jc prabhakarreddy
-
ఎమ్మెల్యే జేసీపై అట్రాసిటీ కేసు
పెద్దపప్పూరు : అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం తాడిపత్రి ఎంఎల్ఏ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదయింది. గత నెల 24న జూటూరు వద్ద ఆర్డీఓ పర్మిషన్తో తాడిపత్రి మండలంలోని చిన్నపడమల వద్దనున్న శ్రీకృష్ణ ప్రభోదానంద ఆశ్రమం నిర్మాణానికి కావాల్సిన ఇసుక తీసుకొని వెళ్తున లారీని జేసీ ప్రభాకర్‌రెడ్డి పెద్దపప్పూరుకు వస్తూ పోలీసులకు అప్పగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో లారీ డ్రైవర్ దాసరి వెంకటేష్‌ను కులం పేరుతో దూషించినట్లు బాధితుడు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసారు. హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు పెద్దపప్పూరు స్టేషన్లో ఎంఎల్ఏపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయమై ఎస్ఐ శ్రీహర్షను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించేందుకు నిరాకరించారు. -
స్వేచ్ఛకు సంకెళ్లు !
– సోషల్ మీడియా యాక్టివిస్టులపై సర్కారు కక్ష – జేసీ ప్రభాకర్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేశారంటూ ఇప్పాల రవీంద్ర అరెస్టు – జేసీపీఆర్ బహిరంగంగానే దుర్భాషలాడినా చేష్టలుడిగిన ప్రభుత్వం – రవీంద్ర అరెస్టు భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమేనంటున్న నెటిజన్లు, మేధావులు (సాక్షిప్రతినిధి, అనంతపురం) సోషల్ మీడియా.. సమాజంలోని ప్రతి అంశంపై ఎవరి అభిప్రాయాలను వారు తెలియజేసేందుకు చక్కటి వేదిక! ఇంతకుముందు చర్చలు, విమర్శలు, అభిప్రాయాలకు పత్రికలు, టీవీ ఛానెళ్లు మాత్రమే ప్రధాన మాధ్యమంగా ఉండేవి. స్మార్ట్ఫోన్ల వాడకం విరివిగా పెరిగిన తర్వాత చాలామంది సోషల్ మీడియాను కూడా ఇందుకు వేదికగా చేసుకుంటున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు పలు సామాజిక వెబ్సైట్లు ఇందుకు దోహదపడుతున్నాయి. సోషల్ మీడియాలో అభిప్రాయాలు పంచుకునే, చర్చలు సాగించేవారి సంఖ్య మూడేళ్లలో భారీగా పెరిగింది. వీరు తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా వ్యక్తపరుస్తున్నారు. నచ్చిన వాటిని కొందరు షేర్ చేస్తున్నారు. మరికొందరు ‘లైక్’ కొడుతున్నారు. సదరు అంశంపై ఇంకొందరు ‘కామెంట్’ పెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వాలు దీన్ని గౌరవిస్తూ వస్తున్నాయి. అయితే.. టీడీపీ ప్రభుత్వం మాత్రం విమర్శలను స్వీకరించలేకపోతోంది. విమర్శించే పత్రికలు, టీవీలపై ఇన్నాళ్లూ ఒంటికాలితో లేచిన టీడీపీ నేతలు.. ఇప్పుడు నెటిజన్ల విమర్శలను కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వానికి, అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారిని అరెస్టులు చేస్తున్నారు. జేసీపై పోస్టులు చేశారని రవీంద్ర అరెస్టు ఇప్పాల రవీంద్ర అనే వ్యక్తి బెంగళూరులో నివాసం ఉంటున్నారు. ఈయన ప్రభుత్వంపై వ్యతిరేక పోస్టులు వైరల్ చేస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. విశాఖపట్నంలోని కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉంచారు. కాగా..తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపైనా రవీంద్ర సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తాడిపత్రి జెడ్పీటీసీ సభ్యురాలు సావిత్రి ఈ ఏడాది మార్చి ఏడున తాడిపత్రి ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. ఈ కేసును తాడిపత్రి టౌన్ పోలీసుస్టేషన్‌కు కోర్టు బదిలీ చేసింది. ఈ క్రమంలో మార్చి 8న పోలీసులు కేసు నమోదు (క్రైం నంబర్ 78/17) చేశారు. అయితే.. కేసు నమోదు చేసినప్పటికీ రవీంద్రను అరెస్టు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ జేసీ వర్గీయులకు చెందిన ‘తాడిపత్రి సమాచార్’ పత్రికలో గురువారం కథనం వచ్చింది. ఇదేరోజు తాడిపత్రి పోలీసులు విశాఖకు బయలుదేరారు. శుక్రవారం అక్కడి జైలు సూపరింటెండెంట్‌ను కలిసి రవీంద్రను కస్టడీలోకి తీసుకున్నారు. కథనం ప్రచురితమైన రోజే పోలీసులు స్పందించి వెళ్లారంటే రవీంద్రను తాడిపత్రికి తీసుకొచ్చేందుకు వ్యూహం రచించి, దాన్ని పక్కాగా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జేసీపై చర్యలేవీ? సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు చేసినందుకు రవీంద్రను అరెస్టు చేసిన పోలీసులు.. రాష్ట్ర ప్రతిపక్ష నేతను వ్యక్తిగతంగా, పత్రికల్లో రాయలేని పదజాలంతో దూషించిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. జేసీ వ్యాఖ్యలు సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని, ఇతను మా ఎమ్మెల్యే అని చెప్పుకునేందుకే సిగ్గుగా ఉందని ప్రజలు చర్చించుకున్నారు. కొందరు ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ సెల్ఫోన్లతో వీడియోలు తీసి..వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి నిరసన తెలియజేశారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగింది. ప్రతిపక్ష నేతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి జేసీ ప్రభాకర్‌పై ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇందుకు కారణం ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే కావడమే! రవీంద్ర సామాన్య వ్యక్తి కాబట్టే ఆయనపై అధికార, పోలీసు జులుం ప్రదర్శిస్తున్నారు. అరెస్టులపై నెటిజన్ల మండిపాటు రవీంద్రను అరెస్టు చేయడంపై ‘అనంత’ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆయన్ను తాడిపత్రి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల తీరును సర్వత్రా ఖండిస్తున్నారు. ఈ అరెస్టు భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు. అరెస్టులతో సోషల్ మీడియాను కట్టడి చేయలేరని, మంచిని అభినందించడం, తప్పును ఎత్తిచూపే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని చెబుతున్నారు. రవీంద్ర అరెస్టును మేధావులు, విద్యార్థులు, సామాజికవేత్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రతిపక్ష నేతపై పరుష వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి గానీ.. సామాన్యులపై కాదని పోలీసులు, ప్రభుత్వానికి హితవు పలుకుతున్నారు. -
రాజీనామా చెయ్.. తేల్చుకుందాం
జేసీపీఆర్‌పై మాజీ ఎంపీ అనంత ఆగ్రహం ‘రా..తేల్చుకుందాం’ అంటున్నారు... వీుకంత మోజు ఉంటే రాజీనామా చేయండి. ప్రజల్లోకి పోదాం.. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. టీడీపీ నేతలంతా రాజీనామా చేస్తారా...? లేదంటే నువ్వు,. నీ సోదరుడు రాజీనామా చేయండి.. అప్పుడు తేల్చుకుందాం. ► రాజీనామాలు చేసి రండి ► జేసీ ప్రభాకర్ వ్యాఖ్యలకు సభ్య సమాజం తలదించుకుంటోంది ► తాడిపత్రిలోని పరిశ్రమలన్నీ జేసీకి కప్పం కట్టాల్సిందే ► జేసీ సోదరులపై మాజీ ఎంపీ అనంత ఫైర్ అనంతపురం : రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన సతీమణి, వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పట్ల తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు, వాడిన పదజాలం సభ్యసమాజంలో అందరూ తలదించుకునేలా ఉందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరావిురెడ్డి విమర్శించారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ కుటుంబం పై జేసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 20–25 ఏళ్లుగా జేసీని చూస్తున్నామనీ, అందరినీ బెదిరించి లొంగదీసుకుందామనే ధోరణిలోనే ఆయన రాజకీయ చరిత్ర ఉందన్నారు. ప్రభాకర్‌రెడ్డి మాటలు వింటుంటే ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అనే అనుమానాలు అందరిలో మెదలవుతున్నాయన్నారు. కేవలం ‘సాక్షి’ పత్రికనో, వైఎస్ జగన్నో కాదు వారి దురాగతాలను ఏ పత్రిక, రాజకీయ పార్టీ ప్రశ్నించినా వారిపట్ల ఇదే రకంగా వ్యవహరిస్తారని ధ్వజమెత్తారు. నాయకులను ఎస్సీ ఎస్టీ కేసులంటూ కోర్టుకు ఈడ్చి బ్లాక్మెయిల్ చేస్తారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తాడిపత్రిలో ఆటవిక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారన్నారు. ప్రజల హృదయాలను గెలుచుకున్న మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానాన్ని కూడా అపహాస్యం చేసేలా మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. చివరికి తాడిపత్రి నియోజకవర్గ ఆడబిడ్డ అనేది కూడా మరచిపోయి విజయమ్మపై కూడా విచక్షణ, జ్ఞానం లేకుండా మాట్లాడారన్నారు. ఏం మాట్లాడినా ‘రా..తేల్చుకుందాం’ అంటున్నారనీ, ఏం తేల్చుకుంటాం కుస్తీలు పట్టేందుకు ఏమైనా రౌడీలా అని ప్రశ్నించారు. మీకంత మోజు ఉంటే రాజీనామా చేయండి. ప్రజా క్షేత్రంలోకి వెళ్లి తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తమ మాట వినలేదని గతంలో ఆర్టీఏ అధికారులు, పోలీసులను అనేకమార్లు బెదించారని విమర్శించారు. అందరూ భయపడితే ఎంతవరకైనా బెదిరిస్తారని, జరక్కపోతే తోక ఎలా ముడుచుకుంటాడో కూడా తెలుసని చెప్పారు. ముఖ్యమంత్రులను, అధికారంలో ఉన్నవారిని పొగిడి ఎలా పనులు చేసుకుంటాడో ప్రజలందరికీ తెలుసన్నారు. చెన్నారెడ్డిని మొదలుకుని జనార్ధన్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, మధ్యలో టీడీపీ తప్ప తర్వాత వచ్చిన వైఎస్, ఆయన తర్వాత వచ్చిన సీఎంలు, ప్రస్తుత ముఖ్యమంత్రి చందబాబును తమ దందాను జరుపుకునేందుకు ఎలా పొగిడారో తెలుసన్నారు. జరక్కపోతే మాత్రం 1994లో జిల్లాలో రాజకీయాలనే ధారాదత్తం చేసి బెంగళూరు, హైదరాబాద్‌కు పారిపోయిన విషయమూ తెలుసన్నారు. అలాంటి వారా జగన్ గురించి మాట్లాడేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అవసరాలు జేసీ సోదరులకు ఉన్నాయి, వీరి అవసరాలు ముఖ్యమంత్రికి ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ ఒత్తిడితో వారు చెప్పింది చేయకపోతే బదిలీలు చేస్తారనే భయం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో ఉందన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎదురుదాడికి దిగుతున్నారన్నారు. జిల్లాలో అదృష్టమో దురదృష్టమో తెలీదుకాని తాడిపత్రిలో చాలా పరిశ్రమలు ఉన్నాయన్నారు. అందరూ వీరికి కప్పం కట్టాలి్సందేనన్నారు. ఇవన్నీ చంద్రబాబుకు తెలీదా? అని ప్రశ్నించారు. సమావేశంలో కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, పార్టీ నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు రిలాక్స్ నాగరాజు, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు. -
'బెదిరించడం జేసీ బ్రదర్స్‌కు అలవాటు'
అనంతపురం : జేసీ బ్రదర్స్‌పై మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ప్రశ్నించే వారిని బెదిరించడం జేసీ బ్రదర్స్‌కు అలవాటు అని ధ్వజమెత్తారు. తాడిపత్రి ఆడపడుచు వైఎస్ విజయమ్మపై దూషణలు చేయడం సభ్యత కాదని నిప్పులు చెరిగారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై హేలనగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తేల్చుకుందాం రా అంటూ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నారని అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. నిజంగా జేసీ బ్రదర్స్‌కు దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేయాలని సవాలు విసిరారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. -
జేసీ ప్రభాకర్ గూండాగిరీ
- ‘సాక్షి’ ఎడిషన్ కార్యాలయం ఎదుట అనుచరులతో కలిసి హల్చల్ - బస్సు ప్రమాద ఘటనపై నిజాలు రాయడాన్ని జీర్ణించుకోలేకపోయిన వైనం - స్థాయి, సభ్యత, సంస్కారం మరచి దురుసు ప్రవర్తన - తాడిపత్రి ఎమ్మెల్యే తీరును తప్పుబడుతున్న అన్ని వర్గాల ప్రజలు (సాక్షి ప్రతినిధి, అనంతపురం) రాజకీయ కుటుంబం.. 60 ఏళ్లకు పైబడి వయస్సు..తొలిసారి ఎమ్మెల్యే.. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాల్సిన నాయకుడు.. అలాంటి వ్యక్తి నోటి నుంచి వెలువడే ప్రతిమాట జాగ్రత్తగా, హుందాగా ఉండాలి. కానీ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నీ మరచిపోయారు. విచక్షణ కోల్పోయారు. కాదు..కాదు..సభ్యత, సంస్కారం లేకుండా ప్రవర్తించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై ‘సాక్షి’ నిజాలు రాయడాన్ని, బాధితుల తరఫున ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించడాన్ని జేసీ ప్రభాకర్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. శనివారం అనుచరులతో కలిసి వచ్చి అనంతపురంలోని ‘సాక్షి’ ఎడిషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తానో ప్రజాప్రతినిధి అనే విషయం మరచిపోయి దుందుడుకు ప్రవర్తనతో రెచ్చిపోయారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగారు. పత్రికల్లో రాయలేని, గౌరవప్రదమైన వ్యక్తులు చర్చించుకోలేని.. ఒక్కమాటలో చెప్పాలంటే ‘అది నోరా...తాటిమట్టా?’ అనేలా మాట్లాడారు. తద్వారా తనను తాను దిగజార్చుకున్నారు. ఎమ్మెల్యే పదవి గౌరవాన్ని దిగజార్చేలా, రాజకీయవ్యవస్థ సిగ్గుపడేలా ప్రవర్తించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజాజీవితంలో ఉన్నవారు తమపై వచ్చిన ఎలాంటి ఆరోపణలకైనా సమాధానం చెప్పాలి.. కానీ ఇలా స్థాయిని మరచి మాట్లాడం సంస్కారం కాదని తప్పుబడుతున్నారు. తోటి ప్రజాప్రతినిధులను గౌరవించాలనే విజ్ఞతను గుర్తురెగాలని సూచిస్తున్నారు. ఇప్పటికైనా తాను ఏం మాట్లాడారో ప్రభాకర్‌రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హితవు పలుకుతున్నారు.