అనంతపురంలో ఆసక్తికర పరిణామం | TDP Leader Campign For YSRCP Candidat | Sakshi
Sakshi News home page

అనంతపురంలో ఆసక్తికర పరిణామం

Published Tue, Apr 2 2019 1:23 PM | Last Updated on Fri, Jul 26 2019 5:42 PM

TDP Leader Campign For YSRCP Candidat - Sakshi

సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న అనంతపురంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అధికార టీడీపీకి చెందిన ప్రముఖ నాయకుడు ఒకరు.. ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు.

అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనంత వెంకట్రామిరెడ్డికి టీడీపీ సీనియర్‌ నేత జయరాం నాయుడు అనూహ్యంగా మద్దతు తెలిపారు. అంతేకాకుండా అనంత వెంకట్రామిరెడ్డి తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అనంతపురం అర్బన్‌ టీడీపీ అభ్యర్థి ప్రభాకర్‌ చౌదరి ప్రజలకు చేసిందేమీ లేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసగించిన ఆయనను ఓడించాలని జయరాం నాయుడు ఓటర్లను కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement