కళాశాలకు వెళ్లడం ఇష్టం లేని విద్యార్థిని పురుగుల మందు తాగి బలవన్మరనానికి పాల్పడింది.
కళాశాలకు వెళ్లడం ఇష్టం లేని విద్యార్థిని పురుగుల మందు తాగి బలవన్మరనానికి పాల్పడింది. ఈ సఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గరుగు చింతలపల్లి గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన లావణ్యేశ్వరి(16) తాడిపత్రిలోని సాయి కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటోంది. దీంతో తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లమని మందలించడంతో.. మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.