
వేదికపై ఆసీనులైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు
అనంతపురం సప్తగిరి సర్కిల్: రాబోవు ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితుల్లోనూ మతతత్వ పార్టీలతో కలిసి పనిచేసేది లేదంటూ వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల ఆత్మీయత.. రాజకీయాల్లో నిబద్ధత ప్రధాన అంశాలుగా ముందుకు సాగుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైతే ముస్లింలకు అన్ని విధాలుగా లబ్ధి చేకూరుతుందన్నారు. అనంతపురంలోని పద్మావతి ఫంక్షన్ హాల్‌లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ముస్లిం మైనారిటీల సదస్సు విజయవంతమైంది. సదస్సుకు వేలాదిగా ముస్లింలు తరలివచ్చారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముస్లిం మత పెద్దల ప్రార్థనలతో సదస్సును ప్రారంభించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగే పరుశురాం, మహాలక్ష్మి శ్రీనివాస్, మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎస్‌ఎస్ సాదిక్, రాష్ట్ర కార్యదర్శులు జేఎం బాషా, ఖాదర్‌బాషా, గౌస్‌బేగ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వైవీ శివారెడ్డి, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, మైనారిటీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మునీరా బేగం, నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, కోగటం విజయభాస్కరరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలాం, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్‌పీరా, మైనారిటీ విభాగం కార్యదర్శి హబీబుల్లా, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియాజ్, అనంతపురం నియోజకవర్గం మైనార్టీ విభాగం అధ్యక్షుడు సైఫుల్లాబేగ్, మైనారిటీ విభాగం నగర అధ్యక్షుడు రోషన్‌జమీర్, జిల్లా అధికార ప్రతినిధులు మన్సూర్, డాక్టర్ మైనుద్దీన్, నాయకులు వేముల నదీం, వాసంతి సాహిత్య, షెక్షావలి, డాక్టర్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.