సాక్షి, అనంతపురం : ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతలు దొంగ దీక్షలు ఆపాలని అనంతపురం మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ నాయకుడు అనంతవెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. నాలుగేళ్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. ఈ నాలుగేళ్లలో ఏపీకి ఎందుకు న్యాయం చేయలేకపోయారో చెప్పాలని ఆయన నిలదీశారు. ప్రత్యేక హోదాకు బదులుగా కేంద్రం ప్యాకేజీ ప్రకటిస్తే టీడీపీ నేతలు సన్మానాలు చేశారని, కేంద్రం ఏపీకి అన్నీ ఇస్తోందని చంద్రబాబు ప్రకటించారని గుర్తుచేశారు. ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు కారుస్తూ టీడీపీ నేతలు దీక్షలు చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే ప్రత్యేక హోదాపై ఎన్నికలకు సిద్ధం కావాలని అనంతవెంకట్రామిరెడ్డి సవాల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment