Inter student
-
హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇటీవల విద్యార్థుల బలవన్మరణాల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పలు కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం.. హయత్‌నగర్‌లో కుంట్లూరు మైనార్టీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థిని సౌమ్య హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది.కాగా, నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన విద్యార్థిని భార్గవి (19) తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. గ్రామానికి చెందిన దర్శనం చంద్రయ్య, బాలవ్వ దంపతుల రెండో కూతురు భార్గవి హైదరాబాద్‌లో గల ఆంధ్ర మహిళా సభలోని హాస్టల్లో ఉంటూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. జామై ఉస్మానియా రైల్వే ట్రాక్‌పై మృతదేహం లభ్యమైంది. -
కాలేజీకి వెళ్లమన్నారని..
పాపన్నపేట(మెదక్): కాలేజీకి వెళ్లమన్నందుకు ఒక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడిచన్‌పల్లిలో శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్‌గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అరిగె కృష్ణ కూతురు సింధుజ (19) మెదక్‌లోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. నెల రోజులుగా కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే దిగాలుగా కూర్చుంటోంది. కళాశాలకు వెళ్లాలని కుటుంబ సభ్యులు శనివారం ఆమెపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అదేరోజు ఇంట్లో ఉన్న తమ్ముడిని బయటకు పంపిన సింధుజ.. ఉరి వేసుకుంది. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆçస్పత్రికి పోలీసులు తరలించారు. -
ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి
-
బాలికపై ఇంటర్ విద్యార్థి లైంగిక దాడి
తిరుపతి క్రైమ్: ఎనిమిదేళ్ల బాలికపై ఇంటర్ విద్యార్థి లైంగిక దాడికి పాల్పడిన ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతిలోని ఎంఆర్‌పల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి బాలాజీ నగర్‌లోని కాలేజీలో చదువుకుంటూ అక్కడికి దగ్గర్లో ఉన్న అమ్మమ్మ ఇంట్లో ఉండేవాడు. వీరి ఇంటికి సమీపంలోనే బాలిక కుటుంబం నివసిస్తోంది. పదో తరగతి చదువుతున్న బాలిక అన్నతో సన్నిహితంగా ఉంటూ వారింటికి వచ్చిపోతూ ఉండేవాడు. పది రోజుల కిందట బాలికకు చాక్లెట్లు కొనిస్తానని చెప్పి అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే మీ అమ్మానాన్నల్ని చంపేస్తానని బెదిరించడంతో బాలిక ఎవరికీ చెప్పలేదు. అలా బెదిరిస్తూ నాలుగుసార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలికకు జ్వరం, కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. లైంగికదాడి జరిగినట్లు వైద్యులు గుర్తించడంతో తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా విషయం చెప్పింది.దీంతో తల్లిదండ్రులు ఎస్వీ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేసి పోక్సో కేసు నమోదుచేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా నగరంలో నివసించే రిటైర్డ్ డీఎస్పీ ఇంట్లో నిందితుడి అమ్మమ్మ పనిచేస్తుండటంతో అతను పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించారు. బాలిక బంధువులు, కుటుంబీకులు దాడిచేసేందుకు ప్రయత్నించడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. -
శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య
-
పిఠాపురం నియోజకవర్గంలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
-
పిఠాపురం: ఇంటర్ విద్యార్థిని అదృశ్యం..
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గంలో ఇంటర్ విద్యార్ధిని అదృశ్యమైంది. 15 రోజుల క్రితం కళాశాలకు వెళ్లిన కొడవలి గ్రామానికి చెందిన వరలక్ష్మీ(16) మిస్సింగ్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్తిపాడులో విద్యార్థిని ఇంటర్ ఫస్ట్‌యర్ చదువుతోంది.తొలుత గొల్లప్రోలు పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన యువతి తల్లిదండ్రులతో పోలీసులు హేళనగా మాట్లాడారు. దీంతో గత నెల 22న ప్రత్తిపాడు పీఎస్ లో వరలక్ష్మీ అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. వరలక్ష్మీ ఆచూకీ తెలియక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. తమ కుమార్తె జాడ కోసం సాయం చేయాలని వరలక్ష్మీ తల్లిదండ్రులు పవన్‌కు లేఖ రాశారు. -
ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు అర్థం కావడంలేదని..
చిలుకూరు: ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు అర్థం కావడం లేదని, దీంతో మార్కులు తక్కువ వస్తున్నాయని ఇంటర్ విద్యార్థి మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని కవిత జూనియర్ కళాశాలలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం సజ్జాపురానికి చెందిన బీమన శేఖర్ కుమారుడు బీమన వినయ్ (17) చిలుకూరు మండల పరిధిలోని కవిత జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూప్‌లో చేరాడు. 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివిన వినయ్.. ఇంటర్లో ఇంగ్లిష్ మీడియంలో సబ్జెక్టులు అర్థంకాక మార్కులు తక్కువగా వస్తున్నాయని కొంతకాలంగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన వినయ్ తిరిగి కళాశాలకు వెళ్లడానికి ఇష్టపడలేదు. దీంతో తల్లిదండ్రులు సర్ది చెప్పి ఆదివారం అతడిని మేనమామ, బంధువులు తీసుకొని వచ్చి కళాశాలలో విడిచి పెట్టి వెళ్లారు. ఆ సమయంలో స్టడీ అవర్స్ నడుస్తుండటంతో విద్యార్థులు, అధ్యాపకులు తరగతి గదుల్లో ఉన్నారు. హాస్టల్ గదిలో లగేజీ పెట్టి వస్తానని వెళ్లిన వినయ్ అక్కడున్న ఫ్యాన్‌కు టవల్‌తో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరగంట తరువాత గమనించిన తోటి విద్యార్థులు, అధ్యాపకులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కోదాడలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వినయ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాంబాబు తెలిపారు. దసరా సెలవులు ముగించుకుని తిరిగి వెళ్లిన రోజే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. -
స్నేహితులే అలా చేసేసరికి.. నంద్యాల ఇంటర్ విద్యార్థి కేసులో విస్తుపోయే విషయాలు!
నంద్యాల, సాక్షి: ఆత్మకూరు ఇంటర్ విద్యార్థి అదృశ్యం కేసు.. విషాదాంతంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు విస్తుపోయే వివరాల్ని మీడియాకు వెల్లడించారు. స్నేహితులే అతన్ని ఎత్తుకెళ్లడం, ఆపై అమానవీయంగా ప్రవర్తించడంతో అతను బలవర్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. ఆత్మకూరు మండలం కొత్తపేటకు చెందిన ఇంటర్ విద్యార్థి వహీద్ బాషా ఈ నెల 13న కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లి అడిగారు. వహీద్ కళాశాల ప్రాంగణంలో తిరిగి వెళ్లినట్లు తెలుసుకున్నారు. అయితే వహీద్ స్నేహితులే అతన్ని కిడ్నాప్ చేసినట్లు అనుమానించారు. ఆ నలుగురు యువకులపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు తెలిపారు. ఈలోపు మూడు రోజులు గడిచాయి. అయినా వహీద్ జాడ తెలియకపోవడంతో అతని కుటుంబంలో ఆందోళన పెరిగిపోయింది. ఈలోపు.. ఆత్మకూరు శివారులోని ఓ బావిలో వహీద్ శవమై కనిపించాడు. దీంతో.. ఇది హత్యా? ఆత్మహత్యా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగింది. చివరకు.. స్నేహితుల వల్లే వహీద్ చనిపోయాడని పోలీసులు నిర్ధారించారు. అర్బన్ సీఐ లక్ష్మినారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. వహిద్‌కు స్నేహితులతో ఏవో గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో అతన్ని కిడ్నాప్ చేసిన తీవ్రంగా కొట్టిన యువకులు.. అతన్ని దుస్తులు విప్పించి బలవంతంగా ఫొటోలు తీశారు. దాడి గురించి బయట ఎవరికైనా చెబితే ఆ ఫొటోల్ని నెట్లో పెడతామని బెదిరించారు. దీనిని అవమానభారంగా భావించిన వాహిద్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు కారకులైన నలుగురు యువకుల్ని అరెస్ట్ చేశాం అని తెలిపారయన. -
అనకాపల్లిలో మైనర్‌పై అత్యాచారం
అనకాపల్లి: మైనర్ బాలిక(14)పై అత్యాచారం చేసి, గర్భవతిని చేసిన ఇంటర్ విద్యార్థిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ తేజేశ్వరరావు బుధవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు. వి.మాడుగుల మండలం కింతలివల్లాపురం గ్రామానికి చెందిన కుటుంబం పనుల నిమిత్తం అనకాపల్లి మండలం ఊడేరు గ్రామానికి వలస వచ్చారు. అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి బాలికపై అత్యాచారం చేశాడు. ప్రస్తుతం 5వ నెల గర్భవతి. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తేజేశ్వరరావు తెలిపారు. -
క్లాస్ రూంలో దారుణం.. లెక్చరర్ ప్రాణం తీసిన ఇంటర్ విద్యార్ధి
విద్యా బుద్దులు నేర్పించే గురువులపై విద్యార్ధులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.ఎందుకు సరిగ్గా చదవడం లేదు? అని ప్రశ్నించిన పాపానికి ఓ గురువు ప్రాణం తీశాడో ఇంటర్ విద్యార్ధి. క్లాసు రూంలోనే విచాక్షణా రహితంగా కత్తితో కసితీరా పొడిచి చంపాడు.అస్సోం రాష్ట్రం గౌహతిలో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అస్సాంలోని శివసాగర్ జిల్లాలో రాజేష్ బారువా బెజవాడ (55) కెమిస్ట్రీ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తూనే..సొంతంగా ఓ స్కూల్‌ను రన్ చేస్తున్నారు.అయితే శుక్రవారం ఎప్పటిలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ సబ్జెట్ చెప్పేందుకు క్లాస్‌కు వచ్చాడు. అనంతరం క్లాస్ రూంలో సరిగ్గా చదవడం లేదని, మీ తల్లిదండ్రుల్ని పిలుచుకుని రావాలని ఓ విద్యార్ధిని మందలించారు.ఆ మరసటి రోజు సదరు విద్యార్ధి సివిల్ డ్రెస్‌తో క్లాస్‌కు వచ్చాడు. పాఠం చెప్పేందుకు క్లాసుకు వచ్చిన రాజేష్ బారువా..సదరు విద్యార్ధిని మీ పేరెంట్స్‌ను పిలుచుకుని రమ్మనమన్నాను కదా.. పిలుచుకుని వచ్చావా? అని ప్రశ్నించారు. విద్యార్ధిని సమాధానం చెప్పకపోవడంతో ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ గట్టిగా అరిచారు.దీంతో అప్పటికే పక్కా ప్లాన్‌తో క్లాసుకు వచ్చిన విద్యార్ధి తన జేబులో ఉన్న పదునైన కత్తితో లెక్చరర్ రాజేష్‌పై దూసుకెళ్లాడు. తలమీద తీవ్రంగా పొడిచాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. విద్యార్ధి దాడితో తీవ్ర గాయాలపాలైన రాజేష్ కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన సిబ్బంది, విద్యార్ధులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గం మధ్యలోనే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
భుజం..భుజం..రాసుకుందని..
హైదరాబాద్: చిన్న గొడవ కారణంగా చోటు చేసుకున్న ఘర్షణ ఒకరి హత్యకు దారితీసిన సంఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగి ంది. బాలంరాయి అంబేడ్కర్‌నగర్‌లో మంగళవారం రాత్రి జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నా యి. అంబేద్కర్‌నగర్‌లో నివాసం ఉంటున్న రాజు, యాదమ్మ దంపతుల కుమారుడు బి.తరుణ్ (18) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. మంగళవారం రాత్రి అత ను స్థానిక శివాలయం సమీపంలోని చౌరస్తాలో ఉన్న ఓ పాన్ షాప్ వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ యువకుడి భుజం తరుణ్‌కు తగిలింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో సదరు యువకుడు మరో ముగ్గురిని తీసుకువచ్చాడు. నలుగురూ కలిసి తరుణ్‌తో గొడవకు దిగారు. పరిస్థితి అదుపుతప్పి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో తమ గదికి వెళ్లిన వారు కత్తి తీసుకువచ్చి తరుణ్‌ను పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తల్లి యాదమ్మ పోలీసులకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల అదుపులో నిందితులు.. బేగంపేట పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన శివశంకర్, తరుణ్, జహీరాబాద్‌కు చెందిన పండు, సాయికిరణ్ తరుణ్‌ను హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు ఉద్యోగం కోసం నగరానికి వచ్చి ఈ నెల 1న అంబేడ్కర్‌నగర్‌లో గదిని అద్దెకు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల్లో ఒకరైన సాయికిరణ్, బీ తరుణ్ మధ్య మొదట గొడవ జరగ్గా, సాయికిరణ్ మిగతా ముగ్గురిని తీసుకురావడంతో గొడవ పెద్దదై హత్యకు దారితీసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. -
ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
హసన్‌పర్తి: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి పరిధి భీమారంలోని ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన హాస్టల్లో శుక్రవారం తెల్లవారుజామున ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే తమ కూతురును హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, బంధువులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్ల కనపర్తికి చెందిన వలుగుల ప్రభాకర్, కవిత దంపతుల పెద్దకూతురు సాహిత్య (17) భీమారంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఆమె అదే కళాశాల హాస్టల్లోనే ఉంటోంది. ఇటీవల ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో గత సబ్జెక్టుల్లో సాహిత్య అనుకున్నంత మేరకు పరీక్షలు రాయలేదు. దీంతో సాహిత్య మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె వద్ద లభ్యమైన సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది. భవనంపై నుంచి దూకి..? సాహిత్య, కళాశాల హాస్టల్ భవనం పైనుంచి శుక్రవారం తెల్లవారు జామున దూకి ఉండవచ్చని పోలీ సులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం సాహిత్య కింద పడి ఉండటం గమనించిన కళాశాల యాజమాన్యం హుటాహుటిన ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. అక్కడినుంచి ఎంజీఎంకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. సూసైడ్ నోట్ లభ్యం.. ఇదిలా ఉండగా సాహిత్య రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘జువాలజీ పరీక్ష రోజు చనిపోతున్నా’అని అందులో పేర్కొంది. అయితే పోలీసులు స్వా«దీనం చేసుకున్న ఆ సూసైడ్ నోట్ తన కూతురిది కాదని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కూతురును హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ రాసి పెట్టారని తెలిపారు. భవనంపై నుంచి దూకితే చేతిపై బ్లేడ్‌తో కోసిన గాయాలు ఎలా అయ్యాయని ప్రశ్నించారు. తమ కూతురు మృతదేహాన్ని గోప్యంగా ఎందుకు ఎంజీఎంకు తరలించారన్నారు. కళాశాల ఎదుట ఆందోళన తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. సుమారు నాలుగు గంటల పాటు ఈ ఆందోళన కొనసాగింది. వారి ఆందోళనకు వి ద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి, స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ సంజీవ, ఎస్సైలు రాజ్‌కుమార్, సురేశ్‌లు ఆందోళనకారులను శాంతింపజేశారు. సాహిత్య మరణంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ సంజీవ తెలిపారు. కళాశాలలో ఉన్న సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అలాగే సూసైడ్ నోట్‌ను ఫోరెనిక్స్ పరీక్షలకు పంపించనున్నట్లు చెప్పారు. నేత్ర దానం సాహిత్య నేత్రాలు దానం చేశారు. తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రాంతీయ నేత్ర వైద్యశాల, వరంగల్ సిబ్బంది నేత్రాలు సేకరించారు. -
ఆదిలాబాద్ జిల్లాలో విషాదం..విద్యార్థి ఆత్మహత్య
-
సూర్యాపేట జిల్లా ఇమాంపేట గురుకులంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
-
ఇంటర్ విద్యార్థి దారుణ హత్య
కోలారు: మైనర్ బాలున్ని మరో మైనర్ బాలుర గుంపు చిత్ర హింసలకు గురి చేసి హత్య చేసింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో కోలారు నగరంలోని పీసీ కాలనీలో చోటు చేసుకుంది. సోషల్ మీడియా దుష్ప్రభావం, బాలలు, యువతలో పెరుగుతోన్న నేర ప్రవృత్తికి ఈ హత్య అద్దం పడుతోంది. కోలారు శాంతి నగర్‌కు చెందిన కార్మికుడు అరుణ్, సుశీల కుమారుడు కార్తీక్ సింగ్ (17) హత్యకు గురైన బాలుడు. వివరాలు.. కార్తీక్‌సింగ్ నగరంలోని కాలేజీలో ఫస్ట్ ఇయర్ ఇంటర్ చదువుతున్నాడు. పీసీ కాలనీకి చెందిన మరో మైనర్ బాలునికి కార్తీక్సింగ్తో గొడవలు ఉన్నాయి. నిందితుడు, అతని స్నేహితులు కార్తీక్ సింగ్‌కు పుట్టిన రోజు పార్టీ ఉందని చెప్పి తెలిపి ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలోకి పిలిపించారు. అక్కడ అతన్ని తీవ్రంగా కొట్టి చిత్రహింసలు పెట్టారు. కత్తితో గొంతు కోసి పరారయ్యారు. రక్తపుమడుగులో మృతదేహం పడి ఉన్న వీడియోలు వైరల్ అయ్యాయి. నిందితుని నేరాల బాట వేమగల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పోలీస్ మురుగన్ కుమారుడు దిలీప్ అలియాస్ షైన్ సూత్రధారి అని ప్రచారం సాగుతోంది. దిలీప్ గత ఫిబ్రవరి నెలలో కూడా ఒకసారి కత్తితో ఒకరిపై దాడి చేశాడు, దీనిపై కోలారు నగర పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు కాగా, పోలీసు కొడుకే అని సర్దిచెప్పి పంపారు. ఇతడు గంజాయికి బానిసై స్నేహితులతో కలిసి దౌర్జన్యాలు చేసేవాడు. సుమారు 8 నెలల కిందట కూడా కార్తీక్ సింగ్‌ని తీవ్రంగా కొట్టి వీడియోలు తీసి వైరల్ చేశారు. పోలీసుల గాలింపు పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఎస్ఎన్ఆర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. హంతకులు పరారీలో ఉండి వీరిని అరెస్టు చేయడానికి పోలీసులు 3 తనిఖా బృందాలను ఏర్పాటు చేశారు. ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. కఠినంగా శిక్షించాలి: కార్తీక్ తల్లి నా కుమారున్ని ఆ దుండగులే పిలుచుకుని వెళ్లారు. నేను కొంతసేపటికి కార్తీక్ మొబైల్‌కు ఫోన్ చేసినప్పుడు స్విచాఫ్ వచ్చింది. కార్తీక్‌ను ఎవరో కొట్టి చంపారని తరువాత మాకు తెలిసినవారు చెప్పారు. హంతకులకు కఠిన శిక్షలు విధించాలి. -
మిస్టరీగా ఇంటర్ విద్యార్ధిని భవ్యశ్రీ అనుమానాస్పద మృతి
సాక్షి, చిత్తూరు జిల్లా: ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీగా మారింది. న్యాయం కోసం పెనమూరు పీఎస్ ఎదుట బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం ఆందోళన చేపట్టారు. కాగా వేణుగోపాలపురానికి చెందిన భవ్యశ్రీ ఈ నెల 17న అదృశ్యమైంది. 18వ తేదీన విద్యార్ధిని తండ్రి మునికృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. 20న ఎగువ చెరువు వద్ద బావిలో భవ్యశ్రీ శవమై కనిపించింది. పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా పోస్టుమార్టంలో ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవని ప్రాథమికంగా తెలిసిందని ఎస్ఐ అనిల్‌కుమార్ తెలిపారు. అఘాయిత్యం జరిగిందా, విషప్రయోగం జరిగిందా అని పరీక్షించేందుకు సాంపిల్స్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయిందా? ఎక్కడి నుంచి అయినా తెచ్చి ఆమె మృతదేహాన్ని బావిలో పడేశారా అన్న విషయం తేల్చేందుకు స్టెరమ్‌బోన్ సాంపిల్స్‌ను కెమికల్ అనాలసిస్ కోసం తిరుపతి ఆర్ఎఫ్ఎస్ఎల్కు పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఆ నివేదికలు వచ్చిన అనంతరం అనుమా నితులను సమగ్రంగా, నిష్పాక్షికంగా విచారిస్తామన్నారు. విచారణను తప్పుదారి పట్టించేలా అసత్య ప్రచారాలను, నిరాధార వార్తలను ప్రచారంచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చదవండి: రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, ఆర్ఐ -
ఉరేసుకుందా.. గుండెపోటా?
వికారాబాద్: ఇంటర్ విద్యార్థిని మృతి అనుమానాస్పదంగా మారింది. ఉరేసుకుని మృతిచెందినట్లు గ్రామస్తులు చెబుతుండగా.. తమ బిడ్డ గుండె పోటుతో మృతిచెందిందని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని నాగారం గ్రామానికి చెందిన అపూర్వ (18) రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోని ఓ గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. వారం రోజుల క్రితం కంటి నొప్పితో హాస్టల్ నుంచి ఇంటికి వచ్చింది. తండ్రి బైండ్ల వెంకటయ్యకు ఫోన్ చేసిన ప్రిన్సిపల్ బాలికను పంపించాలని సూచించారు. దీంతో తల్లిదండ్రులు అపూర్వకు విషయం చెప్పి హాస్టల్‌కు వెళ్లమని సూచించారు. ఆమె మాత్రం రాఖీ పౌర్ణిమ తర్వాత వెళతానని చెప్పడంతో చిన్నపాటి వాగ్వాదం జరిగింది. మిన్నకుండిపోయిన తల్లిదండ్రులు ఎవరి పనులపై వారు వెళ్లిపోయారు. తమ్ముడు సైతం ఇంట్లో లేకపోవడంతో ఒంటరిగా ఉన్న అపూర్వ చీరతో ఫ్యా న్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లగా.. తమ కూతురు గుండెపో టు తో మృతి చెందిందని తల్లిదండ్రులు చెప్పారు. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు నిరాకరించారు. -
ఇంటర్ విద్యార్థి విషాదాంతం.. చదవడం ఇష్టం లేక గోదావరిలో దూకాడు
దండేపల్లి: కాలేజీలో దింపేందుకు తీసుకెళ్లిన తండ్రి వద్దనుంచి కరీంనగర్ బస్టాండ్‌లో తప్పించుకున్న ఓ ఇంటర్ విద్యారి్థ...మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం వద్ద గోదావరినదిలో శవమై తేలాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దండేపల్లికి చెందిన నానవేని మల్లేశ్ కుమారుడు నానవేని ప్రశాంత్, అలియాస్ గట్టు(19) కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల కాలేజీ నుంచి ఇంటికి వచ్చాడు. మంగళవారం అతన్ని కాలేజీలో దింపేందుకు తండ్రి మల్లేశ్ కరీంనగర్ బయల్దేరాడు. కరీంనగర్ బస్టాండులో దిగగానే ప్రశాంత్ తప్పించుకున్నాడు. కొద్దిసేపు బస్టాండులో అతనికోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. కాలేజీకి వెళ్లి ఆరా తీయగా, కాలేజీకి రాలేదని చెప్పారు. దీంతో ఇంటికే వచ్చాడేమో అని తండ్రి దండేపల్లికి రాగా..ఇంటికి కూడా రాలేదని కుటుంబసభ్యులు చెప్పడంతో ప్రశాంత్‌ను వెదికేందుకు బయటికి వెళ్లాడు. ఇంతలో సాయంత్రం గూడెం గోదావరినదిలో శవం ఉందని తెలియడంతో అక్కడికి వెళ్లి చూడగా, అది ప్రశాంత్‌ది కావడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ప్రశాంత్‌ను గతేడాది దండేపల్లి జూనియర్ కాలేజీలో చేరి్పంచగా ఫెయిల్ అయ్యాడు. అతన్ని ఆ కాలేజీ నుంచి తీసి, ఈయేడాది కరీంగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో చేరి్పంచారు. చదవడం ఇష్టం లేకనే గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబీకులు, బంధువులు భావిస్తున్నారు. -
నాన్న పట్టించుకోవడం లేదని..
వికారాబాద్: పదేళ్ల క్రితం తల్లి చనిపోవడం.. తండ్రి తాగుడుకు బానిస కావడం.. పెళ్లయిన సోదరుడు విడిగా ఉండడం.. కుటుంబ గొడవల కారణంగా అన్నతో మాటలు లేకపోవడంతో.. తనకెవరూ లేరని మనోవేదనకు గురైన ఓ ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాపూర్‌కు చెందిన మనోహర్(16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం తన మొబైల్ వాట్సాప్‌లో ‘ఐ మిస్ యూ ఫ్రెండ్స్’ అని స్టేటస్ పెట్టాడు. ఇది చూసిన చిన్నాన్న కూమారుడు భాను ప్రసాద్.. మనోహర్‌కు ఫోన్ చేశాడు. స్పందించక పోవడంతో పొలం వద్దకు వెళ్లాడు. అప్పటికే మనోహర్ చెట్టుకు వేళాడుతూ విగతజీవిగా కనిపించాడు. ఈ విషయాన్ని భానుప్రసాద్ మృతుడి సోదరుడు మల్లేశ్‌కు తెలియజేశాడు. మనోహర్ తన తండ్రి, స్నేహితులతోనే ఎక్కువగా సన్నిహితంగా ఉండేవాడని.. కొంతకాలంగా నాన్న మద్యానికి బానిస కావడం.. తనను సరిగ్గా చూసుకోకపోవడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని మల్లేశ్ పొలీసులకు తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పురుషోత్తం తెలిపారు. -
హన్మకొండలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, వరంగల్: హన్మకొండలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. నగరంలోని సువిద్యా జూనియర్ కళాశాలకు చెందిన ఫస్టియర్ విద్యార్థిని నాగజ్యోతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ నిన్న జరిగిన ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ సరిగా రాయకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన నాగజ్యోతి కళాశాలకు చెందిన హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. నిన్న పరీక్ష రాసి హాస్టల్‌కు వెళ్లిన విద్యార్థిని రాత్రి ఉరి వేసుకుంది. వెంటనే తోటి విద్యార్థులతో పాటు కళాశాల యాజమాన్యం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పేరెంట్స్ వస్తే గాని విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థిని ఆత్మహత్యతో కళాశాల వద్ద పోలీసులు భారీగా మోహరించి ఆందోళనలకు తావు లేకుండా చర్యలు చేపట్టారు. ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన రోజునే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. చదవండి: అందం ఆమె పాలిట శాపమైంది -
ఖమ్మం: సడన్ హార్ట్ ఎటాక్.. కుప్పకూలిన ఇంటర్ విద్యార్థి
సాక్షి, ఖమ్మం: చిన్న వయసులోనే గుండెపోటు సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మరణించాడు. బోనకల్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన మరీదు రాకేష్ మధిరలోని ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. ఇంటి ఆవరణలో స్నేహితులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే లోపు రాకేష్ మృతి చెందాడు. కాగా, అతి చిన్నవయసులో గుండెపోట్లు కనిపించడానికి కొన్ని అండర్లైయింగ్ ఫ్యాక్టర్స్ దోహదపడుతున్నట్లు వెల్లడైంది. కుటుంబ చరిత్రలోనే చిన్నవయసులో గుండెపోటు సంఘటనలు ఉండటం. గుండె నిర్మాణంలోనే పుట్టుకతో తేడాలు ఉండటం. గుండెలో లయబద్ధంగా కొట్టుకోడానికి నిత్యం ఒకే రీతిలో విడుదలయ్యే ఎలక్ట్రిసిటీ కావాలి. అది సయనో ఏట్రియల్ నోడ్ అనే గుండెలోని ఓ కేంద్రం నుంచి వెలువడుతుంది. ఈ కరెంటు వెలువడటంలోని తేడాలు (అబ్నార్మాలిటీస్) కూడా ఇలా యువత అకస్మాత్తు మరణాలకు ఒక కారణమని అధ్యయనాల్లో తేలింది. చదవండి: చిన్నవయసులోనే గుండెపోటు సంఘటనలు ఎందుకు? -
ఇన్విజిలేటర్ మందలించాడని.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
మేడిపల్లి: పరీక్షాహాల్‌లో ఇన్విజిలేటర్ మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీ చైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్థిని రమాదేవి (17) కళాశాల హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా.. కర్నూల్ జిల్లా, బల్మూరు మండలం చెంచుగూడ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ నిమ్మల రాములు కుమార్తె రమాదేవి మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడలోని శ్రీ చైతన్య కాలేజీలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రీ ఫైనల్ పరీక్షల్లో భాగంగా సోమవారం బోటనీ పరీక్ష రాస్తున్న సమయంలో ఇన్విజిలేటర్ రమాదేవిని మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై పరీక్ష పూర్తికాగానే కళాశాల హాస్టల్ మూడవ అంతస్తులోని తన గదిలోకి వెళ్లి ఉరి వేసుకుంది. విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు ఆమెను కిందకు దింపి వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిననట్లు డాక్టర్లు నిర్థారించారు. విద్యార్థి సంఘాల ఆందోళన విషయం తెలియగానే ఏఐఎస్ఎఫ్, ఎంఆర్పీఎస్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. కళాశాలలో ఒత్తిడి, వేధింపుల వల్లనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. ఆందోళనకారులను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. రమాదేవి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫీజు కోసమే వేధించారు..! బల్మూర్: గత వారం తన కూతురిని ఫీజు కోసం పదేపదే అడిగారని, వేరుశనగ పంట డబ్బులు చేతికొచ్చిన తర్వాత చెల్లిస్తామని చెప్పామని నిమ్మల రాములు చెప్పారు. అయినా వినకుండా పదేపదే ఫీజు చెల్లించాలని తోటి విద్యార్థుల ముందు అవమానించడంతో భరించలేక ఆత్మహత్య చేసుకుందని ఆయన ఆరోపిస్తున్నారు. తన కుమార్తె మృతదేహన్ని కళాశాల యాజమాన్యం గాంధీ ఆస్పత్రికి తరలించి అక్కడ అడ్రస్ లేకుండాపోయిందని మండిపడ్డారు. విద్యార్థిని మృతితో చెంచుగూడెంలో విషాదం ఏర్పడింది. రాములు గ్రామంలో తనకున్న ఎకరా భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. -
మేడ్చల్: పీర్జాదిగూడలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
-
ఇంటర్ విద్యార్థిని మృతి.. కాలేజీలో టాబ్లెట్ వేసుకుని..అంతలోనే
వత్సవాయి(జగ్గయ్యపేట) ఎన్టీఆర్ జిల్లా: అనుమానాస్పదస్థితిలో ఇంటర్ విద్యార్థిని మరణించిన సంఘటన బుధవారం వత్సవాయి మండలం భీమవరం గ్రామంలో జరిగింది. విద్యారి్థని కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన జి.రాముడు తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు ఒక కుమార్తె జి.భార్గవి(19), కుమారుడు ఉన్నారు. భార్గవి నందిగామలోని ఒక ప్రయివేటు కళాశాలలో ఇంటర్ చదువుతోంది. రోజూ మాదిరిగానే కళాశాలకు వెళ్లిన భార్గవి తనకు ఒంట్లో నలతగా ఉందని కళాశాలలో టాబ్లెట్ వేసుకుంది. మధ్యలోనే ఇంటికి బయలుదేరిన భార్గవి బస్సులో ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో దాహం వేయడంతో పక్కనే ఉన్న ప్రయాణికుల దగ్గర ఉన్న మంచినీరు అడిగి తాగింది. ఇంటికి వచ్చాక కడుపులో మంటగా ఉందని కుటుంబసభ్యులకు తెలపడంతో వారు మరో టాబ్లెట్ తెచ్చి వేశారు. అయినప్పటికీ తగ్గకపోవడంతో భార్గవిని జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించేలోపే మార్గంమధ్యంలో ప్రాణాలు కోల్పోయింది. తండ్రి రాములు ఫిర్యాదు మేరకు ఎస్ఐ అభిమన్యు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అనుమానాస్పద స్థితిలో భార్య.. నిద్రమాత్రలు మింగి భర్త.. -
నిర్మల్ జిల్లాలో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య
-
ఖమ్మం జిల్లాలో వెంటాడుతున్న సూదిమందు భయం
-
ఇంటర్ బోర్డ్ లీల: అప్పుడు ఫెయిల్... ఇప్పుడు పాస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ బోర్డ్ లీల మరొకటి వెలుగులోకొచ్చింది. ఫెయిల్ అయిన విద్యార్థి రీ వ్యాల్యుయేషన్ జరిపిస్తే, ఏకంగా 31 మార్కులు తేడా వచ్చాయి. ఒకటి, అరా ఓకే కానీ, ఇన్ని మార్కుల తేడా ఎలా వచ్చిందని ఇంటర్ బోర్డ్ అధికారులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ముస్కాన్ బేగం ఈ ఏడాది మే నెలలో జరిగిన ఇంటర్ ద్వితీయ వార్షిక పరీక్షలకు హాజరైంది. అన్ని సబ్జెక్టులు కలిపి ఆమెకు 741 మార్కులొచ్చాయి. జువాలజీలో 10 మార్కులే రావడంతో ఫెయిల్ అయినట్టు ఫలితం వచ్చింది. దీంతో కంగారుపడ్డ బాలిక రీ వ్యాల్యుయేషన్‌కు వెళ్లింది. పూర్తి చేసిన అనంతరం 41 మార్కులు వచ్చినట్టు తేల్చారు. అంటే 31 మార్కులు తక్కువ వేసి, ఆమెను ఫెయిల్ చేశారు. ఇంటర్ బోర్డ్ నిర్వాకం కారణంగా తాను ఇన్ని రోజులు తీవ్ర మనోవేదనకు గురయ్యాయని ముస్కాన్ తెలిపింది. రీ వ్యాల్యుయేషన్‌కు రూ.600, సప్లిమెంటరీ పరీక్షకు రూ.500 చెల్లించానని, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ఇది కూడా భారమేనని తెలిపింది. ఇందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని కోరింది. ఘటనతో కంగుతిన్న బోర్డ్ అధికారులు పేపర్ మూల్యాంకనం చేసిన అధ్యాపకుడిపై చర్యలకు సిద్ధమయ్యారు. నిబంధనల ప్రకారం అతనికి రూ. 5 నుంచి 10 వేలు జరిమానా, మూడేళ్లపాటు మూల్యాంకన బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా, విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న పరీక్షల విభాగంలో కొంతమంది జోక్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ సమితి కన్వీనర్ మాచర్ల రామకృష్ణ గౌడ్ అన్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ: పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదని..
కేసముద్రం: ఆలస్యంగా పరీక్ష కేంద్రా నికి చేరుకున్న విద్యార్థినిని హాల్లోకి అనుమతించకపోవడంతో మనస్తాపా నికి గురైన ఆమె ఇంటి వద్ద పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం భూక్యా రాంతండా గ్రామపంచాయతీ శివారు కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన జాటోతు లచ్చిరాం, శారద దంపతుల చిన్న కుమార్తె సమీరా కేసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్(హెచ్ఈసీ) చదువుతోంది. అదే కళాశాలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫస్టియర్ పరీక్ష రాసేందుకు కేంద్రం వద్దకు 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని కేంద్రం నిర్వాహకులు చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంటికి చేరుకుని.. పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సమీరా చికిత్స పొందుతోంది. -
జవాబు పత్రాలు దిద్దిన అధ్యాపకుడి నిర్లక్ష్యం.. అప్పుడు 0.. ఇప్పుడు 44
ముదిగొండ: ఇంటర్మీడియట్ జవాబు పత్రాలు దిద్దిన అధ్యాపకుడి నిర్లక్ష్యంతో పరీక్షల్లో ఫెయిల్ అయినట్లు మెమో వచ్చిన విద్యార్థికి ఇప్పుడు ఊరట లభించింది. ఖమ్మం జిల్లా ముదిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెచ్ఈసీ గ్రూప్‌తో చదివిన భద్రి గోపి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశాడు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణుడైన అతడికి ఎకనామిక్స్‌లో మాత్రం సు న్నా మార్కులు వచ్చాయి. దీంతో ఎకనామిక్స్ జవాబు పత్రం రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఎకనామిక్స్‌లో 44 మార్కులు వచ్చినట్లు కొత్త మెమోను బుధవారం వెబ్సైట్లో పొందు పరచడంతో గోపి ఊపిరి పీల్చుకున్నాడు. చదవండి👇 తస్మాత్ జాగ్రత్త.. కాల్ చేసి ]401]తో కలిపి డయల్ చేయాలని చెబుతున్నారా.. తెలంగాణలో జికా వైరస్ కలకలం.. హెచ్చరించిన వైద్యులు -
లవ్ ఫెయిల్యూర్.. యువతి ఆత్మహత్య.. మృతిపై భిన్న కథనాలు..
తగరపువలస (భీమిలి) విశాఖపట్నం: ప్రేమ విఫలమై భీమిలి మండలం కొత్త మూలకుద్దు పాకదిబ్బకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని కొయ్య లావణ్య(16) ఆదివారం సాయంత్రం ఉరి వేసుకుని చనిపోయింది. దీనిపై గ్రామంలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కొయ్య లావణ్య, ఇదే గ్రామానికి చెందిన మణి కుమార్ అనే యువకుడు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. చదవండి: స్కూల్ కరస్పాండెంట్ పాడుపని.. బాలికకు మత్తు టాబ్లెట్లు ఇచ్చి.. ఈ క్రమంలో వివాహం చేసుకోమని మణికుమార్‌ను లావణ్య కోరగా నిరాకరించాడని ఒక కథనం వినిపిస్తుండగా.., మణికుమార్ కుటుంబ సభ్యులు లావణ్య కుటుంబ సభ్యులను కలిసి వివాహం గురించి మాట్లాడగా వారు నిరాకరించారని మరో కథనం వినిపిస్తుంది. ఆత్మహత్య చేసుకున్న లావణ్యను సంగివలస అనిల్ నీరుకొండ ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్టు నిర్ధారించారు. మధ్యాహ్నం గ్రామంలో జరిగిన రజస్వల ఫంక్షన్లో ఉత్సాహంగా పాల్గొన్న లావణ్య ఇంతలోనే అఘాయిత్యానికి పాల్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విభిన్న కథనాలపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
అయ్యో పాపం.. పరీక్ష రాస్తూ విద్యార్థి మృతి
పాతపట్నం/సారవకోట: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ పరీక్ష రాస్తూ బూరాడ కార్తీక్ (16) అనే విద్యార్థి మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సారవకోట మండలం ధర్మలక్ష్మిపురం పంచాయతీ దాసుపురం గ్రామానికి చెందిన కార్తీక్ పాతపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ప్రభుత్వ బీసీ వసతి గృహంలో ఉంటూ ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఉదయం వసతి గృహంలో అస్వస్థతకు గురై వాంతులు రావడంతో తోటి విద్యార్థులతో కలిసి హాస్టల్ వార్డెన్ బి.వైకుంఠరావు పాతపట్నం సీహెచ్‌సీకి తీసుకువచ్చారు. చికిత్స అందించాక విశ్రాంతి తీసుకోవాలని సూపరింటెండెంట్ బాలకృష్ణ విద్యార్థికి సూచించారు. అయితే పరీక్షకు సమయమవుతోందని చెప్పిన కార్తీక్ ఆస్పత్రి నుంచి నేరుగా పాతపట్నం బస్టాండ్ వద్ద ఉన్న పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత స్పృహ తప్పడంతో ఇన్విజిలేటర్లు, సిబ్బంది కలిసి పాతపట్నం సీహెచ్‌సీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు సూపరింటెండెంట్ బాలకృష్ణ తెలిపారు. మెదడుకు సంబంధించిన సమస్యతో కార్తీక్ మృతి చెంది ఉండొచ్చని చెప్పారు. తల్లిదండ్రులు బూరాడ శ్యామ్‌సుందరావు, కుమారి, తమ్ముడు దినేష్‌లు ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎస్ఐ మహమ్మద్ అమీర్ ఆలీ ఆస్పత్రికి చేరుకుని వైద్యుడు బాలకృష్ణతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామం దాసుపురం పంపించారు. స్పృహ తప్పిన మరో విద్యార్థిని పాతపట్నం కోర్టు కూడలిలో ఉన్న ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ పరీక్ష రాస్తున్న తూలుగు ధనలక్ష్మి అనే విద్యార్థి స్పృహ తప్పిపోయింది. వెంటనే ప్రిన్సిపాల్ ఎం.ఆంజనేయులు విద్యార్థినిని సీహెచ్‌సీకి తీసుకువెళ్లి వైద్యం చేయించారు. కడుపు నొప్పి వస్తోందని వైద్యులకు చెప్పడంతో సూపరింటెండెంట్ కె.బాలకృష్ణ చికిత్స అందించారు. చికిత్స అందించిన అనంతరం విద్యార్థిని స్వగ్రామం హిరమండలంలోని ధనుపురం పంపించినట్లు వైద్యుడు తెలిపారు. -
బాలికకు దెయ్యం పట్టిందని చిత్రహింసలు పెట్టిన ఓ బాబా
-
దెయ్యం పట్టిందని వస్తే చుక్కలు చూపించిన భూత వైద్యుడు
-
దెయ్యం పట్టిందని వస్తే చుక్కలు చూపించిన భూత వైద్యుడు.. నిప్పులపై నడిపించి
పరిగి: ఇంటర్ చదువుతున్న బాలిక.. అనారోగ్యానికి గురైంది.. ఆమెకు దెయ్యం పట్టిందని ఓ బాబా భయపెట్టాడు.. భూతవైద్యం చేస్తానంటూ ఆమెను నిప్పులపై నడిపించాడు.. చిత్రహింసలు పెట్టాడు.. పాదాలు కాలిపోయి తీవ్రగాయాలతో ఆమె ఆస్పత్రి పాలైంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో ఐదు రోజుల కింద జరిగిన ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. భూత వైద్యం చేస్తానని.. వికారాబాద్ జిల్లా ధారూరు మండలం కుక్కింద గ్రామానికి చెందిన మంజుల వెంకటయ్య కుమార్తె అశ్విని(17) వికారాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె ఇటీవల అనారోగ్యానికి గురైంది. పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన వారి సమీప బంధువు.. తమ గ్రామంలోని దర్గా సమీపంలో ఓ బాబా (భూత వైద్యుడు) ఉన్నాడని, ప్రతి శుక్రవారం భూత వైద్యం చేస్తాడని అశ్విని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ క్రమంలో గత శుక్రవారం బాలికను అతడి వద్దకు తీసుకువెళ్లగా బాలికకు దెయ్యం పట్టిందని నమ్మబలికాడు. దెయ్యం వదిలిస్తానంటూ బాలికను చిత్రహింసలకు గురిచేశాడు. మండే నిప్పులపై బాలికను నడిపించాడంతోపాటు ఆమెపై కాళ్లుపెట్టి నిల్చున్నాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. దీంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు తమ గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ పట్లోళ్ల రాములుకు ఈ విషయం తెలిపారు. వెంటనే స్పందించిన ఆయన.. బాలికను వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగోలేదని.. పాదాలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ ఘటన విషయం తెలిసిన పరిగి డీఎస్పీ శ్రీనివాస్ బాధిత బాలికను పరామర్శించారు. సదరు భూత వైద్యుడిని అరెస్టు చేయాలని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించారు. -
ప్రియురాలికి హాయ్ చెప్పాడని.. మరోసారి వీడు నీ జోలికి రాడంటూ
బంజారాహిల్స్: తన ప్రియురాలికి హాయ్ చెప్పాడనే కోపంతో ఓ ఇంటర్ విద్యార్థి తన స్నేహితులతో కలిసి పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసి మూసీ పరిసరాలకు తీసుకెళ్లి చితకబాదిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఫిలింనగర్, జ్ఞానిజైల్‌సింగ్‌నగర్ బస్తీకి చెందిన బాలుడు (16) స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ బాలిక(16)తో కొన్ని రోజులుగా మాట్లాడేందుకు ప్రయత్నించడంతోపాటు నువ్వంటే నాకిష్టం అని చెబుతున్నాడు. కాగా సదరు బాలిక లంగర్‌హౌజ్ సమీపంలోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థి కాంబ్లే రోహన్(19)ని ప్రేమిస్తోంది. తనను ఒకరు ఇబ్బంది పెడుతున్నారని ఫోన్ చేసి రోహన్‌కు చెప్పడంతో ఆగ్రహానికి గురైన రోహన్ తన స్నేహితులు సంజయ్, అభిషేక్, నరేష్లతో కలిసి మంగళవారం రాత్రి రెండు బైక్‌లపై ఫిలింనగర్‌కు వచ్చాడు. మాట్లాడే పని ఉందని సదరు బాలుడిని వెంకటేశ్వర హోటల్ చౌరస్తా వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి తమ బైక్‌పై ఎక్కించుకున్న రోహన్, సంజయ్ లంగర్‌హౌజ్ సమీపంలోని బాపూఘాట్ వెనుకాల ఖాళీ ప్రదేశంలోకి తీసుకెళ్లారు. చదవండి: (పుట్టిన రోజున ముస్తాబై.. సాయంత్రం బర్త్ డే పార్టీ ఇస్తానని..) తన లవర్ జోలికి వస్తే అంతు చూస్తానంటూ హెచ్చరించిన రోహన్ అతడిపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేయడమేగాక ఆగకుండా తన లవర్ జోలికి రానంటూ చెప్పాలంటూ వీడియోలు తీశారు. రక్తసిక్తమైన బాలుడితో సెల్ఫీ దిగి తన లవర్‌కు పంపుతూ మరోసారి వీడు నీ జోలికి రాడంటూ ఫోన్ చేసి చెప్పాడు. అనంతరం అతడిని బైక్‌పై ఎక్కించుకొని బాపూఘాట్ వద్ద రోడ్డుపై వదిలేసి అక్కడి నుంచి తన స్నేహితుడు సంజయ్‌తో కలిసి పరారయ్యాడు. దీనిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న లంగర్‌హౌజ్ పోలీసులు ఆరా తీయగా సంఘటన జరిగిన ప్రాంతం రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోకి వస్తుందని అక్కడికి వెళ్లాలని సూచించడంతో బాధితుడు అక్కడికి వెళ్లాడు. పోలీసులు అతడిని స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స చేయించారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు పంపించారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితులు సంజయ్, రోహన్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చదవండి: (భర్తతో విడాకులు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య) -
మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ పట్టుబడిన విద్యార్థి
బోనకల్: ఖమ్మం జిల్లా బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడిన ఓ విద్యార్థి మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించాడు. బోనకల్ మండలం గార్లపాడుకు చెందిన కనకపుడి జీవన్‌కుమార్ తాజాగా ఇంటర్ బైపీసీ పరీక్షలు రాస్తున్నాడు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగ ళవారం ఆయన ఫిజిక్స్ పరీక్ష రాస్తూ కాపీ కొడు తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ గుర్తించింది. మాల్ ప్రాక్టీస్ కింద డీబార్ చేయడంతో జీవన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల కాళ్లపై పడి వేడుకున్నా పట్టించు కోలేదని మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా స్నేహితుడికి సమాచారం ఇచ్చి ఇంట్లో ఉరి పెట్టుకున్నాడు. వెంటనే స్నేహితుడు వెళ్లి ఇరుగుపొరుగు వారి సహాయంతో జీవన్‌ను రక్షించి 108 అంబులెన్స్‌లో ఖమ్మం ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. కరోనాతో చదువులు సక్రమంగా జరగలేదని, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల కాళ్లపై పడి జీవన్ వేడుకున్నా కరుణించలేదని, తమ కుమారుడు చనిపోతే అధికారులే బాధ్యత వహిం చాలని ఆయన తల్లిదండ్రులు కనకపుడి సుందర మ్మ, పుల్లయ్య కన్నీరుమున్నీరుగా రోదించారు. -
పాపం! లక్ష్మీదేవి.. ఆర్టీసీ బస్సు రిపేర్.. 10 నిముషాలు పరీక్షకు ఆలస్యమవడంతో
సాక్షి, మిడ్జిల్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ అని చెప్పిన అధికారులు దాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న లక్ష్మీదేవి సోమవారం ఎకనమిక్స్ పరీక్ష రాసేందుకు హైదరాబాద్ నుంచి బస్సులో బయల్దేరింది. ఆ బస్సు మధ్యలో మొరాయించడంతో (మరమ్మతులకు గురైంది) పరీక్ష కేంద్రానికి పది నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. అయితే నిబంధనల ప్రకారం అధికారులు లక్ష్మీదేవిని పరీక్షకు అనుమతించలేదు. బస్సు ఫెయిల్ కావడం వల్లే పరీక్షకు ఆలస్యంగా వచ్చానని అధికారులకు చెప్పినా వినిపించుకోవడంలేదని లక్ష్మీదేవి ధర్నా చేసింది. విషయం తెలుసుకున్న ఎస్సై రాంలాల్ నాయక్ ఆమెకి సర్ది చెప్పి పంపించారు. చదవండి👉🏾పెళ్లైన 4 నెలలకే మరొకరితో ఉంటూ పరువు తీసిందని.. ‘ఇంటర్’ మూల్యాంకన పారితోషికం పెంపు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల విధులు, మూల్యాంకన ప్రక్రియలో పాల్గొనే అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది పారితోషికాన్ని ఇంటర్ బోర్డు 25 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి జవాబు పత్రం మూల్యాంకనానికి రూ.18.93 నుంచి రూ.23.66.. ఇతర విధులకు రోజుకు రూ.641 నుంచి రూ.800 లకు పెంచారు. చదవండి👇 8 ఏళ్ల కిందటి ‘అచ్ఛేదిన్’ ఇవేనా..?: మోదీ ట్వీట్‌పై కేటీఆర్ ఈసారి పొలిటికల్ సైన్స్ ప్రశ్నపత్రంలో తప్పులు -
విషాదం: పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థికి గుండెపోటు
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో పెనువిషాదం చోటుచేసుకుంది. గూడూరు డీఆర్‌డబ్యూ్ల ఎగ్జామ్ సెంటర్ వద్ద పరీక్ష రాసేందుకు వచ్చిన ఇంటర్ విద్యార్థికి గుండెపోటు వచ్చింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వైద్యపరీక్షలు నిర్వహించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చారు. మృతి చెందిన విద్యార్థి సైదాపురంకు చెందిన సతీష్‌గా గుర్తించారు. చదవండి: (ఆర్టీసీ బస్సు బోల్తా.. ఒకరు మృతి, 15 మందికి గాయాలు) -
బావ వరసయ్యే వ్యక్తితో ప్రేమ.. గర్భం దాల్చిన ఇంటర్ విద్యార్థిని
సాక్షి, శ్రీకాకుళం(ఎచ్చెర్ల క్యాంపస్): పొన్నాడ కేజీబీవీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చింది. ఈ విషయం బయట పడటంతో అధికారులు అవాక్కయ్యారు. విద్యార్థినిది ఎచ్చెర్ల మండలం పొన్నాడ సరిహద్దు ధర్మవరం గ్రామం. ఈమె గర్భిణి అనే విషయం గోప్యంగా పాఠశాల యాజమాన్యం ఉంచింది. అయితే ప్రిన్సిపాల్ శిరీషకు పడనివారు విద్యార్థిని గర్భం దాల్చిన విషయాన్ని రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను ప్రాధమికంగా విధుల నుంచి తొలగిస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై అధికారులు మంగళవారం పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. చదవండి: (విషాదం: అమ్మానాన్నల కోసం ఎదురుచూస్తున్న కుమార్తెలకు..) ఈ మధ్య కరోనా సెలవుల్లో విద్యార్థిని ఇంటికి వెళ్లడంతోపాటు శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన క్రీడా పోటీల్లో పాల్గొంది. ఆ సమయంలో విద్యార్థిని గ్రామానికి చెందిన బావ వరసయ్యే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. యువతిపై లైంగిక వేధింపుల విషయాన్ని రహస్యంగా ఉంచినప్పటికీ.. ఆమె గర్భిణిగా తేలడం పాఠశాల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాఠశాల వసతి గృహంలో వాంతులు చేసుకోగా సిబ్బంది గమనించి స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి గర్భం దాల్చినట్టు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకుండా ప్రిన్సిపాల్ జాప్యం చేసినప్పటికీ ఫిర్యాదు రూపంలో విషయం బయట పడింది. విద్యార్థిని తండ్రి మృతి చెందగా, తల్లి వలస కూలీగా పని చేస్తోంది. ఈ విషయాన్ని ఎచ్చెర్ల ఎస్సై రాము వద్ద ప్రస్తావించగా.. పోలీస్‌స్టేషన్‌కు ఎటువంటి ఫిర్యాదు రాలేదన్నారు. -
నా బాధ మీతోగాని, స్నేహితులతో గాని, టీచర్లతోగాని పంచుకోలేను..
గచ్చిబౌలి: ‘లైంగిక వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నాను.. అమ్మా.. నాన్నా నన్ను క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఓ ఇంటర్ విద్యార్థి ప్రాణాలు తీసుకున్న ఘటన కలకలం రేపింది. గచ్చిబౌలి సీఐ గోనె సురేష్ తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ గ్రామానికి చెందిన లింగారం లక్ష్మణ్ గౌడ్, సువర్ణల రెండో కుమారుడు వంశీకృష్ణ (17) నగరంలోని గౌలిదొడ్డి గురుకుల కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ బైపీసీ చదువుతున్నాడు. కోవిడ్‌తో మూతపడిన కళాశాల ఈ నెల 2న పునఃప్రారంభమైంది. జనవరి 31న ఇంటి నుంచి వెళ్లిన వంశీకృష్ణ 2న కళాశాలలో చేరాడు. శుక్రవారం రాత్రి 10 గంటలకు వసతి గృహంలో తోటి విద్యార్థులతో కలిసి నిద్రకు ఉపక్రమించాడు. అప్పటికే స్నేహితుని వాచ్ తీసుకొని రాత్రి 12.30 గంటలకు అలారం పెట్టించుకున్నాడు. ఉదయం 5 గంటలకు వ్యాయామ డ్రిల్‌కు వంశీ గైర్హాజరయ్యాడు. దీంతో ఉదయం 6.30 గంటలకు వెతకగా క్లాస్ రూమ్ వెనక నుంచి గడియ ఉండటం గమనించి తలుపులను గట్టిగా తోసి చూడగా.. పైకప్పు కొక్కేనికి చున్నీతో ఉరి వేసుకొని వంశీకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కళాశాల ఎదుట మృతుడి బంధువుల ఆందోళన లైంగిక దాడి జరిగిందంటూ.. వంశీకృష్ణ బ్యాగ్‌లో రెండు సూసైడ్ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘పూజ్యులైన నాన్న, అమ్మకు క్షమాపణలు. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేకపోతున్నాను. నేను లైంగిక వేధింపులకు గురయ్యాను. నా బాధ మీతోగాని, స్నేహితులతో గాని, టీచర్లతోగాని పంచుకోలేను. మనస్తాపానికి, ఒత్తిడికి గురవుతున్నాను. బాధను భరించలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నా క్షమించాలి’ అని సూసైడ్ నోట్‌ను ఇంగ్లిష్, తెలుగులో భాషల్లో రాశాడని సీఐ సురేష్ తెలిపారు. ‘ఓ దేవుడా నిన్ను మణులు, మాణిక్యాలు అడిగానా, పెద్ద ఉద్యోగం అడిగానా, చిన్న కోరికను తీర్చలేకపోతున్నావు’ అంటూ మరో లేక రాశాడని, ఐయామ్ సఫరింగ్ ఫ్రమ్ బ్లడ్ క్యాన్సర్’ అంటూ మరో చోట రాశాడని పోలీసులు తెలిపారు. లైంగిక దాడి కోణంలోనూ విచారణ చేస్తామని, సూసైడ్ నోట్లు వంశీ కృష్ణ రాశాడా లేదా అనేది తేలాల్సి ఉందన్నారు. కళాశాల ఎదుట ఆందోళన.. మీ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదని శనివారం ఉదయం 6 గంటలకు కాలేజీ నుంచి ఫోన్ వచ్చిందని.. ఆ తర్వాత సూసైడ్ చేసుకున్నాడని చెప్పినట్లు వంశీకృష్ణ తండ్రి లక్ష్మణ్‌గౌడ్ రోదిస్తూ తెలిపారు. హాస్టల్లో నిద్రించిన విద్యార్థి దూరంలో ఉన్న క్లాస్ రూమ్‌కు వెళ్లి సూసైడ్ చేసుకుంటే అక్కడున్న సిబ్బంది ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మృతదేహాన్ని తాము రాకముందే తరలించాల్సిన అవసరం ఏముందని, ఆత్మహత్యగల కారణాలు వెల్లడించాలని విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. వంశీ కృష్ణ చదువులో చురుగ్గా ఉండేవాడని.. అందరూ నిద్రలో ఉండగా క్లాస్‌రూమ్‌కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ప్రిన్సిపాల్ సత్యనారాయణ చెప్పారు. -
ఎంత పనిచేస్తివి.. ఏ కష్టం రానీయకుండా చూసుకున్నం కదామ్మా!
గజ్వేల్ రూరల్: పెళ్లయిన 15 ఏళ్లకు పుట్టిన కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. కానీ ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధించాడు. యువతి ఇల్లు, కాలేజీ చుట్టూ తిరుగుతూ ఇబ్బందిపెట్టాడు. విషయం తల్లిదండ్రులకు తెలిసి మందలించినా వేధింపులు ఆపలేదు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గజ్వేల్ పట్టణంలో శుక్రవారం ఈ విషాదం జరిగింది. ఆరు నెలలుగా వేధింపులు.. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని గుండన్నపల్లికి చెందిన ఎల్ల యాదగిరి, అండాలు దంపతులు వ్యవసాయంతో పాటు మొక్కజొన్న కంకులను అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పెళ్లైన 15 ఏళ్లకు సంగీత (17) పుట్టింది. ప్రస్తుతం సంగీత గజ్వేల్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రజ్ఞాపూర్‌కు చెందిన సల్ల శ్రీకాంత్ అలియాస్ అర్జున్ అనే యువకుడు 6 నెలలుగా గుండన్నపల్లిలో సంగీత ఇంటి ముందు, కళాశాలకు వెళ్లే సమయంలో వెంబడిస్తూ ప్రేమించాలని వేధిస్తున్నాడు. విషయం సంగీత కుటుంబీకులకు తెలియడంతో 2 నెలల క్రితం యువకుడిని మందలించారు. కొద్ది రోజులు మిన్నకున్న తర్వాత మళ్లీ వారం రోజులుగా ఆ యువకుడు వెంబడించడం ప్రారంభించాడు. తనను ప్రేమించాలని, లేకుంటే తనతో కలిసి దిగిన ఫొటోలను అందరికీ చూపిస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని సంగీత ఇంటి పక్కన ఉండే బాబాయి కూతురితో చెప్పుకొని బాధపడింది. కాలేజీకి వెళ్లి వచ్చేందుకు కుటుంబీకులను తోడు తీసుకెళ్లేది. శ్రీకాంత్ వేధింపులతో మనస్తాపానికి గురై కళాశాలకు కూడా వెళ్లలేక బాధపడేది. చెల్లెలితో మాట్లాడి.. ఇంటికెళ్లి.. పరీక్షలు సమీపిస్తుండటంతో సంగీత గురువారం కళాశాలకు వెళ్లి వచ్చింది. సాయంత్రం ఇంటి పక్కనే ఉండే చెల్లెలితో కొద్దిసేపు మాట్లాడింది. తల్లిదండ్రు లు మొక్కజొన్న కంకులను విక్రయించేందుకు వెళ్లగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాసేపటి తర్వాత గుర్తించిన కుటుంబీకులు తలుపులు తెరిచి చూడగా సంగీత విగతజీవిగా కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంగీత ఆత్మహత్య విషయం తెలుసుకున్న తోటి మిత్రులు, విద్యార్థులు శుక్రవారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సంగీత ఫొటోలతో ప్లకార్డులను పట్టుకొని న్యాయం చేయాలని, ఆమె మృతికి కారణమైన యువకుడిని శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కడుపుకోత మిగిల్చావు బిడ్డా ‘అయ్యో బిడ్డా.. ఎంత పనిచేస్తివి. ఒక్కగానొక్క కూతురు. ఏ కష్టం రానీయకుండా చూసుకున్నం. నువ్వు దూరమై మాకు కడుపుకోత మిగిల్చావు’అంటూ సంగీత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యేలా ఏడ్చారు. శ్రీకాంత్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధించడంతో పాటు చంపుతానని బెదిరించడంతో తమ కూతురు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుందన్నారు. సంగీత చావుకు కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థి కిడ్నాప్.. విషయం తెలిసి తల్లిదండ్రుల షాక్
సాక్షి, రాంగోపాల్‌పేట్: ఇంటర్మీడియేట్ చదువుతున్న ఓ బాలిక కిడ్నాప్‌కు గురైంది. ఈ ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. రెజిమెంటల్‌బజార్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటర్ మీడియేట్ చదువుతుంది. ఈ నెల 9వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. తల్లిదండ్రులు తెలిసిన వారు, బంధువుల వద్ద వాకబు చేసినా ఎక్కడా కనిపించ లేదు. సాయంత్రం వేళ ఆ యువతి తన ఫోన్ నుంచి తల్లికి ఫోన్ చేసింది. తాను ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని అతన్ని పెళ్లి చేసుకునేందుకు వెళుతున్నానని చెప్పి పెట్టేసి అటు తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. దీంతో కుటుంబ సభ్యులు గురువారం గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పాలిటెక్నిక్ ప్రశ్నాపత్రాలు లీక్.. ఆ రెండు పరీక్షలు రద్దు -
ఆ కాలేజీకి వెళ్లను.. అంతలోనే విషాదం.. తమ్ముడిని చూసి ఒక్కసారిగా..
వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా): కళాశాలకు వెళ్లనన్న తనయుడిని తల్లిదండ్రులు మందలించడంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. వెంగారెడ్డికండ్రిగ దళితవాడకు చెందిన కొమ్మల మునివెంకటయ్య, ధనమ్మ దంపతులకు కుమార్తె షాలిని, కుమారుడు యశ్వంత్ ఉన్నారు. షాలిని నర్సింగ్ చేస్తుండగా యశ్వంత్ తిరుపతిలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ )ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన యశ్వంత్ ఈ నెల 24 నుంచి కళాశాలకు హాజరు కావాల్సి ఉంది. చదవండి: ఉమెన్స్ బ్యూటీ పార్లర్.. ఆమె డాబూ దర్పం చూసి.. చివరికి లబోదిబో.. తాను ఆ కళాశాలకు వెళ్లేదిలేదని మొండికేశాడు. అయితే ఇప్పటికే ఫీజు చెల్లించేశామని, ఆ కళాశాలకే వెళ్లాలని శనివారం ఉదయం తల్లిదండ్రులు మందలించారు. తరువాత ఉద్యోగరీత్యా వారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ సమీపంలోని అపాచీ పరిశ్రమకు వెళ్లారు. అక్క షాలినితో కలసి యశ్వంత్ ఇంటిలోనే ఉన్నాడు. అయితే ఉదయం అక్క పొలం వద్దకు వెళ్లిన సమయంలో యశ్వంత్(16) ఇంటిలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. 10గంటల సమయంలో ఇంటికి వచ్చిన షాలిని, ఉరేసుకున్న తమ్ముడిని చూసి ఒక్కసారిగా కేకలు పెట్టింది. స్థానికులు గుమికూడి 108కు సమాచారమివ్వడంతో, వారు సత్యవేడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ హనుమంతప్ప తెలిపారు. -
కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం.. ఇంటర్ విద్యార్థిని మృతి..!
సాక్షి, వీపనగండ్ల (మహబూబ్‌నగర్): తీవ్ర అస్వస్థతకు గురైన ఓ ఇంటర్ విద్యార్థిని హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ఉన్న ఒక్కగానొక్క కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు భోరున విలపించారు. వారి కథనం మేరకు.. మండలంలోని గోవర్ధనగిరి సర్పంచ్ చంద్రకళ, సురేశ్‌రెడ్డి ఏకైక కుమార్తె అస్మిత (17) హైదరాబాద్‌లోని నాగోల్‌శాఖ శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. 4 రోజులుగా తీవ్ర జ్వరం, వాంతులు అవుతున్నా.. కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు. గురువారం బంధువు ఒకరు అస్మితను చూసేందుకు కళాశాలకు వెళ్లగా అస్వస్థతతో బాధపడుతూ కనిపించింది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో పాటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందింది. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె మృతిచెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. బాధిత కుటుంబానికి పరామర్శ.. విషయం తెలుసుకున్న కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, సింగిల్‌విండో చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం గ్రామానికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అస్మిత మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
చెప్పులను కుక్క కొరికేస్తుంది.. పైన పెట్టి వస్తానని భర్తకు చెప్పి వెళ్లి..
అనంతపురం సిటీ: స్థానిక పీటీసీ సమీపంలోని ఫ్లై ఓవర్ వద్ద రైలు కింద పడి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... నగరంలోని రజక కాలనీకి చెందిన చాకలి రమ్య (18) ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అనివార్య కారణాల వల్ల చిరుప్రాయంలోనే ఆమెను మేనమామ రాముకిచ్చి కుటుంబసభ్యులు వివాహం జరిపించారు. చదవండి: ఇదివరకే మూడు పెళ్లిళ్లు.. నాలుగేళ్లుగా యువతిని మత్తులో ముంచి అకృత్యం ఆదివారం రాత్రి ఇరువైపులా కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా గడిపిన అనంతరం భర్తతో కలిసి ఇంటికి చేరుకుంది. తలుపుల వద్ద వదిలిన చెప్పులను కుక్క కొరికేస్తుందని, పైన పెట్టి వస్తానని భర్తకు తెలిపి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఆమె కోసం పరిసర ప్రాంతాల్లో కుటుంబసభ్యులు గాలిస్తుండగా రైలు పట్టాలపై యువతి మృతదేహం పడి ఉన్నట్లుగా తెలుసుకుని అక్కడికెళ్లి పరిశీలించారు. మృతదేహం రమ్యదిగా గుర్తించి బోరున విలపించారు. రైలు ఢీకొని ఆమె మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కాగా, రమ్య మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఇంటర్లో ఫస్టియర్ ఫలితాల్లో వరంగల్ విద్యార్థి ప్రతిభ
వరంగల్: ఇంటర్మీడియెట్ ఫస్టియర్ ఫలితాల్లో వరంగల్ విద్యార్థి గుండ సాయి శ్రావణి అద్భుత ప్రతిభ కనబరిచింది. గురువారం వెల్లడైన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ఆమె మెరుగైన మార్కులు సాధించారు. ఎంపీసీ విభాగంలో మొత్తం 470 మార్కులకు గాను 466 మార్కులు తెచ్చుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ఇది రెండో అత్యుత్తమ మార్కులుగా పేర్కొంటున్నారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో లాంగ్వెజెస్‌ను మినహాయిస్తే మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో ఫుల్ మార్కులు సాధించారు. ఇంగ్లీష్ వందకి 97, సంస్కృతంలో వందకి 99 మార్కులు తెచ్చుకున్నారు. సాయి శ్రావణి మార్కుల పట్ల ఆమె తల్లిదండ్రులు గుండ అమర్నాథ్, నిర్మలాదేవిలు హర్షం వ్యక్తం చేశారు. -
ఇష్టమైన కోర్సులో చేర్పించలేదని.. మనస్తాపం చెంది...
సాక్షి, జీడిమెట్ల: ఇంటర్లో తనకిష్టమైన కోర్సులో చేర్పించలేదని మనస్తాపం చెందిన ఓ విద్యార్థి అదృశ్యమైన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్‌నగర్‌కు చెందిన రమేశ్‌కుమార్ కుమారుడు సుమీత్‌కుమార్(17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అయితే తాను సీఈసీలో చేర్చాలని కోరితే కుటుంబ సభ్యులు ఎంపీసీలో చేర్పించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుమీత్‌కుమార్ ఈ నెల 22న ఇంట్లో చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షాపూర్‌నగర్ నుంచి గాజులరామారం వరకు సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు సుమీత్‌కుమార్ గాజులరామారంలోని చింతల్ చెరువు వద్ద తచ్చాడుతూ కనిపించాడు. దీంతో చెరువు దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులతో విద్యార్థిని వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. చదవండి: తెలంగాణలో 67,820 ఉద్యోగ ఖాళీలు.. విభజన పూర్తయ్యేది ఎప్పుడో? యువతి అదృశ్యం జగద్గిరిగుట్ట:ఉద్యోగానికి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుభాష్‌చంద్రబోస్‌నగర్ దర్గా సమీపంలో ఉండే శంకరరావు, శాంతాబాయ్ల కుమార్తె పూజ(20) ఓ ప్రైవేట్ కంపెనీలో హెల్పర్‌గా పనిచేస్తోంది. రోజు మాదిరిగానే 22వ తేదీన ఉదయం 11 గంటలకు ఉద్యోగానికి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆమె మొబైల్ ఫోన్‌కు కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు యువతి స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ఆచూకీ తెలియరాలేదు. దీంతో యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమపేరిట మోసపోయి.. శిశువుకు జన్మనిచ్చి..
నిజామాబాద్ అర్బన్: ప్రేమపేరుతో మోసపోయి గర్భం దాల్చిన ఓ బాలిక మగశిశువుకు జన్మనిచ్చింది. విషయం బయటకు పొక్కకుండా చెత్తకుప్పలో పడేసిన శిశువు కొద్దిసేపటికే మృతి చెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు... ఎడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) అమ్మ మ్మ ఇంటి వద్ద ఉంటూ బోధన్‌లో ఇంటర్ చదువుతోంది. ఓ యువకుడితో ప్రేమలో పడి శారీరకంగా దగ్గరవడంతో ఆమె గర్భం దాల్చింది. ఈ క్రమంలో కడుపునొప్పిగా ఉందని అమ్మమ్మతో కలసి శనివారం తెల్లవారుజామున నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. అక్కడ డెలివరీ నిమిత్తం సిబ్బంది పూర్తి వివరాలు అడగడంతో చెప్పడం ఇష్టంలేక ఖలీల్వాడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడే ఆ బాలిక ఆస్పత్రి మెట్ల పక్కన మగశిశువును ప్రసవించింది. వెంటనే శిశువును పక్కనే ఉన్న చెత్తకుప్పలో పడేసి తీవ్రమైన కడుపు నొప్పి ఉందంటూ వైద్యుల వద్దకు వచ్చింది. ఆమె మాటల్లో పొంతన లేకపోవడంతో డాక్టర్లు తొలుత నమ్మలేదు. అయితే, అప్పటికే ఎక్కువ రక్తస్రావం అవుతుండటంతో ప్రాథమిక చికిత్స అందించారు. అదే సమయంలో పారిశుధ్య కార్మికులకు చెత్తకుప్పల్లో శిశువు కనిపించడంతో ఆస్పత్రి నిర్వాహకులకు సమాచారమిచ్చారు. వైద్యులిచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చి కొనఊపిరితో ఉన్న శిశువును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించేలోపు శిశువు మృతి చెందింది. పోలీసులు బాలికను ప్రశ్నించగా తన ప్రేమ వ్యవహారం, గర్భం గురించి పూసగుచ్చినట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. -
‘లాక్డౌన్’ ఆ విద్యార్థికి ఒకింత మేలే చేసింది!
చెన్నై : బ్యాటరీతో పనిచేసే విమానాన్ని ప్లస్‌టూ విద్యార్థి రూపొందించి పలువురిని ఆశ్చర్యపరిచాడు. విరుదునగర్ జిల్లా, అమ్మన్‌పట్టికి చెందిన నారాయణస్వామి, సెల్వి దంపతుల కుమారుడు ముత్తుకుమార్ (17) ప్లస్‌టూ విద్యార్థి. తండ్రి నారాయణస్వామి మృతిచెందడంతో సెల్వి కూలి పనులు చేస్తూ ముత్తుకుమార్‌ను కముది హయ్యర్ సెకండరీ పాఠశాలలో చదివిస్తోంది. ముత్తుకుమార్‌కు చిన్ననాటి నుంచే వైజ్ఞానిక ఆవిష్కరణలపై ఆసక్తి ఏర్పడింది. ఒకవైపు పేదరికంతో బాధపడుతున్నా మరోవైపు అన్వేషణలపై ఆసక్తి అతన్ని నిద్రలేకుండా చేసింది. గత ఏడాది మినీ విమానాన్ని తయారుచేయాలనే కోరిక కలిగింది. ఇందుకు కరోనా లాక్డౌన్ దోహదపడింది. ఆన్లైన్ క్లాసులు పూర్తికాగానే తర్వాత మిగిలిన సమయంలో ఇంట్లోని వస్తువులతో ఆరు అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పున మినీ విమానాన్ని రాత్రింబవళ్లు తయారుచేశాడు. ముత్తుకుమార్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే విమానంలో ప్రయాణించాలని ఆశపడ్డానని, పేదరికంతో ఆ కోరిక తీరలేదన్నాడు. మేకలు మేపుతున్న సమయంలో విమానాన్ని తయారు చేయాలనే ఆలోచన కల్గిందని, పది నెలలకు పైగా విమానం రూపొందించినట్లు తెలిపాడు. కొన్ని వస్తువులు ఆన్లైన్లో ఆర్డర్ చేశానని, త్వరలో అవి రాగానే విమానాన్ని నడుపుతానన్నాడు. ప్రభుత్వం సహకరిస్తే భవిష్యత్‌లో పెద్ద విమానాలు తయారుచేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. -
బైక్,సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
గాండ్లపెంట(అనంతపురం): తండ్రి ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్ కొన్విలేదని ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి కుటాగుళ్ల రెడ్డిబాషా (18) గురువారం విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. హెడ్‌కానిస్టేబుల్ రామయ్య తెలిపిన వివరాల మేరకు.. రెడ్డిబాషా స్వగ్రామం మలమీదపల్లి పంచాయతీ అరమడకవారిపల్లి. ఇదే మండలంలోని తూపల్లిలో నానమ్మ హసన్నమ్మ ఒంటరిగా ఉండడంతో ఆమె వద్ద ఉంటూ కదిరిలో ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుకునేవాడు. అయితే తనకు ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్ కావాలని రెడ్డిబాషా తన తండ్రి నబీని అడిగాడు. అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పడంతో మనస్థాపానికి గురైన రెడ్డిబాషా విషపు గుళికలు మింగాడు. తర్వాత తనే స్వయంగా 108 సిబ్బందికి ఫోన్ చేయగా వారు కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రెడ్డిబాషా మృతి చెందాడు. మృతుడి చిన్నాన్న హసన్‌వలీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విడపనకల్లులో అర్చకుడు... విడపనకల్లు: మండల పరిధిలోని చీకలగురికి చెందిన ప్రకాష్ (28) అనే అర్చకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలమేరకు... చీకలగురికి ఉండబండ వీరభద్రస్వామి దేవాలయంలో ప్రకాష్ పూజారిగా పనిచేసేవాడు. అయితే సంవత్సర కాలంగా భార్య కాపురానికి రాకపోవంతో మనస్తాపానికి గురై మూడు రోజుల కిందట చీకలగురికిలోని తన సొంత ఇంటిలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పక్కల నివాసం ఉన్న వారికి గురువారం దుర్వాస వస్తుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాల్తూరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆవిష్కరణ: కరోనాను చంపే మాస్క్ అభివృద్ధి
కోల్‌కతా: కరోనా విజృంభిస్తోంది. ప్రభుత్వాలు లాక్డౌన్ వంటి కఠిన ఆంక్షలు విధించినప్పటికి మహమ్మారి అదుపులోకి రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక దూరం పాటిస్తూ.. మాస్క్ ధరిస్తూ.. వ్యక్తిగత శుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రచారం చేస్తున్నారు నిపుణులు, శాస్త్రవేత్తలు, వైద్యులు. ఇక కరోనా వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి మాస్క్ తప్పనిసరి అయ్యింది. కరోనా నుంచి మనల్ని కాపాడే ఆయుధం మాస్కే అని ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు మాస్క్ అంటే కరోనా సోకకుండా కాపాడే ఆయుధంగా భావిస్తున్నాం. కానీ తాజాగా కోవిడ్ వైరస్‌ను చంపే మాస్క్‌ని అభివృద్ధి చేశారు. 12వ తరగతి విద్యార్థిని దీనిని అభివృద్ధి చేసింది. ఈ మాస్క్ కరోనాను చంపేస్తుందని విద్యార్థి పేర్కొంది. ఆ వివరాలు.. పశ్చిమబెంగాల్ పుర్బ బర్ధమాన్ జిల్లాకు చెందిన దిగ్నాటికా బోస్ ఇంటర్ సెకడింయర్ చదువుతుంది. కోవిడ్ వ్యాప్తి పెరుగుతుండటంతో దాన్ని కట్టడి చేయడం ఎలా అని ఆలోచించసాగింది. ఈ క్రమంలో తనకు వచ్చిన ఓ ఆలోచనను ఆచరణ రూపంలో పెట్టి విభిన్నమైన మాస్క్‌ను రూపొందించింది. ఈ మాస్క్ కరోనా వైరస్‌ను చంపేస్తుందని తెలిపింది. దిగ్నాటిక ఆవిష్కరించిన ఈ మాస్క్‌ను ముంబైలోని గూగుల్స్ మ్యూజియం ఆఫ్ డిజైన్ ఎక్సలెన్స్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా దిగ్నాటిక మాట్లాడుతూ.. ‘‘నేను తయారు చేసిన ఈ మాస్క్‌లో మూడు చాంబర్లుంటాయి. మొదటి చాంబర్లో ఉండే అయాన్ జనరేటర్ గాలిలోని దుమ్ము కణాలను వడబోస్తుంది. ఇలా ఫిల్టర్ అయిన గాలి సెకండ్ చాంబర్ గుండా మూడో దానిలోకి ప్రవేశిస్తుంది. కెమికల్ చాంబర్‌గా పిలిచే దీనిలో సబ్బు కలిపిన నీరు ఉంటుంది. ఫిల్టర్ అయ్యి వచ్చిన గాలిలో ఉండే కరోనా వైరస్‌ను ఈ సబ్బు నీరు చంపేస్తుంది’’ అని తెలిపింది. ఇక ‘‘కోవిడ్ పేషెంట్లు ఈ మాస్క్‌ను వినియోగిస్తే.. పైన చెప్పిన ప్రాసేస్ రివర్స్‌లో జరుగుతుంది. వారు వదిలిన గాలిలో కోవిడ్ క్రిములుంటాయి. థర్డ్ చాంబర్‌లోని సబ్బు నీటిలోకి ప్రవేశించినప్పడు అవి చనిపోతాయి. ఆ తర్వాత వైరస్ రహిత గాలి మిగతా రెండు చాంబర్ల గుండా బయటకు వస్తుంది. దీని వల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు’’ అని తెలిపింది. ‘‘కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి సబ్బుతో తరచుగా చేతులు శుభ్రం చేసుకోమని ప్రచారం చేస్తున్నారు. అంటే సబ్బు నీరు కరోనాను చంపుతుందని అర్థం. దీని ఆధారంగా చేసుకుని నేను ఈ మాస్క్ అభివృద్ధి చేశాను. ట్రయల్స్ నిర్వహించడం కోసం త్వరలోనే రాష్ట్ర వైద్య శాఖ అధికారులను కలుస్తాను’’ అని చెప్పుకొచ్చింది దిగ్నాటిక. ఇక ఫస్ట్ లాక్డౌన్ విధించిన సమయంలో తనకు ఈ ఆలోచన వచ్చిందని తెలిపిన దిగ్నాటిక.. తనకు అందుబాటులో ఉన్న వనరులతో దాన్ని ఆవిష్కరించినట్లు వెల్లడించింది. ఇక దిగ్నాటికాకు ఇలా విభిన్న ఆవిష్కరణలు చేయడం అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి. గతంలో ఆమె ఓ కళ్లజోడును తయారు చేసింది. దీన్ని ధరిస్తే.. తల వెనక్కు తిప్పకుండానే మన వెనక ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఇవి అడవిలోకి వెళ్లే వారికి బాగా ఉపయోగపడ్డాయి. వెనక నుంచి ఏవైనా క్రూరమృగాలు వస్తే గమనించడానికి సాయం చేశాయి. ఇప్పటికే దిగ్నాటికా మూడు సార్లు ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైట్ అవార్డ్ అందుకుంది. చెవులపై భారం పడకుండా ఉండేలా రూపొందించిన మాస్క్‌కు గాను మూడో సారి ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైట్ అవార్డు లభించింది. చదవండి: మాస్కు లేకుండా మాజీ ఎమ్మెల్యే తీగల, రూ.1000 ఫైన్ -
‘మామ్ సారీ.. ప్లీజ్ గివ్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్’
గచ్చిబౌలి: తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న ఓ ఇంటర్ విద్యార్థిని 23వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ గోనె సురేష్ తెలిపిన ప్రకారం..నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ‘మంత్రి సెలస్టియ’ అపార్ట్మెంట్ ఎఫ్ బ్లాక్‌లోని 23వ అంతస్తులో ఇషా రంజన్(17), తల్లి మౌనిక సిన్హా, అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి ఉంటోంది. జూబ్లీహిల్స్‌లో శ్రీచైతన్య కాలేజీలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతోంది. సోమవారం సాయంత్రం 4.45 గంటలకు బాల్కనీలో చెప్పులు వదిలేసి స్టూల్ ఎక్కి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వాచ్మెన్ గమనించి చెప్పగా తల్లి చూసి పోలీసులకు సమాచారం అందించారు. భార్యా భర్తలు మౌనిక సిన్హా, సికెష్ రంజన్లు 2015లో విడాకులు తీసుకున్నారు. మౌనిక సిన్హా కూతురుతో కలిసి ఇక్కడే ఉంటుండగా తండ్రి అమెరికా వెళ్లిపోయాడు. తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న ఇషా రంజన్ కొద్ది నెలల క్రితం స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకొని, బ్లేడ్‌తో కోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. మార్చి 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు మిస్ అవుతున్నానని స్నేహితులకు ఏడు లెటర్లు రాసింది. ఆత్మహత్యకు ముందు తల్లికి ‘మామ్ సారీ..ప్లీజ్ గివ్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్’ అని సూసైడ్ నోట్ రాసింది. స్నేహితులకు రాసిన లేఖలతో పాటు సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇషా రంజన్ తీవ్ర ఒత్తిడికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘ఎలా చావాలి’ అని యూట్యూబ్‌లో సెర్చ్ చేసి.. -
శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, కంకిపాడు: కృష్ణా జిల్లాపునాదిపాడు శ్రీచైతన్య క్యాంపస్‌లో ఇంటర్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అనంతపురానికి చెందిన దాసరి లాస్యశ్రీ (16)ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతోంది. బుధవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోరంకిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ఎస్ఐ వై. దుర్గారావు సహచర విద్యార్థులను విచారించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దుర్గారావు తెలిపారు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
అశ్వారావుపేటరూరల్: ఆత్మహత్యకు యత్నించిన బాలిక చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఇన్చార్జి ఎస్సై రాజు కథనం ప్రకారం.. మండల పరిధిలోని నారంవారిగూడెం గ్రామానికి చెందిన బాలిక(16) ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. కుమార్తె సక్రమంగా చదవడం లేదని ఈ నెల 2న తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. ఆ తర్వాత పొలానికి వెళ్లిన తండ్రికి ఫోన్ చేసి చెప్పగా, అతని ఇంటికి వచ్చి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య:మహబూబ్‌నగర్
-
విద్యార్థినిపై లైంగిక దాడి.. ఆపై వీడియోలు తీసి..
సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఇంటర్ విద్యార్థిని(16)పై ఇదే గ్రామానికి చెందిన ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ప్రేమపేరుతో నమ్మించి అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా అర్ధనగ్నంగా ఉన్న ఆమె ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతానని భయభ్రాంతులకు గురి చేశాడు. పలుసార్లు ఆమెపై లైంగికదాడికి పాల్పడగా.. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో కుటుంబ సభ్యులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. ఎల్లారెడ్డిపేట సీఐ బన్సీలాల్, ఎస్సై వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేటకు చెందిన యువకుడు ప్రేమిస్తున్నానంటూ మాయమాటలతో విద్యార్థినికి దగ్గరయ్యాడు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. వీడియో, ఫొటోలు తీసి తరచూ బెదిరిస్తూ పలుసార్లు లైంగికదాడి చేశాడు. ఈ విషయమై విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ బుధవారం యువకుడితోపాటు అతడికి సహకరించిన మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. లైంగిక దాడికి పాల్పడిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆ పరిసరాల్లోని గ్రామస్తులను ఈ ఘటనపై డీఎస్పీ వివరాలు సేకరించారు. లైంగికదాడికి పాల్పడిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు. కాగా ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం ఉందనే కొణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. గంజాయి మత్తులో నిందితుడితో పాటు మరో ముగ్గురు కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. -
జీవితం మీద విరక్తితోనే చనిపోతున్నా..
సాక్షి, మల్కాజిగిరి: మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ బి.శ్రీనివాస్ తెలిపిన మేరకు.. సర్దార్ పటేల్‌నగర్‌కు చెందిన ఎల్లేష్,చంద్రకళ భార్యాభర్తలు. వీరికి కుమారుడు పవన్‌కుమార్, కూతురు తనూష(17) ఉన్నారు. తనూష ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రజ్ఞాపూర్‌లోని గురుకుల్ కాలేజీలో చదువుతోంది. లాక్డౌన్ సందర్భంగా ఇంటి వద్దనే ఉంటోంది. ఈ నెల 14న ఎల్లేష్ , చంద్రకళల, పవన్‌కుమార్‌లు పనిమీద బయటకు వెళ్లారు. చదవండి: (గుడికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు..) మధ్యాహ్నం ఇంటికి వచ్చిన చంద్రకళ బాత్రూమ్లో కాలిన గాయాలతో ఉన్న తనూషను గమనించింది. భర్తకు ఫోన్ ద్వారా తెలియజేసి 108 కు సమాచారం అందించింది. సంఘటనా స్ధలానికి వచ్చిన సిబ్బంది అప్పటికే తనూష మృతి చెందినట్లు తెలిపారు. తన చావుకు తల్లితండ్రులు కారణం కాదని, జీవితం మీద విరక్తితో కిరోసిన్ పోసుకొని చనిపోదామనుకుంటున్న అని రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. చదవండి: (దారుణం: మైనర్‌పై అత్యాచారం చేసిన ఏఎస్సై) -
లారా అదృశ్యం కేసు సుఖాంతం
సాక్షి, హైదరాబాద్ : తల్లిదండ్రులు మందలించారని ఇంటిని వెళ్లిపోయిన ఇంటర్ విద్యార్థిని లారా అదృశ్యం కేసు సుఖాంతమైంది. ఆమె క్షేమంగా ఇంటికి తిరిగిరావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. హయత్‌నగర్ తట్టిఅన్నారానికి చెందిన లారా.. తల్లిదండ్రులు మందలించారంటూ అలిగి మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు, బంధువులు ఎక్కడ గాలించినా ఆమె ఆచూకీ లభించలేదు. చివరికి హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా బాలిక జాడ కనుగొనేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం రాలేదు. చివరకు లారానే ఇంటికి తిరిగి రావడంతో కేసు సుఖాంతమైంది. -
రెండవ భార్యగా ఒప్పుకోనందుకు..
రొంపిచెర్ల (చిత్తూరు జిల్లా): ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక ఇందిరమ్మ కాలనీలో గురవారం చోటు చేసుకుంది. మృతురాలి తండ్రి కథనం..కాలనికీ చెందిన అమీర్ 2వ కుమారై రేష్మా(17) ఇంటర్ మీడియట్ పూర్తి చేసింది. అయితే అదే వీధిలోని ఇమ్రాన్(27) రేష్మాకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. ఇమ్రాన్‌కు ఇది వరకే వివాహమై ఒక కుమారై కూడా ఉందని తెలుసుకున్న రేష్మా తల్లిదండ్రులు ఇద్దరినీ మందలించారు. అయితే ఇమ్రాన్ తాను రెండో వివాహం చేసుకుంటానని ముందుకొచ్చాడు. అయితే రేష్మా తల్లిదండ్రులు దీనికి ఇష్టపడలేదు. రెండవ భార్యగా వద్దంటూ కుమార్తెకు నచ్చచెప్పారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఇంట్లో బెడ్ రూంలో రేష్మా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించి కుటుంబ సభ్యులు హుటాహుటిన రేష్మాను చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రొంపిచెర్ల ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. -
విద్యార్థి ఆయువు తీసిన ఆర్థిక కష్టాలు
వైఎస్సార్ జిల్లా, మార్టూరు: బతుకుదెరువు కోసం లారీ క్లీనర్‌గా మారిన ఇంటర్ విద్యార్థి మార్గం మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన స్థానిక జాతీయ రహదారిపై ఇసుక దర్శి (ప్రకాశం జిల్లా) సమీపంలో మంగళవారం వేకువ జామున 4 గంటల ప్రాంతంలో జరిగింది. పోలీసులు, హైవే అంబులెన్స్ సిబ్బంది కథనం ప్రకారం.. కడపలోని గౌస్ నగర్‌కు చెందిన వెంకట్ (18) ఇంటర్ చదువుతున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో వెంకట్ సోమవారం రాత్రి కడప నుంచి విజయవాడ వెళ్లే టమాటా లారీలో క్లీనర్‌గా బయల్దేరాడు. స్థానిక ఇసుక దర్శి సమీపంలో అతడు ప్రయాణిస్తున్న లారీకి ముందు వెళ్తున్న మరో లారీ అకస్మాత్తుగా ఆగింది. దీంతో వెనుక లారీ బలంగా ఢీకొంది. ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలుకాగా.. క్యాబిన్లో కూర్చున్న వెంకట్ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది అతడిని లారీ నుంచి అతికష్టం మీద బయటకు తీస్తుండగా మృతి చెందాడు. ఎస్ఐ శివకుమార్ తన సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. -
నాన్నా.. సూసైడ్ చేసుకుంటున్నా..
వెల్దుర్తి(తూప్రాన్): మంచిగా చదువుకొమ్మని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయాన్ని ఫోన్లో తండ్రికి తెలుపగా తండ్రి సమాచారం మేరకు సకాలంలో స్పందించిన పోలీసులు విద్యార్థి ఆచూకీ కనుగొనడంతో ప్రాణాపాయం తప్పింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని కుకునూర్ గ్రామానికి చెందిన ఎరుకల నాగరాజు (17)ను మంచిగా చదువుకోవాలని అతని తండ్రి మందలించాడు. దీంతో నాగరాజు కోపంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లి విషం సేవించాడు. అనంతరం తాను చనిపోతున్నానంటూ తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. తండ్రి పోలీసులకు సమాచారమివ్వగా అప్రమత్తమైన పోలీసులు ఐటీ విభాగం సహాయంతో విద్యార్థి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడు వెల్దుర్తి గ్రామ శివారులోని హల్దీవాగు సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ పడి ఉన్న నాగరాజును చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. తమ పిల్లాడి ప్రాణాలు కాపాడిన పోలీసులకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. -
అనుమానస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతి
-
రైలుఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి
విజయనగరం,బాడంగి: మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి వాలేటి జోగీందర్ భూపతినాయుడు (18)ఉరఫ్ ఉదయ్‌ను రైలు ఢీ కొనడంతో ఆదివారం మృతిచెందాడు. విద్యార్థి విజయవాడ చైతన్య కళాశాలలో ద్వితీయ ఇంటర్ చదుతున్నాడు. సంక్రాంతి సెలవులకోసం స్వ గ్రామం భీమవరం వచ్చాడు. తల్లిదండ్రులు, అక్క, స్నేహితులతో ఆనందంగా గడిపాడు. తిరిగి కళాశాలకు వెళ్లేందుకు డొంకినవలస గ్రామం పక్క నుంచి ట్రాక్ దాటుతూ రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా ఉదయం 9.30 ప్రాంతంలో విశాఖ నుంచి కొరాపుట్ వెళ్లే (డీఎంయూ) ఢీకొంది. దీంతో విద్యార్థి దుర్మరణం చెందాడు. రైలు డ్రైవర్, స్టేషన్ మాస్టారు ఇచ్చిన సమాచారం మేరకు బొబ్బిలి హెచ్‌సీ కృష్ణారావు తమ సిబ్బందితో కలసి ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆదుకుంటాడనుకున్న కుమారుడుని రైలు రూపంలో మృత్యువు కబలించిందంటూ తల్లిదండ్రులు ఉమాదేవి, తిరుపతినాయుడు, సోదరి తేజశ్వని బోరున విలపిస్తున్నారు. -
ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
సైదాబాద్: హాస్టల్ ఉంటూ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైన సంఘటన సైదాబాద్ పోలీస్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.మహబూబ్‌నగర్ జిల్లా, చంద్రదాన గ్రామం, పుల్సింగ్తండాకు చెందిన పత్లావత్ రేణుక(17) ఐఎస్‌సదన్ డివిజన్, వినయ్‌నగర్ కాలనీలోని నాయుడు హాస్టల్లో ఉంటూ స్థానికంగా ఉండే సంఘం లక్ష్మిబాయి జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 7న సంక్రాంతి పండగ నేపథ్యంలో ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లింది. దీంతో హాస్టల్ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే ఆమె ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె బంధువు పరుశురాం గురువారం సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగిని.. మల్కాజిగిరి:ప్రైవేట్ ఉద్యోగిని అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ నాగేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.దయానంద్‌నగర్ సాయికృప ఎంపైర్ అపార్ట్మెంట్లో ఉంటున్న తొగర్ క్లెమెంట్ దైవకర్ భార్య జ్యోత్స్న లత గచ్చిబౌలిలోని అభిరాం డెవలపర్స్‌లో జీఎంగా పనిచేస్తోంది. ఈ నెల 8 న డ్యూటీకి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఆమె సెల్‌ఫోన్ కూడా స్విచ్ఛాఆఫ్ వస్తుండడంతో ఆమె భర్త దైవకర్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు విద్యార్థులు అదృశ్యం ఉప్పల్: రామంతాపూర్ డాన్‌బాస్కో నవజీవన్ అనాథాశ్రమం నుంచి ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆశ్రమంలో ఉంటున్న కోడి అఖిల్, నడిపి పోలు అనే విద్యార్థులు ఈ నెల 8న ఉదయం ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోయారు. వారికోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో సొసైటీ ఇన్చార్జి శిల్వరాజు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి
ఆనందపురం (భీమిలి): అందరిలాగే తానుకూడా వేకువజామునే లేచాడు. అందరితోపాటు కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేయడానికని బయలుదేరి వెళ్లాడు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. ఏమయిందో తెలియదుగానీ ఐదు అంతస్తుల భవనం పైనుంచి ఏదో కింద పడ్డ శబ్ధం. అక్కడి సిబ్బందిలో కలకలం. వెళ్లి చూడగా తీవ్ర గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ అచేతనంగా పడి ఉన్న విద్యార్థి. ఆ వెంటనే కుమారుడుకి గాయాలయ్యాయని విద్యార్థి తల్లిదండ్రులకు సమాచా రం. ఆందోళనకు గురైన వారు చేరుకునేలోపే కుమారుడు విగతజీవిగా మారాడన్న పిడుగులాంటి వార్త. దీంతో దుఃఖ సాగరంలో మునిగిపోయిన తల్లిదండ్రులు. ఇదీ మండలంలోని బోయిపాలెంలో ఉన్న శశి ఇంటర్ కళాశాలలో శనివారం తెల్లవారుజామున జరిగిన సంఘటన మిగిల్చిన విషాదం. ఎన్నో ఆశలతో చదివిస్తున్న కుమారుడు విగతజీవిగా మారడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా, పర్లాకిమిడి, యూడవీధికి చెందిన యర్నాగుల నరిసింహరావు, గీత దంపతులకు కార్తీక్ (17) ఒక్కడే కుమారుడు. నరిసింహరావు పర్లాకిమిడిలో వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడిని అల్లారుముద్దుగా పెంచి ప్రయోజకుడిని చేయాలని భావించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి వరకు చదవించారు. పదో తరగతిలో కార్తీక్ 8.2 గ్రేడ్ మార్కులు సాధించాడు. అనంతరం ఈ ఏడాది బోయిపాలెంలో ఉన్న శశి విద్యా సంస్థలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరంలో చేర్పించి కళాశాల హాస్టల్లో ఉంచారు. మూడో అంతస్తులోని 523వ నంబరు గదిలో సహచర విద్యార్థులతో కార్తీక్ ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున సుమారు 5 – 30 గంటల ప్రాంతంలో హాస్టల్ సిబ్బంది విద్యార్థులను నిద్ర లేపారు. అందరితోపాటు కార్తీక్ కూడా లేచి కాల కృత్యాలు తీ ర్చుకొని స్నానం చేయడానికని వె ళ్లాడు. కొద్దిసేపటికి హాస్టల్ భవనం పైనుంచి కిందకు ఏదో పడ్డ పెద్ద శబ్ధం వచ్చింది. అప్పటికి విధుల్లో ఉన్న ఆనందరావు అనే సెక్యూరిటీ గార్డు పరుగున వెళ్లి చూడగా తీవ్ర గాయాలతో అచేతనంగా పడి ఉన్న కార్తీక్ కనిపించాడు. దీంతో ఆందోళనకు గురై కళాశాల సిబ్బందికి తెలియజేయడంతో అక్కడకు చేరుకొని చికిత్స కోసం ఆరిలోవలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. ఆ వెంటనే కార్తీక్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థుల రక్షణ గాలికి.. కళాశాలలో విద్యార్థుల రక్షణకు కనీస చర్యలు చేపట్టనట్టు తెలుస్తోంది. విద్యార్థుల కదలికలు గమనించడానికిగానీ, తరగతి గదులు, హాస్టల్ గదులలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికీ సీసీ కెమోరాలు ఎక్కడా కానరాలేదు. కళాశాల అంతటికీ ఇద్దరే సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి వల్లే తమ కుమారుడు మృతి చెందాడని కార్తీక్ తండ్రి నరిసింహారావు ఆరోపిస్తున్నాడు. విచారణ జరిపిన ఏసీపీ విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా ప్రాంతాన్ని ఏసీపీ రవిశంకరరెడ్డి, సీఐ రవి పరిశీలించారు. సిబ్బందిని, విద్యార్థులను విచారించారు. మృతదేహం ఉన్న ఆరిలోవలోని ప్రైవేట్ ఆస్పత్రిని డీసీపీ విజయ్‌భాస్కర్ సందర్శించి తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసుని ఎస్ఐ శ్రీనివాసరావు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వస్థాలానికి తీసుకెళ్తుండగా గంభీరం వద్ద కళాశాల ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడంతో పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. సంఘటనపై పలు అనుమానాలు..! కార్తీక్ భవనం పైనుంచి దూకి పడిపోయాడని విద్యా సంస్థ సిబ్బంది తెలుపుతుండగా తమ కుమారుడు పిరికివాడు కాదని తల్లిదండ్రులు అంటున్నారు. ఎవరో ఏదో చేశారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. విద్యార్థికి కళాశాలలో ఏమైనా ఇబ్బందులు ఉండి అఘాయిత్యానికి పాల్పడ్డాడా..? లేదా ఎవరైనా పైనుంచి తోసేశారా..? కళాశాల సిబ్బంది ఒత్తిడి ఏమైనా ఉందా..? విద్యార్థుల మధ్య ఏమైనా మనస్పర్థలు ఉన్నాయా..? అన్న కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక వేళ కార్తీక్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటే అందుకు ప్రేరేపించిన సంఘటనలు ఏమిటన్నది తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. -
ప్రాణం తీసిన సెల్ఫీ మోజు
సాక్షి, గుంటూరు : జిల్లాలోని మంగళగిరి మండలం చినకాకాని వద్ద గుంటూరు కాలువలో ఇంటర్మీడియట్ విద్యార్థి బి. విద్యాసాగర్(17) గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలివీ.. తాడేపల్లి డొల్లాస్ నగర్‌కు చెందిన విద్యాసాగర్ ఆదివారం స్నేహితుతడు జగదీష్ పుట్టిన రోజు కావడంతో మరో ఏడుగురు స్నేహితులతో కలిసి సాయంత్రం వేళ చినకాకానిలోని గుంటూరు కాలువ వద్దకు సరదాగా వెళ్లాడు. అక్కడ విద్యాసాగర్ ఫోటోలు కోసం కాలువలోకి దిగగా లోతు ఎక్కువ ఉండటంతో మునిగిపోయాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన స్నేహితుడు అరుణ్ ప్రమాదంలో చిక్కుకోగా.. అక్కడే ఉన్న అయ్యప్ప మూలధారుల్లో ఒకరు వెంటనే కాలువలోకి దూకి అతడిని కాపాడారు. విద్యాసాగర్ గల్లంతు కావడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రాత్రివేళ విద్యార్థి కోసం గాలిస్తున్నారు. -
వసతిగృహంలో ర్యాగింగ్ భూతం
సాక్షి, కొయ్యలగూడెం(పశ్చిమగోదావరి) : ర్యాగింగ్ భూతానికి అభం శుభం తెలియని ఓ విద్యార్థి విలవిల్లాడి మానసిక క్షోభకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ప్రస్తుతం ఆ బాలుడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. బాలు డికి వైద్య వివరాలు బయటకు తెలియ నీయకుండా ఆసుపత్రులను మార్చుతూ జరిగిన ఘటనను కప్పిపుచ్చేం దుకు సంక్షేమ శాఖ వసతిగృహం అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. జంగారెడ్డిగూడెం మండలం చల్లవారిగూడానికి చెందిన పాక గంగరాజు కుమారుడు పాక శాంసన్(15) కొయ్యలగూడెం సమీపంలోని అంకాలగూడెంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ కళాశాల సంక్షేమ వసతిగృహంలో విద్యనభ్యసిస్తున్నాడు. శాంసన్ నెలక్రితం వసతిగృహంలో చేరి, కొయ్యలగూడెంలోని ఓ కళాశాలలో ఇంటర్ (ప్రథమ) చదువుతున్నాడు. బయోమెట్రిక్ అమలు కాకపోతుండటంతో 15 రోజుల క్రితం వసతిగృహం అధికారి శాంసన్‌ను స్వగ్రామం పంపినట్లు తెలిసింది. సోదరి ఫంక్షన్ చల్లవారిగూడెంలో ఏర్పాటు చేయడంతో శాంసన్ అక్కడికి వెళ్లాడు. నాలుగు రోజుల క్రితం తిరిగి వసతిగృహానికి వచ్చిన శాంసన్ ఆగస్టు 30వ తేదీ రాత్రి ఆత్మహత్యకు యత్నించాడు. దీనిపై సంక్షేమశాఖాధికారిని వివరణ కోరగా వసతిగృహాన్ని విడిచి ఇంటికి వచ్చినందుకు తండ్రి మందలించడంతో ఆవేదన చెందిన శాంసన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. శాంసన్‌ను వాహనంలో కొయ్యలగూడెం, అక్కడి నుంచి జంగారెడ్డిగూడెం ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. శాంసన్ తండ్రి గంగరాజు, ఆసుపత్రిలో కోలుకుంటు న్న తన కుమారుడు ఎదుర్కొన్న వేధిం పులను సాక్షికి వివరించారు. శాంసన్‌ను తోటి విద్యార్థులు అనాకారిగా ఉన్నావంటూ గేలి చేస్తున్నారంటూ కొద్ది రోజుల నుంచి ఫోన్లో వాపోతున్నాడని పేర్కొన్నారు. ఒకటి, రెండుసార్లు విద్యార్థులకు స్వయంగా వెళ్లి చెప్పి చూశానని ఆయన తెలిపారు. ఇంటికి వచ్చి వెళ్లిన శాంసన్‌ను విద్యార్థులు మరింత గేలి చేయడంతో ఆత్మహత్యకు ఒడిగట్టాడని గంగరాజు తెలిపారు. ఇదే విషయాన్ని శాంసన్‌ను అడగ్గా సహచర విద్యార్థులు గేలిచేయడం, అవమానకర రీతిలో మాట్లాడి దూరంగా ఉంచుతున్నారని, దీనిపై సంక్షేమశాఖాధికా రికి ఫిర్యాదు చేస్తే విద్యార్థులకు దూరంగా పడుకోబెట్టేవారని తెలిపాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అనంతరం సంక్షేమ శాఖాధికారులు నిజాలు బహిర్గతం చేయవద్దని, చేస్తే వసతిగృహం నుంచి పంపించేస్తామని బెది రించినట్టు శాంసన్ తెలిపారు. దీనిపై వివరణ ఇవ్వడానికి సంబంధిత సంక్షే మ శాఖ అధికారి సుముఖత వ్యక్తం చేయకపోగా, విద్యార్థి వసతిగృహంలో చేరలేదని, అసలు తమకు, ఆ విద్యార్థికి సంబంధం లేదని, తండ్రి మందలిం చడం వల్లే ఆత్మహత్యకు ఒడిగట్టాడని పేర్కొన్నారు. ఆత్మహత్యాయత్నాని పాల్పడిన శాంసన్‌ను ఎవరికీ తెలియకుండా ఆసుపత్రులు మార్చుతూ రహస్యంగా వైద్య చికిత్స అందించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వసతిగృహం విద్యార్థులను దీనిపై నోరు మెదపకుండా కఠినంగా అధికారి ఆంక్షలు విధించినట్లు తెలిసింది.కళాశాల వసతిగృహ సంక్షేమ శాఖ అధికారులు తీరును పలువురు విమర్శిస్తున్నారు. శాంసన్ కొయ్యలగూడెం– పోలవరం రోడ్డులో పురుగు మందుల షాపులో గుళికలు కొనుగోలు చేసినట్లు విచారణలో బయటపడింది. -
నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతుకం
-
ఇంటర్ విద్యార్థి దారుణ హత్య
ప్రకాశం ,గిద్దలూరు రూరల్: ఇంటర్ మొదటి సంవత్సరం సప్లమెంటరీ పరీక్ష రాయాల్సి ఉన్న విద్యార్థిని దుండగులు దారుణంగా హత్య చేసి పూడ్చి పెట్టారు. ఈ సంఘటన మండలంలోని కొంగలవీడు సమీపం అంకాలమ్మ గుడికి కూతవేటు దూరంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. కొంగలవీడు ఎస్టీ కాలనీకి చెందిన రోశయ్య కుమారుడు, ఇంటర్ విద్యార్థి రమణయ్య (19)ను మంగళవారం రాత్రి సమయంలో అంకాలమ్మ గుడి నుంచి రాజానగర్ మీదుగా వెళ్లే కొండ రోడ్డు ప్రాంతంలో కొందరు అతి దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. మృతదేహాన్ని అక్కడే పూడ్చి పెట్టి అనంతరం అక్కడ ఉన్న పాత సిమెంట్ రేకులను పైన కప్పి వెళ్లిపోయారు. పూడ్చి పెట్టిన మట్టి కుప్ప వద్ద చిల్లర డబ్బులు పడి ఉన్నాయి. హత్య జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలతో పాటు ఈడ్చుకెళ్లిన గుర్తులు ఉన్నాయి. కత్తికి ఉండాల్సిన కర్ర పిడి ముక్కను సైతం అక్కడే వదిలేశారు. రోడ్డుపై ఉన్న రక్తపు మరకలను గమనించిన కొంగలవీడుకు చెందిన పొలం యజమాని వెంకటేశ్వర్లు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ వలి సంఘటన స్థలానికి చేరుకుని రక్తపు మరకల ఆధారంగా పూడ్చి పెట్టిన రమణయ్య మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని చూసిన కొంగలవీడు గ్రామస్తులు మృతుడు ఎస్టీ కాలనీకి చెందిన రోశయ్య కుమారుడు రమణయ్యగా గుర్తించారు. అనంతరం మృతుడి తల్లిందడ్రులకు సమాచారం అందించారు. తల, మెడపై బలమైన కత్తి గాయాలు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పట్టణంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. హత్యకు కారణాలు పోలీసుల విచారణలో బయట పడాల్సి ఉంది. -
పరీక్షలో ‘పబ్జీ’ రాశాడు!
సాక్షి, బెంగళూరు: స్మార్ట్‌ఫోన్ గేమ్ ‘పబ్జీ’కి బానిసైన ఓ ఇంటర్ విద్యార్థి ఏకంగా పరీక్షల్లో దాని గురించి రాసి ఫెయిల్ అయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలోని గదగ్ జిల్లాలో జరిగింది. గతేడాది టెన్త్ పరీక్షల్లో 73 శాతం మార్కులతో పాసైన ఓ విద్యార్థి గదగ్‌లో ఓ కళాశాలలో ఇంటర్లో చేరాడు. స్మార్ట్‌ఫోన్‌లో గంటలతరబడి ‘పబ్జీ’ గేమ్ ఆడటంతో అతనికి చదువుపై ఆసక్తి సన్నగిల్లింది. కళాశాల నుంచి వచ్చాక స్మార్ట్‌ఫోన్‌లో పబ్జీ ఆడుతూ గడిపేసేవాడు. ఏం చేస్తున్నావని తల్లిదండ్రులు అడిగితే.. ‘స్నేహితుల దగ్గర సబ్జెక్టుల గురించి చాట్ చేస్తున్నా’ అని జవాబిచ్చేవాడు. చివరికి పరీక్షలు మరో 15 రోజులు ఉన్నాయనగా, పబ్జీ ఆడటం ఆపేశాడు. దీంతో చదువుపై ఏకాగ్రత కుదరలేదు. తీరా పరీక్ష హాల్లోకి వెళ్లాక.. ఇన్విజిలేటర్లు ఎకనామిక్స్ ప్రశ్నపత్రాన్ని అందించారు. అయితే ఈ ప్రశ్నలకు జవాబులు తెలియకపోవడంతో పబ్జీ గేమ్ ఎలా ఆడాలి? ఎలా ఆడితే గెలుస్తాం? అని సవివరంగా వ్యాసాలు రాశాడు. దీంతో ఇటీవల వెలువడ్డ పరీక్షా ఫలితాల్లో అతను ఫెయిల్ అయ్యాడు. -
ఇంటర్ విద్యార్థి గొంతుకోసిన దుండగులు..!
-
పరీక్ష రాస్తూ గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి
-
పరీక్ష రాస్తూ గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి
సాక్షి, హైదరాబాద్ : పరీక్ష హాల్లోనే ఓ ఇంటర్మీడియెట్ విద్యార్థి గుండె ఆగింది. వివరాల్లోకి వెళితే...ఖమ్మం జిల్లాకు చెందిన గోపీరాజు శనివారం ఉదయం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు హాజరయ్యాడు. సికింద్రాబాద్ ప్యారడైజ్ సమీపంలోని శ్రీ చైతన్య కాలేజీలో పరీక్ష రాస్తున్న అతడు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో గోపిరాజును సమీపంలోని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా గోపీరాజు ఓ ప్రయివేట్ కళాశాలలో ఒకేషనల్ కోర్సు చదువుతున్నాడు. విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
దివ్యాంగ విద్యార్థికి ఇక్కట్లు
అల్లాదుర్గం (మెదక్): దివ్యాంగుడైన ఓ ఇంటర్ విద్యార్థి వార్షిక పరీక్షల్లో నష్టపోవల్సిన పరిస్థితి నెలకొంది. తండ్రి నిరక్ష్యరాస్యుడు, ఆ విద్యార్థికి కాళ్లు, చేతులు సరిగా పని చేయవు. సహాయకుడితో పరీక్షలు రాసే అనుమతి ఇవ్వాలని వేడుకున్నా.. అనుమతి లేదంటూ అధికారులు అతనితోనే పరీక్ష రాయించారు. బుధవారం మెదక్ జిల్లా అల్లాదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. అల్లాదుర్గం మండలం వెంకట్రావ్పేట గ్రామానికి చెందిన బాల్‌రాజ్ స్థానిక జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బాల్‌రాజ్ చేతులు, కాళ్లు సరిగా పని చేయని దివ్యాంగుడు. బుధవారం ప్రారంభమైన తెలుగు పరీక్షను సహాయకుడితో రాస్తానని బాల్‌రాజ్ కళాశాల పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్‌ను అడిగినా.. బోర్డు అనుమతి లేదని కళాశాల అధికారులు నిరాకరించారు. రెగ్యులర్ విద్యార్థినే.. కాలేజీలో రెగ్యులర్‌గానే చదివానని, తాను దివ్యాంగు డినని అందరికీ తెలుసని, సహాయకుడికోసం అధికారులు బోర్డు అనుమతి కోసం ఎందుకు పంపలేదో తెలియదని బాల్‌రాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను పరీక్ష రాస్తే సమయం సరిపోదని బాల్‌రాజ్ వాపోయాడు. తామే బోర్డు నుంచి అనుమతి తెచ్చుకోవాలని ఎప్పుడూ చెప్పలేదన్నారు. పదో తరగతిలో కూడా సహాయకుడితోనే పరీక్షలు రాసినట్లు వివరించాడు. ఈ విషయంపై పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ రవీందర్‌ను వివరణ కోరగా, బోర్డు నుంచి విద్యార్థి అనుమతి తెచ్చుకోలేదని చెప్పారు. తమకు అతను సర్టిఫికెట్లు ఇవ్వలేదని, విద్యార్థే సహాయకుడికోసం అనుమతి తెచ్చుకోవాలని వెల్లడించారు. పరీక్ష ప్రారంభమైన సమయంలో అడిగితే తామేం చేస్తామన్నారు. ఇప్పటికైనా బోర్డుకు వెళితే అనుమతి వస్తుందని తెలిపారు. -
గుత్తిలో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య
-
నల్లగొండలో సైకో విద్యార్ధి వీరంగం
-
జ్వరంతో బాధపడుతున్న మధులిక
సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాది కిరాతక దాడిలో తీవ్రంగా గాయపడిన మధులిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై యశోదా ఆస్పత్రి వైద్యులు బుధవారం మెడికల్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతానికి శరీరంలో ఇన్ఫెక్షన్ ఉండటంతో ఆమెకు.. అది తగ్గేందుకు చికిత్స అందిస్తున్నామని, ఇంకా అత్యవసర విభాగంలోనే ఉంచి ఆమెకు వైద్యం కొనసాగిస్తున్నామని వైద్యులు తెలిపారు. మధులిక ఇంకా జ్వరంతో బాధపడుతున్నారని, ఆమెకు జ్వరం వస్తూ పోతూ ఉండడంతో మెరుగైన వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. తన ప్రేమను నిరాకరించిందని ఇంటర్ విద్యార్థిని అయిన మధులికపై ప్రేమోన్మాది భరత్ కొబ్బరిబోండాల కత్తితో కిరాతకంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో శరీరంలోని బలమైన గాయాలు కావడంతో గాయాలకు ఎప్పటికప్పుడు డ్రెసింగ్ చేస్తూ.. ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నామని యశోదా వైద్యులు తెలిపారు. -
లే అన్నా.. పైకి లే అన్నా..!
అనంతపురం, ధర్మవరం అర్బన్: ‘ప్రతిరోజూ చదువుకోవాలని ఉదయాన్నే నిద్ర లేపేవాడివే.. ఇప్పుడు నువ్వే శాశ్వతంగా నిద్రపోయావా.. లే అన్నా.. పైకి లే.. అన్నా’ అంటూ తమ్ముడు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ధర్మవరం పట్టణంలోని సత్యసాయినగర్‌కు చెందిన చేనేత కార్మికుడు కొక్కంటి నాగరాజు, అనుపమ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు యశ్వంత్ (17) ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, రెండో కుమారుడు రాజేష్ పదో తరగతి చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం యశ్వంత్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. కాసేపటి తర్వాత చుట్టుపక్కల వారు గమనించి అతడిని కిందకు దించి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే యశ్వంత్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఆస్పత్రికి చేరుకున్న తమ్ముడు, తల్లిదండ్రులు బోరున విలపించారు. అన్న మృతదేహంపై పడి రాజేష్ గుండెలవిసేలా రోదించాడు. పదో తరగతి కదా చదువుకో అంటూ తెల్లవారుజామున నిద్రలేపే అన్న ఇక లేడని తెలిసి కన్నీరుమున్నీరయ్యాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇంటర్ విద్యార్థినిపై ఉన్మాది కత్తితో దాడి
-
ఇంటర్ విద్యార్ధిని పై ప్రేమోన్మాది దాడి
-
హైదరాబాద్ బర్కత్‌పురాలో ఘోరం
సాక్షి, హైదరాబాద్: ప్రేమను అంగీకరించలేదన్న కక్షతో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. ఇంటర్ చదువుతున్న అమ్మాయిపై కొబ్బరి బోండాల కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని జరిగింది. బర్కత్‌పురా సత్యానగర్ ప్రాంతానికి చెందిన విద్యార్థిని.. ఇంటర్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన భరత్ అనే యువకుడు ప్రేమించాలని ఆమెను కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ఆమెను అడ్డుకున్న నిందితుడు.. తనను ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. ఒప్పుకోలేదనే ఆగ్రహంతో ఊగిపోయిన భరత్...వెంట తెచ్చుకున్న కొబ్బరి బోండాల కత్తితో ఆమె మెడపై వేటు వేశాడు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. ఈ దారుణాన్ని చూసిన చుట్టపక్కలవారు వెంటనే పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించారు. దీంతో బాధితురాలిని మలక్ పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కాగా, ఇంటర్ సెకండియర్ చదువుతున్న అమ్మాయి (17) వెంట పడుతూ..తరచూ భరత్ వేధిస్తున్న విషయం తల్లిదండ్రుల దృష్టికి వెళ్లడంతో గతవారం వారిద్దరినీ కౌన్సెలింగ్‌కు తీసుకెళ్లారు. అయినా, భరత్ తన ధోరణిని మార్చుకోలేదు. రెండురోజుల కిందట అమ్మాయి తల్లికి ఫోన్ చేసి బెదిరించాడు. అతడు కిరాతకంగా దాడి చేయడంతో మెడపై, పొట్టపై, చేతివేళ్లపై బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. -
అనారోగ్యంతో ఇంటర్ విద్యార్థిని మృతి!
సాక్షి, సూర్యాపేట : పట్టణంలోని శ్రీనిధి జూనియర్ కళాశాలలో అనారోగ్యంతో ఓ ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఆత్మకూరు మండలం ఏపూర్‌కు చెందిన షేక్ షమీనా ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. షమీనాకు అనారోగ్యంతో ఉందంటూ శుక్రవారం కళాశాల నుంచి ఆమె తల్లికి ఫోన్ వచ్చింది. తాను అందుబాటులో లేనని, ఆస్పత్రికి తీసుకువెళ్లాలని కళాశాల సిబ్బందికి తల్లి చెప్పింది. అయినా కళాశాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. విద్యార్థిని షమీనా పరిస్థితి విషమం కావడంతో ఉదయం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని చనిపోయిందని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని షమీనా తల్లి, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్ధిని మృతి
-
స్విమ్స్‌లో విద్యార్థి మృతిపై ఆందోళన
చిత్తూరు, తిరుపతి (అలిపిరి): స్విమ్స్ నెఫ్రాలజీ ఐసీయూలో చికిత్స పొందుతున్న ఇంటర్ ప్రథమ సంవత్సరవిద్యార్థి చేకుర్తి చరణ్(16) కిడ్నీ సమస్యలతో గత 15 రోగులుగా ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నాడు. వైద్యులు, నర్సుల నిర్లక్ష్య వైద్యం వల్లే విద్యార్ధి మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు సోమవారం ఆస్పత్రిలోని ఎన్టీఆర్ కూడలి వద్ద ఆందోలనకు దిగారు. వీరికి వైఎస్సార్ సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల కథనం..పొట్టి శ్రీరాములు జిల్లా డక్కిలి మండలం, తిమ్మనగుంటకు చెందిన సి.చరణ్(15) కిడ్నీ సమస్యలతో ఈనెల 7న స్విమ్స్ అత్యవసర విభాగానికి తీసుకొచ్చారు. అత్యవసర విభాగంలో ఆర్యోగ్యం కాస్త మెరుగు పడడంతో ఆదివారం అతడిని నెఫ్రాలజీ ఐసీయూ విభాగానికి తరలించారు. అయితే రాత్రి 9.30 గంటలకు తీవ్రమైన జ్వరంతో పాటు రక్తవాంతులు చేసుకున్నాడు. తల్లిదండ్రులు విషయాన్ని విధుల్లో ఉన్న నర్సులకు చెప్పినా పట్టించుకోలేదు. అత్యవసర విభాగంలోని వైద్యుల వద్దకు వెళ్లి తన కుమారుడి పరిస్థితి దయనీయంగా ఉందని విద్యార్థి తల్లిదండ్రులు ప్రాధేయపడ్డారు. ఉదయం వస్తామని వైద్యులు సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం వేకువజామున 12.30 గంటలకు విద్యార్థి ప్రాణాలు విడిచాడు. సరైన వైద్యసేవలు అందకపోవడం వల్లే చరణ్ మృతి చెందాడని బంధువులు ఆగ్రహించారు. ఉదయం 9 నుంచి 11 గంటలకు వరకు ఆస్పత్రిలో ఆందోళన చేశారు. స్విమ్స్ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం మహాప్రస్థాన వాహనంలో విద్యార్థి మృతదేహాన్ని నెల్లూరుకు తరలించారు. వైఎస్సార్ సీపీ మద్దతు వైద్యుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థి స్విమ్స్‌లో మృతి చెం దాడన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కట్టా గోపి యాదవ్, బీసీ సెల్ న గర అధ్యక్షులు తండ్లం మోహన్ యాదవ్, నాయకులు వేణుగోపాల్, విజయలక్ష్మి, చాన్‌బాషా, వూటుగుంట మోహన్ ఆస్పత్రికి చేరుకున్నారు. బాధిత కు టుం సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు. స్విమ్స్‌లో వైద్య సేవలు రోజు రోజూకు దిగజారుతున్నాయ ని ఆరోపించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి జిల్లాలో మరొకటి లేకపోవడం వల్ల విధిలేని పరిస్థితిలో రోగులు స్విమ్స్‌కు వస్తున్నారని, అయితే రోగుల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు, నర్సులు కొన్ని సమయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నా బిడ్డ ప్రాణాలు తీశారు వైద్యసేవలు సరిగా అందించకపోవడం వల్లే తమ బిడ్డ మృత్యువాత పడ్డాడని చరణ్ తల్లిదండ్రులు పా ర్వతి, భాస్కర్ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రాణాపా య స్థితిలో ఉన్న తమ బిడ్డకు సరైన సమయంలో చికిత్స చేయలేదన్నారు. ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు పొందుతున్న రోగులను చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ కుమారుడి మృతికి కారకులైన వైద్యులు, నర్సులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం చరణ్‌కు స్విమ్స్‌లో మెరుగైన వైద్య సేవలు అందించామని స్విమ్స్ వైద్యులు డాక్టర్ అల్లోక్ సచన్, డాక్టర్ రామ్ తెలిపారు. మృతుడి తల్లిదండ్రుల ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని ఘటనపై ప్రత్యేక కమిటీతో సమావేశమై విచారణ చేస్తామన్నారు. ఇందులో వైద్యులు, నర్సులు నిర్లక్ష్యం ఉందని తేలితే చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబ సభ్యులకు అధికారులు హామీ ఇచ్చారు. -
ఆశల దీపం ఆరిపోయింది
తాము పడుతున్న కష్టాలను కుమారుడు పడకూడదని భావించి రెక్కలుముక్కలు చేసుకుని చదివిస్తున్న ఆ తల్లిదండ్రులకు చివరకు పుత్రశోకమే మిగిలింది. ఆదుకుంటాడనుకున్న కొడుకు రోడ్డు ప్రమాదం రూపంలో మృతిచెందాడనే పిడుగులాంటి వార్త వినాల్సి రావడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద ఘటన పాలకొండ మండలం నవగాం చెరువు మలుపు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం, పాలకొండ/కొత్తూరు: కొత్తూరు మండలం కుంటిబద్ర కాలనీకి చెందిన కానుగ జగన్నాథం, యశోద దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో రెండో సంతానమైన కానుగ చంటి(17) చదువులో చురుకైన వాడు కావడంతో పాలకొండలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటూ ఇంటర్మీడియెట్ బైపీసీ సెకెండియర్ చదివిస్తున్నారు. ఆర్థిక స్థోమత లేకపోవడం, పిల్లలను ఎలాగైనా ఉన్నత చదువులు చదివించాలనే కోరికతో తల్లిదండ్రులిద్దరూ కూలీలుగా మారి చెన్నై వలస వెళ్లారు. తీరని విషాదం.. చంటి తన తల్లిదండ్రులతో దాదాపు ప్రతిరోజూ ఫోన్లో మాట్లాడుతుండేవాడు. కష్టసుఖాలు తెలుసుకునేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల తన తల్లికి ఫోన్ చేసి సంక్రాంతికి తనకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకురావాలని కోరాడు. ఆదివారం కళాశాలకు సెలవు కావడంతో పాలకొండ మండలంలోని పొట్లి గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. నవగాం చెరువు వద్దకు వచ్చేసరికి ఆటో బోల్తాపడి పొలాల్లోకి పడిపోయింది. ఈ ఘటనలో చంటి రోడ్డుపైకి తుల్లిపడటంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. ఇదే ఆటోలో ప్రయాణిస్తున్న ఎం.సింగుపురం గ్రామానికి చెందిన కె.నారాయణమ్మ(65), పొట్లి గ్రామానికి చెందిన ఎం.మురళీకృష్ణలకు తీవ్ర గాయాలయ్యయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం రాజాం కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చంటి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎస్ఐ వాసునారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లడిల్లిన తల్లిదండ్రులు.. కుమారుడి మరణ వార్త విని చంటి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. చెన్నై నుంచి హుటాహుటిన బయలుదేరి వస్తున్నారు. సంక్రాంతి పండగకి రావాలని కోరిన కుమారుడు తమని ఇలా రప్పిస్తున్నాడంటూ కన్నీమున్నీరుగా రోదిస్తున్నారు. -
కాలేజీ బస్సు ఢీకొని విద్యార్దిని మృతి
-
ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
వికారాబాద్ అర్బన్: అనుమానాస్పద రీతిలో ఇంటర్ విద్యార్థిని మృతిచెందిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని గౌతమి జూనియర్ కళాశాలలో మర్పల్లి మండలం వీర్లపల్లి గ్రామానికి చెందిన అక్కా చెల్లెళ్లు శిరీష, మనీష (16)లు బైపీసీ సెకండియర్, బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. వీరిద్దరూ కళాశాల హాస్టల్లో ఉంటున్నారు. రెండు నెలల క్రితమే మనీష కళాశాలలో చేరింది. కాగా ఎప్పటిలాగే సోమవారం రాత్రి అందరితోపాటు నిద్రపోయిన మనీష తెల్లవారుజామున 5 గంటల సమయంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకునేందుకు గదిలో నుంచి బయటకు వెళ్లినట్లు మృతురాలి అక్క, మిగతా విద్యార్థులు చెప్పారు. ప్రతి రోజూ ఉదయం స్టడీ అవర్ ఉంటుందని, 5 గంటలకు మొదటి బెల్ కాగానే బయటకు వెళ్లిన మనీష తిరిగి గదికి రాలేదు. దీంతో అక్క శిరీషతోపాటు, ఇతర విద్యార్థులు పక్క గదుల్లో వెతికారు. మనీష జాడ కనిపించకపోవడంతో హాస్టల్ వార్డెన్ అర్చనకు సమాచారం ఇచ్చారు. ఉదయం 6 గంటల సమయంలో రెండో అంతస్తు మీదకు వెళ్లి చూడగా భవనం వెనుకవైపు మనీష కింద పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా మనీష విగతజీవిగా పడి ఉంది. వార్డెన్ సమాచారం మేరకు హాస్టల్‌కు చేరుకున్న యాజ మాన్యం మనీషను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన డాక్టర్లు చనిపోయి మూడు గంటలు అవుతుందని తెలిపారు. కాగా, మనీష తెల్లవారుజామున 5 గంటల తరువాత భవనం పైనుంచి పడిపోయినట్లు వార్డెన్, విద్యార్థులు చెప్పారు. మృతిపై పలు అనుమానాలు.. మనీష మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతి వార్త తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కళాశాల ఎదుట ఆందోళనకు దిగాయి. రెండు అంతస్తుల భవనం పైనుంచి పడిపోయిన మనీష తలకు, ఇతర శరీర భాగాలకు ఎలాంటి గాయాలు లేకపోవ డం పలు అనుమానాలకు దారితీస్తుందని వారు అన్నారు. ఈ మేరకు యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ర్యాంకుల కోసం విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని, ఒత్తిడితోనే మనీష ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ఆరోపించారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా విద్యార్థిని ఆస్పత్రికి ఎలా తీసుకెళ్లారని ప్రశ్నించారు. సిబ్బందిని విచారించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ అన్నపూర్ణ, డీఎస్పీ శిరీషలు విద్యార్థిని మృతిపై విచారణ చేపట్టారు. హాస్టల్ వార్డెన్‌తో సహా తోటి విద్యార్థులను ప్రశ్నించారు. మనీష గదిని పరిశీలించారు. తమ కూతురు మృతిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని మృతురాలి తండ్రి మాణిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఇంటర్ విద్యార్ధిని అనుమానాస్పద మృతి
-
విద్యార్థినికి అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ
-
విద్యార్థినికి అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ
సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో గతవారం జరిగిన అత్యాచారయత్నం ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధిత విద్యార్థికి అండగా నిలిచింది. విద్యార్థినిపై అత్యాచార యత్నం చేసిన కళాశాల కరస్పాండెంట్ వెంకట సత్య నరిసింహ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు బాధితురాలు, కాలేజీ విద్యార్థులతో కలిసి వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలెక్టర్‌కు సోమవారం వినతి పత్రం ఇచ్చారు. కాగా, మాయ మాటలు చెప్పి ఇంటికి రప్పించుకున్న కరస్పాండెంట్ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిపై గత సోమవారం లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. -
ఐ లవ్ యూ... నన్ను చంపొద్దు అని వేడుకున్నా..
తార్నాక: తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో అనూష అనే ఇంటర్ విద్యార్థినిని అతి కిరాతకంగా బ్లేడుతో గొంతు కోసి హత్య చేసిన ప్రేమోన్మాది ఆరెపల్లి వెంకట్‌ను ఓయూ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఓయూ పోలీస్ స్టేషన్లో బుధవారం ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్ వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్ పార్శిగుట్ట అంబర్ నగర్‌కు చెందిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి హరిప్రసాద్ కుమార్తె అనూష నారాయణగూడలోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది, అదే ప్రాంతానికి చెందిన ఆరెçపల్లి రవీందర్ కుమారుడు వెంకట్ హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. పదో తరగతిలో ట్యూషన్ సెంటర్లో వారి మధ్య ఏర్పడిన పరిచయం గత రెండేళ్లుగా కొనసాగుతోంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అనూష గత నెలరోజులుగా వెంకట్‌తో మాట్లాడటం మానేసింది. ఆమెతో మాట్లాడేందుకు వెంకట్ పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అనూషపై కోపాన్ని పెంచుకున్న వెంకట్ ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. పథకంలో భాగంగా జేబులో బ్లేడు పెట్టుకుని గత నెల రోజులుగా అనూష ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తున్నాడు. మంగళవారం అనూష తన స్నేహితురాలితో కలిసి వెళుతుండటాన్ని గుర్తించాడు. అనూష ఇంట్లోకి వెళ్లగానే ఆమె స్నేహితురాలి వద్దకు వెళి బైక్ కీ లాక్కున్నాడు. అనూషను జామై ఉస్మానియా రోడ్డు వద్దకు తీసుకువస్తేనే బైక్ కీ ఇస్తానంటూ బైక్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో గత్యంతరం లేక ఆమె ఈ విషయాన్ని అనూషకు చెప్పడంతో ఇద్దరూ కలిసి జామై ఉస్మానియా రోడ్డుకు వచ్చారు. అక్కడికి వచ్చిన వెంకట్ బైక్‌ను తిరిగి ఇవ్వడంతో అనూష స్నేహితురాలు అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం అనూషను దూర విద్యాకేంద్రం సమీపంలోని పాడుబడిన పోలీసు క్వార్టర్స్ వద్దకు తీసుకెళ్లిన వెంకట్ తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ‘నీవన్నా, నీ క్యారెక్టర్ అన్నా నాకు నచ్చడం లేదు. అందుకే నిన్ను అవాయిడ్ చేస్తున్నానని’ అనూష చెప్పడంతో ఆగ్రహించిన అతను జేబులో ఉన్న బ్లేడ్ తీసి ఆమె గొంతుపై రెండు గాట్లు పెట్టాడు. దీంతో భయాందోళనకు గురైన అనూష తనను చంపొద్దని వేడుకున్నా వినకుండా బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. స్పహకోల్పోయిన అనూషను మరో గదిలో పడేసి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా, అప్పటికే ఆమె ఆర్తనాదాలు విని అక్కడికి చేరుకున్న ముగ్గురు యువకులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంకట్‌ను అదుపులోకి తీసుకుని అనూషను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అప్పటికే ఆమె మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి అనూష కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు డీసీపీ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. సమావేశంలో కాచిగూడ డివిజన్ ఏసీపీ నర్సయ్య, ఓయూ ఇన్స్పెక్టర్ జగన్ పాల్గొన్నారు. పక్కా ప్లానింగ్ రెండేళ్లుగా ప్రేమించుకున్నాం. చివరకు నా కారెక్టర్ మంచిది కాదని.. నాతో మాట్లాడటం మానేసింది. ఆమెతో మాట్లాడేందుకు ఎంతో ప్రయత్నించాను. అయినా పట్టించుకోలేదు. నా ఫోన్‌కాల్స్ రిజెక్టులో పెట్టడంతో ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాను. పథకం ప్రకారమే రప్పించి హత్య చేశానని ఉన్మాది వెంకట్ పేర్కొన్నాడు. పాడుబడిన క్వార్టర్లలోకి తీసుకువెళ్లి అక్కడా అడిగాను.. అయినా ఆమె మనుసు మార్చుకోకుండా అలాగే మాట్లాడటంతో జేబులో నుంచి బ్లేడు తీసి గొంతుపై కోయడంతో భయపడిన అనూష .. ‘ఐ లవ్ యూ... ఐ లవ్ యూ... నన్ను చంపొద్దు’ అంటూ వేడుకున్నా పట్టించుకోకుండా ఆమె గొంతును కోసినట్లు తెలిపాడు. అనంతరం ఆమెను మరో గదిలోకి ఈడ్చుకెళ్లి పడేసి పారిపోయేందుకు ప్రయత్నించానన్నాడు. -
విద్యార్థిని మనస్తాపం.. ఆత్మహత్య..!
సాక్షి, కడప : ఓ ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా వేంపల్లి మండలం బక్కన్నగారి పల్లెలో ఆదివారం చోటుచేసకుంది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలివి.. సింధూ ఇంటర్ సెకండియర్ చదువుతోందని సమాచారం. పరీక్షల్లో ఫెయిల్ అయ్యిందనే మనస్తాపంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు రోదించిన తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అమ్మ, చెల్లి జాగ్రత్త నాన్నా..!
సాక్షి, విజయవాడ : విజయవాడ గురునానక్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలివి.. నితిన్ కుమార్ శ్రీచైతన్య కాలేజీలో జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు. అతను కాలేజీలో ఉరివేసుకుని తనువు చాలించాడు. ఈ ఘటన మయూరీ కాంప్లెక్స్‌లోని శ్రీ చైతన్య కాలేజీలో శుక్రవారం జరిగింది. నితిన్ ఆత్మహత్యకి ముందు సూసైడ్ లెటర్ కూడా రాసినట్లు తెలుస్తోంది. అమ్మ, చెల్లిని జాగ్రత్తగా చూసుకోమని తండ్రికి లేఖ రాశాడు. విద్యార్థి స్వస్థలం కృష్ణా జిల్లాలోని మొగల్రాజుపురం అని సమాచారం. కార్పొరేట్ కాలేజీల్లో వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యార్థులపై ఒత్తిడి కారణంగా ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కాలేజీ నుంచి సస్పెండ్.. విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, రంగారెడ్డి : కళాశాల నుంచి సస్పెండ్ చేశారని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం కర్ణాటకలోని రాయచూరులో చోటుచేసుకుంది. వివరాలివి.. ధీరజ్ అనే విద్యార్థి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగళూర్‌లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ధీరజ్ స్వస్థలం కర్నాటకలోని రాయచూరు. ఈ నెల 26వ తేదీన ధీరజ్ కళాశాలలో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇది గమనించిన యాజమాన్యం అతని మందలించి, కళాశాల నుంచి సస్సెండ్ చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ధీరజ్ ఇంటికి వెళ్లిపోయాడు. జూన్ 27వ తేదీన ఇంటిలో ఉరివేసుకుని తనువు చాలించాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. అతని చావుకు కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తమ మిత్రుడి మరణవార్త విన్న తోటి విద్యార్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థి
ముదిగుబ్బ: ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కారణంగా సీనియర్ ఇంటర్ విద్యార్థి సప్లిమెంటరీ పరీక్ష ఫీజును నిర్ణీత గడువులోపు చెల్లించలేకపోయాడు. ఎనుములవారిపల్లికి చెందిన హేమంత్ కుమార్ ముదిగుబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు. ఇటీవల జరిగిన పరీక్షల్లో కాపీలు కొడుతూ మాల్‌ప్రాక్టీస్ కింద బుక్ అయ్యాడు. అనంతరం సప్లిమెంటరీ పరీక్ష రాయడానికి ఆ విద్యార్థికి ఇంటర్ బోర్డు అనుమతి ఇచ్చింది. అనుమతి పత్రాన్ని కళాశాలకు ఏప్రిల్ 16న పంపారు. ప్రిన్సిపల్ వాటిని గమనించకుండా విద్యార్థికి అనుమతి పత్రాన్ని మే 12న అందజేసి అనంతపురం ఆర్ఐఓ కార్యాలయానికి వెళ్లి అక్కడ పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించాడు. తీరా ఫీజు కట్టడానికి వెళ్లితే గడువు అయిపోయిందని వెనక్కు పంపారు. ఈ నెల 14 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ప్రిన్సిపల్ కారణంగా ఏడాది విలువైన సమయం కోల్పోవాల్సి వస్తోందని విద్యార్థి వాపోతున్నాడు. -
ఇంటర్ విద్యార్థినిపై లెక్చరర్ కీచకపర్వం
-
అనుమానాస్పదంగా విద్యార్థిని మృతి
ఖమ్మంరూరల్: మండలంలోని గుదిమళ్లకు చెందిన చల్లా యశోద(17) అనే ఇంటర్ విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో సోమవారం సాయంత్రం మృతి చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం చల్లా వెంకటేశ్వర్లు రంగమ్మల కూతురు యశోద ఖమ్మంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. సోమవారం ఉదయం తల్లిదండ్రులు పనికి వెళ్లగా యశోద ఇంటి వద్దే ఉంది. సాయంత్రం యశోద ఇంట్లో దూలానికి చీరతో ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉంది. పనికి వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు తలుపు తీసి చూడగా దూలానికి వేలాడుతూ కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంగళవారం శవ పరీక్ష పూర్తి చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన వారు తమ కూతురిని ఇంటికి ఎదురుగా ఉన్న నరేష్ అనే యువకుడు వేధించి ఇంట్లోనే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని, మృతదేహంపై గాయాలు కూడా ఉన్నాయని వారు తెలిపారు. తమ కూతుర్ని హత్య చేసిన నరేష్‌పై చర్య తీసుకొని న్యాయం చేయాలంటూ మృతదేహాన్ని నరేష్ ఇంటి ఎదుట ఉంచి ఆందోళనకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ తిరుపతిరెడ్డి, కూసుమంచి సీఐ వసంత్‌కుమార్, ఎస్సైలు ఎం.చిరంజీవి, సంజీవరెడ్డి, సర్వయ్య వచ్చి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకుని బైఠాయించారు. దీంతో సీఐ తిరుపతిరెడ్డి విషయాన్ని రూరల్ ఏసీపీ నరేష్‌రెడ్డికి తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ నరేష్‌రెడ్డి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఈ కేసులో ఎంతటివారినైనా వదిలేది లేదని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ మేరకు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ నరేష్‌రెడ్డి తెలిపారు. -
ఫలితాలు వచ్చిన మరుసటి రోజే..
ప్యాపిలి : తమ కుమార్తెకు ఇంటర్లో మంచి మార్కులు రావడంతో తల్లిదండ్రులు సంతోషించారు. అయితే ఆ సంతోషం ఎంతో సేపు నిలువలేదు. మృత్యువు రూపంలో ఆమె వారికి దూరమై ఎనలేని విషాదం మిగిల్చింది. వివరాలిలా ఉన్నాయి.. పట్టణానికి చెందిన బాలక్రిష్ణ, రాజేశ్వరి దంపతుల కుమార్తె రమణి (15) స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఆమె కొంత కాలంగా రక్తహీనతతో బాధపడుతోంది. దీంతో కుటుంబ సభ్యులు తరచూ చికిత్స చేయిస్తున్నారు. బైపీసీ చదువుతున్న ఆమె శుక్రవారం వెలువడిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 8.3 పాయింట్లు సాధించింది. కుటుంబ సభ్యులతో మిఠాయి పంచుకుని సంతోషంగా కబుర్లు చెప్పుకుంది. అయితే శనివారం తెల్లవారుజామున ఒక్క సారిగా ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి మృత్యువాత పడింది. ఒక రోజు ముందు ఆనందంగా గడిపిన తమ కుమార్తె విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రనాథ్ విద్యార్థిని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. -
నేను అందరికీ కోపం తెప్పిస్తున్నా..
నాగోలు: కుటుంబ సభ్యులు మందలించారని ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... నాగోలు జైపురికాలనీకి చెందిన భూపాల్‌రెడ్డి కుమార్తె సాయిప్రియ (18) గాయత్రి కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. పరీక్షలు ముగియడంతో ఖాళీగా ఉంటోంది. తరచూ వాట్సాప్‌లో తన సోదరితో చాటింగ్ చేస్తుండటంతో ఆమె మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన సాయిప్రియ గురువారం రాత్రి బెడ్రూంలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి ఆమె సుప్రజ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంటర్ పరీక్షలు సరిగా రాయలేకపోయాననే బాధతోనే ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి భూపాల్‌రెడ్డి ఇచ్చి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని వద్ద లభించిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘‘నేను అందరికీ కోపం తెప్పిస్తున్నాను... నేను ఎందుకు ఉన్నాననే బాధ... నేను చచ్చిపోతే పనైపోతుంది కదా... డాడీ సారీ... ఐ లవ్ మమ్మీ,డాడీ... ఇన్ని రోజులు ఎందుకు ఆగానంటే అందరూ ఇంటర్ పరీక్షలు అనే అనుకుంటారు.... నేను పరీక్షలన్నీ మంచిగా రాశాను... అందుకే పరీక్షలు ముగిసాక చచ్చిపోవాల ని డిసైడయ్యా... మా అన్న, అక్కకి హ్యాపీ నేను చచ్చిపోతే...’’ అంటూ అందులో పేర్కొంది. -
అందరి ముందు అవమానించాడననే హత్య చేశారు
-
వేట కొడవళ్లతో ఇంటర్ విద్యార్థి దారుణ హత్య
-
కూకట్‌పల్లిలో ఇంటర్ విద్యార్థి దారుణ హత్య
-
ఫోన్ కోసం ప్రాణాలు తీసుకున్నాడు
సాక్షి, మహబూబాబాద్ : కేవలం సెల్‌ఫోన్ కొనివ్వలేదనే కారణంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం దన్నసరి గ్రామశివారులోని సబ్‌స్టేషన్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన బానోతు మోహన్(16) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. సెల్‌ఫోన్ కొనివ్వమని గత కొద్దిరోజుల నుంచి తన తల్లిదండ్రులను అడుగుతున్నాడు. సెల్‌ఫోన్ కొనివ్వలేకపోవడంతో మనస్తాపానికి గురై బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్నటి వరకు కళ్ల ముందు తిరిగిన కొడుకు బావిలో శవమై కన్పించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. -
మాట వినలేదని.. క్రికెటర్‌కు కత్తిపోట్లు!
సాక్షి, చెన్నై: తాను చెప్పినట్లు చేయలేదని ఓ జూనియర్ లెవల్ క్రికెటర్‌పై స్కూల్ టీచరే కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆ బాధిత విద్యార్థి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన తమిళనాడు దిండిగల్ జిల్లా మనవాడిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. దిండిగల్ జిల్లా పాయలానికి చెందిన హదికర్ రహ్మాన్(16) మనవాడిలోని ఆశ్రమ్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. అదే స్కూల్లో పన్నీర్‌సెల్వం ఫిజికల్ ఎడ్యూకేషన్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. స్కూలు తరఫున క్రికెట్ ఆడే రహ్మాన్.. ప్రైవేట్ క్లబ్ టోర్నీల్లోనూ పాల్గొనేవాడు. కేవలం మన స్కూలు, మన ప్రాంతం తరఫున మాత్రమే క్రికెట్ ఆడాలని.. ప్రైవేట్ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించొద్దని రహ్మాన్‌కు పీఈటీ వార్నింగ్ ఇచ్చాడు. కానీ రహ్మాన్ ప్రైవేట్ టోర్నీల్లోనూ పాల్గొనడంతో తీవ్ర ఆవేశానికి లోనైన పీఈటీ పన్నీర్‌సెల్వం మాట్లాడాలంటూ పిలిచాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో క్రికెటర్ రహ్మాన్ ఛాతీ, భుజం భాగాల్లో పొడిచాడు. చేతిలోని కత్తిని ఇతర టీచర్లు గుంజుకోగానే పీఈటీ పన్నీర్‌సెల్వం అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, తీవ్రంగా రక్తస్రావమవుతున్న విద్యార్థి రహ్మాన్‌ను కరూర్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తనను తానే గాయపర్చుకుని పీఈటీ సైతం ఆస్పత్రిలో చేరి విద్యార్థి తనపై దాడి చేశాడని చెప్పడం గమనార్హం. స్కూలు యాజమాన్యం ఫిర్యాదు మేరకు పన్నీర్‌సెల్వంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. -
పట్టపగలే ఇంటర్ విద్యార్థి కిడ్నాప్
మదనపల్లె క్రైం: మదనపల్లెలో రౌడీలు రెచ్చిపోయారు. కళాశాల నుంచి ఇంటికి వెళుతున్న ఓ విద్యార్థిని సోమవారం పట్టపగలే కిడ్నాప్‌చేశారు. పొలాల్లోకి తీసుకెళ్లి చితకబాదారు. విషయం బయటకు పొక్కితే చంపేస్తామని బెదిరించి చివరకు చీకటిపడ్డాక అక్కడే వదలిపెట్టి వెళ్లిపోయారు. పట్టణంలో ఈ ఘటన తీవ్రకలకలం రేపింది. బాధితుని కుటుంబీకులు, పో లీసుల కథనం మేరకు... మదనపల్లె పట్టణం నక్కలదిన్నె తాం డాలో నివాసం ఉంటున్న కాట్లగంటి రవికుమార్, గీత దంపతుల కుమారుడు వేణుమాధవ్ (16) స్థానిక బెంగళూరు రోడ్డులో లయన్స్ క్లబ్ ఎదురుగా ఉన్న ఓ కార్పొరేట్ కళాశాలలో ఇం టర్ మొదటి సంవత్సరం ఎంఈసీ చదువుతున్నాడు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగే పరీక్ష రాయడానికి అతడు కళాశాలకు వెళ్లాడు. పరీక్ష రాసి కళాశాల బయటకు రాగానే సిపాయి వీధికి చెందిన కొందరు రౌడీషీటర్లు అతని వెంటపడ్డారు. నడచుకుంటూ ఇంటికి వెళుతున్న అతడిని కోర్టు సమీపంలో దారి అడ్డగించి బలవంతంగా ఆటోలో ఎక్కించారు. మండలంలోని కొత్తపల్లె పంచాయతీ రంగారెడ్డి కాలనీ సమీపంలోని శేషమహల్ ఏరియా దగ్గరున్న వ్యవసాయ పొలాల వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ వేచివున్న రౌడీ గ్యాంగ్ విద్యార్థిపై మూకుమ్మడిగా దాడిచేసింది. బీరుబాటిళ్లు, బెల్టులతో చితకబాదారు. కారణం చెప్పి కొట్టమని బ్రతిమలాడినా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కొట్టడం పూర్తయ్యాక వారు పీకల దాకా మద్యం తాగారు. రాత్రి 9 గంటల సమయంలో అక్కడే వదిలేసి వెళ్లారు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఎక్కడున్నా వెతికి చంపేస్తామని కూడా చెప్పారు. అనంతరం బాధితుడు ఇంటికి చేరుకుని విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. వారు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి వద్దు.. చదువుకుంటా!
సాక్షి, చిన్నశంకరంపేట: తాను ఇంకా చదువుకుంటానని, ఇప్పుడే పెళ్లి వద్దంటూ ఓ బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం తండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన హలావత్ బాబు, మరోనిల కూతురు సాంకీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమెను మేనబావకు ఇచ్చి పెళ్లి చేద్దామని తండ్రి బాబు తరచూ ఇంట్లో చర్చిస్తున్నాడు. తాను ఇప్పుడే పెళ్లి చేసుకోనని, ఇంకా చదువుకుంటానని బాలిక తండ్రికి చెబుతున్నప్పటికీ వినకపోగా, బెదిరించడం, కొట్టడం మొదలుపెట్టారు. దీంతో మైనర్‌ను అయినప్పటికీ పెళ్లి చేస్తానని తన తండ్రి వేధిస్తున్నాడని సాంకీ చిన్నశంకరంపేట ఎస్ఐ ప్రకాశ్‌గౌడ్‌కు ఫిర్యాదు చేసింది. ఐసీడీఎస్ అధికారులు, తహసీల్దార్లతో కలసి ఆయన బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అమ్మాయి చదువుకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దని, అవసరమైతే బాలసదనంలో ఉంచి చదివిస్తామని ఎస్ఐ వివరించారు. -
కూకట్‌పల్లిలో యువతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న శ్రీ నిలయం అపార్ట్మెంట్ పై నుంచి దూకి గురువారం ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న రేష్మి (18) అనే యువతి ఈ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే మతిస్థిమితం లేకపోడం వల్లే రేష్మి అపార్ట్మెంట్ పై నుంచి దూకిందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
పరీక్షల భయంతో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, కడప: వైఎస్ఆర్ కడప జిల్లాలో శుక్రవారం ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని కాశినాయన మండలం కోడిగుడ్లపాడుకు చెందిన అశ్విని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈరోజు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు చూసేసరికి అశ్విని మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పరీక్షల భయంతోనే అశ్విని ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు తెలిపారు. -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
వీరబల్లి: ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా రాయచోటిలో జరిగింది. వీరబల్లి మండలం మట్లి వడ్డేపల్లెకు చెందిన నాగచాలం రాయచోటిలోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇతను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల యాజమాన్యం మృతదేహాన్ని అతడి ఇంటికి గుట్టుచప్పుడు కాకుండా తరలించినట్లు సమాచారం. ఉదయం 7 గంటల ప్రాంతంలో విద్యార్థి ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అతను చనిపోయినట్లు ధ్రువీకరించారు. కాగా, తమ కుటుంబం గురించి వార్తలు వస్తే తాము కూడా చనిపోతామని అక్కడికి వెళ్లిన మీడియాను మృతుడి కుటుంబీకులు బెదిరించారు. అధికారుల వాట్సప్‌లలో విషయం వెలుగు చూడడంతో రాయచోటి రూరల్ సీఐ రాజు. వీరబల్లి ఏఎస్సై మృతుని కుటుంబాన్ని విచారించారు. సీఐను వివరణ కోరేందుకు యత్నించగా వివరాలు ఇపుడే చెప్పలేమని వెళ్లిపోయారు. -
హాస్టల్లో ఉండటం ఇష్టం లేకే..?
నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్‌లోగల శ్రీ మేధా జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదు వుతున్న విద్యార్థిని రుచిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కళాశాల నాలుగో అంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన స్థానికులు, విద్యార్థులు, కళాశాల యాజమాన్యం ప్రయివేటు ఆస్ప త్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి దాసరి ఒడ్డెన్న ఘటనా స్థలానికి వెళ్లి తోటి విద్యార్థులతో విచారణ చేపట్టారు. విద్యార్థిని ఆత్మహత్యాయ త్నం చేసుకున్న ఘటన జిల్లాలో కలకలం రేపింది. వినాయక్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): ఆర్మూర్ మండలం పెర్కిట్‌కు చెందిన రాజేశ్వర్ తన కూతురు రుచితను నగరంలోని శ్రీమేధ జూనియర్ కళాశాల హాస్టల్లో చేర్చారు. విద్యార్థిని గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కళాశాల భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే వాకింగ్‌కు వచ్చిన వారంతా గుమిగూడారు. దీన్ని గమనించిన వైద్యులు ప్రేమానందం తన కారులో విద్యార్థినిని తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం విద్యార్థినికి వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థిని రెండు కాళ్లు ఫ్రాక్చర్ అయినట్లు, మూడు పక్కటెముకులు విరిగినట్లు వైద్యులు తెలిపారు. రక్త స్రావం అధికంగా కావడంతో విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న నాలుగో టౌన్ ఎస్ఐ నరేష్ విద్యార్థిని వాంగ్మూలం తీసుకునేందుకు జడ్జిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. విద్యార్థిని స్పృహలోకి రాకపోవడంతో వారు వెనుదిరిగారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఇంటర్ విద్యాధికారి ఒడ్డెన్న విచారణ చేపట్టారు. సాయంత్రం ఆస్పత్రి వచ్చిన ఒడ్డెన్న విద్యార్థినిని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు, కళాశాల యాజమాన్యంతో ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం ఘటనాస్థలానికి వెళ్లి తోటి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రుచిత చదువులోనూ, ఆరోగ్యపరంగా చురుగ్గా ఉండేదని వారు తెలిపారు. కళాశాల యాజమాన్యం ఎలాంటి ఒత్తిళ్లకు గురిచేయలేదని, ఆమె అలా ఎందుకు చేసుకుందో అర్థం కావడంలేదని సమాధానమిచ్చారు. ఇదేవిషయమై కళాశాల డైరెక్టర్ భూపతిరెడ్డిని అడగగా మూత్రశాలకు వెళ్లిన రుచిత కళాశాలపై నుంచి పడిన విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్నానన్నారు. ప్రస్తుతం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. చదువు, ఫీజు విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు చేయలేదన్నారు. నాలుగో టౌన్ పోలీసులు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. హాస్టల్లో ఉండటం ఇష్టం లేకనే..? ఇటీవలే విద్యార్థిని తనకు హాస్టల్లో ఉండటం ఇష్టం లేదని తన తల్లితో చెప్పినట్లు సమాచారం. మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులను అడిగే ప్రయత్నం చేయగా వారు వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. -
అనుమానాస్పదస్థితిలో ఇంటర్ విద్యార్థి మృతి
శ్రీకాకుళం ,పోలాకి : అనుమానాస్పదస్థితిలో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. ఓ పంట కాలువలో ఇతడి మృతదేహం లభ్యమయింది. మృతుని బంధువులు, పోలీసులు, కళాశాల సిబ్బంది కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. సారవకోట మండలం బుడితి గ్రామానికి చెందిన కొర్లాపు సురేష్(18) నరసన్నపేట పట్టణంలో పద్మావతి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీ చదువుతున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయాన్నే కళాశాలకు వచ్చిన సురేష్ పోలాకి సమీపంలో శవమై పడివుండటం మిస్టరీగా మారింది. సంతలక్ష్మీపురం జంక్షన్ సమీపంలో ఓ పంట కాలువలో శుక్రవారం సాయంత్రం ఇతడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వీరు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. ఇటువైపు ఎందుకు వచ్చినట్టు సురేష్ పోలాకి వైపు ఎందుకు వచ్చాడు అనేది మిస్టరీగా మారింది. ఉపకారవేతనం కోసం బయోమెట్రిక్ చేసుకునేందుకు ఆధార్ సెంటర్‌కు వెళ్లినట్టు పద్మావతి జూనియర్ కళాశాల సిబ్బంది చెబుతున్నప్పటికీ... పోలాకి ఆధార్ కేంద్రంలో శుక్రవారం 19 మంది విద్యార్థులకు బయోమెట్రిక్ చేశామని అందులో సురేష్ అనే పేరుతో ఎవరూ లేరని ఆధార్ సెంటర్ నిర్వాహకుడు రవి పోలీసులకు తెలిపారు. ఫిట్స్ జబ్బు కారణమా..? ఘటనాస్థలానికి చేరుకున్న మృతుడు బంధువులు సురేష్‌కు ఫిట్స్ జబ్బు ఉందని దానికి మందులు వాడుతున్నామని తెలిపారు. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం. అయితే నిత్యం జనసంచారం ఉండే రహదారి పక్కనే ఇంత పరిస్థితి వచ్చేవరకు ఎవరూ గమనించకుండా ఉండరు. దీంతో పాటు మృతదేహం రోడ్డుపై కాకుండా కాలువలో పడివుండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ సంఘటనపై స్థానిక ఎస్ఐ అబ్రహం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసన్నపేట తరలించారు. కాగా, మృతుని తండ్రి లక్ష్మణరావు సొంత గ్రామం సంతబొమ్మాళి మండలం నువ్వలరేవు. కొన్నేళ్ల కిందట భార్యభర్తల మధ్య వివాదంతో తల్లి అమ్మన్నమ్మతో కలిసి బుడితి వచ్చి నివాసం ఉంటున్నారు. -
అమ్మా.. అంటూ కుప్పకూలి..
చిలంకూరు (ఎర్రగుంట్ల) : సాధారణంగా గుండెపోటు పెద్ద వయసు వారికి వస్తుంది. అయితే 17 ఏళ్లకే చిలంకూరుకు చెందిన ఓ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. కళాశాలకు వెళ్లడానికి తయారవుతున్న తరుణంలో.. అమ్మా.. అంటూ ఒక్క సారిగా కుప్పకూలిపోయాడు. తల్లి వచ్చి చూసేలో గానే విగతజీవిగా కనిపించాడు. అప్పుడే నూరేళ్లు నిండాయా నాయనా అంటూ ఆమె గుండెలవిసేలా రోదించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిలంకూరులోని ఇందిర కాలనీలో నివాసం ఉండే నాగార్జున, రమాదేవి పెద్ద కుమారుడు జలపతి శివహర (17) అదే గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరాన్ని ఎర్రగుంట్లలోని శ్రీ గౌతమ్ జూనియర్ కళాశాలలో చదువుతున్నాడు. మంగళవారం ఉదయాన్నే కళాశాలకు వెళ్లాలని, క్యారీ కోసం అన్నం చేయాలని అమ్మకు చెప్పాడు. ఇంకా కొన్ని నిమిషాలలో క్యారీ, పుస్తకాలు తీసుకొని కళాశాలకు పోవాల్సిన సమయంలో.. అమ్మా అంటూ ఒక్క సారిగా కుప్ప కూలిపోయి కింద పడి మృతి చెందాడు. శివహర చదువుకుంటూనే తల్లిదండ్రులకు చేదోడువాదోడగా ఉంటూ సాయం చేస్తుండే వారు. తండ్రి నాగార్జున కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చేతికి వచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీమున్నీరుగా విలపించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి మృతుడి ఇంటి వద్దకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీ గౌతమ్ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, చిలంకూరు జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయులు వెళ్లి శివహర మృతదేహాన్ని చూసి విషణ్ణవదనంలో మునిగిపోయారు. -
ఇంటర్ విధ్యార్ధి ఆత్మహత్య
-
’సాక్షి’ ఒకరోజు ఎడిటర్‌గా ఇంటర్ విద్యార్థిని
-
నారాయణ కాలేజిలో ఇంటర్ విద్యార్ధి సూసైడ్
-
స్నేహితుడే హంతకుడు
♦ మరో ఇద్దరితో సన్నిహితంగా ఉండటంతో చాందినిని హతమార్చిన క్లాస్మేట్ ♦ అమీన్పూర్ గుట్టపైకి రమ్మని పిలిచి.. గొంతు నులిమి హత్య ♦ ఆపై గుట్టపై నుంచి కిందకు తోసివేత ♦ మృతురాలి సెల్‌ఫోన్ చెరువులో పడేసి పరారీ ♦ సీసీటీవీ ఫుటేజీ, ఆటోడ్రైవర్ సాయంతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ హత్య కేసులో మిస్టరీ వీడింది. క్లాస్మేటే కాలాంతకుడయ్యాడు. తనతో గాకుండా మరో ఇద్దరితో స్నేహంగా ఉండటాన్ని భరించలేక పథకం ప్రకారం హత్య చేశాడు. మాట్లాడదామని నమ్మబలికి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అమ్మాయి గొంతు నులిమి చంపేశాడు. తర్వాత గుట్టపై నుంచి కిందకు తోసేశాడు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ఠాణా పరిధిలో చాందిని జైన్ మృతదేహం దొరికిన 24 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. బుధవారం ఈ కేసు వివరాలను సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌తో కలసి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య మీడియాకు వెల్లడించారు. పదో తరగతి దాకా కలిసి చదువు సిల్వర్ ఓక్స్ స్కూల్లో చాందిని జైన్, నిందితుడు(మైనర్) పదో తరగతి వరకు చదివారు. ఆ సమయంలో వీరి మధ్య చిగురించిన స్నేహం బలపడింది. తర్వాత చాందిని ఈ స్కూల్లోనే చదువు కొనసాగించగా.. నిందితుడు డీఆర్ఎస్ కాలేజీలో చేరి ప్రస్తుతం ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నగరానికి చెందిన ఓ విద్యార్థి ఫేస్బుక్లో ఓ పేజీ(నేషనల్ డిప్లొమోస్ సమ్మిట్) క్రియేట్ చేసి అందులో దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులను సభ్యులుగా చేర్చాడు. ఇలా ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్స్‌గా మారిన వీరంతా సెప్టెంబర్ ఒకటి నుంచి మూడు రోజుల పాటు నగరంలోని సెంట్రల్ కోర్టు హోటల్లో కలిశారు. ఈ పార్టీకి చాందిని జైన్‌తోపాటు ఆమె స్నేహితుడు కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా చాందిని మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని చూసి భరించలేకపోయాడు. అప్పట్నుంచి ఆమెకు దూరంగా ఉండే ప్రయత్నం చేశాడు. మరో స్నేహితుడితో కలిసి పబ్‌కు వెళ్తున్నట్టు ఈ నెల 9న చాందిని నిందితుడికి చాటింగ్ ద్వారా చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన నిందితుడు.. మాట్లాడుకుందాం రమ్మం టూ చాందినిని పిలిచాడు. సాయంత్రం ఐదు గంటలకు దీప్తిశ్రీ నగర్ క్రాస్ రోడ్స్‌కు వచ్చి చాందినితో కలిసి ఆటోలో అమీన్పూర్ గుట్టపైకి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వా దం జరిగింది. స్నేహం ఎప్పట్లాగే కొనసాగించాలని చాందిని ఒత్తిడి తెచ్చింది. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో నిందితుడు చాందిని ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. తర్వాత గొంతు నులిమి చంపి గుట్టపై నుంచి 10 మీటర్ల కిందకు పడేశాడు. అనంతరం మృతురాలి సెల్‌ను చెరువులో పడేసి వెళ్లిపోయాడు. పోలీసులకు చిక్కాడిలా.. అమీన్‌పూర్‌లోని మాధవీపూరి హిల్స్ వద్ద ఓ సీసీటీవీలో నిందితుడు ముఖానికి గుడ్డ కట్టుకున్న దృశ్యాలు చిక్కాయి. చాందినితో కలసి ఆటోలో దిగి గుట్టల వైపు వెళ్లిన దృశ్యాలు నమోదయ్యాయి. ఆటో నంబర్ ఆధారంగా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని అతడి ద్వారా వివరాలు సేకరించారు. అప్పటికే సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా నిందితుడు మియాపూర్‌లోని ప్రగతి ఎన్‌క్లేవ్‌లో ఉంటున్నట్టు గుర్తించారు. ఆటో డ్రైవర్‌ను కూడా అతడి ఇంటికి తీసుకెళ్లి ప్రశ్నించారు. చాందిని హత్య జరిగిన 9 తేదీ సాయంత్రం తాను క్రికెట్ ఆడుతున్నట్టు నిందితుడు చెప్పినా.. పోలీసు విచారణలో అబద్ధమని తేలింది. అతడి తండ్రి కూడా సీసీటీవీ ఫుటేజీలకు చిక్కిన దృశ్యాల్లో ఉన్నది తన కుమారుడేనని తెలపడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి పాఠశాలలు, కళాశాలలకు వెళుతున్న పిల్లలు ఏం చేస్తున్నారనే దానిపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి. ఓ మైనర్ ఫేస్బుక్ పేజీ క్రియేట్ చేసి నగరంలోని ఓ హోటల్లో కలవడం, పబ్‌ల్లో మద్యం సేవించడం మామూలు విషయం కాదు. ఎవరినైనా గుడ్డిగా నమ్మవద్దు. ఫేస్బుక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. – సందీప్ శాండిల్య, సీపీ నిందితుడిని కఠినంగా శిక్షించాలి స్నేహం పేరుతో దగ్గరై మా కూతుర్ని చంపినవాడిని కఠినంగా శిక్షించాలి. హత్య ఒక్కడే చేశాడంటే మేం నమ్మలేకపోతున్నాం. అతడు ఎప్పుడూ మా ఇంటికి రాలేదు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. స్నేహంగా నటించి హత్య చేశాడు. – కవిత, చాందిని తల్లి -
'సాయికిరణ్ ప్లే బాయ్ అయ్యుండొచ్చు'
-
'సాయికిరణ్ ప్లే బాయ్ అయ్యుండొచ్చు'
సాక్షి, హైదరాబాద్ : సాయికిరణ్ రెడ్డి ప్లేబాయ్ అయ్యుండొచ్చునని, ఆరు నెలలకో అమ్మాయిని మార్చేవాడు కావొచ్చని దారుణ హత్య గురైన చాందిని తల్లిదండ్రులు ఆరోపించారు. బహుశా తన కూతురితో ఎట్రాక్షన్ లాంటి రిలేషన్ ఏర్పడి అతడి పనులకు తమ కూతురు అడ్డును తొలగించుకోవాలనే ప్రణాళిక ప్రకారం హత్య చేసి ఉంటాడని భావిస్తున్నామని చాందిని తల్లి చెప్పారు. చాందిని, సాయికిరణ్ రెడ్డి సిల్వర్ ఓక్స్ స్కూళ్లో చదువుకున్నారు. కానీ ఇద్దరు వేరే సెక్షన్లు. అదే సంస్థలో చాందని ఇంటర్ చదువుతుండగా.. సాయికిరణ్ ఎక్కడ చదువుతున్నాడో.. వీరిమధ్య ఏం ఉందో మాకు మాత్రం తెలియదు కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్లాన్ ప్రకారమే చాందిని హత్య సాయికిరణ్ మంచివాడని అనుకున్నాం, కానీ అతడు ఇంత దారుణానికి పాల్పడుతాడని మేం ఎవరం ఊహించలేదు. మీడియాలో చూసేవరకూ ఈ హత్య చేసిందన్నది మాకు కూడా తెలియదు. సాయికిరణ్ ప్లే బాయ్ అయ్యుండొచ్చు. చాందినితో పాటు మరికొందరు అమ్మాయిల్ని వేధించి ఉంటాడు. అసలు ఏమైందో తెలియదు కానీ.. ఎందుకో తనకు అడ్డుగా ఉందని భావించిన సాయికిరణ్.. మరి కొందరు అబ్బాయిలతో కలిసి ప్లాన్‌చేసి చాందినిని హత్యచేశారు. సాయికిరణ్ గురించి తమకు స్పెషల్‌గా ఎప్పుడు చెప్పలేదు. అతడితో పాటు ఫ్రెండ్స్ గురించి చాలా క్యాజువల్‌గా చెప్పేది. టీనేజ్‌లో ఉన్న వీరిమధ్య అట్రాక్షన్ ఉండటం సహజమే. కానీ సాయికిరణ్‌ను ప్రేమిస్తున్నట్లు నా కూతురు చాందిని ఎప్పుడూ చెప్పలేదు. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి. మియాపూర్ కు చెందిన చాందిని జైన్ దారుణహత్య కేసును కేసును పోలీసులు ఛేదించారు. చాందిని స్కూల్‌మేట్ సాయికిరణ్ రెడ్డి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం మదీనాగూడలోని అపార్ట్మెంట్లో సాయికిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నేటి మధ్యాహ్నం నిందితుడు సాయికిరణ్‌ను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. -
చాందిని హత్య: ఊహించని ట్విస్ట్
-
చాందిని కేసును ఛేదించిన పోలీసులు
-
చాందిని కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మియాపూర్ కు చెందిన ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ (17) దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. చాందిని జైన్‌ను ఆమె స్కూల్‌మేట్, ప్రియుడిగా భావిస్తున్న సాయికిరణ్ రెడ్డి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన నగర పోలీసులు సాయికిరణ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మదీనాగూడలోని అపార్ట్మెంట్లో నివాసం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని చాందిని ఒత్తిడి చేస్తుండటంతో ఆమెను సాయికిరణ్ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. నేటి మధ్యాహ్నం నిందితుడు సాయికిరణ్‌ను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. శనివారం ఇంటి నుంచి బయటికి వెళ్లి అదృశ్యమైన చాందిని సోమవారం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ గుట్టల్లో మరణించిన స్థితిలో కనిపించింది. సాయికిరణే ఆమెను ఆ గుట్టల వైపు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి.. ఆమెపై అత్యాచారయత్నం చేసి, హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. మంగళవారం రాత్రి చాందిని స్నేహితులను, కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా సాయికిరణే ఈ హత్యకు సూత్రధారి అని తేలింది. -
విద్యార్థి ఆత్మహత్యాయత్నం కలకలం!
హైదరాబాద్: నగరంలో మరో కాలేజీ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఓ అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి ఇంటర్ విద్యార్థి సంజయ్ కిందకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన బాలాపూర్ లో చోటుచేసుకుంది. కిందకి దూకడంతో సంజయ్ తలకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. లెక్చరర్ల వేధింపులే తమ కుమారుడి ఆత్మహత్యాయత్నానికి కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యార్థి ఆత్మహత్యాయత్నం కలకలం!
-
రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి
తనకల్లు: మండలంలోని కొక్కంటి సమీపంలో రాజన్న మిట్ట మలుపు వద్ద గురువారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి జరిపిటి శ్రీనివాసులు(17) మృతిచెందాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. చెక్కవారిపల్లికి చెందిన జరిపిటి శ్రీనివాసులు.. తనకల్లులోని జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు. తన బంధువులు శశికుమార్, సుప్రియతో కలిసి వ్యక్తిగత పనిపై గురువారం కొక్కంటి క్రాస్‌కు వచ్చిన శ్రీనివాసులు, అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. రాజన్న మిట్ట మలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనంపై వస్తున్న డేరంగుల శ్రీనివాసులు ఢీకొనడంతో నలుగురూ గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 ద్వారా కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీనివాసులు మరణించాడు. డేరంగుల శ్రీనివాసులు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతికి తీసుకెళ్లారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
ఇంటర్మీడియట్ విద్యార్థి అదృశ్యం
ఆత్మకూరు: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పి.యాలేరుకు చెందిన పూజారి సాయికుమార్ 15 రోజులుగా కనిపించడం లేదు. ఈ మేరకు అతడి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక్కగానొక్క కుమారుడు ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియరాలేదని విలపిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 73311 43508, 90520 16850, 95730 30173 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. -
మృగాళ్ల రాజ్యంలో.. మరో లేడీ
తుఫాన్ ధాటికి చిగురుటాకులా చెల్లాచెదురైంది. అలల తాకిడికి గిలాగిలా కొట్టుకున్న చేపపిల్లలా వణికిపోయింది. మండు వేసవిలో ఇంకిపోయిన నీటిగుంతలా ఆవిరైపోయింది. వేటగాడి బాణం దెబ్బకు గాయపడిన పక్షిలా విలవిల్లాడింది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో చదువుకుంటున్న ఓ బాలిక తనపై జరిగిన లైంగికదాడికి హతాశురాలైంది. బరంపురం(ఒడిశా): గంజాం జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై నలుగురు యువకులు సామూహికంగా లైంగికదాడికి పాల్పడిన సంఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేగింది. సామూహిక లైంగిక దాడి కేసులో నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఐసీ అధికారి ఆశ్వినికుమార్ అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. బంజనగర్ పోలీస్‌స్టేషన్, బెల్లుగుంటా ఔట్ పోస్ట్ పరిధిలో మందరా గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని బల్లిగుంఠా కళాశాలలో +2 మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే అగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు ఆ విదార్థిని వెళ్లి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సైకిల్‌పై ఇంటికి వస్తున్న సమయంలో దారి మధ్యలో ధనుంజయపల్లి గ్రామానికి చెందిన నలుగురు యువకులు అడ్డకుని విద్యార్థిని నోరు నొక్కి అక్కడికి దగ్గరలో గల బొడొ నది ఒడ్డున ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకుపోయి సామూహికంగా లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం సొమ్మసిల్లిన విద్యార్థినిని బొడొ నది ఒడ్డున పడేసి వెళ్లిపోయారు. కుమార్తె సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి పలు చోట్ల గాలించాడు. నది ఒడ్డున కూతురు పడిఉన్నట్లు తెలుసుకున్న తండ్రి కుమార్తెను గ్రామస్తుల సహాయంతో ఇంటికి తీసుకు వచ్చాడు. అనంతరం కుమార్తెకు జరిగిన అన్నాయాన్ని తెలుసుకుని కుమార్తెతో కలిసి ళెల్లిగుంఠా పోలీసుఔట్ పోస్టుకు ఫిర్యాదు చేశాడు. గంజాం ఎస్పీ ఆశిష్ కుమార్ సింగ్ ఆదేశంతో బంజనగర్ ఐఐసీ, బెల్లిగుంఠా ఔట్‌పోస్ట్ అధికారి కొంత మంది పోలీసు బృందంతో ధనిజాపల్లి గ్రామానికి చేరుకుని లైంగికదాడికి పాల్పడిన నలుగురు నిందిత యువకులను అరెస్ట చేశారు. అరెస్టయిన వారిలో కృష్ణ బెహరా, శంకర్ బిశ్వాల్, గురు బెహరా, పపున్ బారిక్‌లు ఉన్నట్లు..వీరందరినీ కోర్టులో హాజరుపరిచినట్లు బంజనగర్ ఐఐసీ అధికారి అశ్వినికుమార్ చెప్పారు. -
కార్పోరేట్ కాలేజీలో ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య
-
ఇంటర్ విద్యార్థి అదృశ్యం
రాయదుర్గం అర్బన్ : రాయదుర్గం పట్టణంలోని ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజిలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న పి.ఇబ్రహీం రెండు రోజులుగా కనిపించడం లేదు. బొమ్మనహాళ్ మండలం ఏళంజి గ్రామానికి చెందిన పి.రాజన్న తనయుడు ఇబ్రహీం ప్రతి రోజూ ఉదయం రాయదుర్గానికి వచ్చి కాలేజి అయిపోయిన తర్వాత స్వగ్రామానికి వెళ్లేవాడు. అయితే సోమవారం కాలేజీకి వచ్చిన తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. కాలేజీలో విచారణ చేస్తే సోమవారం మధ్యాహ్నం తర్వాత ఇంటికి వెళ్లిపోయినట్లు తెలిసింది. అనంతరం చుట్టుపక్కల ఊళ్లలోను, బంధువుల ఇళ్లలోను విచారించామన్నారు. దీంతో బుధవారం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రాజన్న చెప్పాడు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ మహానంది తెలిపారు. -
ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
రొద్దం : మండలంలోని గొబ్బరంపల్లి గ్రామానికి చెందిన ఎం.అంజినప్ప కూతురు అఖిల(17) అనే ఇంటర్ విద్యార్థిని అదృశ్యమయింది. ఈమేరకు బాలిక తండ్రి ఆదివారం ఫిర్యాదు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ నరసింహులు తెలిపారు. బాలిక హిందూపురంలో ఇంటర్ చదువుతునట్లు తెలపారు. ఈనెల 20న గ్రామంలో బహిర్భూమికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదన్నారు. పలు ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో.. కూతురు ఆచూకీ తెలపాలని ఫిర్యాదు చేశారన్నారు. -
ఇంటర్ విద్యార్ధి ఫైయిల్ అయ్యడని...
-
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
మెలియాపుట్టి: శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం జాడుపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. కావేటి సీతారాం(16) అనే బాలుడు మెలియాపుట్టి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం బాలుడు ఇంటివద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీతారాం మృతికి కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
గుత్తి : గుత్తిలోని చెర్లోపల్లి కాలనీకి చెందిన సౌజన్య, వెంకటరాముడు దంపతుల కుమార్తె హేమలత(17) అదృశ్యమైనట్లు ఎస్ఐ చాంద్‌బాషా తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదివే ఆమె శుక్రవారం జరిగిన ఫిజిక్స్ పరీక్ష రాసిన తర్వాత ఇంటికి వెళ్లిందన్నారు. ఆ తరువాత ఆరగంటకే ఇంటి నుంచి మాయమైందని, రాత్రైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అంతటా గాలించారన్నారు. పరీక్ష బాగా రాయలేదనే కారణంతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. తల్లిదండ్రులు శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
తనకల్లు (కదిరి) : మండల కేంద్రమైన తనకల్లులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న షాజిదా ఈ నెల 17వ తేదీ నుంచి కనిపించడం లేదు. ఎన్ని చోట్ల వెతికినా ఆచూకీ కానరాకపోవడంతో తండ్రి బాషా బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
మేడ్చల్: ఇంటర్ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక బాలాజీ నగర్ కాలనీలో నివాసముంటున్న సత్యనారాయణ కూతురు అపూర్వ(17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
నారాయణపురం: తెలంగాణ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం వెలుగు చూసింది. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్లోని తెలంగాణ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న శేఖర్(16) అనే విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల సమీపంలోని మల్లారెడ్డిగూడెం గ్రామ శివారు వ్యవసాయబావి వద్ద విద్యార్థి మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు సూర్యాపేట జిల్లా దోసపాడు గ్రామానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
గుత్తి : అనారోగ్యంతో బాధపడుతున్న ఇంటర్ విద్యార్థిని జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. గుత్తిలో ఈ సంఘటన జరిగింది. ఎస్ఐ చాంద్‌బాషా తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో నివాసముండే ఉసేని (టీచర్), రంగమ్మ దంపతుల కుమార్తె ప్రీతి మేఘన. కర్నూలులోని శ్రీచైతన్య కాలేజీలో బైపీసీ ఫస్టియర్ చదువుతోంది. ఆరు మాసాల క్రితం అనారోగ్యానికి గురైంది. తల నుంచి కాళ్ల వరకు విపరీతమైన నొప్పులతో బాధ పడేది. అంతే కాకుండా నరాల బలహీనత కూడా మొదలైంది. కర్నూలు, బళ్లారి, అనంతపురంతోపాటు హైదరాబాద్‌కు కూడా తీసుకెళ్లి వైద్యం చేయించినా ఆరోగ్యం కుదుట పడలేదు. ఈ నేపథ్యంలో కాలేజీకి కూడా సక్రమంగా వెళ్లలేకపోయింది. చదువులో వెనుక పడతాననే భయం ఒక వైపు, ఆరోగ్యం మెరుగపడలేదనే ఆందోళన మరోవైపు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆమె బాధను చూడలేక తల్లిదండ్రులు కుంగిపోయారు. ఇవన్నీ గమనించిన ప్రీతి మేఘన ఇక తనువు చాలించడమే మేలనుకుంది. మంగళవారం ఉదయం ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంది. కూతురు మరణాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రులు దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. ఎస్ఐ కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
గురుకుల విద్యార్థి అదృశ్యం
బోనకల్: మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఆ విద్యార్థి తాను చనిపోతానంటూ లేఖ రాసి తోటి విద్యార్థులకు ఇచ్చివెళ్లడంతో కలకలం రేగింది. తల్లిదండ్రులు, తోటి విద్యార్థుల కథనం మేరకు.. ఏన్కూరు మండలం తూతూకలింగన్నపేట గ్రామానికి చెందిన కేతినేని రామారావు కుమారుడు రవి కుమార్ మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలో 5వ తరగతినుంచి విద్యనభ్యసిస్తున్నాడు. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు. జనవరి 1న మధ్యాహ్నం 3గంటల సమయంలో తోటి విద్యార్థులకు లేఖ ఇచ్చి కళాశాల నుంచి వెళ్లిపోయాడు. వెంటనే విద్యార్థులు ఆ లేఖను ప్రిన్సిపాల్ అంజలికి అందజేశారు. అదే రోజు సాయంత్రం 5 గం టలకు విద్యార్థి తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు సోమవారం కళాశాల వద్దకు చేరుకున్నారు. తోటి విద్యార్థులను ఆరా తీసినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థి లేఖపై తల్లిదండ్రులు ప్రశ్నించగా ప్రిన్సిపాల్ లెటర్ ఏమీ లేదని బుకాయించారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఏఎస్ఐ నారాయణరావు కళాశాలకు చేరుకుని విద్యార్థి అదృశ్యంపై విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్‌ను అడిగి వివరాలు సేకరించారు. అప్పటివరకు బుకాయించిన ప్రిన్సిపాల్ ఏఎస్ఐకి విద్యార్థి రాసిన లేఖ ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు ఆమెను నిలదీశారు. తాను చనిపోతానంటూ రవికుమార్ లేఖలో పేర్కొనడంతో చదివిన తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమ కుమారునికి ఏమైనా జరిగితే కళాశాల సిబ్బందే పూర్తిబాధ్యత వహించాలన్నారు. అధ్యాపకుల వేధింపులు భరించలేక.. తనకు ఆరోగ్యం సరిగాలేదని, కళాశాలలో చదవడం ఇష్టంలేదని, కొంతమంది గెస్ట్ అధ్యాపకులు తనను వేధిస్తున్నారని, ముఖ్యంగా సాంబ య్య అనే అధ్యాపకుడు వేధిపులు భరించలేకపోతున్నానని రవి కుమార్ రాసినæనోట్లో పేర్కొన్నాడు. ఇటీవల కళాశాలకు వచ్చిన ఉన్నతాధికారులకు కళాశాలలో భోజనం సక్రమంగాలేదని, తాను ఫిర్యాదుచేశానని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తనను సూటిపోటిమాటలతో వేధిస్తున్నారని రాశాడు. విద్యార్థితండ్రి రామారావు ఫిర్యాదుమేరకు ఏఎస్ఐ నారాయణరావు కేసు నమోదుచే శారు. విద్యార్థి అదృశ్యంపై కలెక్టర్ ఆదేశాలతో జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి రుషికేష్‌రెడ్డి సోమవారం కళాశాలకు వచ్చి విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్ అంజలిని వివరాలడిగి తెలుసుకున్నారు. ఆమెనుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులపట్ల ఇంత నిర్లక్ష్యమైతే ఎలాఅని ప్రశ్నించారు. పూర్తిస్థాయి నివేదికను కలెక్టర్‌కు అందజేస్తానని తెలి పారు. ప్రిన్సిపాల్ అంజలి, గెస్ట్ టీచర్లు కూడా రోజూ అప్ అండ్ డౌన్ చేస్తూ విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల బాగోగులను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంపై కళాశాల ఎస్ఎంసీ చైర్మన్ జిల్లా అధికారికి ఫిర్యాదుచేశారు. గతంలో ఒక విద్యార్థి కళాశాలనుంచి బయటకువచ్చి సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్లో ఆగి ఉన్న రైలుఎక్కి విద్యుత్‌షాక్‌కు గురై మృతిచెందాడు. కళాశాల అధ్యాపకులతీరుపై మండలవాసులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
తల్లిదండ్రులు మందలించారని...
గూడూరు(మహబూబాబాద్): తల్లిదండ్రులు మందలించారని ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బచ్చలి కుమారస్వామి, పద్మ దంపతుల కుమార్తె నవిత(17) గూడూరులోని జూనియర్ కాలేజిలో ఇంటర్ ఫస్టియర్ చదువుకుంటోంది. ఇంటి పనుల్లో సాయ పడకుండా, చదువుకోకుండా కాలక్షేపం చేస్తోందంటూ తల్లిదండ్రులు నాలుగు రోజుల క్రితం నవితను మందలించారు. మనస్తాపం చెందిన ఆమె అప్పుడే ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులు తెలిసిన వారిని, స్నేహితుల ఇళ్లవద్ద ఆరా తీశారు. ఫలితం లేకపోయింది. గురువారం ఉదయం ఆమె మృతదేహం ఊరకుంట చెరువులో తేలియాడుతుండగాస్థానికులు గమనించారు. మందలించినందుకు మనస్తాపం చెందిన తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని కుమారస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
విద్యార్ధిని చావబాదిన లెక్చరర్
-
మియాపూర్ కార్పొరేట్ కాలేజీలో దారుణం
-
కళాశాల విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: మియాపూర్‌లోని ఓ మహిళా కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న సాత్విక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎంపీసీ గ్రూప్ చదువుతున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన సాత్విక మంగళవారం శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ కళాశాలలో చదువుకోవడం ఇష్టం లేకనే ఆమె ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని తోటి విద్యార్థులు అంటున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
మియాపూర్ కార్పొరేట్ కాలేజీలో దారుణం
హైదరాబాద్: నగరంలోని మియాపూర్‌లో ఉన్న ఓ కార్పొరేట్ కాలేజీలో దారుణం జరిగింది. మంగళవారం కాలేజీలో ఇంటర్ విద్యార్థిని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని నిజామాబాద్‌కు చెందిన సాత్వికగా గుర్తించారు. తీవ్ర ఒత్తిడి కారణంగానే ఈ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడిందని సహ విద్యార్థులు చెప్పారు. సాత్విక మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
హుజూరాబాద్ : హుజూరాబాద్‌లోని విజయతేజస్విని జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని కళాశాలలోని మూడవ అంతస్తులోని ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సైదాపూర్ మండలం రాములపల్లి గ్రామానికి చెందిన పోతరాజు చందన(17) విజయతేజస్విని కళాశాలలో బైపీసీ సెకండియర్ చదువుతోంది. శుక్రవారం కళాశాలకు వచ్చిన చందన క్లాస్‌కు వెళ్లకుండా కళాశాలలోని మూడవ అంతస్తుపైకి వెళ్లింది. తోటి విద్యార్థులు బాత్రూంకు వెళ్లిందని బావించారు. క్లాస్ పూర్తయినా చందన రాకపోవడంతో తోటి విద్యార్థులు పైకి వెళ్లి చూడగా ఓ గదిలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించింది. వెంటనే వారు కళాశాల యాజమాన్యానికి విషయం చెప్పగా వారు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ గౌస్‌బాబా, ఎస్సై కోటేశ్వర్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. చందన మృతికి గల కారణాలను కళాశాల యాజమాన్యాన్ని, తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సమాచారం అందుకున్న చందన తల్లిదండ్రులు సంపత్, భవాని సంఘటన స్థలానికి చేరుకుని కూతురు మృతదేహంపై పడి బోరున విలపించారు. అయితే చందన మృతికి కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ముందు ఆందోళన నిర్వహించారు. పోలీసులు ఆందోళన విరమించాలని కోరినప్పటికి వినిపించుకోలేదు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. చందన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుత్రికి తరలించారు. చందనకు గత కొన్ని రోజులుగా మానసికస్థితి సక్రమంగా లేని కారణంగానే ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి సంపత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కోటేశ్వర్ తెలిపారు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
కడప అర్బన్: కడప నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి (17) బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సమస్యల కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని. ఎలాంటి కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదని మృతదేహాన్ని గురువారం ఉదయం తమ స్వగ్రామానికి తీసుకుని వెళ్లారు. ఈ విషయమై సంబంధిత పోలీసు స్టేషన్ ఎస్ఐని వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. కాగా విద్యార్థి తండ్రి పోలీసు యంత్రాంగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. -
రైలు కిందపడి ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య
-
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఖమ్మం: ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న గుంటా సాయికుమార్ (16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ సమాజంలో తాను బతకలేనని నిర్ణయించుకొని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరు కారణం కాదని ఆ నోట్లో పేర్కొన్నాడు. సాయికుమార్ ఆత్మహత్యతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పోలీసులు అతడి మృతదేహన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కళాశాలకు వె ళ్లడం ఇష్టంలేక..
కళాశాలకు వెళ్లడం ఇష్టం లేని విద్యార్థిని పురుగుల మందు తాగి బలవన్మరనానికి పాల్పడింది. ఈ సఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గరుగు చింతలపల్లి గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన లావణ్యేశ్వరి(16) తాడిపత్రిలోని సాయి కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటోంది. దీంతో తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లమని మందలించడంతో.. మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు’
-
మాచారెడ్డిలో యువతిపై హత్యా యత్నం