Gurnathreddy
-
అనంతపురంలో రైతుల పోరుబాట ఉధృతం
అనంతపురం : సాగునీటి కోసం జిల్లా రైతులు పోరుబాట ఉధృతం చేయడంతో అనంతపురంలో శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తుంగభద్ర ఎగువకాల్వ షట్టర్లను ఎత్తివేసేందుకు రైతులు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. సింగనమల, గార్లదిన్నె, నార్పల, బుక్కరాయసముద్రంలో సుమారు 500మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు రైతుల ఆందోళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్ష నేతలు మద్దతు పలికారు. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, గుర్నాథరెడ్డి, ఎల్ఎం మోహన్ రెడ్డి, సాంబశివారెడ్డి, శరత్ చంద్రారెడ్డి, సీపీఐ నేత జగదీశ్, సీపీఎం నేత రాంగోపాల్ తదితరులు అరెస్ట్ అయ్యారు. మరోవైపు పోలీసుల వైఖరికి నిరసనగా అనంతపురం ఓవర్ బ్రిడ్జి వద్ద వామపక్షాలు రాస్తారోకో చేపట్టాయి. -
వైఎస్ఆర్సీపీ నేతల హౌస్ అరెస్ట్
-
వైఎస్ఆర్సీపీ నేతల హౌస్ అరెస్ట్
అనంతపురం పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తుంగభద్ర ఆయకట్టుకు నీరు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. నేడు బలవంతంగా తుంగభద్ర ఆయకట్టు నీరు విడుదలకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. దీంతో వైఎస్ఆర్సీపీ నేతల ఆందోళనలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, గుర్నాథరెడ్డి, పద్మావతిని హౌస్ అరెస్ట్ చేశారు. ప్రతిపక్ష నేతలు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపిన వామపక్షపార్టీలు సీపీఐ, సీపీఎం నేతలను కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయకట్టుకు నీరు అడిగితే గృహనిర్బంధం చేయడంపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు.