
'విభజన దురదృష్టకరం, నేను కాంగ్రెస్ వాదిని'
రాష్ట్ర విభజన దురదృష్టకరమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు.
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన దురదృష్టకరమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తన రాజీనామా విషయాన్ని తనకు నిన్ననే చెప్పారని ఆయన బుధవారమిక్కడ తెలిపారు. తాను కాంగ్రెస్ వాదినని, ఎవరు రాజీనామా చేసినా పార్టీకి నష్టం వాటిల్లుతుందని అన్నారు.
అనివార్యంగా జరిగిన విభజన వల్ల పార్టీకి జరిగిన నష్టాన్ని పూరించే ప్రయత్నం చేస్తున్నామని బొత్స సత్యనారాయణ తెలిపారు. కిరణ్ రాజీనామా కన్నా రాష్ట్ర విభజనాంశమే ఎక్కువ బాధ కలిగించే అంశమన్నారు. లోక్‌సభ టీవీ ప్రసారాలు ఆపకపోయినా రాష్ట్ర విభజన జరిగేదేనని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.