Tungabhadra canal
-
అనంతపురంలో రైతుల పోరుబాట ఉధృతం
అనంతపురం : సాగునీటి కోసం జిల్లా రైతులు పోరుబాట ఉధృతం చేయడంతో అనంతపురంలో శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తుంగభద్ర ఎగువకాల్వ షట్టర్లను ఎత్తివేసేందుకు రైతులు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. సింగనమల, గార్లదిన్నె, నార్పల, బుక్కరాయసముద్రంలో సుమారు 500మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు రైతుల ఆందోళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్ష నేతలు మద్దతు పలికారు. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, గుర్నాథరెడ్డి, ఎల్ఎం మోహన్ రెడ్డి, సాంబశివారెడ్డి, శరత్ చంద్రారెడ్డి, సీపీఐ నేత జగదీశ్, సీపీఎం నేత రాంగోపాల్ తదితరులు అరెస్ట్ అయ్యారు. మరోవైపు పోలీసుల వైఖరికి నిరసనగా అనంతపురం ఓవర్ బ్రిడ్జి వద్ద వామపక్షాలు రాస్తారోకో చేపట్టాయి. -
వైఎస్ఆర్సీపీ నేతల హౌస్ అరెస్ట్
-
వైఎస్ఆర్సీపీ నేతల హౌస్ అరెస్ట్
అనంతపురం పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తుంగభద్ర ఆయకట్టుకు నీరు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. నేడు బలవంతంగా తుంగభద్ర ఆయకట్టు నీరు విడుదలకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. దీంతో వైఎస్ఆర్సీపీ నేతల ఆందోళనలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, గుర్నాథరెడ్డి, పద్మావతిని హౌస్ అరెస్ట్ చేశారు. ప్రతిపక్ష నేతలు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపిన వామపక్షపార్టీలు సీపీఐ, సీపీఎం నేతలను కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయకట్టుకు నీరు అడిగితే గృహనిర్బంధం చేయడంపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. -
నీళ్లు వదులుతారు.. మళ్లించుకుంటారు!
► ఆంధ్ర నీటివాటాలో భారీ కొత ► ఆంధ్ర సరిహద్దు వరకు అక్రమ నీటి పంపింగ్ కేంద్రాలు ► నీరు సక్రమంగా సరఫరాకాకపోవడంతో వెలవెలబోతున్న జలాశయాలు వేసవిలో జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి విడుదల చేసిన తుంగభద్ర నీరు కర్నూలుకు చేరడం ప్రశ్నార్థకంగా మారింది. అందుకు కారణం తుంగభద్ర దిగువ కాలువపై కర్ణాటక నీటి సరఫరా అధికారులు అక్రమంగా ఆంధ్రసరిహద్దు వరకు విచ్చలవిడిగా నీటి పంపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం. నీటిని వదిలేనట్లే వదిలి మళ్లీ వారే మళ్లించుకోవడంతో సమస్య జఠిలమైంది. పంపింగ్ కేంద్రాల ద్వారా ప్రస్తుతం దిగువ కాలువకు విడుదల చేసిన నీటిని భారీ ఎత్తున మళ్లిస్తున్నారు. వారి జలాశయాల్లో పెద్దఎత్తున నీటిని నిల్వ చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. జిల్లా ప్రజాప్రతినిధులు, దిగువ కాలువ ఆంధ్ర అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఆలూరు రూరల్/హాలహర్వి/హొళగుంద: తాగునీటి కోసం తుంగభద్ర కాలువ ఎల్లెల్సీ ద్వారా మనరాష్ట్ర నీటివాటా కింద 1.8 టీఎంసీలు నీరు రావాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రం కావడంతో తుంగభద్ర దిగువకాలువ అధికారుల కోరిక మేరకు ఆ వాటా నీటిని ఈ నెల 5న విడుదల చేయాలని కోరారు. అందుకు తుంగభద్ర డ్యాం అధికారులు డ్యాంలో ప్రస్తుతం 582 అడుగులతో 5.13 టీఎంసీలు నీరు నిల్వ ఉందని, ఆ నీరు కూడా ఎండకు రోజురోజుకు ఇంకి పోతోందని చెప్పారు. కేవలం ఒక టీఎంసీ నీటిని విడుదల చేసేందుకు అంగీకరించారు. అది కూడా ఆలస్యంగా ఈ నెల 8న విడుదల చేశారు. ఆంధ్ర అధికారుల లెక్కల ప్రకారం హొళగుంద సెక్షన్ దాటిన తర్వాత 250 మైలురాయి ఆన్వాలు వద్ద రోజూ 600 క్యూసెక్కుల నీరు ప్రవహించాలి. అయితే అందులో ప్రతిరోజు 350 క్యూసెక్కుల నీరు కూడా రాని పరిస్థితి. కారణం అనాధికారికంగా ఆంధ్ర అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా ఏడాది క్రితం మోకా, ఎం.గొనేహాల్ వద్ద భారీ నీటి పంపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ పంపింగ్ కేంద్రాల ద్వారా రిజర్వాయర్లోనికి నీటిని మళ్లించేలా చూశారు. ప్రస్తుతం మోకా వద్ద ఏర్పాటు చేసిన నీటి పంపింగ్ కేంద్రానికి కర్ణాటక ప్రభుత్వం దాదాపు రూ.39 కోట్లను ఖర్చు చేసింది. ఆంధ్ర సరిహద్దు ఎ.గొనేహాల్ వద్ద కూడా దిగువ కాలువ ద్వారా అక్కడ అక్రమంగా ఏర్పాటు చేసుకున్న 6.00 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని రిజర్వాయర్లోనికి మళ్లించుకుంటున్నారు. ఆ రెండు రిజర్వాయర్లకు తోడు ఆంధ్ర సరిహద్దుకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శివపురం నీటి పంపింగ్ కేంద్రం కూడా చాలా పెద్దది. ఆ పంపింగ్ కేంద్రం ద్వారా అక్కడ గతంలో ఏర్పాటు చేసిన పెద్ద రిజర్వాయర్లోనికి పెద్దపెద్ద మోటార్ల ద్వారా నీటి పంపింగ్ జరుగుతోంది. ఇలా కర్ణాటక దిగువ కాలువ అధికారులు అక్రమంగా రిజర్వాయర్లను ఏర్పాటు చేసుకుని మన తాగునీటి వాటాకు కూడా గండి కొడుతున్నారు. ప్రస్తుతం కర్ణాటక అక్రమ రిజర్వాయర్లలో నీటి నిల్వల కారణంగా ఆంధ్ర సరిహద్దు చింతకుంట, బాపురం, విరుపాపురం తదితర రిజర్వాయర్లలోనికి నీరు సక్రమంగా రాని పరిస్థితి ఏర్పడింది. దిగువ కాలువకు నీటి నిలిపివేత తుంగభద్ర దిగువ కాలువకు తుంగభద్ర డ్యాం నుంచి బళ్లారి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో నీటిని నిలిపి వేశారు. నీరు నిలిపివేసినా ఆంధ్ర సరిహద్దు మైలురాయి 135 నుంచి ఆన్వాల్ 250 మైలురాయి వరకు నాలుగు రోజులపాటు నీరు ప్రవహించే అవకాశం ఉందని ఆంధ్రసరిహద్దు ఎల్లెల్సీ డీఈ నెహేమియా తెలిపారు. పెద్దపెద్ద మోటార్ల ఉపయోగించి నీటిని పంపింగ్ చేసుకొని రిజర్వాయర్లలోనికి మళ్లిస్తామని చెప్పారు.