chittoor
-
దళితుల కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పిన జిల్లా కలెక్టర్
-
శిఖరాన్ని వంచింది
ప్రకృతి పాఠశాల అంటే భరణికి చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి వచ్చేలా చేసింది. కొండలు, కోనలు భరణి నేస్తాలు. ఆ స్నేహమే ప్రపంచంలోని ప్రసిద్ధ పర్వతాలు అధిరోహించేలా చేస్తోంది. లద్ఖాఖ్‌లోని కాంగ్ యాప్సే నుంచి రష్యాలోని ఎల్ బ్రస్ పర్వతం వరకు ఎన్నో పర్వతాలను అధిరోహించిన చిత్తూరు జిల్లా డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌వో) భరణి గురించి...స్ఫూర్తినిచ్చే సాహసికుల గురించి వినడం, చదవడం భరణికి ఎంతో ఇష్టమైన పని. అలా విన్నప్పుడు, చదివినప్పుడు తాను కూడా ఆ పర్వతాలను అధిరోహించినట్లు కల కనేవారు. ఆ కల నిజమయ్యే సమయం రానే వచ్చింది. ఐపీఎస్ అధికారి అతుల్ కరవాల్ 50 ఏళ్ల వయసులో ఎవరెస్టు అధిరోహించడం భరణిని ప్రభావితం చేసింది. అతుల్ కరవాల్ ఎవరెస్ట్ అధిరోహించినట్లే తానూ ప్రపంచంలో మేటి శిఖరాలను అధిరోహించాలనుకున్నారు. 30 రోజులపాటు శిక్షణ తీసుకున్నారు భరణి.శిక్షణ తరువాత... ఎన్నో శిఖరాలురంపచోడవరంలో ఉప అటవీశాఖ అధికారిణిగా పనిచేస్తూనే డార్జిలింగ్‌లో కేంద్ర రక్షణ శాఖ నిర్వహిస్తోన్న హిమాలయన్ మౌంటెనరీ ఇన్ స్టిట్యూట్లో కోర్సు పూర్తి చేశారు. తొలి ప్రయత్నం గా లద్దాఖ్‌లోని కాంగ్ యాప్సే పర్వతాన్ని అధిరోహించారు.తొలి ప్రయత్నం... తొలి విజయం.తన మీద తనకు ఎంతో నమ్మకం వచ్చింది. మరింత ఉత్సాహం వచ్చింది. ఆ తరువాత...ఉత్తరాఖండ్‌లోని 4,200 మీటర్ల మల్లార్ లేక్ శిఖరాన్ని, రష్యాలో 5,642 మీటర్ల ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు.కిలిమంజారో పిలిచిందిఎన్నోసార్లు ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం గురించి ఆసక్తిగా విన్న భరణి ఆ పర్వతాన్ని అధిరోహించాలనుకున్నారు. కిలిమంజారో ఎత్తు 5,895 మీటర్లు. వీపుపై 28 కిలోల బరువును మోస్తూ ఏటవాలుగా ఉన్న కొండలను ఎక్కడమంటే పెద్ద సాహసమే. ఏమాత్రం పట్టు తప్పినా ప్రాణాలకే ప్రమాదం. అయినా సరే కంటిముందు లక్ష్యం మాత్రమే కనిపించిందని భరణి చెబుతారు. 26 గంటలపాటు సుదీర్ఘంగా కిలిమంజారో అధిరోహణ సాగిందని, పర్వత శిఖరాగ్రంపై పాదం మోపిన వెంటనే కష్టాలన్నీ క్షణంలో మరచిపోయానని అంటారు భరణి.ప్రకృతి పాఠశాలలో...తమిళనాడులోని కోయంబత్తూరు భరణి జన్మస్థలం. తండ్రి సాథూర్ స్వామి ఆర్మీ ఆఫీసర్. తల్లి పద్మ టీచర్. నాన్న ఉద్యోగరీత్యా రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆమె చదువు కొనసాగింది. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ పూర్తి చేసింది. తొమ్మిదో తరగతిలో కొడైకెనాల్‌కు విహారానికి వెళ్లినప్పుడు ఆ దట్టమైన అటవీప్రాంతం, సరస్సులు, కొండల నడుమ జాలువారే జలపాతాలు భరణి మనసును కట్టిపడేశాయి. పర్వత్రపాంతాలకు వెళ్లేటప్పుడు పర్వతారోహణకి సంబంధించి మెలకువలు నేర్చుకున్నారు. భవిష్యత్‌లో మరిన్ని శిఖరాలను అధిరోహించాలనేది భరణి కల. ఆమె కల నెరవేరాలని ఆశిద్దాం.ప్రతి సాహసం ఒక పాఠమేప్రతి ప్రయాణం, ప్రతి సాహసం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటున్నాను. ‘హాయిగా ఉద్యోగం చేసుకోకుండా ఎందుకు ఈ రిస్క్?’ అనే వాళ్లు కూడా ఉంటారు. అయితే రిస్క్ లేనిది ఎక్కడా! సాహసం చేస్తేనే దానిలో ఉన్న మజా ఏమిటో తెలుస్తుంది. ఒక సాహసం మరొక సాహసానికి స్ఫూర్తినిస్తుంది. పర్వతారోహణ అనేది మనలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే సాహసం. భవిష్యత్‌లో మరిన్ని ప్రసిద్ధ పర్వతాలను అధిరోహించాలనుకుంటున్నాను.– భరణి– నామా హరీశ్, సాక్షి. చిత్తూరు -
టీడీపీ అరాచకాలు.. వైఎస్ జగన్‌ను కలిసిన చిత్తూరు వైఎస్సార్సీపీ నేత
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చిత్తూరు ఐదో డివిజన్ వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ మురళీధర్‌రెడ్డి బుధవారం కలిశారు. చిత్తూరు జిల్లా కొంగరెడ్డిపల్లిలో తనపై దాడికి పాల్పడిన టీడీపీ నాయకుల సీసీ కెమెరా విజువల్స్‌ను వైఎస్ జగన్‌కు ఆయన చూపించారు.సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అనుచరులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని, ఎమ్మెల్యే అరాచకాలను వైఎస్ జగన్‌కు మురళీధర్‌రెడ్డి వివరించారు. మురళీ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పూర్తి అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అవసరమైన పూర్తి న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. మురళీధర్‌రెడ్డి వెంట చిత్తూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ విజయానందరెడ్డి ఉన్నారు. -
భర్త మొబైల్లో పక్కంటి మహిళ ఫోన్ నంబరు..
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇరు కుంటుంబాలు పక్కపక్కనే ఉంటాయి.. తెల్లారితే ఒకరి ముఖాలు.. ఒకరు చూసుకోవాలి. తీరా బంధువులు కూడా.. అయితే ఏమైందో..ఏమో కానీ..ఆ ఇరు కుటుంబీకు ల మధ్య కొన్ని నెలల కిందట వివాదం తలెత్తింది. దూరం పెరిగింది. మాటల్లేవ్.. ఈ తరుణంలో భర్త ఫోన్లో ఆ పక్కంటి మహిళా ఫోన్ నంబరు ఉందని భార్య గొడవకు దిగింది. దీంతో మనస్తాపానికి గురైన పక్కంటి మహిళా ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. పదెంకెల ఫోన్ నంబరు తెచ్చిన తంటాకు ఓ ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ ఘటన మంగళవారం చిత్తూరు మండలం ఏనుగుండ్లపల్లి గ్రా మంలో చోటుచేసుకుంది.గ్రామస్తులు, పోలీసులు వివరాల మేరకు...చిత్తూరు మండలం ఏనుగుండ్లపల్లి గ్రామానికి చెందిన రమేష్ భార్య ఉమ (30). ఈ దంపతులకు పెళ్లిలై ముగ్గురు పిల్లలున్నారు. వీళ్ల ఇంటి పక్కనే శివమణి, సుజాత అనే దంపతులు ఉన్నారు. ఈ ఇరుకుటుంబీకులు దగ్గర బంధువు లు. వీళ్ల మధ్య ఏర్పడిన చిన్న తగదాలు గొడవగా మారాయి. కొన్ని నెలలుగా ఈ ఇరు కుటుంబీకుల మధ్య మాటలు లేవు. అయితే సోమవారం శివమణి మొబైల్లో ఉమ ఫోన్ నంబరును సుజాత గమనించింది. ఆ నంబరు నీ ఫోన్లో ఎందుకు ఉందని సుజాత భర్తతో వాగ్వాదానికి దిగింది. ఇలా అక్రోశానికి గురైన సుజాత రోడెక్కింది. ఉమతో గొడవకు దిగింది. ఇద్దరు దుర్భాషలాడుకున్నారు. ఇలా మాట మాట పెరిగి జట్టు పట్టుకొని కొట్టుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనా ఉమ సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలో జాకెట్లోని అట్టముక్కలో తన చావుకు కారణం సుజాతనేని రాసి పెట్టింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. అనుమానం పెనుభూతమైంది. ఓ మహిళా ప్రాణాన్ని బలి తీసుకుంది. క్షణికావేశానికి గురై ఆ మహిళ పరువుకు తలొంచి ఆత్మహత్య చేసుకుంది. -
చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ నేత మురళీరెడ్డిపై దాడి
-
Chittoor: ఎమ్మెల్యే గురజాల అనుచరుల వీరంగం
చిత్తూరు, సాక్షి: కూటమి ప్రభుత్వ పాలనలో టీడీపీ, జనసేన శ్రేణులు రెచ్చిపోతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా కొంగరెడ్డిపల్లిలో వైఎస్సార్సీపీ నేత మురళీరెడ్డిపై దాడికి పాల్పడ్డారు. గత రాత్రి మరళి ఇంటిపైకి వెళ్లిన ముప్పై మంది టీడీపీ గుండాలు వీరంగం సృష్టించారు. మురళిపై దాడికి పాల్పడింది చిత్తూరు ఎమ్మెల్యే గురజాల అనుచరుడిగా సీసీ ఫుటేజీ ద్వారా బయటపడింది. గురజాలకు దగ్గరి మనిషి అయిన సాధు దిలీప్ నాయుడు, అతని అనుచరులు మురళిరెడ్డిపై దాడికి పాల్పడినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయ్యింది. తమ రాజకీయం మాత్రమే చెల్లాలంటూ వాళ్లు ఆయన్ని బెదిరించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న చిత్తూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త విజయానందరెడ్డి బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ‘‘చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ రౌడీ రాజకీయలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతపై హత్యాయత్నం చేయించారు. సీపీఫుటేజీ ఆధారంగా వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలి. లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’’ అని విజయానందరెడ్డి హెచ్చరించారు. -
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
-
చిత్తూరు ఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు
చిత్తూరు, సాక్షి: పట్టణంలో జరిగిన దొంగల కాల్పుల ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. అప్పుల పాలైన ఓ ప్రముఖ వ్యాపారి.. మరో ప్రముఖ వ్యాపారి ఇంట్లో చోరీ కోసం చేసిన ప్రయత్నమేనని పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. బుధవారం వేకువ జామున కాల్పుల కలకలంతో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గాంధీ రోడ్డులో ఉన్న ఓ భవనంలోకి ప్రవేశించిన దొంగల ముఠా.. ఆపై పోలీసులు రావడంతో తుపాకులతో హల్చల్ చేసింది. దీంతో ఆ ప్రాంతమంతా రెండు గంటలపాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు ఎట్టకేలకు దొంగలను పట్టుకోగలిగారు. అనంతరం నిందితుల నుంచి కీలక వివరాలు రాబట్టారు. ప్రముఖ ఎస్ఎల్వీ ఫర్నీచర్ యజమాని సుబ్రహ్మణ్యం వ్యాపారంలో నష్టాలతో బాగా అప్పులు చేశాడు. ఆర్థిక సమస్యల నుంచి తప్పించుకునేందుకు.. పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో కర్ణాటక, ఉత్తర రాష్ట్రాలకు చెందిన మొత్తం ఆరుగురు దొంగలతో డీల్ కుదుర్చుకున్నాడు. పథకం ప్రకారం.. ఈ ఉదయం డమ్మీ గన్స్, రబ్బరు బుల్లెట్లతో ఆ ముఠా గాంధీ రోడ్డులోని చంద్రశేఖర్ ఇంట్లోకి చొరబడ్డారు. గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. సుబ్రహ్మణ్యం డమ్మీ గన్‌తో చంద్రశేఖర్‌ను బెదిరించాడు. అయితే.. చంద్రశేఖర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి దొంగలను లోపలే లాక్ చేయగలిగాడు. ఈ క్రమంలో ఆయనకు గాయాలయ్యాయి.ఆపై బయటకు వచ్చిన ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నలుగురిని పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. అది గమనించిన స్థానికులు వాళ్లపై దాడికి దిగడంతో పోలీసులు చెదరగొట్టారు. ఆ దొంగల నుంచి మూడు తుపాకులను, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం..బిల్డింగ్‌లో ఉన్న మిగతా వాళ్ల కోసం ప్రత్యేక ఆపరేషన్ కొనసాగింది. డీఎస్సీ మణికంఠ నేతృత్వంలో డాగ్ స్క్వాడ్, అక్టోపస్ బలగాలు రంగంలోకి దిగాయి. చుట్టుపక్కల భవనాల నుంచి జనాలను ఖాళీ చేయించడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆపై బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో పోలీసులు బలగాలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాయి. అది గమనించిన దొంగలు పారిపోయే యత్నం చేశారు. ఈ క్రమంలో శివారులో మరో దొంగను పట్టుకుని స్టేషన్‌కు తరలించారు పోలీసులు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలపై పోలీసులు స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. -
‘మీ ఊరికి ఓ ఎస్ఐను తెచ్చుకోండి’..ఊరికే నా వద్దకు వస్తారు..
చిత్తూరు అర్బన్: సుమారు 40 వేల మందికి పైగా జనాభా. 24 పంచాయతీలు. ప్రముఖ పుణ్యక్షేత్రం పులిగుండు ఉన్న ఊరు. అదే పెనుమూరు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పెనుమూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మాత్రం కనిపించడంలేదు. ఎనిమిది నెలలుగా ఈ స్టేషన్లో ఎస్ఐ పోస్టు భర్తీకి నోచుకోలేదు. మండలంలోని ఏ గ్రామంలో చిన్న సమస్య వచ్చినా ప్రజలు పెనుమూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం.. ‘ఇక్కడ ఎస్ఐ లేరు, మీరు చిత్తూరు టౌన్‌లోని తాలూకా పోలీస్ స్టేషన్‌కు వెళ్లండి. అక్కడ సీఐ సార్ ఉంటారు. ఆయన మీ సమస్య చూస్తారు’ అంటూ సిబ్బంది పంపివేయడం. నెలలు తరబడిగా ఇదే సమాధానం వినివిని మండలంలోని ప్రజలు విసుగెత్తిపోతున్నారు. పెనుమూరు మండల కేంద్రం నుంచి చిత్తూరుకు 22 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక చుట్టు పక్కల గ్రామాల నుంచైతే 30 కిలోమీటర్ల పైనే దూరం. మనిషి కనిపించికపోయినా, ఇంట్లో చోరీ జరిగినా, చిన్నపాటి గొడవలు జరిగినా, ఆఖరుకు చింతచెట్లు కొట్టేసినా సరే.. పెనుమూరు ప్రజలు చిత్తూరుకు రావాల్సిందే. స్టేషన్లో ఇద్దరు ఏఎస్ఐలుంటే ఒకరు వారెంట్ డ్యూటీ, మరొకరు స్టేషన్ పర్యవేక్షణ బాధ్యత. ఉన్న పది మందిలో ఎవరికి వాళ్లే బాసు. ఒకరి మాట, ఒకరు వినే పరిస్థితి లేదు. అలాంటిది ప్రజల సమస్య ఏం వింటారనే విమర్శలున్నాయి. మరోవైపు కూటమి ప్రజాప్రతినిధి చెప్పిన వ్యక్తికి ఇక్కడ ఎస్ఐ పోస్టింగ్ దక్కడం లేదో..? పోలీసు బాసు ఎవరినైనా నియమిస్తే ఆయన్ని ఇక్కడ చేర్చుకోవడంలేదో..? తెలియడం లేదుగానీ.. ప్రజలకు మాత్రం తిప్పలు తప్పడంలేదు. ఒక్కొక్కసారి తాలూక స్టేషన్‌లోని పోలీసు సారుకూ చిర్రెత్తుకొస్తుంది. జనం ముందే ‘మీ ఊరికి ఓ ఎస్ఐను వేసుకోవడానికి వగలేదు. ఊరికే నా వద్దకు వస్తారు. మీ వల్లైతే ఎస్ఐను వేసుకోండి. నాకు ఇదొక్కటే స్టేషన్ కాదు కాదా..?’ అంటూ చిర్రుబుర్రులాడుతున్నారని ప్రజలు నిట్టూరుస్తున్నారు. మరి పోలీసు ‘బాసు’ ఇప్పటికైనా పెనుమూరు స్టేషన్‌కు ఎస్ఐని నియమిస్తే ప్రజలకు మేలు చేసినట్లవుతుంది. -
ఐదు భాషల్లో అనర్గళంగా!
శాంతిపురం: ఒక దీపం అనంత దీపాలను వెలిగించినట్టు.. తపన ఉన్న ఓ ఉపాధ్యాయుడు తలిస్తే వందల, వేల మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా ఎలా తీర్చిదిద్దవచ్చన్నది చిత్తూరు జిల్లా (Chittoor District) శాంతిపురం, శెట్టేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల చాటుతోంది. మారుమూల గ్రామంలో ఉన్న ఈ స్కూలు విద్యార్థులు బహుభాషలపై తమ ప్రత్యేకతను చాటుకొంటున్నారు. పాఠ్యాంశాల్లోని తెలుగు (Telugu), ఇంగ్లీషు, హిందీ భాషలతో పాటు కన్నడం, తమిళం, మలయాళీ (Malayalam) భాషలు ఇక్కడి విద్యార్థులు సులువుగా రాయటం, చదవడం, మాట్లాడడం చేస్తున్నారు. ఒక భాషలోని పద్యాలు, రచనలను మరో భాషలోకి అనువాదం చేయగలుగుతున్నారు. ప్రత్యేక పరీక్షల్లో ఉత్తీర్ణత అధికారుల అనుమతితో ఆయా భాషల్లో ప్రావీణ్యులైన ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చి విద్యార్థుల భాషాపరిజ్ఞానంపై ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. గుడుపల్లి ఏపీ మోడల్ స్కూలు ఉపాధ్యాయుడు షిజో మైకెల్ మలయాళంపై, గుడుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం ఎస్కే.మణి తమిళంపై, కర్ణాటకలోని వేమన విద్యా సంస్థల ఉపాధ్యాయురాలు ఎస్వనజాక్షి కన్నడ భాషపై మొత్తం 94 మంది విద్యార్థుల స్థాయిలను ఇటీవల పరీక్షించారు. వీరిలో కన్నడంలో 93 మంది, మలయాళంలో 45 మంది, తమిళంలో 36 మంది సంతృప్తికర ప్రతిభను చాటుకున్నారు. ప్రధానోపాధ్యాయుని సంకల్పం ఇక్కడ ప్రధానోపాద్యాయుడుగా ఉన్న తీగల వెంకటయ్య భాషల పట్ల ఆసక్తితో రూపకల్పన చేసిన కార్యక్రమం విద్యార్థులను బహుభాషా కోవిదులుగా తయారు చేస్తోంది. తీరిక వేళల్లో హెచ్ఎం ఇస్తున్న తర్ఫీదు, మిగతా ఉపాధ్యాయుల సహకారం అందిపుచ్చుకుని అన్ని బాషల్లోనూ తమ పట్టును పెంచుకొంటున్నారు. మాతృభాష (Mother Tongue) వస్తే మరెన్ని భాషలైనా నేర్వవచ్చనే ఆలోచనతో హెచ్ఎం తీగల వెంకటయ్య ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి తన ప్రత్యేక బోధనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.చదవండి: సోలో లైఫే సో బెటరూ అంటున్న యువతులు! 6, 7, 8, 9 తరగతుల వారికి భాషల గురించి చెప్పి, కేవలం 26 సరళమైన పదాలతో బోధన ప్రారంభించారు. ఎవరైనా ఉపాధ్యాయులు లేని సమయంలో వారి తరగతులను తీసుకుని విద్యార్థులకు దీనిపై పాఠాలు చెప్పారు. విద్యార్థులు కూడా ఇతర భాషలు నేర్చుకోవటంపై ఆసక్తి చూపడంతో సొంత ఖర్చులతో వారికి మలయాళం, తమిళం, కన్నడ పుస్తకాలను కొనిచ్చారు. ఈ ఆసరాను అందిపుచ్చుకున్న పిల్లలు ఆయా భాషలపై సులువుగా పట్టు సాధిస్తున్నారు. నా విశ్వాసం పెరిగింది ప్రైమరీ స్కూలు రోజుల నుంచి భాషలే నాకు ఇబ్బందిగా ఉండేవి. అక్కడ తెలుగు, ఇంగ్లీషు ఉంటే 6వ తరగతిలో చేరగానే వాటికి హిందీ కూడా తోడయ్యి అంతా అయోమయంగా ఉండేది. కానీ సులువుగా భాషలు నేర్చుకునే టెక్నిక్ తెలుసుకున్న తర్వాత తెలుగు, ఇంగ్లీషు, హిందీతో పాటు కన్నడ, తమిళం కూడా నేర్చుకొంటున్నాను. నాపై నాకు విశ్వాసం పెరిగింది. – బీ.రామాచారి, 8వ తరగతిఎన్ని భాషలైనా నేర్వవచ్చు నేను రూపొందించిన ప్రాజెక్టు నమూనాతో 20–25 రోజుల్లోపు ఏ బాషలైనా నేర్చుకోవచ్చు. అందరు విద్యార్థులకు దక్షిణ భారత భాషలను నేర్పితే వారి నిత్య జీవనంలో అది ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది – తీగల వెంకటయ్య, హెచ్ఎం5 భాషలు నేర్చుకొంటున్నా కొత్త భాషలను సులువుగా నేర్చుకోవటం భలే సరదాగా ఉంది. ఏడాది క్రితం వరకూ తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లోని పాఠ్యాంశాలు నేర్చుకోవటానికే కష్ట పడేదాన్ని. కానీ మా హెడ్మాస్టర్ చెప్పిన విధానం పాటించటంతో ఆ భాషలతో పాటు మలయాళం, తమిళం, కన్నడ కూడా సులువుగా నేర్చుకున్నాను. ఇదే ప్రేరణతో భవిష్యత్తులో నేను భాషా పండిట్ అవుతాను. – కె.ధరణి, 9వ తరగతివిస్తరిస్తే బాగుంటుంది వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని, విద్యార్థుల మిగతా పాఠ్యాంశాలకు ఇబ్బంది కలగకుండా మా హెచ్ ఎం చేసిన ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది. విద్యాశాఖ ఉన్నత అధికారులు ఈ నమూనాను పరిశీలించి మిగతా స్కూళ్లకు కూడా విస్తరిస్తే బాగుంటుంది. ఇంగ్లీషు, హిందీలకు అదనంగా పాఠశాలకు ఒక్క ఉపాధ్యాయుడిని కేటాయించినా కనీసం మరో మూడు భాషలు పిల్లలకు నేర్పవచ్చు. పోటీ ప్రపంచంలో కేవలం భాషలపై అవగాహన లేకపోవటం వల్లే చాలా మంది సరైన ఉద్యోగాలు పొందలేక పోతున్నారు. – నాగభూషణం, ఇంగ్లీష్ టీచర్ -
చంద్రబాబు.. ఇంత నీచంగా వ్యవహరించాలా?: భూమన
సాక్షి, తిరుపతి: తిరుపతిలో మున్సిపల్ ఎన్నికల వేళ కూటమి నేతలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను భయభాంత్రులకు గురిచేశారు. ఓటింగ్ కోసం ఎస్వీ యూనివర్సిటీకి వెళ్తున్న సమయంలో కార్పొరేటర్ల బస్సుపై జనసేన, టీడీపీ మూకలు దాడులకు పాల్పడ్డాయి. ఈ నేపథ్యంలో కూటమి నేతలపై వైఎస్సార్సీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా? అని ప్రశ్నించారు.ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదు. మెజారిటీ కార్పొరేటర్లు వైఎస్సార్సీపీ వైపే ఉన్నారు. ఒక్క కార్పొరేటర్ బలమే ఉన్న టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం నాయకులు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై దుర్మార్గంగా వ్యవహరించారు. కార్పొరేటర్లు వెళ్తున్న వాహనంపై దాడి చేయమేంటి?. చంద్రబాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా?. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు.అర్థరాత్రి పూట మహిళా కార్పొరేటర్లు ఉన్న గదికి వెళ్లి దౌర్జన్యం చేశారు. మహిళా కార్పొరేటర్లు ఉన్న గదుల్లోకి చొరబడి వారిని భయబ్రాంతులకు గురి చేశారు. ఇదేనా మీకు మహిళల పట్ల ఉన్న గౌరవం. అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. కార్పొరేటర్ల ఆస్తులు విధ్వంసం చేశారు, బెదిరింపులకు పాల్పడ్డారు. కార్పొరేటర్ల బంధువులు, కుటుంబ సభ్యులకు అక్రమంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం తిరుపతి మేయర్ శిరీష మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి నేతలకు పోలీసులు సహకరిస్తున్నారు. పోలీసులే రక్షించకపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?. మహిళా కార్పొరేటర్ అని కూడా చూడకుండా దాడి చేశారు. మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టారు. మా కార్పొరేటర్లను వెంటనే విడిచిపెట్టాలి. మా పార్టీ కార్పొరేటర్లు వచ్చే వరకు మేము ఓటింగ్‌లో పాల్గొనం’ అని కామెంట్స్ చేశారు. -
YSRCP కార్పొరేటర్లను నిర్భందించిన కూటమి నేతలు
-
జనసేన కార్యకర్త మునీర్ పై దాడి చేసిన టీడీపీ నేతలు
-
లోకేష్ జన్మదిన వేడుకల్లో రచ్చ.. జనసేన కార్యకర్తపై దాడి
సాక్షి, చిత్తూరు: ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే భాగస్వాములైన జనసేన(Janasena), బీజేపీ నాయకులకు పలుచోట్ల అవమానాలు తప్పలేదు. ఇప్పటికే పలుచోట్ల పచ్చ నేతలు రెచ్చిపోయి కూటమి నేతలపై దాడులకు తెగబడ్డారు. తాజాగా చిత్తూరు జిల్లాలో జనసేన కార్యకర్తను టీడీపీ(TDP) కార్యకర్తలు చితకబాదారు. ఈ క్రమంలో అతడిని తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లాలోని సోమల మండలంలో గురువారం రాత్రి మంత్రి నారా లోకేష్(Nara Lokesh) జన్మదిన వేడుకల్లో బ్యానర్లు కట్టినందుకు, కేక్ కట్ చేసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు జనసేన కార్యకర్తను టీడీపీ నాయకులు చితకబాదారు. కందూరులో జనసేన కార్యకర్త మునీర్ బాషా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్ బ్యానర్లు వేసి జన్మదిన సంబరాల్లో పాల్గొన్నారు. దీంతో రెచ్చిపోయిన తెలుగుదేశం నాయకులు మునీర్ బాషాను ‘నువ్వెవడురా రావడానికి’ అంటూ చితకబాదారు.ఈ ఘటనను చూసిన ఆయన తల్లి బిడ్డపై దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమెపై కూడా దాడి చేయడంతో పిడికిలి దెబ్బలకు ఆమె పళ్లు రాలిపోయాయి. దీంతో, వెంటనే స్థానికులు పుంగనూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి చిన్నారాయల్కు సమాచారం అందించారు. ఆయన తన అనుచరులతో ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. గాయపడిన మునీర్ బాషాను, ఆయన తల్లిని, జనసేన కార్యకర్తలు, నాయకులు కలిసి పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు జనసేన నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేస్తారా? లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.గాయపడిన జనసేన కార్యకర్త మునీర్ తాజాగా మాట్లాడుతూ..‘గతంలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కందూరులో బ్యానర్లు కట్టొద్దని బెదిరించారు. నేను వాటిని లెక్క చేయలేదు, అప్పుడు నాపై దాడి చేసి గాయపరిచారు, పవన్ కళ్యాణ్ బ్యానర్లు చింపారు. నిన్న రాత్రి నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా నాపై దాడి చేశారు, నా తల్లిని గాయ పరిచారు. నన్ను చంపే అధికారం వాళ్లకు ఎవరు ఇచ్చారు?. నన్ను ఊరు విడిచి వెళ్ళాలి అని బెదిరిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ జనసేన పార్టీ నాయకుల్ని, నన్ను ఇబ్బంది పెట్టలేదు. టీడీపీ వాళ్ళ కంటే వైఎస్సార్సీపీ నాయకులే బెస్ట్ అనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. -
కశ్మీర్లో ఎన్కౌంటర్ నేల కొరిగిన ఆంధ్రా జవాను
శ్రీనగర్/బంగారుపాళ్యం: జమ్మూకశ్మీర్‌లోని సొపోర్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం జలూర గుజ్జర్పటి ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాన్ని జవాన్లు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా పంగల కార్తీక్(32) అనే జవాను బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడ్డారు. వైద్యం కోసం తరలిస్తుండగానే ఆయన తుదిశ్వాస విడిచారని అధికారులు సోమవారం తెలిపారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు ముష్కరుల కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నాయన్నారు. కార్తీక్ వీరమరణంపై శ్రీనగర్ కేంద్రంగా పనిచేసే ఆర్మీ విభాగం చినార్ కార్ప్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన కార్తీక్ యొక్క అత్యున్నత త్యాగానికి చినార్ కార్ప్స్ సెల్యూట్ చేస్తోంది చినార్ వారియర్స్ కార్తీక్ అపారమైన పరాక్రమానికి, త్యాగానికి వందనం చేస్తోంది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతోంది. వారికి సంఘీభావంగా నిలుస్తుంది’అని ‘ఎక్స్’లో తెలిపింది. కాగా, కార్తీక్‌ది ఏపీలోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం ఎగువరాగిమాను పెంట గ్రామం. వరద మందడి, సెల్వి దంపతుల రెండో కుమారుడైన కార్తీక్ పదేళ్ల క్రితం ఆర్మీలో చేరారు. ఈయన చనిపోయిన విషయం తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంగళవారం రాత్రికల్లా మృతదేహం గ్రామానికి రావచ్చని చెబుతున్నారు. -
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం
శాంతిపురం: వివాదంలోని భూమిపై రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులపై పెట్రోల్ చల్లి, తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం చోటుచేసుకుంది. శాంతిపురం మండలంలోని 30 సొన్నేగానిపల్లి పంచాయతీ పరిధిలోని నాయనపల్లికి చెందిన లక్ష్మీపతి తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీపతి తల్లి లక్ష్మమ్మ కర్ణాటకలోని రాజుపేట రోడ్డులో ఓ బట్టల దుకాణం యజమాని ఇంట్లో పనిచేసేది. లక్ష్మమ్మ 2019లో మరణించాక దుకాణం యజమాని సుమమ్మ తాను మృతురాలి నుంచి 2002లో భూమిని కొనుగోలు చేశానని కుప్పం కోర్టును ఆశ్రయించింది.అనువంశిక ఆస్తిని తన తల్లి ఒక్కరే విక్రయించే హక్కు లేదని, చదువులేని తన తల్లిని మోసం చేశారని లక్ష్మీపతి సైతం కోర్టుకు వెళ్లాడు. ఈ కేసు కుప్పం కోర్టులో విచారణలో ఉంది. అయితే కుప్పం–పలమనేరు జాతీయ రహదారి పక్కనే ఉన్న 0.79 ఎకరాల వివాదాస్పద భూమి విలువ రూ.2 కోట్లకు పైగా ఉండటంతో గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల్లో యజమాని పేరు మార్పునకు ద్రస్తాలు కదిలాయి. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీపతి శుక్రవారం సాయంత్రం తహశీల్దారు శివయ్యకు తన గోడు వినిపించే ప్రయత్నం చేశాడు. పట్టించుకోని తహశీల్దారు తనను బయటకు గెంటించారని తెలిపాడు.దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మీపతి శనివారం తన కుటుంబ సభ్యులతో తహశీల్దారు కార్యాలయానికి వచ్చాడు. తహసీల్దారు అందుబాటులో లేకపోవడంతో డీటీ పౌలే‹Ùని కలిసి అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు హేళన చేశాడు. ఎంతకీ తహశీల్దారు రాకపోవడం, ఇతర అధికారులు పట్టించుకోకపోవటంతో లక్ష్మీపతి తన వంటిపై పెట్రోల్ పోసుకుని, కుటుంబ సభ్యులపైనా చల్లే ప్రయత్నం చేశాడు. దీనిని గమనించి వారు పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టెను అతని నుంచి లాక్కుని నీళ్లు పోశారు. కలెక్టర్, కుప్పం ఆర్డీవో ఆదేశాల మేరకు సదరు భూమిని రెవెన్యూ రికార్డుల్లో వివాదాస్పద భూమిగా నమోదు చేస్తామని తహశీల్దారు చెప్పారు. తాను రికార్డుల ప్రకారమే మ్యుటేషన్ చేశానని, భూమి కొనుగోలు పత్రం, ఈసీలను క్షుణ్ణంగా చూశాకే యజమాని పేరు మార్చానన్నారు. -
చిత్తూరు వద్ద ఘోర ప్రమాదం
-
ఇద్దరు ఎమ్మార్వోల వీరంగం.. రియల్టర్‌పై దాడి
సాక్షి,చిత్తూరు:మద్యం మత్తులో చిత్తూరులో ఇద్దరు తహసీల్దార్లు వీరంగం సృష్టించారు. తప్పతాగి నడిరోడ్డుపై రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడికి దిగారు. శివ,ప్రసన్నలు గంగవరం,పెద్దపంజాణి ఇన్ఛార్జ్ తహసీల్దార్లుగా పనిచేస్తున్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కృష్ణకుమార్‌పై శివ,ప్రసన్నలు దాడి చేశారు. చిత్తూరులోని ఓ బార్లో శివ,ప్రసన్న,కృష్ణ కుమార్‌లు వేరువేరుగా మద్యం సేవించారు. శివ,ప్రసన్న,కృష్ణ కుమార్ల మధ్య ఆర్థిక లావాదేవీలున్నాయి.మద్యం తాగేటపుడు మాటా మాటా పెరిగి కృష్ణ కుమార్‌పై శివ,ప్రసన్న దాడి చేశారు. ఈ దాడి వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కృష్ణకుమార్ డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: తెలుగు తమ్ముళ్ల స్వైర విహారం -
వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలపై కూటమి కంటగింపు..
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. నేడు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలపై కూడా సర్కార్ ఓవరాక్షన్ చేస్తోంది. పలుచోట్ల వైఎస్ జగన్ ఫ్లెక్సీలు తొలగించడమే కాకుండా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెడతామని పోలీసులు బెదిరింపులకు దిగారు.వివరాల ప్రకారం.. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలపై కూడా కూటమి సర్కార్ కక్ష సాధింపులకు దిగింది. వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా పార్టీ కార్యకర్తలు రేణిగుంటలో శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కూటమి నేతల ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగి.. ఫ్లెక్సీలను తొలగించారు. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ రేణిగుంట పట్టణ అధ్యక్షులు ప్రభాకర్‌కు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కేసులు పెడతామని సీఐ వార్నింగ్ ఇచ్చారు.మరోవైపు.. అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతలు ఓవరాక్షన్‌కు దిగారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో, ఈఘటనపై మదనపల్లి తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
AP: బలహీనపడిన తుపాను
సాక్షి, అమరావతి/నెట్వర్క్: ఫెంగల్ తుపాను ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి వద్ద నెమ్మదిగా బలహీనపడింది. తీరం దాటిన తర్వాత కూడా 6 గంటలకుపైగా భూమిపై తుపానుగానే స్థిరంగా కొనసాగింది. ఆదివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ప్రస్తుతం ఇది పుదుచ్చేరి సమీపంలోని కడలూరుకు 30 కి.మీ., విల్లుపురానికి 40 కి.మీ., చెన్నైకి 120 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాత్రికి ఇంకా బలహీనపడి వాయుగుండంగా.. ఆ తర్వాత అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మూడు జిల్లాల్లో ఎడతెగని వర్షాలుతుపాను ప్రభావంతో చిత్తూరు, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఆదివారం కూడా ఎడతెగని వర్షాలు కురిశాయి. మిగిలిన కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. 24 గంటల వ్యవధిలో తిరుపతి జిల్లా పుత్తూరులో 18.7సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. అదే జిల్లా పుత్తూరు మండలం రాచలపాలెంలో 15.2 సెం.మీ. వర్షం కురిసింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట, తడ, చిత్తమూరు, దొరవారిసత్రం, నాయుడుపేట, వెంకటగిరిలో భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లా నగరి, నిండ్ర, కార్వేటినగరం, పాలసముద్రం మండలాలు, నెల్లూరు జిల్లాలోని మనుబోలు, కొడవలూరు, సైదాపురం మండలాల్లో విస్తృతంగా వర్షాలు కురిశాయి. కోస్తా జిల్లాల్లోనూ చాలాచోట్ల భారీ వర్షాలు పడ్డాయి.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో 10 సెం.మీ. వర్షం కురిసింది. తిరుపతి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. వాగుల్లోకి పెద్దఎత్తున నీరు చేరి ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నైలో ఇంకా తీవ్రంగా వర్షాలు పడుతుండటంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్లే అనేక బస్సులను రద్దు చేశారు. సోమవారం కూడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. తిరుపతి జిల్లాలో జోరువానతిరుపతి జిల్లాలో 3 రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. సత్యవేడు, గూడూరు, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తాయి. వర్షం ప్రభావంతో 116 ఆర్టీసీ సర్వీసులను నిలుపుదల చేశారు. 21 గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులు వెళ్లడం లేదు. చెన్నైకి వెళ్లే పలు సర్వీసులకు బ్రేక్ పడింది. ఏసీ సర్వీసులను నిలుపుదల చేశారు. జిల్లాలో మామిడి కాలువ, పాముల కాలువ, కార్వేటి కాలువ, ఈదులకాలువ, సున్నపు కాలువ తదితర 21 కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లోనూ వానలుకృష్ణా జిల్లా పెనమలూరు, పెడన, పామర్రు, అవనిగడ్డ ప్రాంతాల్లో ఆదివారం కూడా వర్షాలు కురిశాయి. 19,500 ఎకరాల్లో వరి నేలవాలింది. కోతలు పూర్తయిన చోట్ల ధాన్యాన్ని రోడ్లపైనే రాశులు పోయగా.. తడిసిపోయింది. ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడా మోస్తరు జల్లులు కురిశాయి. పూత దశలో ఉన్న కంది, మిరప గాలులకు రాలిపోయింది. మబ్బుల కారణంగా పంటలు తెగుళ్ల బారిన పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో 9.2 మి.మీ. వర్షం పడగా, అత్యల్పంగా వట్టిచెరుకూరు మండలంలో 1.6 మి.మీ. వర్షం కురిసింది. కొల్లిపర, దుగ్గిరాల, తెనాలి, పొన్నూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో కోతకు వచ్చిన వరి పంట పలుచోట్ల నేల వాలింది.పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం చిరు జల్లుల కారణంగా సార్వా మాసూళ్ల (నూర్పిడి) పనులు నిలిచిపోయాయి. విజయనగరం జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. భోగాపురం, గరివిడి, ఎస్.కోట, డెంకాడ, గుర్ల, చీపురుపల్లి, పూసపాటిరేగ, కొత్తవలస, బొండపల్లి, గజపతినగరం, వేపాడ, నెల్లిమర్ల, మెంటాడ, విజయనగరం, రామభద్రపురం మండలాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో చెదురుమదురు జల్లులు పడ్డాయి.కాకినాడ జిల్లాలో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వరి చేలు నేలకొరిగాయి. సుమారు 30 శాతం వరిచేలు నేలనంటాయి. ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో వరిపై వర్షాల ప్రభావం అధికంగా ఉంది. కూనవరం మొగ మూసుకుపోవడంతో ముంపు నీరు దిగడం లేదు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ శాతం పడిపోయింది. రొయ్యలను కాపాడుకునేందుకు ఆక్వా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.తిరుమలలో విరిగిపడుతున్న కొండ చరియలుతిరుమలలోని రెండో ఘాట్ రోడ్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. సకాలంలో టీటీడీ సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు. రెండు ఘాట్ రోడ్లలోనూ దిట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. తిరుమలలో ఆదివారం కూడా ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చలి తీవ్రత పెరగడంతో చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్ జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు పలు మండలాల్లో వరి పంట నేలకొరిగింది. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రైల్వేకోడూరు నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. వరి, టమాటా, బొప్పాయి ఇతర ఆకు కూరల తోటలు దెబ్బతిన్నాయి. పొగ మంచు రావడంతో రహదారులపై వాహనదారులు కష్టతరంగా ప్రయాణాన్ని సాగిస్తున్నారు. -
‘హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే.. వేధింపులా?’
చిత్తూరు: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్సార్సీపీ సోషల్‌మీడియా కార్యకర్తలు ప్రశ్నిస్తే వారిని అక్రమ కేసులతో వేధింపులకు గురిచేయడం అత్యంత దారుణమమన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిని పూతలపట్టు వైఎస్సార్సీపీ మండల పార్టీ కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డిని మిథున్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కక్ష్య పూరిత రాజకీయాలకు టీడీపీ నాయకులు స్వస్తి పలకాలి. సొంత ఊర్లో తిరగలేని పరిస్థితి ఈరోజు పూతలపట్టు మండల పార్టీ కన్వీనర్ విషయంలో మీరు తీసుకు వచ్చారు. పోలీసులు చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పై దృష్టి పెట్టండి, డైవర్షన్ పాలిటిక్స్ వద్దు. సోషల్ మీడియా కార్యకర్తలు పై కేసులు పేరుతో వేధింపులు మానుకోవాలి.గతంలో టీడీపీ ప్రోద్బలంతో వైఎస్ జగన్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయండి అని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు పై వేధింపులు మానుకోవాలి.ఎల్లకాలం ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి.. ఇలానే చేస్తే ముగింపు అనేది ఉండదు’ అని మండిపడ్డారు మిథున్‌రెడ్డి. -
చిత్తూరు జిల్లాలో కిడ్నాప్ కలకలం
-
చిత్తూరులో 14 ఏళ్ల బాలిక అదృశ్యం
చిత్తూరు అర్బన్: చిత్తూరులో ఓ మైనర్ బాలిక కనిపించకుండా పోయింది. నగరంలోని చామంతిపురానికి చెందిన ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈమె తండ్రి గల్ఫ్ దేశంలో పొట్టకూటి కోసం వెళ్లారు. తల్లి, అమ్మమ్మ వద్ద ఉంటున్న బాలిక ఆదివారం చికెన్ తీసుకొస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత బాలిక ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు కంగారుపడి, తెలిసినవాళ్ల ఇళ్ల వద్ద వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు చెప్పి సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆదివారం రాత్రి వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. మంగళవారం చిత్తూరు పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువయ్యిందని.. మహిళలు మిస్ అవుతున్నా, అఘాయిత్యాలు, అత్యాచారాలకు గురవుతున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు ప్రవర్తిస్తోందన్నారు. చిత్తూరులో కనిపించకుండాపోయిన బాలిక ఆచూకీ వెంటనే కనిపెట్టి, ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. బాలిక ఆచూకీ తెలియకపోవడంతో చామంతిపురం వాసులు మంగళవారం రాత్రి వన్‌టౌన్ స్టేషన్ వద్దకు చేరుకుని బాలిక వివరాలు చెప్పాలని నిరసన తెలిపారు. -
తోతాపురి పండు.. ఎగుమతుల్లో ట్రెండు
చిత్తూరు అర్బన్: తోతాపురి మామిడి కారణంగా చిత్తూరుకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు దక్కింది. తోతాపురి మామిడి కోసం ఏకంగా 48 దేశాలు చిత్తూరు వైపు చూస్తున్నాయి. ఇక్కడి నుంచి పంపిస్తున్న మామిడి గుజ్జు (మ్యాంగో పల్ప్)ను ఆయా దేశాల పౌరులు అపారమైన ప్రేమతో ఆస్వాదిస్తున్నారు. ఎగుమతుల్లో మరే దేశానికి లేని ప్రత్యేకత చిత్తూరు వల్లే భారత్‌కు దక్కుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తూరు మామిడిపై కాస్త దృష్టి సారిస్తే ఎగుమతుల్లో మరింతగా ముందడుగు వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 1.12 లక్షల హెక్టార్లలోఏ రాష్ట్రంలో లేనివిధంగా మామిడి ఉమ్మడి చిత్తూరులో సాగవుతోంది. చిత్తూరు, మదనపల్లె, తిరుపతి జిల్లాల్లో 1.12 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇందులో తోతాపురి (బెంగళూరు) రకానికి చెందిన మామిడి చిత్తూరుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి0ది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 70 వేల హెక్టార్లు తోతాపురి, 42 వేల హెక్టార్లలో టేబుల్ రకాలకు చెందిన మామిడి సాగులో ఉంది. రమారమి ఏటా 7.5 లక్షల టన్నుల మామిడి కాయల దిగుబడి వస్తుండగా.. ఇందులో 5 లక్షల టన్నులతో తోతాపురి సింహభాగంలో ఉంది. తోతాపురి రకం కాయలను పండుగా తినడానికి, పచ్చళ్లకు ఉపయోగించరు. ఇది మృదువుగా, తీపిగా ఉండటంతో దీనిని పూర్తిగా గుజ్జు (పల్ప్) కోసమే ఉపయోగిస్తారు. మామిడి కాయల్ని వేడి నీటిలో శుభ్రంచేసి, టెంకను తొలగించి, గుజ్జును యంత్రాల ద్వారా వేరు చేస్తారు. సహజంగానే ఇది తియ్యగా ఉండటంతో కొద్దిమొత్తంలో చక్కెరను కలిపి మొత్తం గుజ్జును గాలి తీసేసిన కంటైనర్లలో నిల్వచేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. దేశంలోనూ డిమాండే దేశీయంగా తయారయ్యే పల్పీ, ఫ్రూటీ, స్లైస్, డాబర్, బి–నేచురల్ వంటి కంపెనీలు ఈ గుజ్జుతోనే మామిడి పానీయాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆ కంపెనీలు సైతం ఇక్కడి నుంచే గుజ్జును సేకరిస్తాయి. చిత్తూరు జిల్లాలో 47 మామిడి గుజ్జు తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, పోలెండ్, ఉక్రెయిన్, బెల్జియం, ఆ్రస్టేలియా, క్రోషియా, డెన్మార్క్, నార్వే, స్వీడన్, రుమేనియా, ఆల్బేనియా, ఐర్లాండ్, సెజియా, ఐస్లాండ్, స్లోవేనియా, హంగేరి, ఫిన్లాండ్, సెర్బీ, మాల్టా, లాక్సంబర్గ్, సిప్రస్, స్లోవేకియా, మోనాకో లాంటి 48 దేశాలకు చిత్తూరు నుంచే మ్యాంగో పల్ప్ ఎగుమతి అవుతోంది. ఏటా ఏప్రిల్ నుంచి జూలై వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు తయారీ పరిశ్రమలు 24 గంటలపాటు పనిచేస్తుంటాయి. ఐదేళ్లలో 9 లక్షల టన్నుల ఎగుమతి ఐదేళ్లలో చిత్తూరు జిల్లా నుంచి దాదాపు 9 లక్షల టన్నుల మామిడి గుజ్జు ఎగుమతి అయ్యింది. ఇది దేశంలోని మరే ప్రాంతానికి దక్కని గుర్తింపు. గుజ్జు ఎగుమతుల ద్వారా ఏటా సగటున రూ.1,200 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆర్జిస్తోంది. 1.20 లక్షల మంది రైతులు, 2 లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగాను, 4 లక్షల మంది పరోక్షంగా మామిడి గుజ్జు పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వాలు సహకరిస్తే.. భారత్‌తో పాటు ఈజిప్‌్ట, ఆఫ్రికా, మెక్సికో, పాకిస్థాన్ వంటి దేశాలు కూడా అంతర్జాతీయ మార్కెట్‌కు మామిడి గుజ్జు ఎగుమతులు ప్రారంభించాయి. మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న మామిడి గుజ్జుపై 32% పన్ను వసూలు చేస్తున్నారు. దీనిని తొలగిస్తే వ్యాపారులు, ఎగుమతిదారులు మామిడి సేకరణ ధరను పెంచుతారు. తద్వారా రైతులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. కాగా.. చిత్తూరు నుంచి ఎగుమతి అవుతున్న మామిడి గుజ్జును కంటైనర్ల ద్వారా చెన్నైకు తీసుకెళ్లి, అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా విదేశాలకు పంపుతున్నారు. దీనివల్ల ఎగుమతి ప్రోత్సాహకాలు చెన్నైకి అందుతున్నాయి. అలాకాకుండా చిత్తూరు నుంచే కంటైనర్లతో గుజ్జును ఉంచి సీల్ చేసి, ఇక్కడి నుంచి చెన్నైకు పంపిస్తే ఆ ప్రోత్సాహకాలు మన రాష్ట్రానికి లభించడంతోపాటు పారిశ్రామిక రంగానికి అదనపు ఊతం ఇచ్చినట్టవుతుంది. దీనికోసం చిత్తూరులో ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో (ఐసీడీ)ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.మధ్యాహ్న భోజన మెనూలో చేర్చాలి మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు పెడుతున్నట్టే పిల్లలకు మ్యాంగో పల్ప్ కూడా ఇవ్వాలి. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో భక్తులకు అన్న ప్రసాదాలతో పాటు మ్యాంగో పల్ప్ ఇస్తే ప్రయోజనం చేకూరుతుంది. కాణిపాకం, అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి లాంటి ఆలయాల్లో మ్యాంగో పల్ప్ వినియోగాన్ని తప్పనిసరి చేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. దీనిపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చాం. కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటే చిత్తూరు పల్ప్‌కు పేటెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. – గోవర్దన బాబి, చైర్మన్, ఆలిండియా ఫుడ్ ప్రాసెసర్స్ అసోసియేషన్, సౌత్‌జోన్, చిత్తూరు -
మద్యం టెండర్లలో రాజకీయ బెదిరింపులు
-
‘నువ్వు మేయర్ అయితే నాకేంటి? ఏం తమాషాలు చేస్తున్నావా?’
చిత్తూరు అర్బన్: గాంధీ జయంతి రోజే నగర ప్రథమ పౌరురాలైన మహిళా మేయర్‌కు అవమానం జరిగింది. నడిరోడ్డుపై కలెక్టర్, ఉన్నతాధికారులు, ప్రజలు చూస్తుండగానే మహిళా మేయర్ ఆముదపై ట్రాఫిక్ సీఐ నిత్యబాబు దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం, ఏకవచనంతో రెచి్చపోవడం అందరినీ నివ్వెరపరిచింది. ఓ దశలో మేయర్‌ను కొట్టడానికి మీదిమీదికి వెళుతున్నాడేంటి అంటూ చుట్టూ ఉన్న జనం నోరెళ్లబెట్టారు.బుధవారం మహాత్ముడి జయంతిని పురస్కరించుకుని చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచడానికి మేయర్ ఆముద, కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పలువురు అధికారులు వచ్చారు. అధికారుల వాహనాలతో పాటు ఎమ్మెల్యే వాహనాలు రోడ్డుకు ఓవైపు పార్కింగ్ చేశారు. మేయర్ వాహనానికి స్థలం లేకపోవడంతో మరోవైపు పార్కింగ్ చేశారు. అప్పటికే అక్కడకు చేరుకున్న ట్రాఫిక్ సీఐ నిత్యబాబు.. మేయర్ కారును అక్కడి నుంచి తీసేయాలని చెప్పాడు.కార్యక్రమం అయిపోగానే వెళ్లిపోతామని మేయర్ డ్రైవర్ చెప్పినా సీఐ అంగీకరించలేదు. దీంతో డ్రైవర్ కారును కొద్దిసేపు పీసీఆర్ కళాశాల చుట్టూ తిప్పి.. కార్యక్రమం అయిపోవస్తుండటంతో కార్యక్రమం జరిగే ప్రాంతానికి కారును తీసుకొచ్చాడు. మేయర్ కారులోకి ఎక్కి, బయల్దేరబోతుండగా సీఐ మళ్లీ వచ్చారు. కారు అద్దాలను బాదుతూ బండి తీయాలంటూ రచ్చ చేశారు.ఇదీ చదవండి: ఇసుక బంద్.. చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్లోపల మేయర్ ఉన్నారని, వెళ్లిపోతున్నామని డ్రైవర్ చెబుతున్నా సీఐ వినలేదు. దీంతో ఆగ్రహించిన మేయర్ వాహనం దిగి కిందకు వచ్చారు. తమ వాహనానికి ముందు, వెనుక కలెక్టర్, ఎమ్మెల్యే కార్లు ఉంటే ఎలా వెళతామని ప్రశి్నంచారు. దీంతో సీఐ మరింతగా రెచి్చపోయారు. ‘నువ్వు మేయరైతే నాకేంటి? డ్రైవర్‌తో మాట్లాడుతుంటే నువ్వు వస్తావెందుకు? ఏం తమాషా చేస్తున్నావా?’ అంటూ ఏక వచనంతో సంబోధిస్తూ ఓ దశలో మేయర్‌పైకి సీఐ దూసుకెళ్లారు. -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
-
చిత్తూరు రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ సహా పలువురు ప్రయాణికులు మరణించడం బాధాకరమన్నారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి కనుమ రహదారిలో బస్సు, రెండు లారీలు ఢీ కొన్న ఘటనలో ఎనిమిది మంది ఘటనా స్ధలంలోనే మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు వైపు నుంచి పలమనేరు వెళుతున్న ఆర్టీసీ బస్సును పలమనేరు వైపు నుంచి ఐరన్ లోడుతో వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇదీ చదవండి: విజయవాడలాగే.. ఏలూరు వరదలు మ్యాన్ మేడ్! -
టీడీపీ ఎమ్మెల్యేలు డుమ్మా.
-
ఏపీలో ఫుడ్ పాయిజన్ ఘటనలు.. ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: ఏపీలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ అయ్యింది. అనకాపల్లి అనాథా శ్రయంలో ముగ్గురు విద్యార్థుల మృతి చెందగా, 37 మంది విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు. మరో ఘటనలో చిత్తూరు అపోలో ఆసుపత్రిలో 70 మంది విద్యార్థులు విషాహారం తిని అస్వస్థత గురయ్యారు.ఈ కేసులను జాతీయ మానవ హక్కుల సంఘం.. సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ రెండు ఘటనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఏపీ చీఫ్ సెక్రటరీ , డీజీపీలకు నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లో నివేదిక పంపాలని ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. -
ప్రాణం తీసిన జల్లికట్టు
పూతలపట్టు (చిత్తూరు జిల్లా): జల్లికట్టు ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఈ ఘటన గురువారం చిత్తూరు జిల్లా, యాదమరి మండలం, కొట్టాలలో చోటుచేసుకోగా, శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. ఆడిజాతర పురస్కరించుకుని కొట్టాలలో గురువారం మారెమ్మ జాతర జరిగింది. ఇందులోనే జల్లికట్టును నిర్వహించారు. దీనికి మండల, తమిళనాడు సరిహద్దు పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ఎద్దులొచ్చాయి. కొంతసేపటికి ఓ ఎద్దు జల్లికట్టును వీక్షిస్తున్న బంగాపాళ్యంకు చెందిన దిలీప్‌కుమార్ (40)పైకి దూసుకెళ్లింది. కొమ్ములతో బలంగా పొడవడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఇదే ఘటనలో మరో 12 మంది స్వల్పంగా గాయపడ్డారు. అనుమతి లేకుండా జల్లికట్టు నిర్వహించిన మునిరత్నం, సెల్వరాజ్, పళణివేలు, మరికొంతమందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిత్తూరు మండలం, తమ్మింద గ్రామంలో పదేళ్లుగా కాపురం ఉంటున్నారు. -
రాజకీయ కక్షతోనే కేసు.. అంత దౌర్భాగ్యం నాకు పట్టలేదు: ఎమ్మెల్సీ భరత్
సాక్షి, కుప్పం: తిరుమల శ్రీవారి దర్శనం, పూజ టికెట్లు అమ్ముకునేంత దౌర్భాగ్యం తనకు పట్టలేదని అన్నారు వైఎస్సార్సీపీ కుప్పం ఎమ్మెల్సీ కేఆర్జే భరత్. తాను ఒక బ్యూరోక్రట్ ఫ్యామిలీ నుంచి వచ్చానని, తన తండ్రి ఒక ఐఏఎస్ అధికారి అని తెలిపారు. ఉన్నత విలువలతో బతికే వ్యక్తినని చెప్పారు.తన వద్ద మల్లికార్జునరావు అనే పీఆర్ఓ ఎవరూ లేరని, అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదని అన్నారు భరత్. కేవలం కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేయడం, అక్కడ ఆయనను ఎదుర్కొంటూ రాజకీయాల్లో నిలబడుతున్నానన్న కక్షతోనే తనపై కేసులు నమోదు చేసి అప్రతిష్టపాలు జేసేందుకు ఈ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తనపై జరుగుతున్న కుట్రలను కచ్చితంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. అసలు తనపై ఫిర్యాదు చేసిన వారెవరు? పోలీసులు కేసులో రాసిన వాళ్లు ఎవరు? అవన్నీ ఆరా తీస్తానని చెప్పారు. పూర్తి వివరాలతో మళ్లీ మీడియా ముందుకు వస్తానని తన వీడియో సందేశంలో తెలిపారాయన. -
మద్యం మత్తులో.. కూతురికే ఉరి
రొంపిచెర్ల: మద్యం మత్తులో ఓ తండ్రి కన్న బిడ్డనే ఉరేసి చంపిన సంఘటన మండలంలోని పెద్దమల్లెల గ్రామ పంచాయతీ నడింపల్లెలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మృతురాలు మేనమామ జయరాం కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నడింపల్లెకు చెందిన కె.మునిరత్నం(35), రెడ్డెమ్మ దంపతులకు ఒక కుమార్తె గౌతమి(14) ఉంది. పదేళ్ల క్రితం రెడ్డెమ్మ మృతి చెందారు. అప్పటి నుంచి గౌతమి తన తండ్రి, అవ్వతో కలసి ఉంటోంది.గౌతమి పెద్దమల్లెల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అయితే మునిరత్నం తల్లి ఐదు నెలల క్రితం మృతి చెందింది. అప్పుటి నుంచి ఆ ఇంట్లో తండ్రి, కుమారై జీవిస్తున్నారు. మునిరత్నం ఆదివారం రాత్రి తాగొచ్చి ఇంట్లో పడుకుని ఉన్న కుమారైను ఏమీ పని చేయడం లేదని మందలించాడు. దీంతో గౌతమి కూడా గట్టిగా బదులిచ్చింది. వెంటనే కోపంతో సెల్ చార్జింగ్ వైర్‌ను మెడకు వేసి చంపివేశాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉరి వేసుకుని మృతి చెందిందంటూ ఉదయాన్నే చుట్టుపక్కల వారికి చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులకు తండ్రి మీద అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో తన బిడ్డను చార్జింగ్ వైరుతో చంపివేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. ఆ క్రమంలోనే నిందితుడు మునిరత్నం పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. కల్లూరు సీఐ శ్రీనివాసులు, ఇన్చార్జి ఎస్ఐ రవి ప్రకాష్ రెడ్డి, సంఘటన స్థలాన్ని సందర్శించి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం కోసం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడి మునిరత్నం కోసం రొంపిచెర్ల పోలీసులు గాలిస్తున్నారు. రెండు రోజుల్లో నిందితుడిని అరెస్టు చేస్తామని సీఐ శ్రీనివాసులు తెలిపారు.ఎన్నో అనుమానాలు కుమారై గౌతమి మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గౌతమి తాను చనిపోతున్నానని తన చావుకు తన స్నేహితులను పిలవాలని రాసిన ఒక లేఖ సోమవారం బయటపడింది. అయితే మరోపక్క మునిరత్నమే తన కుమార్తెను చంపేశాడని ఒప్పుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తండ్రి కుమార్తెపై లైంగిక దాడికి యతి్నంచి, చంపేసి ఉంటాడని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. పోస్టుమాస్టరం నివేదికలో వాస్తవం బయటపడుతుందని భావిస్తున్నారు. -
దాయ్ యాప్ స్కాంపై విచారణ ముమ్మరం
-
చిత్తూరు జిల్లా పలమనేరులో భారీ ఆన్ లైన్ ఫ్రాడ్
-
ఏపీలో బీహార్ పరిస్థితులు.. చేతులెత్తేసిన పోలీసులు
-
పుంగనూరులో టీడీపీ.. వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుని
సాక్షి,చిత్తూరు జిల్లా: ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో మొదలైన టీడీపీ నేతల అరాచకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం కమ్మపల్లిలో వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు సుబ్రమణ్యరెడ్డి కుటుంబాన్ని టీడీపీ నేతలు గ్రామం నుంచి వెలివేశారు. ఆయన పండించుకున్న టమాటా పంటను అమ్ముకోకుండా అడ్డుకున్నారు. దీంతో టమాటాలన్నీ కుళ్లిపోయి భారీ నష్టం వాటిల్లింది. కనీసం ఆవులకు మేత వేయకుండా అడ్డుకుని అరాచకం సృష్టిస్తున్నారు. పోలీసులకు చెబితే గ్రామం వదిలి వెళ్లిపోవాలంటున్నారని సుబ్రమణ్యరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. గ్రామంలోకి వస్తే చంపేస్తామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
విజృంభిస్తున్న అంటువ్యాధులు
-
సీనియర్లు, కూటమి శ్రేణులకు అడుగడుగునా అవమానం..
సాక్షి, టాస్క్‌ఫోర్స్: సీఎం చంద్రబాబు పర్యటనలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధిపత్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రిని సీనియర్ నేతలు కలిసేందుకు సైతం ఆంక్షలు విధించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక కార్యకర్తలనైతే తన నిరంకుశ వైఖరితో అడుగడుగునా అవమానించారని పార్టీ శ్రేణులే ఆక్షేపిస్తున్నాయి. ఎమ్మెల్యేల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లేలా వ్యవహరించారని మండిపడుతున్నాయి. ఆయన అనుమతి లేనిదే సీఎం సమీపంలోకి సైతం వెళ్లలేని పరిస్థితిని కల్పించారని ఆవేదన చెందుతున్నాయి. చివరకు పోలీసులు.. ఉన్నతాధికారులను తన కనుసన్నల్లోనే నడిపించారని ఆరోపిస్తున్నాయి. అభిమానంతో అధినేతను కలవాలని వస్తే ఇదెక్కడి పెత్తనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కుప్పం నియోజకవర్గానికి విచ్చేశారు. ఇక అప్పటి నుంచి మొత్తం పర్యటన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కనుసన్నల్లోనే సాగడం టీడీపీ శ్రేణులను అసంతృప్తికి గురిచేసింది. ఎవరైనా ముఖ్యమంత్రిని కలవాలంటే ఎమ్మెల్సీ చెప్పాలి. అది ఎమ్మెల్యే అయినా.. సీనియర్, టీడీపీ, జనసేన నేతలైనా సరే. ఆయన చెప్పకపోతే సీఎంని కలిసే అవకాశమే లేదు.అలా ఒకరోజంతా ఓపికగా వేచి చూసిన కూటమి నేతలు, కార్యకర్తలు సహనం నశించి బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు. పరిస్థితి చేయిదాటుతోందని గ్రహించిన ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఎట్టకేలకు సీఎం చంద్రబాబుని కలిసేందుకు అవకాశం కల్పించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకరికి మంత్రి పదవి ఇచ్చి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదని కూటమి ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు మొదటి సారిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పానికి వచ్చారు. మంగళవారం కుప్పానికి చేరుకున్న చంద్రబాబు.. బుధవారం సాయంత్రం వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికారిక, పార్టీ కార్యక్రమాలకు హాజరైన చంద్రబాబుని కలిసేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే కాకుండా.. అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి కూడా కూటమి ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యమంత్రిని కలవొచ్చని ఆశగా కుప్పానికి చేరుకున్న వారికి నిరాశే ఎదురైంది.అడ్డంకులు.. అవమానాలు!ఎమ్మెల్యేల నుంచి.. సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో సీఎం చంద్రబాబుని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే వారికి అడుగడుగునా అడ్డంకులు, అవమానాలే ఎదురైనట్లు ఇద్దరు ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం అంటే సెక్యూరిటీ సహజమే అయినా.. ఎమ్మెల్యే అయితే పెద్దగా తనిఖీలు లేకుండా నేరుగా పంపేస్తుంటారు. అలాంటిది కుప్పంలో ఎమ్మెల్యేలకు చేదు అనుభవమే ఎదురైంది.తాను ఎమ్మెల్యేని చెబుతున్నా.. పోలీసులు పట్టించుకోలేదని, పంపేందుకు ససేమిరా అన్నారని తెలిపారు. ఐడీ కార్డు ఉందా? మీరు ఎమ్మెల్యేనేనా? రుజువు ఏంటి? అంటూ సవాలక్ష ప్రశ్నలతో తీవ్ర అవమానాలకు గురిచేసినట్లు చెబుతున్నారు. ‘సీఎంని కలవాలంటే.. ఎమ్మెల్సీ శ్రీకాంత్ నుంచి ఫోన్ చేయించండి లేదా చెప్పించండి’ అంటూ సమాధానం ఎదురైందంటున్నారు. సరే శ్రీకాంత్‌తో చెప్పిద్దాం అంటే ఆయన అందుబాటులో లేకపోవడం, ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసులే కాకుండా.. అధికారులు సైతం ఎమ్మెల్సీ కనుసన్నల్లో నడిచినట్లు వివరించారు. ఎమ్మెల్యే అనే గౌరవం కూడా లేకుండా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే స్థానిక నాయకులకు కూడా సీఎం చంద్రబాబుని కలిసే అవకాశం లేకుండా పోయినట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక నాయకులందరినీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ దూరం పెట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకపోవడం లోటే..వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు మంత్రి వర్గంలో పెద్దపీట వేశారు. ఏకంగా ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ విప్ పదవి సైతం ఇచ్చారు. జిల్లాపై తనకున్న అభిమానం చాటుకున్నారు. అయితే ఇప్పుడు అదే స్థాయిలో ఎమ్మెల్యేలు గెలిచి కూటమి ప్రభుత్వం ఏర్పడినా.. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా మంత్రి వర్గంలో ఒక్కరంటే ఒక్కరికి కూడా చోటు కల్పించకపోవడంపై జిల్లా వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఒక్కరికై నా మంత్రి పదవి ఇచ్చి ఉంటే.. నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఇలా ఉండేది కాదనే అభిప్రాయపడుతున్నారు. సీఎం చంద్రబాబు తన సొంత జిల్లా ఎమ్మెల్యేలకే న్యాయం చేయకపోతే ఎలా? అని ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.ఆందోళనతో దిగొచ్చినా ప్రయోజనం శూన్యం!కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం.. సీఎం కుప్పానికి రావడంతో పలువురు టీడీపీ, బీజేపీ, జనసేననేతలు చంద్రబాబుని కలిసేందుకు ఉత్సాహం చూపించారు. మంగళవారం ఉదయం నుంచి వేచి ఉన్న వారికి బుధవారం కూడా చంద్రబాబుని కలిసే అవకాశం రాలేదు.ఈ క్రమంలో ముఖ్యమంత్రిని కలవాలని ఎమ్మెల్సీ శ్రీకాంత్‌తోపాటు పోలీసులను ప్రాధేయపడినా ప్రయోజనం లేకపోవడంతో ఆగ్రహించిన కూటమి శ్రేణులు ఆందోళనకు దిగాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్ వారిని లోనికి పంపించమని పోలీసులను ఆదేశించారు. అయితే లోపలికి వెళ్లినా.. కొందరికి మాత్రమే సీఎం చంద్రబాబుని కలిసే అవకాశం దొరికిందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. -
చిత్తూరులో వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ దాడులు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో టీడీపీ కార్యకర్తలు రెచి్చపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సానుభూతిపరులే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. మంగళవారం రాత్రి కార్పొరేషన్ కో–ఆప్షన్ సభ్యుడు ఆనూ ఇంటిపై మొహాలకు ఖర్చీఫ్‌లు కట్టుకుని రాళ్ల దాడికి దిగిన విషయం తెలిసిందే. ఇదేరోజు అర్ధరాత్రి చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (చుడా) మాజీ చైర్మన్ పురుషోత్తంరెడ్డి ఇంటిపైకి టీడీపీ కార్యకర్తలు వెళ్లారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో బయట పార్కింగ్ చేసివున్న స్కార్పియో కారును ధ్వంసం చేసి పారిపోయారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని ఎస్ఆర్.పురం మండలానికి చెందిన తులసీరామ్ (రాజు) అనే వ్యక్తిని చిత్తూరుకు చెందిన టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. రాజుకు చెందిన ఓ లారీను సైతం చోరీ చేశారు. రాజును కిడ్నాప్ చేసి, మురకంబట్టులోని ఓ నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లిన టీడీపీ నేతలు కర్రలు, పైపులతో తీవ్రంగా కొట్టారు. బాధితుడిని మోకాళ్లపై కూర్చోబెట్టి దాదాపు 30 మంది వరకు టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడగా.. కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తీవ్రంగా గాయపడ్డ రాజును స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి్పంచారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి, చోరీకి గురైన లారీని స్వాదీనం చేసుకున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడిఅన్నమయ్య జిల్లా తిమ్మాపురంలో టీడీపీ దుశ్చర్య కేవీ పల్లె: టీడీపీ వర్గీయుల దాడిలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన అన్నమయ్య జిల్లా కేవీ పల్లె మండలం తిమ్మాపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త విశ్వనాథ్ (33) ఇంటిపై టీడీపీ వర్గీయులు బుధవారం రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో విశ్వనాథ్ తలకు గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో పీలేరు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రహీముల్లా తెలిపారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామన్నారు.చెత్త వేయొద్దన్నందుకు టీడీపీ వర్గీయుల దాడి తండ్రీ, కొడుకులకు తీవ్ర గాయాలు పలమనేరు(చిత్తూరు జిల్లా): తమ ఇంటి ముందు చెత్త వేయొద్దన్నందుకు ఆగ్రహించిన టీడీపీ వర్గీయులు ఇంటి యజమానులపై నకుల్ డస్టర్‌తో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన బుధవారం పలమనేరు మండలంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ముడివారిపల్లికి చెందిన కృష్ణమూర్తి, వరదరాజులు కుటుంబాలు పక్కపక్కనే ఉంటున్నాయి. వీరికి తరచూ చెత్త విషయంగా వాగ్వాదాలు జరిగేవి. ఈ నేపథ్యంలో కృష్ణమూర్తి ఇంటిముందు వరదరాజులు కుటుంబీకులు చెత్త వేయడంతో వారు ప్రశి్నంచారు. దీనిపై మండిపడిన వరదరాజులు కుమారుడు ఇంట్లో దాచిన నకుల్ డస్టర్‌ను చేతికి తొడుక్కుని కృష్ణమూర్తి(47) ఆయన కుమారుడు పురుషోత్తం (18)పై దాడిచేసి గాయపరిచాడు. వీరిని స్థానికులు పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
చిరుత చిక్కింది..
-
బౌన్సర్లతో పోలింగ్ వద్ద టీడీపీ అభ్యర్థి థామస్ హల్ చల్
-
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
-
జగనన్న సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది..175/175 పక్కా
-
చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
చిత్తూరు జిల్లా, సాక్షి: ‘‘ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్.. జగన్‌కు ఓటేస్తే.. పథకాలు కొనసాగింపు.. పొరపాటున బాబుకు ఓటేస్తే.. పథకాలు ముగింపేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శనివారం మధ్యాహ్నం పలమనేరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతుందన్నారు.‘‘పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. కొండచిలువ నోట్లో తలపెట్టినట్లే. చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. రూ.2 లక్షల 70వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం అందించాం. 59 నెలల్లోనే 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. పిల్లల చదువులు కోసం అమ్మఒడితో ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. మహిళల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాం’’ అని సీఎం జగన్ చెప్పారు‘‘రైతన్నల కోసం ఆర్బీకే వ్యవస్థ పనిచేస్తోంది. ఏ గ్రామానికి వెళ్లిన గ్రామ సచివాలయం కనిపిస్తోంది. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాం. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచిపనైనా గుర్తుకొస్తుందా?. మన ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎప్పుడైనా ఇచ్చారా అని అడుగుతున్నా.. 14 ఏళ్లు సీఎంగా చేశాను అంటాడు చంద్రబాబు. ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు అబద్దాలు, మోసాలతో వస్తున్నాడు’’ అని సీఎం జగన్ దుయ్యబట్టారు.‘‘రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?. ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?. ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?. అర్హులకు 3 సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?. రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నాడు.. చేశాడా?. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానన్నాడు.. చేశాడా?. సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?. ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చడా?. మళ్లీ ఈ మోసగాళ్లు సూపర్ సిక్స్, సెవెన్ అంటున్నారు. కేజీ బంగారం, బెంజ్‌కారు ఇస్తాననంటారు.. నమ్ముతారా?’’ అంటూ చంద్రబాబు మోసాలను సీఎం జగన్ ఎండగట్టారు.ప్రత్యేకహోదాను అమ్మేసిన బాబు లాంటి వ్యక్తిని ఎవరైనా నమ్ముతారా?• మోసగాళ్లతో మనం యుద్ధం చేస్తున్నాం• కొత్త హామీలతో మోసం చేసేందుకు మళ్లీ ముగ్గురు కలిసి వస్తున్నారు• 14 ఏళ్లపాటు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క మంచైనా చేశాడా?• అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు, మోసాలు• అధికారం దక్కిన తర్వాత చంద్రబాబు చంద్రముఖి మారిపోతాడు• బాబు తన హయాంలో పేద ప్రజలకు ఒక్క సెంటు భూమైనా ఇచ్చాడా? • ఈ 59 నెలల పాలనలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం• మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసే సాంప్రదాయాన్ని పూర్తిగా మార్చేశాం• మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి 99 శాతం అమలు చేశాం• 59 నెలల పాలనలో రూ.2.70 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ• ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయిస్తాయి• చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే• మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది• గ్రామ సచివాలయాల్లో ప్రజలకు 600 రకాల సేవలు అందుతున్నాయి• వర్షం రూపంలో దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తున్నారని భావిస్తున్నా -
ఈ దొంగల్ని నమ్మొద్దు
చిత్తూరు రూరల్(కాణిపాకం): కొత్త వలంటీర్ల పేరుతో తెలుగుదేశం పార్టీ సరికొత్త మోసానికి తెరతీసింది. ఇటీవల రాజీనామా చేసిన వలంటీర్ల స్థానంలో తమ పార్టీకి చెందిన కొందరు యువకులను గ్రామాల్లోని పేదల ఇళ్లకు పంపిస్తోంది. వారి ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోంది. చిత్తూరు రూరల్ మండలంలో ఈ నయా మోసం వెలుగులోకి వచ్చింది. ఇటీవల చిత్తూరు మండలంలో చాలామంది వలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. దీనిని ఆసరాగా చేసుకుని స్థానిక టీడీపీ నేతలు కొందరు యువకులను ఎంపిక చేసి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్లుగా మిమ్మల్నే నియమిస్తామని నమ్మబలికారు. వారికి వలంటీర్లు ఎలాంటి సేవలు అందిస్తారనే విషయంపై శిక్షణ ఇచ్చారు. అనంతరం 50 ఇళ్లకు ఒకరిని చొప్పున పంపించారు. ఇక వారు పేదల ఇళ్లకు వెళ్లి ‘తాము కొత్త వలంటీర్లం. ఇక వచ్చేది టీడీపీ. కాబట్టి టీడీపీకి ఓటు వేయండి. లేకపోతే ఏ పథకం రాదు..’ అని బెదిరిస్తున్నారు. టీడీపీ కరపత్రాలు చూపిస్తూ పింఛన్లు, ఇంటి స్థలం.. అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పేదల అవసరాలను గుర్తించి ఆర్థికంగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. టీడీపీ ఆడుతున్న ఈ కొత్త వలంటీర్ల డ్రామాపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ ఎటువంటి మోసాలకైనా పాల్పడుతుందనేందుకు కొత్త వలంటీర్ల డ్రామా ఒకటని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి దొంగలను నమ్మరాదన్న భావనను వారు వెలిబుచ్చారు. దీనిపై కొందరు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
చిత్తూరులో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి ఎంసీ విజయానంద రెడ్డి నామినేషన్
-
వన్స్ మోర్ జగన్..
(మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : ‘అవ్వా.. చెప్పులేసుకో. లేదంటే కాళ్లు కాలుతాయి’ అని మనువరాలు చెబుతున్నా వినిపించుకోకుండా.. ‘ఆ చెప్పులతోనేమి.. బిర్నా రా ఆ సామి వెళ్లిపోతాడేమో’ అంటూ వృద్ధురాలు అలివేలమ్మ వేగంగా పొలంలో నుంచి రోడ్డు మీదకు వచ్చింది. అటుగా బైక్ మీద వెళుతున్న వ్యక్తిని ఆపి.. ‘ఎంత వరకు వచ్చాడు?’ అని ఆరా తీసింది. ఇంకా రాలేదు.. వస్తున్నాడని చెప్పి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. ఈ లోపు మనవరాలు అలివేలమ్మ దగ్గరకు వచ్చి.. ‘చెబితే వినవు.. సీఎం జగన్ రావడానికి ఇంకా చానాసేపు పడుతుంది. చెట్టునీడకు రా..’ అని పిలవగా.. ‘ఉదయం నుంచి ఎదురు చూస్తున్నా.. కొద్దిసేపు ఇక్కడ నిలబడితే ఏం కాదులే.. ఐదేళ్ల క్రితం ఇదే దారిలో వెళుతుంటే కలిశాను. అధికారంలోకి వస్తావ్ అని అప్పట్లో చెప్పాను.. అనుకున్నట్టే సీఎం అయ్యాడు. మాటిచ్చినట్టే ఇంటి దగ్గరకే పెన్షన్ పంపాడు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు వస్తున్నాడు. మళ్లీ నువ్వే అధికారంలోకి వస్తావ్ అని ఆ సామికి చెబుతానమ్మి..’ అంటూ అవ్వబదులిచ్చింది. చిత్తూరు జిల్లా సదుం ఎస్టీ కాలనీకి చెందిన ఎం.మునెమ్మకు వందేళ్లు ఉంటాయి. స్వతహాగా నడవలేదు, నిల్చోలేదు. అయినప్పటికీ ఎంతో ఓపికగా ఉదయం నుంచి సదుం నుంచి కల్లూరుకు వెళ్లే రహదారి పక్కన కుర్చీలో కూర్చుని ఉంది. ఎక్కువసేపు నువ్ కూర్చోలేవ్ ఇంట్లో పడుకుందువ్ రా.. అని మనవడు పిలిచినా వినడం లేదు. ఆమె గంటల తరబడి అక్కడే వేచి ఉండటానికి కారణం ఏంటని ఆరా తీస్తే.. ఈ రోడ్డు మీదుగా సీఎం జగన్ వస్తున్నారని, ఆయన్ని ఓ సారి చూద్దామని ఎదురు చూస్తోందని ఆమె మనవడు తెలిపాడు. ఇలా అలివేలమ్మ, మునెమ్మల తరహాలో ఎందరో వృద్ధులు.. మహిళలు, వికలాంగులు, విద్యార్థులు, రైతులు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా గంటల తరబడి రోడ్లపై బారులు తీరి తమ అభిమాన నాయకుడిని చూడటానికి పోటీపడ్డారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా తమకు అండగా నిలిచిన నేతను కళ్లారా చూసి ఉబ్బితబ్బిబ్బయ్యారు. ‘తమను అన్ని విధాలుగా ఆదుకున్న మీకే మా మద్ధతు.. ఎన్ని జెండాలు జత కట్టినా మరోసారి చంద్రబాబు మా చేతుల్లో చిత్తవ్వడం ఖాయం’ అని సీఎం జగన్‌కు ప్రజలు తేల్చి చెప్పారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ‘మేమంతా సిద్ధం’ అంటూ బస్సు యాత్ర నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి చిత్తూరు, తిరుపతి జిల్లాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పుంగనూరు నియోజకవర్గం అమ్మగారిపల్లెలో బస శిబిరం నుంచి బుధవారం ఉదయం 9.45 గంటల ప్రాంతంలో ఏడో రోజు యాత్రను ప్రారంభించారు. శిబిరం నుంచి బయటకు వస్తుండగానే అమ్మగారిపల్లె గ్రామస్తులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చిన మహిళలు బంతి పూల వర్షం కురిపించారు. మంగళ హారతులు పట్టి జననేతపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం సదుంలోకి ప్రవేశించిన సీఎంకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనసందోహం ఆత్మీయ స్వాగతం పలికింది. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం కల్లూరు వైపు బయలుదేరిన రోడ్‌షోకు మార్గంమధ్యలో వివిధ గ్రామాల ప్రజలు సంఘీభావం తెలిపారు. పెత్తందార్లకు ఓటు వేయం... బహిరంగ సభ అనంతరం పి.కొత్తకోట, పాకాల క్రాస్, గాదంకి, ఐతేపల్లి క్రాస్, చంద్రగిరి క్రాస్, రేణిగుంట మీదుగా రాత్రి 9 గంటలకు గురువరాజుపల్లెలో ఏర్పాటు చేసిన బస శిబిరానికి సీఎం జగన్ చేరుకున్నారు. బెంగళూరు–తిరుపతి జాతీయ రహదారిపై యాత్రగా వెళుతున్న సీఎం జగన్‌కు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. ప్రజాభిమానం అడ్డు పడటంతో నిర్ధేశించిన షెడ్యూల్ కంటే ఎంతో ఆలస్యంగా యాత్ర సాగినప్పటికీ.. ప్రజలు మాత్రం ఎంతో ఓపికగా సీఎం రాక కోసం వేచి ఉన్నారు. అభిమాన నేతను చూసి ఎంతో సంతోషపడ్డారు. రోడ్లపై బారులు తీరిన వారిలో ఎవ్వరిని కదిలించినా.. ‘వన్స్‌మోర్ సీఎం జగన్’ అన్న నినాదమే వినిపించింది. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న నేత వైఎస్ జగన్‌కు కాకుండా.. పెత్తందారులకు కొమ్ముకాసే చంద్రబాబు, ఆయన తొత్తులకు ఏ విధంగా ఓటు వేస్తాం అంటూ ప్రజలు గర్జించారు. చంద్రగిరి నియోజకవర్గానికి ముందే ఉగాది పుంగనూరు నియోజకవర్గం నుంచి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించిన సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. దామలచెరువులో సంబరాలు అంబరాన్ని అంటాయి. సీఎం రాక నేపథ్యంలో చంద్రగిరి నియోజకర్గ ప్రజలకు ముందే ఉగాది పండుగను తెచ్చిపెట్టాయి. దామలచెరువులో ఊరంతా అరటి ఆకులు, మామిడి తోరణాలతో శోభాయమానంగా అలంకరించి, సుమారు 20 క్రేన్లతో భారీ గజమాలలతో సీఎంకు ఘన స్వాగతం పలికారు. అక్కచెల్లెళ్లు సీఎంకు హారతులు పట్టి, గుమ్మడికాయలతో దిష్టి తీశారు. కోలాటం, చెక్కభజన సహా వివిధ కళారూపాలతో మహిళలు పలికిన ఆత్మీయ స్వాగతం అబ్బుర పరిచింది. ఎర్రటి ఎండను ఏ మాత్రం లెక్క చేయకుండా వేల సంఖ్యలో ప్రజలు దామలచెరువుకు చేరుకున్నారు. రోడ్డు అంతా జనాలతో కిటకిటలాడింది. మధ్యాహ్నం ఒంటి గంట దాటాక దామలచెరువు చేరుకున్న సీఎం.. ఎరట్రి ఎండలోనే బస్ పైకి ఎక్కి ఊరంతా రోడ్ షో నిర్వహించారు. సీఎం కాన్వాయ్‌తో పాటు సమాంతరంగా నడుస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తెచ్చుకోవడానికి మేమంతా సిద్ధం అంటూ ప్రజలు నినదించారు. అనంతరం పూతలపట్టుకు పయనమైన సీఎంకు దారిపొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఐరాల మండలం గుండ్లపల్లి, కొలకలతో పాటు వివిధ గ్రామాల ప్రజలు యాత్రకు సంఘీభావం తెలిపారు. పూతలపట్టు నియోకవర్గం తేనెపల్లి వద్ద సీఎం జగన్ భోజన విరామ శిబిరానికి చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో విరామ శిబిరం నుంచి బస్సు యాత్ర ప్రారంభించి, రంగంపేట క్రాస్ మీదుగా పూతలపట్టు బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. నేను విన్నాను.. నేను ఉన్నాను చిత్తూరు జిల్లా మండల కేంద్రమైన సదుం గ్రామానికి చెందిన 23 ఏళ్ల ముఖేష్ రెండేళ్ల కిందట పెరాలసిస్‌కు గురయ్యాడు. చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకువస్తున్న తల్లిదండ్రులకు ముఖేష్ వైద్య ఖర్చులు తలకు మించిన భారం అయ్యాయి. అతని వైద్యానికి మరో రూ.15 లక్షలు అవసరం అవుతాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సీఎంను కలిస్తే తప్పక తమకు సహాయం దొరుకుతుందని ముఖేష్ తల్లి నమ్మింది. ఈ నేపథ్యంలో మేమంతా సిద్ధం యాత్రలో సదుం వద్ద ముఖేష్ కుటుంబం ముఖ్యమంత్రిని కలిసింది. సీఎం జగన్ వారిని బస్సు వద్దకు పిలిపించుకుని ముఖేష్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. కచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. ముఖేష్ వివరాలను తీసుకోవాలని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అధికారులను సూచించారు. వైఎస్ జగన్ ఇచ్చిన భరోసాతో తమ బిడ్డకు వైద్యం అంది, మామూలు మనిషి అవుతాడనే నమ్మకం కలిగిందని ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. అభిమానం చాటుకున్న ముస్లిం మైనార్టీలు ఎన్నో పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచి, ఆ వర్గాలకు రాజకీయంగా తగు ప్రాధాన్యం ఇచ్చిన సీఎం జగన్ తమ ఊరికి వస్తుండటంతో తెల్లవారుజాము నుంచే కల్లూరు గ్రామంలో సందడి నెలకొంది. సీఎం జగన్ గ్రామానికి చేరుకోగానే మైనార్టీ సోదరులు, అక్కచెల్లెమ్మలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. మత పెద్దలు ముస్లిం సంప్రదాయం ప్రకారం సీఎంకు శాలువ కప్పి, హిమామ్ జామీన్ కట్టి ప్రార్థనలు నిర్వహించి, ఆశీర్వదించారు. అనంతరం బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు నమస్కరిస్తూ ముందుకుసాగారు. ఆ తర్వాత కల్లూరు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన కురుబ సామాజికవర్గం ఆత్మీయ సమావేశానికి సీఎం హాజరయ్యారు. -
సీఎం జగన్ డైనమిక్ ఎంట్రీ @ పూతలపట్టు
-
చిత్తూరులో సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర దృశ్యాలు
-
99 మార్కులు సాధించిన స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా..?
-
సీఎం జగన్ డైనమిక్ ఎంట్రీ దద్దరిల్లిన మదనపల్లె సభ
-
జన సంద్రమైన మదనపల్లె
-
రెండు బటన్లు నొక్కి.. వైఎస్సార్సీపీకి అండగా నిలవాలి: మంత్రి రోజా
సాక్షి, చిత్తూరు: ప్రజల వద్దకే పాలన వాలంటరీ వ్యవస్థ ద్వారా సాధ్యమైందన్నారు మంత్రి రోజా. సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారం చూపించే విధంగా వాలంటరీ వ్యవస్థ పనిచేస్తుందని ప్రశంసించారు. రోజుల తరబడి పెన్షన్ కోసం ఎదురుచూసే రోజులు పోయాయని.. ప్రతినెల ఒకటో తేదిన ఉదయానికే వాలంటీర్లు పెన్షన్ అందిస్తున్నారని తెలిపారు. పూత్తురు రూరల్ పరమేశ్వర మంగళం, తిరుమల కుప్పంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా, సచివాలయం, వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలను మంత్రి రోజా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల కోసం ఎన్నో బటన్లు నొక్కాడని.. 2024లో మీరు(ప్రజలు) తమ కోసం రెండు బటన్లు నొక్కాలని తెలిపారు. మొదటి బటన్ ఎమ్మెల్యేకు, రెండవది ఎంపీ నొక్కి వైఎస్సార్సీపీకి అండగా నిలవాలని కోరారు. ప సమస్యల పరిష్కారం కోసం ప్రజలు మండల స్థాయికే వెళ్లే పని లేకుండా ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా సమస్యకు పరిష్కారం అందుతోందని మంత్రి రోజా అన్నారు. ఇంటి వద్దే అర్హులను గుర్తించి స్వయంగా లబ్ధిదారుల అకౌంట్లోకి రుణాన్ని పొందడం జరుగుతుందన్నారు. ఏదైనా ప్రకృతి విపత్తు వల్ల రైతులకు నష్టం జరిగితే రైతు భరోసా కేంద్రాల ద్వారా గుర్తించి రైతులకు సాయం అందుతోందని తెలిపారు. చదవండి: పార్లమెంట్‌లోకి స్లిప్పులు పంపిన చరిత్ర బాబుది: కేశినేని నాని ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా రోగాన్ని గుర్తించి మెరుగైన వైద్యం కోసం సిఫార్సు మేరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నామని రోజా తెలిపారు. సీఎం జగన్ గొప్ప గొప్ప వ్యవస్థలను నెలకొల్పాడని, ఇలాంటి సౌకర్యవంతమైన పరిపాలన ఎవరైనా అందించారా అనేది ప్రజలు ఆలోచించాలని సూచించారు. నాడు నేడు కింద పాఠశాలలను మెరుగుపరిచి కార్పొరేట్ స్థాయిలో ఉన్నత విద్యను తీసుకు రావడం వల్ల పిల్లలు చదువులు చక్కబడ్డాయని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వ పాఠశాలల పిల్లలు స్టేట్ ర్యాంకుల స్థాయికి ఎదిగారని అన్నారు. విద్యలో జగనన్న తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రతి కుటుంబంలో ఏదో ఒక విధంగా లబ్ధి అందించే సహాయ సహకారాలను ప్రజలు గమనించాలని ప్రజలు అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. -
భువనేశ్వరి భజన
చిత్తూరు అర్బన్: చిత్తూరులో ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం పచ్చ రంగు పూసుకుంది. తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులను టీడీపీ నేత నారా భువనేశ్వరి కార్యక్రమానికి వెళ్లాలని ఒత్తిడి తీసుకొచ్చింది. ర్యాలీకి వెళ్లకపోతే ఆబ్సెంట్ వేస్తామని, ఇంటర్నెల్ మార్కులు కట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడింది. కళాశాల యాజమాన్యం చేష్టలకు విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కళాశాల గుర్తింపు రద్దు చేయాలని ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. స్పందన లేకే... చిత్తూరు నగరంలో నారా భువనేశ్వరి చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఇలా అయితే చిత్తూరు టికెట్ ఆశిస్తున్న తన పరువుపోతుందని టీడీపీ నేత విజయం కళాశాల నిర్వాహకులను సంప్రదించి విద్యార్థులను పంపాలని కోరారు. అడిగిందే అదునుగా విద్యార్థుల అభిప్రాయాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోని కళాశాల నిర్వాహకుడు ఉన్నపళంగా విద్యార్థులకు ఆదేశాలిచ్చేశాడు. కళాశాలలో చదువుతున్న 500 మందికి పైగా విద్యార్థులు భువనేశ్వరికి స్వాగతం పలుకుతూ రోడ్డుకిరువైపులా నిలబడాలని హుకుం జారీ చేశాడు. కొందరు విద్యార్థినిలు ఆరోగ్యం బాగోలేదని చెబుతున్నా పట్టించుకోకుండా కళాశాల నిర్వాహకుడు ఒత్తిడి చేసి రోడు్డపై నిలబెట్టాడు. మరికొందరు విద్యార్థులు రాజకీయ కార్యక్రమాల్లో తాము వెళ్లినట్టు తమ తల్లిదండ్రులకు తెలిస్తే మందలిస్తారని చెప్పినా వినిపించుకోకుండా ర్యాలీకి వెళ్లితీరాల్సిందేనని పట్టుబట్టారు. వెళ్లని వారికి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు కట్ చేస్తానని, ఆబ్సెంట్ వేస్తానని బ్లాక్మెయిల్ చేశారు. దీంతో విద్యార్థులు చేసేది లేక దాదాపు మూడు గంటల పాటు చిత్తూరు పీసీఆర్ కూడలిలోని రోడ్లపై నిలబడ్డారు. ఓ వైపు ఎండలు మండిపోతుంటే కళాశాల యాజమాన్యం కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. గతంలోనూ ఇదే తీరు విజయం విద్యా సంస్థలకు ఇలాంటి ఘటనలు కొత్తేమీకాదు. గతంలో లోకేష్ యువగళం కార్యక్రమానికి సైతం విద్యార్థులను ఒత్తిడి చేసి పంపించారు. నో డ్రగ్స్ పేరిట టీడీపీ నేతలు చిత్తూరులో నిర్వహించిన ర్యాలీకి కూడా టీడీపీ జెండాలు పట్టుకుని రోడ్లపై వెళ్లాల్సిందేనంటూ బ్లాక్మెయిల్ చేశారు. దీనిపై అప్పట్లో కళాశాల యాజమాన్యంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నిర్వాహకుడు విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాడు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కావని హామీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా భువనేశ్వరి కార్యక్రమానికి విద్యార్థులను పంపడంతో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. విద్యార్థులను బెదిరింపులకు గురిచేసి, రోడ్లపై నిలబెట్టడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదుచేసి, కళాశాల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. -
చంద్రబాబు డర్టీ పొలిటీషియన్: మంత్రి రోజా
సాక్షి, చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డర్టీ పొలిటీషియన్ అంటూ మండిపడ్డారు మంత్రి ఆర్కే రోజా. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాడని ధ్వజమెత్తారు. మొన్నటి వరకు రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకున్న చంద్రబాబు. ఇప్పుడేమో మోదీ, అమిత్ షా కాళ్లు పట్టుకుంటున్నాడంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్ లాంటి నాన్ లోకల్ పొలిటిషియన్లకు ప్రజలే తగిన బుద్ది చెప్తారన్నారు. సంక్షేమ రాష్ట్రంగా సీఎం జగన్ ఏపీని ముందుకు నడిపిస్తున్నారన్న మంత్రి రోజా. తండ్రి బాటలోనే సీఎం జగన్ మైనారిటీలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. తండ్రి అడుగు జాడల్లో ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి రూ. 80 వేలు అందిస్తున్నారని, మైనారిటీ పక్షపాతిగా వక్ఫ్ బోర్డు స్థిర చర ఆస్తులు రక్షణకు అండగా నిలుస్తున్నారన్నారు. వైఎస్సార్ షాదీ తోఫా కింద లక్ష రూపాయలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. డిప్యూటీ సీఎం, శాసనమండలి డిప్యూటీ చైర్మన్లతోపాటు 2024 ఎన్నికల్లో ఏడుగురు మైనార్టీలకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారన్నారు. తమ నియోజకవర్గంలో కోటి 85లక్షలతో షాది మహల్ నిర్మాణం చేయడంతోపాటు మసీదుల మరమ్మత్తులకు రూ. 2 కోట్లు కేటాయించారని తెలిపారు. మీరా సాహెబ్‌పాలెం గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. -
అసలు చిత్తూరు టీడీపీలో ఏం జరుగుతోంది!
యూజ్ అండ్ త్రో పాలసీకి పేటెంట్‌దారుడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. జిల్లా ఏదైనా.. నియోజకవర్గం ఏదైనా డబ్బు సంచులు తెచ్చేవారికే టిక్కెట్ ఇస్తారనేది అందరికీ తెలిసిన సత్యమే. ఇదే వ్యవహారం చిత్తూరు నియోజకవర్గంలో కాక రేపుతోంది. కష్టకాలంలో పార్టీకోసం పనిచేసినవారిని కాదని.. డబ్బులిస్తారని ఎవరో ఒకరికి టిక్కెట్ ఇస్తే సహించేది లేదని అక్కడి నేతలు తేల్చి చెబుతున్నారు. కొత్తవారికి ఇస్తే మరోసారి ఓటమి ఖాయమని అధినేతకు తెగేసి చెప్పేస్తున్నారు. అసలు చిత్తూరు టీడీపీలో ఏం జరుగుతోందో చూద్దాం. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం టిడిపిలో అయోమయం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారో తెలియక పార్టీ క్యాడర్ ఆందోళనకు గురవుతోంది. స్థానిక నేతలకు బదులుగా వేరే నియోజకవర్గానికి చెందిన నేతను అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీ నాయకత్వం యోచిస్తుండడం టిడిపి శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. గత నాలుగున్నర సంవత్సరాలుగా చిత్తూరులో టిడిపి వ్యవహారాలను కాజూరు బాలాజీ చూస్తున్నారు. తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఆయన పని చేసుకుంటూ పోతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయనే టాక్ నడుస్తోంది. బాలాజీ స్థానంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి గురజాల జగన్మోహన్ అభ్యర్థిత్వాన్ని మొదట టిడిపి అధిష్టాన వర్గం పరిశీలించిందట. అయితే ఇప్పుడు కొత్తగా టీఎన్ రాజన్ అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు. గురజాల జగన్మోహన్ బెంగళూరులో ఉంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నాడు. కొద్ది నెలలుగా చిత్తూరులో పర్యటిస్తూ అసెంబ్లీ టిక్కెట్ తనకే వస్తుందని అనుచర గణం వద్ద చెప్పుకుంటున్నారట. అలాగే తిరుచానూరుకు చెందిన మాజీ సర్పంచ్ టిఎన్ రాజన్ రెండు మూడు వారాలుగా చిత్తూరుకు వచ్చి తనకే టికెట్ వస్తుందని తన సామాజిక వర్గం వద్ద గట్టిగా చెబుతున్నాడట. చిత్తూరు అభ్యర్థిగా రోజుకో పేరు ప్రచారంలోకి వస్తుండటంతో టీడీపీ కేడర్‌లో అయోమయం ఏర్పడింది. అయితే పార్టీ నాయకత్వం మాత్రం ఇప్పటివరకు చిత్తూరు విషయంలో క్లారిటీ ఇవ్వడంలేదు..ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టడంలేదట. దీంతో ఎవరికి వారే తమకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నట్లు పార్టీలోనే చర్చ జరుగుతోంది. టీడీపీ అగ్ర నాయకత్వమే అభ్యర్థి విషయంలో గందరగోళానికి తావిస్తోందని, ఎలాగూ ఓడిపోయే సీటే గనుక పార్టీ పెద్దగా సీరియస్‌గా తీసుకోవడంలేదేమో అని కూడా కార్యకర్తలు సందేహిస్తున్నారు. టికెట్ విషయంలో ఎవరో ఒకరు తేల్చుకున్న తర్వాత చూద్దాంలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చదవండి: టీడీపీతో పొత్తు కోసం ఆ నలుగురు నేతలు పాట్లు..! -
సామాజిక జైత్రయాత్ర: వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించిన మంత్రులు
-
నేడు చిత్తూరు జిల్లా పలమనేరులో సాధికార బస్సు యాత్ర
-
చిత్తూరు: ఏనుగుల గుంపు హల్చల్.. టెన్షన్లో ప్రజలు!
సాక్షి, కుప్పం: చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. కర్ణాటక సరిహద్దుల్లో 70 ఏనుగుల గుంపు హల్చల్ చేసి కుప్పం వైపు దూసుకొస్తున్నట్టు కర్ణాటక ఫారెస్ట్ అధికారులు తెలిపారు. దీంతో, ఏపీ సరిహద్దు ప్రాంత అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజల్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు.. గ్రామ సరిహద్దులోను, పొలాల్లో రాత్రి పూట ప్రజలు ఉండకూడదని హెచ్చరికలు ముందస్తుగా జారీ చేసి, గ్రామాల్లో ఏనుగులు కంట పడితే వెంటనే సంబంధిత పారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇక, ఫారెస్ట్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. -
మిస్టరీగా ఇంటర్ విద్యార్ధిని భవ్యశ్రీ అనుమానాస్పద మృతి
సాక్షి, చిత్తూరు జిల్లా: ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీగా మారింది. న్యాయం కోసం పెనమూరు పీఎస్ ఎదుట బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం ఆందోళన చేపట్టారు. కాగా వేణుగోపాలపురానికి చెందిన భవ్యశ్రీ ఈ నెల 17న అదృశ్యమైంది. 18వ తేదీన విద్యార్ధిని తండ్రి మునికృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. 20న ఎగువ చెరువు వద్ద బావిలో భవ్యశ్రీ శవమై కనిపించింది. పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా పోస్టుమార్టంలో ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవని ప్రాథమికంగా తెలిసిందని ఎస్ఐ అనిల్‌కుమార్ తెలిపారు. అఘాయిత్యం జరిగిందా, విషప్రయోగం జరిగిందా అని పరీక్షించేందుకు సాంపిల్స్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయిందా? ఎక్కడి నుంచి అయినా తెచ్చి ఆమె మృతదేహాన్ని బావిలో పడేశారా అన్న విషయం తేల్చేందుకు స్టెరమ్‌బోన్ సాంపిల్స్‌ను కెమికల్ అనాలసిస్ కోసం తిరుపతి ఆర్ఎఫ్ఎస్ఎల్కు పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఆ నివేదికలు వచ్చిన అనంతరం అనుమా నితులను సమగ్రంగా, నిష్పాక్షికంగా విచారిస్తామన్నారు. విచారణను తప్పుదారి పట్టించేలా అసత్య ప్రచారాలను, నిరాధార వార్తలను ప్రచారంచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చదవండి: రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, ఆర్ఐ -
తీపి మామిడి పండ్ల తక్కువ ధరలో..!
-
విద్యాదీవెన పిల్లల భవిష్యత్తు మారుస్తుంది: సీఎం జగన్
సాక్షి, నగరి, చిత్తూరు: విద్యా దీవెన పిల్లల భవిష్యత్తు మార్చబోయే పథకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఉన్నత చదువులకు 100 శాతం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. సోమవారం నగరిలో బటన్ నొక్కి విద్యాదీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ పథకంలో భాగంగా ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. చదువు కోసం తల్లిదండ్రులు అప్పులపాలవకూడదని అన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ, 15,600 కోట్లు అందించామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యాదీవెన కింద 26,98,728 మంది పిల్లలకు మంచి చేస్తూ రూ. 11, 317 కోట్లు అందించామని పేర్కొన్నారు. నేడు 8, 44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 680 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. విద్యా రంగంలో అనేక సంస్కరణలు అమలు చేశామని సీఎం పేర్కొన్నారు. అమ్మ ఒడి ద్వారా ప్రతి విద్యార్థికి రూ, 15 వేల అందించామని తెలిపారు. స్కూళ్లు ప్రారంభించే నాటికే విద్యాకానుక అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నామని. బైజూస్ కంటెంట్‌తో విద్యార్థులకు బోధన అందిస్తున్నామన్నారు. పేదరికం విద్యార్థుల చదవులకు అడ్డు రాకూడదన్నారు. విద్యాసంస్థల్లో అక్రమాలుంటే 1902కు కాల్ చేయాలని తెలిపారు. సీఎం జగన్ ప్రసంగం.. ఆయన మాటల్లోనే! ►ప్రతి పేద కుటుంబం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్‌లో ఇంకా బాగుండాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం 4 సంవత్సరాల ప్రయాణంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ►ప్రతి అడుగూ కూడా ప్రతి పిల్లాడినీ చేయి పట్టుకొని పెద్ద చదువులు చదివించి తద్వారా పిల్లలు పేదరికం నుంచి బయటకు రావాలని అడుగులు వేస్తున్నాం. ► 17-20 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు నేటి తరం మరో 80 ఏళ్ల పాటు ఆత్మవిశ్వాసంతో ప్రపంచంలో బతకాలంటే వాళ్ల ప్రయాణాన్ని జీవిత ప్రమాణాన్ని ఈ రెంటింటినీ మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందని నమ్మాం. ►పిల్లల చదువుల కోసం వేగంగా అడుగులు వేస్తున్నాం. ►ప్రతి పేద కుటుంబం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని ఫీజులు పూర్తిగా తల్లుల ఖాతాల్లోకి వేసే కార్యక్రమం జగనన్న విద్యా దీవెన. ► భోజనం, వసతి ఖర్చులకు తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని జగనన్న వసతి దీవెన తీసుకొచ్చాం. 3 నెలలకొసారి తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లాలి. ►ఐటీఐ విద్యార్థులకు 10 వేలు, పాలిటెక్నిక్ పిల్లాడికి 15 వేలు, డిగ్రీ, మెడిసిన్, ఇంజనీరింగ్ పిల్లలకు సంవత్సరానికి 20 వేల చొప్పున పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ►జగనన్న వసతి దీవెన అనే ఒక్క పథకం ద్వారా మాత్రమే రూ.4,275 కోట్లు పెద్ద చదువుల కోసం తల్లుల ఖాతాల్లోకి జమ చేశాం. ►కేవలం ఈ రెండు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా 4 సంవత్సరాల కాలంలోనే రూ.15,600 కోట్లు ఇచ్చాం. ►ఫీజులు మొత్తం నేరుగా కాలేజీలకే ఇవ్వకుండా పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతోంది. ►ప్రతి 3 నెలలకు ఒకసారి తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లాలి. పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకోవాలి. ► ఆ కాలేజీలో విద్యా బోధన బాగాలేకున్నా, వసతులు సరిగ్గా లేకున్నా వాటిపై ఆ కాలేజీల యాజమాన్యాలను ప్రశ్నించే హక్కు ఆ పిల్లల తల్లిదండ్రులకు ఇస్తున్నాం. ఫిర్యాదుల కోసం 1902కు కాల్ చేయండి ►ఏవైనా వసతులు బాగోలేకున్నా, బోధన బాగోలేకున్నా, పిల్లలకు ఇవాళ ఇస్తున్న డబ్బు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ కాక కాలేజీ యాజమాన్యాలు వేరే రకంగా ఇంకో ఫీజు ఇంకొకటని ఫీజులు అడిగితే మాత్రం 1902కు ఫోన్ చేయండి. ► జగనన్నకు చెబుదాంకు ఫోన్ చేయండి. ► ముఖ్యమంత్రి కార్యాలయం, కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడుతుంది. ► ఇటువంటి తప్పిదాలు జరగకుండా కట్టడి చేస్తుంది. యాక్షన్ తీసుకుంటుంది. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ ►4 సంవత్సరాల కాలంలోనే ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం. ►తల్లిదండ్రులకు ఇబ్బందులు లేకుండా పిల్లలను చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి ఏటా 15 వేల చొప్పున అమ్మ ఒడి ఇస్తున్నాం. ►ప్రతి సంవత్సరం పిల్లలకు బ్యాగు బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫాం, షూస్ అన్నీ కలిపి విద్యా కానుకగా స్కూల్ తెరిచే రోజు ఇస్తున్నాం. ► స్కూళ్లను సమూలంగా రూపు రేఖలు మారుస్తూ, శిథిలావస్థలో ఉన్న స్కూళ్లకు గొప్ప వైభవం తీసుకొచ్చేందుకు నాడు-నేడు తీసుకొచ్చాం. ► గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం, బైలింగువల్ టెక్ట్స్ బుక్ లు తీసుకొచ్చాం. ►బైజూస్ కంటెంట్‌తో కూడా పిల్లల కరికులమ్‌ను అనుసంధానం చేశాం. ► 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ►మూడో తరగతి నుంచే టోఫెల్ ఓరియెంటేషన్ బోధన వచ్చే ఏడాది నుంచి ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నాం. ► సీబీఎస్ఈ సిలబస్‌తో ప్రారంభించి ఐబీ, ఐజీసీఎస్ఈ ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ దిశగా మన గవర్నమెంట్ బడులు వేగంగా అడుగులు వేస్తున్నాం. ► ఇంతకు ముందు రాష్ట్రంలో చూడని విధంగా, నాడు-నేడు కింద పూర్తి అయిన బడుల్లో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూములు డిజిటలైజ్ చేస్తున్నాం. ►ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ►63 వేల క్లాస్ రూములకు సంబంధించి 31 వేల క్లాస్ రూముల్లో ఏర్పాటయ్యాయి. ►డిసెంబర్ నాటికల్లా మిగిలిన క్లాస్ రూముల్లో ఏర్పాటవుతాయి. ► 8వ తరగతి పిల్లలకు చదువులను ప్రోత్సహిస్తూ, వాళ్లకు సులభంగా అర్థమయ్యేలా అనే తాపత్రయపడుతూ ట్యాబ్స్ ఇచ్చేందుకు మొదలుపెట్టాం. స్కూళ్లలో రోజుకో మెనూతో గోరుముద్ద ►గవర్నమెంట్ స్కూళ్లలో రోజుకో మెనూతో గోరుముద్ద కింద విపరీతమైన మార్పులు తెచ్చాం. ►పిల్లలు తింటున్న తిండి గురించి ఆలోచించిన చరిత్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా జరిగిందంటే అది మీ అన్న పరిపాలనలోనే. ► సంపూర్ణ పోషణ, స్కూళ్లలో ఆడ పిల్లల కోసం స్వేచ్ఛ తీసుకొచ్చాం. ► చదువులను ప్రోత్సహిస్తూ వివాహానికి ముందే 10 పాసై ఉండాలనే నిబంధన తీసుకొస్తూ వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా అమలు చేస్తున్నాం. ►ప్రతి ఒక్కరూ ఉన్నత విద్య చదవాలని పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తో విద్యా దీవెన తీసుకొచ్చాం. ► వసతి దీవెన తీసుకొచ్చాం. ► ప్రపంచంతో పోటీ పడుతూ విదేశాల్లో 21 ఫ్యాకల్టీల్లో 350 కాలేజీల్లో సీటు తెచ్చుకుంటే చాలు ఉన్నత విద్యకయ్యే ఖర్చు మొత్తం కోటీ 25 లక్షల దాకా ఫీజులను చెల్లిస్తున్న ప్రభుత్వం దేశంలో ఏదీ లేదు. మన రాష్ట్రంలో తప్ప. ►కరిక్యులమ్‌లో ఆన్ లైన్ వర్టికల్స్ తెచ్చాం. తప్పనిసరి ఇంటర్నషిప్ తెచ్చాం. ►కేవలం ఈ పథకాల మీద మీ అన్న ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.69,296 కోట్లు. మీ అన్న చదవిస్తాడని చెబుతున్నా ► ప్రతి కుటుంబం నుంచి ఇంజనీర్, డాక్టర్ రావాలి. ► మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతున్నా ఇబ్బంది పడకుండా పిల్లలను బడులకు, కాలేజీలకు పంపండి. ►విద్యా దీవెన, వసతి దీవెనలో ఎటువంటి కత్తిరింపులు లేవు. ►ప్రతి పిల్లాడికీ మీ అన్న, మీ తమ్ముడు చదివిస్తాడని చెబుతున్నా. ► పిల్లలు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతులకు ప్రతి సామాజిక వర్గానికి మంచి చేయాలని అడుగులు వేస్తున్నాం’ అని సీఎం జగన్ ప్రసంగించారు చదవండి: విద్యాదీవెనతో బాబు, పవన్‌కు మంచి చదువు చెప్పించాలి: రోజా సెటైర్లు -
TTD: ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు శ్రీవాణి ట్రస్ట్ నిధులను విడుదల
సాక్షి, తిరుపతి: ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు శ్రీవాణి ట్రస్ట్ నిధులను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) విడుదల చేసింది. టీటీడీ సహకారంతో 501 ఆలయాల నిర్మాణం, ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ఒక్కో ఆలయానికి రూ. 5వేలు కేటాయించింది. ఆగస్టు నెల కోసం మొత్తం రూ.25.05 లక్షలు విడుదల చేసింది. ఇక నుంచి ప్రతి నెల నిధులు విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. కాగా నేడు ఉదయం 10 గం.కు వసతిగదుల కోటా విడుదల చేయనుంది. ఆన్లైన్లో తిరుమల, తిరుపతిలో ఉన్న వసతిగదులను కోటా విడుదల చేయనుంది. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా.. - నిన్న శ్రీవారిని 67,308 మంది భక్తులు దర్శించుకున్నారు. -
పుంగనూరు కేసులో అదే కీలకాధారం: చిత్తూరు ఎస్సీ
సాక్షి, చిత్తూరు: పుంగనూరులో పోలీసులపై దాడి కేసుకు సంబంధించిన 500 మంది నిందితులను గుర్తించామని.. వీళ్లలో 92 మందికి ఇప్పటివరకు అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు వివరాలను సాక్షికి తెలిపారాయన. ‘‘ఫ్రీ ప్లాన్ గా పోలీసులపై దాడి చేశారు. ఈ విషయాన్ని ఈ కేసులో ప్రధాన నిందితుడైన పుంగనూరు టీడీపీ ఇంఛార్జి చల్లా బాబు పీఏ గోవర్ధన్ రెడ్డి, డ్రైవర్ నరీన్ కుమార్ రిమాండ్ రిపోర్ట్ లో అంగీకరించారు. ఈ కేసులో ఇదే కీలక ఆధారం. వీడియో పుటేజి ఆధారంగా మొత్తం 500 మంది నిందితులను గుర్తించాం, ఇప్పటి వరకు 92 మందిని అరెస్ట్ చేశాం, 408 మందిని ట్రేస్ చేయాల్సి ఉంది. ‘‘ఈనెల 1వ తేదీ నాడు పోలీసులు పై దాడికి ప్లాన్ చేశారు, ముందుగా సమావేశం అయ్యారు. అనుకున్న విధంగా ఈనెల 4వ తేదీన దాడి చేశారు,విధ్వంసం సృష్టించారు. పక్కాగా ప్రీ ప్లాన్డ్‌గానే ఈ దాడి చేశారు. నిందితులిద్దరూ రిమాండ్ రిపోర్ట్‌లో ఈ విషయాన్నే అంగీకరించారు. ప్రధాన నిందితుడు చల్లా బాబు దక్షిణాది రాష్ట్రాల్లో లొకేషన్స్ మారుస్తున్నారు. అయినా అతిత్వరలో అరెస్ట్ చేస్తాం. చల్లా బాబు హైకోర్టు లో బెయిల్ కోసం అప్లై చేస్తే.. న్యాయపరంగా ఎదుర్కొంటున్నాం అని ఎస్పీ రిషాంత్‌రెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: పవన్‌పై క్రిమినల్ కేసులో కీలక పరిణామం -
గుర్తించకపోయిన పర్లేదు అవహేళన చేయకండి : ఎస్పీ రిశాంత్ రెడ్డి
-
పుంగనూరు పోలీసులపై దాడి కేసు.. మరో 9 మంది అరెస్ట్
సాక్షి, చిత్తూరు జిల్లా: రాష్ట్రంలో సంచలనం కలిగించిన పుంగనూరు పోలీసులపై దాడి కేసులో మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మొత్తం ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 72కు చేరుకుంది. A1 ముద్దాయి అయిన పుంగనూరు టీడీపీ ఇంఛార్జి చల్లా బాబు పరారీలో ఉన్నారు. అతని కోసం ఆరు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దాడి జరిగిన రోజు ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో చెక్ పోస్ట్, టోల్ గేట్ వద్దనున్న సీసీ కెమెరాలు ద్వారా వాహనాలు నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.అనంతపురం, బెంగళూరు,రాయచోటి ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నాయకుల,కార్యకర్తల వివరాలు సేకరిస్తున్నారు. చదవండి: టీడీపీ రాక్షస క్రీడ సాక్షి, విజయవాడ: పుంగనూరులో చంద్రబాబు సృష్టించిన విధ్వంసకాండను ఖండిస్తూ పైపుల రోడ్డు సెంటర్లో నిరసన చేపట్టారు. నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిఫ్యూటీ మేయర్ శైలజారెడ్డి, వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పుంగనూరులో చంద్రబాబు పర్యటనలో టీడీపీ శ్రేణులు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రౌడీయిజం చేస్తూ దౌర్జన్యంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడని, ముందస్తుగా వ్యూహం పన్ని పోలీసులపై దాడులు చేసి పోలీసు వాహనాలను తగలబెట్టించాడని మండిపడ్డారు. ‘మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉందంటాడు. కానీ గత కొన్ని రోజులుగా చంద్రబాబు వైఖరి చాలా జుగుప్సాకరంగా ఉంది. అంజు యాదవ్ విషయంలో పవన్ పోలీసు యంత్రాంగం మొత్తాన్ని తప్పుబట్టాడు. పోలీసులపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తే ఎందుకు పవన్ ఖండించలేదని ప్రశ్నిస్తున్నా. ప్రతిపక్షాలు ప్రస్టేషన్ లో ఉన్నాయి. భవిష్యత్తులో గెలవలేమనే భయం ప్రతిపక్షాల్లో ఉంది. పుంగనూరులో రాబోయే తరాల్లో గెలుపు సాధ్యం కాదని భావించి హింసకు పాల్పడ్డారు. కర్రలు, తుపాకులు తీసుకొచ్చి చేసిన వీరంగం టీడీపీ ఏ స్థాయికైనా దిగజారిపోతుందనేదానికి నిదర్శనం. ప్రాజెక్టుల పేర్లతో హింసను ప్రోత్సహించడానికి ఆలోచన చేస్తున్న చంద్రబాబు నైజాన్ని ఖండిస్తున్నాం’ అని పేర్కొన్నారు. -
చిత్తూరులో టీడీపీ కార్యకర్తల వీరంగం.. పోలీసులనే రక్తం కారేలా..
పుంగనూరు: చిత్తూరు రోడ్ షోలో చంద్రబాబు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడంతో వారంతా రెచ్చిపోయి ప్రశాంతంగా ఉండే పుంగనూరులో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. రోడ్ షోకు బందోబస్తు నిర్వహించి రక్షణ కల్పించడానికి వచ్చిన పోలీసులపైనే విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఇష్టమొచ్చినట్టు రాళ్లు రువ్వారు, వాహనాలకు నిపు పెట్టారు, అక్కడున్న వారంతా టీడీపీ కార్యకర్తల వీరంగాన్ని బెంబేలెత్తిపోయి ఇళ్లల్లోకి వెళ్లి దాక్కున్నారు. పాపం పోలీసులు మాత్రం వీధిలో భాగంగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిపై రక్తమోడేలా హింసాత్మక దాడులు చేశారు. అల్లర్ల గురించి పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఉదయ్ మీడియాకు వివరిస్తూ.. టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే దాడులు చేశారన్నారు. పుంగనూరులో ప్రశాంతతకు విఘాతం కలిగించి విధ్వంసం సృష్టించాలనే లక్ష్యంతోనే అల్లర్లు జరిగాయి. వాస్తవానికి వారికి ఆ మార్గంలో రావడానికి అనుమతే లేదు. అయినా కూడా టీడీపీ కార్యకర్తలు ఇదే మార్గాన్ని ఎంచుకుని ఇక్కడికి చొరబడ్దారు. వారు చేసిన దాడుల్లో సామాన్యులతో పాటు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. చంద్రబాబు రోడ్ షో గురించి ప్రకటించగానే అల్లర్ల సృష్టించాలని వారు ముందే పథకం రచించారు. పథకం ప్రకారమే వారు తమ వెంట ఆయధాలను తెచ్చుకున్నారు. వారు దాడులు చేస్తున్నా ప్రతిదాడి చేయకుండా నచ్చజెప్పే ప్రయత్నం చేసి పోలీసులు సహనాన్ని పాటించారు. ముఖ్యంగా గాయపడిన పోలీసులు ఎంతో సంయమనాన్ని పాటించారన్నారు. తామే దాడి చేసి పోలీసులు తమపై దాడి చేశారంటూ ఎదురు ఆరోపణలు చేస్తుండడం శోచనీయం. పోలీసులు రెచ్చగొట్టారనేది పూర్తిగా అవాస్తవం. మేము పోలీసులం.. మాకు అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ఒక్కటే. ఎవ్వరికైనా రక్షణ కల్పించడమే మా కర్తవ్యం. మేం చట్టప్రకారం విధులు నిర్వహిస్తున్నాం. శాంతిభద్రతలను కాపాడడమే మా లక్ష్యం. ఎవరి కార్యక్రమాలకైనా విధిగా మేం భద్రతగా కల్పిస్తాం. అది మా బాధ్యతని గుర్తు చేశారు. రక్షణ కల్పించే మాపైనే వారు దాడి చేసి గాయపరిచారు. ఎంతగా అడ్డుకునే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా విధ్వంసం సృష్టించేందుకే ప్రయత్నించారు. తోటి కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవ చేసేందుకు ఉసిగొల్పారు. సంఘటన గురించి తెలియగానే డీజీపీ వెంటనే విచారణకు ఆదేశించారన్నారు. గాయపడిన పోలీసుల్లో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటనలో నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తి లేదు. విధి నిర్వహణలో ఆంధ్ర పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి ఘటనల్లో కఠినంగా వ్యవహరించాలి. రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ ఘటనను ఖండిచాలి. ఈ కేసును ప్రత్యేక కోర్టు ద్వారా విచారించాలని నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చూడాలన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఎంతటివారైనా చట్టాన్ని గౌరవించాలి. కిందిస్థాయి వారికి పై స్థాయిలోని వారే చెప్పాలని అన్నారు చిత్తూరు జిల్లా పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఉదయ్. ఇది కూడా చదవండి: పుంగనూరు ఘటనపై విచారణకు డీజీపీ ఆదేశం -
టీడీపీ రౌడీల దాడి: పోలీసులను పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: టీడీపీ రౌడీల దాడిలో గాయపడిన పోలీసులను చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు రాజకీయంగా దివాళా తీశారని.. అంతులేని ఆవేదన, ఆలోచనతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘పుంగనూరు బైపాస్ నుంచి వెళ్తామని పోలీసులకు రూట్ మ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత కావాలనే పుంగనూరులోకి వెళ్లాలని ప్రయత్నించారు. అనంతరం పోలీసులపై విచక్షణా రహితంగా దాడి చేశారు. చంద్రబాబు రెచ్చగొట్టి టీడీపీ కార్యకర్తలను పోలీసులపై దాడి పాల్పడేలా చేశారు. అనరాని మాటలు తిడుతూ ప్రజలను రెచ్చగొట్టారు. పోలీసులపై ఈ స్థాయిలో దాడి జరిగిన ఘటనలు ఇటీవల కాలంలో లేవు. కుప్పంలో ఓడిపోతానన్న భయంతో చంద్రబాబు నీచానికి దిగారు’’ అని మంత్రి మండిపడ్డారు. చదవండి: టీడీపీ రాక్షస క్రీడ ‘‘కచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. పోలీసులకు, ప్రభుత్వానికి ఇది ప్రతిష్టాత్మకం. షార్ట్ గన్స్కు లైసెన్స్ ఉండదు.. కానీ వారు ఆయుధాలు తెచ్చుకున్నారు. 200 వాహనాల్లో రౌడీలను తెచ్చుకున్నారు’’ అని మంత్రి పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. -
టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పిన చంద్రబాబు
-
టీడీపీ దాడులకు నిరసన.. రేపు చిత్తూరు బంద్
సాక్షి, అన్నమయ్య: పుంగనూరులో టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణుల దాడులకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రేపు చిత్తూరు జిల్లా బంద్‌కు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పోలీసులపై దాడులకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చింది. కాగా, పుంగనూరులో శుక్రవారం టీడీపీ శ్రేణులు కర్రలతో, రాళ్లతో దాడికి దిగారు. పథకం ప్రకారమే పోలీసులపై దాడి చేశారు. బీర్ బాటిళ్లు, కర్రలు, రాళ్లతో టీడీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడి చేశారు. టీడీపీ శ్రేణుల రాళ్ల దాడిలో 50 మందికిపైగా గాయపడ్డారు. రెండు పోలీసు వాహనాలను తగలబెట్టారు. ఇక, చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొడుతూ అగ్నికి మరింత ఆజ్యం పోశారు. పోలీసులపై అసభ్యకర పదజాలం వాడుతూ దూషించారు. టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇది కూడా చదవండి: టీడీపీ దాడులపై ఎస్పీ రిషాంత్ సంచలన కామెంట్స్ -
టమాటా సాగుతో కోటీశ్వరులు.. 45 రోజుల్లో రూ. 3 కోట్ల ఆదాయం
గతంలో ఎన్నడూ లేనంతగా టమాటా ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. గత నెల రోజులుగా కొండెక్కి కూర్చున్న టమాటాధరలు.. ఎంతకీ దిగిరావడం లేదు. పోనూ పోనూ ఇంకా ప్రియంగా మారుతూ.. సామాన్యుడికి భారంగా మారింది. ప్రస్తుతం కేజీ టమాటా ధర రూ.200 చేరి కొత్త రికార్డులు సృష్టిస్తుంది. అయితే పెరిగిన టమాటా ధరలతో వినియోగదారులు బెంబేలెత్తిపోతుంటే.. వీటిని పండించిన రైతుల ఇంట మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కనివినీ ఎరగని రీతిలో కొంతమంది రైతులు ధనవంతులు అవుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ రైతు కుటుంబం టమాటా పంటతో జాక్‌పాట్ కొట్టింది. 22 ఎకరాల్లో టమాటాసాగు చేసి.. 45 రోజుల్లో ఏకంగా మూడుకోట్లు సంపాదించారు. భూదేవిని నమ్ముకున్న రైతులు ఏ రోజుకైనా రాజులవుతారని నిరూపించారు రైతులు చంద్రమౌళి, మురళి. చిత్తూరు జిల్లా సోమల మండలం కరకమందకు చెందిన రైతు కుటుంబంలోని అన్నదమ్ములు చంద్రమౌళి, అతని తమ్ముడు మురళి ఉమ్మడిగా వ్యవసాయం చేస్తున్నారు. స్వగ్రామమైన కరకమంద సమీపంలో 12 ఎకరాలు, పులిచెర్ల మండలం సువ్వారపు వారి పల్లెలో 10 ఎకరాల పొలంలో 23 సంవత్సరాలుగా టమాటను సాగు చేస్తున్నారు. చదవండి: టమాటా లారీ బోల్తా..! క్షణాల్లోనే ఊడ్చుకెళ్లారు..!! 22 ఎకరాల్లో టమాటా సాగు తన వంగడాలు, మార్కెట్ స్థితిగతుల గురించి బాగా అవగాహన పెంచుకున్న చంద్రమౌళి.. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో మొక్కలు నాటి జూన్ నాటికి దిగుబడి ప్రారంభమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ సంవత్సరం అరుదైన సాహు రకానికి చెందిన టమాటా మొక్కలను 22 ఎకరాలలో సాగు చేశారు. త్వరగా దిగుబడి పొందడానికి మల్చింగ్, మైక్రో ఇరిగేషన్ పద్ధతుల వంటి అధునాతన పద్ధతులను అనుసారించాడు. దాదాపుగా 70 లక్షల వరకు పంటపై ఖర్చు చేయగా.. జూన్ చివరి వారంలో దిగుబడి ప్రారంభమైంది. రూ. 4 కోట్ల ఆదాయం.. ఖర్చులు పోనూ! ఈ పంటను తమ ప్రాంతానికి దగ్గరల్లో ఉన్న కర్ణాటక రాష్ట్రం కోలార్ మార్కెట్లో విక్రయించారు. అక్కడ 15 కేజీల బాక్స్ ధర వెయ్యి రూపాయల నుంచి 1500 మధ్య పలికింది. గత 45 రోజుల్లో సుమారుగా 40 వేల పెట్టెలు విక్రయించాడు. తనకొచ్చిన లాభంపై రైతు చంద్రమౌళి సంతోషం వ్యక్తం చేశాడు. తన అనుభవాన్ని పంచుకుంటూ..ఇప్పటి వరకు పండించిన పంట ద్వారా రూ. 4 కోట్ల ఆదాయం వచ్చిందన్నాడు. మొత్తంగా 22 ఎకరాల్లో పంట కోసం అన్నీ ఖర్చులు కలిపి కోటి రూపాయలు పెట్టుబడి పెట్టగా... రూ. 3 కోట్ల లాభం వచ్చిందని తెలిపారు. రికార్డు స్థాయిలో ధరలు మరోవైపు భారత్‌లోనే అతిపెద్ద టమటా మార్కెట్లలో ఒకటిగా ఉన్న మదనపల్లెలో టమాట ధర విపరీతంగా పెరుగుతోంది. మొదటి గ్రేడ్ టమోటా కిలో ధర శుక్రవారం రూ. 200 రూపాయలు పలికింది. రెండు వారాల క్రితం కిలో టమాటారూ.120 ఉండగా.. 25 కిలోల డబ్బాను రూ.3 వేలకు విక్రయించారు. అయితే ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో టమాటకు డిమాండ్ పెరగడంతో కిలో ధర రూ.200కి చేరింది. ఆగస్టు నెలాఖరు వరకు టమాటా ధరలు పెరుగుతాయని అధికారులు తెలిపారు. చదవండి: సముద్రంలో పడవ బోల్తా.. రుషికొండ బీచ్‌లో తప్పిన ప్రమాదం -
చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్‌రెడ్డికి అడుగడుగునా బ్రహ్మరథం
పాకాల : మండలంలోని పంటపల్లె పంచాయతీలో వైఎస్సార్ సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బుధవారం పంటపల్లె పంచాయతీలో మోహిత్‌రెడ్డి గడప గడపకు మహా పాదయాత్ర సాగింది. ఇంటింటికీ వెళ్లి ఆయన ప్రజలతో మమేకమయ్యారు. పథకాల ద్వారా పొందిన లబ్ధిని వివరించి సంక్షేమ బావుటా బుక్‌లెట్‌ను అందించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు. జగనన్న పాలనలో రామరాజ్యం ముఖ్యమంత్రి జగనన్న పాలనలో ప్రజలు రామరాజ్యాన్ని చూస్తున్నారని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ జగనన్న చేదోడు పథకంతో మహిళలను ఆర్థికంగా బలపడుతున్నారని తెలిపారు. హామీలను నెరేవేర్చిన ఏకై క సీఎంగా జగనన్న చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. అద్భుతమైన పథకాల అమలుతో రాష్ట్రంలో జనరంజక పాలన కొనసాగుతోందని తెలిపారు. ప్రజలంతా జగనన్న వైపే ఉన్నారని, రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం తథ్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన కుటుంబసభ్యుల కంటే నియోజకవర్గ ప్రజలనే ఎక్కువగా అభిమానిస్తారని వివరించారు. నిరంతరం ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో పని చేసే వ్యక్తి మన ఎమ్మెల్యే అని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనను ఆశీర్వదించి గెలిపించాలని మోహిత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎంపీపీ లోకనాథం, వైఎస్సార్ సీపీ కన్వీనర్ నంగా నరే ష్‌రెడ్డి, నాయకులు వల్లివేడు విక్రమ్‌రెడ్డి, మునీశ్వర్‌రెడ్డి, రఘుపతి, కపిలేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
బిచ్చగాడు నుంచి ASPగా మారిన నిరుపేద..
-
శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని టీటీడీ ఆగమోక్తంగా నిర్వహించింది. జూలై 17వ తేదీన ఆణివార ఆస్థానం పురస్కరించుకొని మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. తిరుమంజనం కారణంగా అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని నేడు విఐపీ దర్శనాలు కూడా టీటీడీ రద్దు చేసింది. -
చెప్పాడంటే..చేస్తాడంతే
-
చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ శ్రీకారం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
బంగారు జగనన్నకి బంగారం రాఖీ కట్టిన శైలజాచరణ్ రెడ్డి
సాక్షి, చిత్తూరు: చిత్తూరు డెయిరీ పునరుద్ధరణలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం భూమి పూజ చేశారు. రూ. 385 కోట్లతో చేపడుతున్న ఈ పునరుద్ధరణ పనులకు భూమి పూజ చేసి ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన మరో కీలకమైన హామీ ఆచరణకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్. ఈ మేరకు ఆయన నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. దీనిలో భాగంగా సీఎం జగన్‌కు మహిళా శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజినల్ చైర్పర్సన్, చంద్రగిరి నియోజకవర్గ పరిశీలకురాలు శైలజా చరణ్ రాఖీ కట్టారు. అది కూడా బంగారంతో చేసిన రాఖీ కట్టారు. బంగారంలాంటి మనసున్న జగనన్నకు ఏమిచ్చినా తక్కువ కాబట్టి మహిళా లోకం తరఫు నుంచి బంగారం రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు శైలజా చరణ్‌రెడ్డి. చదవండి: బాబు వెన్నుపోటు వీరుడు.. పవన్ ప్యాకేజీ శూరుడు: సీఎం జగన్ -
చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు సీఎం జగన్ భూమి పూజ (ఫొటోలు)
-
CM Jagan Chittoor Tour : చిత్తూరులో సీఎం జగన్‌కు ఘన స్వాగతం (ఫొటోలు)
-
చిత్తూరు డెయిరీకి భూమి పూజ.. జగనన్న పాటకు, విద్యార్థినుల ఆట
సాక్షి, చిత్తూరు: జగనన్న ప్రభుత్వం మరో హామీని నిలబెట్టుకుంది. చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ ఆచరణకు నోచుకుంది. ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్న రైతన్నల కల నెరవేరుతోంది. మంగళవారం రోజున సీఎం వైఎస్ జగన్ చిత్తూరు డెయిరీ వద్ద అమూల్ సంస్థ ప్రాజెక్ట్‌కు భూమిపూజ చేశారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఫొటో సెషన్, ఎగ్జిబిషన్ పరిశీలించి బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. రైతు సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిన వైఎస్సార్సీపీ తాజా ముందడుగుతో జిల్లా వ్యాప్తంగా పాడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనం కోసం జగన్ సర్కార్ అంటూ జగనన్నకు జయజయ ధ్వానాలు పలికారు. ఈక్రమంలోనే సభా ప్రాంగణంలో కొందరు విద్యార్థినిలు చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ యాత్రను ప్రశంసిస్తూ సాగిన పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ‘పేదోళ్ల కన్నీరు తుడిచే చేయి నీవన్న.. కళ్లల్లో నిండే మా వెలుగే నీవన్న.. జగనన్న’ అనే పాట, విద్యార్థులు ఆట.. అక్కడ ఉన్నవారిని ఎంతగానో ఆకట్టుకుంది. -
బాబు వెన్నుపోటు వీరుడు.. పవన్ ప్యాకేజీ శూరుడు: సీఎం జగన్
సాక్షి, చిత్తూరు: హెరిటేజ్ డెయిరీ కోసం.. చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే చిత్తూరు డెయిరీని మూసేశారని, తన స్వార్థం కోసం చంద్రబాబు సొంత జిల్లా రైతులనే నిలువునా ముంచేశారని సీఎం అన్నారు.మూతపడిన చిత్తూరు డెయిరీని తెరిపిస్తున్నామన్నారు. చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు సీఎం జగన్.. మంగళవారం భూమిపూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘‘చంద్రబాబు హయాంలో అతిపెద్ద చిత్తూరు డెయిరీ దోపిడీకి గురైందని దుయ్యబట్టారు. ‘‘చిత్తూరు డెయిరీపై చంద్రబాబు కళ్లు పడ్డాయి. చంద్రబాబు హయాంలో అన్యాయంగా చిత్తూరు డెయిరీని మూసేశారు. చిత్తూరు డెయిరీ నష్టాల్లో ఉంటే హెరిటేజ్ డెయిరీ లాభాల్లోకి వెళ్లడం ఆశ్చర్యమేసింది. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేర్చా. 182 కోట్ల బకాయిలను తీర్చి డెయిరీ రీఒపెన్ చేస్తున్నాం. అమూల్ రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘10 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే స్థాయిలో డెయిరీ ఉంటుంది. చిత్తూరుతో పాటు రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతులకు మేలు జరుగుతుంది. ఇచ్చిన మాట ప్రకారం చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తున్నాం. అమూల్ రాక ముందు లీటర్ గేదె పాల ధర రూ.67. అమూల్ వచ్చాక లీటర్ గేదె పాల ధర 89 రూపాయల 76 పైసలు. అమూల్ రాక ముందు ఆవుపాలు లీటర్ ధర రూ.32 కూడా లేదు. అమూల్ వచ్చాక ఆవు పాలు లీటర్ ధర 43 రూపాయల 69 పైసలు. వెల్లూరు మెడికల్ కాలేజ్ రాకుండా అడ్డుకున్నది చంద్రబాబు, రామోజీ. అడ్డంకులను దాటి వెల్లూరు మెడికల్ కాలేజీ నిర్మాణానికి పునాది రాయి వేస్తున్నాం. చిత్తూరు జిల్లాకు చంద్రబాబు చేసిన మేలు ఒక్కటి కూడా లేదు’’ అని సీఎం జగన్ దుయ్యబట్టారు. చదవండి: పచ్చని చిత్తూరు విజయా డెయిరీపై ‘పచ్చ’ కుట్ర.. పక్కాగా ప్లాన్ అమలు చేసిన చంద్రబాబు ‘‘చంద్రగిరిలో గెలవలేమని కుప్పం వలస వెళ్లాడు చంద్రబాబు.. చంద్రబాబు గురించి అర్థం చేసుకున్న కుప్పం ప్రజలు కూడా బైబై బాబు అంటున్నారు.. మళ్లీ కుప్పం ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నాడు. ఈ 75 ఏళ్ల ముసలాయన కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నానని డ్రామాలు చేస్తున్నారు’’ అంటూ సీఎం జగన్ మండిపడ్డారు. చదవండి: అప్పటి టీడీపీ ప్రభుత్వం అంటే హెరిటేజ్ ప్రభుత్వమేనా..! ‘‘54 ప్రభుత్వ రంగ, సహకార రంగ సంస్థలను చంద్రబాబు అమ్మేశారు. తన మనుషులకు తక్కువ ధరకు సంస్థలను కట్టబెట్టేశారు. మామకు వెన్నుపోటు పొడిచిన సంగతి ఇప్పటి తరానికి తెలియదని బాబు నమ్మకం. తన ముడుపుల కోసం ప్రభుత్వ సంస్థలను అమ్మేసే చరిత్ర చంద్రబాబుది. పప్పు బెల్లాల కోసం అన్నీ చంద్రబాబు తన వారికి కట్టబెట్టారు. చంద్రబాబు మంచిని నమ్ముకోకుండా మోసాని నమ్ముకున్నారు. మంచి జరిగితేనే నాకు తోడుగా ఉండండి’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘తోడేళ్లు అన్నీ ఏకమవుతున్నాయి. విష ప్రచారాన్ని నమ్మకండి. దత్తపుత్రుడి కలిసి చంద్రబాబు అభివృద్థి, సంక్షేమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు వెన్నుపోటు వీరుడు.. పవన్ ప్యాకేజీ శూరుడు. ఇవాళ పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతోంది. ప్రతి పేదవారి గుండెలో స్థానం కోసం పనిచేస్తున్నాం.’’ అని సీఎం చెప్పారు. చదవండి: రైతుకుంది ధీమా, రామోజీకే లేదు.. ఆందోళన ఎక్కువైనట్టుంది, అందుకే ఇలా! -
హెరిటేజ్ కోసం.. చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారు: సీఎం జగన్
Updates: ►సీఎంసీ హాస్పిటల్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ ►300 బెడ్స్ కెపాసిటీతో అత్యాధునిక సీఎంసీ హాస్పిటల్ నిర్మాణం ►చిత్తూరు డెయిరీ నష్టాల్లో ఉంటే హెరిటేజ్ డెయిరీ లాభాల్లోకి వెళ్లడం ఆశ్చర్యమేసింది: సీఎం జగన్ ►చంద్రబాబు హయాంలో అతిపెద్ద చిత్తూరు డెయిరీ దోపిడీకి గురైంది ►పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేర్చా ►182 కోట్ల బకాయిలను తీర్చి డెయిరీ రీఒపెన్ చేస్తున్నాం ►అమూల్ రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ►హెరిటేజ్ డెయిరీ కోసం.. చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే చిత్తూరు డెయిరీని మూసేశారని, తన స్వార్థం కోసం చంద్రబాబు సొంత జిల్లా రైతులనే నిలువునా ముంచేశారని సీఎం అన్నారు. మూతపడిన చిత్తూరు డెయిరీని తెరిపిస్తున్నామన్నారు. ►చిత్తూరు డెయిరీ వద్ద అమూల్ ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమిపూజ చేశారు. అనంతరం చిత్తూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఫొటో సెషన్, ఎగ్జిబిషన్ పరిశీలించారు. కాసేపట్లో బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. చదవండి: పచ్చని చిత్తూరు విజయా డెయిరీపై ‘పచ్చ’ కుట్ర.. పక్కాగా ప్లాన్ అమలు చేసిన చంద్రబాబు ►రేణిగుంట ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో చిత్తూరుకు బయలుదేరారు. కాసేపట్లో అమూల్ డెయిరీని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం చిత్తూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఫొటో సెషన్, ఎగ్జిబిషన్ పరిశీలించిన తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1.05 గంటలకు సీఎంసీ ఆసుపత్రి ఆవరణలో 300 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సాక్షి, అమరావతి\చిత్తూరు: రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పాడి రైతులకు శుభ గడియ రానేవచ్చింది. దేశంలోనే రెండో అతిపెద్దదైన చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రూ. 385 కోట్లతో చేపడుతున్న ఈ పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం భూమి పూజ చేయనున్నారు. ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన మరో కీలకమైన హామీ ఆచరణకు నోచుకోబోతోంది. 2024 ఏప్రిల్ నాటికి ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో కార్యాచరణ సిద్ధమైంది. తొలి దశలో లక్ష టన్నుల సామర్థ్యంతో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ యూనిట్ ద్వారా పాలు, పెరుగు, వెన్న, పన్నీర్, మజ్జిగను ఉత్పత్తి చేయనున్నారు. మలిదశలో రూ. 150 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత దశల వారీగా పాల కర్మాగారం, వెన్న, పాలపొడి, చీజ్, పన్నీర్, యోగర్ట్, స్వీట్లు తయారీ విభాగాలతో పాటు అల్ట్రా హై ట్రీట్మెంట్ (యూహెచ్‌టీ) ప్లాంటు ఏర్పాటు చేయనున్నారు. ఈ డెయిరీ పునరుద్ధరణ ద్వారా ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే 25 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. సహకార డెయిరీలకు పాతరేసిన బాబు రైతుల నుంచి గిట్టుబాటు ధరకు పాలు సేకరించి, వినియోగదారులకు సరసమైన ధరకే నాణ్యమైన పాల సరఫరా లక్ష్యంతో 6 వేల లీటర్ల సామర్థ్యంతో చిత్తూరు డెయిరీని ఏర్పాటు చేశారు. దశల వారీగా విస్తరించడంతో రోజుకు 2.5 లక్షల లీటర్ల సామర్థ్యంతో దేశంలోనే రెండో అతిపెద్ద డెయిరీగా అవతరించింది. 1992–93 వరకు విజయవంతంగా పనిచేసిన ఈ డెయిరీని 1995లో అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు తన హెరిటేజ్ డెయిరీ కోసం నిర్వీర్యం చేయడంతో చిత్తూరు డెయిరీ తన ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. లాభాల్లో కొనసాగుతున్న డెయిరీని స్వార్థ ప్రయోజనాలతో నిరీ్వర్యం చేసి ఆర్థిక నష్టాలకు గురిచేయడం ద్వారా 2002లో మూతపడేటట్టు చేశారు. చిత్తూరు డెయిరీనే కాదు.. బాబు హయాంలో 2017 జనవరి 23న పులివెందుల డెయిరీ, 2018 జూలై 31న రాజమండ్రి డెయిరీ, 2018 నవంబర్ 30న కృష్ణా జిల్లాలోని మినీ డెయిరీ, 2019 మార్చి 15న చిత్తూరులోని మదనపల్లి డెయిరీతో సహా మరో 8 సహకార డెయిరీలను మూతపడేటట్టు చేశారు. అంతేకాదు అన్నమయ్య జిల్లాలోని యూహెచ్‌టీ ప్లాంట్, ప్రకాశం జిల్లాలోని మిల్క్ పౌడర్ ప్లాంట్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఎంసీసీతో పాటు 141 బీఎంసీయూలు మూతపడ్డాయి. తద్వారా సహకార రంగంలోఉన్న పాల డెయిరీలన్నీ ప్రొడ్యూసర్ కంపెనీల చేతుల్లోకి వెళ్లేటట్టు చేశారు సహకార రంగం బలోపేతమే లక్ష్యంగా.. సహకార డెయిరీ రంగం బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు జగనన్న పాల వెల్లువ కింద రాష్ట్రంలో 3,551 మహిళా పాడి రైతుల సంఘాలకు చెందిన 3.07 లక్షల మంది పాడి రైతుల నుంచి రోజుకు సగటున 1.72 లక్షల లీటర్ల పాలను అమూల్ సేకరిస్తోంది. రెండేళ్లలో 8.78 కోట్ల లీటర్ల పాలు సేకరించగా, రూ.393 కోట్లు చెల్లించారు. అమూల్ రాకతో గత రెండేళ్లలో పెంచిన పాలసేకరణ ధరల వల్ల ప్రైవేటు డెయిరీలకు పాలు పోసే రైతులకు రూ.4,243 కోట్ల మేర అదనపు ప్రయోజనం చేకూరింది. మూతపడిన డెయిరీల పునరుద్ధరణలో భాగంగా ఇప్పటికే మదనపల్లి డెయిరీని అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా మరో అడుగు ముందుకేసి చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తున్నారు. ఇందుకోసం డెయిరీకు ఉన్న రూ.182 కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది. మంగళవారం చిత్తూరులో జరగనున్న భూమి పూజ కార్యక్రమంలో గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ షమల్బాయ్ బి.పటేల్, కైరా జిల్లా కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ విపుల్ పటేల్, రాష్ట్ర మంత్రులు, వ్యవసాయ, సహకార శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది తదితరులు పాల్గొననున్నారు. ఒక్క చిత్తూరు డెయిరీకే నష్టాలు ఎందుకు? ఒకే జిల్లాలో ఒకే సమయంలో ఉన్న రెండు డెయిరీల్లో ఒకటి ఏటా లాభాలను పెంచుకుంటూ పోతే.. మరో డెయిరీ నష్టాలను పెంచుకుంటూ పోయింది. రైతులు అందరూ కలిసి నిర్వహించుకుంటున్న చిత్తూరు డెయిరీ చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత క్రమంగా నష్టాలను పెంచుకుంటూ పోతే.. అదే సమయంలో ఆయన సొంత డెయిరీ మాత్రం లాభాలను రెట్టింపు చేసుకుంటూ పోయింది. ఇదే సమయంలో దేశంలోని అమూల్ వంటి పలు సహకార డెయిరీలు లాభాల్లో నడుస్తుంటే ఒక్క చిత్తూరు డెయిరీ మాత్రమే నష్టాలను మూటకట్టుకుంది. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం చేసి చివరకు 2002లో ఆ డెయిరీని మూసివేయించారు. ఇందుకోసం తనే ఒక కమిటీ వేసి ఆ కమిటీ సిఫార్సుల మేరకు చిత్తూరు డెయిరీని మూసేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికే హెరిటేజ్ పెట్టి 10 ఏళ్లు దాటింది. తన సొంత డెయిరీ కోసం సొంత జిల్లా రైతుల నోటిలో మట్టి కొడుతూ చిత్తూరు సహకార డెయిరీని మూయించేశారు అనడానికి ఇంతకంటే ఉదాహరణలు ఏమి కావాలి. చిత్తూరు డెయిరీ మూసివేత గురించి ఎవరైనా మాట్లాడుతుంటే వెంటనే హెరిటేజ్ డెయిరీ ఉలిక్కిపడటం చూస్తుంటే.. చేసిన తప్పును చెప్పకనే చెపుతోంది అని అర్థమవుతుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చిత్తూరు పాలడెయిరీ పునరుద్ధరణ
-
పచ్చని చిత్తూరు డెయిరీపై చంద్రబాబు పన్నాగం.. అసలేం జరిగిందంటే?
చిత్తూరు అర్బన్: ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద రెండో సహకార పాల డెయిరీగా పేరుగాంచిన చిత్తూరు విజయా డెయిరీ ఎందుకు మూతబడింది? ఏ ప్రభుత్వ హయాంలో విజయా డెయిరీని మూయించారు? నాటి పాలకులు చేసిన తప్పిదాలు ఏంటి? డెయిరీ మూత వెనుక జరిగిన కుట్ర ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ పచ్చ మీడియాకు సమాధానాలు తెలుసు. కానీ ఎక్కడా వాటిని ప్రస్తావించదు. ఎల్లో మీడియా ఎందుకు ప్రస్తావించదంటే.. కారణం.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చంద్రబాబునాయుడు చేసిన కుట్ర. ఇది జగమెరిగిన సత్యం. అలాంటి డెయిరీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పునరుద్ధరిస్తుంటే ‘పచ్చ మీడియా’ ఓర్చుకోవడంలేదు. డెయిరీ ఎదుట ఉన్న వీరరాఘవులునాయుడు విగ్రహం పడేశారంటూ గోల చేస్తూ తప్పుడు కథనాలు వార్చి వడ్డిస్తోంది. డెయిరీ మూసివేత కుట్రకు నాంది చంద్రబాబు నాయుడు సహకార శాఖ మంత్రిగా పనిచేసే రోజుల్లో ఓసారి చిత్తూరు విజయా డెయిరీని సందర్శించారు. అప్పటికి రోజుకు 4 లక్షల లీటర్ల మేరకు పాల సేకరణ జరుగుతుండేది. డెయిరీలో ప్రత్యక్షంగా దాదాపు 800 మంది ఉద్యోగులు పనిచేస్తుంటే, పరోక్షంగా 2 లక్షలకు పైగా కార్మికులు విధులు నిర్వర్తించే వారు. చిత్తూరు విజయా పాల డెయిరీ నుంచి డిల్లీ, పూణే, బాంబే తదితర మహా నగరాలకు రోజుకు 2 లక్షల లీటర్ల మేరకు పాలను తరలించడం గమనించిన బాబు మదిలో ఓ కుట్ర పురుడుపోసుకుంది. హెరిటేజ్ పుట్టిందే ఆ కుట్ర నుంచి.. అదే ఆయన మానస పుత్రిక హెరిటేజ్ పాల డెయిరీ స్థాపన. హెరిటేజ్‌ను స్థాపించాలంటే సహకార రంగంలో పాతుకుపోయిన విజయా పాల డెయిరీని మూయించాలని నిర్ణయించుకున్నారు. తనకు నమ్మిన బంటుగా ఉన్న చిత్తూరు టీడీపీ నేత దొరబాబునాయుడును విజయా పాల డెయిరీకి చైర్మన్‌గా నియమించుకున్నారు. మరో కుడిభుజం జీవరత్నం నాయుడును మేనేజర్‌గా నియమించుకుని విజయా డెయిరీకి వచ్చే పాలను తన డెయిరీకు మళ్లించుకున్నారు. జాగ్రత్తగా డెయిరీని మూత వేయించారు విజయా డెయిరీలో పాల పౌడర్, నెయ్యి లాంటి పదార్థాలు అమ్ముడుపోవడం లేదంటూ, భారీ నిల్వలను ఉంచేశారు. విజయా డెయిరీకి పాల సేకరణ ఎక్కువగా ఉందంటూ వారానికి రెండు రోజులు చొప్పున మిల్క్ హాలిడేను ప్రకటించారు. రైతులకు క్రమంగా పాల ధరలను తగ్గిస్తూ, ఇదే సమయంలో హెరిటేజ్‌లో 20 పైసలు అదనంగా ఇస్తామని ఆశ చూపించి పాలను మళ్లించుకున్నాడు. ముందు నష్టాలు.. తర్వాత లాకౌట్ ఆఖరికి డెయిరీలో భారీ నష్టాలు చూపించి 2002 ఆగస్టు 31వ తేదీన లాకౌట్ ప్రకటించి పూర్తిగా డెయిరీని మూసివేశారు. ఆ సమయంలో డెయిరీ చైర్మన్‌గా ఉన్న దొరబాబు నాయుడు పూర్తిగా చంద్రబాబు నాయుడి కుట్రలకు తోడ్పాటు అందించారు. విజయా పాల డెయిరీపై ఆధారపడ్డ లక్షలాది మంది రైతులను, డెయిరీలో పనిచేస్తున్న వందలాది కుటుంబాలను రోడ్డున పడేశారు. విగ్రహాన్ని భద్రంగా ఉంచాం.. ప్రభుత్వం విజయ డెయిరీని పునఃప్రారంభించనున్న నేపథ్యంలో గేటు ముందు దారిలో అడ్డుగా ఉన్న వీర రాఘవులు నాయుడు విగ్రహాన్ని జాగ్రత్తగా తీసి భద్రపరిచామని నగర కమిషనర్ అరుణ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా తీసిన విగ్రహ ఫొటోలను చూపించారు. విగ్రహాన్ని ఎక్కడా పడేయలేదని స్పష్టం చేశారు. పచ్చ మీడియా దాచిన చరిత్ర 1969లో సహకార కార్పొరేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు విజయా డెయిరీని ప్రారంభించారు. అప్పట్లో రోజుకు 3 వేల లీటర్లు పాలు సేకరించేవారు. ఈ పాలను చిత్తూరు, తిరుపతి నగరాల్లో విక్రయించేవారు. 1977–78 నుంచి తిరుమల శ్రీవారికి అభిషేకానికి కూడా విజయా డెయిరీ పాలను సరఫరా చేసేవారు. తిరుమలలోని పలు హోటళ్లు, క్యాంటీన్లకు సైతం ఇక్కడి నుంచి పాలు వెళ్లేవి. ఘనచరిత్ర చిత్తూరు డెయిరీది 1980లో పాలకోవా, రోస్మిల్క్ తయారు చేసే యూనిట్లను ఏర్పాటు చేశారు. అప్పటికీ రోజుకు 50 వేల లీటర్ల పాలసేకరణ జరిగేది. కాల క్రమేణా తిరుమలకు నెలకు రూ.కోటి మేరకు నెయ్యి సరఫరా చేయడంతో పాటు, పాల కోవా, రోస్ మిల్క్ విక్రయాలను చిత్తూరు, తిరుపతి, తిరుమలలో పుంజుకున్నాయి. విజయా డెయిరీ నుంచి తయారుచేసిన పాల పౌడర్‌ను మిలిటరీ క్యాంటీన్లకు తరలించేవారు. లక్షల కుటుంబాల జీవన ధార రోజు రోజుకూ విజయా డెయిరీకి పాలసేకరణ సామర్థ్యం పెరగడంతో జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల పాడి రైతు కుటుంబా లు రోజుకు దాదాపు 4 లక్షల లీటర్ల మేరకు పాలను సరఫరా చేసేవి. గ్రామాల్లో పాడి రైతులతో కూడిన పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ఏర్పాటు దాదాపు 850 గ్రామాల్లో పాల ఉత్పత్తి దారుల సంఘం కింద పాల సేకరణ భవనాలను నిర్మించారు. ఇపుడు డెయిరీ తెరుస్తుంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడి రైతులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. ఇందులో భాగంగా శిథిలావస్థలో ఉన్న విజయా డెయిరీని పునరుద్ధరించే క్రమంలో స్థలాన్ని అమూల్ సంస్థకు 99 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి పాలను సేకరించి గిట్టుబాటు ధర కల్పించడానికి చేస్తున్న ప్రయత్నంలో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. వీర రాఘవుల విగ్రహానికి సముచిత స్థానం డెయిరీ మాస్టర్ ప్లాన్ ప్రకారం వీరరాఘవులునాయుడు విగ్రహానికి సముచిత స్థానం కల్పిస్తామని మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణ ఇప్పటికే స్పష్టం చేశారు. విగ్రహాన్ని పడేశామని, మూలనచుట్టి ఎక్కడికో తరలించారంటూ వచ్చిన కథనాలను ఆమె ఖండించారు. మరోవైపు డెయిరీని మూయించిన దొరబాబు నాయుడు.. చిత్తూరు కలెక్టర్‌ను కలిసి డెయిరీ ఎదుట వీర రాఘవులు నాయుడు విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని వినతిపత్రం ఇవ్వడం ఈ ఘటనలో కొస మెరుపు. -
పసందైన పొట్టేళ్ల సంత!
బైరెడ్డిపల్లి/పలమనేరు(చిత్తూరు జిల్లా): సాధారణంగా జత పొటేళ్లు రూ.40 వేల దాకా ఉంటాయి. కానీ బక్రీద్ పండుగ కోసం ప్రత్యేకంగా సంరక్షించిన కొమ్ములు తిరిగిన పొట్టేళ్ల ధరలు లక్షలు పలుకుతున్నాయి. రాష్ట్రంలో పొట్టేళ్లు, మేకలు, గొర్రెలకు ప్రాచుర్యం పొందిన వారపు సంతల్లో చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె ముఖ్యమైంది. ఇక్కడ లభించే నాణ్యమైన, రుచికరమైన పొట్టేళ్ల కోసం మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళల నుంచి కూడా వస్తుంటారు. బక్రీద్‌ను పురస్కరించుకుని బైరెడ్డిపల్లెలో శనివారం జరిగిన వారపుసంతకు పొట్టేళ్లు, మేకలు, గొర్రెలు సుమారుగా 40 నుంచి 50 వేల దాకా వ చ్చినట్టు తెలిసింది. జత పొట్టేళ్లు రూ.30 వేల నుంచి రూ.2.70 లక్షల దాకా అమ్ముడయ్యాయి. మొత్తంమీద ఇక్కడ పండుగ సంతలో రూ.20 కోట్ల దాకా క్రయ, విక్రయాలు జరిగినట్టు సమాచారం. గత శనివారం సైతం ఇదే స్థాయిలో రూ.10 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. బైరెడ్డిపల్లె సంతకు బడా వ్యాపారులు బయటి రాష్ట్రాల నుంచి రావడంతో ఇక్కడి పొట్టేళ్లుఅత్యధిక ధరలు పలుకుతున్నాయి. అంతేకాదు, ఇక్కడి పొట్టేళ్ల సంతలో పండుగ సంత కావడంతో దళారుల హవా కొనసాగింది. అటు రైతులు, ఇటు వ్యాపారులకు మధ్య బేరం కుదర్చడంలో దళారులే కీâలకం. వీరికి ఇరువైపుల నుంచి నిర్ణయించిన మేర కమీషన్లు దక్కుతాయి. మొత్తం మీద బక్రీద్ పండుగకు ముందే దళారులు జేబులు నింపుకొన్నారు. మే నుంచి ఏడాది పాటు పొట్టేళ్ల పెంపకం బక్రీద్ పండుగ కోసం పొట్టేళ్లను పెంచి అమ్ముకోవడం రైతులకు లాభసాటిగా మారింది. దీంతో చిత్తూరు, అనంతపురం(అవిభక్త) జిల్లాలు, కర్ణాటకలోని కోలారు, చింతామణి, శ్రీనివాసపురం, మాలూరు జిల్లాల్లో బక్రీద్ పొట్టేళ్ల పెంపకం సాగుతోంది ఏటా మేలో మంచి పొట్టేళ్ల కోసం రైతుల అన్వేషణ మొదలవుతోంది. కందూరు, సోమల, సదుం, పీలేరు, అంగళ్లు, బైరెడ్డిపల్లె, బంగారుపేట(కర్ణాటక) తదితర ప్రాంతాల నుంచి మంచి గొర్రె పొట్టేళ్లను రైతులు కొనుగోలు చేస్తారు. అప్పటికే వీటి ధర రూ.10 వేల దాకా ఉంటుంది. ఆ తర్వాత వీటిని బాగా సంరక్షిస్తారు. ప చ్చిగడ్డితో పాటు బూసా, గానుగపిండి, మొక్కజొన్న తదితరాలను పెట్టి ఏడాదిపాటు సాకుతారు. దీంతో బక్రీద్ పండుగకల్లా కొమ్ము లు తిరిగిన పొట్టేళ్లు మంచి మాంసంతో సిద్ధమవుతాయి. జత పొట్టేళ్లను రూ.2.70 లక్షలకు విక్రయించా.. బక్రీద్ కోసం పొట్టేళ్లను మేపడమే వృత్తిగా పెట్టుకున్నాం. ఏడాదంతా పొట్టేళ్లను మేపి.. బక్రీద్ పండక్కి ముందు సంతకు తోలుకెళతాం. వ్యాపారులు ఎక్కువగా వస్తారు కాబట్టి బాగా మేపిన పొట్టేళ్ల ధర ఎక్కువ పలుకుతుంది. ఈ దఫా జత పొట్టేళ్లను రూ.2.70 లక్షలకు అమ్మడం ఆనందంగా ఉంది. – జగదీష్ , పొట్టేళ్ల పెంపకందారు, తాయిళూరు, కర్ణాటక వీటి మాంసం చాలా రుచిగా ఉంటుంది.. నేను బైరెడ్డిపల్లి సంతలో 23 ఏళ్ల నుంచి బక్రీద్ పొట్టేళ్లను కొంటున్నా. మా ప్రాంతంలో బైరెడ్డిపల్లి పొట్టేళ్లకు భలే డిమాండ్. ఎందుకంటే ఈ ప్రాంతంలోని కొండ, గుట్టల్లో మేత మేస్తుంటాయి. దీంతో వీటి మాంసం చాలా రుచిగా ఉంటుంది. ఫారాల్లో మేపే పొట్టేళ్లు రుచీపచీ ఉండవు. – అబ్దుల్‌బాషా, గుడియాత్తం, తమిళనాడు -
ఇక మాకెవరు దిక్కు తండ్రీ..!
చిత్తూరు: కుప్పం–పలమనేరు జాతీయ రహ దారి కడపల్లె వద్ద శుక్రవారం మోటార్ సైకిల్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. రాళ్లబూదుగూరు పోలీసుల కథనం మేరకు.. కెనమాకులపల్లె పంచాయతీ బోయనపల్లెకు చెందిన శివరాం(22) మోటార్ సైకిల్‌పై సొంతపనిగా కుప్పం వెళ్లాడు. తిరిగి వస్తుండగా గ్రామానికి చెందిన లోకేష్(23) కనిపించడంతో బైక్‌లో ఎక్కించుకున్నాడు. కుప్పం వైపు నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. కడపల్లె సమీపంలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాల వద్ద మోటార్‌బైక్‌ను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో తలకు తీవ్ర గాయాలైన శివరాం అక్కడిక్కడే మృతి చెందాడు. లోకేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రయాణికుల సమాచారంతో నిమిషాల్లో ప్రమాద స్థలానికి వచ్చిన 108 అంబులెన్స్ ద్వారా లోకే ష్‌ను కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లోకేష్ కూడా ప్రాణాలు విడిచాడు. రెండు కుటుంబాల్లో తీరని వ్యధ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న బోయనపల్లెకు చెంది న నాగభూషణం, చెంగమ్మలకు శివరా రం కుమారు డు. కుమా ర్తెకు పెళ్లి చేసి పంపేశారు. చదువు అబ్బక పోవడంతో మూడు నెలల కిందట శివారంకు ఫైనాన్సులో ఆటోను కొనిచ్చారు. శుక్రవారం మోటార్‌బైక్‌లో కుప్పం వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ప్రమాద స్థలంలో శివరాం మృతదేహం వద్ద తమ ఇంటి దీపం ఆరిపోయిందంటూ కన్న వారు, బంధువుల రోదనలు మిన్నంటాయి. అదే గ్రామానికి చెందిన మురుగన్, సుమతిల కుమా రుడు లోకేష్ డిగ్రీ చదువుతున్నాడు. కుప్పంలో పరీ క్ష ముగించుకుని గ్రామానికి చెందిన శివరాం తారస పడడంతో కలిసి మోటార్ సైకిల్‌పై ఇంటికి బయలుదేరి ప్రమాదంతో మృత్యుఒడిలోకి చేరాడు. -
భక్తులకు శుభవార్త.. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
సాక్షి, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త అందించింది. స్వామివారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్ధం కోరకు టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సోమవారం సమావేశమైంది. సమావేశ తీర్మానాలను టీటీడీ ఛైర్మన్ మీడియాకు వెల్లడించారు. తిరుమలలో రూ. 4 కోట్లతో తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రూ. 1 కోటి 28 లక్షలతో వసతి గృహాల ఆధునీకరించనున్నట్లు తెలిపారు. రూ. 40.50 కోట్లతో వ్యర్థాల నిర్వహణ కోసం ప్రైవేటు ఏజెన్సీకి మూడు సంవత్సరాల కాలపరిమితికి అనుమతి ఇచ్చినట్లు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఒంటిమిట్టలో దాతల సాయంతో రూ.4 కోట్లతో నూతన అన్నదాన భవన నిర్మాణానికి పాలక మండలి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంతో 2,445 నూతన ఆలయాల నిర్మాణం చేపడుతున్నామని, శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీటీడీ పాలకమండలి నిర్ణయాలు ►తిరుమలలో రూ.3.55 కోట్లతో పోలీసు క్వార్టర్స్ ఆధునీకీకరణ ►శ్రీవెంకటేశ్వర వేదిక్ విశ్వవిద్యాలయంలో రూ.5 కోట్లతో వసతి గృహాలు ► రూ.9.5 కోట్లతో టీటీడీ పరిపాలన భవనంలో సెంట్రలైజ్డ్ రికార్డు రూమ్‌కు ఆమోదం ►రూ.97 కోట్లతో స్విమ్స్ ఆస్పత్రి ఆధునీకీకరణకు ఆమోదం ►29 కొట్ల 50 లక్షలతో ఎఫ్ఎంఎస్‌కు కేటాయింపు ►ఒంటి మిట్ట కోదండ రామాలయం వద్ద ప్రతి రోజు అన్న ప్రసాదం వితరణ, నూతన భవన నిర్మాణానికి ► తిరుమలలో 3 కోట్లు10 లక్షలతో తిరుమలలో ప్లాస్టిక్ చెత్త కుండీల ఏర్పాటు. చదవండి: పవన్‌కు చంద్రబాబు వల్లే ప్రాణహాని: పేర్ని నాని ► ఎస్వీ వేదిక్ యునివర్సిటీ స్టాప్ క్వార్టర్స్ నిర్మాణానికి 5 కోట్లు మంజూరు. ►తిరుమలలో ఉన్న కంప్యూటర్లను తొలగించి, రూ.7.44 కోట్లతో ఆదునిక కంప్యూటర్ కొనుగోలుకు నిర్ణయం ►నగిరిలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి 2 కోట్లు కేటాయింపు ►కర్నూలు జిల్లాలో 4 కోట్ల 15 లక్షలతో శ్రీవేంకటేశ్వర ఆలయం పునరుద్ధరణ. ►స్వీమ్స్‌ను పూర్తి స్థాయిలో ఆధునీకరణ చేసి బెడ్స్ మరింత పెంచాలని నిర్ణయం ►1,200 పడకలతో స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధి, 97 కోట్లతో నూతన భవనాలు నిర్మాణం శ్రీకారం. ►జమ్మూ కాశ్మీర్ లో 24 నెలలో ఆలయం పూర్తి చేసి, వైభవంగా ఆలయాన్ని ప్రారంభించాం. ►తిరుచానూరు పుష్కరిణికి ఇత్తడి గ్రిల్స్ అమరిక 6 కోట్లు కేటాయించారు. ►తిరుపతి రామానుజ సర్కిల్ నుండి రేణిగుంట వరకు బిటి రోడ్డు నిర్మాణానికి 5.16 కోట్లు ►పట్టణాలతో సమానంగా గిరిజన ప్రాంతాల్లో కూడా శ్రీవారి ఆలయాలు, కళ్యాణమండపాలు నిర్మిస్తున్నాం. ►గుజరాత్ గాంధీనగర్, ఛత్తీస్‌గఢ్ రాయపుర్ లో త్వరలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేస్తాం ►శ్రీవాణి ట్రస్ట్‌పై కొంతమంది రాజకీయ లబ్ది కోసం అసత్య ప్రచారం చేస్తున్నారు ►సనాతన హిందు దర్శ ప్రచారంలో దేశవ్యాప్తంగా దేవాలయాలు ఏర్పాటుకి శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు. ►వచ్చే నిధులు ఆలయ నిర్మాణం కోసం వాడాలని గొప్ప నిర్ణయం తీసుకున్నాం. ►హుండీ, కార్పస్ ద్వారా వచ్చే ఆదాయం అంతా తెలియపరిచాము, శ్వేతపత్రం విడుదల చేశాం. ►శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగం, టీటీడీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఖండిస్తూ తీర్మానం. ►శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా వచ్చే నిధులతో 2. 445 ఆలయాలు నిర్మాణం చేస్తున్నాం. ►అధికశాతం బలహీన వర్గాలు, బడుగు వర్గాలు ఉన్న ప్రాంతాలలో చేపట్టాం. ►పురాతన ఆలయాలు 200 పైగా పునర్నిర్మాణం చేశాం. ►దూప దీప నైవేద్యాలు, గోసంరక్షణ, ధర్మ ప్రచారం కోసం వినియోగం. ►పది వేలు తీసుకొంటున్నారు, 300 బిల్లు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అవన్నీ అసత్యం ►విరాళం ఇచ్చిన అందరికి విరాళం బిళ్లు, దర్శన టికెట్లకు రసీదులు ఇస్తున్నాం ►ఇలాంటి ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకొంటాం. ►తిరుమలలో నిషేధిత వస్తువులు రావడం అనే దానిపై చర్చించాం. ►ఇలాంటి సమస్యలు రాకుండా నూతన యంత్రాలను ఏర్పాటు చేస్తాం. ►విమానాలు ఆలయంపై తిరగకుండా విమాన శాఖకు లేఖ రాశామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. చదవండి: Viveka Case : సునీత పిటిషన్ జులై 3కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు -
Tirupati : తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయ సమీపంలో అగ్ని ప్రమాదం (ఫొటోలు)
-
‘దేవుడి రథంతో రాజకీయాలా? అగ్నికి ఆహుతి అయినట్లు అబద్దాలా?’
తిరుపతి: తిరుపతిలో జరిగిన అగ్ని ప్రమాదంలో గోవిందరాజుస్వామి వారి రథం అగ్నికి ఆహుతి అయినట్లు వస్తున్న వార్తలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఖండించింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవాలని స్పష్టం చేసింది. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో ఉన్న లావణ్య ఫోటో ఫ్రేమ్స్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆ దుకాణం మాత్రమే అగ్నికి ఆహుతి అయింది తప్ప గోవిందరాజు స్వామి ఆలయ రథానికి ఎటువంటి ప్రమాదం జరగలేదని పేర్కొంది. తిరుపతిలో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. గోవింద రాజస్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో లావణ్య ఫోటో ప్రేమ్స్ దుకాణం అగ్నికి ఆహుతైంది. టీడీపీ విష ప్రచారం సంఘటన ప్రాంతంలో సహాయక చర్యల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఫైర్ ఇంజన్ అధికారులు సకాలంలో చేరుకుని మంటల్ని అదుపు చేస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలు ఈ మంటల్లో చలి కాసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గోవింద రాజస్వామి ఆలయం రథం కాలిపోయిందంటూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అనుకూల మీడియాలో వచ్చిన కథనం రథానికి, లావణ్య ఫ్రేమ్స్ దుకాణానికి చాలా దూరం ఉందని, మంటలు చూసి చలి కాసుకునే విష సంస్కృతి టీడీపీ నేతలదని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. మంటలు అంటుకుంది టీడీపీ సానుభూతి పరుడు దుకాణమేనని కానీ దాన్ని తాము రాజకీయం చేయడం లేదని, మంటలు ఆర్పేందుకు సహాయం చేస్తున్నామని తెలిపారు. రథానికి ఏం కాలేదు.. ఇదీ వాస్తవ దృశ్యం వదంతులు నమ్మవద్దు అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన ప్రాంతం టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. గోవింద రాజస్వామి రథానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని కోరారు. రథాన్ని వెనకకు జరిపి పెట్టామని, మంటలకు దగ్ధమైన షాపుకు రథానికి చాలా దూరం ఉందని తెలిపారు. పది ఫైర్ ఇంజన్లు మంటలను దాదాపు అదుపులోకి తీసుకొచ్చాయని, పది ద్విచక్ర వాహనాలు , ఆరు దుకాణాలు దగ్దమయ్యాయని తెలిపారు. -
తిరుపతిలో అగ్ని ప్రమాదం..
సాక్షి, తిరుపతి: తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోవింద రాజస్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున ఎగసి పడ్డ మంటలు చుట్టు పక్కల దుకాణాలకు వ్యాపించగా, సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను చూసి భక్తులు భయంతో పరుగులు తీశారు. మాడవీధిలో రాకపోకలను నిలిపివేశారు అధికారులు. కాగా అగ్ని ప్రమాదం జరిగిన చోటే గోవిందరాజ స్వామి రథం ఉంది. టీడీపీ విష ప్రచారం సంఘటన ప్రాంతంలో సహాయక చర్యల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఫైర్ ఇంజన్ అధికారులు సకాలంలో చేరుకుని మంటల్ని అదుపు చేస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలు ఈ మంటల్లో చలి కాసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గోవింద రాజస్వామి ఆలయం రథం కాలిపోయిందంటూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రథానికి, లావణ్య ఫ్రేమ్స్ దుకాణానికి చాలా దూరం ఉందని, మంటలు చూసి చలి కాసుకునే విష సంస్కృతి టీడీపీ నేతలదని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. మంటలు అంటుకుంది టీడీపీ సానుభూతి పరుడు దుకాణమేనని కానీ దాన్ని తాము రాజకీయం చేయడం లేదని, మంటలు ఆర్పేందుకు సహాయం చేస్తున్నామని తెలిపారు. వదంతులు నమ్మవద్దు అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన ప్రాంతం టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. గోవింద రాజస్వామి రథానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని కోరారు. రథాన్ని వెనకకు జరిపి పెట్టామని, మంటలకు దగ్ధమైన షాపుకు రథానికి చాలా దూరం ఉందని తెలిపారు. పది ఫైర్ ఇంజన్లు మంటలను దాదాపు అదుపులోకి తీసుకొచ్చాయని, పది ద్విచక్ర వాహనాలు , ఆరు దుకాణాలు దగ్దమయ్యాయని తెలిపారు. చదవండి: ప్రజలకు మంచి చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదు: సీఎం జగన్ -
యూ ట్యూబ్ వీడియోలు చూసి దొంగ నోట్లు ముద్రించిన యువకుడు
-
సంపు క్లీన్ చేస్తుండగా విద్యుత్ షాక్.. ముగ్గురు మృతి..
చిత్తూరు: చౌడేపల్లి మండలం పెద్ద కొండామారిలో విషాద ఘటన జరిగింది. విద్యుత్ షాక్‌కు గురై ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సంపు క్లీన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు విడిచారు. మృతులను రమణ, మునిరాజా, రవిలుగా గుర్తించారు. మోటారు వైరు తెగి సంపులో పడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని కుటుంబసభ్యులు తెలిపారు. విగతజీవులుగా మారిన వారిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. చదవండి: ఘోర ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు దుర్మరణం.. -
పట్టాలు తప్పిన డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
సాక్షి, గుడుపల్లె(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్లే డబుల్ డెక్కర్ రైలు గుడుపల్లె మండలం బిసానత్తం రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం పట్టాలు తప్పింది. ఉదయం 11 గంటల సమయంలో చెన్నై నుంచి బెంగళూరుకు బయలు దేరిన ఈ రైలు రెండో కోచ్ చక్రాలు కర్ణాటక సరిహద్దులోని బిసానత్తం వద్ద కిందకు దిగిపోయాయి. దీంతో పైలెట్ గమనించి రైలును ఆపేయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. పట్టాలు తప్పిన కోచ్‌లో 130 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ రైలును క్రమబద్ధీకరించేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. డబుల్ డెక్కర్ రైలు పట్టాలు తప్పడంతో చెన్నై-బెంగళూరు మార్గంలో రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు ఐదు గంటలు ఆలస్యంగా నడిచాయి. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. -
చిత్తూరు జిల్లా బ్యూటీషియన్ దుర్గా ప్రశాంతి హత్య కేసు నిందితుడు అరెస్ట్
-
బ్యూటీషియన్ మృతి.. చక్రవర్తి స్పృహలోకి వస్తేనే అసలు విషయం తెలిసేది?
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని మంగళవారం ఓ బ్యూటీషియన్ చనిపోవడం.. పక్కనే ఆమె స్నేహితుడు రక్తపుమడుగులో పడి ఉండటం సంచలనం సృష్టించింది. ఇద్దరూ రక్తపుమడుగులో పడి ఉండటంతో యువతి గొంతు కోసి చంపి.. ఆ తర్వాత ఆమె స్నేహితుడు గొంతు, ఛాతి, చేతులు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటాడని తొలుత భావించారు. అయితే, పోలీసులు వచ్చి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మృతురాలి శరీరంపై ఎక్కడా చిన్నగాయం కూడా కనిపించలేదు. యువతిని ఆమె స్నేహితుడు గొంతు నులిమి చంపేసి, అనంతరం అతను బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు నగరంలోని తాలూకా పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగరాజు, ఇందిర దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. కుమారుడు 15 ఏళ్ల క్రితం విద్యుత్ షాక్‌తో చనిపోయాడు. పెద్ద కుమార్తెకు ఏడాది క్రితం పెళ్లి చేశారు. రెండో కుమార్తె దుర్గాప్రశాంతి(23) ఎం.ఫార్మసీ పూర్తిచేసి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కొంతకాలం పనిచేసింది. ఆమె ఏడాది క్రితం హైదరాబాద్‌కు వెళ్లి బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంది. నాలుగు నెలల క్రితం చిత్తూరులోని కొండమిట్ట ప్రాంతంలో సొంతగా బ్యూటీపార్లర్ ప్రారంభించింది. ఫేస్బుక్ ద్వారా పరిచయమై.. దుర్గాప్రశాంతికి రెండేళ్ల క్రితం ఫేస్బుక్లో చక్రవర్తి (27) అనే యువకుడు పరిచయమయ్యాడు. అతనిది తెలంగాణలోని భద్రాచలం జిల్లా కొత్తగూడెం కాగా, రెండేళ్లు దుబాయ్‌లో వంట మాస్టర్‌గా పనిచేశాడు. ఆ సమయంలోనే చక్రవర్తికి, దుర్గాప్రశాంతికి ఫేస్బుక్ ద్వారా స్నేహం కుదిరింది. రెండు నెలల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన చక్రవర్తి.. తన తల్లిని తీసుకుని చిత్తూరు వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. నగరంలోని దర్గా కూడలిలో బ్రెడ్ ఆమ్లెట్ దుకాణం పెట్టి జీవనం సాగిస్తున్నాడు. ఇతని తల్లి, దుర్గాప్రశాంతి తల్లి ఇందిర కూడా స్నేహితులుగా మారారు. రెండు రోజుల క్రితం ఇద్దరూ కలిసి కాణిపాకం వినాయకస్వామి ఆలయానికి కూడా వెళ్లి వచ్చారు. దుర్గాప్రశాంతి బ్యూటీపార్లర్ వద్దకు మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో చక్రవర్తి వచ్చాడు. ఇద్దరూ లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇందిర వచ్చి బ్యూటీపార్లర్ తలుపు తీసి చూడగా.. దుర్గాప్రశాంతి రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉంది. చక్రవర్తి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాసమూర్తి, సీఐ నరసింహరాజు ఘటనాస్థలానికి చేరుకుని చక్రవర్తిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దుర్గాప్రశాంతి అప్పటికే చనిపోయి ఉంది. చక్రవర్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రిమ్స్‌కు తరలించారు. ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద దుర్గాప్రశాంతి మృతదేహాన్ని ఎస్పీ రిషాంత్‌రెడ్డి పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. చదవండి: 'నేను డేంజర్లో ఉన్నా' అని లవర్‌కు మెసేజ్.. కాసేపటికే ముగ్గురూ బీచ్‌లో.. ఇప్పుడే పెళ్లి వద్దంటూ.. దుర్గాప్రశాంతికి పెళ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ఇటీవల ఒక సంబంధం చూశారు. అబ్బాయి వైద్యుడు అని, పెళ్లి చేసుకోవాలని కోరారు. అయితే, ఏడాది తర్వాత పెళ్లి గురించి చూద్దామని దుర్గాప్రశాంతి చెప్పింది. ఈ నేపథ్యంలో చక్రవర్తి, దుర్గాప్రశాంతికి మధ్య ఏదైనా గొడవ జరిగి.. ఆమె గొంతు నులిమి చంపేసి, అతను బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడా..? అని పోలీసులు అనుమానిస్తున్నారు. దుర్గాప్రశాంతి ఆత్మహత్య చేసుకుందనడానికి ఘటనాస్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. చక్రవర్తి స్పృహలోకి వస్తేనే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. -
చిత్తూరు కొండమిట్టలో దారుణం.. బ్యూటీపార్లర్‌లోకి ప్రవేశించి..
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని కొండమిట్టలో దారుణం జరిగింది. బ్యూటీ పార్లర్లో పనిచేస్తున్న యువతిని అత్యంత కిరాతంగా గొంతుకోసి చంపేశాడు ఓ యువకుడు. వేలూరు రోడ్డులోని ఆనందా ధియేటర్ వద్ద మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బ్యూటీ పార్లర్‌లోకి ప్రవేశించిన యువకుడు చక్రవర్తి.. ముందుగానే తనతో తెచ్చుకున్న పదునైన కత్తితో విచక్షణారహితంగా ప్రశాంతి గొంతు కోశాడు. తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రక్తపు మడుగులో పడి ఉన్న యువతి, యువకులను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్ర రక్తస్రావంతో యువతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. పోస్టుమార్టం నిమిత్తం యువతి మృత దేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కొన ఊపిరితో ఉన్న చక్రవర్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. కాగా మృతురాలు చిత్తూరు పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ నాగరాజు కూమార్తెగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతిపై దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇతరులెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? లేక యువకుడే దాడి చేశాడా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. చదవండి: 'నేను డేంజర్లో ఉన్నా' అని లవర్‌కు మెసేజ్.. కాసేపటికే ముగ్గురూ బీచ్‌లో.. -
ఏపీలో టెక్నో పెయింట్స్ ప్లాంట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెయింట్స్ తయారీలో ఉన్న టెక్నో పెయింట్స్ రూ.46 కోట్లతో కొత్తగా మూడు ప్లాంట్లను ఈ ఏడాదే నెలకొల్పుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, చిత్తూరుతోపాటు మధ్యప్రదేశ్‌లోని కట్నీ వద్ద ఇవి రానున్నాయి. ఈ కేంద్రాల్లో డ్రై సిమెంట్ పుట్టీ, టెక్స్చర్స్, ప్రైమర్స్, ఎమల్షన్స్ తయారు చేస్తారు. తొలి దశలో ఒక్కొక్క ప్లాంటు వార్షిక సామర్థ్యం 30,000 మెట్రిక్ టన్నులని టెక్నో పెయింట్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఫార్చూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ‘తెలంగాణ ప్రభుత్వం నుంచి మన ఊరు–మన బడి, మన బస్తీ–మన బడి కార్యక్రమంలో భాగంగా 26,065 పాఠశాలలకు రంగులు వేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టాం. 2023లో దేశవ్యాప్తంగా రిటైల్‌లో విస్తరిస్తాం. విక్రయ కేంద్రాల్లో కలర్ బ్యాంక్స్ పరిచయం చేస్తాం. వీటితో వినియోగదారు కోరుకున్న రంగును వెంటనే అందించవచ్చు. 2022–23లో 100 శాతం వృద్ధి సాధించాం’ అని వివరించారు. -
బ్యూటీషియన్‌కు షాక్.. లక్ష కడితే నెలకు రూ.40 వేల వడ్డీ.. చివరికి..
చిత్తూరు అర్బన్: ‘రూ.లక్ష పెట్టుబడి పెట్టండి. ప్రతి వారం రూ.10 వేలు పట్టుకెళ్లండి. మూడేళ్ల తర్వాత మీరు పెట్టిన రూ.లక్ష పెట్టుబడిని వెనక్కు ఇచ్చేస్తాం. మీరు పెట్టిన రూ.లక్షకు బాండు ఇదిగో’ అంటూ ఓ బ్యూటీషియన్‌ను మోసం చేసి ఏకంగా రూ.45 లక్షలు కాజేసిన ఉదంతమిది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. చిత్తూరు వన్‌టౌన్ పోలీసులు సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నరసింహరాజు కథనం ప్రకారం.. చిత్తూరు నగరంలోని చేపల మార్కెట్ వీధికి చెందిన అనురాధ కొంగారెడ్డిపల్లెలోని బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నారు. బజారులో ఉన్న ఏవోజీ అనే కంపెనీలో డబ్బులు డిపాజిట్ చేస్తే మంచి లాభాలు ఇస్తున్నారంటూ తన బంధువు చెప్పడంతో అనూరాధ అక్కడకు వెళ్లింది. రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.40 వేలు వడ్డీ ఇస్తామని.. మూడేళ్ల తరువాత పెట్టుబడి రూ.లక్షను సైతం ఇచ్చేస్తామని ఏవోజీ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. అయితే, కంపెనీ నిబంధనల ప్రకారం తొలి మూడు నెలల వరకు వడ్డీ రాదని, నాలుగో నెల నుంచి మొత్తం చెల్లిస్తామని చెప్పారు. ఇంత పెద్ద మొత్తం వస్తుందని ఆశపడ్డ అనూరాధ తనతో పాటు తన సమీప బంధువుల నుంచి అప్పు తీసుకుని, ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి ఏవోజీ కంపెనీ ప్రతినిధులకు ఏకంగా రూ.45 లక్షలు చెల్లించారు. చదవండి: జ్యోతిష్యుడితో వివాహేతర సంబంధం .. రెండు ఇళ్లు, డబ్బులు అడగడంతో మూడు నెలలు దాటడంతో వడ్డీ తీసుకుందామని కంపెనీకి వెళ్లిన అనూరాధ బోర్డు తిప్పేసినట్టు గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. ఈ కంపెనీలో మరికొందరు కూడా పెద్దఎత్తున నగదు జమ చేసినట్లు తెలుస్తోంది. రూ.కోట్లలో డిపాజిట్లు చేసిన వాళ్లకు అసలు విషయం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని, ఇంకా ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేస్తే వాటిపై కూడా కేసు నమోదు చేస్తామని సీఐ పేర్కొన్నారు. -
గుండెపోటుతో వైఎస్సార్సీపీ నేత మృతి
చిత్తూరు: నాగలాపురానికి చెందిన మాజీ ఎంపీపీ, మొదలియార్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కల్పన భర్త విజయకుమార్(50) శుక్రవారం వేకువ జామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. సమాచారం అందుకున్న జెడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు కోనేటి సుమన్‌కుమార్ నాగలాపురంలోని మృతుని స్వగృహానికి చేరుకొని విజయ్‌కుమార్ భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందించి ఓదార్చారు. సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నాగలాపురం చేరుకొని విజయకుమార్ మృతదేహానికి గజమాలతో నివాళి అరి్పంచారు. మృతుని భార్య కల్పన, పిల్లలకు తన సానుభూతిని తెలియజేశారు. విజయకుమార్ పార్టీ ఆవిర్భావం నుంచి నాగలాపురంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన లేనిలోటు పారీ్టకి తీర్చలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కనీ్వనర్ అపరంజిరాజు, రైతు సలహా మండలి చైర్మన్ చిన్నదొరై, వైఎస్సార్ టీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్ఎం సురే‹Ù, సచివాలయ మండల కనీ్వనర్ మోహన్ మొదలి, నాయకులు పాల్గొన్నారు. -
ఒక అమ్మాయితో ప్రేమ.. మరో యువతితో నిశ్చితార్థం
చిత్తూరు: ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని ఓ యువతి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. పట్టణలోని ఆజాద్ రోడ్డుకు చెందిన మణి కుమార్తె నక్షత్ర బెంగళూరులో డిగ్రీ చదువుతోంది. అలాగే స్థానిక జయప్రకాష్రోడ్డుకు చెందిన మూర్తి కుమారుడు ఆకాష్ తరచూ నక్షత్ర వెంటపడేవాడు. ప్రేమిస్తున్నానని చుట్టూ తిరిగేవాడు. కొన్నాళ్లకు అతడి మాటలు నమ్మిన యువతి ప్రేమలో పడింది. ఈ విషయం తెలుసుకున్న ఇరువురి కుటుంబీకులు వారి వివాహానికి అంగీకరించారు. అయితే అమ్మాయి చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేద్దామని నక్షత్ర తల్లిదండ్రులు చెప్పడంతో, ముందు నిశ్చితార్థం జరిపించారు. ఈ క్రమంలో ఏడాది నుంచి ఆకాష్ మరో యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు నక్షత్రకు తెలిసింది. దీనిపై ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. సమస్యలు పరిష్కరించుకుందామని ఒకరోజు ఆకాష్ తన వెంట నక్షత్రను బెంగళూరులో ఓ భవనం పైకి తీసుకెళ్లాడు. మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఆమెను కిందకు తోసేశాడు. దీంతో నక్షత్ర తీవ్రంగా గాయపడింది. కాలు విరిగిపోవడంతో వీల్‌చైర్‌కే పరిమితమైంది. ఇదే సాకుగా చూపుతూ ఆకా‹Ù, తల్లిదండ్రులు అడ్డంతిరిగారు. నడవలేని అమ్మాయిని పెళ్లి చేసుకోలేమని తేలి్చచెప్పేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. -
‘అందులో ఈనాడు రామోజీరావు పాత్ర ఉంది’
సాక్షి, చిత్తూరు: ఈనాడు,రామోజీపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్కిల్ స్కాంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారన్నారు. ‘‘అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ ఆధారాలు బయటపెట్టారు.. కానీ ఈనాడు పత్రికలో ప్రచురించలేదు. నవరత్నాలు గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కానీ ఏనాడు ఈనాడులో ఒక్క మంచి వార్త కూడా రాలేదు’’ అని నారాయణ స్వామి దుయ్యబట్టారు. ‘‘ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. అందులో రామోజీరావు పాత్ర ఉంది. అను నిత్యం సీఎం జగన్‌పై విషం చల్లుతున్నారు. రామోజీరావు తాటాకు చప్పుళ్లకు వైఎస్ జగన్ భయపడరు’’ అని డిప్యూటీ సీఎం అన్నారు. చదవండి: డబ్బున్నవాళ్లే పేదల్ని ఆదుకోవాలా? -
మహిళా దినోత్సవ సందర్భంగా చిత్తూరు మేయర్ పై స్పెషల్ స్టోరీ
-
టీడీపీలో చేరాలంటూ బంపర్ ఆఫర్లు
లోకేష్ యువగళం పాదయాత్రను హైలెట్ చేసేందుకు టీడీపీ నేతలు పడరానిపాట్లు పడుతున్నారు. చినబాబు ఆధ్వర్యంలో ఇతర పార్టీ నేతలను చేర్పించేందుకు నానాతంటాలు పడుతున్నారు. ఇందులో ముఖ్యంగా గ్రామస్థాయిలో చురుగ్గా పనిచేస్తున్న వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు వెళ్లి మధ్యస్తాలు పెడుతున్నారు. తమ పార్టీలో చేరాలంటూ కాళ్లబేరానికి దిగుతున్నారు. లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ కొండువా కప్పుకోవాలని బతిమలాడుతున్నారు. ఆయన పాదయాత్రగా వచ్చేటప్పుడు పూల దండ వేసి స్వాగతం పలకాలని కాళ్లావేళ్లాపడుతున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మీరేం కోరుకున్నా చేస్తామంటూ బంపర్ ఆపర్లు ఇస్తున్నారు. కానీ జగన్ సైన్యం ససేమిర అంటున్నారు. ‘మీకో దండం.. మేం రాం’ అంటూ ముఖాన్నే చెప్పేస్తున్నారు. దీంతో చేసేది లేక టీడీపీ నేతలు బిక్కమొఖాలేస్తున్నారు. సాక్షి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ నేత లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు స్పందన లేకపోవడంతో ఆ పార్టీ నేతలు రకరకాల ఎత్తులు, కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు. ఇటీవల శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలంలో ఓ టీడీపీ కార్యకర్తకు చెందిన ఆరు ఎకరాల వేరుశనగ పంటను దున్నేసి దాన్ని వైఎస్సార్సీపీపై నెట్టాలని ప్రయత్నించారు. ఆ పంటను చినబాబు పరిశీలించి వైఎస్సార్సీపీపై చిందులేసే విధంగా స్కెచ్చేశారు. కానీ అది బెడిసికొట్టడంతో ఇప్పుడు కొత్త నాటకాలకు తెరలేపుతున్నారు. క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్న వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్‌గా ఎంచుకుంటున్నారు. వారిని ఎలాగైనా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీలో చేరేవిధంగా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే శ్రీకాళహస్తి నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్రకు ముందు రోజు టీడీపీ నేతలు బొజ్జల సుధీర్‌రెడ్డి, మండల స్థాయి నాయకులు కొందరు గతంలో ఆ పార్టీ కోసం పనిచేసిన వారి నివాసాలుకు వెళ్లారు. అలాగే వైఎస్సార్సీపీ నేతలను విడివిడిగా కలిసి టీడీపీలోకి ఆహ్వానించగా.. వారు ససేమిర అనడంతో చేసేదిలేక అక్కడి నుంచి వెనుదిరిగినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తిరుపతిలో అద్దె మనుషులకు పార్టీ కండువాలు? తిరుపతి అసెంబ్లీ పరిధిలో యువగళం పాద యాత్ర సాగుతుండడంతో స్థానిక టీడీపీ శ్రేణులు వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ‘పార్టీలో చేరండి, లేదంటే పాదయాత్రలో పాల్గొనండి’ అంటూ ప్రాధేయపడుతున్నారు. ఎవ్వరూ సుముఖంగా లేకపోవడంతో కొందరు అద్దె మనుషులను పిలిపించి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించేలా ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. ప్రత్యేక నిఘా గ్రామస్థాయిలో ముఖ్యమైన వైఎస్సార్సీపీ నేతలను కలిసేందుకు టీడీపీ ఓ బృందాన్ని రెడీ చేసింది. ఆ బృందంలోని సభ్యులు యువగళం పాదయాత్ర సాగే ముందురోజు ఆయా గ్రామాల్లోని నేతల ఇళ్లకు వెళ్లడం.. వారిని పార్టీలోకి రావాలని బతిమలాడుతూ బేరసారాలు కుదర్చడమే పనిగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. గ్రామంలో ద్వితీయ, తృతీయ స్థాయి నాయకులైతే ఆయా మండలాల నాయకులే వెళ్లి కలుస్తున్నట్టు సమాచారం. మరో వైపు శ్రీకాళహస్తిలో తనయుడు బొజ్జల సుధీర్‌రెడ్డితోపాటు తల్లి బొజ్జల బృందమ్మ సైతం నియోజకవర్గంలో ముఖ్యనాయకుల నివాసాలకు వెళ్లి రహస్య మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. ఇదిగో సాక్ష్యం కుప్పం నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర జీడీనెల్లూరు నియోజకవర్గం మీదుగా సాగింది. మార్గంమధ్యలోని శ్రీరంగరాజపురం మండలంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు టీడీపీలో చేరేలా ఆ పార్టీ నేతలు ప్రణాళిక రచించారు. అందులో భాగంగా కృష్ణమూర్తి(పేరుమార్చాం) నాయకుడి ఇంటికెళ్లి టీడీపీలో చేరాలని బతిమలాడారు. లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకోవాలని కాళ్లావేళ్లాపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పదవులు ఇస్తామని నమ్మబలికారు. చిన్నాచితక కాంట్రాక్టర్ పనులూ చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు. కానీ ఆయన ‘మాకొద్దు బాబు’ అంటూ వారి ముఖాన్నే చెప్పడంతో ఖంగుతిన్నారు. చేసేది లేక ఉసూరుమంటూ వెనుదిరిగారు. మూడు రోజుల క్రితం శ్రీకాళహస్తి నియోజకవర్గం, పాపానాయుడుపేట మండలంలో లోకేష్ పాదయాత్ర సాగింది. స్థానికంగా చురుగ్గా ఉన్న వైఎస్సార్సీపీ నాయకుడు (బుచ్చిరెడ్డి) పేరుమార్చాం ఇంటికి డబ్బు, పార్టీ కండువాలతో టీడీపీ నాయకులు వెళ్లారు. లోకేష్ ఆధ్వర్యంలో పార్టీలో చేరాలని బేరాలకు దిగారు. మీరుచెబితే గ్రామస్తులు కూడా చాలామంది చేరుతారని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఏం కావాలన్నా చేస్తామంటూ ఆఫర్లు కురిపించారు. కానీ ఆయన ‘మేం రాం’ అంటూ తెగేసి చెప్పడంతో అక్కడి నుంచి ఉడాయించారు. .. జిల్లాలో ఇవి మచ్చుకు రెండు మాత్రమే. లోకేష్ పాదయాత్రలో ఇలాంటివి నిత్యకృత్యం. వైఎస్సార్సీపీ నేతలే టార్గట్‌గా టీడీపీనేతలు బేరాలకు దిగుతున్నారు. ఆఫర్లమీద ఆఫర్లు ఇస్తూ పార్టీలో చేరాలని గడ్డాలు పట్టుకుని మరీ బతిమలాడుతున్నా.. జగన్ సైన్యం అందుకు ససేమిర అనడం చర్చనీయాంశమవుతోంది. -
ఒక్కరే మిగిలారు
సాక్షి, చిత్తూరు : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకపక్షంగా మారింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి సిపాయి సుబ్రమణ్యం నామినేషన్ ఒక్కటే మిగలడంతో ఈ స్థానం ఏకగ్రీవం కానుంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం శుక్రవారం కలెక్టరేట్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, జేసీ వెంకటేశ్వర్ పరిశీలించారు. మధ్యాహ్న వరకు కొనసాగిన పరిశీలనలో సిపాయి సుబ్రమణ్యం సమర్పించిన పత్రాలు అన్నీ పక్కాగా ఉండడంతో నామినేషన్‌ను ఆమోదించారు. స్వతంత్ర అభ్యర్థి ధనంజయయాదవ్ నామినేషన్లో సక్రమంగా వివరాలు లేకపోవడంతో తిరస్కరించారు. దీంతో సిపాయి సుబ్రమణ్యం ఒక్కరే బరిలో మిగిలారు. ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీగా ఎన్నికై న అభ్యర్థిని ప్రకటించనున్నట్లు జేసీ వెల్లడించారు. వార్ వన్ సైడ్! ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల్లో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులే అధికంగా ఉన్నారు. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకే అని పలువురు విశ్లేషకులు వెల్లడించారు. ఈ క్రమంలో ఆ పార్టీ అభ్యర్థి సిపాయి సుబ్రమణ్యం నామినేషన్ ఒక్కటే మిగలడంతో వార్ వన్‌సైడ్‌గా మారిందని వివరించారు. కేడర్‌లో జోష్ వైఎస్సార్సీపీ అభ్యర్థి సునాయాసంగా గెలుస్తుండడం వైఎస్సార్సీపీ కేడర్‌లో ఉత్సాహం నింపింది. 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా నడిచిన క్రమంలో ఇది రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ కార్యకర్తలకు మరింత బూస్టప్ ఇస్తుందని నేతలు భావిస్తున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రభావం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం త్వరలోనే జరగనున్న టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పడనుంది. సిపాయి సుబ్రమణ్యం ఏకగ్రీవంగా గెలుస్తున్న క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు మరింత ఉత్సాహంతో పనిచేసే అవకాశముంది. వైఎస్సార్సీపీ బలపరిచిన పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డిని గెలిపించుకునేందుకు పార్టీ ప్రజాప్రతినిధులు సైతం సమష్టిగా పనిచేస్తున్నట్లు పలువురు నేతలు వెల్లడిస్తున్నారు. బీసీలకు స్వర్ణయుగం జగనన్న పాలనలో బీసీలకు స్వర్ణయుగం వచ్చిందన్నారు. నాపై నమ్మకంతో ఎమ్మెల్సీగా నిలబెట్టిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటా. వెనుకబడిన వర్గాలకు చెందిన అన్ని కులాల వారికి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే న్యాయం జరిగింది. – సిపాయి సుబ్రమణ్యం, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పట్టభద్రులు 23.. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి 8 నామినేషన్లు చిత్తూరు కలెక్టరేట్: ఉమ్మడి ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు జిల్లాల పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు దాఖలు చేసిన నామినేషన్లను శుక్రవారం కలెక్టరేట్లో క్షుణ్ణంగా పరిశీలించారు. అబ్జర్వర్లు కాటమనేని భాస్కర్, కోన శశిధర్లు, అభ్యర్థుల సమక్షంలో ఎన్నికల అధికారి హరినారాయణన్ నామినేషన్ల పరిశీలన చేపట్టారు. ఆమోదం పొందిన, తిరస్కరించిన అభ్యర్థుల జాబితాను మధ్యాహ్నం 3 గంటలకు నోటీస్ బోర్డులో పెట్టారు. ఈ నెల 27వ తేదీన బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. డీ ఆర్ఓ రాజశేఖర్, ఏఓ కులశేఖర్, సూపరింటెండెంట్లు మురళి, వెంకటేశ్వర్, శేషగిరి, డీఎస్పీలు శ్రీనివాసమూర్తి, తిప్పేస్వామి, సీఐలు మద్ధయ్య ఆచారి, నరసింహరాజు పాల్గొన్నారు. ఆమోదం.. తిరస్కరణ నామినేషన్ల పరిశీలన అనంతరం పట్టభద్రులకు సంబంధించి 30కి గాను 23 నామినేషన్లను ఆమోదించారు.వివిధ కారణాలతో 7 నామినేషన్లు తిరస్కరించారు. ఉపాధ్యాయుల స్థానానికి 8 నామినేషన్లకు గాను 8 ఆమోదం పొందాయని అధికారులు ప్రకటించారు. -
సమర్థవంతంగా ఎన్నికల విధులు
చిత్తూరు కలెక్టరేట్ : సెక్టోరియల్ అధికారులు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని, సమర్థవంతంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డీఆర్ఓ రాజశేఖర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో సెక్టోరల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపు, వీల్ చైర్స్, విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, వెబ్ క్యాస్టింగ్‌కు ఏర్పాట్లు చేసి నివేదిక సమర్పించాలన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులకు వేర్వేరుగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతం పంపించాలని స్పష్టం చేశారు. ఎన్నికల హెల్ప్‌డెస్క్ పరిశీలన ఎమ్మెల్సీ ఎన్నికలకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను డీఆర్ఓ రాజశేఖర్ శుక్రవారం పరిశీలించారు. -
అసత్య కథనాలపై ఆగ్రహం
సదుం: ఈనాడు దినపత్రిక పాఠకుల విశ్వనీయత కోల్పోయిందని, విలువలను పూర్తిగా వదిలేసిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వంపై తప్పుడు కథనాల ప్రచురించినందుకు నిరసనగా శుక్రవారం సదుంలో ఈనాడు ప్రతులను దహనం చేశారు. చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యంగా ఎల్లో మీడియా పని చేయడం దారుణమన్నారు. ఈనాడు, ఏబీఎన్, టీవీ5లను ప్రజలు నమ్మడం మానేశారని చెప్పారు. ఇప్పటికై నా వాస్తవాలను ప్రచురించకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఎవరెన్న ప్రయత్నాలు చేసిన అంపశయ్యపై ఉన్న టీడీపీని బతికించలేరని స్పష్టం చేశారు. ఎంపీపీ ఎల్లప్ప, సచివాలయాల మండల కన్వీనర్ ప్రకాష్‌రెడ్డి, సర్పంచ్ ఉషారాణి, కో–ఆప్షన్ సభ్యుడు ఇమ్రాన్, మాజీ ఎంపీపీ వెంకటస్వామి, సయ్యద్‌బాషా, పుట్రాజు, హనుమంతరెడ్డి, ఇర్పాన్, భాస్కర్ పాల్గొన్నారు. శ్రీరంగరాజపురం: తప్పుడు కథనాలను ప్రచురించడంలో రామోజీరావు దిట్టని జెడ్పీటీసీ సభ్యుడు రమణప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఈనాడు దినపత్రిక ప్రతులను శుక్రవారం దహనం చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు మాట్లాడుతూ పట్టాభిని కొట్టారంటూ పాత ఫొటోలతో తప్పుడు కథనం ప్రచురించి ప్రజలను ,చట్టాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తప్పుడు వార్తలు రాయించినందుకు రామోజీరావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు జనార్ధన్, కుప్పయ్య, మణి, బాబు, చిన్నబ్బ, బాలకృష్ణ యాదవ్, రామచంద్రయాదవ్, రామకృష్ణ పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఎమ్మెల్సీ ఎన్నికలు
చిత్తూరు కలెక్టరేట్ : పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అబ్జర్వర్లు కాటమనేని భాస్కర్, కోన శశిధర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై ఆర్ఓ, కలెక్టర్ హరి నారాయణన్, ఎస్పీ రిశాంత్‌రెడ్డితో సమావేశం నిర్వహించారు. అబ్జర్వర్లు మాట్లాడుతూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్ఓ మాట్లాడుతూ పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ బాక్సులను ఇప్పటికే సిద్ధం చేశామని తెలిపారు. నోడల్ అధికారుల పర్యవేక్షణలతో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. కోడ్ ఆఫ్ కండక్ట్ పరిశీలనకు మండలస్థాయిలో ప్రత్యేక టీమ్‌లను నియమించినట్లు చెప్పారు. ఎస్పీ రిశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు అవసమైన బందోబస్తు కల్పిస్తున్నామని వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో.. ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపడుతున్నట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఆరు జిల్లాల పరిధిలో 3లక్షల 83 వేల మంది ఓటర్లు ఉంటారని, పోలింగ్ నిర్వహణకు గానూ 320 పోలింగ్ స్టేషన్లు, 133 అదనపు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు దాదాపు 27 వేల మంది ఓటర్లు ఉన్నారని, 170 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆరు జిల్లాలలోని కలెక్టర్లు, డీఆర్ఓలు, ఆర్డీఓలు ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైనట్లు వెల్లడించారు. నామినేషన్ల పరిశీలన పూర్తయిందని, 27వ తేదీన తుది జాబితా ప్రకటించనున్నట్లు చెప్పారు. 2వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. -
మా బిడ్డను పొట్టనపెట్టుకున్నారు..!
మదనపల్లె : మా బిడ్డను పొట్టన పెట్టుకున్నారని బాధితులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రి వర్గాలతో శుక్రవారం ఘర్షణకు దిగారు. వివరాలు.. పుంగనూరు మండలం ఈడిగపల్లెకు చెందిన వెంకటేష్ భార్య లోకేశ్వరి 3 నెలల కిందట జిల్లా ఆస్పత్రిలో మొదటి కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారి ఐదు రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతుండడంతో పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం ఊపిరాడకపోగా పరిస్థితి విషమంగా మారడంతో ఇంజెక్షన్ వేశారు. అయినా ఎలాంటి మార్పు రాకపోవడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఇక్కడి వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. దీంతో చంటిబిడ్డ తల్లిదండ్రులు ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. చికిత్సలో తమ తప్పు లేదని ఆస్పత్రి యాజమాన్యం చెప్పడంతో.. చేసేదిలేక విషణ్ణవదనంతో బిడ్డను తీసుకుని ఇంటికెళ్లిపోయారు. -
విజయ డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభం
తిరుపతి కల్చరల్: రెడ్డి రెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన విజయ డయాగ్నొస్టిక్ సెంటర్‌ను శుక్రవారం ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తమ విజయ డయాగ్నొస్టిక్ సెంటర్లు దేశ వ్యాప్తంగా ఉన్నాయని తెలిపారు. 125వ సెంటర్‌ను తిరుపతిలో ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఇక్కడ బోర్ 3టీ ఎంఆర్ఐ, మల్టీ డైమెన్షనల్ సిటీ, గామా కెమెరా, పూర్తి ఆటోమేటెడ్ ల్యాబ్, డిజిటల్ మామోగ్రఫీ వంటి అత్యాధునిక పరికాలు ఉన్నాయని తెలిపారు. ప్రాథమిక రక్త పరీక్ష నుంచి పూర్తి స్థాయి రోగ నిర్ధారణ పరిశోధనలు, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా చేస్తామని పేర్కొన్నారు. సెంటర్ ప్రారంభం సందర్భంగా ఈనెల 28వ తేదీ వరకు ఉచితంగా షుగర్, థైరాయిడ్ పరీక్షలు చేస్తామన్నారు. -
చిత్తూరు కలెక్టరేట్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్
-
జగన్ మళ్లీ సీఎం కావాలంటూ బైక్ యాత్ర
చిత్తూరు (కార్పొరేషన్): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభిమానంతో ఓ యువకుడు హైదరాబాద్ నుంచి బైక్ యాత్ర చేపట్టాడు. ఈ నెల 6న ప్రారంభమైన ఈ యాత్ర ఆదివారం చిత్తూరు చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు వీరాభిమాని అయిన వీరబాబు మాట్లాడుతూ.. ‘మాది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం. 2009లో ఖమ్మంలోని వజీర్ సుల్తాన్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్‌లో చేరాను. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్‌మెంట్స్ ద్వారా నాలుగేళ్లు (రూ.1.60 లక్షల ఖర్చుతో) బీటెక్ పూర్తి చేశా. ఆ తరువాత హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించా. వైఎస్సార్ తనయుడు సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానంతో హైదరాబాద్ నుంచి విజయనగరానికి బైక్ యాత్ర మొదలుపెట్టా. ఉదయం 10 గంటలకు యాత్ర ప్రారంభించి సాయంత్రం 6 గంటలకు ముగిస్తున్నా. రోజుకు 100 నుంచి 120 కిలోమీటర్లు వెళ్తున్నా. రాత్రివేళ ఎక్కడికక్కడ లాడ్జిలో బసచేస్తూ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కింద నైట్ షిఫ్ట్ డ్యూటీ చేస్తున్నా. జగనన్న అందిస్తున్న పథకాలు ఎంతగానో నచ్చాయి. అందుకే.. ఆయనే మరోసారి సీఎం కావాలని ఆకాంక్షిస్తూ బైక్ యాత్ర చేపట్టా’ అని వివరించారు. చదవండి: బెజవాడలో టీడీపీ గూండాల బరితెగింపు -
నారా లోకేష్ ఫ్లాప్ షో.. యువగళం ‘గండాలు’
సాక్షి టాస్క్‌ఫోర్స్, తిరుపతి: గండాలు.. కన్నీటి సుడిగుండాల మధ్య లోకేష్ పాదయాత్ర సాగుతోంది. నాయకులకే కాదు.. అటు కార్యకర్తలు, అధికారులకు సైతం ప్రాణ సంకటంగా మారింది. తమపైనే ఆధారపడ్డ కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది. యువగళం పాదయాత్ర ప్రారంభమైన మొదటి రోజే తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోగా.. 14వ రోజు మరో రూపంలో గండం ఎదురైంది. తోపులాటలో విధుల్లో ఉన్ హెడ్‌కానిస్టేబుల్ గుండె ఆగిపోయింది. ఇక అరుపులు.. కేకలు, తోపులాటల మధ్య మరో కార్యకర్త త్రిశూలంపై పడి తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. మున్ముందు ఎన్ని అనర్థాలు ఎదురవుతాయో.. ఎంతమంది ప్రాణాలు పోతాయోనని నాయకులు, కార్యకర్తల గుండెల్లో గుబులు పట్టుకుంది. మునిగిపోతున్న నావను తెడ్డేసి పైకిలేపాలని టీటీడీ అధిష్టానం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇందులో భాగంగానే యువగళం పేరుతో పార్టీ పేరునూ స్పష్టంగా పలకలేని నారా లోకేష్‌బాబును పాదయాత్రకు దింపింది. ఆయన పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి తరచూ అపశ్రుతులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. సినీ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర గుండెపోటుతో కర్ణాటక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా గురువారం గంగాధరనెల్లూరు నియోజకవర్గానికి పాదయాత్ర చేరుకోగా.. అక్కడ టీడీపీ కార్యకర్తలు, నాయకుల తోపులాటలో పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ రమేష్(56) ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. చికిత్స కోసం చిత్తూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. రోడ్డుపై బైఠాయించి.. కార్యకర్తలను పురమాయించి లోకేష్ యువగళం పాదయాత్ర గురువారం గంగా ధరనెల్లూరు మండలం.. సమిసిరెడ్డిపల్లికి చేరుకుంది. అక్కడ రహదారిపై బహిరంగ సభకు పోలీ సులు అనుమతించకపోవడంతో లోకేష్ రగిలిపోయారు. సమిసిరెడ్డిపల్లి రహదారిపైనే సభ పెట్టేందుకు కార్యకర్తలను పురమాయించారు. కార్యకర్త నుంచి మైక్ తీసుకునేందుకు ప్రయత్నం చేయగా.. లంచ్ బ్రేక్ ఏర్పాటు చేసిన ప్రాంతానికి వెళ్లి ప్రసంగించాలని డీఎస్పీ శ్రీనివామూర్తి సూచించారు. అయినా లోకేష్ వినకుండా రోడ్డుపై బైఠాయించారు. కార్యకర్తలందర్నీ రోడ్డుకు అడ్డుగా కూర్చోమని ఆదేశించారు. రాకపోకలకు ఇబ్బంది అవుతుందని పోలీసులు పలుమార్లు ప్రాధేయపడినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఒకానొక దశలో పోలీసులపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తిరగబడి దాడిచేసేందుకు యత్నించారు. తనకు చట్టం తెలుసంటూ పోలీసులపై లోకేష్ ఊగిపోయారు. మీ అంతుచూస్తానంటూ చిందులేశారు. ఈ పరిస్థితుల్లో అక్కడే విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జనం లేరు.. తరలించాలి సారూ! గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో లోకేష్ యాత్ర ప్రారంభం కాగా.. ఆ పార్టీ అగ్రనేతలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం అటు ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. గతంలో పార్టీ లేదు.. బొక్కలేదు అన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇప్పుడు ‘చిత్తూరు జిల్లాలో యువగళం యాత్రకు జనం రాకపోవడంతో అధినేత, నేను చాలా బాధపడ్డాం’’ అని చెప్పడం సంచలనంగా మారింది. చదవండి: ఆ విషయాన్ని మాత్రం ‘ఈనాడు’ ఎందుకు చెప్పదు? జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి చిట్టిబాబుకు ఫోన్‌చేసి యాత్రకు జనాన్ని తరలించాలని.. ఎంత డబ్బయినా పెట్టి 300 వాహనాల వరకు ఉండేలా జాగ్రత్తపడాలని సూచించారు. వీరి మధ్య సాగిన సంభాషణకు సంబంధించిన ఆడియో లీక్ అవ్వడంతో టీడీపీ శ్రేణులు షాక్‌కు గురయ్యారు. లోకేష్ పాదయాత్ర డొల్లతనం బయటపడిందని జనం చర్చించుకుంటున్నారు. టీడీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు గంగాధరనెల్లూరు మండలం, పోటుకృష్ణమ్మపల్లికి చెందిన లోకనాథం (47) లోకేష్ పాదయాత్రలో పాల్గొని తీవ్రంగా గాయపడ్డాడు. ముత్యాలమ్మ గుడి వద్ద పాదయాత్ర సాగుతుండగా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పక్కనే ఉన్న త్రిశూలంపై లోకనాథం పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే టీడీపీ నేతలు గుట్టుచప్పుడు కాకుండా అతన్ని చిత్తూరుకు తీసుకెళ్లారు. లోకనాథం ఫొటోలు తీయడానికి, అతని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించిన మీడియాను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. లోకనాథం పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. రహస్య సమాచారం మేరకు లోకనాథం ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు సమాచారం. -
విధి విసిరిన సవాల్‌కు బెదర లేదు..
విధి విసిరిన సవాల్‌కు బెదర లేదు.. ప్రకృతి ప్రకోపానికి భయపడలేదు.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా కుంగిపోలేదు. తల్లిదండ్రులు చెంతలేరని చింతించలేదు. కన్నవారు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. పట్టుమని పదేళ్లు కూడా లేని తోబుట్టువులకు అన్నీ తానై ఆప్యాయతలు కురిపిస్తోంది. అమ్మలా లాలిస్తూ.. నాన్నలా అనురాగాన్ని పంచుతూ.. తనూ చదువుకుంటూ, పసివాళ్లకు కొండంత అండగా నిలుస్తోంది. అమ్మచేత గోరుముద్దలు తింటూ.. చందమామ కథలు వింటూ హాయిగా గడపాల్సిన వయసులో కుటుంబ బరువు, బాధ్యతలు మోస్తూ శభాష్ అనిపించుకుంటోంది. తల్లిదండ్రులు పక్క రాష్ట్రంలో కూలి పనులు చేస్తుండగా విధిలేని పరిస్థితుల్లో ఏడాదిన్నరగా చెల్లీతమ్ముడితో కలిసి మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేస్తున్న తీరు పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆ చిట్టితల్లి జీవన స్థితిగతులపై‘సాక్షి’ స్పెషల్ ఫోకస్.. చిత్తూరు: మండలంలోని ముడిపల్లె ఎస్టీ కాలనీకి చెందిన సాగర్, సెల్వి దంపతుల కుమార్తె ప్రతిజ్ఞ (12) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. బాలిక తమ్ముడు సుదీప్‌కుమార్ (7) 2వ తరగతి, చెల్లెలు మధుర (4) అంగన్వాడీ సెంటర్లో విద్యనభ్యసిస్తున్నారు. వీరు ముగ్గురూ ఏడాదిన్నరగా ముడిపల్లె ఏస్టీ కాలనీలో ఓ గుట్టపై ఉన్న చిన్న ఇంట్లో నివాసముంటున్నారు. అమ్మలాంటి అక్క ప్రస్తుతం ఈ కుటుంబ పెద్ద దిక్కు ప్రతిజ్ఞ. ఉదయం ఐదింటికే నిద్రలేచింది మొదలు పడుకునేవరకు తమ్ముడు, చెల్లి ఆలనాపాలనా చూస్తోంది. ఇల్లూవాకిలీ శుభ్రం చేయడం.. పాత్రలు కడిగి తెలిసిన వరకు వంట చేయడం.. వేడినీళ్లు కాగబెట్టి తమ్ముడు, చెల్లికి స్నానాలు చేయించడం.. పౌడర్ కొట్టి అందంగా ముస్తాబు చేసి బడికి తీసుకెళుతోంది. సాయంత్రం బడి నుంచి వచ్చిన వెంటనే మళ్లీ ఇంటి పని చేసుకుని.. తోబుట్టువులతో హోంవర్క్ పూర్తి చేయించడమే కాకుండా.. తానూ చక్కగా చదువుకుంటోంది, బాధ్యతలన్నీ తనపైనే ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలన్నా.. కొత్తదుస్తులు కొనాలన్నా.. పండుగపబ్బాలకు ఏవైనా తీసుకురావాలన్నా.. అన్నీ తానై వ్యవహరిస్తోంది ప్రతిజ్ఞ. తన అత్తతో కలిసి ఐదు కిలోమీటర్ల దూరంలోని నగరి వారపు సంతకు వెళ్లి కూరగాయలు తెచ్చుకుంటోంది. తోబుట్టువులకు ఆరోగ్య సమస్యవస్తే ఆస్పత్రికి తీసుకెళ్తూ అమ్మానాన్నలా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. తనకు వినికిడి సమస్య ఉన్నా, తోబుట్టువు లను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది హైదరాబాద్‌లో తల్లిదండ్రులు ప్రతిజ్ఞ తండ్రి సాగర్ పెయింటర్. అరకొర సంపాదన కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. ఈ నేపథ్యంలో ఐదేళ్ల క్రితం కుటుంబంతో సహా హైదరాబాద్‌కు మకాం మార్చాడు. అక్కడ ఒక కాంట్రాక్టరు వద్ద భార్యతో పాటు పెయింటింగ్ పనుల్లో కూలీగా చేరాడు. అక్కడే పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేరి్పంచాడు. ఇలా సాఫీగా సాగుతున్న వారి సంసారాన్ని కరోనా రక్కసి కష్టాల్లోకి నెట్టింది. ఆ తర్వాత పనుల్లేక తల్లడిల్లిపోవాల్సి వచ్చింది. విధిలేని పరిస్థితుల్లో మళ్లీ స్వగ్రామానికి రావాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కాంట్రాక్టర్ వద్ద అప్పు తీరకపోవడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో పిల్లలు ముగ్గురినీ సొంత ఊరికి పంపి.. నెలకో, రెండు నెలలకోసారి వచ్చి బియ్యం, పప్పు దినుసులు, కొంత నగదు ఇచ్చి వెళ్లిపోతున్నారు. మరో రెండేళ్లపాటు పనిచేస్తేగానీ అప్పుతీరని పరిస్థితిలో కన్నపేగును దూరం చేసి కుమిలిపోవాల్సి వస్తోంది. చిట్టి చేతులకు కొండంత అండ ఏడాది క్రితం నుంచి స్వగ్రామంలో ఉన్న ఈ చిన్నారులకు పాఠశాలలో ఒకపూట మధ్యాహ్న భోజనం అందుతోంది. ఇదిగాక యూనిఫాం, పుస్తకాలు, అంగన్వాడీ ద్వారా గుడ్లు, ఇతర సామగ్రి వస్తుండడం కాస్త ఆదరువుగా నిలుస్తోంది. గ్రామ వలంటీర్ వీరిని గుర్తించి ఇప్పటికే ఆధార్ కార్డు ఇప్పించారు. రేషన్ కార్డుకు సైతం దరఖాస్తు చేయించారు. అది వచ్చిన తర్వాత వీరి సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి దరఖాస్తు చేయనున్నట్లు సర్పంచ్ తెలిపారు. వచ్చే ఏడాది పిల్లల్లో ఒకరికి అమ్మఒడి అందనుంది. ఇటీవల వచ్చిన తుపానుకు చిన్నారులు ఉన్న ప్రాంతం ముంపునకు గురికావడంతో ప్రభు త్వం తరఫున కూరగాయలు, వంట సామగ్రితోపాటు ఆర్థిక సాయం అందింది. భయపెట్టిన తుపాను గత ఏడాది వచ్చిన మాండూస్ తుపానుతో ముడిపల్లె ఎస్టీ కాలనీ అతలాకుతలమైంది. ఇళ్లు మునిగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రతిజ్ఞ ఉంటున్న ఇంటి పైకప్పు సైతం దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో ఒంటరిగా తమ్ముడు, చెల్లిని రెక్కలకింద పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వచ్చింది. అప్పుడప్పుడూ ఇంటికి సమీపంలోనే ఉన్న మేనత్త వచ్చి సాయం అందించేది. తిండికూడా సరిగా వండుకునే పరిస్థితి లేకపోవడంతో అర్ధాకలితోనే అలమటించినట్టు ప్రతిజ్ఞ చెబుతోంది. అమ్మలా చూసుకుంటోంది అక్క ప్రతిజ్ఞ ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రంచేసి నన్ను నిద్ర లేపుతుంది. చదువుకోమని చెప్పి తాను స్నానం చేసి వంట సిద్ధం చేస్తుంది. నేను స్నానం చేసి వచ్చేలోపు అన్నం చేసి తినిపిస్తుంది. తనే దగ్గరుండి పాఠశాలకు తీసుకెళ్లి వదలిపెడుతుంది. మళ్లీ పాఠశాల వదిలే సమయంలో నన్ను ఇంటికి తీసుకువస్తుంది. రాత్రి పూట అన్నం తినిపిస్తుంది. జ్వరం వస్తే ఆస్పత్రికి తీసుకెళ్తుంది. అప్పుడప్పుడూ అమ్మా, నాన్న వస్తారు. అప్పటి వరకు అక్కే చూసుకుంటుంది. –సుదీప్‌కుమార్ అక్కే స్నానం చేయిస్తుంది నాకు అక్కే స్నానం చేయిస్తుంది. బట్టలు తొడుగుతుంది. అన్నం తినిపిస్తుంది. రాత్రిళ్లు నేను పక్క తడిపేస్తే ఆ దస్తులను కూడా తనే ఉతుకుతుంది. రాత్రిళ్లు భయపడితే పక్కనే పడుకోనిచ్చి నిద్రపుచ్చుతుంది. అక్కే అమ్మలా అన్నీ చూస్తోంది. మాకు అమ్మా నాన్న లేరనే దిగులు లేకుండా చూసుకుంటోంది. – మధుర అమ్మతో ఉంటూ అలా నేర్చుకున్నా.. రోజూ పెయింటింగ్ పనులకు వెళ్లి వచ్చి మణికట్టు, చేతుల నొప్పితో అమ్మ చాలా బాధపడేది. చేతులు ఒత్తుకుంటూ కన్నీరు పెట్టేది. ఆ బాధ చూసి ఆమెకు వంటచేసే సమయంలో, ఇతర పనుల్లో సాయంగా ఉండేదాన్ని. అలా వంటావార్పు నేర్చుకున్నా. ఇంటి పనులు ఎలా చేయాలో తెలుసుకున్నా. తమ్ముడు, చెల్లెల్ని నేనే చూసుకుంటా. ఏవైనా సమస్యలు వస్తే తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెబుతుంటా. – ప్రతిజ్ఞ, ముడిపల్లె ఎస్టీ కాలనీ నాలుగు నెలల్లో వచ్చేస్తాం హైదరాబాద్‌లో నేను, నా భర్త పెయింటింగ్ కాంట్రాక్టు వర్కులు తీసుకొని చేస్తున్నాం. కరోనా సమయంలో తీసుకున్న కాంట్రాక్టులు చేయలేక పోయాం. ప్రస్తుతం ఆ పనులు పూర్తి చేస్తున్నాం. నాలుగు నెలల్లో కాంట్రాక్టర్ వద్ద పని అయిపోతుంది. ముడిపల్లెకు వచ్చేస్తాం. పొదుపు చేసిన డబ్బులు కొంత ఇంటి నిర్మాణానికి వాడుకుంటాం. నగరి పరిసర ప్రాంతాల్లో పెయింటింగ్ పనులకు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటాం. – సెల్వి, ప్రతిజ్ఞ తల్లి -
అదే ఆమె గొప్పతనం.. మంత్రి రోజాపై కిరణ్ ప్రశంసల వర్షం
ఏపీ మంత్రి రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు లలితా జువెలరీస్ ఎండీ కిరణ్. చిత్తూరు జిల్లాలో నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా బ్రాంచ్‌లు కలిగిన లలితా జువెలరీస్ తాజాగా 46వ షోరూంను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. 'డబ్బులు ఊరికే రావు' అనే డైలాగ్‌తో ఫేమస్ అయ్యారు కిరణ్. ఈ సందర్భంగా హాజరైన మంత్రి రోజాను కిరణ్ కొనియాడారు. పిలవగానే వచ్చినందుకు రోజాకు ధన్యవాదాలు తెలిపారు. కిరణ్ మాట్లాడుతూ.. 'మా ఆహ్వానం అందగానే వచ్చినందుకు థ్యాంక్స్. ఇటీవలే రోజా ఇంటికి వెళ్లి షోరూం ప్రారంభోత్సవానికి పిలిచాం. ఎంతో ఆప్యాయంగా పలకరించారు. మాకు చాలా బాగా మర్యాదలు చేశారు. చాలా సంతోషంగా ఉంది. అది ఆమె గొప్పతనం. మనం పిలిచిన వ్యక్తి గెస్ట్‌గా వస్తే ఆనందం మాటల్లో వర్ణించలేం.' అంటూ మంత్రి రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం రోజా కూడా లలితా జువెలరీస్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
చిత్తూరు: లోకేష్ యాత్రలో టీడీపీ కార్యకర్తల షాక్
చిత్తూరు: టీడీపీ నేత నారా లోకేష్‌కు పాదయాత్రలో షాకిచ్చారు ఆ పార్టీ కార్యకర్తలు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు జరిగిన అన్యాయంపై భానుమూర్తి అనే కార్యకర్త లోకేష్‌ను నిలదీశాడు. చంద్రబాబు హయాంలో బీసీలకు సంక్షేమ పథకాలు అందలేదని చెప్పాడు. టీడీపీ నేతలు వాళ్లకు వాళ్లే సంక్షేమ పథకాలు పంచుకున్నారని పేర్కొన్నాడు. టీడీపీ హయాంలో సంక్షేమ పథకాలు అందక బీసీలు ఎంతో ఇబ్బందిపడ్డారని భానుమూర్తి అన్నాడు. కుప్పంలో పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని లోకేష్‌కు నిర్మొహమాటంగా చెప్పాడు. కుప్పంపై పార్టీ నాయకులు తప్పుడు రిపోర్టు ఇస్తున్నారని వివరించాడు. తాను వాస్తవం చెబుతున్నానని, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదని భానుమూర్తి తేల్చి చెప్పాడు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా భానుమూర్తి మాట్లాడటంతో టీడీపీ నేతలు మొహాలు తెల్లబోయాయి. నిజాలు చెప్పిన భానుమూర్తిపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కుప్పంలో గ్రౌండ్ రిపోర్టు ఎందుకు బాగోలేదంటూ మండిపడ్డాడు. చదవండి: నేను మూర్ఖుడిని -
కుప్పం వేదికగా చంద్రబాబు కని‘కట్టు’ కథ
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం వేదికగా నిన్నటి నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న హడావుడి అంతా ఇంతాకాదు. కందుకూరు, గుంటూరు టీడీపీ సభల్లో జనం చనిపోయిన ఉదంతాలను మరిపించి ప్రజల్లో సానుభూతి కోసం చంద్రబాబు చేస్తున్న డ్రామాలు పతాక స్థాయికి చేరాయి. పోలీసుల లాఠీఛార్జీలో తమ కార్యకర్తలు గాయపడ్డారంటూ నిన్నటి నుంచి గగ్గోలు పెట్టిన చంద్రబాబు… కనికట్టు కథ బట్టబయలైంది. చంద్రబాబు రాకముందు చేతికి, తలకు ఎటువంటి కట్లు లేకుండా ఎదురుచూస్తున్న టీడీపీ కార్యకర్తలు గురువారం కుప్పంలో ఆ కార్యకర్తలను పరామర్శించే ఒక సీన్‌ను చంద్రబాబు క్రియేట్ చేశారు. చంద్రబాబు పరామర్శకు వచ్చే సరికి మహానటులైన టీడీపీ కార్యకర్తలు ఆస్పత్రిలో బెడ్ల మీద తమకు గాయాలతో బాధపడుతున్నట్టుగా ఒక స్టిల్ ఇచ్చారు. తీరా చంద్రబాబు రాగానే.. యథాలాపంగా తన వంతు పాత్రను రక్తికట్టించారు. వారిని ఓదారుస్తున్నట్టుగా, భరోసానిస్తున్నట్టుగా బ్రహ్మాండంగా స్టిల్స్ ఇచ్చారు. ఈ పరామర్శ ముగిసిన తర్వాత చంద్రబాబు తన దైన శైలిలో రెచ్చిపోతూ మీడియాతో మాట్లాడారు. ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడారు. అంత వరకూ చూసేవాళ్లకు బాగానే ఉంది. కాకపోతే.. ఇక్కడే ఒక ట్విస్ట్. చంద్రబాబు కనికట్టు కథ… బట్టబయలైంది. ఇలా చంద్రబాబు వెళ్లారో లేదో… ఆ వెంటనే మహా నటులైన టీడీపీ కార్యకర్తలు తమ బెడ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. చంద్రబాబు పరామర్శ సమయంలో కనికట్టు కన్నీరు పాలైన ఆ వార్డు.. తర్వాత ఖాళీగా దర్శనమిచ్చింది. బాబు వచ్చారు..పరామర్శ డ్రామా మొదలెట్టారు చంద్రబాబు వెళ్లగానే వార్డులో ఖాళీగా దర్శనమిస్తున్న బెడ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్ డ్రామాను చంద్రబాబు రక్తికట్టిస్తున్న తీరు.. -
బిగ్‌బాస్‌పై గీతురాయల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
చిత్తూరు రూరల్: ‘హాయ్..చిత్తూరు. నాయనా..మీ అభిమానం సల్లంగుండా!’ అంటూ బిగ్‌బాస్ ఫేమ్ గీతురాయల్ పలకరించింది. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైనా గీతు రాయల్ చిత్తూరు వాసుల్లో జోష్‌ను పెంచింది. గీతూ.. ఒక్క సెల్ఫీ– అంటూ యువత ఉత్సాహం చూపింది. ఆతర్వాత వేదికపైకి వెళ్లి హాయ్ చిత్తూరు అంటూ మొదలుపెట్టింది. ‘మీ అభిమానం చూస్తుంటే.. నా వల్ల కావడం లేదురా నాయనా.. నేను చిత్తూరు వదిలి వెళ్లి పోయి 15 ఏళ్లు అయింది. అయినా కూడా చిత్తూరు యాసను నా బ్లడ్‌లో ఎక్కించేసుకున్నా. ఏ సందర్భమైనా నేను చిత్తూరు యాసలోనే మాట్లాడుతున్నా. నన్ను ఏవరైనా మీది ఏ ఊరంటే..హేయ్.. మాది చిత్తూరు రా.. అని గర్వంగా చెబుతున్నా. బిగ్‌బాస్ వెళ్లాక నేను రెండు విషయాలు నేర్చుకున్నా. మనం తప్పు చేయకపోతే ఎదుటి వ్యక్తి ఎంతా తోపైనా అసలు తగ్గకూడదు. మనవైపు తప్పుంటే చిన్నపిల్లలైనా క్షమాపణ చెప్పాల్సిందే.. జీవితాంతం మీకు రుణపడి ఉంటా’ అని ముగించింది. ఆమెను తానా నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. చదవండి: కృతిసనన్‌తో డేటింగ్‌పై ప్రభాస్‌ను డైరెక్ట్‌గా అడిగేసిన బాలయ్య -
Swetha: ఫేస్బుక్ ద్వారా మగాళ్లకు రిక్వెస్టులు పంపుతూ..
సాక్షి, చిత్తూరు అర్బన్: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటామని నమ్మించి రూ.46 లక్షలు కాజేసిన చిత్తూరుకు చెందిన అపర్ణ అలియాస్ శ్వేత (29)ను తెలంగాణలోని రాచకొండ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గంగనపల్లెకు చెందిన లేట్ నాగభూషణం కుమార్తె అపర్ణ చిత్తూరులోని అనాథ ఆశ్రమంలో పనిచేసేది. ఆశ్రమం మూతబడటంతో సులువుగా డబ్బులు సంపాదించడానికి అలవాటుపడ్డ అపర్ణ, ఫేస్బుక్ ద్వారా మగాళ్లకు రిక్వెస్టులు పంపుతూ డబ్బులు కాజేయడం మొదలుపెట్టింది. ఇలా రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో ఫేస్బుక్లో పరిచయం పెంచుకుంది. త్వరలో ఇద్దరం పెళ్లి చేసుకుందామని నమ్మించింది. అయితే తన పేరిట రూ.7 కోట్లు బీమా ఉందని.. దీన్ని తీసుకోవాలంటే కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని ఫోన్లో నమ్మ బలికింది. ఆ బీమా సొమ్ము కోసం ప్రస్తుతం కొద్దిగా డబ్బు చెల్లించాలని, సాయం చేయాలని ఆ వ్యక్తిని కోరింది. ఆ వ్యక్తి ఈ యువతిని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో విడతల వారీగా అపర్ణ ఖాతాకు రూ.46 లక్షలు జమచేశాడు. తీరా పెళ్లికి నిరాకరించి, ఫోన్ ఎత్తక పోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రాచకొండ సైబర్ విభాగం పోలీసులు అపర్ణను అరెస్టు చేసి, ఆమె నుంచి అయిదు సెల్ఫోన్లు, ఓ ట్యాబ్‌ను సీజ్ చేశారు. చదవండి: (ప్రేమ ఎంత కఠినం) -
చిత్తూరు డెయిరీ మూయించింది చంద్రబాబే : మంత్రి సిదిరి అప్పలరాజు
-
అమ్మానాన్నలు అలా.. కూతురు ఇలా!
చిత్తూరు అర్బన్: భార్యాభర్తలు విడిపోయి, ఎవరిదారి వారు చూసుకున్నారు. కన్న కుమార్తెను గాలికి వదిలేశారు. దీంతో అమ్మమ్మ దగ్గర ఉన్న బాలిక ఇటీవల మేనత్త ఇంటికి వచ్చింది. అయితే కన్న తల్లి దగ్గరికి రానీయకపోవడంతో వేదనతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరులోని మిట్టూరులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు, చిత్తూరుకు చెందిన గీత(16) అమ్మానాన్నలు విడిపోవడంతో తమిళనాడులోని అమ్మమ్మ వద్దే చదువుకుంది. అయితే 10 వతరగతి ఫెయిలైంది. ఇటీవల చిత్తూరులోని తన మేనత్త ఇంటికి వచ్చింది. అమ్మ వద్దకు వెళ్లాలనుకున్నప్పటికీ ఆమె అనుమతించకపోవడంతో మనోవేదనకు గురైంది. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చీరతో సీలింగ్‌ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందింది. ఈ మేరకు వన్‌టౌన్ ఎస్ఐ రమేష్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. చివరికి ఎంత పనిచేశాడంటే?
చిత్తూరు అర్బన్: భార్యను హత్య చేసిన కేసులో నగరికి చెందిన శరవణ (26)కు జీవితఖైదు విధిస్తూ చిత్తూరు ప్రత్యేక మహిళా కోర్టు న్యాయమూర్తి శాంతి గురువారం తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.నిర్మల కథనం మేరకు.. చిత్తూరు బీవీ రెడ్డి కాలనీలో ఉంటున్న పులివర్తి నాని ఇంట్లో నగరి ప్రాంతంలోని నెత్తంకు చెందిన శరవణ సెక్యూరిటీ, వాచ్మెన్ డ్యూటీ చేసేవాడు. 2017లో లక్ష్మీనగర్ కాలనీకు చెందిన సత్యను శరవణ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఓ బిడ్డ పుట్టి, అనారోగ్యంతో కొన్నాళ్లకే చనిపోయింది. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న శరవణ నిత్యం ఆమెను హింసించేవాడు. 2019 జనవరిలో తన అక్క ఊరికి వెళదామని సత్యను తీసుకుని శరవణ పిచ్చాటూరు మండలం వెంగళత్తూరుకు వెళ్లాడు. జనవరి 16వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో అక్క ఇంట్లోని బాత్రూమ్లో సత్యను కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు. దీనిపై మృతురాలి తల్లి దేవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పిచ్చాటూరు పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సాక్షులను, కేసు దర్యాప్తు అధికారులను విచారించిన అనంతరం శరవణకు జీవితఖైదు, రూ.1500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. చదవండి: మహిళతో వివాహేతర సంబంధం.. ఆమె కుమార్తెపైనా కన్నేయడంతో...! -
బరి తెగించిన భార్య.. ‘మా ఆయన్ను లేకుండా చేస్తే మనకు అడ్డుండదు’
చిత్తూరు అర్బన్: ‘మనది స్వచ్ఛమైన ప్రేమ. దీన్ని గెలవాలంటే మా ఆయన్ను తప్పించాలి. ఆయన్ను చంపేస్తే మనం హాయిగా కలిసి ఉండొచ్చు...’ అని ప్రియురాలు చెప్పిన మాటల్ని తలకెక్కించుకున్న ప్రియుడు ఆమె భర్తను స్నేహితులసాయంతో హతమార్చాడు. తీరా పోలీసులకు పట్టుబడి జైలుపాలయ్యాడు. గతవారం చిత్తూరు శివారుల్లో వెలుగుచూసిన ఆటోడ్రైవర్ వడివేలు హత్య కేసు మిస్టరీని తాలూక పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఎ.సెల్విరాణి (26), ఎస్.వినయ్ (30), ఆర్.నిరంజన్ (30), ఎం.కిషోర్ (29) అనే నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం తాలూక స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసమూర్తి.. సీఐ మద్దయ్య ఆచారి, ఎస్ఐ రామకృష్ణతో కలిసి వివరాలను మీడియాకు వెల్లడించారు. చిత్తూరు బాలాజీనగర్ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ వడివేలు ఈనెల 5వ తేదీ రాత్రి సీతమ్స్ బైపాస్ వద్ద హత్యకు గురయ్యాడు. మృతుడి తల్లి రాణెమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. సెల్విరాణి గత ఏడాదిగా నగరంలోని చర్చివీధిలో ఓ బిందెల దుకాణంలో పనిచేస్తోంది. ఇదే వీధిలో ఎంబీఏ వరకు చదువుకుని ఫ్యాన్సీ దుకాణం పెట్టుకున్న వినయ్‌తో ఈమె తనకు పెళ్లికాలేదంటూ పరిచయం చేసుకుంది. ఏడాదిపాటు వీళ్ల ప్రేమ వ్యవహారం బాగానే సాగింది. పెళ్లి చేసుకోవడానికి వినయ్ ఒత్తిడి పెంచడంతో ఓ రోజు తనకు పెళ్లయ్యిందని సెల్విరాణి అసలు విషయం చెప్పింది. తన భర్తను తప్పిస్తే పెళ్లి చేసుకుని హాయిగా బతికేయొచ్చని చెప్పడంతో వినయ్ వడివేలుతో స్నేహం చేసి, రెండుసార్లు మద్యం సేవించాడు. అయితే భార్యపై అనుమానం రావడంతో వడివేలు పలుమార్లు ఆమెను కొట్టాడు. విషయం తెలుసుకున్న వినయ్, వడివేలును హతమార్చడానికి నిర్ణయించుకున్నాడు. సంతపేటకు చెందిన తన స్నేహితుడు నిరంజన్‌కు విషయం చెప్పగా వళ్లియప్పనగర్‌కు చెందిన కిరాయి హంతకుడు ఎం.కిషోర్‌ను సంప్రదించారు. హత్యకు రూ.3 లక్షలు డిమాండ్ చేయగా, రూ.2.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి వినయ్ నుంచి రూ.లక్ష అడ్వాన్సుగా తీసుకున్న కిషోర్, రెండు నెలలుగా వడివేలును చంపడానికి ప్రయతి్నస్తున్నాడు. ఆటోస్టాండులో గిరాకీలు తెచ్చిస్తూ, వడివేలుకు స్నేహితుడిగా మారిన కిషోర్, ఇతడ్ని చంపడానికి అమెజాన్‌లో కత్తిని కూడా బుక్ చేసుకున్నాడు. నాలుగు మార్లు శివారు ప్రాంతాలకు తీసుకెళ్లి, మద్యం తాగించినప్పటికీ వడివేలు నిబ్బరంగా ఉండటంతో సాధ్యంకాక వచ్చేశాడు. తన భర్తకు మద్యం తాగిన తరువాత స్వీటు తినిపిస్తే మత్తు ఎక్కు తుందని సెల్విరాణి చెప్పడంతో ఈనెల 5వ తేదీ రాత్రి వడివేలుకు గిరాకీ ఉందని చెప్పిన కిషోర్, మద్యం తాగించి బీరుబాటిల్‌తో తలపైకొట్టి కత్తితో శరీరంలో 23 చోట్ల పొడిచి, ఆపై గొంతుకోసి చంపేశాడు. మరుసటి రోజు ఘటనా స్థలానికి వచ్చిన సెల్విరాణి, కుటుంబ సభ్యులతో కలిసి భర్త మృతదేహాన్ని చూసి ఏడుస్తూ నటించింది. అప్పుడు వినయ్‌కు వాట్సాప్ కాల్ చేసి మాట్లాడి త్వరలోనే పెళ్లి చేసుకుందామని చెప్పింది. హత్యానంతరం మృతుడి సెల్‌ఫోన్ తీసుకుని చెరువులో పడేసిన కిషోర్.. వినయ్, నిరంజన్‌తో కలిసి పారిపోయాడు. సాంకేతిక ఆధారాల సాయంతో ఆదివారం ఉదయం నిందితులు ముగ్గురినీ పోలీసులు చిత్తూరు–తిరుపతి బైపాస్ రోడ్డు వద్ద అరెస్టు చేశారు. వీళ్ల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, ద్విచక్రవాహనం, సెల్ఫోన్లను సీజ్ చేశారు. చదవండి: శ్రీకాళహస్తి: లాడ్జికి తీసుకెళ్లి.. ఆపై మత్తు మందు ఇచ్చి.. -
చిత్తూరులో ఘోరం.. పెళ్లింట పెనువిషాదం
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పరిధిలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 22 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన రాత్రి 10 గంటల సమయంలో పూతలపట్టు, కాణిపాకం మార్గంలోని లక్ష్మయ్య ఊరు అనే గ్రామం వద్ద జరిగింది. ఐరాల మండలం బలిజపల్లికి చెందిన హేమంత్‌కుమార్‌కు పూతలపట్టు మండలం జెట్టిపల్లిలో గురువారం వివాహం జరగాల్సి ఉంది. ఇందుకోసం వరుడి తరఫు బంధువులు సుమారు 30 మంది వరకు బుధవారం రాత్రి ట్రాక్టర్లో జెట్టిపల్లికి బయలుదేరారు. ఈ క్రమంలో పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో సురేంద్రరెడ్డి (52) (డ్రైవర్), వసంతమ్మ (50), రెడ్డెమ్మ (31), తేజ (25), వినీషా (3), దేశిక (2) ఉన్నారు. గాయపడ్డ వారిని అంబులెన్స్‌లో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ సురేంద్రరెడ్డి ట్రాక్టర్ గేర్‌ను న్యూట్రల్ చేసి వేగంగా వెళ్లడంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కనే గుంతలో దిగి బోల్తాపడింది. గాయపడ్డవారిలో వళ్లెమ్మ (60), సోమశేఖర్ (25), లక్ష్మమ్మ (60), చిన్నప్ప (55), మునీశ్వరి (46), సుభాíÙణి (35), అరుణ (44), ఉదయ్ (35), లీలావతి (27), మాలతి (35), మాధవి(25), కృష్ణవేణి (38), యశోద (30), నవీన (26), శంకయ్య (70), హేమంత్ (31), వినాయక (39), సుమతి (49), మోనిక (23), కాంతమ్మ (45), అన్నపూర్ణ (43,) శోభన్‌బాబు(43) ఉన్నారు. -
నల్ల డబ్బు మార్చే యత్నం!
చిత్తూరు అర్బన్: ‘మావద్ద లెక్కలో చూపించని బ్లాక్‌మనీ (నల్లడబ్బు) రూ.40 కోట్ల వరకు ఉంది. దీన్ని కొంచెం కొంచెం మీ బ్యాంకు ఖాతాలో వేస్తాం. మీ బ్యాంకు ఖాతా నుంచి ఆ మొత్తాన్ని వైట్ మనీ (లెక్కల్లో చూపించేది)గా ఇస్తే చాలు..’ అంటూ రైస్ పుల్లింగ్ నేరం తరహాలో బురిడీకొట్టించే ప్రయత్నం చేసి.. తీరా పోలీసులకు తెలిసిపోవడంతో ఓ ముఠా పారిపోయింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన గిరీష్ అనే పారిశ్రామికవేత్తకు చెన్నైకి చెందిన సత్య ఇటీవల పరిచయమయ్యాడు. తనకు తెలిసిన ఓ బడా పారిశ్రామికవేత్త వద్ద రూ.వందల కోట్ల నల్ల డబ్బు ఉందని, దీన్ని బ్యాంకులో వేసుకుని లెక్కల్లో చూపించి తమకు బదిలీ చేస్తే కమీషన్ రూపంలోనే రూ.కోట్లు సంపాదించవచ్చని గిరీష్‌ను నమ్మించాడు. ఢిల్లీకు చెందిన వినోద్‌గుప్త అనే వ్యక్తిని గిరీష్‌కు ఫోన్లో సత్య పరిచయం చేశాడు. గిరీష్, సత్య, వినోద్‌గుప్త ముగ్గురూ ఫోన్లో పలు దఫాలుగా మాట్లాడుతుకున్నారు. తొలుత రూ.50 లక్షలను సత్య వద్దకు చేరిస్తే.. రూ.5 కోట్లను గిరీష్ బ్యాంకు ఖాతాలో వేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీన్ని అమలు చేయడానికి చిత్తూరు నగరాన్ని ఎంచుకున్నారు. ఢిల్లీ నుంచి వినోద్‌గుప్తను చెన్నైకు పిలిపించి, అక్కడి నుంచి కారులో బయలుదేరిన సత్య.. గిరీష్‌ను చిత్తూరు నగరంలోని ఓ లాడ్జిలో ఉండాలని చెప్పాడు. బుధవారం రాత్రి తనిఖీలకు వెళ్లిన పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న గిరీష్ బృందాన్ని ప్రశ్నించారు. తనను మోసం చేయడానికి సత్య, వినోద్‌గుప్త ప్రయత్నించారని గ్రహించిన గిరీష్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా అప్పటికే సమాచారం పోలీసులకు తెలిసిపోయిందని గ్రహించిన సత్య, వినోద్‌కుమార్ చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించకుండానే పారిపోయారు. చిత్తూరు సీసీఎస్ ఎస్ఐ కేసు నమోదు చేశారు. -
130 కిలోమీటర్ల వేగం.. నిద్రమత్తు... ముగ్గురు మృతి
సాక్షి, చిత్తూరు, తవణంపల్లి: బెంగళూరు– తిరుపతి జాతీయ రహదారిపై తవణంపల్లె మండలం నర్తపుచేను చెరువు వద్ద శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదంలో భార్యాభర్తలతోపాటు ఓ చిన్నారి మృతి చెందారు. వివరాలు.. బాపట్ల జిల్లా నాగులుప్పులపాడు మండలం ముప్పాల గ్రామానికి చెందిన అశోక్‌బాబు(33), భార్య మౌనిక (29), కుమారుడు ప్రభవ్ (3) కారులో బెంగళూరు నుంచి గుంటూరులోని అత్తగారింటికి బయలుదేరారు. నర్తపుచేను దగ్గరకు వచ్చేసరికి కారు అదుపుతప్పి పక్కన సరీ్వసు రోడ్డులో ఆగి ఉన్న పాల ట్యాంకర్‌ను వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా, అందులో ప్రయాణిస్తున్న ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. ప్రమాదతీవ్రతకు డ్రైవింగ్ చేస్తున్న అశోక్ తల, మొండెం వేరయ్యాయి. పక్కసీట్లో ఉన్న భార్య, కుమారుడి తలలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమయ్యాయి. ఘటనాస్థలం.. రక్తసిక్తం ప్రమాదస్థలం బీతావహంగా తయారైంది. ఛిద్రమైన శరీరాలతో రక్తసిక్తంగా మారింది. కారు పైభాగం ట్యాంకర్ కిందకు వెళ్లిపోవడంతో మృతదేహాలు ఇరుక్కుపోయాయి. డ్రైవింగ్ చేస్తున్న అశోక్ నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సుమారు 130 కిలోమీటర్ల వేగంతో కారు ప్రయాణిస్తూ ట్యాంకర్‌ను ఢీకొట్టి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మృతుల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు నానా అవస్థలు పడ్డారు. కారులో రెండు సెల్ఫోన్లు దొరికినా, అవి లాక్ అయి ఉన్నాయి. దీంతో ఆ ఫోన్లకు కాల్ వచ్చేవరకు పోలీసులు వేచి ఉండాల్సి వచ్చింది. ఘటనాస్థలాన్ని సందర్శించిన ఎస్పీ ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును డీఎస్పీ శ్రీనివాసమూర్తి, సీఐ శ్రీనివాసరెడ్డి వివరించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. బంధువుల ఇంటికొస్తూ.. నాగులుప్పలపాడు : చిత్తూరు జిల్లా తవణంపల్లె వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అశోక్ బాబు స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 20 ఏళ్ల కిందట అశోక్‌బాబు తల్లిదండ్రులు అద్దంకి ఆంజనేయులు, వెంకాయమ్మ కర్ణాటకలోని రాయచూర్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఏడాదికోసారి స్వగ్రామానికి వచ్చి వెళుతుంటారు. అశోక్‌బాబు పదో తరగతి వరకు నాయనమ్మ వద్ద ఉంటూ ఉప్పుగుండూరు పాఠశాలలో చదువుకున్నాడు. ఉన్నత చదువుల తర్వాత బెంగళూరులో ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గుంటూరుకు చెందిన మౌనికతో ఐదేళ్ల కిందట వివాహమైంది. గుంటూరులో అత్తగారింటికి వస్తున్న అశోక్‌బాబు కుటుంబం ప్రమాదంలో మృత్యువాత పడటంతో బంధుమిత్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
పులిపెక్కిపోతాండవంట.. చిత్తూరు యాస సుట్టూ టాలీవుడ్
సినిమా ఇప్పుడు ఒక్క భాష.. ఒక్క యాసకి పరిమితం కావడంలేదు. ‘΄పాన్ ఇండియా’ అయిపోయింది. అందుకే కథకు తగ్గ ‘యాస’ చుట్టూ సినిమా తిరుగుతోంది. ఇప్పుడు చిత్తూరు యాస సుట్టూ సినిమా తిరగతాంది! అన్ని సినిమాలూ కాదనుకోండి... అయితే ఇంతకుముందు వరకూ పెద్దగా వినపడని ఈ యాస ఇప్పుడు నాలుగైదు సినిమాల్లో వినబడుతోంది. ఇప్పటికే ‘అరవింద సమేత వీర రాఘవ’లో ఎన్టీఆర్, ‘పుష్ప 1’ లో అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు చిత్తూరు యాసలో మాట్లాడి, అలరించారు. ప్రస్తుతం చిత్తూరు యాస నేపథ్యంలో ‘పుష్ప 2’, ‘హరోం హర’, ‘వినరో భాగ్యము విష్ణుకథ’, ‘అలిపిరికి అల్లంత దూరంలో’, ‘అమ్మాయిలు అర్థం కారు’ వంటి చిత్రాలు రూపొందుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. పులిపెక్కిపోతాండవంట.. ‘ఏం ΄పాప.. నచ్చినానా నీకు’, ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు’, ‘పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదే లే’.. అంటూ ‘పుష్ప’ తొలి భాగంలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగులు ఎంత ΄ాపులర్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘హే ఛీ ఛీ.. నువ్వు నాకు నచ్చేదేంది.. నేను నిన్ను సూల్లేదని ఓ పులిపెక్కి పోతాండవంట గదా’ అంటూ రష్మికా మందన్న చెప్పిన మాటలు కుర్రాళ్ల హృదయాన్ని తాకాయి. చిత్తూరు సమీపంలోని శేషాచలం అడవుల్లో విరివిగా ఉండే ఎర్రచందనం నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అల్లు అర్జున్, రష్మిక, సునీల్... ఇలా అన్ని ΄పాత్రలు చిత్తూరు యాసలోనే మాట్లాడతాయి. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ΄పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ‘పుష్ప 2’ రానుంది. తొలి భాగంలో నటించిన వారే రెండో భాగంలోనూ ఉంటారు. నీ కోసం సూస్తా ఉండారు.. ‘సుబ్రహ్మణ్యం అన్న.. జనాలు నీ కోసం సూస్తా ఉండారు.. అట్లా కదలకుండా ఉంటే ఎట్లా.. ఏందోకటి సెప్పు’, ‘ఇంగ సెప్పేదేం లేదో.. సేసేదే’ వంటి చిత్తూరు యాస డైలాగులు ‘హరోం హర’ సినిమా మోషన్ టీజర్లో వినిపించాయి. సుధీర్ బాబు హీరోగా జ్ఞానసాగర్ దర్శకత్వంలో ‘హరోం హర’ సినిమా రూ΄÷ందుతోంది. సుమంత్ జి. నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన 1989 నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మాది తిరపతి.. నా పేరు విష్ణు ‘ఏడు వింతల గురించి మాకు పెద్దగా తెలీదన్నా.. మా జీవితాలన్నీ ఏడుకొండల సుట్టూ తిరగతా ఉంటాయి, మాది తిరపతి.. నా పేరు విష్ణు’ అంటూ ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రం టీజర్లో హీరో కిరణ్ అబ్బవరం చెప్పే చిత్తూరు యాస డైలాగులు ఆసక్తిగా ఉన్నాయి. కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి జంటగా మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. తిరుపతి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం 2023 ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. ఇవే కాదు.. మీడియమ్, స్మాల్ రేంజ్ చిత్రాల్లోనూ చిత్తూరు యాస వినపడనుంది. వాటిలో రావణ్ నిట్టూరు, శ్రీ నిఖిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్ కీలక ΄ాత్రల్లో డైరెక్టర్ నందినీ రెడ్డి శిష్యుడు ఆనంద్ జె. దర్శకత్వం వహించిన ‘అలిపిరికి అల్లంత దూరంలో’ ఒకటి. రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి. నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలకానుంది. అలాగే నరసింహ నంది దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘అమ్మాయిలు అర్థంకారు’. అల్లం శ్రీకాంత్, ప్రశాంత్, కమల్, మీరావలి, సాయిదివ్య, ప్రియాంక, స్వాతి, శ్రావణి హీరోహీరోయిన్లుగా నటించారు. నందిరెడ్డి విజయలక్ష్మి రెడ్డి, కర్ర వెంకట సుబ్బయ్య నిర్మించిన ఈ సినిమా కూడా చిత్తూరు యాస నేపథ్యంలో ఉంటుంది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంకా చిత్తూరు యాస సుట్టూ తిరిగే కథలు కొన్ని ఉన్నాయి. చదవండి: 'ఉరికే ఉరికే' ప్రోమో సాంగ్ .. లిప్ లాక్‌తో రెచ్చిపోయిన అడవి శేష్ -
టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసు: మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు
సాక్షి, చిత్తూరు: పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణకు చుక్కెదురయ్యింది. చిత్తూరు కోర్టు బెయిల్ రద్దు చేసింది. నవంబర్ 30లోగా పోలీసులకు లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ రద్దు చేయాలని చిత్తూరు వన్ టౌన్ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ కేసులో మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు ప్రభుత్వ టీచర్లు, మిగిలిన వారు నారాయణకు చెందిన స్కూల్ సిబ్బంది ఉన్నారు. చదవండి: కార్పొరేట్ విద్యా మాఫియా అధిపతి నారాయణ చరిత్ర ఇదే.. కాగా, నారాయణ విద్యా సంస్థలపై మొదటి నుంచి వివాదాలున్నాయి. విద్యార్థులపై అధిక ఒత్తిడి తెస్తారనే ఆరోపణలున్నాయి. తమ విద్యాసంస్థల్లో లక్షల మందిని జాయిన్ చేసుకుంటారు. కొంచెం బాగా చదివే వారిని ఎంచుకుంటారు. వారి కోసం పరీక్షల సమయంలో పేపర్ లీకేజీ చేయించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు తెప్పించి పబ్లిసిటీ చేయించుకోవడం పరిపాటిగా మారిందని అనేకమంది చెబుతున్న మాట. ఆ విద్యాసంస్థల్లో నిర్భంద విద్యతో మానసిక ఒత్తిడికి లోనైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలున్నాయి. గత టీడీపీ హయాంలోనే పదుల సంఖ్యలో విద్యార్థులు బలవన్మరాణానికి పాల్పడ్డారు. మంత్రిగా ఉన్న నారాయణపై ఎలాంటి కేసుల్లేకుండా చేసుకోవడంపై గత ప్రభుత్వంపై ఆరోపణలొచ్చాయి. -
గ్రహణ ప్రభావం.. ఆశ్చర్యం, ఆ వింతని చూసేందుకు ఎగబడ్డ జనం!
రామకుప్పం: మండలంలోని కెంచనబళ్ల పంచాయతీ, రెడ్డివానిపోడు గ్రామానికి చెందిన కర్ణ కుటుంబీకులు పూర్వీకుల కాలం నుంచి సూర్యగ్రహణం రోజు రోలుకు పూజలు చేసి రోకలిని నిలబెట్టేవారు. మంగళవారం సూర్యగ్రహణం వేళల్లో రోలుకు పూజలు చేసి అందులో నీరుపోసి రోకలిని నిలబెట్టారు. గ్రహణ ప్రభావం ఉండడం చేత రోకలి ఎటువంటి సపోర్టు (ఆధారం) లేకుండా రోలు మీద నిటారుగా నిలబడింది. గ్రహణ సమయంలో రోలు నుంచి రోకలిని వేరుచేసి తట్టలో నింపిన కుంకుమ నీళ్లలో రోకలిని నిలబెట్టగా రోకలి నిటారుగా నిలబడింది. రోకలిని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఇదే వింత కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో సూర్యగ్రహణం సందర్భంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో అన్ని ఆలయాలు మంగళవారం మూతపడ్డాయి. కృష్ణా జిల్లా కోడూరు మండలం స్వతంత్రపురం, మండల కేంద్రమైన తోట్లవల్లూరులో గ్రహణం ప్రభావంతో ఎటువంటి ఆధారం లేకుండా రోకళ్లు నిలబడటం స్థానికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు ప్రసవం.. క్యాంటమ్ కంపెనీ బాత్రూమ్లో శిశువు కలకలం -
‘ఎన్ని మందలు కలిసి వచ్చినా.. సీఎం జగన్‌పై పైచేయి సాధించలేరు’
సాక్షి, చిత్తూరు: పవన్, చంద్రబాబు బంధంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి రాకముందే తాను ఎస్వీయూ అధ్యక్షుడిగా ఉన్నానని తెలిపారు. ఏ రోజు కూడా వాడు, వీడు అని ఎవరిని మాట్లాడలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆయన దత్తత పుత్రుడు పవన్ కల్యాణ్ తప్పుడు కూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ఉపయోగించిన భాష చాలా దారుణమని.. తెలుగు రాష్ట్రాలు సిగ్గుపడేలా ఆయన వ్యాఖ్యానించారని మండిపడ్డారు. మనం మాట్లాడే భాష మంచిగా ఉండాలని హితవు పలికారు. రాష్ట్రంలో చెప్పులు చూపించే సంస్కృతి మనకు ఉందా అని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. మూడు పెళ్లిళ్లు చేసుకోమంటున్న పవన్ గురించి రాష్ట్ర మహిళలే ఆలోచిస్తారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు, పవన్ హైదరాబాద్‌కే పరిమితమవుతారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణ నాయకుడని, ఆయన్ను ఎదురించాలంటే చంద్రబాబుకు ధైర్యం, బలం సరిపోదన్నారు. అందుకే తోక పార్టీలను కలుపుకుని ఎన్నికలకు పోవాలని అనుకుంటున్నారని విమర్శించారు. అందరూ కలిసి వచ్చినా సీఎం జగన్‌పై పైచేయి సాధించలేరని పేర్కొన్నారు. ‘పులి ఒక్కటే వేటకు పోతుంది కానీ.. గుంపులు గుంపులుగా.. మందలు మందలుగా పోదు. ఏపీలో ఎన్ని మందలు వచ్చినా.. ప్రజల అభిమానంతో 2024ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధించడం ఖాయం. చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే.. ఒకరు మన నాయకుడిని అన్యాయంగా ఇబ్బందులకు గురిచేస్తే.. మరొకరు సొంత మామకే వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. ఆ విధంగా ఇద్దరు ముఖ్యమంత్రులు చిత్తూరు జిల్లాకు చెడ్డపేరు తీసుకొచ్చారని’ పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. చదవండి: జలవనరుల శాఖ, పోలవరం పనులపై సీఎం జగన్ సమీక్ష -
పాస్ పోర్టు రెన్యూవల్ కోసం అమెరికా నుంచి వచ్చి ..
కాణిపాకం(చిత్తూరు): తమ పాస్‌పోర్టు సమయం అయిపోతుందని రెన్యూవల్ కోసం ఫారిన్ నుంచి ఇండియాకు వచ్చారు. కుమారుని పాస్ పోర్టు రెన్యూవల్‌కు సమయం ఉండడంతో దైవ దర్శనానికి బయలుదేరి అనుకోని ప్రమాదంలో అత్తకోడళ్లు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన మంగళవారం మండలంలో విషాదం నింపింది. వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన కుమారస్వామి, సుజాత భార్యాభర్తలు. వృతిరీత్యా యూ ఎస్ఏలో ఉద్యోగం చేస్తున్నారు. వారి కుమారుడు ధను. ముగ్గురి పాస్‌పోర్టులు గడువు ముగియడంతో రెన్యూవల్ కోసం ఇండియాకు గత నెలలో వచ్చారు. తండ్రి, తల్లి పాస్‌పోర్టులు రెన్యూవల్ పూర్తికాగా.. కుమారుని పాస్ పోర్టు రెన్యూవల్ కాలేదు. సమయం ఉండడంతో తల్లిదండ్రులు సుబ్రమణ్యం, స్వర్ణలత, భార్య సుజాతతో కలసి కుమారస్వామి కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి మంగళవారం వేకువ జామున హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరారు. సాయంత్రం కాణిపాకం సమీపంలోని తిరువణంపల్లె సమీపంలో టైరు పేలింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు ను ఢీకొంది. ఈ ప్రమాదంతో స్వర్ణలత(65), సుజాత(31)కు తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ స్వర్ణలత, సుజాత మృతి చెందారు. ఎస్ఐ మనోహర్ కేసు నమోదు చేశారు. కాగా రాత్రి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులను ఆర్డీఓ రేణుక పరామర్శించారు. -
కాణిపాకం అభిషేకం టికెట్ ధరలపై దేవాదాయ శాఖ వివరణ
సాక్షి, చిత్తూరు: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి పంచామృత అభిషేకం టికెట్ల ధరలపై దేవాదాయ, ధర్మాదాయ శాఖ స్పందించింది. రూ. 700 ఉన్న టికెట్ రూ. 5000కు పెంచేశారని వార్తలు రావడంతో అభిషేకం టికెట్ ధర పెరగలేదని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న రూ.700 ధర యథాతథంగా కొనసాగనున్నట్లు తెలిపింది. ఆలయ అధికారుల అవగాహన రాహిత్యం వల్లే అభిప్రాయ సేకరణ పత్రము విడుదల చేసినట్లు పేర్కొంది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని దేవాదాయ కమిషనర్ వెల్లడించారు. -
కూతురిపై లైంగికదాడి కేసులో తల్లిదండ్రులకు జీవిత ఖైదు
చిత్తూరు అర్బన్/దేవీపట్నం(అల్లూరి సీతారామరాజు జిల్లా): కన్న కూతురిపైనే లైంగికదాడికి పాల్పడిన తండ్రికి, అతనికి సహకరించిన తల్లికి బతికి ఉన్నంతవరకు జైలు శిక్ష(జీవిత ఖైదు) విధిస్తూ చిత్తూరులోని ప్రత్యేక మహిళా న్యాయస్థానం శుక్రవారం తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లీలావతి కథనం మేరకు.. 2018, నవంబర్ 3వ తేదీన పలమనేరుకు చెందిన కృష్ణమూర్తి, ధనమ్మ దంపతుల కుమార్తె(13 ఏళ్ల బాలిక) ఇంట్లో నిద్రిస్తోంది. చదవండి: ముంబై హోటల్లో మోడల్ ఆత్మహత్య.. నేను సంతోషంగా లేనంటూ.. మద్యం మత్తులో ఉన్న కృష్ణమూర్తి తన కుమార్తెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇందుకు బాలిక తల్లి సహకరించింది. బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి డీఎస్పీ రామ్‌కుమార్ కేసు నమోదు చేసి కృష్ణమూర్తి, ధనమ్మను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులపై నేరం రుజువుకావడంతో ఇద్దరూ జీవించి ఉన్నంత వరకు జైలు శిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శాంతి తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి 20 ఏళ్లు జైలు కూతురిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు, రూ.2,500 జరిమానా విధిస్తూ కాకినాడ పోక్సో కోర్టు తీర్పు చెప్పిందని ఎస్ఐ నాగార్జున శుక్రవారం తెలిపారు. దేవీపట్నం మండలంలో తున్నూరు గ్రామానికి చెందిన ఎ.రాజేశ్వరరెడ్డి తన కూతురు (మైనర్)పై లైంగిక దాడికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం గమనించిన ఐసీడీఎస్ సూపర్వైజర్ చోడి వీర్రాఘవ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16న రాజేశ్వరరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ పోక్సో కోర్టు జడ్జి ఎల్. వెంకటేశ్వరరావు సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం నిందితుడికి 20 ఏళ్ల జైలు, రూ.2,500 జరిమానా విధించారని ఎస్ఐ తెలిపారు. -
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవ వైభవం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వీడి వచ్చి, భూలోక వైకుంఠమైన వేంకటాద్రిపై కొలువుదీరాడు. కన్యామాసం (చాంద్రమానం ప్రకారం ఆశ్వీయుజ మాసం) శ్రవణ నక్షత్రం రోజున శ్రీవేంకటేశ్వరస్వామిగా అర్చారూపంలో ఇక్కడ స్వయంభువుగా వెలశాడు. శ్రీవేంకటేశ్వరుడు ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, నైవేద్య ప్రియుడు, భక్తజన వల్లభుడు. కోరినవారి కొంగుబంగారమై కోరికలను ఈడేర్చే శ్రీవేంకటేశ్వరుని వైభోగం న భూతో న భవిష్యతి! వేంకటాచల క్షేత్రం పై వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుని పిలిచి, లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించాడట. ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణా నక్షత్రం నాటికి ముగిసేలా తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడట. తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయని ప్రతీతి. దసరా నవరాత్రులు జరిగే కన్యామాసంలో శ్రీవేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణ నక్షత్ర శుభ ముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిదిరోజుల ముందు నవరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం అనాదిగా వస్తున్న ఆచారం. సూర్యచంద్ర మాసాల్లో ఏర్పడే వ్యత్యాసం వల్ల ప్రతి మూడేళ్లకొకసారి అధిక మాసం వస్తుంది. ఇందులో భాగంగా కన్యామాసం (అధిక భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రులలో (ఆశ్వయుజం)లో నవరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహించటం కూడా ఆనవాయితీగా కొనసాగుతోంది. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం, వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేస్తారు. ధ్వజారోహణం, బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణానక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాలు మాత్రం వైదిక ఆచారాలు (ధ్వజారోహణం, ధ్వజావరోహణం) లేకుండా ఆగమోక్తంగా అలంకార ప్రాయంగా నిర్వహిస్తారు. ఎనిమిదో రోజున మహారథం (చెక్కరథం) బదులు ఇదివరకు వెండిరథాన్ని ఊరేగించేవారు. 1996వ సంవత్సరం నుంచి టీటీడీ తయారు చేయించిన స్వర్ణరథంపై స్వామివారి ఊరేగింపు జరుగుతూ వస్తోంది. 2012లో పాత స్వర్ణరథం స్థానంలో కొత్త స్వర్ణరథం అందుబాటులోకి వచ్చింది. అంకురార్పణతో ఆరంభం శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు వసంత మండపానికి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజు రాత్రి మేళతాళాలతో చేరుకుంటారు. నిర్ణీత పునీత దేశంలో భూదేవి ఆకారంలోని లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే ‘మృత్సంగ్రహణం’ అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో శాలి, ప్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవ ధాన్యాలను పోసి ఆ మట్టిలో మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవ ధాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందేలా ప్రార్థిస్తారు. నిత్యం నీరుపోసి అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త పడతారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారు. ధ్వజారోహణం న భూతో న భవిష్యతి అనేలా అంగరంగ వైభవోపేతంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామివారి వాహనం గరుడు కాబట్టి, ఒక కొత్తవస్త్రం మీద గరుడుని బొమ్మ చిత్రీకరిస్తారు. దీన్ని ‘గరుడ ధ్వజపటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రం. అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు కొండమీదే కొలువుదీరి ఉత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి. పెద్ద శేషవాహనం ధ్వజారోహణం అయిన రోజు రాత్రి స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడై తిరుమల ఆలయం పరిధిలోని నాలుగు మాడవీథుల్లో ఊరేగుతారు. స్వామివారు కొలువుదీరింది శేషాద్రి. ధరించేది శేషవస్త్రం. ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యమిస్తూ తొలిరోజు ఆ వాహనం మీద ఊరేగుతారు. చిన్నశేషవాహనం రెండోరోజు ఉదయం స్వామివారు తన ఉభయ దేవేరులతో కలసి ఐదు శిరస్సుల చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. పెద్ద శేషవాహనం ఆదిశేషుడైతే, చిన్నశేషవాహనం వాసుకి. హంసవాహనం రెండోరోజు రాత్రి స్వామివారు విద్యాప్రదాయని అయిన శారదామాత రూపంలో హంసవాహనంపై ఊరేగుతారు. పాలు, నీళ్లను వేరు చేసినట్లే గుణావగుణ విచక్షణా జ్ఞానానికి సంకేతంగా శ్రీనివాసుడు హంసవాహనం అధిరోహించి భక్తులకు దర్శనమిస్తాడు. ఇహలోక బంధ విముక్తుడైన జీవుని ఆత్మను హంసతో పోల్చుతారు. అలాంటి హంసపై పరమహంస అయిన శ్రీనివాసుడు ఊరేగుతూ దర్శనమివ్వడం భక్తులకు నేత్రపర్వం. సింహవాహనం బ్రహ్మోత్సవాలలో మూడో రోజు ఉదయం సింహవాహనం అధిరోహించి శ్రీవేంకటనాథుడు భక్తులకు దర్శనమిస్తాడు. జంతువులలో మృగరాజైన సింహాన్ని తానేనంటూ మనుషులలో జంతు ప్రవృత్తిని నియంత్రించుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు. శ్రీవేంకటేశ్వరుడు తనలోని పరాక్రమాన్ని ప్రపంచానికి చాటడానికి సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారని ముత్యాలపందిరి వాహనం మూడో రోజు రాత్రి శ్రీవేంకటేశ్వర స్వామివారికి జరిగే సుకుమారసేవగా ముత్యాలపందిరి వాహనాన్ని చెప్పవచ్చు. ముక్తి సాధనకు ముత్యంలాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. కల్పవృక్ష వాహనం కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తుంది. తన భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే దేవదేవుడు శ్రీవేంకటాద్రివాసుడు. కల్పవృక్షం– అన్నవస్త్రాదుల వంటి ఇహలోక సంబంధితమైన కోరికలను మాత్రమే తీర్చగలదు. కానీ స్వామివారు శాశ్వత కైవల్యాన్ని ప్రసాదించే కారుణ్యమూర్తి. నాలుగోరోజు ఉదయం సువర్ణకాంతులీనే కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుడు సర్వాలంకార భూషితుడై ఊరేగుతాడు. సర్వభూపాల వాహనం లోకంలోని భూపాలకులందరికీ భూపాలుడు తానేనని లోకానికి చాటుతూ శ్రీవేంకటేశ్వరుడు నాలుగోరోజు రాత్రి సర్వభూపాల వాహనం మీద కొలువుదీరుతారు. సర్వభూపాల వాహన సేవ జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది. మోహినీ అవతారం బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది ఐదోరోజు. ఆ రోజు ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్త జనావళికి కనువిందు చేస్తారు. అన్ని వాహనసేవలు వాహన మండపం నుంచి ప్రారంభమైతే, మోహినీ అవతారం మాత్రం నేరుగా శ్రీవారి ఆలయం లోపలి నుంచే పల్లకిపై ప్రారంభం అవుతుంది. పరమశివుడిని సైతం సమ్మోహన పరచి, క్షీరసాగర మథనంలో వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసిన అవతారమిది. మంచి పనులు చేయడం ద్వారా దైవానుగ్రహం ఎలా పొందవచ్చో లోకానికి చాటడానికే శ్రీవారు జగన్మోహిని రూపంలో తిరువీథుల్లో విహరిస్తారు. గరుడవాహనం ఐదోరోజు రాత్రి తనకు నిత్య సేవకుడైన గరుత్మంతుడి మీద స్వామివారు ఊరేగుతారు. స్వామివారి మూలమూర్తి మీద ఉన్న మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామమాల ధరించి మలయప్పస్వామి భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీవేంకటేశ్వరుడిని తన కీర్తనలతో నానా విధాలుగా కొనియాడిన గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు నుంచి పంపే తులసిమాలను, నూతన ఛత్రాలను గరుడ వాహనంలో అలంకరిస్తారు. ఈ వాహనంలో ఊరేగే స్వామివారి వైభోగాన్ని చూసి తరించడానికి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తారు. గరుడుడితో స్వామికి గల అనుబంధాన్ని కూడా ఈ సేవ చాటి చెబుతుంది. హనుమంత వాహనం ఆరోరోజు ఉదయం స్వామివారు హనుమద్వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. త్రేతాయుగంలో తనను సేవించుకున్న భక్త శిఖామణి హనుమంతుడిపై స్వామివారు తిరువీథుల్లో ఊరేగింపుగా వెళతారు. హనుమంతుని భక్తి తత్పరతను లోకులకు తెలిసేలా, రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు అన్నీ తానేనని ఈ సేవ ద్వారా స్వామివారు చాటి చెబుతారు. గజవాహనం గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఆరోరోజు రాత్రి గజవాహనంపై ఊరేగుతారు. గజవాహనంపై ఊరేగుతుండగా స్వామిని దర్శించుకుంటే, పెనుసమస్యలన్నీ ఇట్టే తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. సూర్యప్రభ వాహనం బ్రహ్మోత్సవాలలో ఏడోరోజు ఉదయం సప్తాశ్వాలపై భానుడు రథసారథిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామివారు సూర్యప్రభ వాహనం మీద ఊరేగుతారు. ప్రపంచానికి వెలుగులు ప్రసాదించే సూర్య భగవానుడు తన ప్రతిరూపమేనని చాటిచెబుతారు. చంద్రప్రభ వాహనం ఏడోరోజు రాత్రి ధవళ వస్త్రాలు, తెల్లని పూలమాలలు ధరించి స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణత, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశలేనని తెలియజేస్తారు. మనఃకారుకుడైన చంద్రుడి లక్షణం తనలోనూ ఉందని, తాను కూడా భక్తుల మనస్సుపై ప్రభావం చూపిస్తానని చాటి చెబుతారు. రథోత్సవం గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే కళ్లెంతో అదుపు చేసే విధంగానే, రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్త్వజ్ఞానాన్ని స్వామివారు ఎనిమిదో రోజు ఉదయం తన రథోత్సవం ద్వారా తెలియ జేస్తారు. స్వామివారి రథ సేవలో పాల్గొన్న వారికి పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అశ్వవాహనం ఎనిమిదోరోజు రాత్రి స్వామివారు అశ్వవాహనారూఢుడై ఊరేగుతారు. చతురంగ బలాలలో అత్యంత ప్రధానమైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశం. చక్రస్నానం ఎనిమిది రోజుల పాటు వాహన సేవల్లో అలసిపోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహస్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరో రూపమైన చక్రత్తాళ్వారును వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. చక్రత్తాళ్వార్ స్నాన మాచరించే సమయంలో కోనేరులో స్నానం చేస్తే సకల పాపాలు నశించి, కష్టాలు తీరుతాయని ప్రతీతి. ధ్వజావరోహణం చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్స వాలను ముగిస్తారు. డాలర్ లేని బ్రహ్మోత్సవం... ఈ ఏట తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు డాలర్ శేషాద్రి సందడి లేకుండానే జరగనున్నాయి. శ్రీవారి ఆలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న డాలర్ శేషాద్రి ఉరఫ్ పాల శేషాద్రి గత ఏడాది నవంబర్ 29వ తేదీన కన్ను మూయడంతో ఈసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు డాలర్ లేకుండానే జరగనున్నాయి. 1978వ సంవత్సరంలో టీటీడీ లో విధుల్లో చేరిన శేషాద్రి అప్పటినుంచి గత ఏడాది వరకు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటూ వచ్చారు. మధ్యలో 2009వ సంవత్సరంలో కోర్టు తీర్పు కారణంగా బ్రహ్మోత్సవాల విధులకు దూరమైన శేషాద్రి అటు తరువాత 2014వ సంవత్సరంలో ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే గుండెపోటుకి గురై కొన్ని వాహనసేవలకు దూరమయ్యారు. ఈ రెండుసార్లు మినహాయిస్తే దాదాపు 44 సంవత్సరాల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొని ఉత్సవాల నిర్వహణలో పాలుపంచుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉత్సవాల సమయంలో స్వామి వారి ఆలంకరణలను ఏవిధంగా చేయాలన్న దాని పై అర్చకులకు సహకరిస్తూ ఏ సమయంలో ఏ కైంకర్యం నిర్వహించాలో తెలుపుతూ సమయానికి అన్నీ సక్రమంగా జరిగేలా చూసుకునే వారు. ఆలయ మాడవీథుల్లో వాహన ఊరేగింపు జరుగుతున్నంత సేపు కూడా వాహనంతో పాటే ఉంటూ అన్నీ తానై వ్యవహరిస్తూ వాహన సేవ విజయవంతంగా సాగేలా సహకరించి అటు అధికారులతోపాటు ఇటు టీటీడీ పాలకమండలి మన్ననలను పొందేవారు. మరోవైపు ఉత్సవాలలో వాహన ఊరేగింపు ముందు సందడి చేస్తూ భక్తుల్లో భక్తిభావాన్ని నింపేవారు. ఇలా బ్రహ్మోత్సవాలలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచే డాలర్ శేషాద్రి లేకుండానే ఈ ఏట శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 26.09.2022 అంకురార్పణ 27.09.2022 ధ్వజారోహణం పెద్ద శేషవాహనం 28.09.2022 చిన్నశేషవాహనం హంసవాహనం 29.09.2022 సింహవాహనం ముత్యపుపందిరి వాహనం 30.09.2022 కల్పవృక్షవాహనం సర్వభూపాల వాహనం 01.10.2022 మోహినీ అవతారం గరుడ వాహనం 02.10.2022 హనుమంతæవాహనం గజవాహనం 03.10.2022 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం 04.10.2022 రథోత్సవం అశ్వ వాహనం 05.10.2022 చక్రస్నానం ధ్వజావరోహణం -
సీఎం జగన్ కుప్పం పర్యటన (ఫొటోలు)
-
చేతగాని నాయకుడు ఈ చంద్రబాబు: సీఎం జగన్
సాక్షి, చిత్తూరు: నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో 33 ఏళ్లు కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు ఉన్నాడని, అలాంటి వ్యక్తి కుప్పం నుంచి తనకు కావాల్సింది తీసుకున్నాడే తప్ప.. చేసిందేమీ లేదని సీఎం జగన్ చాటిచెప్పారు. కుప్పం అనిమిగానిపల్లి బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. కుప్పంను చంద్రబాబు ఏనాడూ సొంత గడ్డగా భావించలేదని, హైదరాబాదే ముద్దు అని భావించాడు. అందుకే సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఇంద్రభవనంలాంటి ఇల్లు కట్టుకున్నాడు. కుప్పంలో సొంత ఇల్లు కాదు కదా.. ఓటు కూడా లేదు. చంద్రబాబు హైదరాబాద్‌కి లోకల్.. కుప్పానికి నాన్‌లోకల్ అని ఎద్దేవా చేశారు. కనీసం ప్రజలకు ఏం కావాలో కూడా ఆయన ఆలోచించలేదని సీఎం జగన్ అన్నారు. గత పరిపాలనలో కంటే అప్పులు ఈ ప్రభుత్వం తక్కువగా చేస్తోందని, అదే సమయంలో అభివృద్ధి ఎక్కువగా చేస్తున్నామని సీఎం జగన్ తెలియజేశారు. అప్పుడు.. దోచుకో పంచుకో తినుకో ద్వారా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు.. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు బాగుపడ్డారని అన్నారాయన. కానీ, ఇప్పుడు తమ ప్రభుత్వంలో సంక్షేమం సాధ్యమైందని, ప్రజలు అది గుర్తించాలని సీఎం జగన్ మనవి చేసుకున్నారు. చంద్రబాబుది చేతగాని తనం అనాలా? చేయకూడదనే దుర్భుద్ది అనాలా? అర్థం కావట్లేదన్నారు ఆయన. ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు.. 14 సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా తన సొంత నియోజకవర్గంలో కరువు సమస్యకు పరిష్కారం చూపించలేకపోయాడని అన్నారు. పైగా హంద్రీనీవాకు ఆటంకంగా కూడా మారారన్నారు. తనకు కావాల్సిన వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చాడని, కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డాడని, కుప్పంకు మంచి నీళ్లు మాత్రం తెప్పించలేకపోయాడన్నారు. కుప్పంలో సరైన రోడ్లు కూడా వేయించలేకపోయారని విమర్శించారు. ఉపాధి కల్పించాలనే ఆలోచన కూడా చేయలేదని.. కుప్పం నుంచి నిరుద్యోగులు కూడా తరలిపోయారన్నారు. కుప్పానికి చేం చేయలేని చేతగాని నాయకుడు ఈ చంద్రబాబు అని సీఎం జగన్ మండిపడ్డారు. చివరకు.. సీఎంగా ఉన్న టైంలో ఏనాడూ రెవెన్యూ డివిజన్ గురించి ఆలోచించలేదని, కానీ, ప్రజా ఒత్తిడితో రెవెన్యూ డివిజన్ కావాలని లేఖ రాశాడని సీఎం జగన్ తెలిపారు. ‘‘కానీ, జగన్ మీవాడు.. మంచోడు.. మీ బిడ్డ.. మీరు అడిగారు.. జగన్ ఇచ్చాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. వెన్నుపోటుకు, దొంగ ఓటుకు కేరాఫ్ ఎవరంటే అది చంద్రబాబేనని అని అన్నారు. బీసీల సీటు అయిన కుప్పంను సైతం లాక్కుని తన మార్క్ సామాజిక న్యాయం ప్రదర్శించాడని ఎద్దేవా చేశారు సీఎం జగన్. ‘‘చంద్రబాబుకు తలవంచేది లేదని కుప్పం ప్రజలు తేల్చి చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత అన్ని ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేశాం. కుప్పం ప్రజలు బాబు అవినీతికి వ్యతిరేకంగా ఓటేశారు. కుప్పం ప్రజలకు మూడేళ్లలో పథకాలతో రూ.1,149 కోట్లు ఇచ్చాం. కుప్పం నియోజక వర్గంలో డీబీటీ ద్వారా రూ.866 కోట్లు ఇచ్చాం. నాన్ డీబీటీ ద్వారా రూ.283కోట్లు ఇచ్చాం. చంద్రబాబుకు తనకు పిల్లనిచ్చిన మామపై ఎలాంటి ప్రేమ ఉందో.. కుప్పంపై కూడా అలాంటి వెన్నుపోటు ప్రేమే ఉందన్నారు. కుప్పాన్ని మున్సిపాలిటీ చేశాం. ఆరు నెలల్లో హాంద్రీనీవా పనులు పూర్తి చేస్తాం. కలగా మిగిలిన ఆర్డీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేశాం. రామకుప్పంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేశాం. ఇంటిగ్రేగెడ్ ఆఫీస్ కాంప్లెక్స్‌ను కూడా పూర్తి చేశాం. ఒకేషనల్ జూనియర్ కాలేజీ పూర్తి చేశాం. ఇంకా చాలా చేశాం. ఇవన్నీ పూర్తి చేసింది మీ బిడ్డే అని సీఎం జగన్ కుప్పం ప్రజలకు గుర్తు చేశారు. ఈ మూడేళ్లలోనే కుప్పం సిసలైన అభివృద్ధిని చూసింది. ఎమ్మెల్సీగా ఉంటూనే భరత్ నాతో ఇన్ని మంచి పనులు చేయించాడు. భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తా. ఈ ప్రభుత్వం.. మీ ప్రభుత్వం అని గుర్తు పెట్టుకోండి అని సీఎం జగన్ కుప్పం ప్రజలకు చివరగా విజ్ఞప్తి చేశారు. -
కుప్పం అంటే ఇప్పుడు అభివృద్ధి: సీఎం జగన్
సాక్షి, చిత్తూరు: కుప్పం అంటే ఇవాళ చంద్రబాబు పాలన కాదు. నా అక్కచెల్లెమ్మల అభివృద్ది. నా అనుకుంటున్న అన్ని వర్గాల ఇంట అభివృద్ధి. అది ఇక్కడి చిరునవ్వులోనే కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కుప్పంలోని అనిమిగానిపల్లిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ చేయూత నగదు జమ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అక్కడి బహిరంగ సభ నుంచి ప్రసంగించారు. మరో మంచి కార్యక్రమాన్ని కుప్పం నుంచి శ్రీకారం చుడుతున్నాం. నా పేద ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా పేద అక్కచెల్లెమ్మల కోసం తీసుకొచ్చిన పథకం ఇది. కుటుంబాన్ని బాధ్యతతో మోస్తున్నవాళ్లకు అండగా ఉండేందుకు అమలు చేస్తున్న కార్యక్రమని సీఎం జగన్ గుర్తు చేశారు. చేయూతతో వాళ్ల జీవితాల్లో వచ్చిన మార్పు అందరికీ స్ఫూర్తిదాయకమని సీఎం జగన్ పేర్కొన్నారు. అంతేకాదు.. వారం రోజుల చేయూత ఉత్సవాలు కుప్పం నుంచి ప్రారంభం అవుతాయని సీఎం జగన్ ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి మండలానికి ప్రజాప్రతినిధులు వచ్చి.. అక్కాచెల్లెమ్మల సంతోషంలో భాగస్వాములవుతారని అన్నారు. ఇక ఇదే వేదిక నుంచి ఏపీలో జనవరి నుంచి పెన్షన్ రూ.2,750కి పెంచుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. అలాగే.. మ్యానిఫెస్టోలో చెప్పినట్లు మూడు వేల రూపాయలు వరకు పెన్షన్ ఇస్తామని ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేరస్తామని సీఎం జగన్ ఉద్ఘాటించారు. వరుసగా మూడో ఏడాది కూడా 26 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు వైఎస్సార్ చేయూత నిధులు అందిస్తున్నామని, ఈ ఏడాదికిగానూ అక్కాచెల్లెమ్మల కోసం రూ.4,949 కోట్లు జమ చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఒక్క చేయూత ద్వారానే మూడేళ్లలో రూ.14,110 కోట్ల సాయం అందించామని, అమ్మ ఒడి ద్వారా 44.50 లక్షల మందికి రూ.19,617 కోట్లు ఇచ్చినట్లు సీఎం జగన్ తెలియజేశారు. అలాగే ఆసరా ద్వారా 78.74 లక్షల మందికి రూ.12,758 కోట్లు ఇచ్చినట్లు, సున్నా వడ్డీ కింద రూ.3,615 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. ఎక్కడా పారదర్శకతా, వివక్ష లేకుండా.. బటన్ నొక్కగానే నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ అవుతున్నాయని ఆయన అన్నారు. గత పాలనకు, ఇప్పటి పాలనకు తేడా గమనించాలని, ఒక్కసారి ఆలోచించమని ప్రతీ అక్కాచెల్లెమ్మను కోరారు సీఎం జగన్. చేయూత ద్వారా ఆదుకునే డబ్బును ఎలా ఉపయోగించాలనే స్వేచ్ఛను అక్కాచెల్లెమ్మల చేతుల్లోనే పెట్టామని, అది ఎలా సక్రమంగా ఉపయోగించుకోవాలో వాళ్లే నిర్ణయించుకోవాలని, అవసరమైన సాంకేతికత ప్రభుత్వం తరపున అందిస్తామని భరోసా ఇచ్చారు సీఎం జగన్. -
చంద్రబాబు కుప్పానికి నాన్ లోకల్: సీఎం జగన్
సీఎం జగన్ కుప్పం పర్యటన.. అప్డేట్స్ 1:48PM మూడో విడత వైఎస్సార్ చేయూత నిధులు విడుదల వైఎస్సార్ చేయూత పథకం ద్వారా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 26.39 లక్షల మంది ఖాతాల్లో రూ. 4, 949 కోట్ల జమ అక్కా చెల్లెమ్మల ఖాతాల్లోకి రూ. 4,949.44 కోట్ల నిధులను విడుదల చేసిన సీఎం జగన్ 12:50PM సీఎం జగన్ ప్రసంగంలోని కొన్ని కీలకాంశాలు కుప్పం అంటే ఈరోజు అక్క చెల్లెమ్మల అభివృద్ధి కుప్పం అంటే ఈరోజు నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, నా మైనార్టీలు.. ఇలా ప్రతి ఇంటా అభివృద్ధి కనిపిస్తోంది కుప్పంలో వీరి చిరునవ్వుల మధ్య అభివృద్ధి కనిపిస్తోంది కుప్పంలో ఈరోజు మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం 26,39, 703 మందికి వరుసగా మూడో ఏడాది వైయస్సార్ చేయూత అమలు చేస్తున్నాం ఈ ఏడాది అందిస్తున్న ఆర్థిక సహాయంతో అక్షరాల రూ. 4,949.44 కోట్లుతో మొత్తంగా రూ.14,110.62 కోట్లు వారంరోజులపాటు చేయూత ఉత్సవాలు వారంరోజుల పాటు ప్రతి మండలంలో ప్రజా ప్రతినిధుల సమక్షంలో చేయూత పంపిణీ చేయూత మహిళల జీవితాల్లో వచ్చిన మార్పులు సమాజానికే మార్పులు వరుసగా నాలుగేళ్లపాటు అదే అక్క చెల్లెమ్మకు రూ.75వేలు అందిస్తామని హామీ ఇచ్చాం మనసా , వాచా, కర్మణా అమలు చేశాం ఈ మూడో విడత వరుసగా అదే అక్క చెల్లెమ్మకు అక్షరాల చేయూత ద్వారా రూ.56,250లు పెట్టినట్టు అవుతుంది 45–60 సంవత్సరాల మధ్యలో నా పేద అక్కచెల్లెమ్మలు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మల కోసం ఈ పథకాన్ని తీసుకు వచ్చాం ఈ వయస్సులో ఉన్న అక్క చెల్లెమ్మలు మొత్తం కుటుంబాన్ని ఒక బాధ్యతతో మోస్తున్నారు వాళ్ల చేతిలో డబ్బులు పెడితే.. ఆకుటుంబం ఎదుగుతుందని విశ్వసించాం ఇక 60 ఏళ్లు దాటితే ఎలాగూ పెన్షన్‌వస్తుంది సూర్యోదయానికి ముందే.. ఠంచనుగా పెన్షన్ ఒకటో తారీఖున వస్తోంది పెన్షన్ రూ.2500 కూడా ఈ జనవరి నుంచి రూ.2,750లకు పెంచుతున్నాం మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రూ.3వేల వరకూ తీసుకుని పోతాను అంటూ చెప్పిన మాటను నెరవేరుస్తున్నాను అమ్మ కడుపులోని బిడ్డ నుండి, ఆప్యాయంగా ఆశీర్వదించే బిడ్డ వరకూ మన ప్రభుత్వం అండగా నిలుస్తుంది ఈ ప్రభుత్వం మీది, అక్క చెల్లెమ్మల ప్రభుత్వం అని చెప్పడానికి గర్విస్తున్నాను ఈ 39 నెలల కాలంలో ఇప్పటివరకూ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ చేయూత ద్వారానే రూ.14,110 కోట్లు అందించాం అక్కచెల్లెమ్మల సాధికారితే లక్ష్యంగా ఈప్రభుత్వం అడుగులు ముందుకేసింది అమ్మ ఒడి ద్వారా 44.5 లక్షలమందికి రూ.19,617 కోట్లు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ఇచ్చాం వైఎస్సార్ ఆసరా ద్వారా 78.74లక్షలమందికి రూ. 12,757 కోట్లు ఇచ్చాం రెండు దఫాలు ఇప్పటికే పూర్తయ్యాయి మూడో దఫా జనవరి మాసంలో ఇస్తున్నాం చెప్పిన మాటమేరకు నాలుగు దఫాల్లో ఇస్తున్నాం చేయూత ద్వారా 26.4లక్షలమందికి రూ. 14,111 కోట్ల రూపాయలు ఇస్తున్నాం సున్నా వడ్డీ పథకానికి రూ. 3,615 కోట్లు ఇచ్చాం కేవలం ఈ నాలుగు పథకాల ద్వారా 39 నెలల కాలంలో రూ.51వేల కోట్లు ఇచ్చాం బటన్ నొక్కి డీబీటీ ద్వారా అందించిన సొమ్ము రూ.1,17,666 కోట్లు ఇచ్చాం అన్న దమ్ములకు కూడా ఇచ్చింది కలుపుకుంటే.. రూ. 1.71లక్షల కోట్లు అర్హత ఒక్కటే ప్రామాణికంగా పథకాలను అమలు చేస్తున్నాం మార్పును చూడమని, తేడాను చూడమని కోరుతున్నాను అప్పటి పాలనకు, ఇప్పటి పాలనకు తేడా చూడండి నాన్ డీబీటీ పథకాలతో కలుపుకుంటే.., అక్షరాల ఈ 39 నెలల కాలంలో ప్రతికుటుంబానికీ ఇచ్చిందిమొత్తం రూ.3,12,764 కోట్లు ఇచ్చాం రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇచ్చాం 21 లక్షల ఇళ్ల నిర్మాణలు వేగంగా జరుగుతున్నాయి ఇళ్లు పూర్తైతే ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.7–10 లక్షల ఇస్తి ఇచ్చినట్టు అవుతుంది ఇళ్ల కార్యక్రమం ద్వారా అక్క చెల్లెమ్మల చేతిలో రూ. 2–3 లక్షల కోట్లు పెట్టినట్టు అవుతుంది తేడా గమనించమని ప్రతి అక్కా చెల్లెమ్మను కోరుతున్నాం ఇంతకుముందు పరిపాలనలో ఇక ముఖ్యమంత్రి ఉన్నారు అప్పుడూ అదే బడ్జెట్, అదే ముఖ్యమంత్రి... అప్పుడు చేసిన అప్పులు కన్నా.. ఇప్పుడు చేసిన అప్పులు తక్కువే కాని, ఆ ప్రభుత్వంలో ఎందుకు జరగలేదు, ఎందుకు ఇప్పుడు జరుగుతున్నాయి.. ఆలోచన చేయలేదు ఆ రోజుల్లో దోచుకో.. పంచుకో తినుకో.. పద్ధతి ఉండేది ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడు, గ్రామాల్లో జన్మభూమి కమిటీలు ఉండేవి అప్పుడు ప్రజలకు డబ్బు పోయేది లేదు ఇవాళ బటన్ నొక్కుతున్నాం... నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి అందుకనే ఇప్పుడు జరుగుతున్నాయి..., ఇప్పుడు జరగలేదు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అక్కచెల్లెమ్మల మీద మన ప్రభుత్వానికి ఉన్న మమకారం చేయూత ద్వారా వచ్చే డబ్బును ఎలా వాడుకోవాలన్నది మీ చేతిలో పెట్టాను చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలా? జీవనోపాధికి ఎలా వాడుకోవాలా? అన్నది మీ నిర్ణయమే చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి సాంకేతిక, బ్యాంకుల పరంగా మార్కెటింగ్ పరంగా అన్ని సహకారాలను కూడా అందించడానికి ప్రభుత్వం మీకు తోడుగా ఉంది కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకునేవారికి వారికి ఐటీసీ, హిందుస్థాన్ లీవర్, ప్రాక్టర్ అండ్ గాంబెల్, రిలయన్స్ లాంటి కార్పొరేట్ కంపెనీలతో టై అప్చేశాం మార్కెటింగ్‌లో శిక్షణ ఇవ్వడంతోపాటు బ్యాంకులతో రుణాలు అందిచేలా కూడా చేస్తున్నాం ప్రతి అక్కా.. చెల్లెమ్మ మరో రూ.7–10వేల ప్రతినెలా ఆదాయం పొందడానికి మార్గాన్ని ప్రభుత్వం చూపించనుంది ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు కొనాలన్నా.. వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమూల్ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం గతంలో కన్నా కనీసం రూ.5–15లు ఎక్కువ రేటుకు అమూల్ సంస్థ కొనుగోలు చేసుకునేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అమూల్ రంగ ప్రవేశం చేశాక ఇప్పుడు హెరిటేజ్ సంస్థకూడా రేట్లు పెంచక తప్పని పరిస్థితి కూడా వచ్చింది వైఎస్సార్ ఆసరా, చేయూతల ద్వారా అందిన డబ్బుతో 1.10 లక్షలమంది మహిళలు కిరాణా దుకాణాలు పెట్టారు మరో 60,995 మంది వస్త్రవ్యాపారం చేస్తున్నాం 2.96లక్షలమంది ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు పెంచుకుంటూ సంపాదిస్తున్నారు 1.15లక్షల మంది ఇతర జీవనోపాధి మార్గాల్లో వారు ఉపాధి పొందుతున్నారు 12:25PM 14 ఏళ్లు సీఎంగా ఉండి కుప్పానికి చంద్రబాబు చేసిందేమీ లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక కుప్పం రూపు రేఖలు మారాయి. మూడేళ్లలో మహిళలకు రూ. 2.39 లక్షల కోట్ల సాయం అందించారు. మూడేళ్ల పాలనలో సీఎం జగన్ అన్ని వర్గాలకు అండగా నిలిచారు. వచ్చె ఎన్నికల్లో కుప్పంలో విజయం సాధించి తీరుతాం. కుప్పం అభివృద్ధశిని వైఎస్ జగన్ చేతల్లో చూపిస్తున్నారు. భరత్‌ను మీరందరూ ఆశీర్వదించి గెలిపించాలి: మంత్రి పెద్దిరెడ్డి కుప్పం ప్రజలను చంద్రబాబు ఇన్నాళ్లు మోసం చేశారు: ఎమ్మెల్సీ భరత్.సీఎం వైఎస్ జగన్ వల్లే 33 ఏళ్ల తర్వాత చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది. కుప్పం అభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు: ఎమ్మెల్సీ భరత్ 12:00PM ‘వైఎస్సార్ చేయూత’ వేదిక వద్దకు చేరిన సీఎం జగన్ 11:15AM కుప్పం చేరుకున్న సీఎం వైఎస్ జగన్. కుప్పంలో అడుగడుగునా సీఎం జగన్‌కు నీరాజనం సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన కుప్పం ప్రజలు 10:50AM సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పం పర్యటనలో భాగంగా రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్‌కు వైఎస్సార్సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. సీఎం వైఎస్ జగన్‌కు స్వాగతం పలికిన వారిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ డా.గురుమూర్తి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తదితరలు ఉన్నారు. 9:15AM ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కుప్పం పర్యటన కోసం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి కుప్పంకు వెళ్లనున్నారు సీఎం జగన్. సీఎం హోదాలో ఆయన ఇక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి. నియోజకవర్గంలోని అనిమిగానిపల్లిలో వైఎస్సార్ చేయూత మూడో విడత నగదు జమ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆపై బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా నగదు జమ చేస్తారు. వైఎస్సార్ చేయూత కార్యక్రమం తర్వాత.. కుప్పం పురపాలక సంఘం అభివృద్ధికి సంబంధించి రూ.66 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, రూ.11 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ► పేద అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన, సాధికారతే లక్ష్యంగా వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ చేయూత కింద సాయాన్ని అందిస్తున్నారు. ► బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.4,949.44 కోట్ల ఆర్థిక సాయాన్ని నేరుగా జమ చేయనున్నారు సీఎం జగన్. ► దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు తోబుట్టువుగా ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయం చేయడం ద్వారా వారి జీవనోపాధిని మెరుగు పరుస్తున్నారు. వైఎస్సార్ చేయూత పథకం కింద.. ► వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఇప్పటి వరకు అర్హులకు రూ.14,110.62 కోట్ల లబ్ధి ► రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 కుటుంబాల్లోని మహిళలకు తద్వారా కోటి మంది జనాభాకు మేలు కలిగిస్తూ ఇప్పటి వరకు వైఎస్సార్ చేయూత ద్వారా రూ.14,110.62 కోట్లు (నేడు జమ చేసే మొత్తంతో కలిపి) అందించారు. అంటే మూడేళ్లలో అర్హులైన ఒక్కో లబ్ధిదారుకు రూ.56,250 చొప్పున జమ చేశారు. ► వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అందిన నగదును లబ్ధిదారులు చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసుకోవడానికి, ఇతర అవసరాలకు, జీవనోపాధి కార్యక్రమాలకు వినియోగించుకునేందుకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిస్తోంది. ► సాంకేతిక, బ్యాంకింగ్, మార్కెటింగ్ సహకారాలు అందిస్తూ.. కిరాణా షాపులు, గేదెలు, ఆవులు, మేకల పెంపకం వంటి వాటి ద్వారా జీవనోపాధి మార్గాలను చూపిస్తోంది. దిగ్గజ సంస్థలు, బ్యాంకులతో ఒప్పందం చేసుకుని వారి వ్యాపారాలను మందుకు నడిపిస్తోంది. -
అమ్మా.. బతుకుతామో లేదో తెలీదు: కుమార్తెకు తండ్రి చివరి కాల్
చిత్తూరు కలెక్టరేట్/చిత్తూరు అర్బన్ : మరణం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు. తండ్రి, స్నేహితుడితో కలిసి తన పుట్టిన రోజు జరుపుకుంటున్న యువకుడు అదే రోజు మృత్యుఒడిలోకి చేరుతాడని అనుకోలేదు. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను, కుమారుడిని వదిలిపెట్టి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని తన విద్యతో రూపుమాపడానికి విదేశాలకు వెళ్లాల్సిన యువకుడి ఆశ అడియాశలైపోయింది. చిత్తూరు నగరంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ (65), ఢిల్లీబాబు (35), బాలాజీ (24) కుటుంబ పరిస్థితులు చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు. అనుమతులేవీ..? ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఆ భవనంలో ఏడాదిన్నర కాలంగా భాస్కర్ పేపర్ ప్లేట్లను తయారుచేసే కుటీర పరిశ్రమను నడిపిస్తున్నారు. దీనికి అధికారుల నుంచి ఎలాంటి అనుమతుల్లేవు. తమిళనాడు నుంచి భారీ మొత్తంలో సరుకును తెప్పించి, ఇక్కడ చిన్నపాటి యంత్రంతో ఒత్తిడినిచ్చి పేపర్ ప్లేట్లకు రూపునిచ్చి తయారు చేస్తున్నారు. పైగా భవనం ఏళ్లక్రితం నిర్మించింది కావడంతో అగ్నిప్రమాదం జరిగితే బయటపడే ముందస్తు ప్రణాళికలు ఏవీ కనిపించలేదు. ఈ ఘటనలో మృతి చెందిన బాధితుల శరీరంపై ఒక్క గాయం కూడా లేదు. వ్యాపించిన పొగకు ఊపిరి ఆడక ఆ ముగ్గురు మృతిచెందినట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఆ భవనానికి రెండోవైపు దారి ఉండుంటే ప్రాణాలు పోయేవి కావని, ఒకేదారి ఉండడంతో మంటల్లో ప్రధాన దారి నుంచి లోనికి ప్రవేశించేందుకు కష్టతరం అయిందని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి తెలిపారు. కన్నీటి వీడ్కోలు ..: మృతుల్లో భాస్కర్‌కు ముగ్గురు సంతానం. కుమార్తెలు దీప్తి, దివ్య, కుమారుడు డిల్లీబాబు ఉన్నారు. దివ్య వివాహం చేసుకుని దుబాయ్‌లో ఉండగా, తల్లి శమంతకమణిని మూడు నెలల క్రితం తనవద్దకు తీసుకెళ్లింది. తన తండ్రి, అన్న మరణవార్త వినగానే అర్థరాత్రి దుబాయ్ నుంచి హుటాహుటిన ఇక్కడికి బయలుదేరి బుధవారం మధ్యాహ్నం చిత్తూరుకు చేరుకున్నారు. భాస్కర్, డిల్లీబాబుకు బంధువులు, మిత్రుల అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. పరామర్శ.. ఘటనపై కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ రిషాంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని చిత్తూరు ఆర్డీవో రేణుక, తహసీల్దారు పార్వతి, కమిషనర్ అరుణ పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. స్థానిక కార్పొరేటర్ నాజీరా, వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ అల్తాఫ్ ఇంకా స్థానికులు ప్రమాద ఘటనలో వేగంగా స్పందించినా.. వీళ్ల ప్రయత్నం ఫలించలేదు. ఇక మాజీ ఎమ్మెల్యే సీకే బాబు సైతం మృతుల కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రమాద ఘడియలు ఇలా.. ►మంగళవారం అర్ధరాత్రి 11 గంటలు : చిత్తూరు నగరంలోని 44 వ డివిజన్ రంగాచారి వీధిలో పేపర్ ప్లేట్లు తయారుచేసే ఇంట్లో ఢిల్లీబాబు, తన తండ్రి భాస్కర్, స్నేహితుడు బాలాజీతో కలిసి తన జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. ►రాత్రి 11.10 : అప్పటి వరకు సరదాగా ఉన్న ఇంట్లోని వంటగది నుంచి వైర్లు కాలే వాసన వస్తోంది. సున్నపు దిమ్మెలతో నిర్మించి ఆ ఇంట్లో వైర్లు అప్పుడప్పుడు షార్ట్ సర్క్యూట్ అవడం మామూలేనని ముగ్గురూ పట్టించుకోకుండా ఉండిపోయారు. కొద్ది నిముషాల్లోనే నిప్పు రవ్వలు అక్కడ నిల్వ చేసిన పేపర్ప్లేట్లపై పడటంతో మంటలు వ్యాపించాయి. ►రాత్రి 11.14 : ఈ ఇంట్లో భారీ మొత్తంలో పేపర్‌ప్లేట్లను నిల్వ చేసి ఉంచడంతో క్షణాల్లో మంటలు భవనం మొత్తం అలముకున్నాయి. ఇదే సమయంలో దట్టమైన పొగ కమ్ముకోవడంతో అక్కడున్న ముగ్గురూ భయపడిపోయారు. బయటకు వెళ్లే మార్గంలో మంటలు వ్యాపించాయి. ►రాత్రి 11.15 : భాస్కర్ తన కుమార్తెకు చివరసారిగా ఫోన్ చేశాడు. ‘అమ్మా... ఇల్లు మొత్తం కాలిపోతా ఉంది. ఏమీ కనిపించలేదు. మీ అన్న కూడా నాతోనే ఉన్నాడు. బతుకుతామో లేదో తెలీదు...’ అంటుండగానే ఫోన్ కట్ అయిపోయింది. ముగ్గురూ ప్రాణభయంతో పరుగులుపెట్టి బాత్రూమ్లోకి వెళ్లిపోయారు. ►రాత్రి 11.17: రామ్‌నగర్ కాలనీకు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు రంగాచారి వీధివైపు వెళుతూ భవనంలో మంటలుచూసి డయల్ –100కు ఫోన్ చేయడం, స్థానికులు అగ్నిమాపకశాఖకు సమాచారం ఇచ్చారు. బయటున్నవాళ్లు భవనంలో ఉన్నవారికి ఫోన్‌చేసినా ఫోన్ కలవలేదు. ►రాత్రి 11.25 : ఒకదాని వెంట ఒకటి రెండు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సిబ్బంది ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. పాకాల నుంచి మరో ఫైర్ ఇంజిన్ వచ్చింది. నీళ్లు అయిపోవడంతో మళ్లీ ఫైర్ ఇంజన్ వెళ్లి నీళ్లు నింపుకుని వచ్చింది. కార్పొరేషన్ ట్యాంకు నుంచి అదనంగా నీళ్లు తీసుకొచ్చారు. ►అర్థరాత్రి 12.45 : మంటలు స్వల్పంగా తగ్గడంతో ధైర్యం చేసిన అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సాయంతో ఇంటి పక్కనే ఉన్న గది షెటర్ తీసి లోపలకు వెళ్లారు. అక్కడున్న మరో కిటికీకి పగులగొట్టి గదుల్లో వెతికితే బాత్రూమ్లో భాస్కర్, ఢిల్లీబాబు, బాలాజీ విగత జీవులుగా పడున్నారు. వెంటనే అంబులెన్సులో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ముగ్గురూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆశలు బుగ్గి పాలు ఘటనలో మృతి చెందిన డిల్లీబాబు సాఫ్ట్వేర్ ఇంజినీర్. మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అతనికి ఏడాది వయసున్న బాబు (సాత్విక్) ఉన్నాడు. మంగళవారం ఢిల్లీబాబు పుట్టినరోజు కావడం, తన తండ్రి పక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో మృత్యువాత పడటం స్థానికుల్ని కలచివేసింది. డిగ్రీ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం మరో రెండు నెలల్లో విదేశాలకు వెళదామనుకున్న బాలాజి ఆశలు అగ్నికి ఆహుతయ్యాయి. తవణంపల్లి మండలం తెల్లగుండ్ల పల్లికి చెందిన కరుణాకర్, పార్వతి దంపతుల కుమారుడు బాలాజీ. కుటుంబంతో కలిసి మూడేళ్ల క్రితం చిత్తూరుకు వచ్చి, రంగాచారి వీధిలో బాడుగ ఇంట్లో ఉంటున్నాడు. బాలాజి తండ్రి గ్రానైట్ ఫ్యాక్టరీలో కూలీ పని చేస్తుండగా, తల్లి పార్వతి ఇంటి పని చేస్తూ కుటుంబాన్ని లాక్కొస్తోంది. భర్తకు అనారోగ్యంగా ఉండటం ఆ కుటుంబాన్ని కుంగదీస్తుంటే, కుమారుడ్ని విదేశాలకు పంపుతున్నామనే చిన్న సంతోషం వాళ్లకు పునర్జీవం పోస్తూ వచ్చింది. తీరా చెట్టంత కొడుకు తమను విడిచి శాశ్వతంగా వెళ్లిపోయాడని తెలుకున్న ఆ దంపతులకు కన్నీళ్లు తప్ప మరేమీ మిగల్లేదు. తెల్లగుండ్లపల్లిలోనే అంత్యక్రియలు నిర్వహించారు. -
చిత్తూరు: ఘోర ప్రమాదం.. ముగ్గురి సజీవ దహనం
సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఘోరం జరిగింది. పేపర్ ప్లేట్లు తయారు చేసే పరిశ్రమలో మంటలు చెలరేగి ముగ్గురు సజీవదహనం అయ్యారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రంగాచారి వీధిలో ఉన్న పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవదహనం అయ్యారు. మృతుల్ని భాస్కర్, ఢిల్లీ బాబు, బాలాజీగా గుర్తించారు. షార్ట్ స్కర్యూట్‌తో అర్ధరాత్రి 2గం. సమయంలో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. మృతుల్లో తండ్రీకొడుకులతో పాటు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నట్లు సమాచారం. కాగా.. ఫ్యాక్టరీ యాజమాని కొడుకు ఢిల్లీబాబు సదరు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా నిర్ధారణ అయ్యింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. -
భార్యకు దూరంగా భర్త.. మరో మహిళతో వివాహేతర సంబంధం.. లాడ్జిలో షాకింగ్ ఘటన..
చిత్తూరు అర్బన్: వివాహేతర సంబంధం ఒకరి ప్రాణం బలిగొన్న సంఘటన చిత్తూరు నగరంలో గురువారం వెలుగుచూసింది. వన్‌టౌన్ సీఐ నరసింహరాజు కథనం మేరకు, పుంగనూరుకు చెందిన ఈశ్వర్‌రెడ్డి (50) భార్యకు దూరంగా ఉంటున్నాడు. రెండేళ్లుగా చిత్తూరులో ఈయన కూరగాయలు, తినుబండారాలు విక్రయిస్తూ నివశిస్తున్నాడు. ఈయనకు యాదమరికి చెందిన లలితతో వివాహేతర సంబంధం ఏర్పడింది. చదవండి: కనిపెంచిన తండ్రి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. దేవుడా ఎంత శిక్ష వేసావయ్యా ఈ క్రమంలో బుధవారం వీరిద్దరూ సుందరయ్యవీధిలోని లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. కొద్దిసేపు తరువాత డబ్బులు విషయమై వీరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఈశ్వర్‌రెడ్డిని నెట్టేయడంతో తలకు తీవ్రగాయమై అక్కడే మృతి చెందాడు. దీంతో గురువారం ఉదయం లలిత గది తాళాలు వేసి రిసెప్షన్లో ఇచ్చి వెళ్లిపోయింది. మధ్యాహ్నం లాడ్జిని శుభ్రం చేయడానికి సిబ్బంది గది తెరచిచూడగా ఈశ్వర్‌రెడ్డి మృతి చెంది ఉన్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, ఈశ్వర్‌రెడ్డి మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే లాడ్జి గదిని లలిత పేరుమీద బుక్ చేయడంతో పోలీసుల పని సులభతరమైంది. ఆమె ఇచ్చిన చిరునామా, ఫోన్ నంబర్ ఆధారంగా నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమించి పెళ్లి.. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని
సాక్షి, చెన్నై: ప్రేమించి పెళ్లి చేసుకొని సంసార జీవితాన్ని కొనసాగిస్తూ ముగ్గురు పిల్లలకు తండ్రిగా తన బాధ్యతను నెరవేరుస్తున్న ఒక భర్త పాలిట భార్యే మృత్యుపాశంగా మారింది. ప్రియుడు, అతని సన్నిహితులతో కలిసి కిరాతకంగా భర్తను మట్టుబెట్టింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా, నగరి మునిసిపాలిటీ రామాపురం వద్ద వెలుగుచూసింది. రామాపురం వద్ద ఉన్న స్టోన్‌క్రషర్ కొలనులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విజయ్‌కుమార్ (32) మృతికి గల కారణాలను పోలీసులు అత్యంత వేగంగా కనుగొన్నారు. తీగలాగితే డొంక బయటపడినట్టు, మృతికి గల కారణాలు వెలుగు చూశాయి. నిందితులను అరెస్ట్ చూపుతున్న సీఐ శ్రీనివాసంతి సీఐ శ్రీనివాసంతి తెలిపిన వివరాలు.. నగరిలో సెల్ ఫోన్ షాపు నడుపుకునే విజయకుమార్‌కు 14 ఏళ్లక్రితం వనిత (30)ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. విజయకుమార్‌కు వ్యాపారరీత్యా టీఆర్ కండ్రిగకు చెందిన తమిళరసు (21)తో పరిచయం ఏర్పడింది. దీంతో తమిళరసు విజయకుమార్ ఇంటికి తరచూ వెళ్లేవాడు. ఈ క్రమంలో తమిళరసుకు వనితతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే కుమార్తెతో అతి చనువుగా తమిళరసు మాట్లాడుతుండడంతో విజయకుమార్ తమిళరసును తన ఇంటికి రావద్దని ఆపేశాడు. 15 రోజుల పాటు తమిళరసు, వనిత కలుసుకోవడానికి విజయకుమార్ అడ్డుపడుతూ రావడంతో అతన్ని చంపడానికి వీరు మాస్టర్ ప్లాన్ వేశారు. తమిళరసు ఈ ప్లాన్‌లో తనకు మద్యం మిత్రులైన టీఆర్ కండ్రిగకు చెందిన తమిళరసు, కాకవేడు దళితవాడకు చెందిన నాగరాజు కొల్లాపురి (20), సంతోష్‌కుమార్ (15) కలిశారు. పక్కాగా పథక రచన చేశారు. గత ఆదివారం రాత్రి క్వారీ వద్దకు తమిళరసు, కొల్లాపురి, సంతోష్‌కుమార్ ముందుగా చేరుకున్నారు. ఫుల్‌గా మద్యం తాగి, విజయకుమార్‌కు ఫోన్‌చేసి బైక్‌లో పెట్రోల్ అయిపోయిందని.. తాము క్వారీ వద్ద ఉన్నామని పెట్రోల్ తీసుకురావాలని కోరాడు. మిత్రుని కోసం పెట్రోల్ తీసుకువెళ్లాలని బయలుదేరిన విజయకుమార్ వెంట తానూ వస్తానని వనిత బయలు దేరింది. ఇద్దరూ పెట్రోల్ తీసుకొని క్వారీ వద్దకు వెళ్లారు. పెట్రోల్‌ను బండిలో పోసే సమయంలో ఈతరాని విజయకుమార్‌ను వెనకనుంచి తమిళరసు తోసివేయగా కొల్లాపురి అతనిపై దూకి నీళ్లలో ముంచే ప్రయత్నం చేశాడు. క్వారీ పై నుంచి వనిత, సంతోష్ అతని తలపై రాళ్లువేయడంతో తీవ్రగాయాలపాలైన విజయకుమార్ నీటమునిగి మృతిచెందాడు. చదవండి: అదృశ్యమైన కారు డ్రైవర్ హత్య.. ప్రియుడితో కలిసి భార్య సుపారీ ఒకసారి బెడిసికొట్టిన ప్లాన్ గత ఆదివారానికి ముందు చంపడానికి వీరు ప్లాన్ వేసి కత్తిని కూడా సిద్ధం చేసుకున్నారు. ఇదేవిధంగా విజయకుమార్‌కు ఫోన్ చేసి పెట్రోల్ అయిపోయిందని చెప్పడంతో అతను వెళ్లాడు. అయితే ఆ సమయానికి అక్కడ జన సంచారం ఉండడంతో ప్లాన్ మిస్సయింది. అత్యంత వేగంగా విచారణ విజయకుమార్ అనుమానాస్పద మృతి కేసులో విచారణ వేగంగా జరిగింది. విచారణలో తాను దొరుకుతానని తెలుసుకున్న వనిత ముందస్తుగా వీఆర్వో వద్ద సరెండర్ కావడంతో, మిగిలిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం మైనర్‌ను జువైనల్ హోంకు పంపగా మిగిలిన వారిని రిమాండ్‌కు తరలించారు. -
సంక్షేమం తలుపు తడుతోంది
(చిత్తూరు) నగరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమం ప్రతి ఇంటి తలుపుతడుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సరీ్వసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మంగళవారం నగరి మండలం, దేశూరు అగరం గ్రామంలో ఆమె గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి మూడేళ్ల కాలంలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేలును అంకెలతో సహా వివరించారు. నవరత్న పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు ఏయే సంక్షేమ పథకాలు అందాయి, వాటి ద్వారా ఎంత మేర లబ్ధి చేకూరిందో వివరించారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల బుక్లెట్లను అందజేశారు. సమస్యల కారణంగా పథకాల లబ్ధి ఆగిందని పలువురు మంత్రి దృష్టికి తీసుకురాగా, ఎందుకు ఆగిందో సచివాలయ సిబ్బంది, వలంటీర్ల ద్వారా తెలుసుకున్నారు. వాటి పరిష్కార మార్గాలను సూచిస్తూ అర్హులెవ్వరికీ అన్యా యం జరగకూడదని సచివాలయ సిబ్బందికి సూచించారు. మంచి చేస్తుంటే ఓర్వలేక కుట్రలు సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంటే ప్రతిపక్ష టీడీపీ ఓర్వలేక కుట్ర రాజకీయాలు చేస్తోందని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవధిలోనే 95 శాతానికిపైగా ముఖ్యమంత్రి జగనన్న అమలు చేశారని గుర్తు చేశారు. ఏ పథకమైనా ప్రకటించిన తేదీల్లోనే లబి్ధదారులకు అంద జేస్తూ పారదర్శక పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఎంపీపీ భార్గవి, వైస్ ఎంపీపీలు కన్నియప్పన్, ఢిల్లీ, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, హౌసింగ్ డీఈ శంకరప్ప, వెటర్నరీ ఏడీ వాసు, ఎంపీటీసీ సభ్యు లు గుణశేఖర్ రెడ్డి, నాయకులు సుధాకర్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, పరంధామరెడ్డి, శరత్ బాబు, దినకర్‌రెడ్డి, రామూర్తి రెడ్డి, రంగనాథం, మధు, సచి వాలయ సిబ్బంది, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. -
కాణిపాకం ఆలయానికి కొత్త మెరుగులు.. మహా కుంభాభిషేకానికి సర్వం సిద్ధం
సాక్షి, చిత్తూరు: వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి మహా కుంభాభిషేకానికి సర్వం సిద్ధమైంది. ఈనెల 21న ఆదివారం శాస్త్రోక్తంగా చతు ర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం నిర్వహణకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వస్తి శ్రీ చంద్రమాన శుభ కృత్ నామ సంవత్సర శ్రావణ బహుళ దశమి మృగశిరా నక్షత్ర యుక్త శుభ కన్యా లగ్నము నందు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు వరకు విమాన గోపురం, ధ్వజస్తంభానికి మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ►మహా కుంభాభిషేకంలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి చతుర్థ కాల హోమము, మహా పూర్ణాహుతి, కలశోద్వాసన ►ఉదయం 8 నుంచి 8.30 గంటలలోపు రాజ గోపురం, పశ్చిమ ద్వార గోపురం, స్వామి వారి విమాన గోపురం, నూతన ధ్వజ స్తంభములకు మహా కుంభాభిషేకం ►ఉ.8:30 నుంచి 9 గంటల పు స్వయం భు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి కుంభాభిషేకం, తీర్థ ప్రసాద వినియోగం, యజమానోత్సవం. ►మహా కుంభాభిషేకము అనంతరం మ.2 గంటల నుంచి స్వామి వారి మూల విరాట్ దర్శనం కల్పించనున్నారు. ►సా. 6 నుంచి శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి తిరు కళ్యాణం. అలాగే గ్రామోత్సవం నిర్వహించనున్నారు. ఈనెల 21 నుంచి మూల విరాట్ స్వయంభు వినాయక పునర్దర్శనం భక్తులకు అందుబాటులో రానున్నది. ఆలయ పునర్నిర్మాణానికి కృష్ణా జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐలు గాయత్రీ దేవి, ఐకా రవి దంపతులు.. గుత్తికొండ జానకి,శ్రీ గుత్తికొండ శ్రీనివాస్ దంపతులు రూ.10 కోట్ల విరాళం ఇచ్చారు. దేవస్థానంలో అభివృద్ధి పనులు ► రూ.5 కోట్లతో నూతన లడ్డు పోటు, పడి తరం స్టోరు నిర్మాణం ► సుమారు రూ. 12 కోట్లతో వినాయక సదన్ వసతి గదుల 2, 3 వ అంతస్తుల నిర్మాణం ► సుమారు రూ.9 కోట్లతో భక్తుల సౌక ర్యార్థం నూతన ఏసీ, నాన్ ఏసీ కళ్యాణ మండపంలో నిర్మాణానికి ప్రతిపాదనలు జరిగాయి. ► సుమారు రూ. 20 కోట్లతో నూతన క్యూ కాంప్లెక్స్ భవనానికి సంబంధించిన నిర్మాణానికి అంచనా ► సుమారు రూ. 14 కోట్లతో నూతన బస్టాండు మరియు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అంచనా. ► సుమారు రూ. 4 కోట్లతో 100 అడుగుల రోడ్డు మరియు స్వాగతం ఆర్చి గేట్ నిర్మాణానికి చర్యలు.. -
ప్రేమించి పెళ్లాడి.. వదిలేశాడు
చిత్తూరు : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కడుపు వస్తే మాయ మాటలతో కడుపు తీయించి గాలికి వదిలేశాడంటూ బాధితురాలు శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. ఎస్ఐ దస్తగిరి మాట్లాడుతూ కడప జిల్లా పులివెందులకు చెందిన శిరీష, చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం ఈదువారిపల్లెకు చెందిన నిరంజన్‌కుమార్ విజయవాడలో 2018 నుంచి 2022 వరకూ ఒకే కళాశాలలో బీటెక్ చదువుకున్నారు. కళాశాలలో చేరినప్పటి నుంచి వెంటపడి ప్రేమించి, మొదటి సంవత్సరం ఆఖరిలో విజయవాడలోనే కనక దుర్గమ్మ ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి కలిసే ఉంటున్నారు. 2021లోర్భం దాల్చన విషయాన్ని గుర్తించిన నిరంజన్‌కుమార్ తన స్వగ్రామానికి తీసుకొచ్చాడు. అయితే ప్రేమించి పెళ్లిచేసుకున్న విషయాన్ని, తాను గర్భంగా ఉన్న విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు నన్ను ఇష్టపడ లేదు. దీంతో నిరంజన్‌కుమార్ మా తల్లిదండ్రులకు నచ్చలేదు. వేరే పెళ్లి చేసుకో అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో వారి తల్లిదండ్రులను నిలదీస్తే, నాలుగేళ్లు ఆగు చూద్దామని చెప్పి చేతులు దులుపుకున్నారు. ఈ విషయమై కడపలో కూడా నిరంజన్‌కుమార్‌పై కేసు పెట్టడంతో, అక్కడి పోలీసులు అతనితో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు నిరంజన్ వారి సమీప బంధువును ప్రేమించి, పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో శిరీష వెళ్లి వారి తల్లిదండ్రులను ప్రశ్నించింది. దీంతో వారు దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ పేర్కొన్నారు. -
కుప్పం అభివృద్ధికి అండగా ఉంటాం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో కంటే.. గత మూడేళ్లలోనే కుప్పం నియోజకవర్గానికి ఎక్కువ మేలు జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలతో భేటీలో భాగంగా.. గురువారం సాయంత్రం మొదటగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ నిర్వహించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుంచే మొదలు కావాలని ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. ‘ కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానం. ఇక్కడ భరత్‌ను గనుక గెలిపిస్తే.. ఆయనకు మంత్రి పదవి గ్యారెంటీ. చంద్రబాబు హయాంలో కన్నా.. ఈ మూడేళ్లలో కుప్పం నియోజకవర్గానికి మేలు ఎంతో జరిగింది. భవిష్యత్తులోనూ మరింత జరగుతుంది కూడా. ఈ వేళ కుప్పం మున్సిపాల్టీకి సంబంధించి రూ.65 కోట్ల విలువైన పనుల నిధులను మంజూరు చేస్తున్నాం. కుప్పం అభివృద్ధికి అన్ని వేళలా అండగా ఉంటాం అని సీఎం జగన్.. కార్యకర్తలను ఉద్దేశించి పేర్కొన్నారు. పార్టీ క్యాడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేసేలా సీఎం జగన్.. దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. కార్యకర్తలతో సమావేశాన్ని కుప్పంనుంచే ప్రారంభిస్తున్నాం కుప్పం అంటే టీడీపీకి ఒక కంచుకోట అని అంతా అనుకుంటారు వాస్తవం ఏంటంటే.. బీసీలు ఎక్కువగా ఉన్న స్థానం కుప్పం నియోజకవర్గం బీసీలకు మంచి చేస్తున్నాం అంటే .. అది ప్రతి పనిలోనూ కనిపించాలి బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన మంచి వ్యక్తి, ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని అభ్యర్థిగా పెట్టి మనం అడుగులు ముందుకేశాం దురదృష్టవశాత్తూ చంద్రమౌళి మనకు దూరమయ్యారు అంతటితో ఆ కుటుంబాన్ని వదిలేయకుండా.. ఆయన కుమారుడు భరత్‌ను తీసుకు వచ్చాం చంద్రమౌళి చికిత్స పొందుతున్న సమయంలో నేను ఆస్పత్రికి కూడా వెళ్లాను ఆ రోజు భరత్ నాకు పరిచయం అయ్యాడు నేను భరత్‌ను ప్రోత్సహిస్తానని ఆ రోజే చెప్పాను ముందుండి ప్రతి అడుగులోనూ సపోర్ట్ చేశాం మీరు కూడా భరత్‌పై అదే ఆప్యాయతను చూపించారు దీనివల్ల భరత్ నిలదొక్కుకున్నాడు భరత్‌ను ఇదేస్థానంలో నిలబెడతారా? లేదా ఇదే భరత్‌ను మళ్లీ పై స్థానంలోకి తీసుకు వెళ్తారా? అన్నది మీమీద ఆధారపడి ఉంది భరత్‌ను గెలుపించుకు రండి..భరత్‌ను మంత్రిగా మీ కుప్పానికి ఇస్తాను నియోజకవర్గంలో చంద్రబాబు గెలుస్తారు, ఆయన సీఎం అవుతాడు, కుప్పం అభివృద్ధి చెందుతుంది అనే ఒక భ్రమను టీడీపీ, చంద్రబాబు కల్పించుకుంటా వెళ్లారు నిజం చెప్పాలంటే.. చంద్రబాబు హయాంలో కన్నా.. ఈమూడేళ్లలో కుప్పం నియోజకవర్గానికి ఎక్కువ మేలు జరిగింది స్కూళ్లలో నాడు –నేడు, ఇళ్ల పట్టాలు, ఆస్పత్రుల్లో నాడు–నేడు, ఇక ప్రతి గ్రామంలోనూ సచివాలయం, విలేజ్ క్లినిక్, ఆర్బీకే.. ఇవన్నీకూడా గతంలో ఏ గ్రామంలోనూ కనిపించలేదు మన కళ్ల ఎదుటే ఇవి కనిపిస్తున్నాయి నాడు – నేడుతో బడులన్నీకూడా రూపురేఖలు మారుతున్నాయి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌కూడా అమల్లోకి వస్తుంది ఇదీ చదవండి: నాడు అసాధ్యమన్నారు.. నేడు సాధ్యమైందిగా! -
బయటపడిన నిత్య పెళ్లికూతురి బాగోతం.. ముగ్గురి దగ్గర మూడు పేర్లతో..
సాక్షి, చిత్తూరు(చెన్నై): విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి ముగ్గురి భర్తల వద్ద మూడు పేర్లు చెప్పి వివాహం చేసుకున్న కిలాడీ లేడి విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. చెన్నై ఆవడి సమీపంలోని ముత్తు పుదుపేట రాజీవ్‌నగర్‌కు చెందిన హరి(44) ఎంసీఏ పూర్తి చెన్నైలోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతనికి 2008లో చెన్నైలోని కొలత్తూరు ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాహమైంది. మనస్పర్థల కారణంగా వీరు 2014లో విడాకులు తీసుకున్నారు. దీంతో హరి రెండవ వివాహం చేసుకునేందుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇంటి పని చేస్తున్న వ్యక్తి ద్వారా ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన శరణ్య అనే యువతిని చూశారు. ఆ సమయంలో ఆమె తనకు 35 ఏళ్లు అని, బంధువులు ఎవరూ లేదని చెప్పింది. దీంతో హరి, శరణ్యను గత ఏడాది వివాహం చేసుకున్నాడు. ఈ ఆస్తి వివరాలను చెప్పాలని హరితో శరణ్య తరచూ ఘర్షణ పడేది. ఆస్తులను తనపై పేరుపై రాసి పెట్టాలని కోరింది. చివరికి వరకట్న వేధింపులు గురి చేస్తున్నారని భర్త, అత్త ఇంద్రాణిపై తిరుపతి పోలీసులకు శరణ్య ఫిర్యాదు చేసింది. దీంతో హరి తల్లి ఇంద్రాణి ఆవడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా శరణ్య నిజమైన పేరు సుగణ అని ఈమెకు 50 ఏళ్లని తేలింది. ఈమెకు ఇది వరకే తిరుపతికి చెందిన రవి అనే వ్యక్తితో వివాహం జరిగి ఇద్దరు కుమార్తెలున్నట్లు తెలిసింది. దీంతో ఆవడి పోలీసులు శరణ్యను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట సమీపంలోని వక్కనంపట్టి గ్రామానికి చెందిన సుబ్రమణి శనివారం ఆవడి పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు. అందులో తాను సేలం, ఈరోడ్డు, కాట్పాడి వంటి రైల్వేస్టేషన్‌లోని క్యాంటిన్లో పని చేస్తున్నానని 2010లో ఆరణికి చెందిన ఏజెంట్ ద్వారా శరణ్యకు తనకు వివాహం జరిగిందని పేర్కొన్నాడు. తన వద్ద ఆమె పేరును సంధ్య అని తెలిపిందన్నారు. గత పదేళ్లుగా శరణ్యతో తాను జీవించానని తమకు పిల్లలు లేదని 2021 జూలైలో మేట్టుపాళ్యంలో రైల్వే క్యాంటీన్లో పనికి వెళ్లిన సమయంలో శరణ్య తనను వదిలి వెళ్లి పోయిందని అందులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Hyderabad: ప్రాణం తీసిన ప్రేమ పెళ్లి! -
ఆర్టీసీ బస్సు–లారీ ఢీ
చింతూరు/మోతుగూడెం: ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ మృతిచెందగా బస్సు డ్రైవర్, కండక్టర్‌తో సహా 15 మంది గాయపడ్డారు. చింతూరు, మోతుగూడెం రహదారిలోని సుకుమామిడి సమీపంలో మలుపు వద్ద ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సీలేరు నుంచి విజయవాడ వెళ్తుండగా తెలంగాణ నుంచి ఒడిశాకు సిమెంటు లోడుతో వెళుతున్న లారీని ముందు భాగంలో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన పల్లపు రాజు(26) లారీ క్యాబిన్, స్టీరింగ్ నడుమ ఇరుక్కుని తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ అప్పలనాయుడు, ఎస్ఐలు యాదగిరి, సత్తిబాబు తమ సిబ్బందితో కలసి క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని శ్రమించి బయటకు తీశారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, కండక్టర్‌తో పాటు మరో 15 మందికి కూడా గాయాలు కాగా వీరిని చికిత్స నిమిత్తం చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వీరిలో 11 మందిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. డ్రైవర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం చింతూరు తరలించిన పోలీసులు ప్రమాదానికి గురైన బస్సును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కాగా బస్సు డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. సంఘటనపై జిల్లా జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో సూరజ్ ధనుంజయ్ గనోరే ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఏపీవోను ఆదేశించారు. -
‘నడవలేని చంద్రబాబుకు పచ్చపత్రికలే ఊతకర్ర’
సాక్షి,పలమనేరు/వి.కోట: అభివృద్ధి జరగలేదని బజాయించే ఎల్లో మీడియా, టీడీపీ నాయకులకు గ్రామాల్లో నిర్మించిన సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, బీఎంసీలు, వెల్నెస్ సెంటర్లు కంటికి కనిపించలేదా అని రాష్ట్ర మైనింగ్, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా విమర్శించారు. ఆయన పలమనేరు నియోజకవర్గం వి.కోటలో శనివారం వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి, షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. అక్కడ జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ కరువు కాటకాలు విలయతాండవం చేసేవన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక ఈ మూడేళ్లలో క్రమం తప్పకుండా వర్షాలు కురవడంతో కరువు పారిపోయిందని చెప్పారు. నేడు రైతులు పంటలను సాగుచేస్తూ గ్రామాలు కళకళలాడుతున్న మాట నిజం కాదా అని ప్రశ్నించారు. వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలుసని, అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తోందని గుర్తుచేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేడు కులమతాలు, పార్టీలకతీతంగా ఇంటింటికీ చేరుతున్న మాట నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని పచ్చ పత్రికలు చూస్తే బాగుంటుందన్నారు. పార్టీలకతీతంగా పథకాలు నలభైఏళ్ల అనుభవం అని చెప్పుకొనే చంద్రబాబు చేయలేని అభివృద్ధిని కేవలం మూడేళ్లలో చేసిచూపెట్టిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కిందని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ అన్నారు. గత ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలను గుర్తించారని చెప్పారు. దేశం మెచ్చుకున్న సచివాలయ వ్యవస్థను రూపొందించి పార్టీలకతీతంగా పథకాలను అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. ఇక ఎప్పటికీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేరని చెప్పారు. వచ్చే ఎన్నికలే కాదు.. ఎన్ని ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో వైఎస్సార్సీపీదే అధికారమని, జగనన్నే ముఖ్యమంత్రిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో పార్లమెంటు సభ్యులు ఎన్.రెడ్డెప్ప, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్, డీసీసీబీ చైర్మన్ మొగసాల రెడ్డెమ్మ, వి.కోట సర్పంచ్ లక్ష్మి, ఎంపీపీ యువరాజ్, రాష్ట్ర కార్యదర్శులు నాగరాజ్, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, కన్వీనర్ బాలగురునాథ్, జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షులు మొగసాల రెడ్డెప్ప నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నడవలేని చంద్రబాబుకు పచ్చపత్రికలు, మీడియా ఊతకర్రగా పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని కాదని వక్రీకరించి వార్తలు రాసినంత మాత్రాన జనం నమ్మరు. టీడీపీకి వచ్చే ఎన్నికల్లో దీటైన జవాబు చెబుతాం. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా వైఎస్సార్ సీపీదే విజయం. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సంక్షేమ పాలన సాగిస్తారు. మా నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో వర్షాలు బ్రహ్మాండంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా కరువు ఎక్కువగా ఉండే పడమటి మండలాల్లో సైతం వరుణుడు కరుణించాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ మెజారిటీ 32 వేలయితే, రాబోయే ఎన్నికల్లో 50 వేల మెజారిటీతో గెలవడం ఖాయం. రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతోంది. ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,రాష్ట్ర మైనింగ్, అటవీశాఖ మంత్రి చదవండి: బాబు, పవన్‌కు రాజకీయ హాలిడే -
సప్తగిరి గ్రామీణ బ్యాంకుకు టీడీపీ నేతల టోకరా!
శాంతిపురం(చిత్తూరు): సప్తగిరి గ్రామీణ బ్యాంకుకు చెందిన నాలుగు శాఖల్లోని వివిధ ఖాతాల నుంచి టీడీపీకి చెందిన ముగ్గురు యువ నేతలు ఏకంగా రూ.10 లక్షలకు పైగా కొల్లగొట్టారు. రామకుప్పం శాఖలో తీగ లాగడంతో శాంతిపురం కేంద్రంగా గత మూడు నెలల నుంచి సాగిన ఈ వ్యవహారం బయ ట పడింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక సప్తగిరి బ్యాంకులో ఔట్సోర్సింగ్ అటెండర్‌గా పనిచేస్తున్న నడింపల్లికి చెందిన సత్యకుమార్‌ను బ్యాంకు అధి కారులు అతిగా నమ్మారు. అతనికి కంప్యూటర్ పరి జ్ఞానం ఉండడంతో ఇతర పనులను కూడా అప్పగించారు. దీనిని తనకు అనుకూలంగా మలచుకు న్న అతను కెనమాకులపల్లికి చెందిన తిప్ప అలియాస్ త్యాగరాజు, జంగాలపల్లికి చెందిన మునిరాజుతో కలిసి దోపిడీకి తెరతీశాడు. శాంతిపురం, రామకుప్పం, రాళ్లబూదుగూరు, గుడుపల్లి బ్రాంచుల్లో 60కి పైగా బ్యాంకు ఖాతాల నుంచి సొమ్మును డ్రా చేశారు. ఇందుకోసం దీర్ఘకాలంగా ఆపరేట్ చేయని బ్యాంకు ఖాతాలు, మృతుల పేరుతో ఉన్న ఖాతాల ను ఎంచుకున్నారు. ఆయా ఖాతాల వివరాలతో తమ వారి ఫొటోలు అతికించి నకిలీ పాస్బుక్కుల ను సిద్ధం చేశారు. మృతుల ఆధార్ నంబర్లను బ్యాంకులో మార్చివేసి తమకు కావాల్సిన ఆధార్ నంబర్లను చేర్చారు. ఆయా ఖాతాలనుంచి తరచుగా గుట్టుచప్పుడు కాకుండా నగదు విత్‌డ్రా చేశారు. ఈ క్రమంలోనే.. రామకుప్పం బ్రాంచిలో ఓ మృతు డి ఖాతా నుంచి రూ.49 వేలను విత్‌డ్రా చేయడంతో.. అప్పటికే ఖాతాలోని నగదు గురించి అవగాహ న ఉన్న మృతుడి కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం బ్యాంకుకు వచ్చి సిబ్బందితో గొడవకు దిగారు. దీంతో బ్యాంకు సిబ్బంది ఖాతా వివరాలను పరిశీలించడంతో విషయం బయట పడింది. గుట్టుచప్పుడు కాకుండా సర్దుబాటు! బ్యాంకు నుంచి స్వాహా చేసిన మొత్తంలో ఇప్పటి వరకూ లెక్క తేలిన మొత్తాన్ని వెనక్కు కట్టించి విషయం సద్దుమణిగించేందుకు టీడీపీకి చెందిన కొంతమంది నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం రూ.4లక్షలను నిందితుల నుంచి బ్యాంకు అధికారులు రికవరీ చేశారు. ఈ వ్యవహారంపై స్థానిక బ్రాంచి మేనేజర్ దస్తగిరిని వివరణ కోరగా.. మృతుల ఖాతాల్లో నుంచి నకిలీ పాసు పుస్తకాలతో సొమ్ము డ్రా చేయడం వాస్తవమేనని ధ్రువీకరించారు. అయితే దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాళ్లబూదుగూరు ఎస్ఐ మునిస్వామి తెలిపారు.