చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో మొదట ఎర్రచందనం స్మగ్లర్లే పోలీసులపై దాడి చేశారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు చెప్పారు.
హైదరాబాద్: చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో మొదట ఎర్రచందనం స్మగ్లర్లే పోలీసులపై దాడి చేశారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు చెప్పారు. ఆ తర్వాత ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరిపారని వెల్లడించారు.
శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు ఉన్నట్టు సమాచారం రావడంతో టాస్క్ఫోర్స్ బృందాలు కూంబింగ్ నిర్వహించాయని డీజీపీ తెలిపారు. స్మగ్లర్లు దాడులు చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారని డీజీపీ వివరించారు. ఎన్కౌంటర్పై కేసులు వేసినా కోర్టుల్లో ఎదుర్కొంటామని చెప్పారు. ఎర్రచందనం పరిరక్షణ కోసం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సరిహద్దుల్లో మరింత భద్రత పెంచుతామని డీజీపీ చెప్పారు.