anantha venkatarami reddy
-
బడ్జెట్ ప్రసంగమా.. లేక.. బాబు, లోకేష్ భజన
-
పోసాని అరెస్ట్ పై అనంత వెంకట రామిరెడ్డి ఫైర్
-
'జగన్ ' అంటే నమ్మకం కోల్పోయింది అధికారమే.. ప్రజాదరణ కాదు
-
రైతులకు మద్దతుగా జగన్ పర్యటిస్తే ఎలాంటి భద్రత కల్పించలేదు
-
ఆ ట్రోలింగ్‌ను పవన్, బాబు ఖండించరా?
అనంతపురం, సాక్షి: వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతున్న ప్రజాదరణను ఓర్వలేక చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు దిగిందని, ఈ క్రమంలోనే భద్రతను కుదించిందని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి విమర్శించారు. వైఎస్ జగన్‌ను కలిసిన చిన్నారిని ట్రోల్ చేసిన అంశంపైనా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) విఫలమవుతోంది. ఈ అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. జగన్ ప్రజల్లో తిరగకుండా చేసేందుకు భద్రత కుదించారు. ఇల్లీగల్ యాక్టివిటీస్‌కు భద్రత కల్పించలేమని చంద్రబాబు అంటున్నారు. రైతులను పరామర్శించడం చంద్రబాబు దృష్టిలో ఇల్లీగల్ యాక్టివిటీసా?. చంద్రబాబు అలా మాట్లాడడం దుర్మార్గం కాదా?.. ..కావాలనే వైఎస్ జగన్ భద్రత(YS Jagan Security)పై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. మిర్చి రైతులను జగన్ పరామర్శిస్తే తప్పేంటి?. వైఎస్ జగన్ పాలనలో 24 పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరలు కల్పించింది. కానీ, టీడీపీ కూటమి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించటంలో విఫలమైంది.రాజకీయ విలువల్లేవా?వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో ఫోటో దిగిన చిన్నారిపై సోషల్ మీడియాలో టీడీపీ సైకోలు దుష్ప్రచారం(TDP Trolling) చేస్తున్నారు. అమ్మ ఒడి వస్తోందో.. రాలేదో... నారాయణ, చైతన్య స్కూళ్ల వద్ద అడిగినా చెబుతారు. చిన్నారిపై ట్రోలింగ్ జరుగుతుంటే చంద్రబాబు, పవన్‌లు ఖండించరా?. వాళ్లకు అసలు రాజకీయ విలువలు లేవా? అని అనంత ప్రశ్నించారు. -
‘పవన్.. హామీల అమలు నీ బాధ్యత కాదా?’
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ హామీల అమలుకు పవన్ కళ్యాణ్ ఎందుకు బాధ్యత తీసుకోరు అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ నాయకులు. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయరా?. శాంతి భద్రతల నిర్వహణలో చంద్రబాబు సర్కార్ విఫలమైందన్నారు. అలాగే, కక్ష సాధింపు చర్యలను మానుకుని హామీలను అమలు చేయాలని కూటమి నేతలకు హితవు పలికారు.అనంతరంలో వైఎస్సార్సీపీ నాయకులు చంద్రబాబు పాలనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సాకే శైలజానాథ్ మాట్లాడుతూ..‘ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు పవన్ కళ్యాణ్ ఎందుకు బాధ్యత తీసుకోరు?. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయరా?. టీడీపీ కూటమి.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ చంద్రబాబు జారుకునే యత్నం చేస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియలేదా? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు తగదు. ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కొనసాగిస్తుంది. శాంతి భద్రతల నిర్వహణలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. ప్రజల గొంతుకను అణచివేసేందుకు పోలీసులను ఉపయోగించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారు. కక్షసాధింపు చర్యలు మానుకుని ఇచ్చిన హామీలను అమలు చేయండి అని హితవు పలికారు.వైఎస్సార్సీపీ నేత, ప్రభుత్వ విద్యా మాజీ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. విలువలు, విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్. ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. హామీల అమలులో చంద్రబాబు, పవన్‌కు చిత్తశుద్ధి లేదు. వైఎస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. టీడీపీ కూటమి అరాచకాలపై నిత్యం పోరాటాలు చేస్తూనే ఉంటాం అని తెలిపారు. -
శైలజానాథ్ పార్టీలో చేరడంపై అనంత వెంకట్రామిరెడ్డి రియాక్షన్
-
కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యార్థులకు ఇబ్బందులు: అనంత వెంకట్రామిరెడ్డి
-
చంద్రబాబూ..ఇంత మోసమా!: అనంతవెంకట్రామిరెడ్డి
సాక్షి,అనంతపురం:ఇచ్చిన అన్ని హామీలను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అమలు చేశారని,నవరత్నాలను నిక్కచ్చిగా అమలు చేసిన ఘనత ఆయనదేనని అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంతవెంకట్రారామిరెడ్డి అన్నారు. బుధవారం(జనవరి29) ఆయన మీడియాతో మాట్లాడారు.‘సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు చేతులెత్తేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇంత మోసం చేస్తారా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబుకు అవగాహన లేదా? సూపర్‌సిక్స్ హామీలకు చంద్రబాబు,పవన్ కళ్యాణ్ నైతిక బాధ్యత వహించాలి.సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోతే ఉద్యమం తప్పదు. ప్రజలు అధైర్య పడొద్దు. వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన పోరాడుతుంది’అని అనంతవెంకట్రామిరెడ్డి తెలిపారు.గుమ్మనూరు జయరాం ఆగడాలు పెరిగిపోయాయి‘మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గం. వార్తలు రాసే జర్నలిస్టు లను రైలు పట్టాలపై పడుకోబెతారా? ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆగడాలు మితిమీరి పోతున్నాయి.ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై గుంతకల్లు పోలీసులు దాడి చేశారు. రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది.బాధితులపైనే హత్యాయత్నం కేసు కేసులు నమోదు చేస్తున్నారు.టీడీపీ ప్రజాప్రతినిధుల చెప్పు చేతుల్లో పోలీసులు పనిచేస్తున్నారు’అని అనంతవెంకట్రామిరెడ్డి ఫైరయ్యారు. -
గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలపై ప్రభుత్వానికి అనంత వెంకటరామి రెడ్డి మాస్ వార్నింగ్
-
విద్యుత్ చార్జీలు పెంచడం దుర్మార్గం
-
చంద్రబాబు ప్రజలను మోసం చేశారు: వెంకట్రామిరెడ్డి
-
పోరాటానికి సిద్ధం.. చంద్రబాబుది అసమర్థత పాలన..
-
‘బాబూ.. ఒక్కో రైతుకు 20వేల ఆర్థిక సాయం ఏమైంది?’
సాక్షి, అనంతపురం: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేదన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో రైతు సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైనట్టు తెలిపారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబుది అసమర్థత పాలన. హామీలను అమలు చేయడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం విఫలమైంది. రైతు సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధం. ఈనెల 13వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమం జరుగుతుంది. అనంతపురంలో ర్యాలీ, అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తాం. రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతుకు 20వేల ఆర్థిక సాయం ఏమైంది?. ధాన్యం కొనుగోలు, మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందన్నారు.మాజీ ఎంపీ తలారి రంగయ్య మీడియాతో మాట్లాడుతూ..‘రైతులకు భరోసా కల్పించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. రైతులకు ఇచ్చిన హామీలను టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేదు. ఈనెల 13వ తేదీన వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతం చేయండి అని పిలుపునిచ్చారు. -
జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు అనంత వెంకటరామిరెడ్డి కౌంటర్
-
అక్రమ అరెస్ట్ లపై కూటమి ప్రభుత్వానికి అనంత వెంకటరామి రెడ్డి కౌంటర్
-
రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారు
-
చంద్రబాబు రైతు ద్రోహి
-
పోలవరం ఎత్తు తగ్గింపు బాబు కుట్రే: అనంత వెంకట్రామిరెడ్డి
సాక్షి,అనంతపురం:కరువు మండలాల ప్రకటనలో చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కేవలం 17 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఈ విషయమై శుక్రవారం(నవంబర్ 1) ఆయన మీడియాతో మాట్లాడారు.‘ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 63 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి. చంద్రబాబు రైతు ద్రోహి. వ్యవసాయం దండగ అన్న సిద్ధాంతంతో చంద్రబాబు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు చంద్రబాబు కుట్రే. పోలవరం ఎత్తు 45.72 అడుగుల నుంచి 41 అడుగులకు కుదించాలని నిర్ణయించడం ద్రోహమే. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఏపీకి సాగు తాగు నీటి కష్టాలు వస్తాయి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు విభజన చట్టాన్ని ఉల్లంఘించటమే. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు చంద్రబాబే నైతిక బాధ్యత వహించాలి. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటున్నారని ప్రధాని మోదీ గతంలో బాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు’అని అనంత వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు.ఇదీ చదవండి: అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన చంద్రబాబు -
ఇకనైనా మేల్కొండి.. తినడం ఆపి...పాలించడం మొదలు పెట్టండి
-
ఆ విషయంలో ఎందుకు స్పందించరు?: అనంత వెంకటరామిరెడ్డి
సాక్షి, అనంతపురం: రైతు భరోసా కింద ఒక్కొ రైతుకు రూ. 20 వేల ఆర్థిక సాయం చేస్తానని చెప్పి చంద్రబాబు మాట తప్పారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అంటూ నిలదీశారు.‘‘కరవు రైతులను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారు. హంద్రీనీవా, తుంగభద్ర జలాలను ప్రణాళికాబద్ధంగా ఉపయోగించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రాజెక్టుల్లో నీరున్నా ఆయకట్టుకు నీరు విడుదల చేయకపోవడం దారుణం. రాయలసీమకు చెందిన మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించరు?. రైతుల సమస్యల కన్నా మద్యం, ఇసుక నుంచి కోట్ల రూపాయలు ఎలా దోచుకోవాలన్న ధ్యాసే ముఖ్యమా?’’ అంటూ అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. -
చంద్రబాబు కనుసన్నల్లోనే టీడీపీ నేతల దోపిడీ
-
మతోన్మాదాన్ని రెచ్చగొట్టి బీజేపీ, టీడీపీ నీచ రాజకీయం..
-
చంద్రబాబును ఏకిపారేసిన వెంకట రామిరెడ్డి
-
‘చంద్రబాబు వంద రోజుల పాలన మోసం.. దగా’
సాక్షి, అనంతపురం: చంద్రబాబు పాలనలో రాష్ట్రమంతా కరువు పరిస్థితి ఉందని.. రైతులకు కనీసం పెట్టుబడి సహాయం కూడా అందలేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు వంద రోజుల పాలన మోసం, దగా.. మాయమాటలతో చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.‘‘అబద్ధాలు చెప్పటంలో చంద్రబాబు గోబెల్స్‌ను మించిపోయారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారు. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచే నవరత్నాలు అమలు చేశారు. జగన్ ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఖజానాలో కేవలం రూ.100 కోట్లే ఉంది. చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసే నాటికి 7 వేల కోట్ల రూపాయలు ఉంది. అయినప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తున్నారు’’ అంటూ అనంత వెంకటరామిరెడ్డి నిలదీశారు.ఇదీ చదవండి: ఆవు నెయ్యి.. టీడీపీకి గొయ్యి!‘‘జగన్ సీఎంగా ఉండి ఉంటే అమ్మ ఒడి వచ్చేది.. రైతు భరోసా పథకం అందేది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఏ మోహం పెట్టుకుని టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్తారు’ అంటూ అనంత వెంకటరామిరెడ్డి దుయ్యబట్టారు.తిరుపతి లడ్డూ: చంద్రబాబు ఒక మాట.. ఈవో మరో మాట‘‘కోట్ల మంది భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీస్తున్నారు. తిరుపతి లడ్డూల విషయం చంద్రబాబు ఒక మాట... ఈవో శ్యామలరావు మరో మాట మాట్లాడుతున్నారు. టీడీపీ కార్యాలయం లో తిరుపతి లడ్డూల ప్రస్తావన ఎందుకు చంద్రబాబు?. లడ్డూలపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడమే చంద్రబాబు దిన చర్య’’ అంటూ అనంతవెంకటరామిరెడ్డి మండిపడ్డారు. -
బాబుకు అనంత వెంకట రామిరెడ్డి వార్నింగ్
-
హింసా రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు..
-
జోరుగా ఎన్నికల ప్రచారం
-
అనంతపురంలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం
-
సీఎం జగన్ పై చంద్రబాబు, పవన్ అసత్య ప్రచారం చేస్తున్నారు.
-
చరిత్రలో నిలిచిపోయేలా సిద్ధం సభ ఉంటుంది: MLA వెంకట రామిరెడ్డి
-
సీఎం జగన్ పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు: ఎమ్మెల్యే అనంత
-
సీఎం పదవి మీదే వారి ధ్యాస.. ప్రజా సమస్యలు వాళ్ళకి కనపడవు
-
అనంతలో ఎల్లో కుట్రలు.. ఆ ఇద్దరే 22 కేసులు వేశారు
దుష్ట శక్తులన్నీ గుంపులుగా చేరడం సహజం. ఇప్పుడు అనంతపురంలో అదే జరుగుతోంది. అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించడం రాజకీయ పార్టీల విధి. ప్రత్యర్థులైనా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను అడ్డుకోరు. కాని ఏపీలో పచ్చ పార్టీ, దత్తపుత్రుడి పార్టీ, జాతీయ పార్టీ ముసుగేసుకున్న ఒక పచ్చ నేత కలిసి అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుంటున్నారు. రోడ్డు.. మోకాలడ్డు.! అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అనంతపురం నగర అభివృద్ధిపై జగన్ సర్కారు ప్రత్యేక దృష్టి సారించడంతో సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అనంతపురం అర్బన్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఈ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కొన్ని రహదారుల నిర్మాణం పూర్తయ్యింది. 300 కోట్ల రూపాయల ఖర్చుతో పంగల్ రోడ్డు నుంచి బళ్లారి రోడ్ దాకా నిర్మితమవుతున్న ఓ జాతీయ రహదారి అనంతపురం నగరం మీదుగా వెళ్తోంది. ఈ రోడ్డు పనుల్ని ఆపేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఇప్పుడు ఏకమయ్యారు. ఆక్రమిస్తాం.. కేసులేస్తాం.! ప్రస్తుతం బీజేపీ నేతగా చెలామణి అవుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరీ, జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ లకు చెందిన కమర్షియల్ కాంప్లెక్స్ రోడ్డు విస్తరణలో భాగంగా సగానికి సగం వెళ్లిపోతాయి. జాతీయ రహదారి స్థలాన్ని ఆక్రమించి ఈ ఇద్దరు నేతలు అతిపెద్ద భవనాలను నిర్మించి కొన్ని సంవత్సరాలుగా కోట్ల రూపాయలు లబ్ది పొందుతున్నారు. ఆక్రమ కట్టడాలు తొలగించాలని, లేకపోతే తామే కూల్చేస్తామని వరదాపురం సూరీ, టీసీ వరుణ్‌లకు ఇప్పటికే అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఎలాగైనా రోడ్డు విస్తరణ పనులను ఆపేయాలని ఆ ఇద్దరు ఎత్తుగడ వేశారు. కోర్టుల్లో ఇప్పటిదాకా 22 కేసులు వేశారు. రోడ్డు నిర్మాణం సరిగా జరగటం లేదంటూ ఎల్లో మీడియా ద్వారా వక్రీకరణ కథనాలు రాయిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కూడా వీరితో జతకట్టినట్లు సమాచారం. బండారం బట్టబయలు పంగల్ రోడ్డు నుంచి బళ్లారి రోడ్‌ను కలిపే రహదారి పూర్తయితే అనంతపురం నగరం రూపురేఖలు మారిపోతాయి. ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ప్రభుత్వానికి, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి మంచి పేరు వస్తుందన్న అభద్రతా భావం విపక్ష నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే టీడీపీ నేత ప్రభాకర్ చౌదరి, బీజేపీ నేత వరదాపురం సూరీ, జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ సంయుక్తంగా అనంతపురం అభివృద్ధిపై కుట్రలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి రోడ్డు విస్తరణలో అనంతపురం మేయర్ మహమ్మద్ వాసీంకు చెందిన నీమా ఆప్టికల్స్ కూడా పోతుంది. ఆయన షాపు పూర్తిగా తొలగించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. మేయర్ మహమ్మద్ వాసీం యంత్రాంగానికి పూర్తిగా సహకరిస్తున్నారు. నగర మేయర్‌తో పాటు చాలా మంది వైఎస్సార్ సీపీ నేతలు.. మద్దతుదారులు రోడ్డు విస్తరణలో భాగంగా తమ భవనాలు తొలగించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వీరి స్ఫూర్తి టీడీపీ, బీజేపీ, జనసేన నేతల్లో ఎందుకు కనిపించడంలేదని జనం ప్రశ్నిస్తున్నారు. ప్రజల అవసరాల కంటే.. అనంతపురం నగర అభివృద్ధి కంటే.. అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు పాకులాడటం పట్ల అనంత వాసులు భగ్గుమంటున్నారు. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
Anantapur: మూడు రాజధానులకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష
సాక్షి, అనంతపురం జిల్లా: ఏపీలో అధికార అభివృద్ధి వికేంద్రీకరణ వ్యతిరేకించే పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని అనంతపురం జిల్లాకు చెందిన మేధావులు, ప్రజా సంఘాలు హెచ్చరించాయి. శ్రీబాగ్ ఒప్పందానికి 85 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురం నగరంలోని కల్లూరు సుబ్బారావు విగ్రహం వద్ద వికేంద్రీకరణ సాధన సమితి జేఏసీ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని వికేంద్రీకరణ చేస్తానని ముందుకు వస్తే.. దాన్ని అడ్డుకుని స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకోవడం క్షమించరాని నేరం అన్నారు. దశాబ్దాలుగా రాయలసీమ అన్యాయానికి గురవుతోందని.. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్న సీఎం జగన్‌కు రుణపడి ఉంటామని అనంతపురం మేధావులు స్పష్టం చేశారు. అధికార అభివృద్ధి వికేంద్రీకరణకు టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాలు అడుగడుగునా అడ్డుపడటం బాధాకరమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. సత్యాగ్రహ దీక్ష చేపట్టిన వికేంద్రీకరణ సాధన సమితి జేఏసీ నేతలకు ఆయన సంఘీభావం తెలిపారు. సీఎం జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానంటే.. ఏపీలోని ప్రతిపక్ష పార్టీల నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాయటం దుర్మార్గం అని మండిపడ్డారు. శ్రీబాగ్ ఒప్పందానికి 85 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దీక్ష జరగడం అభినందనీయం అని ఎమ్మెల్యే అన్నారు. ఏపీలో మూడు రాజధానుల ద్వారా వికేంద్రీకరణకు బాటలు వేసిన సీఎం జగన్‌కు అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి జేఏసీ నేత కేవీ రమణ. కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: జగనన్న మేలును ఎన్నటికీ మరువలేం -
వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి : అనంత వెంకట్రామిరెడ్డి
-
అబద్ధాలు ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట: ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి
-
అమ్మా.. రేషన్ కార్డు వచ్చిందా.. లబ్ధిదారుకు ఎమ్మెల్యే ఫోన్..
అనంతపురం సెంట్రల్: ‘హలో అనురాధమ్మనా మాట్లాడేది. నేను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని మాట్లాడుతున్నా. రేషన్‌కార్డు కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నావు కదా కొత్త కార్డు వచ్చిందా.’ అంటూ స్వయంగా ఓ లబ్ధిదారుకు ఫోన్ చేసి ఎమ్మెల్యే ఆరా తీయడం అందరినీ ఆశ్చర్యపరచింది. శనివారం నగరంలో రహమత్‌నగర్‌లోని 27వ సచివాలయాన్ని ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. స్పందన కార్యక్రమంలో వస్తున్న ఫిర్యాదులను తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ లబ్ధిదారురాలికి నేరుగా ఫోన్ చేశారు. సమస్య పరిష్కారమయిందా లేదా అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారు మాట్లాడుతూ.. రేషన్‌కార్డు వచ్చిందని, పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నా రావడం లేదని తెలిపారు. బాధ్యతగా సేవలందించండి అనంతరం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సచివాలయ ఉద్యోగులతో మాట్లాడారు. అర్హత ఉంటే వెంటనే పథకాలు అందించాలని ఆదేశించారు. ‘స్పందన’ ఫిర్యాదులను రికార్డుల్లో నమోదు చేసి.. పరిష్కారం అయిన వెంటనే పొందుపర్చాలని సూచించారు. దాదాపు 3 నెలలుగా ఫిర్యాదులు రికార్డుల్లో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులుగా నియమితులై రెండు సంవత్సరాలు పూర్తవుతోందని.. నేటికీ సరిగా విధులు నిర్వహించకపోవడమేంటని ప్రశ్నించారు. వచ్చామా.. పోయామా అంటే కుదరదని... ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ప్రతి ఇంటికీ వెళ్లాలని సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లను ఆదేశించారు. ఒక సమస్యపై ప్రజలు తరుచూ తిరగకుండా, సమస్య పరిష్కారమయేంత వరకూ సచివాలయ ఉద్యోగులదే బాధ్యతని తెలియజేశారు. దీర్ఘకాలికంగా ప్రకాష్‌రోడ్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్న రైల్వే ట్రాక్ డ్రెయినేజీ సమస్యకు పరిష్కారం చూపాలని సూచించారు. ప్రకాష్‌రోడ్డు ప్రాంతానికి సంబంధించి సచివాలయం రహమత్‌నగర్‌లో ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే కార్యాలయాన్ని మార్చాలని చెప్పారు. అర్హత ఉన్న అందరికీ పింఛన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న వయస్సుల్లోనే ఉద్యోగాల్లోకి వచ్చిన మీరు ప్రజలకు జవాబుదారిగా పనిచేయాలని సూచించారు. కోట్లాది రూపాయలను సచివాలయ వ్యవస్థపై సీఎం వెచ్చిస్తున్నారని, ఆయన నమ్మకానికి అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. -
టీడీపీ పార్టీపై మండిపడ్డ ఎమ్మెల్ల్యే అనంత వెంకటరామిరెడ్డి
-
ఆక్సిజన్ అందక ఐదుగురు కరోనా రోగులు మృతి
సాక్షి, అనంతపురం: ప్రాణవాయువు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో అనంతపురము సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఐదుగురు కరోనా బాధితులు మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి 8-9 గంటల మధ్యన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఆస్పత్రిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. మిగిలిన రోగులకు ఆక్సిజన్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి అధికారులకు కలెక్టర్, ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఘటన దురదృష్టకరమని తెలిపారు. లోపాలు సరిదిద్దాలని అధికారులకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని, ఈ ఘటనపై సమగ్ర విచారణ చేస్తామని ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి తెలిపారు. చదవండి: మన ప్రాణాల కన్నా ప్రధానికి అతడి స్వార్థమే ముఖ్యం చదవండి: అక్క ఆత్మహత్య.. తట్టుకోలేక హార్పిక్ తాగిన చెల్లెలు -
ఉత్తరాంధ్ర అంటే జగదాంబ సెంటర్ కాదు
శ్రీకాకుళం : 'అమరావతి నీకు..నీ చుట్టూ ఉన్న కోటరికి అవసరం. అమరావతి కంటే వెనుకబడిన ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం జిల్లా నీకు గుర్తులేదా' అని డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాస్ చంద్రబాబుపై మండిపడ్డారు. విశాఖపట్నం రాజధాని దేనికి అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నాడని, ఉత్తరాంధ్ర అంటే జగదాంబ సెంటర్ కాదని ధర్మాన ఫైర్ అయ్యారు. 'ఉత్తరంధ్రాలో సాగునీరు లేక ఏండిన పొలాలను ఏనాడైనా చూశావా?నీ ఐదేళ్ళ పాలనలో వంశధార ప్రాజెక్టును పూర్తి చేయ్యగలిగావా? గిరిజన గ్రామాల్లో రహదారులు లేక వైద్యం కోసం అల్లాడిన పేదలు భాధలు ఏనైడా ఆర్ధమయ్యాయా?నువ్వు ముఖ్యమంత్రిగా అనర్హుడవనే ప్రజలు నీకు 23 సీట్లకు పరిమతం చేశారు. ఆ భగవంతుడే నిన్ను శిక్షించాడు' అని డిప్యూటీ సిఎం ధర్మాన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. పాదయాత్ర చేసి అన్ని ప్రాంతాల సమస్యలు తెలుసుకుని... వికేంద్రీకరణ ద్వార మూడు రాజధానులు పెట్టిన గొప్ప మనసున్న నాయకుడు సిఎం జగన్ అని ప్రశంసించారు. అనంతపురం: మున్నిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం ఖాయమని ఎమ్మెల్యే అనంత వెంటరామిరెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికల కంటే ఎక్కువ ఫలితాలు ఈ ఎన్నికల్లో వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఓటమికి కారణాలు వెతుక్కుంంటున్నారని, వరుస ఓటములతో చంద్రబాబు, లోకేష్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని ధ్వజమెత్తారు. ఏపీలో టీడీపీ పతనావస్థకు చేరిందని, జగన్ అద్భుతమైన పరిపాలనకు ప్రజలు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. 140 కోట్ల రూపాయల తో రోడ్లు నిర్మించామని, త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని, అనంతను స్మార్ట్ సిటీగా మార్చబోతున్నామని తెలిపారు. చదవండి : (ఎంపీ కేశినేనిని దూరంపెట్టిన చంద్రబాబు..) (మహిళపై చేయిచేసుకున్న అశోక్ గజపతి రాజు) -
1న ‘అనంత’కు సీఎం వైఎస్ జగన్
అనంతపురం సెంట్రల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిబ్రవరి 1న అనంతపురానికి రానున్నట్టు అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ కోసం అందజేస్తున్న వాహనాలను సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. 1వ తేదీన ఉదయం 10 గంటలకు నగరంలోని జూనియర్ కళాశాల మైదానంలో కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. కాగా బుధవారం సాయంత్రం ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, కలెక్టర్ గంధం చంద్రుడు తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. -
పండ్ల తోటల రైతులు దీన్ని ఉపయోగించుకోవాలి
సాక్షి, అనంతపురం: కిసాన్ రైల్లో తరలించే పంట ఉత్పత్తులకు రవాణా చార్జీల్లో 50 శాతం రాయితీ ఇవ్వడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిసాన్ రైలుతో రైతులకు మార్కెటింగ్ సౌకర్యం పెరిగిందన్నారు. పండ్ల తోటల రైతులు దీన్ని సమృద్ధిగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. (చదవండి: కిసాన్ రైలు రవాణాపై 50 శాతం చార్జీల తగ్గింపు) ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి రైతుల పక్షపాతి అని, రైతుల సంక్షేమం కోసం ఆయన అనేక చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. ఆయన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కృషివల్లే అనంతపురానికి కృష్ణా జలాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆ నీటితోనే రైతులు పండ్ల తోటలు సాగు చేస్తున్నారని తెలిపారు. (చదవండి: ‘అనంత’ ఫలసాయం హస్తినకు..) -
ప్రధాని మోదీ, సీఎం జగన్‌లకు కృతజ్ఞతలు
సాక్షి, అనంతపురం: కిసాన్ రైలు ద్వారా రైతులు తరలించే పంట ఉత్పత్తులకు రవాణా చార్జీలను 50 శాతం తగ్గించటం హిందూపూరం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, అర్భన్ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలకు మంగళవారం వారు కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం నుంచి ఢిల్లీ వెళ్లే కిసాన్ రైల్లో రవాణా ఛార్జీలను సగానికి సంగం తగ్గించటం వల్ల అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అనంతలో పండే పంటలు ఢిల్లీలో అధిక ధరలకు విక్రయించి రైతులు లాభం పొందవచ్చని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు -
చంద్రబాబు, లోకేష్‌లకు అవకాశం..
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలు రైతులు, దళితుల భూములను దోచుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. అసైన్డ్ భూములు కొనుగోలు చేసి వ్యాపారం చేశారని, దళితులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీలా మారిపోయిందని.. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం అమరావతి కోసం ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదని, చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే రాజధాని అక్రమాలపై విచారణకు సిద్ధపడాలని సవాల్ విసిరారు.(చదవండి: అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు) కాగా అమరావతి రాజధాని భూకుంభకోణంపై మంగళవారం అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణల నేపథ్యంలో ప్రాథమిక నివేదికల ఆధారంగా ఏసీబీ మరింత లోతుగా విచారణ చేపట్టనుంది. ఈ విషయంపై స్పందించిన వైఎస్సార్ సీపీ నేతలు మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్‌లకు అవకాశం టీడీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. చట్టాలను సైతం ఉల్లంఘించి భూ కుంభకోణానికి పాల్పడ్డారని.. చంద్రబాబు, లోకేష్ తమ నిజాయితీ నిరూపించుకునే అవకాశం వచ్చిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ నేతలకు దమ్ముంటే విచారణకు సహకరించాలని చాలెంజ్ విసిరారు. ఫైబర్‌గ్రిడ్ కుంభకోణంపై విచారణ జరగాలి కేబినెట్ సబ్ కమిటీ విచారణలో రాజధాని అక్రమాలు బయటపడ్డాయని ఎమ్మెల్యే రోశయ్య స్పష్టం చేశారు. సబ్ కమిటీ నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదైందని, తప్పు చేశారు కాబట్టే టీడీపీ నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు. గతంలో టీడీపీ హయాంలో జరిగిన ఫైబర్‌గ్రిడ్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. లోకేష్ కోట్లు కొల్లగొట్టారు అక్రమార్కులపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తుంటే కక్షసాధింపు అంటున్నారని, అందుకే తాము సీబీఐ విచారణ కోరుతున్నామని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఫైబర్‌గ్రిడ్‌లో లోకేష్ తన బినామీలతో కోట్లు కొల్లగొట్టారని, ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరారు. సీబీఐ విచారణ జరిపించాలి అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారని, చంద్రబాబు, టీడీపీ నేతలు విచారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
‘డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి ఎమ్మెల్యే ఫిర్యాదు’
సాక్షి, అనంతపురం: వైద్యుల నిర్లక్ష్యంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి అనంతపురం ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఫిర్యాదు చేశారు. కరోనా బాధితుల పట్ల వైద్యుల చిన్నచూపు తగదని సూచించారు. వైద్యుల్లో మానవతా దృక్పథం లోపించిందని, నాసిరకమైన భోజనం అందిస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినా కొందరు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం సరికాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. (‘ఆ రాష్ట్రాలతో అతి కొద్ది సమయంలోనే పోటీ పడవచ్చు’) కాగా ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని వైద్యం చేసేందుకు నిరాకరించే ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. నాన్ కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. (వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అనంత ఫైర్..) -
వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అనంత ఫైర్..
సాక్షి, అనంతపురం: జీజీహెచ్‌లో వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అనంత వెంకటరామి రెడ్డి సీరియస్ అయ్యారు. సోమవారం రోజున అనంతపురం జీజీహెచ్‌లో కరోనా బాధితులను స్వయంగా పరామర్శించిన ఆయన వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బాధితులపై చిన్నచూపు తగదు. వైద్యులు మానవతా థృక్పథంతో వ్యవహరించాలి. ప్రభుత్వం అన్ని వసతులు కల్పించినా ఎందుకీ నిర్లక్ష్యం...? ప్రభుత్వ వైద్యుల్లో బాధ్యత పెరగాలి. కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించాలి. కరోనా కష్టకాలంలో ప్రైవేటు డాక్టర్ల దోపిడీ తగదు. కరోనా పరీక్షల పేరుతో ఒక్కొ సీటీ స్కాన్‌కు రూ. 5,000 వసూలు చేయటం బాధాకరం. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపై కఠిన చర్యలు తప్పవు!. కరోనా బాధితులకు భరోసా ఇవ్వాల్సింది వైద్యులే. కోవిడ్ వారియర్స్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాల అండగా ఉంటారని' ఎమ్మెల్యే అనంత పేర్కొన్నారు. ('కరోనా వైద్యం ఫ్రీగా అందిస్తున్న ఏకైక సీఎం జగన్') -
'కరోనా వైద్యం ఫ్రీగా అందిస్తున్న ఏకైక సీఎం జగన్'
సాక్షి, అనంతపురం: కోవిడ్ నిర్ధారణ పరీక్షలు మరింత వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ సంజీవిని బస్సులను శుక్రవారం ఉదయం ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో కలిసి ప్రారంభించారు. కరోనా నివారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అన్నారు. ఏపీలో కరోనా టెస్టింగ్ కెపాసిటీ మరింత పెరిగింది. కరోనా పరీక్షలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం జగన్‌దే. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కరోనా వైద్యం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ రంగయ్య పేర్కొన్నారు. చదవండి: సైకిళ్ల గంటలు ఎందుకు మూగబోయాయో..! హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ విమర్శలు అర్థరహితం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు అభాండాలు వేస్తున్నారు' అని తెలిపారు. కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేయింబవళ్లు శ్రమిస్తున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. కరోనా పరీక్షల్లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉంది. అనేక విషయాల్లో మిగతా రాష్ట్రాలు సీఎం జగన్‌ను ఫాలో అవుతున్నాయి. సీఎం జగన్‌పై ప్రజలకు విశ్వాసం పెరిగింది అని అనంత వెంకటరామి రెడ్డి పేర్కొన్నారు. చదవండి: తాగి పడుకున్న దద్దమ్మలా మాట్లాడేది.. -
కరోనాతో సీఐ మృతి.. ఎంపీ మాధవ్ దిగ్భ్రాంతి
సాక్షి, అనంతపురం/ కర్నూలు: అనంతపురం ట్రాఫిక్ సీఐగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ (47) కరోనా బారినపడి మంగళవారం మృతి చెందారు. ఈయన కొన్నేళ్లుగా మధుమేహ వ్యాధితో బాధపడుతుండేవారు. ఆరోగ్యం క్షీణించి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా కర్నూలు దాటిన తరువాత పరిస్థితి విషమించింది. దీంతో ఆయనను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాజశేఖర్ కుటుంబసభ్యులు కర్నూలులోని రామలింగేశ్వర నగర్ రోడ్‌నెంబర్ 5లో నివాసముంటున్నారు. ఆత్మకూరు మండలం కృష్ణాపురం స్వగ్రామం. తండ్రి శ్రీరాములు కో–ఆపరేటివ్ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి వీరు కర్నూలులోనే నివాసముంటున్నారు. శ్రీరాములుకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు అమెరికాలో స్థిరపడ్డాడు. రెండవ కుమారుడైన రాజశేఖర్ 1995లో ఎస్ఐగా ఎంపికయ్యారు. ఎక్కువ కాలం అనంతపురం జిల్లాలోనే విధులు నిర్వహించారు. సీఐగా పదోన్నతి పొందిన తరువాత కొంతకాలం కర్నూలు సీసీఎస్‌లో కూడా విధులు నిర్వహించారు. ఈయనకు భార్య శిరీషతో పాటు బీటెక్ చదువుతున్న కుమారుడు ఉన్నాడు. మొన్నటివరకు విధుల్లో పాల్గొంటూ అందరితో కలిసి ఉన్న సీఐ రాజశేఖర్ ఉన్నట్టుండి అనారోగ్యం బారిన పడి మృతి చెందడం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సీఐ రాజశేఖర్ మృతిపై కలెక్టర్ గంధం చంద్రుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. సమర్థవంతుడైన సీఐ మృతి చెందడం దురదృష్టకరమన్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ గోరంట్ల రాజశేఖర్ మృతి పట్ల హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో ఉన్నప్పుడు తన సమకాలికుడిగా ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. రాజశేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. రాజశేఖర్ మృతికి ఎమ్మెల్యే అనంత సంతాపం అనంతపురం సెంట్రల్: సీఐ రాజశేఖర్ మృతి పోలీసు శాఖకు తీరని లోటని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అనేక సంవత్సరాలుగా వివిధ హాదాల్లో సమర్థవంతంగా పనిచేశారన్నారు. కరోనా కష్టకాలంలోనూ మూడు నెలలుగా ప్రజలను కాపాడేందుకు తీవ్రంగా కృషి చేసిన అధికారి మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
దమ్ముంటే మోదీని ప్రశ్నించగలవా?
అనంతపురం సెంట్రల్: దమ్ముంటే ప్రధాని మోదీని ప్రశ్నించగలవా? అని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సవాల్ విసిరారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలకు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో చాలా రాష్ట్రాలు మద్యం దుకాణాలను తెరిచాయని, కానీ ఏపీలో మాత్రమే చంద్రబాబు, టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మంగళవారం నగరంలోని 50వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ గురు బిందుప్రియ, శేఖర్‌బాబు ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అనంత హాజరై పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడారు. లాక్‌డౌన్‌తో పనులు లేకపోవడంతో ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందించిందని, దాతలు కూడా మందుకొచ్చి చేయూతనిస్తున్నారన్నారు. ఎన్ని మంచి పనులు చేస్తున్నా చంద్రబాబు, టీడీపీ నాయకులు ముఖ్యమంత్రిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మద్యపాన నిషేధానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రతి వీధిలో బెల్ట్ షాపులు ఉండేవని, ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. -
‘టీడీపీ నేతలంతా హోంక్వారంటైన్లో ఉన్నారు’
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడికి ప్రజాసేవ తెలియదని ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి అన్నారు. కరోనా కష్టకాలంలో చంద్రబాబు, లోకేష్ ఇంట్లో దాక్కున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలంతా హోంక్వారంటైన్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్‌పై విమర్శలు చేసే నైతిక హక్కు టీడీపీకి లేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుచూపుతో ఆలోచిస్తున్నారని, కరోనా కట్టడి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఏపీలో ప్రతిపక్షాలు బాధ్యత నేర్చుకోవాలని సూచించారు. -
చంద్రబాబుపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి
సాక్షి, అనంతపురం: కరోనా వైరస్ నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనాపై జరుగుతున్న యుద్ధంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. భౌతిక దూరం పాటిస్తూ రంజాన్ ఘనంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రార్థనాలయాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. -
సీఎం వైఎస్ జగన్ పేదల పక్షపాతి
-
ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలి
-
హామీలన్నీ నెరవేర్చిన ఘనత సీఎం జగన్‌దే..
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు తెచ్చిందని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చే శక్తి వైఎస్సార్సీపీకే ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విలువలు,విశ్వసనీయతకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. ‘ఇచ్చిన మాటకు కట్టుబడే నైజం సీఎం వైఎస్ జగన్‌ది.. హామీలన్నీ నెరవేర్చిన ఘనత ఆయనదేనని’ తెలిపారు. అక్రమ కేసులకు భయపడేదిలేదని అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. -
‘స్థానిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించాలి’
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైంధవుడిలా అడ్డుపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానికి సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కర్యాకర్తలు కష్టపడి పని చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో తమ ప్రభుత్వం ప్రభంజనం సృష్టించాలని పేర్కొన్నారు. బాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో!: అనంత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. 9 నెలల పాలనతో నవరత్నాల అమలు ఎలా ఉందో ప్రచారంలో పేర్కొవాలని సూచించారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలను ధీటుగా ఎదుర్కొవాలని చెప్పారు. అత్యధిక స్థానాల్లో వైఎస్సార్ సీపీ గెలిచి, టీడీపీ జనసేనలకు బుద్ది చెప్పాలని ఆయన అన్నారు. ఇక ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ.. సీఎం జగన్ పరిపాలన అద్భుతంగా ఉందని, ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకేళ్లాలన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు ఐక్యమత్యంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొవాలని ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు. -
పేదలకు పెద్ద చదువులే లక్ష్యంగా జగనన్న వసతి దీవేన
-
ఆ దాడులకు బాబుదే నైతిక బాధ్యత
సాక్షి, అనంతపురం: అమరావతిలో ప్రజాప్రతినిధులపై జరుగుతున్న దాడులకు చంద్రబాబుదే నైతిక బాధ్యత అని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత ఎంపీ నందిగం సరేష్పై టీడీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండించారు. బాబు ప్రోత్సాహంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఆయన వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, ఆ డబ్బుతోనే అమరావతిలో భూములు కొనుగోలు చేశారని విమర్శించారు. బినామీ ఆస్తులు కాపాడుకునేందుకే బాబు ఆరాటపడుతున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (ఎంపీ నందిగం సురేష్‌పై దాడి) -
బాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో!: అనంత
సాక్షి, అనంతపురం: మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై విచారణ అంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై సిట్ ఏర్పాటును మేము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతల భూ లావాదేవిలపై సమగ్ర విచారణ జరపాలన్నారు. ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఒకే కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్నారు. ఇక అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా చంద్రబాబు, లోకేష్‌లు మారారని విమర్శించారు. కులాలు, మతాల ప్రాతిపదికన అవినీతి పరులను ఊపేక్షించాలా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. -
‘శంకుస్థాపన చేసినా.. తట్టెడు మట్టి కూడా తీయలేదు’
సాక్షి, అనంతపురం : తెలుగు ప్రజల ఐక్యత కోసం కర్నూలు రాజధానిని త్యాగం చేసిన ఘనత రాయలసీమ ప్రజలదని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ కోసం సమైక్యాంధ్ర ఉద్యమాలు జరిగాయని, చరిత్ర తెలిసి కూడా చంద్రబాబు తప్పులు చేశారని విమర్శించారు. మూడు పంటలు పండే భూముల్లో అమరావతి రాజధాని నిర్మించడం మంచిది కాదన్నారు. అవినీతి పరుడైన చంద్రబాబు పరిపాలనలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు చంద్రబాబు మూడుసార్లు శంకుస్థాపన చేసినా..తట్టెడు మట్టి తీయలేదని ఎద్దేవా చేశారు. బినామీ ఆస్తుల కోసమే చంద్రబాబు ఆరాటం, పోరాటమని విమర్శించారు. రాయలసీమ కరవు పై చంద్రబాబు, అయన కుటుంబ సభ్యులు ఎందుకు జోలె పట్టలేదని, ఆ సమయంలో రాయలసీమ టీడీపీ నేతలు చంద్రబాబును ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. (మూడు రాజధానులకు మద్దతుగా అనంతలో భారీ ర్యాలీ) దేశమంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన వైపు చూస్తోందని, రాష్ట్ర సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని ఎమ్మెల్యే ప్రశంసించారు. రాజధాని కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసే స్థితిలో ఏపీ లేదని,అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ రాష్ట్రానికి అత్యవసరమని అన్నారు. వైఎస్సార్ కృషి వల్ల రాయలసీమకు కృష్ణా జలాలు వచ్చాయన్నారు. హంద్రీనీవా కాలువ వెడల్పు, సమాంతర కాలువ ద్వారా పది వేల క్యూసెక్కుల నీరు తెచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంగీకరించారని, జీఎన్ రావు, బోస్టన్,శివరామకృష్ణయ్య కమిటీలు అధికార వికేంద్రీకరణకు సిఫార్సు చేశాయని గుర్తు చేశారు. జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాయలసీమకు వ్యతిరేకంగా జేసీ, ఇతర టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు. గ్రేటర్ అమరావతిలో నారాలోకేష్ ఎందుకు ఓడిపోయారో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. చదవండి: 'ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా' అందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కరవు కాటకాలకు చంద్రబాబు విధానాలే కారణమని కదిరి ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి ధ్వజమెత్తారు. రెయిన్ గన్స్ పేరుతో చంద్రబాబు మోసం చేశారని, హంద్రీనీవా కాలువ వెడల్పుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంగీకరించారని తెలిపారు. వృథాగా వెళ్తున్న వరద నీటిని రాయలసీమకు తరలించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టమైన ప్రణాళికలు వేశారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే లతో చంద్రబాబు రాజీనామా చేయించి ఎన్నికల కు వెళ్లాలని, బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అప్పుడెందుకు బాబు రోడ్లు ఎక్కలేదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి తెలిపారు. రాయలసీమ వెనుకకబాటుకు చంద్రబాబే కారణమని, ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడంలో చంద్రబాబు దిట్ట అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. అదే విధంగా రాయలసీమ కరవుపై చంద్రబాబు ఏనాడూ స్పందించలేదని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి దుయ్యబట్టారు. రైతుల ఆత్మహత్యలు, వలసలు జరిగినప్పుడు చంద్రబాబు, ఆయన కుటుంబం ఎందుకు రోడ్లు ఎక్కలేదని, అమరావతి కోసం ఎందుకింత తాపత్రయమని ప్రశ్నించారు. అయిదేళ్ళ టీడీపీ పాలనలో అమరావతి ఎందుకు నిర్మించలేదని, రాజధానిలో ఎందుకు శాశ్వత నిర్మాణాలు జరపలేదో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నిపుణుల కమిటీలను అధ్యయనం చేస్తున్నారని, ప్రజాస్వామ్య పద్ధతిలో సీఎం వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారని, ఏపీలో వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కన్నారు. -
మైనార్టీలకు సర్కార్ అండ..
సాక్షి, అనంతపురం: మైనార్టీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి భరోసా ఇచ్చారు. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు గురువారం ఆయనను కలిశారు. ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్‌ఆర్‌పీలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని వినతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్ఆర్సీకి ప్రభుత్వం వ్యతిరేకమని, రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. -
టీడీపీ అమరావతికే పరిమితమా?
సాక్షి, అనంతపురం : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఈ నెల 13న అనంతపురం జిల్లాలో బస్సుయాత్ర చేస్తాననటం హాస్యాస్పదమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. అధికార వికేంద్రీకరణపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వతే రాయలసీమలో పర్యటించాలని సవాల్ విసిరారు. శనివారం అనంతవెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందింది. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ కోసమే సమైక్యాంధ్ర ఉద్యమాలు జరిగాయి. ఇప్పుడు అలాంటి తప్పులు పునరావృతం కాకూడదు. అధికార వికేంద్రీకరణ దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో కూడా చంద్రబాబు ఇంతలా గగ్గోలు పెట్టలేదు. టీడీపీ స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. ఏపీ సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారు. రాయలసీమ పర్యటనకు వస్తున్న చంద్రబాబును ప్రజలు ప్రశ్నించాలి. స్పష్టమైన సమాధానం చెప్పిన తర్వాతే చంద్రబాబు అనంతపురంలో పర్యటించాలి. అమరావతిలో పోరాటం చేస్తున్నది రైతులు కాదు.. రియల్ ఎస్టేట్ వ్యాపారులే. కర్నూలులో హైకోర్టు పెట్టాలా? వద్దా?.. విశాఖలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పెట్టాలా? వద్దా?.. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉండాలా? వద్దా?.. అమరావతి కోసమే చంద్రబాబు పనిచేస్తున్నారా?..మిగిలిన ప్రాంతాల అభివృద్ధి చంద్రబాబుకు అక్కర్లేదా?.. రాయలసీమలో రైతుల ఆత్మహత్యలు జరిగినప్పుడు చంద్రబాబు భిక్షాటన ఎందుకు చేయలేదు?.. సీమ నుంచి రైతులు, వ్యవసాయ కూలీలు వలసలు వెళ్లినప్పుడు చంద్రబాబు ఎందుకు స్పందించలేదు?.. శ్రీభాగ్ ఒప్పందం అమలుపై చంద్రబాబు వైఖరి ఏంటి?.. టీడీపీ అమరావతికే పరిమితమా?.. చంద్రబాబు అమరావతికి మాత్రమే నాయకుడా?.. చంద్రబాబుకు ఏపీ ప్రయోజనాల కన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారమే ముఖ్యమా?’ అని ప్రశ్నించారు. -
బినామీ ఆస్తులు కాపాడుకునేందుకే డ్రామాలు..
సాక్షి, అనంతపురం: ‘అమ్మఒడి పథకం’ వల్ల అక్షరాస్యత శాతం గణనీయంగా పెరుగుతుందని ఏపీ మంత్రి శంకర్ నారాయణ స్పష్టం చేశారు. అనంతపురం శారదా మున్సిపల్ హైస్కూల్లో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో కలిసి మంత్రి శంకర్ నారాయణ అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చరిత్ర సృష్టిస్తున్నాయని తెలిపారు. అమరావతిలో బినామీ ఆస్తులు కాపాడుకునేందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉద్యమం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఏపీలోని 13 జిల్లాలను అభివృద్ధి చేస్తామంటే చంద్రబాబు వద్దంటున్నారని.. రాయలసీమ, ఉత్తరాంధ్ర లకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. బోస్టన్, జీఎన్ రావు కమిటీ నివేదికలను హైపర్ కమిటీ నిశితంగా పరిశీలిస్తోందని.. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ ఏపీకి అత్యవసరం అని శంకర్‌నారాయణ పేర్కొన్నారు. దేశం చూపు..జగన్ పాలన వైపు.. అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన వైపు.. దేశం యావత్తు చూస్తోందని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. అమ్మఒడి పథకం పేద విద్యార్థుల పాలిట ఓ వరం అని ఏపీ పాఠశాల విద్య కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ పామిడి వీరాంజనేయులు చెప్పారు. (చదవండి: ఫిబ్రవరి 9లోపు నమోదు చేసుకోండి: సీఎం జగన్) (చదవండి: ‘వచ్చారు జగన్.. మెచ్చారు జనం’) -
దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు!
సాక్షి, అనంతపురం: మూడు రాజధానుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి దమ్మూ ధైర్యం ఉంటే తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి.. మళ్లీ ప్రజాతీర్పు కోరాలని వైఎస్సార్సీపీ అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సవాల్ చేశారు. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును ప్రజలు స్వాగతిస్తున్నారని, కానీ చంద్రబాబు, టీడీపీ నేతలు మాత్రమే దీనిని వ్యతిరేకిస్తూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందటం చంద్రబాబుకు ఇష్టం లేనట్లుందని అన్నారు. -
బాబు పారిపోయి వచ్చారు: అనంత
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరు మాసాల పాలన అద్భుతమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి కొనియాడారు. సంక్షేమం అభివృద్ధి సీఎం జగన్‌కు రెండు కళ్లని పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబుకు కేసుల భయం పట్టుకుందని, అందుకే అమరావతిపై రాద్ధాంతం చేస్తున్నారన్నారు. అమరావతిలో నిజంగా అభివృద్ధి జరిగుంటే నారా లోకేష్ ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. అమరావతిలో తాత్కాలిక భవనాలు మాత్రమే కట్టిన చంద్రబాబుకు సింగపూర్ వ్యాపారులతో రహస్య ఒప్పందాలున్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా చంద్రబాబు స్వార్థపూరిత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుంచి బాబు పారిపోయి వచ్చారని ఆయన పేర్కొన్నారు. -
కుబ్రా బేగంకు అనంత వెంకట్రామిరెడ్డి చేయూత
సాక్షి, అనంతపురం : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మంచి మనసును చాటుకున్నారు. హైదరాబాద్‌లోని బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కుబ్రా బేగం (23)కు చేయూత అందించారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ కింద బాధిత యువతికి హైదరాబాద్‌లో మెరుగైన చికిత్సలు అందిస్తున్నారు. అలాగే బాధితురాలికి సీఎం రిలీఫ్ ఫండ్ విడుదలయ్యేలా అధికారులతో సంప్రదింపులు జరిపారు. అనంత వెంకట్రామిరెడ్డి వినతి మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం సహాయకనిధి నుంచి రూ.3,60,000 మంజూరు చేసింది. (చదవండి : బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం) అనంతపురంనకు చెందిన కుబ్రా బేగం శనివారం హైదరబాద్‌లోని ఓ కంపెనీకి ఇంటర్వ్యూకు హాజరై సెలక్ట్ కూడా అయింది. ఈ వార్తను సెల్ఫోన్లో అనంతపురంలో ఉన్న తండ్రి తో పంచుకుంటున్న సమయంలోనే రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఒంటినిండా గాయాలతో చావుబతుకులతో పోరాడుతోంది. గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాదంలో కుబ్రా వెన్నెముక దెబ్బతిందని, ఆపరేషన్ కోసం రూ.6లక్షలు ఖర్చు అవుందని వైద్యులు చెప్పారు. (చదవండి : రూపాయి లేదు..వైద్యమెలా!) తప్పకుండా ఆదుకుంటా: కేటీఆర్ ఫ్లైఓవర్ ప్రమాదంలో గాయపడిన కుబ్రా బేగం (23) ను తప్పకుండా ఆదుకుంటామని తెలంగాణ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘రూపాయి లేదు..వైద్యమెలా!’ అనే శీర్షికతో సోమవారం ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని ఓ నెటిజన్ కేటీఆర్‌కు ట్విట్ చేశారు. ఎలాగైనా ఆ యువతిని ఆదుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ఆమెకు మెరుగైన వైద్యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆమె ఆరోగ్యంపై మేయర్ బొంతు రామ్మోహన్‌తో చర్చించానని చెప్పారు. కుబ్రా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. Absolutely will be taken care. I have already asked Hyderabad Mayor @bonthurammohan to visit her and assure her parents of all support that is required https://t.co/MRZKlHz52Z — KTR (@KTRTRS) November 25, 2019 -
‘బీసీలను వెన్నముకగా చూస్తున్న సీఎం’
సాక్షి, అనంతపురం: బీసీలను వెన్నముకగా చూస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి అన్నారు. జిల్లాలోని జూనియర్ కళాశాల మైదానంలో భక్త కనకదాస జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్‌నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంవెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస జగన్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పదవుల్లో, కాంట్రాక్టు పనుల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. కాగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసమే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలు ప్రవేశపెట్టారని గర్తుచేశారు. బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఘనత సీఎం జగన్‌ది అని ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఉషాశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కృష్ణప్ప, రాగే పరశురాం, అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
మీరు దద్దమ్మలనే 23తో సరిపెట్టారు
సాక్షి, అనంతపురం : ఇసుక పేరుతో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్నది దొంగదీక్ష అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. గురువారం స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనది 40 ఏళ్ల అనుభవమనీ, 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశానని, పదేళ్ల ప్రతిపక్ష నేతగా ఉన్నానని గొప్పలు చెప్పే వ్యక్తి ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తారా..? అని ప్రశ్నించారు. గడిచిన ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన చంద్రబాబు ఉనికి కోసమే ఇసుక రాజకీయం చేస్తున్నారన్నారు. పదేళ్ల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, ఈ క్రమంలో నీటమునిగిన రీచ్‌లలోని ఇసుకను ఎలా తీస్తారో ఆయనే చెప్పాలన్నారు. అసలు వర్షాలు కురిసే సమయంలో ఎక్కడైనా నిర్మాణాలు జరుగుతాయా..? అని ప్రశ్నించారు. ఆమాత్రం ఇంగితం లేకుండా చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. టీడీపీ నేతలకు భవన నిర్మాణ కారి్మకుల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే వారికి పనులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాలి గానీ, రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమన్నారు. ఇసుకాసురులు టీడీపీ నేతలే ఇసుక, మట్టిని దోపిడి చేసిన నీచమైన చరిత్ర టీడీపీ నాయకులేనని ఎమ్మెల్యే అనంత మండిపడ్డారు. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా చేసి భారీగా దోపిడీ చేశారన్నారు. ఇసుక అక్రమ రవాణాతో రాయదుర్గం, పెనుకొండ, హిందూపురం, తాడిపత్రి, శింగనమల, ధర్మవరం ప్రాంతాల్లోని టీడీపీ ప్రజాప్రతినిధులు రూ.కోట్లు గడించారన్నారు. ఇలాంటి నీచమైన చరిత్ర ఉన్న వారు..ఇప్పుడు ఇసుకపై మాట్లాడటం దారుణంగా ఉందన్నారు. టీడీపీ హయాంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఓ తహసీల్దార్‌పై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యం చేస్తే కనీసం కేసు నమోదు చేయలేదన్నారు. ఇసుక మాఫియాను ప్రోత్సాహించింది చంద్రబాబేనని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, అందువల్లే ఎక్కడ అక్రమ రవాణా జరిగిన కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలిచ్చారన్నారు. ఈ క్రమంలో మన జిల్లాలో 9 చోట్ల పోలీసు యంత్రాంగం చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిందన్నారు. మంచి కనిపించడం లేదా బాబూ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జనరంజక పాలన చేస్తున్నారన్నారు. ఆశావర్కర్ల జీతాలను రూ. 3 వేల నుంచి రూ. 10 వేలకు పెంచామన్నారు. అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంచామన్నారు. సొంత ఆటో ఉన్న వాళ్లకు రూ. 10 వేలు అందించామన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు మొదటి విడత రూ. 10 వేల అందించామన్నారు. వైఎస్సార్ రైతు భరోసా కింద రూ. 12,500 ఇస్తామని చెప్పి అంతకుమించి రూ. 13,500 అందించామన్నారు. లక్షా 20 వేల మందికి శాశ్వత ఉద్యోగాలు కలి్పంచామన్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 11 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఇవన్నీ మంచి పనులు కావా..? అని ప్రశ్నించారు. ఇక విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ‘మన బడి నాడు–నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఆ స్కూళ్ల ఫొటోలను పంపుతామని, చంద్రబాబు వాటిని దాచిపెట్టుకొని మూడేళ్ల తర్వాత అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూసుకోవాలన్నారు. మీరు దద్దమ్మలనే 23తో సరిపెట్టారు చంద్రబాబు ఆ పార్టీ నేతలు దద్దమ్మలనే గత ఎన్నికల్లో ఆ పార్టీని 23 స్థానాలకే ప్రజలు పరిమితం చేశారని ఎమ్మెల్యే అనంత అన్నారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు చంద్రబాబు రాష్ట్రాన్ని దివాళా తీయించారన్నారు. రాజధాని పేరుతో దోపిడీ చేశారని, అమరావతిని గెజిట్‌లో కూడా పొందుపరచలేదన్నారు. ఇక జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి ఆయన ఎంత ఊగినా ఫలితం లేదన్నారు. వారి ఊపులకు ఎవరు భయపడరన్నారు. పవన్ పొలిటికల్ సినిమా ఫ్లాప్‌తో మూతపడిందన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో తాము ముందుకు సాగుతున్నామన్నారు. జిల్లాకు హంద్రీనీవా ద్వారా 2012 నుంచి ఏటా 30 నుంచి 35 టీఎంసీలు నీరు వస్తున్నా... ఒక్క ఎకరాకు నీరివ్వలేని దద్దమ్మలు మీరు కాదా అని ప్రశ్నించారు. ఆ నీళ్లన్ని ఎక్కడికెళ్లాయో కూడా లెక్కలు లేవన్నారు. జిల్లాలో సాగునీటి సమస్య పరిష్కారం కోసం డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హంద్రీనీవాను 10 వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు సమాంతర కాలువ తెస్తున్నట్లు చెప్పారు. ఇది తమ ప్రభుత్వ చిత్తశుద్ధి అని తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు వస్తే టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారనీ, తాము అలా చేయమని స్పష్టంచేశారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇప్పటికైనా విమర్శలు చేయడం, దొంగ దీక్షలు చేయడం మాని మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌మోహన్, మాజీ కార్పోరేటర్ చంద్రమోహన్‌రెడ్డి, జాన్సన్, సైఫుల్లా బేగ్ తదితరులు పాల్గొన్నారు. -
‘చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ఇద్దరూ ఒక్కటే’
సాక్షి, అనంతపురం : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దిగజారి వ్యవహరిస్తున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి దుయ్యబట్టారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుది దొంగ దీక్ష అని, తెలుగుదేశం పార్టీని కాపాడుకునేందుకే బాబు ఫీట్లు చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో ఇసుక పుష్కలంగా లభ్యమవుతోందని, రాజకీయ లబ్ధి కోసమే బాబు దీక్ష చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇసుక దోపిడి ద్వారా టీడీపీ నేతలు వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారని ఎద్దేవా చేశారు. అలాగే ‘వైఎస్సార్ రైతు భరోసాకు బాబు వ్యతిరేకమా? 1.35 లక్షల సచివాలయ ఉద్యోగాల భర్తీకి చంద్రబాబు వ్యతిరేకమా? సీఎం వైఎస్ జగన్ పరిపాలనపై చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధమా? ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిపై చింతమనేని దాడి చేస్తే చంద్రబాబు ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. చంద్రబాబు చేతకాని దద్దమ్మ అని అందుకే టీడీపీని ప్రజలు ఓడించారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ఇద్దరూ ఒక్కటే’ అని పేర్కొన్నారు. -
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా అనంత
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఎన్నికయ్యారు. అంబటి రాంబాబు చైర్మన్‌గా ఏడుగురి సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయగా...అందులో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి చోటు కల్పిస్తూ ఏపీ స్టేట్ లెజిస్లేచర్ సెక్రటరీ బాలకృష్ణమాచార్యులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘అనంత’ కుటుంబం ఐదు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తోంది. నాలుగుసార్లు ఎంపీగా పనిచేసిన అనంత వెంకటారామిరెడ్డి... తన హయాంలో జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారు. కేంద్రంతో పాటు రాష్ట్రం నుంచి నిధులు రాబట్టి అభివృద్ధి బాటలు వేశారు. ఈయన తండ్రి అనంత వెంకటరెడ్డి రెండుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పని చేశారు. అనంత వెంకటరామిరెడ్డికి ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా అవకాశం కల్పించడంతో పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. -
నగర రూపురేఖలు మారుస్తాం
సాక్షి, అనంతపురం : ‘గత పాలకుల నిర్లక్ష్యం నగర ప్రజలకు శాపంగా మారింది. నగరంలోని రోడ్లు చాలా చోట్ల చిద్రమయ్యాయి. నగర ప్రజలు అడుగు వేయాలంటే భయపడే పరిస్థితి. శానిటేషన్‌ను అటకెక్కించేశారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాలనను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నాం. ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లి నగర రూపురేఖలు మారుస్తాం’ అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే సాక్షితో మాట్లాడారు. నగరంలో చేపట్టబోతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేశారు. ఆర్అండ్బీ పరిధిలోని గుత్తి రోడ్డు పోస్టాఫీసు నుంచి సోములదొడ్ది వరకు రూ.1.10 కోట్లతో బీటీ రోడ్డు, క్లాక్‌టవర్ ఆర్ఓసీ బ్రిడ్జిపై రూ.40 లక్షలతో బీటీ రోడ్డు వేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకు సంబంధించి టెండర్లను ఆహ్వానించామని, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయన్నారు. రూ.4.2 కోట్లతో రోడ్లకు ప్రతిపాదనలు గతంలో అప్పటి ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప వేరుకుంపట్లతో నగరాభివృద్ధిని విస్మరించారన్నారు. వీరి అస్తవ్యస్థ పాలనతో నగరంలోని రోడ్లన్నీ గుంతలమయంగా మారాయన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.4.2 కోట్లతో నగరంలో రోడ్లు వేసేందుకు ప్రతిపాదనలు పంపుతామన్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి గుత్తి రోడ్డు వరకు రూ.85 లక్షలతో బీటీ రోడ్డు, త్రివేణి థియేటర్ నుంచి శ్రీకంఠం సర్కిల్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు రూ.46 లక్షలతో రోడ్డు, 1, 2, 3 రోడ్లు ఉండే జీరో క్రాస్ వద్ద రూ.60 లక్షలతో బీటీ రోడ్డు, నీలిమా థియేటర్ నుంచి తపోవనం హైవే వరకు రూ.81 లక్షలతో రోడ్డు, 48వ డివిజన్లో రూ.49 లక్షలతో రోడ్డు, అశోక్‌నగర్ నుంచి డ్రైవర్స్ కాలనీ వరకు రూ.40 లక్షలతో బీటీ రోడ్డు, ఓటీఆర్‌ఐ నుంచి అశోక్‌నగర్ వైపు రూ.40 లక్షలతో రోడ్డు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. మొదలైన ప్యాచ్ వర్క్ పనులు నగరంలో రూ.25 లక్షలతో ప్యాచ్ వర్క్‌లు మొదలయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రధాన రోడ్లలో మొదట ప్యాచ్ వర్క్›లు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామన్నారు. వర్షం పడుతున్న సమయంలో నెమ్మదిగా పనులు జరిగేలా చూస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో నగరం సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం
సాక్షి, అనంతపురం సిటీ: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం తన నివాసంలో నగరంలోని డివిజన్ కన్వీనర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో అందరూ సమష్టిగా కృషి చేయడం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. అదే స్ఫూర్తిని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చూపాలన్నారు. నగరపాలక సంస్థకు త్వరలో ఎన్నికలు జరుగుతాయని, 50 డివిజన్లలోనూ విజయఢంకా మోగించాలని ఆకాంక్షించారు. ఇందు కోసం ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూ చించారు. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాను ఇప్పటికే విడుదల చేశారని, మార్పులు, చేర్పులు ఉంటే పరిశీలించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించారని, కార్యకర్తలంతా కష్టపడి జాబితాలో చేర్పులకు శ్రీకారం చుట్టారన్నారు. కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అందరినీ కలుపుకుని వెళ్లాలని సూచించారు. పదవుల విషయంలో ఎవరికీ అనుమానాలు, భయాలు వద్దని, కష్టపడి పని చేసేవారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు విజయం సాధిస్తే సరిపోదని, కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటేనే నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లవచ్చన్నారు. గతంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోయామని, ప్రస్తుతం అలాంటి తప్పు జరగకుండా డివిజన్లలో కార్యకర్తలందరినీ కలుపుకుని వెళ్లాలన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే పోలింగ్ శాతం మరింత పెరిగేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. ఓటరు జాబితాకు సంబంధించి ఏవైనా పొరపాట్లు ఉంటే తన దృష్టికి తీసుకుని వస్తే అన్నింటినీ కలిపి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగేపరశురాం, పార్టీ సీనియర్ నాయకులు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, పెన్నోబుళేసు, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, సాకే చంద్ర, కార్పొరేటర్లు బాలాంజనేయులు, జానకి, గిరిజ, శ్రీదేవి, డివిజన్ కన్వీనర్లు పాల్గొన్నారు. -
అనంతపురంలో ఆసక్తికర పరిణామం
సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న అనంతపురంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అధికార టీడీపీకి చెందిన ప్రముఖ నాయకుడు ఒకరు.. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనంత వెంకట్రామిరెడ్డికి టీడీపీ సీనియర్ నేత జయరాం నాయుడు అనూహ్యంగా మద్దతు తెలిపారు. అంతేకాకుండా అనంత వెంకట్రామిరెడ్డి తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరి ప్రజలకు చేసిందేమీ లేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసగించిన ఆయనను ఓడించాలని జయరాం నాయుడు ఓటర్లను కోరుతున్నారు. -
చంద్రబాబుపై ఈసీ సీరియస్‌గా వ్యవహరించాలి!
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే వచ్చే ఎన్నికల్లో దొడ్డిదారిలో గెలిచేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. శనివారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. కావాలనే వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగిస్తున్నారని, తనకు అనుకూలంగా ఉండే పోలీసు అధికారులకు పదోన్నతులు ఇచ్చి ఎన్నికల్లో అక్రమాలకు సిద్ధమయ్యారని ఆయన అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెవిన్యూ, పోలీసు అధికారులను మార్చాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అక్రమాలపై ఎన్నికల సంఘం సీరియస్‌గా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. -
టీఆర్ఎస్తో పొత్తుకు చంద్రబాబు ప్రయత్నించలేదా?
సాక్షి, అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్ని రాజకీయ పార్టీల మాస్కులను జేబులో పెట్టుకుని తిరుగుతున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్, జనసేనలతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్న సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు కోసం.. హరికృష్ణ మృతదేహం సాక్షిగా చంద్రబాబు ప్రయత్నించలేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యం అని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ రాజీలేని పోరాటం చేస్తున్నారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఒంటరిగానే పోటీ చేస్తోందని అన్నారు. -
ఎన్ఐఏ విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు?
సాక్షి, అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన హత్యాయత్నం వెనుక సీఎం చంద్రబాబు నాయుడు హస్తం ఉందని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా సంఘీభావ యాత్ర చేపట్టిన ఆయన ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ఐఏకు అప్పగిస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికే చంద్రబాబు ఎన్ఐఏ విచారణకు సహకరించలేదని విమర్శించారు. హైకోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు ఎన్ఐఏ విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఓ చారిత్రాత్మక ఘట్టమని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఏ నాయకుడు ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేపట్టలేదని తెలిపారు. వైఎస్ జగన్‌తోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని అన్నారు. -
పరిటాల శ్రీరాం రాజ్యాంగేతర శక్తి
అనంతపురం: గతంలో పరిటాల రవీంద్ర హయాంలో జిల్లాలో ఎలా దౌర్జన్యాలు జరిగాయో ఈరోజు పరిటాల సునీత మంత్రి అయిన తర్వాత ఆ కుటుంబం అదే తరహాలో దౌర్జన్యాలకు పాల్పడుతోందని, శ్రీరాం రాజ్యాంగేతర శక్తిగా మారారని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. మంత్రి సునీత తనయుడు పరిటాల శ్రీరాం, ఎమ్మెల్యే పార్థసారథి ‘సాక్షి’ కార్యాలయం వద్ద ధర్నా చేసి జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేసేలా మాట్లాడిన తీరును నిరసిస్తూ శనివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. పార్టీ కార్యాలయం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. దారి పొడవునా పరిటాల కుటుంబం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పత్రికాస్వేచ్ఛను కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సప్తగిరి సర్కిల్లో మానవహారం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఓఎస్డీ స్వామికి వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో పత్రికాస్వేచ్ఛను పూర్తిగా హరిస్తున్నారన్నారు. అభివృద్ధి పేరుతో దోచుకుంటున్నారని, దౌర్జన్యాలు, అరాచకాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ పథకం చూసినా అవినీతిమయం చేశారన్నారు. ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములను లాగేసుకుంటున్నారన్నారు. పత్రికలు కాని, రాజకీయ పార్టీలు ప్రశ్నించినా వారిపై దౌర్జన్యాలు చేయడం, అక్రమంగా కేసులు బనాయించడం, ఆస్తుల, ప్రాణ నష్టం కల్గించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. అభివృద్ధి పేరుతో మంత్రి సునీత సాగిస్తున్న దోపిడీని ‘సాక్షి’ పత్రిక ప్రచురించిందన్నారు. నియోజకవర్గంలో తన బంధువులను మండలానికి ఒక ఇన్చార్జిని నియమించుకుని సాగిస్తున్న దోపిడీపై కథనం వచ్చిందన్నారు. ఇందులో ఏవైనా తప్పులుంటే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వారికి పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. పరిటాల సునీత మంత్రి హోదాలో ఉన్నా.. తనయుడు పరిటాల శ్రీరాం ‘సాక్షి’ కార్యాలయం ఎదుట ధర్నా చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కూడా గతంలో ‘సాక్షి’ కార్యాలయం ఎదుట రచ్చ చేశారన్నారు. వారి అవినీతి అక్రమాలు ‘సాక్షి’లోనే కాదు తక్కిన పత్రికల్లో కూడా వచ్చాయని గుర్తు చేశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలను భయభ్రాంతులకు గురచేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోనే కుటిల ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక విధానాలను ఎవరూ జీర్ణించుకోరని హెచ్చరించారు. రెవెన్యూ, పోలీసు వ్యవస్థలు పూర్తిగా కీలుబొమ్మలుగా మారాయన్నారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తున్నారన్నారు. పత్రికలపై దాడులకు పా ల్పడాలని చూస్తే ప్రజలు క్షమించరన్నారు. శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగైందన్నారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారన్నారు. ఏకంగా పత్రికా కార్యాలయానికి వచ్చారంటే వారు దేనికైనా తెగిస్తారనేది అర్థమవుతోందన్నారు. రాష్ట్ర ప్ర«ధా న కార్యదర్శి రాగే పరుశురాం మాట్లాడుతూ మంత్రి కుటుంబానికి ఉన్నది ఉన్నట్లు రాస్తే అంత ఉలుకెందుకన్నారు. ఆరు మండలాల్లోనూ తమ బంధువులను ఇన్‌చార్జ్‌లుగా నియమించుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వారి చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంటుందని, దాన్నికూడా హరించాలని చూస్తే ప్రజలు ఒప్పుకోరన్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైవీ శివారెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి కుటుంబం సాగిస్తున్న దందా ప్రజలందరికీ తెలుసన్నారు. గాలి మరల నుంచి రైల్వే టెండర్ల దాకా ప్రతిదాంట్లోనూ దోచుకుంటున్నారన్నారు. నాయకులు కోగటం విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో ఒక ఓటుకు ఐదుగురు మంత్రులు, ఎమ్మెల్యేలయ్యారని ఎద్దేవా చేశారు. మంత్రి సునీత బంధువులు మండలానికో ఇన్చార్జ్ కాదని ఎమ్మెల్యే, మంత్రిలా వ్యవహరిస్తూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి రాప్తాడు జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రరెడ్డి, గౌస్‌బేగ్, మహానందరెడ్డి, ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మైనుద్దిన్, పెన్నోబులేసు, తాటిచెర్ల నాగేశ్వరరెడ్డి, విద్యార్థి విభాగం నరేంద్రరెడ్డి, ఎద్దుల రాజేష్, మహిళా విభాగం వాసంతి సాహిత్య, కొండమ్మ, రాధ తదితరులు పాల్గొన్నారు. ఉనికి కోసమే ‘సాక్షి’పై బెదిరింపులు రాప్తాడు నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లుగా మంత్రి సునీత కుటుంబం చేస్తున్న దోపిడీపై పత్రికల్లో లెక్కలేనన్ని కథనాలు వచ్చాయి. ఆధారాలతో సహా ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో పర్యటించిన రోజే కథనం రావడంతో పరిటాల కుటుంబం టీడీపీలో ఉనికిని కోల్పోయే పరిస్థితి తలెత్తింది. తమ ప్రతిష్ట దిగజారుతోందనే ఆక్రోషంతో మంత్రి సునీత తన కుమారుడు శ్రీరాం, మరికొందరు గూండాలను ఉసిగొలిపి ‘సాక్షి’ పత్రిక జర్నలిస్టులను బెదిరించే ప్రయత్నం చేశారు. బహిరంగ సభలో ఆమె తనయుడు మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. సమాజంలో నాలుగో స్తంభమైన మీడియాను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో నోరెత్తిన ప్రతి ఒక్కరి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతుంది. ఇందుకోసమే ‘సాక్షి’కి అండగా నిలుస్తున్నాం. – తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త -
టీడీపీ ఎమ్మెల్యే వర్గీయుల దౌర్జన్యం
సాక్షి, అనంతపురం: నగరంలో టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్ సీపీ చేపట్టిన రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. వివరాల్లోకి వెళ్తే.. 46వ డివిజన్లో వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సాగుతున్న రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. అయితే దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రభాకర్ చౌదరి అనుచరులు, టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అయిన కూడా వైఎస్సార్ సీపీ శ్రేణులు సంయమనంతో వ్యవహరించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో టీడీపీ కార్యకర్తలు జారుకున్నారు. శారదనగర్‌లో వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను కూడా ప్రభాకర్ చౌదరి వర్గీయులు చించివేశారు. దీనిపై మైనార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్ చౌదరి అభద్రతా భావంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీకి రోజురోజుకూ ప్రజా ఆదరణ పెరుగుతుందని తెలిపారు. రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజా సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయన్నారు. టీడీపీ నేతల అవినీతిపై జనం ఆగ్రహంగా ఉన్నారని.. బహిరంగ చర్చకు రాకుండా ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప పారిపోయారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తే ప్రజా ఆగ్రహం తప్పదని హెచ్చరించారు. -
వైఎస్ఆర్సీపీ నేతల హౌజ్ అరెస్ట్
-
అనంతలో ఉద్రిక్తత
అనంతపురం: నగరంలో శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ ఎమ్మెల్యే వి. ప్రభాకర్ చౌదరీ విసిరిన సవాల్‌ను స్వీకరించి చర్చకు బయలుదేరిన వెంకట్రామిరెడ్డిని పోలీసులు ఆయన ఇంటి వద్దనే అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. అనంతపురం నగరపాలక సంస్థలో జరిగిన అవినీతి అక్రమాలపై అనంత వెంకట్రామి రెడ్డి బహిరంగ చర్చకు సిద్దపడ్డారు. టీడీపీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాంనగర్ పార్క్‌లో చర్చకు బయలు దేరారు. టీడీపీ ఎమ్మెల్యేలు బహిరంగ చర్చకు పిలిచి పోలీసుల చేత అక్రమంగా నిర్బంధించడమేంటని మండిపడ్డారు. ఈ విషయమై ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను వెంకట్రామిరెడ్డి ప్రశ్నించగా చర్చకు ఎటువంటి అనుమతి లేదని సమాధానం ఇచ్చారు. అనంత వెంకట్రామిరెడ్డితో పాటు వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త తలారి రంగయ్య, మాజీ మేయర్ రాగేపరశురా, పలువురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను అరెస్ట్ చేసి గృహనిర్బంధం చేశారు. పోలీసులు వైఖరితో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. -
15 ఏళ్లలో ఏం సాధించావ్?
అనంతపురం: తాను పదవిలో ఉన్నా లేకున్నా నగరాభివృద్ధికి కేంద్రం నుంచి అమృత్ స్కీం తీసుకొస్తానని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఫైర్ అయ్యారు. మంత్రిగా, ఎంపీగా ఉండి 15 ఏళ్లు ఏం సాధించారని ప్రశ్నించారు. సోమవారం నగరంలోని 10వ డివిజన్లో ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ జేసీ నాగిరెడ్డి పథకం, యాడికి కెనాల్ నిర్మాణానికి 2005లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పునాది వేశారన్నారు. జేసీ నాగిరెడ్డి పథకానికి రూ.390కోట్లు, యాడికి కెనాల్‌కు రూ.502 కోట్లు ఖర్చు చేశారన్నారు. పునాది వేసిన తర్వాత రెండు పర్యాయాలు కాలపరిమితి దాటిందన్నారు. జేసీ దివాకర్‌రెడ్డి టీడీపీలోకి వెళ్లిన తర్వాత మూడో పర్యాయం కూడా పూర్తవుతోందన్నారు. 15 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న ఆయన 90 శాతానికిపైగా జరిగిన ఆ పనులనే పూర్తి చేయించలేదుగానీ, పదవిలో లేకపోయినా నగరాన్ని అభివృద్ధి చేస్తారంట అని ఎద్దేవా చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడే రాంనగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి తెచ్చామన్నారు. అయితే సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆలస్యమైందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెడల్పు కుదిస్తూ అంచనాలు మార్పు చేసి దాన్ని పనికిరాకుండా చేశారన్నారు. ఈ బ్రిడ్జిపై వెళ్లేవారికి ఎదురుగా మరో వాహనం వస్తే ఇబ్బందేనన్నారు. అంచనాలు మార్చి వెడల్పు కుదించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని మండిపడ్డారు. సైఫుల్లా బ్రిడ్జి నిర్మాణంలోనూ నిధులు ఆగిపోతే దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సహకారంతో రూ.3.50కోట్లు మంజూరు చేయించి పూర్తి చేశామని గుర్తు చేశారు. టీటీడీ నుంచి అడ్డంకులు వస్తే తాము మాట్లాడి అనుమతులు తెచ్చామన్నారు. నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు తమ హయాంలోనే ముందడుగు పడిందని, అయితే ఎన్నికలు, ఇతరత్ర కారణాల వల్ల నిలిచిపోయిందని చెప్పారు. అప్పట్లో డీపీఆర్ చేసినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అడుగూ ముందుకు పడలేదన్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు నాలుగున్నరేళ్లుగా అమృత్ పథకం అంటూ కథలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదన్నారు. నగర పరిధిలో 42 మురికివాడలుంటే ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్ ఆవైపు కన్నెత్తి చూడలేదన్నారు. నగర అభివృద్ధి విషయంలో ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్ కథలు చెబుతున్నారే తప్ప ఎలాంటి చర్యలూ తీసుకోలేదని విమర్శించారు. -
వంచనను ఎండగడదాం
అనంతపురం సప్తగిరి సర్కిల్: గత ఎన్నికలకు ముందు ఒక విధంగాను, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో విధంగానే బడుగు, బలహీన వర్గాలను వంచనకు గురి చేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడదామంటూ అనంతపురం పార్లమెంటు అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 20న జిల్లా కేంద్రం వేదికగా జరిగే బీసీల నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమ నిర్వహణపై ఆ పార్టీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పామిడి వీరాంజినేయులు అధ్యక్షతన అనంతపురం పార్లమెంటు పరిధిలోని కుల సంఘాలు, డివిజన్ కన్వీనర్లు, అధ్యక్షులు, కార్యకర్తలతో జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. సీఎం ఇచ్చిన 600 హామీలలో ప్రత్యేకంగా బీసీలకు 130 హామీలు ఉన్నాయన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం నెరవేర్చలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీసీలను వంచన చేసేందుకు ‘జయహో బీసీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ తరహా చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలన్నారు. బీసీలకు టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రతి మోసాన్ని ఎత్తి చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో ఈ నెల 20న ఉదయం 10 గంటలకు జెడ్పీ హాల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. బీసీలకు జరిగిన అన్యాయాలపై కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళ విభాగం రాష్ట్ర కార్యదర్శి మనేరు కొండమ్మ, సంయుక్త కార్యదర్శి షాను, అనంతపురం పార్లమెంటు కార్యదర్శి రాధాయాదవ్, నగర అద్యక్షుడు చింత సోమశేఖర్‌రెడ్డి, యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ సాకే చంద్ర, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి వడ్డే గోపాల్, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ గౌడ్, బీసీ సెల్ నగర అధ్యక్షుడు శ్రీనివాసులు, 24వ డివిజన్ కన్వీనర్ లీలావతి, దేవాంగం రామయ్య, రత్నమయ్య, రాధాకృష్ణ, షరీఫ్, శివప్రసాద్, ఓబిలేసు, శ్రీనివాసులు, నాగశేషయ్య, రవితేజ, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టారు అధికారంలోకి వచ్చేందుకు బీసీ కులాలను ఎస్సీ, ఎస్టీ కులాల్లో చేరుస్తామంటూ చెప్పి, అధికారం చేపట్టిన తర్వాత కులాల మధ్య చిచ్చుబెట్టారు. బీసీలకు చేసిన అన్యాయాన్ని ఎండగట్టేందుకు ఈ నెల 20న తలపెట్టిన నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయండి. – పామిడి వీరాంజినేయులు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు -
ముస్లింకా దుష్మన్ చంద్రబాబు
అనంతపురం, తాడిపత్రి: ‘‘ముసల్మాన్కా దుష్మన్ చంద్రబాబు....నారా నమక్ హరాం’’ అని వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం పట్టణంలోని సత్యసాయి ఫంక్షన్ హాలులో వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు గయాజ్‌బాషా ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం జాతీయ కార్యదర్శి రెహ్మాన్, విజయవాడ పార్లమెంటు సమన్వకర్త మహ్మద్ ఇక్బాల్, కడప శాసనసభ్యులు అంజాద్‌బాషా, హిందూపురం పార్లమెంటు సమన్వయకర్త నదీమ్ అహ్మద్, తాడిపత్రి సమన్వకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి తదితరులు ముఖ్యతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామిరెడ్డి, మాట్లాడుతూ, మహానేత వైఎస్సార్ హయాంలో బడుగుబలహీన వర్గాలన్నీ బాగుపడ్డాయనీ, మళ్లీ అలాంటి పరిపాలన తిరిగి రావాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో తిరిగి రాజన్న రాజ్యం వస్తుందన్నారు. తాడిపత్రి నుంచి రాజధాని వరకు ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీని, రాష్ట్రంలో ఉన్న టీడీపీని ఇంటికి సాగనంపడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గమనించారనీ, వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించే ప్రతిపక్ష నేతపై హత్యకు కుట్ర పన్నాడని అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుకు దక్కిందన్నారు. ఆయన జీవితమంతా కుట్రమలమయమన్నారు. చంద్రబాబు అధికారం కోసం ఎన్ని రంగులైనా మారుస్తారనీ, అందువల్లే తిట్టిన నోటితోనే సోనియాగాంధీని ఆకాశానికి ఎత్తుతున్నాడన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో జతకట్టి నాలుగేళ్లు కేంద్రంలో అధికారం పంచుకున్న చంద్రబాబు....అతని అవినీతిని ప్రశ్నించినందుకు బీజేపీ నుంచి వైదొలిగి కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నాడని అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు సొంతంగా ఏనాడు అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవని... పొత్తులతోనే అధికారాన్ని చేజిక్కించుకుంటున్నాడన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్‌బాషా, మైనార్టీ విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎంఎస్ బేగ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కొనుదుల రమేష్‌రెడ్డి, పైలా నరసింహయ్య, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి పేరం స్వర్ణలత, మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి రియాజ్, పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షబ్బీర్, సేవాదళ్ పట్టణ అధ్యక్షుడు హాజీవలి, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు అన్వర్‌బాషా, మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి పెయింటర్బాషా, జిల్లా ప్రచార కార్యదర్శి షేక్‌గౌస్, ఖాజాపీర్, గౌస్‌పీర్, యువజన విభాగం జిల్లా కార్యదర్శులు ఎస్.బాబా, జబ్బార్, హనుమంతరెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి రంగనాథ్‌రెడ్డి, యాడికి మండల కన్వీనర్ బొంబాయి రమేష్‌నాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి, రైతు విభాగం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, సాంస్కృతిక విభాగం జిల్లా కార్యదర్శి రమేష్‌నాయుడు, సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్‌కుమార్, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజు, బీసీ సెల్ కార్యదర్శి లక్ష్మీరంగయ్య, ఎస్సీ సెల్ పట్టణ కన్వీనర్ దూలా రఘు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ వల్లే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చలువ వల్లే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు దక్కాయి. ఆయన పాలనలో ముస్లింలకు ఏ కొరతా లేకుండా చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేద ముస్లింలకు ఎన్నో ఆపరేషన్లు చేయించారు. వైఎస్సార్ వల్లే ముస్లింల ఆర్థిక స్థితిగతులు మారాయి. మళ్లీ అలాంటి సువర్ణయుగం రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సి అవసరం ఉంది. – నదీమ్ అహ్మద్, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త జేసీ సోదరుల దోపిడీకి అంతేలేదు జేసీ సోదరుల దోపిడీకి అంతులేకుండా పోయింది. వారి దోపిడీని ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారు. వారి పుణ్యాన లారీ ఓనర్లు అప్పులపాలవుతున్నారు. ముస్లింల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకున్న జేసీ సోదరులు... వారిని అసాంఘిక కార్యకలాపాలవైపు ప్రోత్సహిస్తున్నారు. ముస్లింల మధ్య చిచ్చుపెడుతున్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పేద ముస్లింకు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తాం. – కేతిరెడ్డి పెద్దారెడ్డి, సమన్వయకర్త, తాడిపత్రి ముస్లింలకు పెద్దపీట మహానేత డాక్టర్ వైఎస్సార్ తన హయాంలో ముస్లిం సంక్షేమానికి పె ద్దపీట వేశారు. చంద్రబాబు నా యుడు ముస్లింలకు తీరని ద్రోహం చేయడమే కాకుండా కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబు ముస్లింలకు ఏనాడు అధికారం ఇవ్వలేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓట్ల కోసం ముస్లింలను మంత్రివర్గంలోకి తీసుకున్నాడు. – అంజాద్‌బాషా, శాసనసభ్యులు, కడప వక్ఫ్‌బోర్డు ఆస్తులుఅన్యాక్రాంతం తాడిపత్రిలోని వక్ఫ్‌బోర్డు ఆస్తులన్నీ అన్యాక్రాంతమవుతున్నాయి. పేరు కే వక్ఫ్‌బోర్డు కమిటీలో ముస్లింలు ఉన్నారు. కానీ పెత్తనం అంతా ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిదే. వక్ఫ్‌బోర్డుకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ బాడుగలు రూ.లక్షల్లో వస్తుంటే...ఎమ్మెల్యే జేసీపీఆర్ రూ.వేలల్లో చూపించి స్వాహా చేస్తున్నారు. వక్ఫ్‌బోర్డు ఆస్తుల అన్యాక్రాంతంపై ప్రశ్నించినందుకే జేసీ సోదరులు నాపై దాడి చేశారు. అయినా నేను ఎవరికీ భయపడను. వక్ఫ్‌బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం ప్రాణాలైనా అర్పిస్తాను. – గయాజ్‌బాషా, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు -
‘పవన్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్’
సాక్షి, అనంతపురం : ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే పవన్ కళ్యాణ్ అనంతపురంలో పర్యటించారంటూ వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పలు అంశాల్లో పవన్ కళ్యాణ్ వైఖరిని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ ప్రభుత్వాల భాగస్వామి అంటూ ఆరోపించారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్‌కు లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్ రైతు భరోస యాత్ర చేసి కష్టాల్లో ఉన్న అన్నదాతలను పరామర్శించిన సంగతి పవన్‌కు తెలీయదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించేందుకే పవన్ కళ్యాణ్ జిల్లాలో కవాతు నిర్వహించారని ఆరోపించారు. రైతు ఆత్మహత్యలు, వలసలపై పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబును ఎందుకు నిలదీయడం లేదంటూ ప్రశ్నించారు. 23 మంది వైఎస్సార్ సీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెడితే పవన్ కళ్యాణ్ ఎందుకు మద్దతు కూడగట్టలేదని ప్రశ్నించారు. చంద్రబాబుపై ఉన్న కేసులు పవన్ కళ్యాణ్‌కు కనిపించవంటూ మండి పడ్డారు. పవన్ కళ్యాణ్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్.. చంద్రబాబు తరఫున రాజకీయాల్లో నటిస్తున్నరంటూ ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌కు సిద్ధాంతాలు లేవు.. డబ్బు తీసుకోవటం.. నటించడం మాత్రమే తెలుసంటూ పవన్‌పై వివర్శలు గుప్పించారు. -
టీడీపీ, బీజేపీకి చివరి రోజులు
అనంతపురం: కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీలకు ఇవి చివరి రోజులని, ఆ రెండు పార్టీలను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం అనంతపురం నగరం 26వ డివిజన్లో ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమంలో పాల్గొన్న ‘అనంత’ మాట్లాడుతూ, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలకు నూకలు చెల్లాయన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, ఈ పరిస్థితుల్లో జనాలకు వైఎస్ జగన్ ఒక్కడే కనిపిస్తున్నారన్నారు. టీడీపీకి చెందిన సర్పంచ్, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేట్ నుంచి ముఖ్యమంత్రి దాకా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు ప్రజలను మోసం చేసేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారన్నారు. ప్రజలు అప్రత్తంగా ఉండాలని కోరారు. టీడీపీ సాగిస్తున్న దుష్టపాలన అంతమొందించాలంటే వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందనీ, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మోసకారి బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయాయన్నారు. అధికారం మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
ఆదర్శం.. అవినీతి పర్వం
ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి పరస్పర వ్యాఖ్యలపై ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. జిల్లాలోనే అర్బన్ నియోజక ఆదర్శమని ఎమ్మెల్యే గొప్పలు చెబుతుండగా...అవినీతిలోనే ఆదర్శంగా నిలిచారంటూ మాజీ ఎంపీ అనంతతో పాటు విపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. (సాక్షిప్రతినిధి, అనంతపురం) : అనంతపురం అర్బన్ నియోజకవర్గం జిల్లాకే ఆదర్శం. నాలుగున్నరేళ్లలో అవినీతి లేకుండా, అభివృద్ధిని అందించాం. జిల్లాకే ‘అనంత’ ఆదర్శం’’ – పలు సందర్భాల్లో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వ్యాఖ్యలు ‘అనంత’ అభివృద్ధిలో కాదు...అవినీతిలో జిల్లాకు ఆదర్శం. ఏ పని చూసినా, ఏ వార్డుకు వెళ్లినా అవినీతి తాండవిస్తోంది. గతంలో మేం చేసిన అభివృద్ధి మినహా నాలుగున్నరేళ్లలో ఎక్కడా అభివృద్ధి కన్పించలేదు.’’– మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి విమర్శలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో అనంత అర్బన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. జిల్లా కేంద్రం కావడం, నియోజకవర్గంలోని ఎక్కువశాతం ఓటర్లు విద్యావంతులు, రాజకీయంగా చైతన్యం ఉన్నవారే కావడంతో ఈ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు జిల్లాలోని తక్కిన నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపిస్తాయి. మొదటినుంచి ‘అనంత’లో టీడీపీ అత్యంత బలహీనంగా ఉంది. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభాకర్‌చౌదరి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే నాలుగున్నరేళ్లలో ‘అనంత’ అభివృద్ధిని ఎమ్మెల్యే, మేయర్ పూర్తిగా విస్మరించారు. ఎంపీ జేసీదివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆధిపత్యపోరుతో ‘అనంత’ అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందనేది నగరవాసుల వాదన. కానీ ఎమ్మెల్యే మాత్రం తాను నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి చేశానని, అవినీతికి దూరమని, శాంతి కాముకుడినని, రాజకీయంగా అందరికీ అండగా ఉంటున్నాని ప్రచారం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే మాటలకు.. నియోజకవర్గ వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతనలేదు. అభివృద్ధిలో కాదు...అవినీతిలోనే ఫస్ట్ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరికి అనుమతి లేకుండా నVýæరంలో చిన్న మురుగు కాలవ పనులు కూడా ముందుకు సాగవన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ప్రతీ పనికి ఈయన కమిషన్ ఆశిస్తారని... ఆ పార్టీలోని కార్పొరేటర్లు, నేతలే బాహాటంగా చెబుతున్నారు. జేఎన్టీయూ పరిధిలో రూ.150 కోట్లతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల్లో 2 శాతం కమిషన్ ఎమ్మెల్యేకు ఇచ్చినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ పరిధిలో ఐహెచ్పీ చేపట్టిన రూ.191 కోట్లతో తాగునీటి పైపులైన్ పనుల్లోనూ మొబలైజేషన్ అడ్వాన్స్‌కింద మొదట్లో కంపెనీకి ఇచ్చిన రూ.7.5 కోట్లు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లినట్లు కార్పొరేటర్లే చెబుతున్నారు. ఇందులో ఎమ్మెల్యేతో పాటు మేయర్‌కూ వాటాలు అందినట్లు తెలుస్తోంది. అలాగే రాంనగర్ బ్రిడ్జి నిర్మాణంలోనూ ఎమ్మెల్యేకు 3 శాతం ‘గుడ్‌విల్’ ముట్టజెప్పినట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇటీవల వడ్డెర ఫెడరేషన్‌కు చెందిన రూ.12 కోట్లు దారి మళ్లినట్లు బాధితులుపోలీసులను ఆశ్రయించారు. నిజానికి రూ.24 కోట్ల మేర దారి మళ్లాయని, ఇందులో వడ్డెర ఫెడరేషన్ చైర్మన్‌తో పాటు ఎమ్మెల్యే పాత్ర ఉందని కూడా తెలుస్తోంది. ఇద్దరికీ వాటాలు టౌన్‌ప్లానింగ్‌కు సంబంధించి భారీ భవంతులు నిర్మాణాలకు మేయర్‌కు వాటాలు ముట్టందే పని ముందుకు కదలదని కార్పొరేటర్లే చెబుతున్నారు. ‘అనంత’లో భారీ సంఖ్యలో నిర్మాణాలు జరుగుతుండటం, ఆదాయం ఎక్కువగా ఉండటంతో టౌన్‌ప్లానింగ్‌లోని ఓ అధికారి అండతో ఎమ్మెల్యే ఇంటికీ పర్సెంటేజీలు వెళుతున్నాయని తెలుస్తోంది. పైకి మేయర్‌తో విభేదాలు ఉన్నట్లు కనిపించినా.... వాటాల పంపకంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయంతో ఉంటారని ఆపార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. నాలుగున్నరేళ్లలో రూ.107 కోట్ల అభివృద్ధి పనులు కార్పొరేషన్లో జరిగితే రూ.40 శాతం అవినీతి జరిగిందనేది అధికారులు, కార్పొరేటర్లే చెబుతున్నారు. ఇందులో సింహభాగం ఎమ్మెల్యేకు, ఆపై మేయర్‌కు, అధికార పార్టీ కార్పొరేటర్లకు కొద్ది మేర వాటాల పంపకం జరిగిందని తెలుస్తోంది. 2005లో రాష్ట్రపతి పర్యటన ‘అనంత’లో లేకపోయినా ఇక్కడికి వస్తారని సాకు చూపి 36వ డివిజన్లో రెండురోజుల్లో రూ.2 కోట్ల ఖర్చుపెట్టి నాసిరకమైన పనులు చేశారు. సొంతపార్టీ నేతల్లోనే అసంతృప్తజ్వాలలు టీడీపీలో జయరాంనాయుడు క్రియాశీలకంగా పనిచేశారు. అయితే ఎమ్మెల్యే వైఖరితో విభేదించి అవినీతిపై విమర్శలు చే స్తున్నారు. దీంతో బుల్లెట్ లింగమయ్య అనే వ్యక్తి ద్వారా తనను హత్య చేసేందుకు ఎమ్మెల్యే చౌదరి ప్రయత్నించారని ఇటీవల జయరాం పోలీసులను కలిశారు. ఓ స్కార్పియో ఇవ్వడంతో పాటు రాజకీయంగా ఎదిగేందుకు సహకరిస్తానని లింగమయ్యకు చౌదరి భరోసా ఇచ్చారని జయరాం చెబుతున్నారు. శాంతిస్థాపన కోసం ‘అవే’ను స్థాపించానని చెప్పే చౌదరి... రాజకీయంగా అడ్డొచ్చేవారిని అంతమెందించాలనుకోవడం దారుణమని విమర్శలు వచ్చాయి. ఎవరైనా తనను విమర్శించినా, అడ్డొచ్చినా వారి డివిజన్లపై చౌదరి కక్ష కట్టినట్లు వ్యవహరిస్తారనే ఆరోపణలున్నాయి. కార్పొరేటర్లు ఉమామహేశ్వరరావు, లాలెప్ప, విద్యాసాగర్‌తో పాటు పలువురి కార్పొరేటర్లపై ఈ తరహా ధోరణి అవలంభించారు. ఇలా ‘అనంత’ అవినీతిలో నాలుగున్నరేళ్లుగా అడుగులు వేస్తూ వచ్చిన చౌదరి వ్యాఖ్యలు చూస్తుంటే ‘వేయిగొడ్లను తిన్న రాబంధు ఓ గాలివానకు నెలకూలిందన్నట్లు’ ప్రతీ పనిలో వాటాలు తీసుకునే చౌదరి కూడా వచ్చే ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోక తప్పదని విపక్షపార్టీ నేతలతో పాటు సొంతపార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. -
వైఎస్సార్ సీపీతోనే ముస్లింల సంక్షేమం
అనంతపురం సప్తగిరి సర్కిల్: రాబోవు ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితుల్లోనూ మతతత్వ పార్టీలతో కలిసి పనిచేసేది లేదంటూ వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల ఆత్మీయత.. రాజకీయాల్లో నిబద్ధత ప్రధాన అంశాలుగా ముందుకు సాగుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైతే ముస్లింలకు అన్ని విధాలుగా లబ్ధి చేకూరుతుందన్నారు. అనంతపురంలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ముస్లిం మైనారిటీల సదస్సు విజయవంతమైంది. సదస్సుకు వేలాదిగా ముస్లింలు తరలివచ్చారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముస్లిం మత పెద్దల ప్రార్థనలతో సదస్సును ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగే పరుశురాం, మహాలక్ష్మి శ్రీనివాస్, మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎస్ఎస్ సాదిక్, రాష్ట్ర కార్యదర్శులు జేఎం బాషా, ఖాదర్‌బాషా, గౌస్‌బేగ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వైవీ శివారెడ్డి, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, మైనారిటీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మునీరా బేగం, నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, కోగటం విజయభాస్కరరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలాం, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్‌పీరా, మైనారిటీ విభాగం కార్యదర్శి హబీబుల్లా, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియాజ్, అనంతపురం నియోజకవర్గం మైనార్టీ విభాగం అధ్యక్షుడు సైఫుల్లాబేగ్, మైనారిటీ విభాగం నగర అధ్యక్షుడు రోషన్‌జమీర్, జిల్లా అధికార ప్రతినిధులు మన్సూర్, డాక్టర్ మైనుద్దీన్, నాయకులు వేముల నదీం, వాసంతి సాహిత్య, షెక్షావలి, డాక్టర్ రజాక్ తదితరులు పాల్గొన్నారు. -
‘చంద్రబాబు బీజేపీకి శాశ్వత మిత్రుడు’
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీకి శాశ్వత మిత్రుడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంజాద్ బాషా పేర్కొన్నారు. ఆదివారం మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో అనంతపురంలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో హర్ దిల్ మే వైఎస్సార్ పేరుతో ముస్లిం మైనారిటీల ఆత్మీయ సదస్సు జరిగింది. దీనిలో భాగంగా మాట్లాడిన అంజాద్ బాషా.. చంద్రబాబు బీజేపీకి శాశ్వత మిత్రుడు అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ సెక్యులర్ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో ఎలాంటి పొత్తులు పెట్టుకోదని పేర్కొన్నారు. ముస్లింలపై టీడీపీ సర్కార్ కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ముస్లింలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ ఆ పార్టీ నెరవేర్చకపోవడమే ఇందుకు ఉదాహరణగా ఆయన తెలిపారు. చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతోందని, రోజుకో పార్టీతో ఆయన పొత్తు పెట్టుకుంటున్నారని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రెహ్మాన్ విమర్శించారు. అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ముస్లిం ద్రోహి టీడీపీ అని, మైనార్టీలను ఓటు బ్యాంకులా చూడటం సిగ్గు చేటని ఆయన ధ్వజమెత్తారు. -
పోలీసులు.. కీలుబొమ్మలు
శింగనమల : పోలీసులు అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్నారని వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా ప్రజల సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్సీపీ నాయకులను అరెస్ట్ చేయడం తగదని అన్నారు. టీడీపీ పాలనలో ప్రతిపక్ష పార్టీ కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు, మంత్రులు అడుగడుగునా పోలీసుల ద్వారా అడ్డు తగులుతూనే ఉన్నారన్నారు. ఏ కార్యక్రమం తలపెట్టినా ముందస్తుగా నేతలను గృహనిర్బంధం, ముందస్తు అరెస్టులతో అణచివేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాప్తాడు, హిందూపురం, పెనుకొండ, ధర్మవరం, రాయదుర్గం, తాడిపత్రి, శింగనమల వంటివే కాకుండా జిల్లా అంతటా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. పోలీసుల రాజ్యంలో ఉన్నామా.. లేకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు పోలీసుల చేత ఎన్నికయ్యారా అని విమర్శించారు. ముచ్చుకోట వద్ద ఎటువంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకున్నా వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. పోలీసులు పద్ధతి మార్చుకోకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో దిగ్బంధిస్తామని హెచ్చరించారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, పార్లమెంటు సమన్వయకర్తలతో కలిసి పోలీసుల తీరుపై డీజీపీ, గవర్నర్లకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధులు పోలీసు వ్యవస్థను కించపరిచినా ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. రాజకీయాల్లోకి రావాలంటే ఎంతోమంది ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వస్తున్నారని.. మీకు అధికార పార్టీపై అభిమానం ఉంటే ఖాకీ చొక్కాలు విప్పి పచ్చ చొక్కాలు వేసుకుని రావాలని హితవు పలికారు. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం : కేతిరెడ్డి జిల్లాలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విమర్శించారు. మేము ఏమైన రాళ్లు రువ్వుతున్నామా.. ఎవరో తాడిపత్రి ఎమ్మెల్యే, ఎంపీ చెబితే మీరు వైఎస్సార్సీపీ నాయకులను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. తాడిపత్రి ఎమ్మెల్యే తిమ్మంపల్లిలో పర్యటిస్తే 500 మంది పోలీసులతో బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేస్తారని నిలదీశారు. తాము ప్రజాసమస్యల కోసం పాదయాత్ర చేస్తామంటే పోలీస్‌స్టేషన్‌లో పెడతారా అంటూ విరుచుకుపడ్డారు. అదే ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులను అవమానకర రీతిలో దూషించినా ఆయనపై ఎటువంటి కేసూ నమోదు చేయరన్నారు. నీరు రాకుండా జేసీ సోదరుల అడ్డుకట్ట శింగనమల: ముచ్చుకోట రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయకపోవడంతో పాటు వర్షపునీరు కూడా డ్యాంలోకి చేరకుండా జేసీ సోదరులు అడ్డుకట్ట వేశారని వైఎస్సార్సీపీ తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. ముచ్చుకోట నుంచి పెద్దపప్పూరుకు చేపట్టిన పాదయాత్రను అడ్డుకుని, పెద్దారెడ్డిని శింగనమల పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డ్యాంలో నీరు ఉంటే పెద్దపప్పూరు మండలంలోని 20 గ్రామాల్లో భూగర్భజలం పెరుగుతుందన్నారు. తద్వారా రైతులు పంటలు పండించుకుంటే.. ఇక జేసీ ఇంటి వద్దకు ఎవరూ తిరిగి చూడరని 30 సంవత్సరాలుగా రిజర్వాయర్‌కు నీరు విడుదల చేయకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నీటిని విడుదల చేయాలని తాము కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశామన్నారు. తాడిపత్రిలో పోలీస్ వ్యవస్థ లేదని, అక్కడ జేసీ సోదరుల కనుసన్నల్లోనే పోలీసులు నడుచుకుంటున్నారన్నారు. ప్రబోధానందాశ్రమంపై జేసీ సోదరులు, వారి అనుచరులు దాడి జరిపితే పోలీసులు సుమోటోగా కూడా కేసు నమోదు చేయలేదన్నారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ధైర్యముంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. వైఎస్సార్సీపీ నేతల పరామర్శ శింగనమల పోలీస్స్షేన్లో కేతిరెడ్డి పెద్దారెడ్డిని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, యువజనవిభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరిసాంబశివారెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ ఛైర్మన్ నార్పల సత్యనారాయణరెడ్డి, మైనారిటీ సెల్ అధ్యక్షుడు గయాజ్‌బాషా, తాడిపత్రి, యల్లనూరు మండలాల వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు పరామర్శించారు. మధ్యాహ్నం కేతిరెడ్డి పెద్దారెడ్డి విడుదల తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని మధ్యాహ్నం సొంత పూచికుత్తపై విడుదల చేశారు. పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు పోయిన తరువాత తాడిపత్రికి వెళ్లకూడదని డీఎస్పీలు రామకృష్ణ, చిన్నికృష్ణలు కేతిరెడ్డి పెద్దారెడ్డి వాహనాన్ని నిలిపి అభ్యంతరం చెప్పారు. రోడ్డుపైనే పోలీస్‌స్టేసన్ మందు అనుచరలు అందోళన చేస్తామని చెప్పడంతో వాహనాలను పంపించి వేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐలు నిరంజన్‌రెడ్డి, ప్రసాద్‌రావు, ఎస్ఐ కరీం బందోబస్తు చేపట్టారు. -
రాజకీయంగా ఎదుర్కోలేకే ఫ్యాక్షన్‌కు బీజం
అనంతపురం సెంట్రల్: ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న సమయంలో రాజకీయంగా ఎదుర్కోలేక అధికార తెలుగుదేశం పార్టీ నేతలు అల్లర్లు, ఫ్యాక్షన్‌కు బీజం వేస్తున్నారని వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంటు అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలు ఆరోపించారు. గురువారం తాడిపత్రి నియోజకవర్గ సమన్వకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ను ఆయన చాంబర్లో కలిసి ఫిర్యాదు చేశారు. కేసుల్లో ఇరికించేందుకు కుట్ర ఎన్నికలు వస్తున్న తరుణంలో ఫ్యాక్షన్, అల్లర్లకు రెచ్చగొట్టి ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలను అక్రమ కేసుల్లో ఇరికించాలని అధికారపార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. తాడిపత్రి, రాప్తాడు, ధర్మవరం, హిందూపురం, రాయదుర్గం తదితర నియోజకవర్గాల్లో పోలీసులు తమ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రిలో నాలుగు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయిన వారిని తీసుకొచ్చి మళ్లీ గొడవలకు ఆజ్యం పోస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 14 నుంచి 29 వరకు కేతిరెడ్డి పెద్దారెడ్డి తిమ్మంపల్లి గ్రామానికే పోలేదన్నారు. అయితే వైఎస్సార్సీపీ కార్యకర్త బాషాను అన్యాయంగా అధికార పార్టీ నేతలు కొట్టారన్నారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి వెళితే మీరు ఫిర్యాదు చేస్తే మీపై కౌంటర్ కేసులు నమోదు చేస్తామని తాడిపత్రి రూరల్ సీఐ నారాయణరెడ్డి బెదిరించారన్నారు. రాత్రికిరాత్రే కుట్ర పన్ని పెద్దారెడ్డిపై అక్రమ కేసులు బనాయించారన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పోలీసు నియామకాలపై అనుమానాలు జిల్లాలో అనేక మంది సీఐలకు పోస్టింగ్‌లు లేకుండా పక్కన ఉంచారని కేతిరెడ్డి పేర్కొన్నారు. అయితే ఇటీవల పదోన్నతి పొందిన నారాయణరెడ్డిని తాడిపత్రి రూరల్ సీఐగా నియమించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. స్వామిభక్తిని నిరూపించుకోవడానికే ఆయన్ను ఇక్కడకు వేశారని తెలుస్తోందన్నారు. డీఎస్పీ విజయ్‌కుమార్ నియామకంపైనా అనుమానాలు ఉన్నాయన్నారు. తన తండ్రి కేతిరెడ్డి సూర్యప్రతాప్‌రెడ్డి హత్య సమయంలో సీఐగా పనిచేశారన్నారు. అప్పట్లో ఆయన సీఐగా సరిగా పనిచేయకపోవడం వలనే ఆ హత్య జరిగిందని ఆరోపించడంతో బదిలీ చేశారన్నారు. తిరిగి ఇప్పుడు డీఎస్పీగా ఆయన్నే ఇక్కడకు నియమించుకున్నారన్నారు. పోలీసులకు దివాకర్రెడ్డినే జీతాలు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును జీతంగా తీసుకొని పనిచేస్తున్నామనే విచక్షణ మరిచి పోలీసులు వ్యవహరిస్తుండడం బాధాకరమన్నారు. తాము పోలీసులపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రామగిరి ఏమైనా పీఓకేనా? ‘ప్రతిపక్ష నాయకులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అణగదొక్కుతున్నారు. రామగిరి మండలంలోకి వెళ్లాలంటే అనుమతి లేదంటారు.. అదేమైనా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరా (పీఓకే)’ అని ప్రశ్నించారు. ప్రజస్వామ్యంలో ఉన్నామా? లేక రాక్షస రాజ్యంలో ఉన్నామా అని నిలదీశారు. తమకు న్యాయం జరగకపోతే త్వరలో జిల్లా వ్యాప్తం గా వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించా రు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరు సాంబశివారెడ్డి, నాయకులు నార్పల సత్యనారాయణరెడ్డి, కార్పొరేటర్ బాలాంజనేయులు, రాజేష్ పాల్గొన్నారు. ఓట్ల కోసం ఫ్యాక్షన్‌కు ఆజ్యం యల్లనూరు, పుట్లూరు మండలాల్లో తొలి నుంచి తమ కుటుంబానికి ప్రజల మద్దతు ఉందని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు. జేసీ దివాకర్‌రెడ్డి ఎంపీ అయిన తర్వాత ఓట్లు సంపాదించుకోవాలనే లక్ష్యంతో ఈ రెండు మండలాల్లో ఫ్యాక్షన్‌ను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో పోలీసు పికెటింగ్ ఉన్నా తమ కార్యకర్త బాషాపై దాడి చేశారన్నారు. పోలీసుల బెదిరింపులతో ఫిర్యాదు కూడా చేయలేదన్నారు. అయితే గొడవలు జరిగేందుకు ఆస్కారం ఉన్న సమయంలో పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సింది పోయి చిన్న సంఘటనను భూతద్దంలో చూపించి పెద్దారెడ్డిపై ఏకంగా నాన్‌బెయిలబుల్ కేసు అక్రమంగా నమోదు చేశారన్నారు. పెద్దారెడ్డిని జైలుకుపంపడం దుర్మార్గం - ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అనంతపురం: వైఎస్సార్సీపీ తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిపై అక్రమంగా నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసి జైలుకు పంపడం దుర్మార్గమని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సంబంధం లేని కేసులో పెద్దారెడ్డిని ఇరికించడం పోలీసుల దమనకాండకు నిదర్శనం అని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి, అక్రమ అరెస్టులు చేయించి మరోసారి అధికారంలోకి రావడానికి కుయుక్తులు పన్నుతోందని ధ్వజమెత్తారు. పెద్దారెడ్డిపై కేసును ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబు ముస్లింల దోహి
-
ప్రజలే బంద్ సక్సెస్ చేశారు
అనంతపురం: ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలే స్వచ్ఛందంగా బంద్‌ను జయప్రదం చేసి హోదా ఆకాంక్షను చాటి చెప్పారని మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు బంద్ పాటించాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన నిరంకుశ వైఖరికి నిరసనగా తాము బంద్‌కు పిలుపునిచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుందనీ, దీన్నిబట్టి చూస్తే టీడీపీ నైజం ఏమిటో తెలుస్తోందన్నారు. ప్రత్యేకహోదా అవసరం లేదని, ప్రత్యేకహోదా ఏమైనా సంజీవనా అని చంద్రబాబు గతంలో వ్యాఖ్యానించారన్నారు. కానీ మూడు నెలలుగా ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నానంటూ కొత్త పల్లవి అందుకున్నారన్నారు. కానీ నేడు తాము కేంద్రం తీరుకు నిరసనగా బంద్ పాటిస్తే ఎందుకు అడ్డుపడ్డారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్మదీక్షల పేరుతో ప్రజాధనాన్ని ఖర్చు చేసి చంద్రబాబు దొంగదీక్షలు చేశారని, తాము నిజాయతీగా పోరాటాలు చేస్తే అడుగడుగునా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. తాను బీజేపీతో పోరాటం చేస్తున్నానంటూ చంద్రబాబు చెబుతుండగా...కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో టీడీపీ తమకు మంచి మిత్రపక్షమని చెబుతున్నారన్నారు. ఈరోజు బంద్ నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించిన టీడీపీ ప్రభుత్వం కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలు నిజమని రుజువు చేసిందన్నారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించి ప్రత్యేకహోదా సాధన ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. బంద్ సందర్భంగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడక్కడే అరెస్ట్‌లు చేయడం, వారి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని ఆయన ఖండించారు. ఉరవకొండ ఎమ్మెల్యే యల్లారెడ్డి విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, 30 యాక్ట్, 144 సెక్షన్ పేరుతో హోదా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారన్నారు. హోదా కోసం తానే పోరాడుతున్నానంటూ చెబుతున్న చంద్రబాబు... మరోవైపు హోదా ఉద్యమం పట్ల విషం చిమ్ముతూ ఉక్కుపాదం మోపుతూ నిర్వీర్యం చేయాలని చూశారన్నారు. అర్ధరాత్రి నుంచే అరెస్ట్‌లు చేసినా.. అన్ని వర్గాల ప్రజలు బంద్‌కు పూర్తి మద్దతునిచ్చారన్నారు. హోదా ఆకాంక్ష ఎంత బలంగా ఉందో ప్రజలు తెలియజేశారన్నారు. ఇది చంద్రబాబుకు చెంపపెట్టులాంటదన్నారు. హోదాకోసం కేంద్రంపై పోరాటం చేస్తున్నామంటూనే... రాష్ట్రంలో జరుగుతున్న హోదా ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తన పరిపాలన పట్ల 85 శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు... నాలుగేళ్లలో ఎన్నిరోజులు 30 యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉంచారో చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీ నిరంకుశ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కుల పట్ల దాడి చేస్తోందన్నారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రభుత్వ వైఫల్యాలపట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్నారు. బంద్ సందర్భంగా మహిళల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, కార్యకర్తల పట్ల జులుం ప్రదర్శించారన్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. రోడ్లపై అడుగుపెట్టిన వెంటనే అరెస్ట్‌లు చేశారన్నారు. వైఎస్సార్సీపీ అంటే ప్రభుత్వం ఎంత భయపడుతోందో అరెస్ట్‌ల ద్వారా అర్థమైందన్నారు. సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధులు ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, చింతకుంట మధు, ప్రధానకార్యదర్శి రామచంద్రారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, కార్పొరేటర్ గంగన హిమబిందు పాల్గొన్నారు. -
హోదా కోసం పోరాటం చేస్తున్నట్లు టీడీపీ నటిస్తోంది
-
‘రాజీనామాలు చేసే దమ్ము టీడీపీకి ఉందా’
సాక్షి, అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకు రాజీనామా చేసి.. దీక్షలు చేసే దమ్ము టీడీపీ ఎంపీలకు ఉందా అని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి సవాల్ విసిరారు. ఈ నెల 24న చేపట్టనున్న రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హోదా కోసం పోరాటం చేస్తున్నట్లు టీడీపీ నటిస్తోందని విమర్శల వర్షం కురిపించారు. రైల్వే జోన్ తేలేని దద్దమ్మలు టీడీపీ నేతలని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి టీడీపీ, బీజేపీ రెండు పార్టీలు కారణమన్నారు. కేంద్రానికి ఆ అవకాశం ఇచ్చింది టీడీపీ అని తెలిపారు. చంద్రబాబు ఇప్పుడు కూడా ఎన్డీయే భాగస్వామి, మిత్రుడే అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం వామపక్షాలతో సహా, ప్రజా సంఘాల మద్దతు కోరుతున్నామన్నారు. ఏపీ ప్రయోజనాలను మోదీ వద్ద చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్టారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొన్న వేలాది మందిపై కేసులు పెట్టిన ఘనత చంద్రబాబుది అని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై మోదీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని వెంకట్రామిరెడ్డి విమర్శించారు. టీడీపీ, బీజేపీ కలిసి ఏపీకి ద్రోహం చేశాయని, వైఎస్సార్సీపీ ఎంపీల త్యాగం చారిత్రాత్మకమైనదని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఉద్యమ సారథి వైఎస్ జగన్ విభజన హామీల అమలు కోసం చేస్తున్న పోరాటాన్ని వైఎస్సార్సీపీ ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోందని వైఎస్సార్సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రజల మనోభావాలు, వారికి జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్లో సుదీర్ఘంగా తమ నేతలు నిరసనలు తెలిపారన్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎంపీలు పదవికి రాజీనామా చేసి అమరణ దీక్ష చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఏపీ ప్రజల హక్కులను కేంద్రం తిరస్కరించడం దుర్మార్గమని మండిపడ్డారు. తప్పును బీజేపీపైకి నెట్టి చంద్రబాబు జారుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్యాకేజీని చూసి అసెంబ్లీ సాక్షికి చంద్రబాబు, మంత్రులు స్వాగతించారని పేర్కొన్నారు. ప్యాకేజీ బాగుందని కేంద్ర మంత్రులను చంద్రబాబు సన్మానించారని గుర్తుచేశారు. పార్లమెంట్లో ప్రత్యేక హోదాపై స్పందించేలా చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని మండిపడ్డారు. టీడీపీకి ఏపీ ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నదని విమర్శించారు. ప్రత్యేక హోదాకు మద్దతుగా ఈ నెల 24న జరిగే ఏపీ బంద్‌కి వామపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలపాలని విశ్వేశ్వరరెడ్డి కోరారు. -
ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి
అనంతపురం: ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంటు అధ్యక్షుడు, అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త అనంత వెంకటరామిరెడ్డి సూచించారు. మహిళా విభాగం అనంతపురం పార్లమెంటు అధ్యక్షురాలిగా నియమితురాలైన బోయ గిరిజమ్మ బుధవారం అనంత వెంకటరామిరెడ్డిని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ పార్టీలో నాయకులందరినీ కలుపుకొని వెళ్తూ పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. అనంతరం గిరిజమ్మ మాట్లాడుతూ పార్టీ తనపై నమ్మకం ఉంచి అప్పగించిన పదవికి న్యాయం చేసేందుకు అంకితభావంతో పని చేస్తానన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానన్నారు. నాయకులు, కార్యకర్తలు, మహిళలను కలుపుకొని ముందుకు వెళ్తానన్నారు. తనకు అవకాశం కల్పించేందుకు సహకరించిన పార్టీ జిల్లా ఇన్చార్జ్ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ అనంతవెంటకరామిరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా సుభాష్‌రోడ్డులోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2వ డివిజన్‌కు చెందిన సూరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. శివ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి గిరిజమ్మను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు, రమేష్, సుబహాన్, హాజీపీరా, రవి, సంతోష్, చైతు, కిట్టా, పవన్, రాజశేఖర్, రత్నమ్మ, లలిత, ప్రశాంతి, విజయశాంతి, దేవి, జాహ్నవి, బాపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, దస్తగిరి, రాజు, విశ్వనాథ్, సుభహాన్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ పార్టీ నేతలది మొసలి కన్నీరు
-
టీడీపీ నేతలు దొంగ దీక్షలు ఆపాలి
సాక్షి, అనంతపురం : ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతలు దొంగ దీక్షలు ఆపాలని అనంతపురం మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ నాయకుడు అనంతవెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. నాలుగేళ్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. ఈ నాలుగేళ్లలో ఏపీకి ఎందుకు న్యాయం చేయలేకపోయారో చెప్పాలని ఆయన నిలదీశారు. ప్రత్యేక హోదాకు బదులుగా కేంద్రం ప్యాకేజీ ప్రకటిస్తే టీడీపీ నేతలు సన్మానాలు చేశారని, కేంద్రం ఏపీకి అన్నీ ఇస్తోందని చంద్రబాబు ప్రకటించారని గుర్తుచేశారు. ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు కారుస్తూ టీడీపీ నేతలు దీక్షలు చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే ప్రత్యేక హోదాపై ఎన్నికలకు సిద్ధం కావాలని అనంతవెంకట్రామిరెడ్డి సవాల్ చేశారు. -
‘వైఎస్ పథకాలు దేశానికే స్ఫూర్తిదాయకం’
సాక్షి, అనంతపురం : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్ప దార్శనికుడని, ఆ మహానేత ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే స్ఫూర్తిదాయకమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. నేడు వైఎస్ జయంతి సందర్భంగా మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్సార్‌దేనని అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయితే మళ్లీ రాజన్నయుగం వస్తుందని చెప్పారు. వైఎస్సార్ ఆశయాలు సాధించేందుకు ప్రతిఒక్కరూ నడుం బిగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
బాబు ఓ రాజకీయ వ్యభిచారి
అనంతపురం జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ రాజకీయ వ్యభిచారి అని అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఉరవకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, హిందూపురం వైఎస్సార్సీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు శంకర్ నారాయణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బాబు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమని అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే వెంటనే రాజీనామా చేసి ఒంటరిగా పోటీ చేసి గెలవాలన్నారు. విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు..ఇప్పుడు మైనార్టీలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. శంకర్ నారాయణ మాట్లాడుతూ..అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. -
బాబు ఓ రాజకీయ వ్యభిచారి
-
‘రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యం’
సాక్షి, అనంతపురం: ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం హామీలు ఇచ్చారని మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఆయన సోమవారం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వంచనపై గర్జన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోదీ, చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారన్నారని.. ప్రత్యేక హోదాతో పాటు 7 వెనుకబడ్డ జిల్లాలను ఆదుకుంటామన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి తాండవిస్తోందన్నారు. అనంతలో అత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇచ్చి ఉంటే రాయలసీమ ఈ పాటికి అభివృద్ధి చెంది ఉండేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ఎంపీలు రాజీనామాలు చేశారని, ఆమరణ దీక్షలు చేశారన్నారు. హంద్రీనీవా ద్వారా 3 లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకు పనులు వేగంగా జరిగాయన్నాయన్నారు. ఈ పోరాటం అధికారం కోసం కాదని.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే వైఎస్సార్సీపీకి ముఖ్యమని వివరించారు. ప్రజల కోసం పోరాటాలు చేస్తే వారిని తెలుగుదేశం పార్టీ భౌతికంగా తుదిముట్టించిందని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, పోరాటాలు సాగుతూనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. -
చంద్రబాబు ఏపీ హక్కులను తాకట్టు పెట్టారు
-
2న వంచనపై గర్జన దీక్ష
సాక్షి, హైదరాబాద్/అనంతపురం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుకు నిరసనగా అనంతపురంలోని టవర్‌క్లాక్ సమీపంలో ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూలై 2వ తేదీన ‘వంచనపై గర్జన దీక్ష’ నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 30న జరగాల్సిన ఈ దీక్షను వచ్చే నెల రెండుకు వాయిదా వేసినట్లు ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు జరిగే ఈ దీక్షలో.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీ పదవులకు సైతం రాజీనామా చేసిన నేతలతో పాటు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలు పాల్గొంటారని తెలిపారు. దీక్షలో పాల్గొనే నేతలంతా ఆ రోజున తప్పనిసరిగా నల్లదుస్తులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల్ని టీడీపీ, బీజేపీ దగా చేశాయి.. రాష్ట్ర ప్రజల్ని టీడీపీ, బీజేపీ దగా చేశాయని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ, బీజేపీల తీరుకు నిరసనగా అనంతపురంలో చేపడుతున్న వంచనపై గర్జన దీక్షను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో మాలగుండ్ల శంకరనారాయణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీపై పోరాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారని.. మరి నాలుగేళ్లు కేంద్రంలో ఉండి ఏం చేశారని ఆయన నిలదీశారు. పోలవరం నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను కాజేశారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నా సీఎం ఎందుకు జవాబు చెప్పట్లేదని ప్రశ్నించారు. దివంగత వైఎస్సార్ వల్లే పోలవరాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ నిజాన్ని ఇప్పటికైనా బాబు ఒప్పుకున్నారని.. అవినీతిపై తాము చేసిన ఆరోపణలను కూడా భవిష్యత్‌లో ఒప్పుకోక తప్పదన్నారు. -
గర్జన సభ వాయిదా
సాక్షి, అనంతపురం : టీడీపీ చేస్తోన్న అన్యాయంపై వైఎస్సార్ సీపీ తలపెట్టిన గర్జన దీక్ష వాయిదా పడింది. ఈనెల 30న నిర్వహించదలిచిన ఈ సభ వచ్చే నెల 2కు వాయిదా పడినట్లు వైఎస్సార్సీపీ నేతలు ప్రకటించారు. జూలై 2న అనంతపురం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో టీడీపీ చేస్తున్న వంచనపై గర్జన దీక్షను చేయబోతున్నట్లు నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, శంకర్ నారాయణలు తెలిపారు. -
ఆటోవాలా.. అభిమానమిలా..
అనంతపురం: ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్ర సీఎం చంద్రబాబు ఇద్దరూ తోడుదొంగలేనని వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంటు అధ్యక్షుడు, అనంతపురం అసెంబ్లీ సమన్వయకర్త అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు ఏడాదికి రూ. 10 వేలు ఇస్తామంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం వైఎస్సార్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి టవర్‌క్లాక్ వరకు సాగిన ర్యాలీని అనంత వెంకట్రామిరెడ్డితో పాటు, ఆ పార్టీ అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య ప్రారంభించి, మాట్లాడారు. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలు, డీజిల్ బ్యారెల్ ధరలు తగ్గినా రాష్ట్రంలో వివిధ పన్నులు వేస్తూ ధరలు పెంచుతున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్వార్థ రాజకీయాలకు ఈ నాలుగేళ్ల కాలం కాస్తా గడిచిపోయిందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో, నిరుద్యోగ సమస్య తీర్చడంలో ఉభయ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. ఇన్నిరోజులు బీజేపీ, టీడీపీ సఖ్యతగా ఉంటూ ప్రజల్ని పీడించి దోపిడీ చేశాయన్నారు. కులమతాల మధ్య విద్వేషాలు రగిల్చి నాలుగేళ్ల తర్వాత తాము విడిపోయామంటూ ప్రజల్ని మరోమారు మోసగించేందుకు వస్తున్నారన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేసిన వీరిద్దరికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. డిగ్రీలు, ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు ఉద్యోగాలు లభ్యం కాక బతుకు తెరువు కోసం ఆటోలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారని గుర్తు చేశారు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్, రోడ్డు ట్యాక్స్ ఉంటేనే ఆటోలు నడుపుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లకు ఆర్ధిక భారం తగ్గించేందుకు అధికారంలోకి వస్తే ఏడాదికి రూ. 10వేలు ఇస్తామంటూ తమ అధినేత జగన్ ప్రకటించడం హర్షణీయమన్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల్లాంటి పథకాలతో అన్ని వర్గాలూ లబ్ధి పొందుతాయన్నారు. జగన్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగే పరుశురాం మాట్లాడుతూ... వైఎస్ హయాంలో సంక్షేమ పథకాల అమలులో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలూ లబ్ధి పొందాయని గుర్తు చేశారు. వైఎస్ జగన్ సీఎం అయితే తిరిగి అలాంటి పాలనే అందుతుందన్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైవీ శివారెడ్డి మాట్లాడుతూ ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రకటన చేసిన వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆటో యూనియన్ అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా, నాయకులు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, అనంత చంద్రారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు రిలాక్స్ నాగరాజు, అబూసాలెహ, శేఖర్‌బాబు, జయరాంనాయక్, డాక్టర్ మైనుద్దీన్, కార్పొరేటర్లు జానకి, గిరిజమ్మ, హిమబిందు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, రాష్ట్ర కార్యదర్శులు దేవి, కొండమ్మ, పార్వతి తదితరులు పాల్గొన్నారు. -
బాబు నాలుగేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారు
-
రాష్ట్రాన్ని బీజేపీ, టీడీపీ దగా చేశాయి
అనంతపురం: రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ దగా చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం పార్లమెంటు అధ్యక్షుడు, అనంతపురం అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈనెల 14, 15 తేదీల్లో చేపట్టనున్న సంఘీభావ పాదయాత్ర, 16న కలెక్టరేట్ ఎదుట చేపట్టబోయే ధర్నాను విజయవంతం చేయడంలో భాగంగా గురువారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ అనంతపురం నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ‘అనంత’ మాట్లాడుతూ, 14న ఉదయం 7 గంటలకు అనంతపురంలోని తాడిపత్రి బస్టాండు గాంధీ విగ్రహం వద్దకు చేరుకోవాలన్నారు. 8 గంటలకు సంఘీభావ పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. 15న కూడా పాదయాత్ర ఉంటుందని, 16న కలెక్టరేట్ ఎదుట ధర్నా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకం బీజేపీ సిద్ధాంతాలకు వైఎస్సార్సీపీ పూర్తిగా వ్యతిరేకమన్నారు. అలాంటి బీజేపీతో వైఎస్సార్ సీపీకి సంబంధం ఉందన్నట్లు చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారనీ..దీన్ని ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలను ప్రధాని మోదీ మోసం చేస్తుంటే.. నాలుగేళ్ల పాటు ఎలా భాగస్వామిగా కొనసాగారంటూ చంద్రబాబును ప్రశ్నించారు. కేవలం తన స్వార్థం, లబ్ధి కోసం కేంద్రంతో దోస్తీ చేశారని మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నక్కజిత్తుల చంద్రబాబు మరోమారు మోసగించేందుకు వస్తారని... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. కలిసికట్టుగా పని చేసి వచ్చే అన్ని ఎన్నికల్లోనూ జిల్లాలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. కార్యకర్తల కృషితోనే పార్టీ అధికారంలోకి వస్తుందని అలాంటి కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ఈ ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రధానకార్యదర్శి కిష్టప్ప మాట్లాడుతూ, పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూస్తుంటే టీడీపీపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మాజీ మేయర్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాగే పరుశురాం మాట్లాడుతూ, అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీని మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. అతినమ్మకం వద్దని కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రధానకార్యదర్శి మహాలక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ బలిజలకు పెద్దపీట వేస్తోందన్నారు. పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించడం పట్ల తమ కులం వారు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వైవీ శివారెడ్డి, మీసాల రంగన్న, నాయకులు బి.ప్రతాప్‌రెడ్డి, అనంత చంద్రారెడ్డి, జయరాంనాయక్, రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, ఎస్సీ సెల్, ట్రేడ్ యూనియన్, సాంస్కృతక విభాగం, గిరిజన విభాగం, రైతు విభాగం, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు పెన్నోబులేసు, మరువపల్లి ఆదినారాయణరెడ్డి, రిలాక్స్ నాగరాజు, సాకే రామకృష్ణ, బోయ నరేంద్రబాబు, మిద్దె భాస్కర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు చింతకుంట మధు, ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, కార్పొరేటర్లు గిరిజమ్మ, జానకి, బాలాంజనేయులు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి, అబూసాలెహ పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిచి తీరుతాం పార్టీ అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో అవతల ఎవరు ఉన్నా... ప్రజాభిమానం కలిగిన వైఎస్సార్ సీపీ గెలిచి తీరుతుందన్నారు. ఇపుడున్న ఎండలో నిమిషం కూడా నిలబడలేమని... అలాంటిది ప్రజల కోసం రోజుల తరబడి మండుటెండలో పాదయాత్ర చేయడం జగన్‌కే సాధ్యమైందన్నారు. -
రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం
కణేకల్లు: కరువు కోరల్లో చిక్కుకున్న అనంత రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అనంతపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వకర్త అనంత వెంకట్రామిరెడ్డి, పార్లమెంట్ సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య విమర్శించారు. ఆ పార్టీ కణేకల్లు మండల కన్వీనర్ ఆలూరు చిక్కణ్ణ, మాజీ ఎంపీపీ ఆలేరి రాజగోపాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు కళేకుర్తి జయరామిరెడ్డి, మారెంపల్లి మారెన్నలతో కలిసి సోమవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు సమస్యల పరిష్కారానికి జిల్లాలో ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎలాంటి కృషి చేయడం లేదని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారన్నారు. ఉపాధి నిధులను నీరు–చెట్టుకు మళ్లించి కూలీలకు పనులు లేకుండా చేశారన్నారు. యంత్రాలతో పనులు చేయించడం ద్వారా భారీగా ప్రజాధనం పక్కదారి పట్టించారన్నారు. నాలుగేళ్లుగా హెచ్చెల్సీ ఆయకట్టుకు సకాలంలో సాగునీటిని విడుదల చేయించలేకపోయారన్నారు. టీబీ డ్యామ్‌లో ఆశించిన మేర నీళ్లున్నా... ఆయకట్టుకు సాగునీటిని అందివ్వలేని అసమర్థ ప్రభుత్వం ఏపీలో తప్ప మరెక్కడా లేదని విమర్శించారు. అదను దాటాక నీరివ్వడంతో వరి పంట దిగుబడులు తగ్గి రైతులు నష్టపోయారని తెలిపారు. వచ్చిన అరకొర దిగుబడులకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక మరింత నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చిందన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలను సీఎం చంద్రబాబు దగా చేస్తున్నారన్నారు. డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు.. మాఫీ మాట మరచి పెట్టుబడి నిధి, పసుపు కుంకుమ పేరిట దశవారీగా రూ.10వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా ఇటీవల ఎక్కువగా మెటీరియల్ కంపోనెంట్ పనులు చేస్తుండటంతో కూలీలకు పనులు లేకుండా పోయాయన్నారు. దీంతో కూలీలు వలస బాట పట్టాల్సి వచ్చిందన్నారు. తనను చూసి కరువు పారిపోయిందని చెబుతున్న చంద్రబాబు అది నిజం కాదన్న వాస్తవం గ్రహించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు విక్రం సింహారెడ్డి, పి.సాదత్, టీఎస్ఎస్ రవూఫ్, నబీసా, లక్ష్మీకాంతరెడ్డి, నరేంద్రరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, జిలాన్, టైగర్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో నియామకాలు
హైదరాబాద్: వైఎస్సార్సీపీలో కొత్తగా నియామకాలు జరిగాయి. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనంతపురం అర్భన్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్తగా అనంతవెంకట్రామిరెడ్డిని, హిందూపురం పార్లమెంటు వైఎస్సార్ సీపీ సమన్వయకర్తగా నదీంఅహ్మద్ను, అలాగే అనంతపురం పార్లమెంటు వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా తలారి రంగయ్యను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. -
బీజేపీ, టీడీపీ నాటకాలు
అనంతపురం: ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాటకాలు ఆడుతూ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధనకు చేస్తున్న పోరాటంలో భాగంగా వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సోమవారం పార్లమెంటులో చర్చకు రానున్న నేపథ్యంలో ఎంపీలకు సంఘీభావంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ప్రజా సంకల్ప మానవహారం’ చేపట్టనున్నట్లు తెలిపారు. హోదా కోసం పోరాడుతున్న పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, విద్యార్థులు, యువజన సంఘాలు, నిరుద్యోగులు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకహోదా అంశాన్ని నాలుగేళ్లుగా కాలయాపన చేస్తూ వచ్చిన బీజేపీ, టీడీపీలు ఈ రోజు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా టీడీపీ చేసిన తప్పిదాలను ఇతరులపై నెట్టేందుకు కుటిలయత్నం చేస్తోందన్నారు. వైఎస్సార్సీపీ పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్ధతిస్తామని చెప్పిన చంద్రబాబు.. ఉదయానికే మాట మార్చి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఉగాది శుభాకాంక్షలు జిల్లా ప్రజలకు అనంత వెంకటరామిరెడ్డి విళంబి నామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. -
చంద్రబాబు ఒక నియంత.. టీడీపీ నేతలు దద్దమ్మలు
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నియంతలా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. విభజనతో నష్టపోయిన రాయలసీమకు న్యాయం కోసం పోరాడుతున్న న్యాయవాదులను, వారి ఉద్యమాలను అణచడానికి ప్రయత్నిస్తోందని మండి పడ్డారు. రాయలసీమకు చెందిన తెలుగుదేశం ప్రజాపతినిధులు దద్దమ్మలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాయలసీమకు అన్యాయం జరుగుతున్నా తెలుగుదేశం నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని న్యాయవాద సంఘం నేతలు మండిపడ్డారు. చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేస్తున్నా, పట్టించుకోవట్లేదని విమర్శించారు. దీనికి త్వరలోనే తగిన ఫలితం అనుభవిస్తారని న్యాయవాద సంఘం నేతలు హరినాథరరెడ్డి, రామ్‌కుమార్, రాజారెడ్డి అన్నారు బాబు రోజుకో మాట మాట్లాడుతున్నారు : ఆంధ్రపద్రేశ్ ప్రత్యేక హోదాపై చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత సీ రామచంద్రయ్య విమర్శించారు. ఏయే రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉందో కూడ సీఎంకు తెలియకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం అని అన్నారు. దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా అమలౌతోందని తెలియచేశారు. ఏరాష్ట్రంలోనైనా హోదాను చట్టంలో పెట్టినట్లు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. -
తోడు దొంగల కొత్త నాటకం
అనంతపురం: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రజలంతా గగ్గోలు పెడుతుంటే వారి దృష్టి మళ్లించేందుకే టీడీపీ, బీజేపీ నేతలు తోడు దొంగల్లా పరస్పర విమర్శలతో కొత్త నాటకానికి తెర తీశారని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో లాయర్లు చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు అవినీతిని బీజేపీ ఎమ్మెల్సీ కొత్తగా చెప్పాల్సిందేమీ లేదని, రెండెకరాల నుంచి లక్షల కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు తెలుసన్నారు. తామెప్పుడూ ప్రజల పక్షాన ఉంటామని, అధికారం కోసం మీలా కేంద్రానికి దాసోహం కామని టీడీపీ నాయకులపై మండిపడ్డారు. నాలుగేళ్లుగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. నిధుల కేటాయింపు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, రైల్వేజోన్, రాజధాని నిర్మాణం, పోలవరం, దుగరాజపట్నం పోర్టు, కడప ఉక్కు పరిశ్రమ ఇలా అన్నింటా మోసపోతున్నామన్నారు. అసెంబ్లీలో తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుమార్లు ప్రశ్నించారని గుర్తు చేశారు. రాజకీయంగా విభేదాలున్నా ప్రత్యేకహోదా విషయంలో కలిసికట్టుగా ముందుకెళ్దామని చెబితే తమను హేళన చేశారన్నారు. టీడీపీ హంగామాప్రచారానికే.. ‘ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. అభివృద్ధి ఎలా చేయాలో తెలుసు. నిధులు ఎలా తెచ్చుకోవాలో తెలుసు’ అని చెప్పిన సీఎం చంద్రబాబుకు ఈ రోజు అసలు విషయం తెలుస్తోందా? అని మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామన్న సీఎం ఈ రోజు రాష్ట్రంలో ఏమి చేస్తున్నారో.. అభివృద్ధి ఎక్కడ చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు పట్టుకుని టీడీపీ ఎంపీలు చేసిన హంగామా కేవలం ప్రచారానికే అనేది ప్రజలకు అర్థమైందన్నారు. దమ్ముంటే రాజీనామాలు చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న ఆందోళనలో పాల్గొనాలని సవాల్ విసిరారు. బీజేపీ ఎమ్మెల్సీ వీర్రాజు వైఎస్సార్సీపీ కోవర్టు అని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ ఆయన మా పార్టీ కోవర్టయితే చంద్రబాబు బీజేపీ కోవర్టా? అని ఎద్దేవా చేశారు. బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఈనెల 8న వామపక్షాలు చేస్తున్న బంద్‌లో వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ మేయర్ రాగే పరుశురాం, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైవీ శివారెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, గోగుల పుల్లయ్య, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘అనంతను కరివేపాకులా వాడుకుంటున్నారు’
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరివేపాకులా వాడుకుంటున్నారని మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. రేపు (గురువారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం పర్యటన సందర్భంగా మాజీ ఎంపీ, వైఎస్ఆర్ సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. గత నాలుగేళ్లుగా కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాకు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని.. వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. అనంతపురం టీడీపీ నేతలకు చీము నెత్తురు, సిగ్గూశరం ఉంటే చంద్రబాబు ను నిలదీయాలని డిమాండ్ చేశారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన అనంత వెంకట్రామిరెడ్డి పదవులను కరివేపాకులా చూస్తున్న వారంతా రాజీనామా చేస్తే బాగుంటుందన్నారు. అక్రమ సంపాదన, దౌర్జన్యాలను పక్కనపెట్టి సమస్యలు తీర్చేందుకు ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందని అన్నారు. ఏపీ సర్కార్ ఆర్భాటంగా నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం ఓ బోగస్ అని, అర్జీలు తీసుకోవడం మినహా సాధించింది శూన్యమని ఆయన వ్యాఖ్యానించారు. జన్మభూమి టీడీపీ ప్రచార కార్యక్రమంలా సాగుతోందని, ఏపీలో అధికారులు నరకయాతన అనుభవిస్తున్నారని అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. హెరిటేజ్ కంపెనీకి లబ్ది చేకూర్చేందుకే చంద్రబాబు పాడి పరిశ్రమను నీరుగారుస్తున్నారన్నారు. -
జేసీ బ్రదర్స్ దౌర్జన్యాలపై అఖిలపక్ష నేతల ఆగ్రహం
సాక్షి, అనంతపురం : జిల్లాలోని ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జేసీ బ్రదర్స్ దౌర్జన్యాలను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఎస్పీ కార్యాలయంలోకి చొచ్చుకు పోయేందుకు ప్రయత్రించిన అఖిలపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రిలో శాంతిభద్రతలు క్షీణించాయని, పోలీసులను ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించినా చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యమని అఖిల పక్ష నేతలు మండిపడ్డారు. అంతేకాదు సాక్షి విలేకరిపై జేసీ వర్గీయులు దాడికి పాల్పడ్డారని, జేసి బ్రదర్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అఖిల పక్ష నేతలు ప్రెస్ క్లబ్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేశారు. ఇందులో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి వైఎస్ఆర్సీపీ సమన్వయ కర్త పెద్దారెడ్డి, హిందూపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ ఆధ్యక్షులు శంకర్ నారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ పాల్గొన్నారు. -
హత్యలు చేసేందుకూ వెనుకాడరు
-
'వైఎస్ఆర్ ఆశయాలకు చంద్రబాబు సర్కార్ తూట్లు'
-
'వైఎస్ఆర్ ఆశయాలకు చంద్రబాబు సర్కార్ తూట్లు'
సాక్షి, అనంతపురం: జిల్లాలో కరువు నివారణకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో శ్రమించారని, ఆయన హయాంలో అనంతపురం జిల్లాకు ఎంతో మేలు జరిగిందని వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్ట్ పనులను యుద్ధ ప్రాతిపదికన వైఎస్ఆర్ పూర్తి చేయగా, చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ఆర్ ఆశయాలకు తూట్లు పొడుస్తుందని ఆయన మండిపడ్డారు. జిల్లాలో 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, కేవలం 45 మందికే చంద్రబాబు సర్కార్ పరిహారం ఇవ్వడం దుర్మార్గమన్నారు. 'వైఎస్ఆర్ హయాంలో జిల్లాలో ఎంతో అభివృద్ధి జరిగింది. రైతులు ఎంతో ధీమాగా ఉండేవారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు జిల్లాలో లేవు. చంద్రబాబు సీఎం అయ్యాక రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తున్నా రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు. ఎన్నికలకు ముందు రుణమాఫీ అన్నారు. ఆ హామీకి నీళ్లొదిలారు. 4 లక్షల మంది వ్యవసాయ కూలీలు జిల్లా నుంచి వలస వెళ్లినా చంద్రబాబు సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే వలసలు నేటికీ కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర రైతులకు భరోసా కల్పిస్తోంది. మరోసారి జిల్లా రైతులకు మంచి రోజులు రావాలంటే వైఎస్ జగన్ అధికారంలోకి రావాలని' అనంత వెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. -
మంత్రి పరిటాల సునీత హస్తం
మంత్రి పరిటాల సునీత హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. శుక్రవారం ఆ పార్టీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి తదితరులు ఎస్పీని కలిశారు. అనంతపురం సెంట్రల్: ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయ హత్యలను ప్రేరేపిస్తున్నారని వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయయాదవ్పై హత్యకు కుట్ర జరిగిన విషయంపై ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ను శుక్రవారం క్యాంపు కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. బాధితుడు ధనుంజయయాదవ్కు రక్షణ కల్పించాలని అనంత వెంకట్రామిరెడ్డితో పాటు రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి తదితరులు ఎస్పీని కోరారు. అనంతరం మాజీ ఎంపీ అనంత మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులే లక్ష్యంగా అధికారపార్టీ నేతలు హత్యారాజకీయాలు ప్రేరేపిస్తున్నారన్నారు. ఈ సారి కూడా ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే పథకం రచిస్తున్నారన్నారు. గత ఎన్నికల్లోనూ ఇలాంటి కుట్ర రాజకీయాలు చేశారని గుర్తు చేశారు. అధికారం చేపట్టినప్పటి నుంచి రాక్షసత్వం టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులను పొట్టన పెట్టుకున్నట్లు తెలిపారు. పెద్దవడుగూరు సింగిల్‌విండో అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, ప్రసన్నాయపల్లి ప్రసాద్‌రెడ్డి తదితరులను హత్య చేయించారని గుర్తు చేశారు. పేరూరులో సమావేశమైన వైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేయడమే కాకుండా కౌంటర్ కేసులు నమోదు చేశారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులను భయబ్రాంతులకు గురిచేయడానికి దౌర్జన్యాలకు, దారుణాలకు తెగబడుతున్నారన్నారు. రాప్తాడు సమన్వయకర్త ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. మంత్రి పరిటాల సునీత హత్యారాజకీయాలను ప్రేరేపిస్తున్నారన్నారు. మంత్రి స్థానంలో ఉంటూ ఇలాంటి చర్యలను ప్రోత్సహించడం బాధాకరమన్నారు. సీనియర్ నాయకులను అంతమొందిస్తే తప్పా ఎన్నికల్లో గెలవలేమనే ఉద్దేశంతో దారుణాలకు తెగబడుతున్నారని తెలిపారు. మనోహర్‌నాయుడు, శీన అనే వ్యక్తులు కుట్ర చేస్తున్నారని, వీరి వెనుక స్థానిక ప్రజాప్రతినిధి హస్తముందని ఆరోపించారు. దీనిపై పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయయాదవ్కు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్నగర అధ్యక్షుడు సోమశేఖరరెడ్డి, అధికార ప్రతినిధులు చింతకుంట మధు, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షుడు పెన్నోబిలేసు, నాయకులు అమర్నాథ్రెడ్డి, యూపీనాగిరెడ్డి, రఘునాథరెడ్డి, వరప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'ప్రజల కష్టాలను వాళ్లు ఏనాడో మర్చిపోయారు'
-
‘చంద్రబాబుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది’
-
‘చంద్రబాబుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది’
నంద్యాల: ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ అభివృద్ధి పేరుతో జీవోలు విడుదల చేసి చంద్రబాబు ప్రజలకు గాలం వేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ అనంత వెంట్రామిరెడ్డి అన్నారు. కడప జిల్లాలో శాసనమండలి ఎన్నికల సందర్భంగా రూ. 300 కోట్ల జీవోలు విడుదల చేశారని గుర్తు చేశారు. నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరు నెలలు గడుస్తున్నా.. ఆ అభివృద్ధికి అతిగతి లేకుండా పోయిందన్నారు. తెలుగుదేశం పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ వస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, చంద్రబాబుకు భయం మొదలైందన్నారు. అడుగడుగునా టీడీపీ నేతలు సభకు ప్రజలను రానివ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నా.. ప్రజలు వస్తున్నారంటే వైఎస్ జగన్‌కు ఉన్న ఆదరణ ఏంటో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలన్నారు. -
రాయలసీమ అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది
-
ఇది ప్రతిపక్షం విజయం: అనంత వెంకటరామిరెడ్డి
అనంతపురం: ప్రతిపక్ష, విపక్ష పార్టీల ఉద్యమం ఫలితంగానే వాతావరణ బీమా, ఇన్పుట్ సబ్సిడీ వేర్వేరుగా అందించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, అంతే తప్ప ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం ప్రేమ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఇన్పుట్ సబ్సిడీపై సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 8.50 లక్షల హెక్టార్లకు రైతులతోపాటు ప్రభుత్వాలు రూ.280 కోట్లు ప్రీమియం చెల్లిస్తే 6 లక్షల హెక్టార్లకు రూ.419 కోట్లు బీమా పరిహారం అందించడం దారుణమన్నారు. మిగతా 2.50 లక్షల హెక్టార్లకు బీమా ప్రీమియం చెల్లించినా బీమా కంపెనీలు పరిహారం వర్తింపజేయకుండా రైతులను మోసం చేస్తున్నా పట్టించుకోరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరవు రైతులపై చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం ప్రేమ, కరుణ ఉన్నా రూ.1451 కోట్లను ప్రకటించి గొప్పలు చెప్పుకోవడం కాదు.. న్యాయబద్ధగా జిల్లా రైతులకు రావాల్సిన సొమ్ము (ఇన్పుట్, బీమా) రూ.4 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎంకు చెందిన మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ ఏటా లక్షల్లో పెట్టుబడి పెట్టి రైతులు పంటలు సాగు చేసి తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రాయితీలు అందిస్తున్నామని ప్రకటించుకోవడమే తప్ప వాటిని రైతులకు ఇవ్వడంలేదన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ జూన్ 9న ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందిస్తున్నట్లు సీఎం ప్రకటించారని, 14లోపు రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారని చెప్పారు. రైతులకు సలహాలు సూచనలు అందించేందుకు కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని అసత్యాలు ప్రచారం చేస్తూ రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అప్పటి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగానే పెట్టుబడి రాయితీ ఇస్తున్నారని, రైతులకు డబుల్ ధమాకా అంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. -
దోచుకోవడమే టీడీపీ ధ్యేయం
∙ కళ్యాణదుర్గం ప్లీనరీలో ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ నేతలు కళ్యాణదుర్గం : టీడీపీ పాలన దోచుకోవడమే ధ్యేయంగా సాగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం నియోజకవర్గ ప్లీనరీ సమావేశాన్ని సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ అధ్యక్షతన నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా హాజరైన అనంత మాట్లాడుతూ ప్రజలు టీడీపీ నాయకులను నమ్మి ఓట్లేస్తే వారు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతి పని లోనూ దోచుకోవడానికి చూస్తున్నారని మండిపడ్డారు. కళ్యాణదుర్గం అభివృద్ధి చెందిందంటే దివంగత లక్ష్మీదేవమ్మ, అనంత వెంకటరెడ్డిల హయాంలోనేనని, ప్రస్తుతం వైఎస్సార్‌సీపీతోనే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆ నమ్మకాన్ని ప్రజలకు కలిగించేలా ధైర్యంగా ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచిం చారు. పరిటాల రవి మంత్రిగా ఉంటూ శాసిస్తున్న సమయంలోనూ ఎదురొడ్డి పోరాడిన నాయకులు, కార్యకర్తలు ఇక్కడ ఎందరో ఉన్నారన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన టీడీపీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆయన కుమారుల చేతుల్లో బందీ అయ్యారని, వారు ఎమ్మెల్యే పీఠాన్ని అవినీతి పీఠంగా మార్చుకున్నారని విమర్శించారు. అందరం ఐకమత్యంతో పోరాడి ఇక్కడ కూడా వైఎస్సార్సీపీ జెండా ఎగురవేద్దామన్నారు. ప్లీనరీ పరిశీలకుడిగా హాజరైన ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పాలు తాగే మనువడికి అవినీతి పాఠాలు నేర్పిన ఘనుడు సీఎం చంద్రబాబు అని విమర్శించారు. అక్షరా భ్యాసం సమయంలో అ – అంటే అమరా వతి, ఆ – అంటే ఆదాయమని, అమరావతిలో ఆదాయం ఉందంటూ మనువడికి విద్య నేర్పిన చరిత్ర సీఎంకే దక్కిందన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమాధానం చెప్పాలంటే చంద్రబాబు వణికిపోతున్నారన్నారు. రాజన్న రా జ్యం కోసం ప్రజలు జగన్‌ను ముఖ్యమంత్రిని చే యాలని కోరుకుంటున్నారన్నారు. పరిస్థితి వైఎ స్సార్‌సీపీకి అనుకూలంగా ఉందని, అందరూ ఐకమత్యంతో టీడీపీ అరాచకాలు, మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఒకే ఒక్క కేసులో ఇరుక్కుపోయిన చంద్రబాబు రాత్రికి రా త్రే విజయవాడకు మకాం మార్చారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడకుండా ప్రత్యేక హోదా కోసం, ప్రజా సమస్యలపైనా పోరాడుతూనే ఉన్నారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు మూడేళ్ల పాలనలో అభివృద్ధి గుండుసున్నా అన్నారు. జన్మభూమి కమిటీల నుంచి చంద్రబాబు వరకు అవినీతిలో కూరుకుపోయారన్నారు. పట్టిసీమలో 600 కోట్ల అవినీతి జరిగిందని కాగ్ అక్షింతలు వేసినా వారికి సిగ్గు రాలేదన్నారు. జిల్లాలో టీడీపీని ఆదరించినా ప్రజాప్రతినిధులు చేసిందేమీ లేదన్నారు. హంద్రీ నీవా నీరు రావాలంటే జగన్ సీఎం కావాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మేలు జరిగేందు కోసం వైఎస్సార్సీపీని గెలిపించి రాజన్న రాజ్యాన్ని తీసుకొద్దామన్నారు. ప్రజా సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఎంతైనా ఉందన్నారు. వైఎస్సార్సీపీ మడకశిర సమన్వయకర్త తిప్పేస్వామి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం తథ్యమన్నారు. దళితులంతా టీడీపీ మోసాలను గ్రహించి వైఎస్సార్సీపీకి మద్దతు ఇవ్వాలన్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ ‘ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో కళ్యాణదుర్గంకు వచ్చా.. అందులో భాగంగానే గడపగడపకూ తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకున్నా.. ఒక్క అవకాశం ఇవ్వండి’ అని విజ్ఞప్తి చేశారు. ఉచిత కంటి ఆపరేషన్లు చేయిస్తామని, వికలాంగులకు కృత్రిమ అవయవాలు అందజేస్తామని చెప్పారు. కళ్యాణదుర్గం చెరువులకు నీరు నింపేదాక పోరాటాలు చేస్తామన్నారను. మహిళలకు ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందంటూ.. ఎమ్మెల్యే రోజా, తహసీల్దార్ వనజాక్షి ఉదంతాలను ప్రస్తావించారు. -
‘డబ్బులు వసూలు చేస్తున్న జేసీ బ్రదర్స్’
అనంతపురం: తాడిపత్రిలో అప్రజాస్వామిక పాలక నడుస్తోందని వైఎస్సార్ సీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. వైఎస్సార్ సీపీ తాడిపత్రి నియోజకవర్గ ప్లీనరీలో మాట్లాడుతూ... జేసీ బ్రదర్స్ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారారని, పరిశ్రమల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మెప్పు కోసమే జగన్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తాడిపత్రిలో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. జేసీ బ్రదర్స్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. -
గార్లదిన్నెలో బహిరంగ సభ జరుపుతాం
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత శింగనమల : వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన ‘మేలుకొలుపు’ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా గార్లదిన్నెలో బహిరంగసభ జరిపి తీరుతామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ‘మేలు కొలుపు’ యాత్రలో భాగంగా గార్లదిన్నె మండలం కల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరువు పరిస్థితుల కారణంగా జిల్లాలో 4 లక్షల మంది పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారన్నారు. జిల్లాలో 267 మంది రైతులు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నారన్నారు. సాగు, తాగు నీరు అందడం లేదని, పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉందని పాదయాత్ర ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపించాలని జొన్నలగడ్డ పద్మావతి ‘మేలుకొలుపు’ కార్యక్రమ చేపట్టారన్నారు. అయితే ప్రభుత్వ విప్ ప్రభుత్వ పెద్దలతో చర్చించి పోలీసుల ద్వారా పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ధర్మవరంలో ప్లెక్సీల కోసం మంత్రి పరిటాల సునీత, స్థానిక ఎమ్మెల్యే అనుచరులు కొట్టుకుంటే పోలీసులు దగ్గర ఉండి బహిరంగ సభ జరిపించలేదా..? అనంతపురం ఎమ్మెల్యే, ఎంపీ ఘర్షణ పడితే ప్రత్యేకంగా వారికి సభలు పెట్టించలేదా..? నవనిర్మాణ దీక్షల పేరుతో అనంతపురంలోని టావర్క్లాక్ వద్ద ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నా సభలు పెట్టించారన్నారు. పోలీసులు ప్రజాసామ్యబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ‘మేలుకొలుపు’ పాదయాత్రను అడ్డుకుంటే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో పాదయాత్ర చేపడుతామని రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి, సీనియర్ నాయకులు అమరేంద్రనాథ్‌రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు పెన్నోబులేసు, ఎంపీటీసీ సభ్యులు జగ్గాల రవి, వీరాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు. -
‘నిరాయుధులను చేసి హత్య చేయిస్తున్నారు’
-
‘నిరాయుధులను చేసి హత్య చేయిస్తున్నారు’
కర్నూలు/హైదరాబాద్: చంద్రబాబు డైరెక్షన్లోనే వైఎస్సార్ సీపీ నేతల హత్యలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్ సీపీ నాయకుల గన్మెన్లను తొలగిస్తున్నారని అన్నారు. నిరాయుధులను చేసి తర్వాత వైఎస్సార్ సీపీ నేతలను హత్య చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నారాయణ రెడ్డికి ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేక పొట్టన పెట్టుకున్నారని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. హత్యా రాజకీయాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. -
‘ఏపీ రైతులకు భిక్షాటన పరిస్థితి బాధాకరం’
-
‘ఏపీ రైతులకు భిక్షాటన పరిస్థితి బాధాకరం’
అనంతపురం: రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 172మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 4లక్షలమంది రైతులు, కూలీలు వలస వెళ్లినా ప్రభుత్వం పట్టించుకోలేదని, కేరళలో రైతులు భిక్షాటన చేయడం ఏపీకి అవమానకరం అని ఆందోళన వ్యక్తం చేశారు. అనంత రైతులు రూ.4వేల కోట్ల విలువైన పంట నష్టపోతే కేవలం రూ.450 కోట్ల ఇన్సురెన్స్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బజాజ్ ఇన్సూరెన్స్ సంస్థతో ప్రభుత్వం కుమ్మక్కైందని మండిపడ్డారు. -
రాష్ట్రంలో నియంత పాలన
బాబు-చినబాబుకు కమీషన్లపైనే మోజు కూలీలను కాదని తెలుగు తమ్ముళ్లకు ‘ఉపాధి’ రైతులను ఆదుకోవడంలోనూ ఘోరంగా విఫలం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత ధ్వజం కణేకల్లు : రైతు, పేదల సంక్షేమాన్ని పక్కనపెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో నియంతన పాలన సాగిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. తండ్రీకొడుకులు (చంద్రబాబు- లోకేష్) ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల్లో కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. మండలకేంద్రమైన కణేకల్లులో టీడీపీ నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనంత ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వరుస కరువులతో జిల్లాలోని రైతులు, కూలీలు ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీలు దుర్భర జీవనం కొనసాగిస్తున్నారన్నారు. కూలీలకు ‘ఉపాధి’ కల్పించకుండా.. జేసీబీలతో పనులు చేయించి తెలుగు తమ్ముళ్ల జేబులు నింపుతున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అన్నదాతలు వేరుశనగ, శనగ, పత్తి, వరి తదితర పంటలు కోల్పోయి పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతే ప్రభుత్వం ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తనయుడు లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలవలేడని భావించిన చంద్రబాబు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. జనరంజక పాలన రావాలంటే అది వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. జగన్‌పై విశ్వాసం ఉంచి వైఎస్సార్సీపీలో చేరుతున్న నాయకులు, కార్యకర్తలకు తమ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి మాట్లాడుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదువులిచ్చి ప్రజాస్వామాన్ని ఖూనీ చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్రమైనార్టీ సెల్ కన్వీనర్ నదీం అహమ్మద్ మాట్లాడుతూ మైనార్టీ మంత్రి లేకుండా ఉన్న ప్రభుత్వం టీడీపీ అని చెప్పారు. తెలుగుజాతి ఆత్మగౌరం పెంచేది, తెలుగు ప్రజలు తల ఎత్తుకునేలా చేసే పార్టీ వైఎస్సార్‌సీపీయేనన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మాధవరెడ్డి, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భోజరాజనాయక్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బీటీపీ గోవిందు, పార్టీ మండల కన్వీనర్ ఆలూరు చిక్కణ్ణ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పాటిల్ నాగిరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు ఉషారాణి, పీఏసీఎస్ అధ్యక్షులు మారెంపల్లి మారెన్న, రాయదుర్గం పట్టణ అధ్యక్షులు నబీష్, డి.హిరేహళ్, గుమ్మఘట్ట మండల కన్వీనర్లు వన్నూరుస్వామి, కాంతారెడ్డి, సేవాదళ్ కన్వీనర్ కె.విక్రంసింహారెడ్డి, నాయకులు టి.కేశవరెడ్డి, జీఎంఎస్ సర్మస్, చంద్రమోహన్‌రెడ్డి, టీఎస్ఎస్ రవూఫ్, మక్బుల్, చిన్న సర్మస్ తదితరుల పాల్గొన్నారు. మంత్రి ఇలాకాలో టీడీపీకి ఎదురుదెబ్బ కణేకల్లు : రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ నుంచి 300 మంది వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మైనార్టీసెల్ రాష్ట్ర కన్వీనర్ నదీం అహమ్మద్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్‌రెడ్డిల సమక్షంలో టీడీపీ నాయకులు, కణేకల్లు మత్స్యకార్మికుల సంఘం మాజీ అధ్యక్షులు పెద్దదేవర నబీసాబ్తోపాటు సయ్యద్, ఉలుకు ఫకృద్దీన్, రహముతుల్లా, బెస్త నాగరాజు, ఫకృద్దీన్, మల్లిఖార్జున, జావేద్, చోట హుసెన్, ఇమాం, వన్నూరా, జాకీర్, నబీ తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. వీరి రాకతో దాదాపు కణేకల్లులోని మత్స్యకార్మికులంతా సుమారు 90శాతం వైఎస్సార్సీపీలో వచ్చినట్లైంది. ప్రజల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని, అందుకే అధికార తెలుగుదేశం పార్టీ వీడి.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్సీపీలో చేరామని పెద్దదేవర నబీసాబ్ పేర్కొన్నారు. -
ఒత్తిడి చేసి కమిషనర్‌తో చెప్పించారు
– నిజాయితీ అధికారిగా పేరున్న బాలసుబ్రహ్మణ్యం నిజాలు బయటకు చెప్పాలి – వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి అనంతపురం : తనపై దాడికి దిగిన అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే విషయంలో ‘సమస్య సద్దుమణిగిందంటూ’ రవాణా కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం చెప్పడం వెనుక ప్రభుత్వ ఒత్తిడే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కమిషనర్ బాలసుబ్రమణ్యంకు నిజాయితీ అధికారిగా పేరుందని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వాల్లోనూ ఆయన మంచి పేరు తెచ్చుకున్నారని, ఎప్పుడూ ఎలాంటి ఆరోపణలు లేవని తెలిపారు. అలాంటి వ్యక్తిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమా తాము ప్రజాప్రతినిధులమని కూడా మరచి దూషణలకు, దాడికి దిగారని గుర్తు చేశారు. తాను నోరు తెరిస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని కమిషనర్ అనడంతో ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు ప్రభుత్వం ఎంపీ, ఎమ్మెల్యేలతో ఆయనకు క్షమాపణ చెప్పించిందని పేర్కొన్నారు. ‘ప్రభుత్వ ఒత్తిడితోనే సమస్య సద్దుమణిగిందంటూ కమిషనర్ చెప్పారు. నిజాయితీ అధికారిగా పేరున్న ఆయన వాస్తవాలు బయటకు చెబుతారని అందరూ భావించారు. అయితే వాస్తవాలను ఆయన దాస్తుండటంతో నిజాయితీని శంకించాల్సి వస్తోంది. అసలు బస్సుల మాఫియా ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్రంలో ఇద్దరు,ముగ్గురు కలిసి ఈ మాఫియాను నడుపుతున్నారు. ఈ మాఫియా గురించి గతంలోనే తాము చెప్పినా ప్రభుత్వం పట్టించుకోకపోగా తేలిగ్గా తీసుకుంద’ని విమర్శించారు. కేశినేని నాని బస్సు ఆపరేటర్ కాబట్టి కమిషనర్ వద్దకు వెళ్లారని, అదే సమయంలో బొండా ఉమా ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ బరి తెగింపునకు ఈ ఘటన పరాకాష్టగా నిలుస్తోందని ధ్వజమెత్తారు. -
'చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పారు'
అనంతపురం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పారని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఎన్నికల హామీలను విస్మరించిన చంద్రబాబుకు వ్యతిరేకంగా జనం తీర్పు చెప్పారని ఎన్నికల ఫలితాలను ఆయన విశ్లేషించారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిధ్దంకావాలని వెంకట్రామిరెడ్డి సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఎన్నికలు జరిగినా ఇవే ఫలితాలు వస్తాయని, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించడం ఖాయం అని ఎమ్మెల్సీగా వెన్నపూస గోపాల్‌రెడ్డి విజయం సందర్భంగా వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. -
రాజీనామా చెయ్.. తేల్చుకుందాం
జేసీపీఆర్‌పై మాజీ ఎంపీ అనంత ఆగ్రహం ‘రా..తేల్చుకుందాం’ అంటున్నారు... వీుకంత మోజు ఉంటే రాజీనామా చేయండి. ప్రజల్లోకి పోదాం.. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. టీడీపీ నేతలంతా రాజీనామా చేస్తారా...? లేదంటే నువ్వు,. నీ సోదరుడు రాజీనామా చేయండి.. అప్పుడు తేల్చుకుందాం. ► రాజీనామాలు చేసి రండి ► జేసీ ప్రభాకర్ వ్యాఖ్యలకు సభ్య సమాజం తలదించుకుంటోంది ► తాడిపత్రిలోని పరిశ్రమలన్నీ జేసీకి కప్పం కట్టాల్సిందే ► జేసీ సోదరులపై మాజీ ఎంపీ అనంత ఫైర్ అనంతపురం : రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన సతీమణి, వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పట్ల తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు, వాడిన పదజాలం సభ్యసమాజంలో అందరూ తలదించుకునేలా ఉందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరావిురెడ్డి విమర్శించారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ కుటుంబం పై జేసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 20–25 ఏళ్లుగా జేసీని చూస్తున్నామనీ, అందరినీ బెదిరించి లొంగదీసుకుందామనే ధోరణిలోనే ఆయన రాజకీయ చరిత్ర ఉందన్నారు. ప్రభాకర్‌రెడ్డి మాటలు వింటుంటే ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అనే అనుమానాలు అందరిలో మెదలవుతున్నాయన్నారు. కేవలం ‘సాక్షి’ పత్రికనో, వైఎస్ జగన్నో కాదు వారి దురాగతాలను ఏ పత్రిక, రాజకీయ పార్టీ ప్రశ్నించినా వారిపట్ల ఇదే రకంగా వ్యవహరిస్తారని ధ్వజమెత్తారు. నాయకులను ఎస్సీ ఎస్టీ కేసులంటూ కోర్టుకు ఈడ్చి బ్లాక్మెయిల్ చేస్తారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తాడిపత్రిలో ఆటవిక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారన్నారు. ప్రజల హృదయాలను గెలుచుకున్న మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానాన్ని కూడా అపహాస్యం చేసేలా మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. చివరికి తాడిపత్రి నియోజకవర్గ ఆడబిడ్డ అనేది కూడా మరచిపోయి విజయమ్మపై కూడా విచక్షణ, జ్ఞానం లేకుండా మాట్లాడారన్నారు. ఏం మాట్లాడినా ‘రా..తేల్చుకుందాం’ అంటున్నారనీ, ఏం తేల్చుకుంటాం కుస్తీలు పట్టేందుకు ఏమైనా రౌడీలా అని ప్రశ్నించారు. మీకంత మోజు ఉంటే రాజీనామా చేయండి. ప్రజా క్షేత్రంలోకి వెళ్లి తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తమ మాట వినలేదని గతంలో ఆర్టీఏ అధికారులు, పోలీసులను అనేకమార్లు బెదించారని విమర్శించారు. అందరూ భయపడితే ఎంతవరకైనా బెదిరిస్తారని, జరక్కపోతే తోక ఎలా ముడుచుకుంటాడో కూడా తెలుసని చెప్పారు. ముఖ్యమంత్రులను, అధికారంలో ఉన్నవారిని పొగిడి ఎలా పనులు చేసుకుంటాడో ప్రజలందరికీ తెలుసన్నారు. చెన్నారెడ్డిని మొదలుకుని జనార్ధన్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, మధ్యలో టీడీపీ తప్ప తర్వాత వచ్చిన వైఎస్, ఆయన తర్వాత వచ్చిన సీఎంలు, ప్రస్తుత ముఖ్యమంత్రి చందబాబును తమ దందాను జరుపుకునేందుకు ఎలా పొగిడారో తెలుసన్నారు. జరక్కపోతే మాత్రం 1994లో జిల్లాలో రాజకీయాలనే ధారాదత్తం చేసి బెంగళూరు, హైదరాబాద్‌కు పారిపోయిన విషయమూ తెలుసన్నారు. అలాంటి వారా జగన్ గురించి మాట్లాడేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అవసరాలు జేసీ సోదరులకు ఉన్నాయి, వీరి అవసరాలు ముఖ్యమంత్రికి ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ ఒత్తిడితో వారు చెప్పింది చేయకపోతే బదిలీలు చేస్తారనే భయం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో ఉందన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎదురుదాడికి దిగుతున్నారన్నారు. జిల్లాలో అదృష్టమో దురదృష్టమో తెలీదుకాని తాడిపత్రిలో చాలా పరిశ్రమలు ఉన్నాయన్నారు. అందరూ వీరికి కప్పం కట్టాలి్సందేనన్నారు. ఇవన్నీ చంద్రబాబుకు తెలీదా? అని ప్రశ్నించారు. సమావేశంలో కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, పార్టీ నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు రిలాక్స్ నాగరాజు, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు. -
'బెదిరించడం జేసీ బ్రదర్స్‌కు అలవాటు'
అనంతపురం : జేసీ బ్రదర్స్‌పై మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ప్రశ్నించే వారిని బెదిరించడం జేసీ బ్రదర్స్‌కు అలవాటు అని ధ్వజమెత్తారు. తాడిపత్రి ఆడపడుచు వైఎస్ విజయమ్మపై దూషణలు చేయడం సభ్యత కాదని నిప్పులు చెరిగారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై హేలనగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తేల్చుకుందాం రా అంటూ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నారని అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. నిజంగా జేసీ బ్రదర్స్‌కు దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేయాలని సవాలు విసిరారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. -
బాబు సర్కారుకు బుద్ధి చెబుదాం
గుంతకల్లు టౌన్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి కరువు జిల్లా సమస్యలపైన, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న కష్టాలపైన అలుపెరగని పోరాటాలు చేయగల యోధుడని, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు సర్కారుకు బుద్ధి చెబుదామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక రాయల్ పంక్షన్ హాల్లో సోమవారం పార్టీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సీఎం చంద్రబాబు, ఆ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దౌర్జన్యకాండను కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండీ ప్రయోజనం లేదన్నారు. హంద్రీనీవా ద్వారా జిల్లాలోని 1,270 చెరువులకు, 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇప్పించాలన్న ధ్యాస వారికి ఏమాత్రమూ లేదన్నారు. నీళ్లకు గండికొడుతున్నా, పరిశ్రమలు రాకపోయినా, రైల్వేజోన్ ఏర్పాటు చేయకపోయినా నోరుమెదపకపోవడం సిగ్గుచేటన్నారు. మంత్రి పల్లె రెడ్డి కాబట్టి ఆయనతో ప్రతిపక్ష నేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేయిస్తూ చంద్రబాబు పైశాచిక ఆనం దం పొందుతున్నారని దుయ్యబట్టారు. మూడేళ్లయినా సెంట్రల్ యూనివర్సిటీ అతీగతీ లేదని, మంత్రి పల్లె మాత్రం అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు అనుమతులు తెచ్చుకున్నారని విమర్శిం చారు. తాడూ బొంగరాల్లేని పారిశ్రామికవేత్తలతో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఎంఓ యూ కుదర్చుకుందన్నారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాగేపరుశరామ్ మాట్లాడుతూ జిల్లా మం త్రులు చేతకాని దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారన్నా రు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘన త దివంగత సీఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డిదేనని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నదీమ్ అహ్మద్ తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అరాచక పాలనకు సమాధి కట్టాలంటే ఈ ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. పట్టభద్రులను చైతన్యవంతులను చేసి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి గెలిపించాలని అభ్యర్థించారు. టీడీపీ దౌర్జన్యాలకు భయపడేది లేదు : వైవీఆర్ టీడీపీ చేస్తున్న దౌర్జన్యాలకు భయపడే ప్రసక్తే లేదని గుంతకల్లు సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి అన్నారు. టీడీపీకి పతనం మొదలైందని, కడుపు మండి నోడి పోరాటం ఏ విధంగా ఉంటుందో చంద్రబాబు త్వరలో చవిచూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆయనకన్నా ప్రజలు చాలా మేధావులని, ఎప్పుడు, ఏ విధంగా దెబ్బతీయాలో వారికి బాగా తెలుసని చెప్పారు. వెన్నపూస గోపాల్‌రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించి, ఆయన విజయాన్ని వైఎస్.జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని పార్టీ శ్రేణులను కోరారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాదిలింగేశ్వరబాబు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల రామాంజినేయులు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వీరాంజినేయులు, రాష్ట్ర నాయకుడు బాలకృష్ణారెడ్డి, గుంతకల్లు పట్టణ, మండల అధ్యక్షులు వై.సుధాకర్, మోహన్ రావు, గుత్తి మండలాధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, పామిడి అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి, వైఎస్సార్‌టీయూ రాష్ట్ర కార్యదర్శులు త్యాగరాజు, మల్లికార్జున శాస్త్రి, సింగిల్‌విండో వైస్‌చైర్మన్ సుంకిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, గుత్తి మాజీ సర్పంచ్ పీరా, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ మల్లయ్యయాదవ్, గుంతకల్లు, గుత్తి, పామిడి కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. -
మోసకారి బాబుకు ఓటుతో బుద్ధి చెబుదాం
పుట్టపర్తి టౌన్ : జాబు రావాలంటే బాబు రావాలని ఎన్నికల్లో ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చి గద్దెనెక్కిన అనంతరం ఉన్న జాబులు ఊడగొడుతూ యువతను చంద్రబాబు నాయుడు మోసం చేశాడని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుతో ఆయనకు బుద్ధి చెప్పాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. పుట్టపర్తిలోని కోటా గార్డెన్స్‌లో శనివారం పుట్టపర్తి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయనతో పాటు ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కరువు జిల్లాకు వేలాది పరిశ్రమలు తెచ్చి ఇక్కడి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన తెలుగుదేశం పెద్దలు అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఒక్క పరిశ్రమ కూడా తీసుకొచ్చిన పాపానపోలేదన్నారు. ఇక్కడ చదువుకున్న పట్టభద్రులు, యువకులు ఇతర రాష్ట్రాలకు వలసలు పోయి కూలీలుగా పనిచేయాల్సిన అగత్యం ఏర్పడిందన్నారు. చంద్రబాబుతో పాటు వచ్చిన కరువు మూడేళ్లుగా జిల్లా రైతుల్ని కుంగదీస్తోందని, జిల్లా రైతులు కేరళలో బిచ్చగాళ్లుగా మారుతున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి పెద్దలు చట్టం చేస్తే, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వార్థం కోసం హోదాను తాకట్టు పెట్టి, ప్యాకేజీతో తాను, తన కార్యకర్తలతో పండుగ చేసుకుంటున్నాడని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ఈ జిల్లా నుంచి సమర్థుడైన వ్యక్తిని చట్టసభలకు పంపాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా ఉద్యోగుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వెన్నపూసగోపల్రెడ్డికి ప్రతి పట్టభద్రుడు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సమస్యలపై, ప్రజా పోరాటాలపై చంద్రబాబు ప్రభుత్వానికి గౌరవం కూడా లేదన్నారు. మదమెక్కిన ప్రభుత్వం మెడలు వంచేందుకు విద్యావంతులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఫ్లోర్‌లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి, మాజీ మేయర్ రాగేపరుశురాం, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మాధవప్ప, జాయింట్ సెక్రెటరీ లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, సహకార సంఘం అధ్యక్షులు ఏవి.రమణారెడ్డి, నరసారెడ్డి, కౌన్సిలర్లు నారాయణరెడ్డి, ఈశ్వరయ్య, రాంజీనాయక్, పుట్టపర్తి పట్టణ, రూరల్, కొత్తచెరువు, బుక్కపట్నం, నల్లమాడ, ఓడీసీ, అమడగూరు మండలాల కన్వీనర్లు మాధవరెడ్డి, గంగాద్రి, జగన్మోహన్రెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, శేషూరెడ్డి, రామాంజనేయులు, వివిధ మండలాల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. -
'చంద్రబాబు రాయలసీమ ద్రోహి'
-
'చంద్రబాబు రాయలసీమ ద్రోహి'
అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐదేళ్లుగా కృష్ణా జలాలు అనంతపురానికి వస్తున్నా.. ఒక్క ఎకరా ఆయకట్టుకు నీరివ్వలేదని విమర్శించారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా మారారని ఆయన ధ్వజమెత్తారు. హంద్రీనీవాపై బహిరంగ చర్చకు చంద్రబాబు సిద్ధమా అని మంగళవారం అనంత వెంకట్రామిరెడ్డి సవాల్ విసిరారు. అనంతపురం మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు, కోడుకు, మనవడికి భజన చేసేందుకే ఉన్నారంటూ ఆయన విమర్శించారు. -
కార్పొరేషన్‌ను లూటీ చేస్తున్నారు
– పైప్‌లైన్ పనుల్లో అవినీతి కన్పించలేదా? – ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్‌పై మాజీ ఎంపీ ‘అనంత’ ఫైర్ – బందిపోటు దొంగలను మించిపోయారు : మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి ధ్వజం – సెంట్రల్ విజిలెన్స్‌తో విచారణ చేపట్టాలి : సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ అనంతపురం న్యూసిటీ : ‘నగరపాలక సంస్థలో గడిచిన రెండున్నరేళ్లలో ప్రజాప్రతినిధులు ప్రజాధనాన్ని విచ్ఛలవిడిగా లూటీ చేశారు. నగరంలో అభివృద్ధి పనులకు టెండర్ వేయాలంటే ప్రజాప్రతినిధులకు కప్పం కట్టాల్సి వస్తుందనే భయంతో కాంట్రాక్టర్లు ఉన్నారు. నగర ప్రజలు, వ్యాపారులు, చిన్న కాంట్రాక్టర్లు బిక్కుబిక్కుమంటూ జీవించే భయానక వాతావరణాన్ని పాలకులు సృష్టిస్తున్నారు. ఇక్కడి అవినీతిని రూపుమాపేందుకే ధర్నా చేస్తున్నాం. ఇకనైనా మీరు మేల్కోండి. లేదంటే మీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లి నియంత్రిస్తామని’ మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయం ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. మాజీ ఎంపీతో పాటు మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, మాజీ మేయర్ రాగే పరుశురాం, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ తదితరులు హాజరై పాలకవర్గం అవినీతిపై నిప్పులు చెరిగారు. మాజీ ఎంపీ అనంత మాట్లాడుతూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప తీరును తప్పుబట్టారు. ‘అధికార పార్టీ నేతల తీరుతో ప్రజలు విరక్తి చెందారు. మేము ఆరోపణలు చేయడానికి రాలేదు. పాలకర్గం అవినీతిని ఎత్తిచూపడానికే నిజాయితీ, నిర్భయంగా «ముందుకొచ్చాం. సీఎం, మంత్రుల పర్యటన పేరుతో చెత్తను ఊడ్చే దగ్గర నుంచి ప్రతి పనిలో అవినీతికి పాల్పడుతున్నారు. ట్రాఫిక్ పేరుతో రోడ్లు విస్తరించాలని ఒకరు, విస్తరించకూడదని మరొకరు మాట్లాడుతున్నారు. ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించలేదు. వర్గాలుగా ఏర్పడి భయానక వాతావరణం సృష్టించారు.ఎప్పుడు ఎవరిని కొడతారో తెలియని పరిస్థితి. ఓ ప్రజాప్రతినిధి ‘చైతన్యం’ పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. వీరికి ఎవరిచ్చారీ హక్కు’ అని ప్రశ్నించారు. రూ.147 కోట్లతో చేపడుతున్న పైప్‌లైన్ పనుల్లో అవినీతి జరుగుతుంటే ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్‌కు కనపడలేదా అని ప్రశ్నించారు. టెండర్లలో లెస్‌కు వేసిన వారిని కాదని ఎక్సెస్(అంచనా కంటే అధిక మొత్తం)కు కోట్ చేసిన ఐహెచ్పీ కంపెనీకి పైప్‌లైన్ పనులు కట్టబెట్టారన్నారు. పైప్‌లను సరిగా పూడ్చకున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. అవినీతిపై జిల్లా కలెక్టర్ స్పందించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అనంతపురంలో తహశీల్దార్, నగర పాలక సంస్థ కమిషనర్, ధర్మవరం, కంబదూరులో రెవెన్యూ అధికారులపై అధికార పార్టీ నేతల దాడులు హేయమన్నారు. వారి అవినీతి, దౌర్జన్యాలు మితిమీరాయని, ప్రభుత్వం నియంత్రించాలని డిమాండ్ చేశారు. బందిపోట్లను మించిపోయారు ‘నగరపాలక సంస్థలో డిపార్ట్మెంట్, నామినేషన్, పూడికతీత, మట్టిదిబ్బల తొలగింపు పనుల పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టారు. బందిపోటు దొంగలను మించి దోచుకుంటున్నారని’ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే, మేయర్, అధికారులు ప్రజాధనాన్ని దిగమింగుతున్నారన్నారు. రూ.కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో అర్థంకాని పరిస్థితి ఉందన్నారు. కాలువలు, డివైడర్లు తొలగించి మళ్లీ వేస్తున్నారన్నారు. మాజీ ఎంపీ అనంత నిధులతో చేసిన పనులకు కూడా బిల్లులు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి.. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, మహాత్మాగాంధీ తరహాలో శాంతివచనాలు వల్లించడం శోచనీయమన్నారు. రుద్రంపేటలో జంట హత్యలు చేసింది ఎమ్మెల్యే అనుచరులేనని ఆరోపించారు. ఇంట్లోనే మర్డర్లు చేసి రైలు పట్టాలపై శవాలను తేల్చిన విషయాన్ని ప్రజలు మరచిపోలేదన్నారు. ఎమ్మెల్యే చుట్టూ రౌడీలు, గూండాలే ఉన్నారన్నారు. ఎమ్మెల్యే అయిన వెంటనే శిల్పారామం పనులను ఆపి, తిరిగి అదే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించిందెవరని ప్రశ్నించారు. కార్పొరేషన్ అవినీతిపై విజిలెన్స్, కలెక్టర్‌కు లేఖ రాశామని కథలు చెబుతున్నారన్నారు. కలెక్టర్ వద్దన్నా కమిషనర్.. ఈఈ స్థాయిలో బిల్లులు ఏవిధంగా చేశారని ప్రశ్నించారు. కలెక్టర్ మాటలను వినకుండా బిల్లులు చేశారంటే ఇందులో కలెక్టర్‌కూ భాగస్వామ్యం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఎస్ఈకి కమిషనర్(ఎఫ్ఏసీ)గా బాధ్యత అప్పగించకుండా ఆయన కింద ఉండే ఈఈకి ఏవిధంగా ఇస్తారన్నారు. మిస్సమ్మ స్థలాన్ని కబ్జా చేశామని చెప్పడం సరికాదని, ఇలాగే మాట్లాడితే నాలుక కోస్తామని ఎమ్మెల్యేను హెచ్చరించారు. సంఘమిత్ర స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టింది నీవు కాదా అని నిలదీశారు. మిస్సమ్మ స్థలం కబ్జా చేసి ఉంటే ఎనిమిదేళ్లలో ప్రభుత్వం ఎప్పుడు స్వాధీనం చేసుకోకూడదన్నారు. నీతి, నిజాయితీతో పైకొచ్చామని, అందుకే ప్రజలు ఐదుసార్లు తమకు అవకాశం ఇచ్చారని చెప్పారు. అవినీతి సొమ్మును రికవరీ చేయించాలి నగరపాలక సంస్థలో వివిధ అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతికి సంబంధించి సొమ్మును రికవరీ చేయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, మేయర్‌కు సిగ్గుంటే సెంట్రల్ విజిలెన్స్‌తో విచారణ జరిపించాలన్నారు. అప్పుడు నిజానిజాలు వెలుగు చూస్తాయన్నారు. డ్రామాలు చేస్తున్నారని మేయర్ అనడం సరికాదని, తక్షణం ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కడియం నుంచి మొక్కలు తెచ్చామని, సప్తగిరి సర్కిల్ నుంచి సూర్యనగర్ సర్కిల్ వరకు మట్టిని తొలగించామంటూ రూ.8.5 లక్షలు, కేటీఆర్ ఫంక్షన్‌హాల్ నుంచి సోములదొడ్డి వరకు మట్టి దిబ్బల తొలగింపు పేరిట రూ.3.50 లక్షలు బిల్లులు పెట్టి నిధులు స్వాహా చేశారన్నారు. గడిచిన ఎనిమిది నెలల్లో కౌన్సిల్ ఆమోదం లేకుండానే రూ 1.5 కోట్ల నామినేషన్ పనులు చేశారన్నారు. రూ.కోట్లలో ప్రజాధనాన్ని లూటీ చేశారని, ఇందులో పెద్ద మనుషుల హస్తం ఉందని ఆరోపించారు. ధర్నాలో మాజీ మేయర్ రాగే పరుశురాం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఎర్రిస్వామి రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నదీమ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బోయ సుశీలమ్మ, కొండమ్మ, పార్టీ నగరాధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నగరాధ్యక్షుడు దాదాగాంధీ, సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్ర, పార్టీ నాయకుడు గోపాల్, సీపీఐ నగర కార్యదర్శి లింగమయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘చంద్రబాబు అలా చెప్పుకోవడం సిగ్గుచేటు’
-
‘చంద్రబాబు అలా చెప్పుకోవడం సిగ్గుచేటు’
కర్నూలు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అనంత వెంకట్రామిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 50 ఏళ్లుగా పోలవరం ప్రాజెక్ట్‌పై ఉద్యమం సాగిందని, అలాంటిది చంద్రబాబు తనవల్లే పోలవరం సాధ్యమైందని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. వంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేసిన ప్రాజెక్టులను చంద్రబాబు తన ఘనతగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. జిల్లాలో వైఎస్ జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్రకు అన్నదాతలు బ్రహ్మరథం పడుతున్నారని అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల్లో వైఎస్ జగన్ ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారని ఆయన పేర్కొన్నారు. -
‘అనంత’ పోరాటం మరువలేనిది!
- ఆయన స్ఫూర్తితోనే సాగు, తాగునీటి ఉద్యమాలు - అనంత వెంకటరెడ్డి వర్థంతిలో వక్తలు అనంతపురం : అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించినప్పుడే అభివృద్ధి చెందుతుందని భావించి అనేక పోరాటాలు చేసిన వారిలో అనంత వెంకటరెడ్డి ముఖ్యుడని, ఆయన పోరాటాలు మరువలేనివని పలువురు వక్తలు కొనియాడారు. అనంత వెంకటరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా గురువారం వారు పెద్దాస్పత్రి ఎదుట ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అనంతవెంకటరెడ్డి తనయుడు, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమ జిల్లాల్లో ఆరు లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలనే ఉద్దేశంతో హంద్రీ–నీవా పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. దీనిద్వారా మన జిల్లాలో 3.42 ఎకరాలకు, 387 చెరువులకు సాగునీరు అందుతుందన్నారు. ఈ దిశగా కృషి చేసిన అనంత వెంకటరెడ్డి పేరు ఈ పథకానికి పెట్టారని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం అనంత వెంకటరెడ్డి పేరును తొలిగించడమే కాకుండా 380 చెరువులను 1,260 చెరువులుగా చేస్తానని చెబుతూ 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు తిలోదకాలు ఇచ్చేందుకు పూనుకుందని మండిపడ్డారు. వైఎస్ పేరును శాశ్వతంగా కనుమరుగు చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోందన్నారు. అనంత లాంటి నాయకులæ ఉద్యమ స్ఫూర్తితో ప్రజలందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. - ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజల భవిష్యత్తు కోసం చివరిదాకా పోరాటాలు చేసిన యోధుడు అనంత వెంకటరెడ్డి అన్నారు. కృష్ణాజలాలు అనంతకు మళ్లించేందుకు జరిగిన పోరాటంలో ఆయన చాలా కీలకపాత్ర పోషించారన్నారు. దశాబ్దాల పోరాటాల ఫలితంగానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ గొప్ప మనసుతో రాయలసీమ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారన్నారు. అంతకుముందు చంద్రబాబు 9 ఏళ్లు సీఎంగా ఉన్నా ఒక్క ప్రాజెక్టునూ పట్టించుకోలేదన్నారు. హంద్రీ - నీవా పథకానికి అనంత వెంకటరెడ్డి పేరు తొలిగించడం ప్రభుత్వ కుసంస్కారానికి నిదర్శనమన్నారు. జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు హంద్రీ - నీవా నీరు తెచ్చుకునేందుకు వెంకటరెడ్డి స్ఫూర్తితో పోరాడేందుకు రైతులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. - మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాలు ఈరోజు అనంతకు వచ్చాయంటే వెంకటరెడ్డి చలువేనన్నారు. ఆయన పోరాటాలు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. ఆయన కృషి ఫలితంగానే హంద్రీ - నీవా ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టారన్నారు. - పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్‌రెడ్డి మాట్లాడుతూ మన జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన కృషిని ప్రస్తుత ప్రభుత్వం విస్మరించడం దుర్మార్గమన్నారు. - కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు దాదాగాం«ధీ మాట్లాడుతూ ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రాగేపరుశురాం, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ధనుంజయయాదవ్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు నదీంఅహ్మద్, మీసాలరంగన్న, మహిళ,బీసీ,ట్రేడ్, ఎస్సీ విభాగాల జిల్లా అధ్యక్షులు బోయ సుశీలమ్మ, పామిడి వీరా, ఆదినారాయణరెడ్డి, పెన్నోబులేసు, నాయకులు నార్పల సత్యనారాయణరెడ్డి, అంబటి ఆదినారాయణరెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జేఎం బాషా తదితరులు పాల్గొన్నారు. - అంతకుముందు రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నగరంలోని అనంత వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పూర్తిగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి తాగు, సాగునీటి కోసం ఆయన చేసిన ఉద్యమం మరువలేనిదన్నారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామన్నారు. -
అనంతపురంలో రైతుల పోరుబాట ఉధృతం
అనంతపురం : సాగునీటి కోసం జిల్లా రైతులు పోరుబాట ఉధృతం చేయడంతో అనంతపురంలో శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తుంగభద్ర ఎగువకాల్వ షట్టర్లను ఎత్తివేసేందుకు రైతులు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. సింగనమల, గార్లదిన్నె, నార్పల, బుక్కరాయసముద్రంలో సుమారు 500మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు రైతుల ఆందోళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్ష నేతలు మద్దతు పలికారు. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, గుర్నాథరెడ్డి, ఎల్ఎం మోహన్ రెడ్డి, సాంబశివారెడ్డి, శరత్ చంద్రారెడ్డి, సీపీఐ నేత జగదీశ్, సీపీఎం నేత రాంగోపాల్ తదితరులు అరెస్ట్ అయ్యారు. మరోవైపు పోలీసుల వైఖరికి నిరసనగా అనంతపురం ఓవర్ బ్రిడ్జి వద్ద వామపక్షాలు రాస్తారోకో చేపట్టాయి. -
వైఎస్ఆర్సీపీ నేతల హౌస్ అరెస్ట్
-
వైఎస్ఆర్సీపీ నేతల హౌస్ అరెస్ట్
అనంతపురం పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తుంగభద్ర ఆయకట్టుకు నీరు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. నేడు బలవంతంగా తుంగభద్ర ఆయకట్టు నీరు విడుదలకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. దీంతో వైఎస్ఆర్సీపీ నేతల ఆందోళనలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, గుర్నాథరెడ్డి, పద్మావతిని హౌస్ అరెస్ట్ చేశారు. ప్రతిపక్ష నేతలు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపిన వామపక్షపార్టీలు సీపీఐ, సీపీఎం నేతలను కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయకట్టుకు నీరు అడిగితే గృహనిర్బంధం చేయడంపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. -
జలగండం
– హెచ్చెల్సీ ఆయకట్టు గురించి పట్టించుకోని పాలకులు – స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటున్న అధికార పార్టీ నేతలు – జిల్లాకు నీటిని తీసుకురావడానికి పైస్థాయిలో ఒత్తిళ్లు చేయలేని దుస్థితి – అనంత కోటాను తన్నుకుపోయిన కర్నూలు ప్రజాప్రతినిధులు జిల్లాకు జలగండం ముంచుకొస్తోంది. తుంగభద్ర జలాశయం నుంచి కేసీ కెనాల్ వాటా 10 టీఎంసీలలో దామాషా ప్రకారం మూడు టీఎంసీలు రివర్స్ డైవర్షన్ పద్ధతిలో జిల్లాకు రావాల్సి ఉన్నా.. కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులు పైస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చి తన్నుకుపోయారు. జిల్లాకు సాగు, తాగునీటిని తీసుకురావడంలో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఘోరంగా విఫలమయ్యారని చెప్పేందుకు ఇదొక్క నిదర్శనం చాలు. ఫలితంగా హెచ్చెల్సీ చరిత్రలో ఎన్నడూలేని విధంగా పంటలకు నీరివ్వలేని దుస్థితి ఈసారి ఏర్పడింది. అనంతపురం సెంట్రల్ : తుంగభద్ర ఎగువ కాలువ(హెచ్చెల్సీ) కింద మొత్తం 2.84 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గతంలో ప్రతియేటా దాదాపు లక్ష ఎకరాల వరకూ నీరందించేవారు. కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఆయకట్టు బీడుగా మారుతోంది. గతేడాది మిడ్‌పెన్నార్ సౌత్, నార్త్ కెనాల్, తాడిపత్రి బ్రాంచ్‌కెనాల్ (టీడీపీ) తదితర వాటి కింద ఆయకట్టుకు నీరివ్వలేదు. ఈ ఏడాది ఏకంగా హెచ్చెల్సీ వ్యవస్థలోని మొత్తం ఆయకట్టును ఎండబెడుతున్నారు. హెచ్చెల్సీ మెయిన్ కెనాల్, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ (జీబీసీ) కింద వేలాది ఎకరాల్లో సాగు చేసిన మిరప, వరి, ఆరుతడి పంటలు ఎండిపోతున్నాయి. లోపించిన ప్రణాళిక టీబీ డ్యాం నుంచి ఈ ఏడాది 22 టీఎంసీల నీరు హెచ్చెల్సీకి వస్తుందని, తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు పోనూ మిగిలిన నీటిని ఆయకట్టుకు వదలాలని సాగునీటి సలహామండలి(ఐఏబీ) సమావేశంలో నిర్ణయించారు. అయితే.. వర్షాభావం వల్ల టీబీ డ్యాంలోకి ఆశించిన స్థాయిలో నీరు రావడం లేదు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఇప్పుడు కూడా ఆయకట్టుకు నీటిని విడుదల చేయవచ్చుననే అభిప్రాయాన్ని సాగునీటి రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం హెచ్చెల్సీకి మొత్తం 10 టీఎంసీలు వచ్చే అవకాశముంది. దీంతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం(2005)లో జారీ చేసిన జీవో మేరకు కేసీ కెనాల్ వాటా నీరు జిల్లాకు రావాలి. ప్రస్తుతం దామాషా ప్రకారం మూడు టీఎంసీలు రావాల్సి ఉంటుంది. అలాగే శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకానికి తొమ్మిది టీఎంసీలు కేటాయించారు. శ్రీశైలంలో నీటి నిల్వ పడిపోకుండా చర్యలు తీసుకుంటే మరింత ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశముంది. ఈ లెక్కన 22 నుంచి 25 టీఎంసీల నీటిని జిల్లాకు తీసుకొచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. గతంలో హెచ్చెల్సీకి మాత్రమే 16 టీఎంసీలు వచ్చిన సమయంలోనూ తాగునీటికి పోనూ మిగిలిన నీటిని పంటలకు ఇచ్చారు. ఈసారి అధికారపార్టీ ప్రజాప్రతినిధుల చేతకానితనం వల్ల ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటికే విడపనకల్లు ప్రాంతంలో జీబీసీ కింద వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. అనంత రైతులకు సీఎం షాక్ జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో జిల్లాకు కేటాయించిన కోటా కన్నా అధిక నీటిని తీసుకురావడానికి అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులు కషి చేయాలి. ముఖ్యమంత్రి స్థాయిలో తుంగభద్రబోర్డు, కష్ణా రివర్‌బోర్డు అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి హెచ్చెల్సీ, హంద్రీనీవా ద్వారా వీలైనంత ఎక్కువ నీటిని తేవడానికి ప్రయత్నించాలి. కానీ ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. వేరుశనగ పంట ఎండిపోకుండా కాపాడతానంటూ గత నెలాఖరులో జిల్లాకు వచ్చి హడావుడి చేసిన ముఖ్యమంత్రి.. చివరకు కేసీకెనాల్ వాటా నీటిని కూడా కర్నూలుకు ఇచ్చి అనంత రైతులకు అన్యాయం చేశారు. కేసీకెనాల్ డైవర్షన్ నీటి వాటాను కర్నూలుకు ఇవ్వాలని ఆగస్టు 27న ఈఎన్సీ వెంకటేశ్వరరావు తుంగభద్ర సెక్రటరీకి లేఖ రాశారు. 2.6 టీఎంసీలను విడుదలచేయాలని అందులో పేర్కొన్నారు. అదే నెల 29 నుంచి నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు. దీన్నిబట్టే అనంత రైతులపై సీఎంకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థమవుతోంది. జిల్లా ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు : అనంతవెంకట్రామిరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీబీసీ కింద ఆయకట్టులో పంటలు పూర్తిగా ఎండిపోయాయి. రైతులకు రూ.250–300 కోట్ల మేర పెట్టుబడి నష్టం వాటిల్లింది. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు వారికి మరింత నష్టాన్ని చేకూరుస్తున్నాయి. కేసీకెనాల్ డైవర్షన్ కింద జిల్లాకు హక్కుగా రావాల్సిన 3.3 టీఎంసీలను కర్నూలుకు ఎలా కేటాయించారో సమాధానం చెప్పాలి. హెచ్చెల్సీతో పాటు హంద్రీ–నీవా నీళ్లను ఇష్టానుసారం చెరువులకు, కాలువలకు పాలెగాళ్లలాగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. అనంతలో పంటలను కాపాడేందుకు వచ్చిన ముఖ్యమంత్రి జిల్లాకు హక్కుగా రావాల్సిన నీటిని కర్నూలుకు కేటాయించాలని ‘అనంత’ నుంచే ఉత్తర్వులు ఇచ్చి జిల్లా రైతులకు తీరని అన్యాయం చేశారు. ఈ ఏడాది ఆయకట్టు కింద పంట నష్టానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. -
'చంద్రబాబు రెయిన్గన్ల డ్రామా'
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న ధర్నాకు మద్దతు ఇవ్వాలని రైతులకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం అనంతపురంలో వారిరువురు మాట్లాడుతూ... కరువు రైతుల సమస్యలు చంద్రబాబుకు పట్టడం లేదని ఆరోపించారు. తుంగభద్ర ఎగువకాల్వ ఆయుకట్టుకు ప్రతిఏటా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై సెప్టెంబర్ 27వ తేదీన అనంతపురం కలెక్టరేట్ వద్ద వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధర్నా నిర్వహించనున్నారని తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీ, బీమా డబ్బులు ఎగ్గొట్టేందుకు చంద్రబాబు రెయిన్గన్ల డ్రామా అడుతున్నారని విమర్శించారు. -
ఓపికను పరీక్షించొద్దు
– ఈ నెల 20 నుంచి ఆయకట్టుకు నీరివ్వకపోతే చావోరేవో తేల్చుకుంటాం – హెచ్చెల్సీ ఎస్ఈకి మాజీ ఎంపీ అనంత అల్టిమేటం – రైతులతో కలిసి ఆందోళన అనంతపురం సెంట్రల్ : ‘రెండేళ్లుగా ఆయకట్టుకు నీరివ్వడం లేదు. తుంగభద్ర ఎగువ కాలువ కింద హక్కుదారులుగా ఉన్న రైతులను కాదని ఇతర ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు. మా మంచి తనాన్ని చేతగాని తనంగా భావించొద్దు. ఈనెల 20 నుంచి ఆయకట్టుకు నీరు వదిలితే పొలాల్లోకి పార తీసుకొని వెళతాం. లేకుంటే చావోరేవో తేల్చుకుంటా’మని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన lకార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన శింగనమల నియోజకవర్గ పార్టీ నేత ఆలూరు సాంబశివారెడ్డి, ఆయకట్టు రైతులతో కలిసి స్థానిక హెచ్చెల్సీ కార్యాలయంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) శేషగిరిరావును కలిశారు. ఆయకట్టుకు నీరివ్వకుండా అన్యాయం చేస్తున్నారంటూ రైతులు ఎస్ఈతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ... ‘గతంలో అనేక కరువులు చూశాం. అప్పట్లో ఎంత కష్టమైనా ఆయకట్టుకు నీరొచ్చాయి. కానీ ఈ ప్రభుత్వంలో రెండేళ్లుగా ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. హెచ్చెల్సీ పరిధిలో లేకపోయినప్పటికీ కొందరు అధికారబలంతో కళ్లెదుటే అక్రమంగా నీటిని తీసుకెళుతున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పొలాలకు, వారి పరిసర ప్రాంతాలకు లబ్ధి కలిగేలా వ్యవహరిస్తున్నార’ని మండిపడ్డారు. తుంగభద్ర, శ్రీశైలం జలాశయాల నుంచి జిల్లాకు నీటిని తీసుకురావడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు. తుంగభద్ర జలాశయం నుంచి 10 టీఎంసీల కే సీ కెనాల్ వాటాను మన జిల్లాకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేటాయించారని గుర్తు చేశారు. కానీ మీ అలసత్వంతో ఈ ఏడాది ఇప్పటికే 1.8 టీఎంసీ నీటిని కర్నూలు జిల్లా వారు తీసుకుపోతున్నారన్నారు. రెండేళ్లుగా గుంతకల్లు బ్రాంచ్ కెనాల్, ఎంపీ సౌత్, నార్త్‌కెనాల్, తాడిపత్రి బ్రాం^Œ lకెనాల్‌కు నీరివ్వకపోవడం వల్ల ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయన్నారు. ఈ ఏడాది కూడా నీరు విడుదల చేయకపోతే ఈ ప్రాంతంలో పండ్లతోటలు ఏఒక్కటీ మిగలవని హెచ్చరించారు. ఆయకట్టును కాదని చెరువులకు నీరెలా ఇస్తారని ప్రశ్నించారు. ఆయకట్టు తర్వాత మిగులు జలాలుంటేనే చెరువులకు ఇవ్వాలన్నారు. తుంగభద్ర నుంచి ప్రస్తుత వాటా 10 టీఎంసీలు, కేసీ కెనాల్ వాటా 3 టీఎంసీలు, ఇటు శ్రీశైలం నుంచి ప్రస్తుతం కేటాయించిన 9 టీఎంసీలతో పాటు వీలైనంత ఎక్కువ నీటిని జనవరి నెలాఖరు వరకూ తీసుకొచ్చి హెచ్‌ఎల్‌ఎంసీ, జీబీసీ కింద సాగైన పంటలను కాపాడడంతో పాటు ఎంపీ సౌత్,నార్త్, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ తదితర వాటి కింద ఆయకట్టులో ఆరుతడి పంటలకైనా నీరు వదలాలని డిమాండ్ చేశారు. జిల్లాలో రెయిన్గన్ల ద్వారా నాలుగు లక్షల ఎకరాల్లో వేరుశనగను కాపాడినట్లు ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు గొప్పలు చెబుతున్నారని, అలాంటిది హెచ్చెల్సీ కింద 60 వేల ఎకరాల్లో పంటను కాపాడలేరా అని ప్రశ్నించారు. ఎస్ఈ శేషగిరిరావు స్పందిస్తూ కలెక్టర్‌తో చర్చించి ఆయకట్టుకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ జయరామిరెడ్డి, పుట్లూరు,బుక్కరాయసముద్రం సింగిల్‌విండోల అధ్యక్షులు రాఘవరెడ్డి, నాగలింగారెడ్డి, పార్టీ మండల మాజీ కన్వీనర్ బొమ్మలాటపల్లి సుధాకర్‌రెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్లు నారాయణరెడ్డి, నార్పల సత్యనారాయణరెడ్డి, నాయకులు ఆకులేడు రామచంద్రారెడ్డి, చెన్నంపల్లి రాజశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, ఎస్సీ సెల్ నాయకులు రామకష్ణ తదితరులు పాల్గొన్నారు.