రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీల అమలు ఇంకా ప్రారంభం కాలేదని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు.
రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీల అమలు ఇంకా ప్రారంభం కాలేదని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాలపై పోరాడాలంటూ రాష్ట్ర ఎంపీలకు ఆయన లేఖ రాశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఆర్థికలోటు భర్తీ లాంటి హామీలేవీ అమలు కావట్లేదని రఘువీరా చెప్పారు.
వీటిపై ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ లేఖ రాసినా.. దానికి ప్రధానమంత్రి నుంచి స్పందన రాలేదన్నారు. హుదూద్ తుపాను బాధితులకు ప్రధాని ప్రకటించిన తాత్కాలిక సాయం కూడా ఇప్పటివరకు అందలేదని గుర్తుచేశారు. దీనిపై కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయనో లేఖ రాశారు.