
సాక్షి, అనంతపురం: కరోనా వైరస్ నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనాపై జరుగుతున్న యుద్ధంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. భౌతిక దూరం పాటిస్తూ రంజాన్ ఘనంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రార్థనాలయాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.