'బెదిరించడం జేసీ బ్రదర్స్కు అలవాటు' | Anantha venkatramireddy fires on JC Prabhakarreddy | Sakshi
Sakshi News home page

'బెదిరించడం జేసీ బ్రదర్స్కు అలవాటు'

Published Mon, Mar 6 2017 1:45 PM | Last Updated on Fri, Jun 1 2018 9:07 PM

'బెదిరించడం జేసీ బ్రదర్స్కు అలవాటు' - Sakshi

'బెదిరించడం జేసీ బ్రదర్స్కు అలవాటు'

అనంతపురం :
జేసీ బ్రదర్స్పై మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ప్రశ్నించే వారిని బెదిరించడం జేసీ బ్రదర్స్కు అలవాటు అని ధ్వజమెత్తారు. తాడిపత్రి ఆడపడుచు వైఎస్ విజయమ్మపై దూషణలు చేయడం సభ్యత కాదని నిప్పులు చెరిగారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై హేలనగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

తేల్చుకుందాం రా అంటూ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నారని అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. నిజంగా జేసీ బ్రదర్స్కు దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేయాలని సవాలు విసిరారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement