వైఎస్ఆర్సీపీ నేతల హౌస్ అరెస్ట్
అనంతపురం పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తుంగభద్ర ఆయకట్టుకు నీరు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. నేడు బలవంతంగా తుంగభద్ర ఆయకట్టు నీరు విడుదలకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. దీంతో వైఎస్ఆర్సీపీ నేతల ఆందోళనలపై పోలీసులు ఆంక్షలు విధించారు.
ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, గుర్నాథరెడ్డి, పద్మావతిని హౌస్ అరెస్ట్ చేశారు. ప్రతిపక్ష నేతలు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపిన వామపక్షపార్టీలు సీపీఐ, సీపీఎం నేతలను కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయకట్టుకు నీరు అడిగితే గృహనిర్బంధం చేయడంపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు.