సాక్షి, అనంతపురం: వైద్యుల నిర్లక్ష్యంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి అనంతపురం ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఫిర్యాదు చేశారు. కరోనా బాధితుల పట్ల వైద్యుల చిన్నచూపు తగదని సూచించారు. వైద్యుల్లో మానవతా దృక్పథం లోపించిందని, నాసిరకమైన భోజనం అందిస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినా కొందరు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం సరికాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. (‘ఆ రాష్ట్రాలతో అతి కొద్ది సమయంలోనే పోటీ పడవచ్చు’)
కాగా ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని వైద్యం చేసేందుకు నిరాకరించే ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. నాన్ కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. (వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అనంత ఫైర్..)
Comments
Please login to add a commentAdd a comment