికి అర్ధం అయిపోతోంది. ఇక్కడ కొన్ని సంగతులు చెప్పుకోవాలి. ఓటుకు నోటు కేసు సమయంలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పట్లో అరెస్టు అయ్యారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు మనవాళ్లు భ్రీఫ్ డ్ మి అంటూ చేసిన వ్యాఖ్యల ఆడియో బయటకు వచ్చింది. అప్పుడు చంద్రబాబు వాదన ఏమిటంటే తన ఫోన్ టాపింగ్ ఎలా చేస్తారని ప్రశ్నించేవారు. పైగా అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఏపీలో ఎదురు కేసులు రిజిస్టర్ చేయించారు. ఆ కేసులో ముప్పైసార్లు చార్జీషీట్ లో చంద్రబాబు పేరు వచ్చినా, ఎఫ్ఐఆర్ లో తన పేరు లేకుండా మేనేజ్ చేసుకోగలిగారు. దానిని అంతటిని కుట్రగా ప్రచారం చేశారే కానీ, జరిగింది తప్పు అని చెప్పకుండా తప్పించుకునే యత్నం చేశారు.అదే కాదు. కొద్ది నెలల క్రితం పుంగనూరు, అంగళ్లు వద్ద జరిగిన గొడవలలో చంద్రబాబు స్వయంగా తన కార్యకర్తలను రెచ్చగొడుతూ తన్నండి.. కొట్టండి.. అంటూ దూషణలకు దిగారు. దానిపై కేసు అయితే, అదంతా పోలీసుల తప్పు గా ఈనాడు, జ్యోతి ప్రచారం చేశాయి. పుంగనూరులో అయితే చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని దగ్దం చేయడం, రాళ్లు విసరడం చేస్తే ఒక పోలీస్ కానీస్టేబుల్ కు కన్ను కూడా పోయింది. అయినా ఈనాడు మీడియా పోలీసులదే తప్పన్నట్లు, టీడీపీ నేతలను అరెస్టు చేయడం అక్రమం అనేట్లుగా దారుణ ప్రచారం చేసింది.ఏపీలో ఎల్లో మీడియా ఎంత నీచంగా వ్యవహరిస్తున్నదనడానికి ఇవన్ని ఉదాహరణలే. అలాగే ఇతర చోట్ల ఈవీఎం లను కింద పడేస్తే టీడీపీ వారిపై పెట్టిన కేసులకు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేపై పెట్టిన కేసుల సెక్షన్లకు చాలా తేడా ఉందట. ఎమ్మెల్యేపై అతి కఠినమైన సెక్షన్లు పెట్టడం కూడా కుట్రగానే చూస్తున్నారు. హైకోర్టు ఈ కేసులో తాత్కాలిక స్టే ఇచ్చింది. అది వేరే విషయం. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, నేతలు కానీ కొందరు ఇలాంటి నేరాలకు పాల్పడకపోలేదు. ఉదాహరణకు గతంలో ఒక టీడీపీ ఎమ్మెల్యే బాంబుల శివారెడ్డిగా పేరొందారు. వేరేప్రాంతానికి చెందిన ఆయన హైదరాబాద్ స్థానిక ఎన్నికలలో బూత్‌ల వద్ద బాంబులు విసిరారు. మరో టీడీపీ ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రాలలోకి వెళ్లి బాక్స్‌లలో నీళ్లు పోశారు. ఈవీఎం లకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్న రోజుల్లో ఆయన మద్దతుదారుడు ఒకరు ఏకంగా ఒక ఈవీఎం నే అపహరించుకుని వచ్చారన్న కేసు నమోదు అయింది.గతంలో 1999 ఎన్నికల సమయంలో టీడీపీ ప్రముఖ నేత కోడెల శివప్రసాదరావు ఆస్పత్రిలో బాంబులు పేలి నలుగురు మరణిస్తే, ఆయనపై కేసు విచారణే జరగకుండా చంద్రబాబు అప్పటి కేంద్ర హోం మంత్రి అద్వాని ద్వారా మేనేజ్ చేయగలిగారు అప్పుడు ఆ కేసును బీజేపీ సహకారంతో కప్పిపుచ్చగలిగారు. ఇప్పుడు బీజేపీ సహకారంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి చికాకు సృష్టిస్తున్నారు. తమకు కావల్సిన పోలీసు అదికారులను ఈసీ ద్వారా పోస్టు చేయించుకుని గందరగోళం చేస్తున్నారు. ఈసీ ఇంతగా దిగజారిపోవడం ఇటీవలికాలంలో ఇదే అని చెప్పాలి. ఇలాంటి ఘటనలు టీడీపీ హయాంలో అనేకం జరిగినా, బలహీనవర్గాలవారు ఓట్లు వేయకుండా పోలీసు అధికారులే ఇప్పుడు అడ్డుకున్నా అదంతా ప్రజాస్వామ్యమని ఈనాడు రామోజీరావు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మాత్రం ఘోర అపచారానికి పాల్పడినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. టీడీపీ వారు ఏమి చేసినా భుజాన వేసుకోవడం, అదే ఎదుటివారిది చిన్న తప్పు అయినా గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేయడం ఈ మీడియాకు అలవాటు అయింది.దీనికి తోడు ఈనాడు రామోజీరావు రాజ్యాంగానికి ఏదో జరిగిపోయిందంటూ దిక్కుమాలిన సంపాదకీయం రాసి మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. ఇలాంటి తప్పులు ఎవరు చేసినా మంచిదికాదని చెప్పవలసిన ఈ పెద్ద మనిషి టీడీపీ నేతల తప్పులను మాత్రం ఎంతదూరం అయినా వెళ్లి కాస్తున్నారు. మాచర్ల టీడీపీ అభ్యర్ధిపై పలు కేసులు ఉన్న విషయాన్ని కప్పిపుచ్చే యత్నం జరుగుతోంది. ఎన్నికల రోజున ఆయన ఆధ్వర్యంలో కొన్ని బూత్‌ల వద్ద జరిగిన అల్లర్లపై పలు వార్తలు వచ్చాయి. వాటి మీద ఏ చర్యలు తీసుకుంది తెలియదు. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిలో పోలీసులు జరిపిన విధ్వంసంపై ఎన్నికల సంఘం ఏ చర్య తీసుకుందీ కూడా తెలియరాలేదు. పల్నాడుతో సహా వివిధ ప్రాంతాలలో సిట్ ఏర్పడిందే ప్రధానంగా టీడీపీవారి అరాచకాలపైన అనే సంగతి మర్చిపోకూడదు. దారుణాలకు పాల్పడి బలహీనవర్గాలవారిని ఓట్లు వేయనీయకుండా టీడీపీకి చెందినవారు చేసిన ప్రయత్నాలకు ఈనాడు కొమ్ముకాస్తున్న తీరు పెత్తందారులకు ఎలా వత్తాసు పలుకుతోంది అర్దం చేసుకోవచ్చు.పిన్నెల్లి పరార్ అనే బ్యానర్ కథనాలు రాసే ఈ పెద్దలు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు పీఎస్ గా ఉన్న వ్యక్తి విచారణకు హాజరుకాకుండా అమెరికాకు పరారైతే మాత్రం సమర్థిస్తూ వార్తలు ఇస్తారు. చంద్రబాబుపై అవినీతి కేసు వస్తే నిర్లజ్జగా అది అక్రమ కేసు అని డబాయించడానికి రామోజీరావు బృందం చేసిన ప్రయత్నం చూశాక, వారు ఇంతేలే అని సరిపెట్టుకోవడం తప్ప ఏమి చేయగలం. ఆ రోజుల్లో చంద్రబాబును అరెస్టు చేస్తారా అని గగ్గోలు పెట్టిన ఈనాడు అర్జంట్ గా పిన్నెల్లిని తీసుకువెళ్లి జైలులో పెట్టాలని, ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని వీరే తీర్పు ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు దొంగ మెడికల్ సర్టిఫికెట్లతో బెయిల్ పొందేవరకు ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తప్పుడు వార్తలు రాసిన ఈనాడు రామోజీరావు నుంచి ఇంతకన్నా ప్రమాణాలతో కూడిన జర్నలిజాన్ని ఆశించడం తప్పే అనుకోవాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
‘సోమిరెడ్డి చీకటి కోణాలు చాలానే ఉన్నాయి’
నెల్లూరు, సాక్షి: బెంగళూరు రేవ్ పార్టీకి, ఆ కేసు నిందితులకు.. తనకు ఎలాంటి సంబంధాలు లేవని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపణలు చేయడంతో తాజాగా కాకాణి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో సోమిరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారాయన. సోమిరెడ్డిది నీచమైన చరిత్ర. అలాంటి చరిత్ర నాకైతే లేదు. రిసార్ట్ ఓనర్ గోపాల్‌రెడ్డితో నాకు సంబంధాలు ఉన్నాయని సోమిరెడ్డి అంటున్నారు. దానికి ఒక్క ఆధారమైనా చూపించగలరా?. రాజకీయంగా ఎదుర్కొనేలేకే ఈ చౌకబారు ఆరోపణలు. సోమిరెడ్డి చీకటి కోణాలు చాలానే ఉన్నాయి. పురాతన పంచలోహ విగ్రహాలను అమ్మేందుకు సోమిరెడ్డి విదేశాలకు వెళ్లారు. నేను చేస్తున్నవి ఆరోపణలు కావు.. పచ్చి నిజాలు. సోమిరెడ్డి వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో.. శాంపిల్స్ ఇవ్వడానికి నేను రెడీ. సోమిరెడ్డికి దమ్ముంటే నా ఛాలెంజ్‌ను స్వీకరిస్తారా?. నా పాస్ పోర్ట్ నా దగ్గరేదే ఉంది. ఇదివరకే మీడియా సమావేశం పెట్టి ఈ విషయాన్ని చెప్పా. అయినా ఆయన పదే పదే అదే ఆరోపణ చేస్తున్నారు. రేవ్ పార్టీతోగానీ, ఆ కేసు నిందితులకి నాకు ఎలాంటి సంబంధాలు లేవు. నా కారు స్టిక్కర్ వాడకంపై ఇదివరకే పోలీసులకు ఫిర్యాదు చేశాం అని కాకాణి మరోసారి స్పష్టత ఇచ్చారు. -
గాలి భానుప్రకాష్ అతి.. ఓట్ల లెక్కింపునకు ముందే..!
నగరి: నగరి నియోజకవర్గం పుత్తూరులో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓట్ల లెక్కింపు జరగముందే తానే ఎమ్మెల్యే అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేయించారు. కొందరు దీన్ని చూసి అంత తొందరేల భానూ.. అంటూ నవ్వుకున్నారు. ఇందంతా ఒక పథకం ప్రకా రం రెచ్చగొట్టడమేనని భావిస్తున్నారు. నేర చరిత కలిగిన వారిని జనంలోకి రప్పించడం.. గతంలో గంజాయి సరఫరా జరిగిందని ప్రచారం జరిగిన ప్రాంతంలో బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభించడం ఏంటని చర్చించుకుంటున్నారు. అది బ్యాడ్మింటన్ కోర్టు కాదు.. విధ్వంస కుట్రలకు కేంద్రంగా చేసుకున్నారని అనుమానిస్తున్నారు. ఇదంతా ఎన్నికల కమిషన్‌కు కనబడలేదా అని జనం ప్రశి్నస్తున్నారు.ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది టీడీపీ నేతల పరిస్థితి. ఓట్ల లెక్కింపు జరగలేదు. గెలుస్తారో లేదో కూడా తెలియదు. నగరిలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఎమ్మెల్యే అంటూ పుత్తూరు పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం హాస్యాస్పదంగా మారింది. ఇదేం విడ్డూరం అంటూ జనం నవ్వుకుంటున్నారు.బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభోత్సవంలో గాలి భానుప్రకాష్పుత్తూరు మున్సిపాలిటీ చింతలగుంటలో గతంలో బీఎస్ జిమ్ నిర్వహించేవారు. ఏడాది క్రితం ఈ జిమ్ నిర్వాహకుడు టీడీపీ నేత హరి విశాఖపట్నం అరకు వద్ద గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత ఆ జిమ్ నిరుపయోగంగా మారింది. ఈ జిమ్ నుంచే గంజాయి సరఫరా జరిగేదంటూ అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అనంతరం ప్రచారాల్లోను, పలు కార్యక్రమాల్లోను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్తో పాటు గంజాయి స్మగ్లర్, అతని అనుచరులు పాల్గొనడం అప్పట్లో వివాదాస్పదమైంది. వివాదాలకు చిరునామాగా ఉన్న వీరంతా తాజాగా మరో వివాదానికి తెరతీశారు. నిరుపయోగంగా ఉన్న జిమ్‌ను బ్యాడ్మింటన్ కోర్టుగా మార్చి ఎన్ని కల కోడ్ ఉండగానే టీడీపీ అభ్యరి్థతో ప్రారం¿ోత్సవం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో భానుప్రకాష్ ఎమ్మెల్యే, నగరి అంటూ ముద్రించి ప్రదర్శనగా ఉంచారు.కోడ్ వర్తించదా? ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్న టీడీపీ నాయకులకు ఎన్నికల నిబంధనలు వర్తించవా అంటూ నగరి నియోజకవర్గ ప్రజలు ప్రశి్నస్తున్నారు. బహిరంగంగా ఒక అభ్యర్థి ఎమ్మెల్యే అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ప్రారం¿ోవాలు చేస్తుంటే వారిపై చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.రెచ్చగొట్టి విధ్వంసాలకు పాల్పడేందుకేనా?ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే పుత్తూరు టీడీపీ నాయకుల దుశ్చర్యను చూసి వైఎస్సార్సీపీ నాయకులు, స్థానిక ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. రాజకీయ పారీ్టలను రెచ్చగొట్టి.. గొడవలు సృష్టించి విధ్వంసాలకు పాల్పడేందుకే పథకం వేశారని స్థానికులు భయపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించేందుకే నేరచరిత కలిగిన వారిని టీడీపీ నాయకులు జనంలోకి తీసుకొస్తున్నట్టు సమాచారం. -
May 24th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 24th AP Elections 2024 News Political Update01:42 PM, May 24th, 2024ఆరోగ్యశ్రీ ఆగలేదు.. అయినా అసత్య ప్రచారమే!ఏపీ వ్యాప్తంగా డా.వైఎస్సార్ ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగుతున్నాయిఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలుఅయినా కూడా నిలిచిపోయాయంటూ ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రెండు రోజుల క్రితం నెట్ వర్క్ ఆసుపత్రులకి 200 కోట్ల బకాయిలు విడుదల చేసింది.మిగిలిన బకాయిల విడుదలపై ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డి, వైద్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సీఈవో లక్ష్మీ షాసమీక్ష ఇప్పటికే.. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.3566 కోట్లు చెల్లించింది2024-25 ఆర్ధిక సంవత్సరంలో నెట్ వర్క్ ఆసుపత్రులకు తొలి రెండు నెలలలో రూ.366 కోట్ల చెల్లింపులుఇక ఏడాది కాలంగా రోజుకి సరాసరిన 5349 మందికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు జరిగాయి. మొన్న(మే 22, బుధవారం) 6718 మందికి..నిన్నన(మే 23, గురువారం) 7118 మందికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు అందాయి: ఆరోగ్యశ్రీ సీఈవో లక్ష్మీ షా ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలిగించవద్దన్న పిలుపుకి నెట్ వర్క్ ఆసుపత్రులు సహకరిస్తున్నాయిపొరుగు రాష్ట్రాలలోనూ ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయి.. ఆరోగ్యశ్రీ సేవలకు ఎక్కడా అంతరాయం లేదు11:45 AM, May 24th, 2024బెంగుళూరు రేవ్ పార్టీకి, నాకు ఎలాంటి సంబంధం లేదు: మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డినెల్లూరు:మాజీ మంత్రి సోమిరెడ్డి నా పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నాడుబ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానుమాజీ మంత్రి సోమిరెడ్డికి దమ్ము దైర్యం ఉంటే.. అయన కూడా బ్లడ్ శాంపిల్ ఇవ్వగలడా..?నా పాస్ పోర్ట్ నా వద్దే ఉంది.. హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయం చెప్పానుసోమిరెడ్డిలాగా నాది నీచమైన చరిత్ర కాదు.. తాగుడుబోతులు మాట్లాడే మాటలు ఎవ్వరూ పట్టించుకోరురేవ్ పార్టీలోని నిందితులకు, నాకు ఎలాంటి సంబంధాలు లేవునా కారు స్టిక్కర్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాంనిందితులు గోపాల్ రెడ్డితో తనకు పరిచయం ఉన్నట్టు ఒక్క ఆధారమైన సోమిరెడ్డి చూపగలడా..?రాజకీయంగా ఎదుర్కోలేకే సోమిరెడ్డి నాపై ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నాడుసోమిరెడ్డి చీకటి కోణాలు చాలానే ఉన్నాయిపురాతన పంచలోహ విగ్రహాలను అమ్మేందుకు సోమిరెడ్డి విదేశాలకు వెళ్లాడుసోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నేను చేస్తున్న ఆరోపణలన్ని పచ్చి నిజాలే..11:00 AM, May 24th, 2024టీడీపీ నేతల అరాచకం.. కొనసాగుతున్న అరెస్ట్లుపల్నాడు జిల్లాలో పోలింగ్ రోజున టీడీపీ నేతల విధ్వంసం కేసులో కొనసాగుతున్న అరెస్టులురోజు భారీ స్థాయిలో కొనసాగుతున్న అరెస్టులు146 కేసుల్లో 1500 మందిని పైగా నిందితుల్ని గుర్తించిన పోలీసులుఇప్పటికే వెయ్యి మందికి పైగా నిందితుల అరెస్ట్ చేసిన పోలీసులుఇప్పటికే భారీ స్థాయిలో నిందితుల అరెస్టులుపరారీలో ఉన్న వారి కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేసిన ఎస్పీ మల్లికా గార్గ్కౌంటింగ్ నేపథ్యంలో 400 మంది అనుమానితులను బైండోవర్ చేసిన పోలీసులునరసరావుపేట సబ్ డివిజన్లో కొత్తగా ఐదుగురిపై రౌడీషీట్లు ఓపెన్ చేసిన పోలీసులు9:58 AM, May 24th, 2024చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్చంద్రబాబు పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు2019 ఎన్నికలలో వచ్చింది 23 స్థానాలేఈసారి మా వాళ్ళను నలుగురిను ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావుజూన్ 4న కౌంటింగ్ జరగబోతున్నదిఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నావో ఈపాటికి నీకు అర్థమై ఉంటుంది కదా చంద్రబాబూ?ఈ లెక్కన నువ్వు నాలుగు స్థానాలకే పరిమితం కాబోతున్నావని తెలిసి.. నీ మీద జాలేస్తోంది చంద్రబాబూ...!పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు. 2019 ఎన్నికలలో (మే 23న జరిగిన కౌంటింగ్‌లో) నీకు వచ్చింది 23 స్థానాలే.ఈసారి మా వాళ్ళను నలుగురిను ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావు. జూన్ 4న కౌంటింగ్ జరగబోతున్నది. ఈసారి…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 24, 2024 8:28 AM, May 24th, 2024ఆ అభ్యర్థులకు హైకోర్టు రక్షణజూన్ 6 వరకు పిన్నెల్లి, గోపిరెడ్డి, పెద్దారెడ్డి తదితరులను అరెస్టు చెయ్యొద్దని పోలీసులకు ఆదేశంకౌంటింగ్ ముగిసే వరకు తాడిపత్రిలో ఉండొద్దని అస్మిత్‌రెడ్డికి ఆదేశంనలుగురి కంటే ఎక్కువ మందితో తిరగరాదుఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదుసాక్షులను ప్రభావితం చేయరాదు.. దర్యాప్తులో జోక్యం చేసుకోరాదుహైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు స్పష్టీకరణవీరిపై నిఘా పెట్టాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం8:23 AM, May 24th, 2024టీడీపీ రిగ్గింగ్‌లపై ఈసీకి మరోసారి వైఎస్సార్సీపీ ఫిర్యాదుపోలింగ్ రోజు 16 నియోజకవర్గాలలో టీడీపీ రిగ్గింగ్‌కి పాల్పడినట్లు ఆధారాలతో సహా ఫిర్యాదు60కి పైగా పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీని కోరిన వైఎస్సార్సీపీపోలింగ్ రోజు పలుచోట్ల యథేచ్ఛగా టీడీపీ రిగ్గింగ్పచ్చమూక రిగ్గింగ్ చేసుకోవడానికి సహకరించిన కొందరు పోలీస్ అధికారులురిగ్గింగ్ జరిగిన ప్రాంతాలలో వెబ్ కాస్టింగ్ పరిశీలించాలంటున్న వైఎస్సార్‌సీపీఆయా పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ పర్సంటేజ్ని గమనించినా రిగ్గింగ్ జరిగిందో లేదో అర్ధమవుతోందంటున్న వైఎస్సార్‌సీపీచేసిన రిగ్గింగ్ బయటపడుతుందనే రీపోలింగ్ కోరని టీడీపీపల్నాడు జిల్లాలో టీడీపీ రిగ్గింగ్‌పై పోలింగ్ రోజే ఈసికి ఫిర్యాదు చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిరిగ్గింగ్‌కి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుపిన్నెల్లి ఫిర్యాదుపై ఇప్పటివరకు చర్యలు తీసుకోని ఈసీ8:05 AM, May 24th, 2024నగరి టీడీపీ అభ్యర్థి ఎన్నికల కోడ్ ఉల్లంఘనఫలితాలు రాకముందే గాలి భానుప్రకాష్‌ను నగరి ఎమ్మెల్యేగా పేర్కొంటూ ఫ్లెక్సీల ఏర్పాటు బీఎస్ స్పోర్ట్స్ క్లబ్‌ను ప్రారంభించిన భానుప్రకాష్‌ఎన్నికల అధికారికి మున్సిపల్ చైర్మన్ హరి ఫిర్యాదు 7:19 AM, May 24th, 2024టీడీపీ దాడులపై చర్యలెందుకు తీసుకోలేదు?: సజ్జల రామకృష్ణారెడ్డిఒక్క పాల్వాయి గేట్ వీడియోనే ఎలా లీక్ అయ్యింది?అది కూడా చిన్న క్లిప్పింగే ఎలా బయటకు వచ్చింది?7 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని ఎన్నికల కమిషనే చెబుతోందిఆ వీడియోలను ఎందుకు రిలీజ్ చేయట్లేదు?అమాయక ఓటర్లపై దాడులు చేసిన టీడీపీ గూండాలపై చర్యలకెందుకు వెనుకాడుతున్నారు?ఎన్నికల కమిషన్‌కు ప్రశ్నలు సంధించిన సజ్జల 7:10 AM, May 24th, 2024మహిళా పోలీస్‌కే రక్షణ లేదు..టీడీపీ నేతల దాడిపోలింగ్ రోజున మహిళా పోలీస్ అనూషపై టీడీపీ నేతల దాడిప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురంలో ఘటనఎస్పీని కలవకుండా మధ్యలోనే అడ్డుకున్న పోలీసులుచివరికి కలెక్టర్ ఆదేశాలతో టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసురాజీకి ఒప్పుకోలేదని కౌంటర్ కేసూ నమోదు చేశారని బాధితురాలి ఆవేదన7:07 AM, May 24th, 2024ఆ వీడియో లీక్ అయింది.. మేము విడుదల చేయలేదు: సీఈవోఅది మేము విడుదల చేయలేదుఈసీకి సంబంధం లేదుదర్యాప్తు సమయంలో బయటకు వెళ్లి ఉండవచ్చుదానిపైనా విచారణ చేస్తున్నాంఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లుమీడియాతో సీఈవో ముఖేష్ కుమార్ మీనా7:03 AM, May 24th, 2024టీడీపీ రీపోలింగ్ ఎందుకు కోరలేదు?మాచర్లలో విచ్చలవిడిగా రిగ్గింగ్ చేసిన టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిఅడ్డొచ్చిన వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లు, కార్యకర్తలపై దాడిరిగ్గింగ్ అడ్డుకోవడంతో తుమృకోటలో నాలుగు ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలుఅయినా వైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆరోపణలుపోలింగ్ సక్రమంగా జరగలేదంటూ గగ్గోలుఅయినా రీపోలింగ్ కోరని టీడీపీఅంటే తమకు అనుకూలంగా ఎన్నికలు జరిగినట్లేగా..మరోవైపు.. మాచర్లలోని పలు ప్రాంతాల్లో రీపోలింగ్ కోరిన ఎమ్మెల్యే పిన్నెల్లి రీపోలింగ్ జరగకుండా ఎన్నికల అధికారులపై టీడీపీ నేతల ఒత్తిడి6:56 AM, May 24th, 2024పచ్చమూక అరాచకం.. ఆనవాళ్లివిగో..పల్నాట గ్రామాలు వదిలి బయట తలదాచుకుంటున్న బడుగులుఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు.. ఆపై రిగ్గింగ్‌కు పాల్పడిన టీడీపీ నేతలుఓటింగ్ తరువాత కూడా బడుగు, బలహీన వర్గాలపై దాడులు కొనసాగింపువైఎస్సార్‌సీపీకి ఓటు వేశారని కారంపూడి మండలం పేటసన్నెగండ్లలో బేడ బుడగ జంగాలపై దాడి.. రెంటచింతల మండల పరిధిలోని గోలిలో ఎస్టీలపై దాడితొండేపి గ్రామాన్ని వదలి ప్రాణభయంతో బయట తలదాచుకుంటున్న మైనార్టీలుచిలకలూరిపేట మండలం కావూరులో ఎస్సీలకు తాగునీరు నిలిపివేతకొత్త గణేషునిపాడు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలను వెళ్లగొట్టిన టీడీపీ నేతలుచివరకు బాధితులపైనే కేసులు నమోదు పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యేలు కాసు, అనిల్ కుమార్‌పైనా దాడిపట్టించుకోని పోలీసు యంత్రాంగం 6:40 AM, May 24th, 2024కూటమి సేవలో 'ఘనాపాఠి'చంద్రబాబు విధ్వంస కుట్రలో ప్రధాన పాత్రధారి.. పల్నాడులో హింసాకాండకు ఐజీ త్రిపాఠి వత్తాసుకీలక అధికారుల ఆకస్మిక బదిలీల వెనుక సూత్రధారిపోలీసులను కట్టడి చేసి టీడీపీ గూండాగిరికి అండదండలుకౌంటింగ్ రోజు మరోసారి అలజడికి కొమ్ము కాస్తున్న వైనంపచ్చ ముఠాలను ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడమే నిదర్శనంటీడీపీ అధినేత ఒత్తిడితోనే త్రిపాఠికి పోస్టింగ్‌పల్నాడులో ప్రశాంతత కోసం ఆయన్ను తక్షణం బదిలీ చేయాలంటున్న పోలీస్ యంత్రాంగం -
అల్లర్లపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి
సాక్షి,అమరావతి/నరసరావుపేట: మాచర్లలో జరిగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని నరసరావుపేట వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్ధి అనిల్‌కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ అల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలు సత్యహరిశ్చంద్రులు అన్నట్లుగా వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. గురువారం ఆయన తన ప్రసంగంతో కూడిన వీడియోను విడుదల చేశారు. ఎన్నికల హింస, అల్లర్లపై ఈసీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. మాచర్ల నియోజకవర్గంలో అధికారులను మార్చిన తరువాతే దాడులు, హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయన్నారు.టీడీపీ అల్లర్లకు పాల్పడేందుకు అవకాశాలున్నాయని పిన్నెల్లి ముందు నుంచి ఈసీకి లేఖలు రాస్తూనే ఉన్నారని గుర్తుచేశారు. మాచర్లలోని పలు ప్రాంతాల్లో రిగ్గింగ్ జరుగుతోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదని ఆరోపించారు. టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న చోట ఎస్పీ సహకారం అందించారని, టీడీపీ పాల్పడ్డ రిగ్గింగ్ పై ఎస్పీ స్పందించకపోతే స్వయంగా పిన్నెల్లి వెళ్లి అడ్డుకున్నారని గుర్తుచేశారు. పాల్వాయి గేట్ వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొడుకు తల పగులకొట్టినా పోలీసులు స్పందించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రోజు తొమ్మిది ఈవీఎంలు ధ్వంసం అయితే పిన్నెల్లి వీడియో మాత్రమే ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు. పిన్నెల్లి వీడియో బయటకు ఎలా వచ్చిందనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒక సామాజికవర్గం అధికారులను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని, కానీ టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణ దేవరాయులు సుద్ధ పూసలాగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తుమృకోటలో రిగ్గింగ్ జరుగుతోందని తానే ఫోన్ చేసి ఎస్పీకి తెలియచేశానని, టీడీపీవాళ్లు దాడులు చేస్తున్నారని చెప్పినా స్పందించలేదన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడుతున్న ఒప్పిచర్ల, తుమృకోట, పాల్వాయి గేట్, చింతపల్లిలో మాత్రం నామమాత్రంగా పోలీసులను నియమించారని ఆరోపించారు. ఈ గ్రామాల్లో పోలింగ్ బూత్ ల వీడియో ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. -
టీడీపీ దాడులపై చర్యలెందుకు తీసుకోలేదు?
సాక్షి, అమరావతి: అమాయక ఓటర్లపై టీడీపీ గూండాలు చేసిన దాడులకు సాక్ష్యాలున్నా చర్యలెందుకు తీసుకోవట్లేదని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా గురువారం సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘానికి ప్రశ్నలు సంధించారు. అలాగే పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ గూండాల అరాచకాలకు సంబంధించిన వీడియోలను ఆయన సామాజిక మాధ్యమం (ఎక్స్)లో పోస్టు చేశారు. ‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా? వీడియో సరైనదేనా? కాదా? అనేది నిర్ధారించకుండానే ఈసీ చర్యలకు ఎలా దిగుతుంది? ఒకవేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వచి్చంది? మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజున ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి ఏడు ఘటనలు జరిగాయని ఎన్నికల కమిషనే చెబుతోంది.అలాంటప్పుడు కేవలం ఈ ఒక్క వీడియో మాత్రమే ఎలా లీక్ చేశారు? ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను.. 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన పూర్తి వీడియోలను ఎందుకు బయటపెట్టట్లేదు? ఒక చిన్న క్లిప్పింగ్ మాత్రమే బయటకు ఎలా వదిలారు?అన్ని వీడియోలు బయటకు వస్తే అసలేం జరిగిందో తెలుస్తుంది కదా! తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు?’ అని సజ్జల ప్రశి్నంచారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే అమాయక ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని సజ్జల చెప్పారు.వారి మీద ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు? దాని వెనుక ఉన్న వారిని ఎందుకు పట్టుకోవడం లేదు? అని నిలదీశారు. టీడీపీ మూకల రిగ్గింగ్‌లపై తాము ఫిర్యాదు చేసిన అన్నిచోట్లకు సంబంధించిన వీడియోలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల అనుమానాలన్నీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌కు కచి్చతంగా ఉందన్నారు. మాచర్లలో ప్రజాబలమున్న పిన్నెల్లి ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని.. ఐదోసారి కూడా గెలవబోతున్నారని చెప్పారు. ఏదో నలుగురు అధికారులను మేనేజ్ చేసి.. అవసరమైనంత వరకే వీడియోను కట్ చేసి.. దొంగ వీడియోలను లీక్ చేసి.. కేసులు పెట్టినంత మాత్రాన భయపడే వ్యక్తులం కాదన్నారు. -
చారిత్రక విజయానికి ఐదేళ్లు...
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ చారిత్రక విజయానికి ఐదేళ్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో 2014–19 మధ్య చంద్రబాబు అరాచక పాలనకు తెరదించుతూ 2019, మే 23న ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారు. 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించి గతంలో ఎన్నడూలేనంత ఘన విజయాన్ని అందించారు. 2019, మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఐదేళ్లూ సుపరిపాలన అందించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి రికార్డు సృష్టించారు.అర్హతే ప్రామాణికంగా వివక్ష చూపకుండా.. లంచాలకు తావు లేకుండా.. అత్యంత పారదర్శకంగా సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలోనే రూ.2.70 లక్షల కోట్లను పేదల ఖాతాల్లోకి జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చారు. వాటిని సద్వినియోగం చేసుకున్న పేదలు సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు.మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే.. ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఆశీర్వదించాలని సీఎం జగన్ వినమ్రంగా చేసిన విజ్ఞప్తికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు భారీఎత్తున స్పందించారు. ఈనెల 13న జరిగిన పోలింగ్ సరళిని బట్టి చూస్తే.. వైఎస్సార్సీపీ మరోసారి అఖండ విజయం సాధించడం ఖాయమని.. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి చిత్తుగా ఓడిపోవడం తథ్యమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.సరిగ్గా 5 యేళ్ళ కిందట ఇదే రోజున ఏపీని ఊపేసిన ఫ్యాను గాలి.151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో చరిత్ర తిరగరాసిన వైయస్ఆర్ సీపీజూన్ 4న అంతకుమించి సాధించే ఫలితాలతో మరోసారి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేయనున్న జగనన్న.#5YearsOfYSRCPMassVictory pic.twitter.com/XmdiIPvMEa— YSR Congress Party (@YSRCParty) May 23, 2024 -
టీడీపీ రీపోలింగ్ ఎందుకు కోరలేదు?
సాక్షి, నరసరావుపేట: ‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేశాడు.. ఓటర్లను బెదిరించాడు.. ఎన్నికలు సక్రమంగా జరగలేదు’.. అని రెండ్రోజులుగా గగ్గోలు పెడుతున్న టీడీపీ, పచ్చ మీడియా వర్గాలు ఎందుకు ఈవీఎంలు పగలగొట్టిన చోట్ల రీపోలింగ్ జరపమని ఎన్నికల సంఘాన్ని కోరలేదన్న ప్రశ్న అందరిలోనూ వేధిస్తోంది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు పోలింగ్ రోజు అధికార పార్టీ రిగ్గింగ్ చేసిందనో, అధికారులను ఉపయోగించి ఎన్నికలు పారదర్శకంగా జరపలేదన్న కారణాలను చూపి రీపోలింగ్ అడుగుతాయి.ఫ్యాక్షన్ కు దూరంగా ఉంటూ అభివృద్ధి బాటపట్టిన మాచర్లను కావాలనే టీడీపీ అనుకూల మీడియా చంబల్‌లోయ అంటూ గత కొన్నినెలలుగా విషప్రచారం చేస్తోంది. అదే నిజమైతే అక్కడ నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల్లో అరాచకం సృష్టించాడు.. రీపోలింగ్ జరపండి అని ఈసీని కోరాలిగానీ అటువంటి చర్యలేవి తెలుగుదేశం పార్టీ, మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి తీసుకోలేదు, అంటే.. ఎన్నికల వారికి అనుకూలంగా జరిగాయని వారు భావిస్తున్నట్లేగా? తాము చేసిన రిగ్గింగ్ వృథా కాకూడదనే మౌనంగా ఉన్నారా అన్న వాదన వినిపిస్తోంది.విచ్చలవిడిగా రిగ్గింగ్ చేసిన జూలకంటి..నిజానికి.. ఫ్యాక్షన్ నేతగా ముద్రపడిన మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి పోలింగ్ రోజు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్ నుంచి బయటకు లాగి కళ్లలో కారంకొట్టి దాడి చేయించాడు. రెంటచింతల మండలం పాల్వాయిగేట్, తుమృకోట, జెట్టిపాలెం, కారంపూడి మండలం ఒప్పిచర్ల, చింతలపూడి, వెల్దుర్తి వంటి పలు గ్రామాల్లో ఇదే జరిగింది. ఒప్పిచర్లలో పోలింగ్ ఏజెంట్‌గా ఉన్న ఎస్టీ సామాజికవర్గానికి చెందిన పాలకీర్తి శ్రీనివాసరావు, ఆయన సోదరుడు పాలకీర్తి నరేంద్రలపై వందల మంది దాడిచేసి బయటకు లాగి యథేచ్ఛగా రిగ్గింగ్ చేశారు.అలాగే, రెంటచింతల మండలం తుమృకోటలో ఏజెంట్లుగా ఉన్న షేక్ సైషావలీ, షేక్ జానీబాషాలను బయటకు లాగి విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. రిగ్గింగ్ అడ్డుకున్నందుకు తుమృకోటలో నాలుగు ఈవీఎంలను టీడీపీ నేతలు పగలగొట్టారు. జూలకంటి సొంత గ్రామమైన వెల్దుర్తిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకులాగి దాడిచేసి రిగ్గింగ్‌లకు తెగబడ్డాడు. 137, 138, 139, 140, 141 బూత్‌లలో కూర్చున్న వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లను టీడీపీ నేతలు బయటకులాగి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఇలా మాచర్ల నియోజకవర్గంలో ఎనిమిది గ్రామాల పరిధిలోని సుమారు 20 పోలింగ్ బూత్‌లలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. అంతేకాక.. మాచర్లలో బ్రహ్మారెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశాడు. ఇందుకు పోలీసుశాఖ పూర్తి సహాయ సహకారాలు అందించిందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.వీడియో బయటకు వచ్చాక గగ్గోలు..ఇక జూలకంటి బ్రహ్మారెడ్డి అనుకున్నట్లుగా రిగ్గింగ్ విచ్చలవిడిగా జరగడంతో టీడీపీ, పచ్చమీడియా పోలింగ్ రోజు, తరువాత వారం రోజులపాటు రిగ్గింగ్ అన్న పదం వాడలేదు. టీడీపీ రిగ్గింగ్ చేయడంతో అడ్డుకోవడానికి పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి పెద్దగా ప్రస్తావించలేదు. ఈవీఎంలు పగలగొట్టాడు అని వార్తలు సైతం పెద్దగా రాయలేదు. కారణం పాల్వాయిగేట్‌లో టీడీపీ చేసిన రిగ్గింగ్ బయటపడుతుందన్న ఒకేఒక్క కారణంతో. అయితే, నిజమో కాదో తెలియని ఓ ఈవీఎం పగలగొడుతున్న వీడియో బయటకు రాగానే ఒక్కసారిగా మాచర్లలో అరాచకం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు.అయినా సరే.. ఏ టీడీపీ నేత కూడా ఈవీఎంలు పగలినచోట్ల రీపోలింగ్ జరపమని మాటవరుసకైనా అనలేదు. కారణం అక్కడ రిగ్గింగ్ చేసింది, లాభపడింది తెలుగుదేశం పార్టీ కావడమే. ఈవీఎంలు పగలడానికి ముందు ఆయా పోలింగ్ కేంద్రాల్లో జరిగిన దౌర్జన్యాల సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టమని అడగడంలేదు. ఒకవేళ టీడీపీ రిగ్గింగ్ చేసి ఉండకపోతే పూర్తి సీసీ ఫుటేజ్ బయటపెట్టమని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తున్నా సరే వారెందుకు మౌనంగా ఉంటున్నారో మిలియన్ డాలర్ల ప్రశ్న. కారణం జూలకంటి బ్రహ్మారెడ్డి వర్గం చేసిన అరాచకాలు బయటపడితే వారి కుట్రలు ప్రజలకు తెలిసిపోతాయని.రీపోలింగ్ కోరిన పిన్నెల్లి..మరోవైపు.. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ చేసిన రిగ్గింగ్‌పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘానికి రెండుసార్లు లేఖ రాశారు. పోలింగ్ రోజు నియోజకవర్గంలోని 8 గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలలో టీడీపీ చేసిన దౌర్జన్యాలను వివరిస్తూ మే 13వ తేదీ మ.3.33 గంటలకు.. సా.6.10 గంటలకు ఈసీకి రెండు లేఖలు రాశారు. ఇందులో టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న గ్రామాల్లో తిరిగి రీపోలింగ్ నిర్వహించాలని అభ్యర్థించారు. ఆ గ్రామాలు కారంపూడి మండలంలో చింతపల్లి, ఒప్పిచర్ల, పేటసన్నెగుండ్ల, పెదకోడగుండ్ల, రెంటచింతల మండం తుమృకోట, పాల్వాయిగేట్, జెట్టిపాలెం, వెల్దుర్తి గ్రామాలున్నాయి. అయినా, ఈ లేఖలను ఎన్నికల సంఘం పట్టించుకున్న పాపాన పోలేదు.టీడీపీ నేతలు రీపోలింగ్ జరపకుండా ఎన్నికల సంఘాన్ని ఒత్తిడి తెచ్చి విజయం సాధించారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజంగా.. వైఎస్సార్సీపీ నేతలు రిగ్గింగ్ చేసి ఉంటే రీపోలింగ్ జరపమని పదేపదే లేఖలు రాసి ఎందుకు డిమాండ్ చేస్తారు? వెబ్‌కాస్టింగ్ వీడియోలు పూర్తిగా బయటపెట్టమని ఎందుకు అడుగుతారు? అంబటి రాంబాబు లాంటి నేతలు రీపోలింగ్ కోసం ఎందుకు హైకోర్టు మెట్లు ఎక్కుతారు? ఈ చిన్న లాజిక్‌వల్ల పల్నాడులో అరాచకాలు చేసింది తెలుగుదేశం పార్టీయేనని సృష్టమవుతోంది. -
ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడు: కాసు మహేష్‌రెడ్డి
సాక్షి, విజయవాడ: ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయని ధ్వజమెత్తారు. టీడీపీ అరాచకాలపై ఈసీకి వైఎస్సార్సీపీ నేతలు కాసు మహేష్ రెడ్డి, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.అనంతరం కాసు మహేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తూనే ఉన్నామన్నారు. ‘‘సుమారు 60, 70 బూత్‌ల్లో రిగ్గింగ్ చేశారు. వెబ్ కెమెరాల ఫుటేజ్ పరిశీలించి రీపోలింగ్ జరపాలని కోరాం. ఈసీ స్పందించకపోతే న్యాయ పోరాటం చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఇళ్లను సైతం టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. మహిళలు భయాందోళనలకు గురై గుడిలో తలదాచుకున్నారు. దాడులకు పాల్పడ్డ టీడీపీ నేతలపై చర్యలేవి?. మాచర్ల ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి’’ అని కాసు మహేష్‌రెడ్డి డిమాండ్ చేశారు.‘‘ఓటు వేసిన వారిని టీడీపీ వాళ్లు కొట్టి, చంపాలని చూస్తే పోలీసులు స్పందించలేదు. ఎన్నికలకు వారం రోజుల ముందు పోలీసులను మార్చారు. దాని వల్లనే హింస చెలరేగింది. ఈ హింసకి బీజేపీ, టీడీపీ, ఈసీ ఎవరు బాధ్యత వహిస్తారు?. ఎన్ని చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసినా ప్రజలు మాత్రం జగన్‌ని గెలిపించాలని నిర్ణయించారు. మాచర్లలో తుమ్రకోట, వెల్దుర్తి వంటి చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసింది. టీడీపీ రిగ్గింగ్ చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదు’’ అని కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ముందే ఈసీ దృష్టికి తీసుకుని వెళ్లామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ముందస్తు భద్రత కల్పించమని అడిగామని.. అయినా భద్రత చర్యలు తీసుకోలేదన్నారు. పురందేశ్వరి అధికారులను మార్చమని ఒత్తిడి తెచ్చారు. ఆమె చేసిన ఒత్తిడి నిర్ణయంతో హింస జరిగింది’’ అని మల్లాది విష్ణు మండిపడ్డారు. -
ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట
సాక్షి, విజయవాడ: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 6కి వాయిదా వేసింది.పిన్నెల్లితో సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో ఊరట లభించింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కేసులున్న అభ్యర్థులపై వచ్చే నెల 5వ తేదీ ఉదయం 10 గంటల వరకు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది.కాగా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. పిన్నెల్లి తరపున న్యాయవాది నిరంజన్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. సంఘటన ఈనెల 13న జరిగితే.. 15న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారని పేర్కొన్నారు. ముందు ఎఫ్ఐఆర్లో గుర్తు తెలియని వ్యక్తులు అని పేర్కొన్నారని.. తర్వాత లోకేష్ ట్విట్టర్లో వీడియోను చూసి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడంపై నిరంజన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.ట్విట్టర్లో వీడియో మార్ఫింగ్ చేసి ఉండొచ్చని.. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరిన నిరంజన్‌రెడ్డి.. సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ కేసులో మార్గదర్శక సూత్రాల ప్రకారం ఏడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లు ఉంటే 41A నోటీసులు ఇవ్వాలని ఉందని పేర్కొన్నారు. -
మళ్లీ అధికారం వైఎస్సార్సీపీదే.. అంచనాలు ఇవే
రెండు రోజుల క్రితం జంగారెడ్డి గూడెం నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశారు. ఆయన ఆసక్తికరమైన విషయం చెప్పారు. అక్కడ ఒక గ్రామానికి చెందిన నలుగురైదుగురు యువకులు ఐఏఎస్ పరీక్షల కోసం సిద్ధం అవుతున్నారట. ఏపీలో శాసనసభ ఎన్నికలపై ఆసక్తితో వారు తమంతట తాము సర్వే చేపట్టారట. వారికి ఆశ్చర్యపోయే విషయాలు తెలిశాయట. వారి పరిశీలన ప్రకారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఏభైఎనిమిది శాతం ఓటర్లు మద్దతు ఇస్తున్నారని తేలిందట. వారు ఆయా ప్రాంతాలలో ఈ స్టడీ చేశారట. వారు ప్రత్యేకంగా ఏ పార్టీపై అభిమానం ఉన్నవారు కాదు. ఇండిపెండెంట్ గా పరిశీలన చేశారు.⇒ ఇది విన్న నాకు కొద్ది రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రభంజనం వస్తుందని 151 సీట్లు మించి వస్తాయని అన్న విషయం గుర్తుకు వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వివిధ వర్గాలలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీలతో కూటమి కట్టిన తర్వాత వారి పరిస్థితి మెరుగైందని టీడీపీ అభిమానుల భావన కావచ్చు. కానీ ప్రజలు కూటమిని స్వీకరించారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అని చెప్పడం లేదు కానీ, దాదాపు అదే తరహాలో జరిగిన స్టడీలలో అత్యధిక భాగం వైఎస్సార్సీపీ విజయాన్ని అంచనా వేస్తున్నాయి. అందులో అంకెలు కొంచెం అటు, ఇటుగా ఉండవచ్చు కానీ, గెలుపుపై తేడా ఉండడం లేదు.⇒ ఈ నేపథ్యంలో కొన్ని ఫేక్ పోల్స్ సర్వేలు కూడా బయటకు వస్తున్నాయి. అలా చేసిన వాటిలో అత్యధికం తెలుగుదేశం పార్టీవే ఉండడం గమనించదగ్గ అంశం. ఉదాహరణకు హిందుస్తాన్ టైమ్స్ లో ఏదో సర్వే వచ్చిందని, అందులో టీడీపీ కూటమికి అనుకూల ఫలితాలు ఉన్నాయని ప్రచారం చేశారు. ఆ సంగతి తెలిసిన ఆ మీడియా తాము అలాంటి సర్వే ఏదీ ప్రచురించలేదని ఖండన ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాదు ఒక తెలుగు వార్తా చానల్ ఇచ్చిందంటూ ఇలాగే టీడీపీ గెలవబోతోందంటూ ప్రచారం చేస్తే, అది కూడా వాస్తవం కాదని వెల్లడైంది.వైఎస్సార్సీపీకి అనుకూలంగా వచ్చిన సర్వేలలో అత్యధిక భాగం కాస్త, కూస్తో అందరికి తెలిసిన సంస్థలవే కావడం విశేషం.⇒ ఇండియా టుడే సీనియర్ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయ్ ఆ మధ్య ఏపీలో పర్యటించారు. నాయకుల ఇంటర్వ్యూలతో పాటు జనంలో కూడా తిరిగారు. చివరిగా విశాఖ తీరంలో కూర్చుని ఆయన ఒక వ్యాఖ్య చేశారు. మహిళలు, పేదలు ఎటు ఎక్కువ ఓట్లు వేస్తే వారిదే గెలుపు అని వ్యాఖ్యానించడం ద్వారా ఒక స్పష్టమైన పరోక్ష సంకేతం ఇచ్చారు. మహిళలు అత్యధికంగా ఓట్లు వేయడం, వారిలో పలువురు వైఎస్సార్సీపీ పట్ల సానుకూల ధోరణితో ఉండడం వంటి అంశాల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైఎస్సార్సీపీ విజయాన్ని సూచిస్తున్నాయన్న భావన ఏర్పడింది.⇒ అలాగే మరో సీనియర్ పాత్రికేయుడు ఇండియా టుడే లో ఒక వ్యాసం రాస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు బాగా ప్రభావితం చేస్తున్నాయని, అవే ఎన్నికల ఫలితాలను నిర్దేశించనున్నాయని అభిప్రాయపడ్డారు. పివిఎన్ శర్మ అనే సీనియర్ జర్నలిస్టు డిల్లీ నుంచి ఒక పోస్టు పెడుతూ వలంటీర్ల వ్యవస్థ వైఎస్సార్సీపీకి బాగా ఉపకరించిందని పేర్కొన్నారు. టీడీపీ సృష్టించిన వివాదంతో రాజీనామా చేసిన వేలాది మంది వలంటీర్లు తమ పరిధులలోని వివిధ వర్గాల ప్రజలను ఉదయం, సాయంత్రం ఓటింగ్ నిమిత్తం సమీకరించారని తెలిపారు. సాయంత్రం వేళ పోలింగ్ పెరగడానికి వారే కారణమని ఆయనతో పాటు మరికొందరు విశ్లేషించారు.⇒ వివిధ ప్రాంతాల నుంచి కార్లలో వచ్చిన టీడీపీ మద్దతుదారుల హడావుడిని గమనించిన మీదట అప్పటి వరకు ఓటు వేయకుండా వేచి ఉన్న మహిళలు, పేదవర్గాల వారు సాయంత్రం పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓట్లు వేశారని, దానివల్లే ఓట్ల పోలింగ్ శాతం పెరిగిందని చెబుతున్నారు. ఒక సీనియర్ అధికారి అంచనా ప్రకారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దు పోయేవరకు జరిగిన పోలింగ్ శాతం పన్నెండు శాతం వరకు ఉండవచ్చట. ఇది కూడా నిర్ణయాత్మకంగా ఉండవచ్చని భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ, టీడీపీ కూటమి పోటాపోటీగా ఓటింగ్ శాతం పెంచడానికి యత్నించాయి. కాగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారికన్నా పేద, బలహీనవర్గాలు అధికంగా ఉండడం వైఎస్సార్సీపీకి ప్లస్ అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.⇒ కాగా కొన్నిచోట్ల పోలింగ్ అధికారులలో కొంతమంది వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఉన్నారని, వారు కావాలని పోలింగ్‌ను ఆలస్యం చేస్తున్నారని గమనించిన ఓటర్లు ఎంతో ఓపికతో రాత్రి పొద్దు పోయేవరకు నిలబడి మరీ ఓట్లు వేసి వెళ్లారని కొందరు చెప్పారు. ఉదాహరణకు తెనాలి నియోజకవర్గంలో గుదిబండివారి పాలెంలో అర్ధరాత్రి అయినా ఒక్కరు కూడ కదలకుండా ఓట్లు వేసి మరీ వెళ్లారని ఆ గ్రామానికి చెందిన వ్యక్తి తెలిపారు. ఇక బెట్టింగ్‌ల వారిది మరో కథ. వారు కావాలని పందాలకు పలువురిని ఆకర్షించడానికి రకరకాల వ్యూహాలు అమలు చేశారని సమాచారం వస్తోంది. ఉదాహరణకు కొద్ది నెలల క్రితం ఈ బెట్టింగ్ నిర్వాహకులు వైఎస్సార్సీపీకి ఏభైమూడు సీట్లు వస్తాయని అంచనా వేస్తే, అది నిజమేనని నమ్మి టీడీపీకి చెందినవారు పందాలు కాయడానికి ఉత్సాహపడ్డారట. ⇒ ఆ తర్వాత క్రమేపి ఆ సంఖ్యను మార్చుతూ వైఎస్సార్సీపీకి 86-88 సీట్లు వస్తాయని వారు పేర్కొన్నారట. అంటే ఏమిటి దీని అర్ధం. వైఎస్సార్సీపీకి అధికారం వస్తుందని చెప్పడమే కదా! కడప జిల్లాలోని ఒక నియోజకవర్గంకు చెందిన మిత్రుడు ఒకరు కొద్ది రోజుల క్రితం కలిశారు. ఆయన ఇంకో విషయం చెప్పారు. ఆ నియోజకవర్గంలో పోటీ చాలా తీవ్రంగా ఉందని ప్రచారం జరిగింది. అక్కడ పరిస్థితి ఏమిటని అడిగితే అతను జవాబిస్తూ చాలా చోట్ల ఇలాగే ప్రచారం జరుగుతోందని, ఇదంతా బెట్టింగ్ రాయళ్ల పని అని అన్నారు.⇒ తమ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఇరవైవేలకు పైగా మెజార్టీ వచ్చే అవకాశం ఉందని, కానీ టైట్ అని ప్రచారం చేస్తే రెండు పార్టీలకు చెందినవారు పందాలు కాస్తారన్న ఉద్దేశంతో ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని అన్నారు. అది నిజమేనని అనిపించింది. ఎందుకంటే ఏపీలో పలు నియోజకవర్గాలపై ఇలాంటి పందాలు సాగుతున్నాయి. కాగా కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా? లేదా అన్నదానిపై కూడా బెట్టింగులు జరుగుతున్నాయని చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక నియోజకవర్గంలో ఓటు వేసిన ఒకరు మాట్లాడుతూ కాపు సామాజికవర్గం ఏకపక్షంగా టీడీపీ కూటమికి ఓటు వేశారన్న ప్రచారం వాస్తవం కాదని అబిప్రాయపడ్డారు.⇒ జనసేనను టీడీపీ అధినేత చంద్రబాబు కాళ్ల వద్ద పవన్ కల్యాణ్ పడేశారని బాధ పడుతున్నవారు కూడా గణనీయంగా ఉన్నారని అన్నారు. టీడీపీ నేతలు గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రఘురామకృష్ణరాజులు టీడీపీ గెలుపు ఖాయమని చెబుతున్నా, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పెట్టి ఆ విషయాన్ని ఎందుకు ప్రకటించలేకపోయారని వైఎస్సార్‌సీపీవారు అడుగుతున్నారు. అంతేకాదు టీడీపీకి సలహాదారుగా పనిచేసిన రాబిన్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన సర్వే గురించి సోషల్ మీడియాలో వస్తున్న కధనాలను టీడీపీ ఎందుకు ఖండించలేకపోతోందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈయన బృందం టీడీపీ గెలుపుపై సందేహాలు వ్యక్తం చేసిందని ప్రచారం జరుగుతోంది. అది నిజమో, కాదో తెలియదు.⇒ ఇంతవరకు సుమారు ముప్పైకి పైగా పోస్ట్ పోల్ అంచనాలను ఇచ్చాయి. వాటిలో ఒకటి, రెండు తప్ప మిగిలినవన్నీ వైఎస్సార్సీపీనే గెలుస్తుందని చెబుతున్నాయి. అయినా పందాలు కాయవద్దని, అది చట్టరీత్యా నేరమని ఎవరైనా చెబితే తెలుగుదేశంకు చెందిన కొంతమంది బెట్టింగులు వద్దంటే టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లే కదా అని వితండ వాదన తెస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల జనం నష్టపోతారు. గతంలో 2009లో ఒక వర్గం, 2014 లో మరో వర్గం, 2019 లో ఇంకో వర్గం బోగస్ సర్వేలను నమ్మి పందాలు కాసి కోట్ల రూపాయల మేర కోల్పోయారు. వీటిని దృష్టిలో పెట్టుకుని పందాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది.⇒ ఏది ఏమైనా ప్రజాభిప్రాయం వైఎస్సార్సీపీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికు అనుకూలంగా ఉందన్నది ఎక్కువమంది నమ్మకం. బలహీనవర్గాలు, మహిళలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఓటు బ్యాంకు అయ్యారని వారు చెబుతున్నారు. ఎక్జిట్ పోల్‌ను పర్యవేక్షించిన ఒకరిని దీని గురించి ప్రశ్నిస్తే అలాంటి సమాధానమే ఇచ్చారు. కాగా తాము ఇచ్చిన సూపర్ సిక్స్ కు జనం కొంతైనా ఆకర్షితులు అయి ఉంటారని, అంతేకాక తాము లాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చేసిన అబద్దపు ప్రచారం కొద్దిగానైనా ప్రభావితం చేసి ఉండకపోతుందా అని టీడీపీ మద్దతుదారుడు ఒకరు పేర్కొన్నారు. ఈ మొత్తం ఎన్నిక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలా? వద్దా? అనే దానిపైనే జరిగిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి vs చంద్రబాబు కాదని ఆయనే అభిప్రాయపడడం విశేషం. దీనిని బట్టి ఈ ఎన్నికలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా జరిగాయని, ఆయన స్కీములు, ఇతర కార్యక్రమాల చుట్టూనే జరిగాయని తేలుతోంది. అందుకే వైఎస్సార్సీపీ వర్గాలు గెలుపుపై అంత ధీమాతో ఉన్నాయని అనుకోవచ్చు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఆ ఒక్క వీడియోనే లీకైందా?.. ఈసీకి సూటి ప్రశ్నలు సంధించిన సజ్జల
గుంటూరు, సాక్షి: మాచర్ల పాల్వాయి గేట్ ఈవీఎం ధ్వంసం ఉదంతంపై తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ వీడియో లీకేజీ వ్యవహారంలో ఎన్నికల సంఘం తీరుపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయంపై స్పందిస్తూ ఎన్నికల సంఘానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ‘‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా?. వీడియో సరైందేనా? కాదా? అనేది నిర్దారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది?. ఒక వేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వస్తుంది?.. A set of questions to the EC in light of how the Commission dealt with the recent Macherla issue - While Pinnelli deals with the charges legally, the @YSRCParty has certain questions which the @ECISVEEP must address.— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024 A set of questions to the EC in light of how the Commission dealt with the recent Macherla issue - While Pinnelli deals with the charges legally, the @YSRCParty has certain questions which the @ECISVEEP must address.— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024 .. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ నాడు ఈవీఎంలకు సంబంధించి ఏడు ఘటనలు జరిగాయని ఈసీనే చెబుతుంది కదా.! అలాంటప్పుడు కేవలం ఒక వీడియో మాత్రమే ఎలా లీక్ చేస్తుంది?. ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను ఎందుకు బయటపెట్టదు?. 3. More importantly, in the videos attached below, there is clear evidence of TDP goons attacking innocent voters. Why has no action been initiated in these instances? pic.twitter.com/iYVvwO5nXj— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగిందన్నది బయటకు వస్తుంది కానీ.. ఒక చిన్న క్లిప్పింగ్‌ను మాత్రమే బయటకు ఎలా వస్తుంది?తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు?. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే.. అమాయక ఓటర్లపై టీడీపీ గుండాలు దాడి చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. వారి మీద ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు? దాని వెనక ఉన్నవారిని ఎందుకు పట్టుకోవడం లేదు? అని సజ్జల ప్రశ్నించారు. వీటికి సమాధానాలేవీ?13న జరిగితే 21వ తేదీన వీడియో బయటకు ఎందుకు వచ్చింది?గుర్తు తెలియని వ్యక్తులని ఎలా ఫిర్యాదు చేయగలిగారు?స్వయంగా ఎమ్మెల్యే ఉంటే ఇంత గోప్యత ఎందుకు? ఇన్నాళ్లూ టీడీపీ వాళ్లు గుర్తించలేదా?పిన్నెల్లి అనుచరులు తమను బెదిరించారనే టీడీపీ వాదన నమ్మేలా ఉందా?ఈ నెల 20న ఫిర్యాదు నమోదు అయ్యిందని ఈసీ వివరణ, అంటే.. ఇంతకాలం సీఈవో ఆఫీస్ ఆ ఫుటేజీని చూడలేదా?అసలు ఇంతకాలం ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేశారు?మిగతా వీడియోల సంగతి ఏంటి? అందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారనేది ఈసీ ఎందుకు దాస్తోంది? -
మాచర్లలో మరో టెన్షన్.. సీఈవో కీలక ప్రకటన
ఎన్నికల పోలింగ్ హింసాత్మక ఘటనల నుంచి తేరుకోవడానికి.. ప్రశాంతత నెలకొనేందుకు పల్నాట నాలుగురోజుల సమయం పట్టింది. అలాంటి చోట మళ్లీ అల్లర్లకు తెలుగు దేశం పార్టీ కుట్రలు చేస్తోందా?. వద్దని పోలీసులు వారిస్తున్నా చలో మాచర్ల చేపట్టం వెనుక ఆంతర్యం ఏమిటి?. 👉మాచర్లకు టీడీపీ నేతలు.. మంచిది కాదు: సీఈవో ముకేష్ కుమార్ మీనాపిన్నెల్లి వీడియోపై సీ ఈవో సంచలన ప్రకటనఆ వీడియోను మేము విడుదల చేయలేదుఎన్నికల కమిషన్ నుండి బయటకు వెళ్లలేదుఅది ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటాందర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతినుండో బయటకు వెళ్లిందిపాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పీ ఓ, ఏపీ ఓలను సస్పెండ్ చేశాంమాచర్లకు టీడీపీ నేతలు వెళ్లడం మంచిది కాదుఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చిందిటీడీపీ నాయకులకు అనుమతి లేదని చెప్పాంవాళ్లు వెళితే వైఎస్సార్సీపీ నేతలు కూడా వెళతామంటారుమళ్లీ పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందిబయట నాయకులు ఎవ్వరూ మాచర్లకు వెళ్లకూడదుఎవ్వరినీ ఆ గ్రామాల్లోకి వెళ్లనీయొద్దని ఆదేశించాను 👉టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని పోలీసులకు చెప్పిన స్పందించలేదు: అనిల్ కుమార్ యాదవ్ఓటమి భయంతోనే టీడీపీ దాడులకు పాల్పడింది 8 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయితే ఒక్కటే ఎందుకు బయటకు వచ్చింది ఈవీఎంల ధ్వంసం దృశ్యాలను ఎవరు బయటపెట్టారు ఈసీ తీరు పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన కుమారుడి పై కూడా దాడులు చేశారు ఈవీఎంల ధ్వంసం దృశ్యాలను ఎవరు బయటపెట్టారు ఈసీ తీరు పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన కుమారుడి పై కూడా దాడులు చేశారు పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలు పగలగొట్టారు తుమ్మురుకోట, వబుచెర్లలో ఈవీఎంలు ధ్వంసం చేశారు చింతపల్లిలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు పాల్వాయిగేటు ప్రాంతంలో టీడీపీ నేతల విధ్వంసం చేశారు టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రాలేదు? ఎస్సీ, ఎస్టీలను కొడుతున్న వీడియోలు ఈసీకి కనపడలేదా? టీడీపీ రిగ్గింగ్ చేసిన చోట్ల రీపోలింగ్ పెట్టాలి ఈసీ తీరుపై న్యాయ పోరాటం చేస్తాం 👉టీడీపీ కీలక నేతల గృహనిర్బంధంమాచర్లలో టీడీపీ ‘చలో మాచర్ల’కు అనుమతి లేదని పోలీసుల స్పష్టీకరణఉద్రిక్తతలు తలెత్తకుండా సహకరించాలని జిల్లా ఎస్పీ మలికా గార్గ్ విజ్ఞప్తిమాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతల గృహ నిర్బంధం గొల్లపూడిలో దేవినేని ఉమ, విజయవాడలో వర్ల రామయ్య, గుంటూరులో నక్కా ఆనంద్, కనపర్తిలో శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసులుఅయినా మాచర్ల వెళ్లితీరతామంటూ టీడీపీ నేతల మొండిపట్టు.. ఉద్రిక్తత 👉మాచర్లలో భారీ పోలీసు బందోబస్తుపల్నాడు జిల్లాలో మరొక భారీ కుట్రకు ప్లాన్ చేసిన తెలుగుదేశం పార్టీ?పల్నాడు జిల్లాలో శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు చలో పల్నాడు.. మాచర్ల పేరుతో తెలుగుదేశం నేతలు మరొక డ్రామాఉమ్మడి గుంటూరు ,కృష్ణా జిల్లాల నేతలతో చలో మాచర్ల కార్యక్రమానికి పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీజిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది అని చెబుతున్న పోలీసులునిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్న పోలీసులుపోలీసుల హెచ్చరికలను పట్టించుకోని తెలుగుదేశం పార్టీచలో మాచర్ల పేరుతో పల్నాడులో మరోసారి విధ్వంసం సృష్టించడానికి తెలుగుదేశం రెడీ అవుతున్న తెలుగుదేశం నేతలు 👉 పల్నాడులో టీడీపీ చలో మాచర్ల పిలుపుతో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు👉 మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేత దేవినేని ఉమా గృహ దిగ్భంధం.. మరికొందరు నేతల్ని సైతం అడ్డుకున్న పోలీసులు👉 మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనలకు అనుమతి లేదు: పోలీసులు👉 మాచర్లలో ఎలాగైనా పర్యటన చేపడతాం: టీడీపీ నేతలు తెలుగు దేశం పార్టీ ఇవాళ చలో మాచర్లకు పిలుపు ఇచ్చింది. ఈ ఉదయం మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా నేతలు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు దేవినేని ఉమా, వర్ల రామయ్య, నక్క , ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, జీవీ ప్రకాష్ లాంటి కీలక నేతలు పాల్గొనేందుకు ప్రణాళిక రూపొందించారు. పోలింగ్ సందర్భంగా ఇక్కడ జరిగిన అల్లర్లపై ఈసీ సీరియస్ అయ్యింది. దీంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాచర్లలోఎలాంటి పర్యటనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు. అయినా కూడా టీడీపీ సానుభూతిపరులకు పరామర్శ పేరిట చలో మాచర్ల నిర్వహించి తీరతామని టీడీపీ అంటోంది. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండగా.. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొందక్కడ. -
పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
ఒకవైపు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయడం లేదంటూనే.. మరోవైపు రాజకీయ వ్యూహకర్త హోదాలో ఎన్నికల ఫలితాలపై జోస్యాలు చెబుతున్నారు ప్రశాంత్ కిషోర్. అయితే ఆయన పలుకులు ఫలానా పార్టీలకే అనుకూలంగా ఉంటుండడంతో సోషల్ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి. అంతెందుకు ఏపీ విషయంలోనూ ఆయన అలాంటి వ్యాఖ్యలే చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పీకేకు క్రెడిబిలిటీకి సంబంధించిన ప్రశ్న ఎదురుకాగా.. ఆ దెబ్బకు సహనం కోల్పోయారాయన.ఇంతకీ ఏం జరిగిందంటే.. సీనియర్ జర్నలిస్ట్ కరణ్‌థాపర్ ది వైర్ తరఫున ప్రశాంత్ కిషోర్‌ను ఇంటర్వ్యూ చేశారు. అయితే పీకే జోస్యాలపై కరణ్ థాపర్ ఓ ప్రశ్న సంధించారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని ప్రశాంత్ కిషోర్ చెప్పారని కరణ్ థాపర్ ప్రశ్నించారు. అయితే.. తానేమీ అలా జోస్యాలు చెప్పే వ్యాపారంలో లేనంటూ పీకే మాట్లాడారు. అందుకు.. హిమాచల్ విషయంలో పీకే వ్యాఖ్యలపై రికార్డులు ఉన్నాయని కరణ్ థాపర్ వివరించే యత్నం చేశారు. దీంతో.. ప్రశాంత్ కిషోర్ నీళ్లు నమలలేక అసహనం ప్రదర్శించారు. అలా తాను అన్నట్లు వీడియో రికార్డులు ఉంటే చూపించాలని, పత్రికలు-వెబ్సైట్లు ఇష్టానుసారం రాస్తాయని పీకే చిరాకుగా మాట్లాడారు. అయినా కరణ్ థాపర్ తన ప్రశ్నను వివరించే యత్నం చేస్తున్నప్పటికీ.. ప్రశాంత్ కిషోర్ వినలేదు. ‘మీరు తప్పు చేశారు’ అంటూ దాదాపు ఆగ్రహం ప్రదర్శించారు. దానికి కరణ్ థాపర్.. ‘‘హిమాచల్‌లోనే కాదు తెలంగాణలోనూ మీరు చెప్పిన జోస్యం(బీఆర్ఎస్ గెలుస్తుందని) ఫలించలేదు, మీరు(పీకే) అలా అన్నట్లు రికార్డులు ఉన్నాయి’’ అని స్పష్టంగా వివరించబోయారు. అయినప్పటికీ.. కరణ్ థాపర్‌ను మాట్లాడనీయకుండా తాను అలా అన్నట్లు వీడియో చూపించాలంటూ పీకే పట్టుబట్టారు. అంతేకాదు ఇంటర్వ్యూ పేరుతో తనను టార్గెట్ చేయొద్దంటూ పీకే అసహనం ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా కరణ్ థాపర్‌ను తనను తాను గొప్పగా ఊహించుకోవద్దంటూ పీకే అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆ సమయంలో కరణ్ థాపర్ తాను కేవలం ఎన్నికల ఫలితాల జోస్యాలు అంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్పగలరు అని మాత్రమే ప్రశ్నిస్తున్నానని అనగా.. మరో ప్రశ్నకు వెళ్లాలంటూ పీకే దాటవేయడం ఆ వీడియోలో చూడొచ్చు.Karan Thapar screwed Prashant Kishor to the extent that he lost his cool & showed his true colours.pic.twitter.com/inn8vuaFCx— ✎𝒜 πundhati🌵🍉🇵🇸 (@Polytikles) May 22, 2024
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- ఆరో విడత పోలింగ్.. బీజేపీ అభ్యర్థిపై రాళ్ల దాడి
- చత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
- బిస్కెట్ ప్యాకెట్ల బరువు తగ్గింది.. భారీ జరిమానా పడింది!
- సన్‌రైజర్స్ కాదు..ఐపీఎల్ టైటిల్ కేకేఆర్‌దే: ఆసీస్ లెజెండ్
- రూ.3 లక్షల అప్పుతో రూ.1300 కోట్లు సంపాదన.. అసిన్ భర్త సక్సెస్ స్టోరీ
- Mangalagiri: రెండోసారి ఓటమికి సిద్ధమైన లోకేష్!
- Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ
- డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ
- చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్: రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా
- TG: అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?
Advertisement