‘ఏపీ రైతులకు భిక్షాటన పరిస్థితి బాధాకరం’
అనంతపురం: రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 172మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
4లక్షలమంది రైతులు, కూలీలు వలస వెళ్లినా ప్రభుత్వం పట్టించుకోలేదని, కేరళలో రైతులు భిక్షాటన చేయడం ఏపీకి అవమానకరం అని ఆందోళన వ్యక్తం చేశారు. అనంత రైతులు రూ.4వేల కోట్ల విలువైన పంట నష్టపోతే కేవలం రూ.450 కోట్ల ఇన్సురెన్స్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బజాజ్ ఇన్సూరెన్స్ సంస్థతో ప్రభుత్వం కుమ్మక్కైందని మండిపడ్డారు.