
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడికి ప్రజాసేవ తెలియదని ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి అన్నారు. కరోనా కష్టకాలంలో చంద్రబాబు, లోకేష్ ఇంట్లో దాక్కున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలంతా హోంక్వారంటైన్లో ఉన్నారని ఎద్దేవా చేశారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్‌పై విమర్శలు చేసే నైతిక హక్కు టీడీపీకి లేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుచూపుతో ఆలోచిస్తున్నారని, కరోనా కట్టడి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఏపీలో ప్రతిపక్షాలు బాధ్యత నేర్చుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment