
అనంతపురం సెంట్రల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 1న అనంతపురానికి రానున్నట్టు అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ కోసం అందజేస్తున్న వాహనాలను సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
1వ తేదీన ఉదయం 10 గంటలకు నగరంలోని జూనియర్ కళాశాల మైదానంలో కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. కాగా బుధవారం సాయంత్రం ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, కలెక్టర్ గంధం చంద్రుడు తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment