
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్: వైఎస్సార్‌సీపీలో కొత్తగా నియామకాలు జరిగాయి. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనంతపురం అర్భన్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్తగా అనంతవెంకట్రామిరెడ్డిని, హిందూపురం పార్లమెంటు వైఎస్సార్ సీపీ సమన్వయకర్తగా నదీంఅహ్మద్‌ను, అలాగే అనంతపురం పార్లమెంటు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా తలారి రంగయ్యను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.