అనంతపురంలో రైతుల పోరుబాట ఉధృతం | Farmers protest demanding release of water from tungabhadra | Sakshi
Sakshi News home page

అనంతపురంలో రైతుల పోరుబాట ఉధృతం

Published Sat, Nov 19 2016 1:38 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

Farmers protest demanding release of water from tungabhadra

అనంతపురం :  సాగునీటి కోసం జిల్లా రైతులు పోరుబాట ఉధృతం చేయడంతో అనంతపురంలో శనివారం ఉద్రిక‍్తత చోటుచేసుకుంది. తుంగభద్ర ఎగువకాల్వ షట్టర్లను ఎత్తివేసేందుకు రైతులు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. సింగనమల, గార్లదిన్నె, నార్పల, బుక్కరాయసముద్రంలో సుమారు 500మందిని అరెస్ట్‌ చేశారు. మరోవైపు రైతుల ఆందోళనకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో పాటు వామపక్ష నేతలు మద‍్దతు పలికారు.


దీంతో వైఎస్ఆర్‌సీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, గుర్నాథరెడ్డి, ఎల్‌ఎం మోహన్‌ రెడ్డి, సాంబశివారెడ్డి, శరత్‌ చంద్రారెడ్డి, సీపీఐ నేత జగదీశ్‌, సీపీఎం నేత రాంగోపాల్‌ తదితరులు అరెస్ట్‌ అయ్యారు. మరోవైపు పోలీసుల వైఖరికి నిరసనగా అనంతపురం ఓవర్‌ బ్రిడ్జి వద్ద వామపక్షాలు రాస్తారోకో చేపట్టాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement