వైఎస్సార్సీపీ సంస్థాగత పదవుల నియామకం | organizational ranks in ap ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ సంస్థాగత పదవుల నియామకం

Published Tue, Jun 14 2016 6:53 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

వైఎస్సార్సీపీ సంస్థాగత పదవుల నియామకం - Sakshi

వైఎస్సార్సీపీ సంస్థాగత పదవుల నియామకం

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పదవుల్లో పలువురిని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పి.శ్రీలక్ష్మి
యువజన, విద్యార్థి విభాగాల పర్యవేక్షకుడిగా కోలగట్ల

 సాక్షి,హైదరాబాద్: ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పదవుల్లో పలువురిని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి(ఏలూరు) నియమితులయ్యారు. రాష్ట్ర యువజన, విద్యార్థి విభాగాల పర్యవేక్షణ బాధ్యతలను ఎమ్మెల్సీ, విజయనగరం జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామికి అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతిని పాతపట్నం నియోజకవర్గం సమన్వయకర్తగా, కావటి శివ నాగ మనోహర్ నాయుడును గుంటూరు జిల్లా పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు.

 కర్నూలు జిల్లా నుంచి
పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా గుండం సూర్యప్రకాష్ రెడ్డి(బనగానపల్లి), రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా పోచా.శీలారెడ్డి(బనగానపల్లి), జిల్లా ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజు యాదవ్(కర్నూలు), జిల్లా అధికార ప్రతినిధిగా సిద్ధారెడ్డి రామ్మోహన్‌రెడ్డి(బనగానపల్లి), జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా జి.అయ్యపురెడ్డి(బనగానపల్లి)లు నియమితులయ్యారు.

 ప్రకాశం జిల్లా నుంచి
రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా సలగాల అమృతరావు(చీరాల), జిల్లా విద్యార్థి విభాగం సహాయ కార్యదర్శిగా పెర్లి రిచ్చి(చీరాల), కార్యవర్గసభ్యులుగా చీరాలకు చెందిన యామర్తి అజైల్ రాయ్, దాసరి వినోద్, కాగిత సందీప్, నల్లమేకల రాజేష్ యాదవ్, బండి బాలశంకరరావులు నియమితులయ్యారు. వేటపాలెం మండల పార్టీ అధ్యక్షుడిగా కొలుకుల వెంకటేశ్, విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడిగా కుంచాల ఏడుకొండలరెడ్డి, చీరాల మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఆట్ల రూపేంద్రరెడ్డి, చీరాల పట్టణ విద్యార్థి విభాగం అధ్యక్షురాలిగా బిళ్ల వినీత్నలు నియమితులయ్యారు.

 శ్రీకాకుళం జిల్లా నుంచి
పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా శిర్ల రామారావు(శ్రీకాకుళం), నందిగాం మండల పార్టీ అధ్యక్షుడిగా బొమ్మిలి లక్ష్మీనారాయణ(టెక్కలి), ఇచ్ఛాపురం పట్టణ శాఖ అధ్యక్షుడిగా కళ్ళ దేవరాజ్‌లను నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement