
వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేస్తున్న బోయ గిరిజమ్మ
అనంతపురం: ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంటు అధ్యక్షుడు, అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త అనంత వెంకటరామిరెడ్డి సూచించారు. మహిళా విభాగం అనంతపురం పార్లమెంటు అధ్యక్షురాలిగా నియమితురాలైన బోయ గిరిజమ్మ బుధవారం అనంత వెంకటరామిరెడ్డిని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ పార్టీలో నాయకులందరినీ కలుపుకొని వెళ్తూ పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. అనంతరం గిరిజమ్మ మాట్లాడుతూ పార్టీ తనపై నమ్మకం ఉంచి అప్పగించిన పదవికి న్యాయం చేసేందుకు అంకితభావంతో పని చేస్తానన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానన్నారు.
నాయకులు, కార్యకర్తలు, మహిళలను కలుపుకొని ముందుకు వెళ్తానన్నారు. తనకు అవకాశం కల్పించేందుకు సహకరించిన పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ అనంతవెంటకరామిరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా సుభాష్‌రోడ్డులోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2వ డివిజన్‌కు చెందిన సూరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. శివ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి గిరిజమ్మను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు, రమేష్, సుబహాన్, హాజీపీరా, రవి, సంతోష్, చైతు, కిట్టా, పవన్, రాజశేఖర్, రత్నమ్మ, లలిత, ప్రశాంతి, విజయశాంతి, దేవి, జాహ్నవి, బాపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, దస్తగిరి, రాజు, విశ్వనాథ్, సుభహాన్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.