
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ అనంత, హాజరైన కార్యకర్తలు
అనంతపురం: రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ దగా చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం పార్లమెంటు అధ్యక్షుడు, అనంతపురం అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈనెల 14, 15 తేదీల్లో చేపట్టనున్న సంఘీభావ పాదయాత్ర, 16న కలెక్టరేట్ ఎదుట చేపట్టబోయే ధర్నాను విజయవంతం చేయడంలో భాగంగా గురువారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ అనంతపురం నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ‘అనంత’ మాట్లాడుతూ, 14న ఉదయం 7 గంటలకు అనంతపురంలోని తాడిపత్రి బస్టాండు గాంధీ విగ్రహం వద్దకు చేరుకోవాలన్నారు. 8 గంటలకు సంఘీభావ పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. 15న కూడా పాదయాత్ర ఉంటుందని, 16న కలెక్టరేట్ ఎదుట ధర్నా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకం
బీజేపీ సిద్ధాంతాలకు వైఎస్సార్‌సీపీ పూర్తిగా వ్యతిరేకమన్నారు. అలాంటి బీజేపీతో వైఎస్సార్ సీపీకి సంబంధం ఉందన్నట్లు చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారనీ..దీన్ని ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలను ప్రధాని మోదీ మోసం చేస్తుంటే.. నాలుగేళ్ల పాటు ఎలా భాగస్వామిగా కొనసాగారంటూ చంద్రబాబును ప్రశ్నించారు. కేవలం తన స్వార్థం, లబ్ధి కోసం కేంద్రంతో దోస్తీ చేశారని మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నక్కజిత్తుల చంద్రబాబు మరోమారు మోసగించేందుకు వస్తారని... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. కలిసికట్టుగా పని చేసి వచ్చే అన్ని ఎన్నికల్లోనూ జిల్లాలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. కార్యకర్తల కృషితోనే పార్టీ అధికారంలోకి వస్తుందని అలాంటి కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ఈ ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రధానకార్యదర్శి కిష్టప్ప మాట్లాడుతూ, పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూస్తుంటే టీడీపీపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
మాజీ మేయర్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాగే పరుశురాం మాట్లాడుతూ, అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీని మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. అతినమ్మకం వద్దని కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రధానకార్యదర్శి మహాలక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ బలిజలకు పెద్దపీట వేస్తోందన్నారు. పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించడం పట్ల తమ కులం వారు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వైవీ శివారెడ్డి, మీసాల రంగన్న, నాయకులు బి.ప్రతాప్‌రెడ్డి, అనంత చంద్రారెడ్డి, జయరాంనాయక్, రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, ఎస్సీ సెల్, ట్రేడ్ యూనియన్, సాంస్కృతక విభాగం, గిరిజన విభాగం, రైతు విభాగం, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు పెన్నోబులేసు, మరువపల్లి ఆదినారాయణరెడ్డి, రిలాక్స్ నాగరాజు, సాకే రామకృష్ణ, బోయ నరేంద్రబాబు, మిద్దె భాస్కర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు చింతకుంట మధు, ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, కార్పొరేటర్లు గిరిజమ్మ, జానకి, బాలాంజనేయులు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి, అబూసాలెహ పాల్గొన్నారు.
ఎన్నికల్లో గెలిచి తీరుతాం
పార్టీ అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో అవతల ఎవరు ఉన్నా... ప్రజాభిమానం కలిగిన వైఎస్సార్ సీపీ గెలిచి తీరుతుందన్నారు. ఇపుడున్న ఎండలో నిమిషం కూడా నిలబడలేమని... అలాంటిది ప్రజల కోసం రోజుల తరబడి మండుటెండలో పాదయాత్ర చేయడం జగన్‌కే సాధ్యమైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment