ఎమ్మెల్యే జేసీపై అట్రాసిటీ కేసు | atracity case file on mla jc prabhakarreddy | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే జేసీపై అట్రాసిటీ కేసు

Published Tue, Jul 4 2017 11:10 PM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM

atracity case file on mla jc prabhakarreddy

పెద్దపప్పూరు : అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం తాడిపత్రి ఎంఎల్‌ఏ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదయింది. గత నెల 24న జూటూరు వద్ద ఆర్‌డీఓ పర్మిషన్‌తో తాడిపత్రి మండలంలోని చిన్నపడమల వద్దనున్న శ్రీకృష్ణ ప్రభోదానంద ఆశ్రమం నిర్మాణానికి కావాల్సిన ఇసుక తీసుకొని వెళ్తున లారీని జేసీ ప్రభాకర్‌రెడ్డి పెద్దపప్పూరుకు వస్తూ పోలీసులకు అప్పగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో లారీ  డ్రైవర్‌ దాసరి వెంకటేష్‌ను కులం పేరుతో దూషించినట్లు బాధితుడు హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేసారు. హెచ్‌ఆర్‌సీ ఆదేశాల మేరకు పెద్దపప్పూరు స్టేషన్‌లో ఎంఎల్‌ఏపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయమై ఎస్‌ఐ శ్రీహర్షను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించేందుకు నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement