
విజయసాయి రెడ్డి (ఫైల్ ఫొటో)
బాధితురాలు, కాలేజీ విద్యార్థులతో కలిసి వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలెక్టర్‌కు సోమవారం వినతి పత్రం ఇచ్చారు.
సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో గతవారం జరిగిన అత్యాచారయత్నం ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధిత విద్యార్థికి అండగా నిలిచింది. విద్యార్థినిపై అత్యాచార యత్నం చేసిన కళాశాల కరస్పాండెంట్ వెంకట సత్య నరిసింహ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు బాధితురాలు, కాలేజీ విద్యార్థులతో కలిసి వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలెక్టర్‌కు సోమవారం వినతి పత్రం ఇచ్చారు. కాగా, మాయ మాటలు చెప్పి ఇంటికి రప్పించుకున్న కరస్పాండెంట్ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిపై గత సోమవారం లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే.